vinod s k 1 May 6, 2021

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
vinod s k 1 May 5, 2021

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 13 शेयर
vinod s k 1 May 5, 2021

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
vinod s k 1 May 5, 2021

+11 प्रतिक्रिया 0 कॉमेंट्स • 7 शेयर
vinod s k 1 May 4, 2021

🙏🌷కృష్ణుని జీవితం...దారుణమైన ముళ్ళబాట🌷🙏 నీతులూ, ధర్మాలూ చెప్పడం తేలికే కాని, ఆచరించడంకష్టం. *సుఖంగా, హాయిగా ఉన్నట్లు కనిపించినా కృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు. *పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరకూ కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై, స్థిరజీవనం లేకుండా కాలం గడిపాడు కృష్ణుడు. కృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు, తాత చెఱసాలలో మ్రగ్గిపోయారు. కృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరునిమిషమే తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో వ్రేపల్లెకు వలసపోయాడు. కొన్ని వారాల వయసుకే శ్రీకృష్ణునిపై మొదటగా హత్యాప్రయత్నం చేసింది పూతన. *అప్పటినుండీ అతనికి దినదిన గండంగానే గడిచింది. కృష్ణుని శైశవదశ, బాల్యదశ కూడా - శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేశి, వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడుడనే యక్షునితోనూ, కాళీయుడు అనే సర్పరాజుతోనూ పోరాటాలతోనే సరిపోయింది. కేవలం పదహారేళ్ళనాటికే ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత కష్టమో కదా! *జరాసంధునితో వరుసగా 17 సార్లు యుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లూ కృష్ణుడే జయించాడు. కాని, క్షణం విశ్రాంతి లేకుండాపోయింది. అంతలోనే "కాలయవనుడు" అనే గర్విష్ఠిని అంతం చేయవలసి వచ్చింది. యుద్ధాల వల్ల ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలుగుతున్నదని భావించిన శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు. *రుక్మిణిని వివాహమాడేందుకు, ఆమె అన్నయైన రుక్మితో పోరాడాడు. సత్యభామను పొందిన ఘట్టములో శమంతకమణిని అపహరించాడనే నిందనూ ఒక హత్యానేరాన్నీ మోశాడు. ఎన్నో కష్టాలు పడి పరిశోధించి శమంతకమణిని సాధించి తెచ్చి తనపై మోపిన నిందలను పోగొట్టుకున్నాడు. జాంబవతిని పెళ్ళాడేముందు ఆమె తండ్రియైన జాంబవంతునితో యుద్ధం చేశాడు. అష్టమహిషుల్లో ఒకరైన నాగ్నజితిని వివాహం చేసుకునేటందుకు మదించిన ఆబోతులతో పోరాడవలసి వచ్చింది. జీవితమే ఒక పోరాటమయింది కృష్ణునికి. *చివరకు సంసారజీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయలూ, వైషమ్యాలూ ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వు లొలికిస్తూనే, ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే చక్కటి గుణపాఠాలను నేర్పుకొచ్చిన మగధీరుడు ఆయన. సత్యభామ కోరిన పారిజాతవృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు. *తననే నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు. ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురైనాడు. కురుక్షేత్రములో దుష్టజన నాశనం పూర్తయినా, కృష్ణుని కష్టాలు తీరలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారిచేత శపించబడ్డాడు. యదువంశం నాశనమై పోవాలని శపించింది ఆమె! *కృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు, బాధ పడలేదు. యాదవకుల నాశనానికి "ముసలం" పుట్టింది. తన కళ్ళ ముందే తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారులు, మనుమలు యావన్మందీ ఒకరినొకరు నరుక్కుంటూ చచ్చి పీనుగులైపోతున్నా, విధి విధానాన్ని అనుసరించి అలా చూస్తూ నిలబడ్డాడు కృష్ణుడు! సోదరుడైన బలరాముడు సైతం తన కళ్ళముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అలాంటి సమయములో ఆయన మనఃస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. నీతులూ, ధర్మాలూ చెప్పడం తేలికే కాని, ఆచరించడం కష్టం.కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పడం సులభమే అనుభవించడం కష్టం. కాని, కృష్ణుడు అన్నీ ఆచరించి, భరించి చూపించాడు. అందుకే కృష్ణుడు ఆరాధ్యుడు అయ్యాడు ఓం నమో నారాయణాయ🙏

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 25 शेयर
vinod s k 1 May 4, 2021

హరి గొలిచియు మరి అపరములా.. పరము అంటే అత్యంత శ్రేష్ఠమైనది అని అర్థము. ఏమిటది? మోక్షము. అపరము అంటే మోక్షము దక్కకపోవటం. హరిగొలిచిన వారికి అపరములా... అంటున్నారు అన్నమయ్య. అసంభవం... స్థిరమైన ఆతని తత్వం తెలియాలేగానీ, ఒకసారి తెలుసుకున్నవారికి ఆతని కృప కలుగక మానుతుందా అంటున్నారు. ఒక్కసారి పంకజనాభుని పాదాలను నమ్మినవానికి ఇతరముల గూర్చిన చింత ఎందులకు? ఆ జగన్నాథుని ఆతని సేవకులను ఆశ్రయించిన వానికి ఆతని పాదములను కొలుచుచూ ఉండటమే మోక్షము. వేంకటేశ్వరుని నామామృతం స్వీకరించిన అన్యములు రుచించునా అంటున్నారు అన్నమాచార్యులవారు. హరిగొలిచిన వారికి కూడా అపరములా? ( మోక్షము దక్కకపోవటం లాంటివి ఉంటాయా? ) తిరముగ ( స్థిరముగ ) అతనిని తెలియుటయే మోక్షము. అటుగాక వేరొండు కలదా? 1.పంకజనాభుని నిజపాదదర్శనం అయినవానికి ఇంకా మరియొక ఇతరము మీద ( ఇంకొక దానిమీద ) వ్యామోహం ఉంటుందా? అంకెల ( అతని ఆధీనులై ) ఆ శ్రీహరిని, ఆయన దాసులను కొంకక ( జంకులేక ) కొలిచిన, ఆతని కృప సిద్ధిస్తుంది. ఇందులో ఏమాత్రమూ సందేహానికి ఆస్కారం లేదు. 2. పన్నగశయనుడైన శేషాచల నిలయుని బంట్లకు బంట్లయి ఉన్నవారు కోర్కెలను జయించిన ఉన్నతులు. అటువంటి వారికి కొన్నిటిపై కోర్కె ఉంటుందా? ఇన్ని కోరికలున్నవారికి తమకే ఇవన్నీ కావాలని అనుకొని కోలుపోయి ఆ హరిని కోరుటగాక ఇంకా ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? 3. వీనులవిందుగా వేంకటవిభుని నామామృతమూనిన ( ఆస్వాదించిన ) మనస్సుకు మఱియొకటి రుచిస్తుందా? ఆతని నుతి ( కీర్తించుట ) తేనెలు కారెడి తీపి పదార్థములను సేవించుట వంటిది. ఆబగా నానారుచులను నంచెడువాడు ఏరుచినీ సంపూర్తిగా ఆస్వాదించలేడు.

+12 प्रतिक्रिया 0 कॉमेंट्स • 7 शेयर
vinod s k 1 May 4, 2021

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
vinod s k 1 May 4, 2021

కొవిడ్ కు భయపడవద్దు.. లక్షణాలు కనబడగానే.. ఈ క్రింది విధంగా ఫాలో అవ్వండి. 1. గాస్ట్రిక్ టాబ్లెట్ Omez D పరగడుపున వేసుకోండి. 2. ఉదయం పాలు లో కొంచెం పసుపు వేసుకుని బాగా కాచి త్రాగాలి... 3.టిఫిన్ గా ఇడ్లీ అల్లం చట్నీ. 4 9 గంటలకు Azithrol 500 mg టాబ్లెట్ + Zincovit ( రోజుకు ఒకటి మాత్రమే ) 5. మధ్యాహ్నం12 లోపు కొబ్బరి నీళ్ళు లేదా బార్లీ లేదా ముగ్గిన బొబ్బాస పండు లేదా గుమ్మడి కాయ సూప్ లేదా దానిమ్మ జ్యూస్.. 6. 2 గంటలకు వేపుడు జావ చారుతో ( మిరియాలు , ధనియాలు , పసుపు, జీలకర్ర , కరివేపాకు, కాస్త చింతపండు వేసి కాస్తారు ) 7. 4 గంటలకు మళ్ళీ ఏదైనా స్నాక్ విత్ హెర్బల్ టీ..( 3 రోజేస్ నాచురల్ ) సప్లిమెంట్ విటమిన్ C & D వేసుకోండి. 8. 7 గంటలకు వేపుడు జావ మజ్జిగ తో.. 9.రాత్రి 8 గంటలకు DOXT Sl 100 ( రోజుకు ఒకటి మాత్రమే ) 10. పడుకునే ముందు ORS (ఎలక్ట్రోల్ పౌడర్) పెద్ద గ్లాస్ మంచినీళ్లు లో కలుపుకుని త్రాగండి. జ్వరం తీవ్రత ను బట్టి DOLO 650 రెండు పూటలా లేక మూడు సార్లు వేసుకోండి. దగ్గు వస్తుంటే Brozine X+ సిరప్.. బాగా జ్వరం ఉంటే నుదిటి పై కర్చీఫ్ చన్నిటిలో ముంచి పిండి నుదిటి మీద పలుమార్లు వేయాలి. ఆవిరి ( పసుపు, తులసి, పచ్చ కర్పూరం నీళ్ళ లో వేసి ) తప్పని సరిగా రెండు పూటలా పట్టాలి.. పూర్తి విశ్రాంతి తీసుకోండి.. తప్పక తగ్గుతుంది.. 5/7 రోజులు పడుతుంది. భయం తో హాస్పిటల్స్ కు పరుగులు పెట్టకండి. అక్కడ అత్యవసర కేసులుకు ఆటంకం కలుగుతుంది. బాగా నీరసం వేస్తే సెలైన్ కూడా ఇంటి వద్దే అర్ ఎం పి లేక నర్సు తో గాని పెట్టించుకొండి. ఊపిరి సమస్య వస్తే ఆక్సిజన్ పెట్టాలి. అప్పుడు 104 కాల్ చెయ్యండి.. ధైర్యం గా ఉండండి. ఇతర లకు దైర్యం చెప్పండి.. ఈ పోస్ట్ బాగా షేర్ చెయ్యండి.. సర్వే జనా సుఖినోభవంతు..

+7 प्रतिक्रिया 1 कॉमेंट्स • 19 शेयर