Venugopal Krishnan Oct 10, 2019

ఆయన దర్శన భాగ్యం కలగడం ఎన్ని జన్మల పుణ్య ఫలమో ? బాలా త్రిపుర సుందరీ మంత్ర మహాయోగి –శ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారు . ‘’నాకోసం మీరు కంచి కి ఇంత దూరం రావలసిన పని లేదు .చందోలు లో లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారున్నారు కదా !ప్రతి గురువారం వారిని దర్శించండి ‘’అని కంచి కామ కోటి పీథ పరమా చార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర యతీంద్రుల వారు చెప్పారు అంటే శాస్త్రి గారి యోగ సిద్ధి మహిమ ఎంతటి దో మనకు అర్ధమవు తుంది . గుంటూరు జిల్లా చంద వోలు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి ,హనుమమ్మ దంపతులకు శాస్త్రి గారు1896 ఆగస్ట్ ఇరవై అయిదున లో జన్మించారు .నిష్టా గరిష్ట కుటుంబం వారిది .చంద వోలు శాస్త్రి గారని అందరు పిలుస్తారు .తాడి కొండ వాసి కేదార లింగం గారు ‘’బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని ‘’వీరికి ఇచ్చారు .పదహారో సంవత్సరం దాకా ఆ మంత్రోపాసన చేసి నందు వల్ల అమ్మ వారు వీరికి పిలిస్తే పలికేది .దెందు కూరి పాన కాల శాస్త్రి వద్ద తర్కం ,పొదిలి సీతా రామ శాస్త్రి వద్ద మంత్రం నేర్చారు .యవ్వనం లోనే సన్య సించాలి లనే కోరిక కలిగింది .శ్యామ లాంబ అనే యోగిని వీరి తండ్రి గారితో శాస్త్రి గారు సూర్య మండలాన్తర్వర్తి అయిన మహా సిద్ధుడు ఈ రూపం లో జన్మించాడని చెప్పింది .శాస్త్రి గారికి చిన్న తనం లో పిన తల్లి చూపించిన ఒక దృశ్యం గోచ రించింది .అందులో తాను ఒక సిద్ధుడు శ్రీ చక్రేశ్వారి అయిన కామేశ్వరి దూరం గా ఉన్న యువతుల్ని తీసుకు రమ్మన్నది .ఒకరిని మోసుకొని ఇద్దర్నీ తీసుకొచ్చాడు .అమ్మ వారు చిరు నవ్వు తో అతని మనసు కొంచెం చలించింది అని భూలోకం లో జన్మించమని తాను మోసుకొచ్చిన అమ్మాయే భార్య అవుతుందని అన్నది .19 వ ఏట అద్దేపల్లి మంగమ్మ ,పాపయ్య శాస్త్రుల కూతురు పార్వతి తో వివాహ మైంది .పిన్ని చూపించింది కూడా ఈమెనే .ఆమె పేరు ను శ్రీ దేవి గా శాస్త్రి గారు మార్చారు . పాండిత్య ప్రకర్ష శాస్త్రి గారు తండ్రి గారి వేద పాథ శాల నిర్వహణ లో తోడు పడుతూ ఉన్నారు .అయన పద్ధతి నచ్చిన చాలా మంది అమెరికా కు రమ్మన్నారు .వారికి ఇష్టం లేదు .పిన పాటి వీరభద్రయ్య తో నేత్రావధానం ,ఎలేశ్వరపు పురుషోత్తమ శాస్త్రి తో కవిత్వ సాధన చేశారు .అప్పటికే అనేక సభల వారు శాస్త్రి గారికి 400 కు పైగా సర్టి ఫికేట్స్ ఇచ్చారు .వ్యాకరణ గురువు గారు ముదిగొండ నాగ లింగ శాస్త్రి గారి తో అనేక అవధానాలు చేసి ,ఆ డబ్బు అంతా గురువు గారికే సమర్పించారు .పుష్పగిరి పీథా ది పతులు శ్రీ చంద్ర శేఖర భారతీ స్వామి సన్నిధి లో జరిగిన అష్టావదానికి వారు మెచ్చి ఉభయ శ్లేషకు లక్ష్యం గా ఒక శ్లోకం చెప్ప మంటే ఆశువుగా అద్భుతం గా చెప్పి ఒప్పించారు . అమ్మ వారి సాక్షాత్కారం దేశ సంచారం చేస్తూ ఒక సారి ఇంటికి వస్తే ఇల్లు ‘’అయ్యవారి నట్టిల్లు ‘’లా ఉంది .ఇంటి వద్దే ఉండి తండ్రికి తోడ్పడ్డారు .తిండికి గడవని పరిస్థితి .మూడు రోజులు అంతా ఉపవాసమే .మూడవ రోజు రాత్రి 27 సార్లు లలితా సహస్ర నామ పూజ చేసి నైవేద్యం పెట్టిన జలాన్నే త్రాగి అన్గోస్త్రం నేల మీద పరచి నిద్ర పోయారు .10 ఏళ్ళ బాలిక కలలో కన్పించి ‘’ఒరెయ్ ! ముష్టి పెడ- తాను .కొంగు పట్టు ‘’అన్నది .దోసెడు బియ్యం కొంగు లో పోసి ‘’బండి వస్తుంది .అందులో కావలసిన సామగ్రి అంతా వస్తుంది ‘’అన్నది .తెల్లారే సరికి ఖాజీ పాలెం సీతా రామ రాజు గారి బండి వచ్చింది .అక్కడ రాజు గారు కోరిన మీదట పురాణం చెప్పి రాత్రి ఇంటికి వచ్చే సరికి తలుపు దగ్గర రాజు గారు పోయించిన పుట్టెడు ధాన్యపు రాశి కన్పించింది . అప్పటి నుంచి శాస్త్రి గారింట లక్ష్మీ దేవి నిత్య సాక్షాత్కారమే . అనేక గ్రామాలలో భాగవతం ,హరి వంశం ,పురాణం చెబుతూ రాత్రికి ఇంటికి చేరే వారు .పరమ నిష్టా గరిష్టం గా జీవించే వారు .ప్రాణాయామం తపస్సు కోన సాగించారు .ఇంట్లో వేరు సెనగ నూనె, వేరు సెనగ వాడ లేదు .దొండకాయ ,టమేటా ,బంగాళా దుంప ,ముల్లంగి కాబేజీ ,నిశిధం .కాశీ కి తప్ప ఎప్పుడు రైలు ప్రయాణం చేయ లేదు .శాస్త్రి గారికి మగ సంతానం లేదు అష్ట సిద్దులు కైవశం శాస్త్రి గారికి అష్ట సిద్ధులు వశ మైనాయి .వాటిని స్వంతానికి ఎప్పుడు వాడుకో లేదు .తాడి కొండ వేద పాథ శాలలో దేయాలు తిరిగి ఇబ్బంది పెడుతుంటే శాస్త్రి గారు మంత్రం పఠించి పార ద్రోలారు .ఒక సారి ‘’వశ్యంకర ఔషధి ‘’ని సేకరించాలని చంద్ర గ్రహణం రోజున కొండ ఎక్కి ,దాన్ని గుర్తు పట్టి తీసుకొందామని దగ్గరకు వెళ్తే ఒక బాలుడు అడ్డుకొన్నాడు .బలవంతాన లాక్కో బోతే ‘’నీకు ఈ మొక్క తో పని లేదు .నీ ముఖం చూస్తేనే అందరు వశు లౌతారు ‘’అన్నాడు .ఇంతలో గ్రహణం వదిలింది .బాలుడు మాయమయ్యాడు .తనకు దాన్ని పొందే యోగం లేదని భావించారు .అది దత్తాత్రేయ స్వామి అది పతి గా ఉన్న ఓషధి .పూర్వ జన్మ సఖుడైన ఒక యోగి కన్పించి సుఖ దుఃఖాలను సమానం గా భావించాలని చెప్పి మళ్ళీ 50 ఏళ్ళ కు కని పిస్తానని చెప్పి వెళ్లాడు .సరిగ్గా యాభై ఏళ్ళ తరువాత శాస్త్రి గారు అమరావతి వెళ్లి అమరేశ్వర స్వామిని దర్శించి తమ గదిలో ప్రాణాయామం చేస్తూ చాలా పైకి లేచి తల క్రిందులు గా పడి పోతుంటే తల నే లకు తగిలే సమయాన ఆయోగి వచ్చి చేయి అడ్డం పెట్టి కాపాడాడు .శాస్త్రి గారు నమస్కరించ గానే యోగి అదృష్యుడైనాడు . తండ్రి గారు మొదలు పెట్టిన ‘’శ్రీ రామ కదామృతం ‘’ను వారి మరణానంతరం శాస్త్రి గారు పూర్తీ చేస్తున్నారు అయోధ్యా కాండం లో గాయత్రీ మంత్రం లోని ‘’భకార’’వర్ణం తో పద్యం రావటం లేదు .అమ్మను ఉపాశించి నిద్ర పోయారు .కలలో ఒక బీబీ జగన్మోహిని నిద్రిస్తుండగా 30ఏళ్ళ గడ్డం వాడొకడు ఆమె చొక్కా పైకెత్తి పాలు తాగుతున్నాడు .శాస్త్రి గారు ఆ దృశ్యం చూస్తుంటే ‘’ఎందుకు నిల బద్దావు ‘’?అని అడిగింది .’’నాకూ పాలు ఇస్తావా ?’’అని అడిగారు .మెలకువ వచ్చి ‘’భర్మ మయ రమ్య హర్మ్యము ‘’అనే భ వర్ణం తో పద్యం తేలిగ్గా వచ్చింది ఒక సారి పుస్తక ముద్రణ కోసం చందాలకు తిరుగుతూ ఉంటె సత్తెన పల్లి లో ఒక బ్రాహ్మణుల ఇంట్లోకి ఇరవైయేళ్ళ యువతీ కని పించి ,నమస్కరించి లోపలి వెళ్ళింది .ఆమె గ్రహ పీడి తురాలు .అందర్ని కొడుతూ ,తిడుతూ ఉండేది .అలాంటిది శాస్త్రి గారిని చూడగానే అత్యంత వినయాన్ని ప్రదర్శించటం ఇంట్లో వారందరికి ఆశ్చర్యం కలిగించింది .ఆమెను గ్రహ ప్రేరణ చేసి ‘’ఏం చేస్తే నువ్వు పోతావు /’’అని అడిగారు .’’సహస్ర గాయత్రీ జప ఫలం ధార పోస్తే పోతాను ‘’అంది .శాస్త్రి గారు సహస్ర గాయత్రి జపం చేసి ధార పోశారు .ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మ విరిగి పడింది .దెయ్యం వదిలింది .వేరొక సారి నాగుల చవితి రోజు కాలవ లో స్నానం చేసి వస్తుంటే నాగలి చాలులో పడుకొన్న నాగు పాము తోక పై ఆయన కాలు పడింది .అది బుసలు కొడుతూ పైకి లేచి కాటు వెయ బూనితే ‘’గారుడ మంత్రం ‘’జపించారు .సర్పం తల నేల కు వాల్చింది .’’స్వామీ !నీ జోలికి నేను రాలేదు .నా జోలికి నువ్వు రావద్దు .పోర పాటున నా కాలు తగిలింది .వెళ్లి పొండి ‘’అనగానే పాము వెళ్లి పోయింది .ఆ రోజంతా గారుడ మంత్రం పతిస్తూనే ఉన్నారు . శాస్త్రి గారు 90 ఏళ్ళ జీవిత కాలం లో 80 ఏళ్ళు ‘’బాలా మంత్రానుష్టానం ‘’చేసిన మహనీయులు .ఒక సారి కాశీ లో గంగా స్నానం చేస్తుంటే గంగా దేవి’గలగలా లాడే బంగారు చ్గాజులున్న చెయ్యి చూపించి ‘’నాకేమి కానుక తెచ్చావు ?’’అని అడిగింది .శాస్త్ర్రి గారికి ఏమీ పాలు పోక తన వ్రేలికున్న బంగారు దర్భ ఉంగరం తీసి ఆమె చేతి లో పెట్టారు .బసకు తిరిగి వచ్చి దేవతార్చన పెట్టె తెరిస్తే గంగకు అర్పించిన ఉంగరం అందులోనే ఉంది .తానేమైనా పొరపడి దర్భ ఉంగరం ఇవ్వలేదా అని సందేహించి ధ్యాన నిమగ్న మయ్యారు ..గంగమ్మ కని పించి ‘’కానుక ఇమ్మంటే దర్భ ఉంగరం ఇచ్చా వేరా ?’’అన్నది .’’అది నీకు పితృ తర్పణం చెయ్యటానికి ఉప యోగ పడుతుంది కాని నాకు ఆభరణం ఎలా అవుతుంది ?’’అని గద్దించింది .’’అమ్మా నేనేమీ నీ కోసం తేలేదు .ఆ సమయానికి అది స్పురించి ఇచ్చానంతే .’’అన్నారు .మళ్ళీ గంగమ్మ ‘’నీ భార్యదగ్గర నాకోసం తెచ్చిన నగ ఉంది అది తెచ్చివ్వు ‘’అన్నది గంగ .శాస్త్రి గారు భార్యను అడిగి నగను తీసుకొని పోయి ‘’గంగార్పణం ‘’చేశారు . ఆయన తన కార్య క్రమాలన్ని ముగించుకొని వాకిలి అరుగు మీద కూర్చుంటే వందలాది మంది వచ్చి తమకు ముహూర్తం పెట్టమనో ,పేరు పెట్టమనో అడిగే వారు .కాసేపు కళ్ళు మూసుకొని ముహూర్త న్నిర్ణయం చేసే వారు .అంతే .ఆ కార్య క్రమం శుభప్రదం గా జరిగి పోయేది .దానికి తిరుగు లేదు .అదీ వారి మంత్ర సిద్ధి . దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితం కాంచీ పరమాచార్యులు ఉయ్యూరు కే’సి’పి’వారి ఆహ్వానం ,గురజాడ లోని చల్లా శర్మ గారు ఏర్పాటు చేసిన కార్య క్రమం లో వారం రోజులున్నారు .అప్పుడు రాఘవ శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు అన్ని రోజులు .అప్పుడు వారిని చూశాను .జగద్గురువుల ను వీరినీ ఒకే సారి చూసే భాగ్యం కలిగింది .అప్పుడే ‘’నడయాడే దైవం ‘’అని పరమా చార్య మీద పుస్తకం ఆవిష్కరణ జరిగి నట్లు జ్ఞాపకం .10-12-1990ప్రమోదూత మార్గ శిర బహుళ నవమి నాడు శాస్త్రి గారు బాలా త్రిపుర సుందరి అమ్మ వారి ఒడిలోకి శాశ్వతం గా చేరి పోయారు .వారి పార్ధివ దేహానికి అగ్ని సంస్కారం చేస్తున్నప్పుడు అమ్మ వారి ఆకారం గా చితి మంటలు ఆకాశానికి లేవటం ఎందరో చూసి పరమాద్భుతం గా వర్ణించారు .శాస్త్రి గారు కారణ జన్ములు .వారి పేరు వింటే చాలు సకల శుభాలు జరుగుతాయి ❗❗❗

+12 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
Venugopal Krishnan Sep 30, 2019

+4 प्रतिक्रिया 2 कॉमेंट्स • 1 शेयर
Venugopal Krishnan Sep 28, 2019

+9 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
Venugopal Krishnan Sep 27, 2019

⭐నేనే కామాక్షీ ‼ పరమాచార్య స్వామివారు మకాం చేసిన ఊర్లో ఉన్న ఒకావిడకి స్వామివారంటే అనన్యమైన భక్తిప్రపత్తులు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆవిడ తరచూ ఇంటినుండి బయటకు వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండేది కాదు. ఒకరోజు ఎలాగో ఇంటినుండి బయటకు వచ్చి మహాస్వామి వారు బస చేసిన చోటికి వచ్చింది. అది మద్యాహ్న సమయం. పూజావేదిక పైనుండే కూర్చుని పరమాచార్య స్వామివారు భక్తులతో మాట్లాడుతున్నారు. ఈమె చేతిలో హారతి పళ్ళెంతో మహాస్వామి వారి దగ్గరకు వెళ్ళి హారతివ్వడానికి స్వామివారికేసి చూసింది. వెంటనే స్వామివారు ముఖాన్ని మరోవైపుకు తిప్పుకున్నారు. రెండు మూడు సార్లు ప్రయత్నించినా పరమాచార్య స్వామివారు ఆమెకు వారి ముఖ దర్శనం ఇవ్వలేదు. ఆవిడకు చాలా బాధవేసింది. మహాస్వామివారు తన వైపు తిరిగినట్టనిపించి హారతిపళ్ళెంలో కర్పూరాన్ని వెలిగించింది. ముందుకు వెళ్ళి హారతి ఇచ్చే లోపల స్వామివారు లేచి లోపలికి వెళ్ళిపోయారు. ఆవిడ నిచ్చేష్టురాలై మనసులో “అమ్మా అంబికా! ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? నేను చేసిన పాపం ఏమిటి?” అని రోదించసాగింది. తరువాత తమాయించుకొని “సరే! నేను ఈ హారతిని నీకే సమర్పిస్తాను” అని పూజా వేదికపైన ఉన్న త్రిపురసుందరి అమ్మవారికి హారతిచ్చి చాలా నిరాశతో ఇంటికి వెనుతిరిగింది. ఆ పందిరి నుండి బయటకు రాగానే, ఒకరు ఆవిడ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, “అమ్మా! పెరియవ నిన్ను పిలుస్తున్నారు” అని చెప్పాడు. “నన్ను పిలుస్తున్నారా? నన్ను కాదేమో” అని సంశయంగా చెప్పింది. “అవును అమ్మా మిమ్మల్నే. లోపలికి రండి” అని చెప్పాడు. అనుమానంగా లోపలికి వెళ్ళింది. వేదికపైన కూర్చున్న మహాస్వామి వారు ఆవిడతో, “నాకు ఇవ్వాల్సిన హారతి అమ్మవారికి ఇచ్చానని ఏమి మధనపడకు. ఇప్పుడు నాకు హారతి ఇవ్వు” అని చెప్పారు. ఉద్వేగంతో కర్పూరాన్ని పళ్ళెంలో పెట్టింది. చేతులు వణుకుతుండగా కర్పూరాన్ని వెలిగించింది. కొద్దిగా ధైర్యము తెచ్చుకుని స్వామివారి ముందుకు వెళ్ళి హారతి ఇస్తూ మహాస్వామి వారి ముఖంలోకి చూసింది. ఆవిడ కళ్ళకి మహాస్వామి వారు నాలుగు చేతులతో చెరకు విల్లు, పువ్వుల బాణాలు, పాశాంకుశాలు పట్టుకుని మందస్మితయైన సాక్షాత్ కామాక్షి అమ్మవారిలాగా కనపడ్డారు. స్వామివారిని అలా చూడగానే ఆవిడ గట్టిగా లెంపలేసుకుంటూ భక్తితో “అమ్మా! అమ్మా!” అని అరవసాగింది. వేదికపైన ఉన్న కామాక్షి, పరమాచార్య స్వామివారు ఒక్కటే అన్న విషయం ఈ సంఘటన వల్ల మనకు తెలుస్తుంది. [కాల్చి పుటం పెడితేనే వన్నె చేకూరుతుంది బంగారానికి. భగవంతుడు పెట్టే పరీక్షలకు తట్టుకుని నిలబడితేనే భక్తుని భక్తి, ఆర్తి తెలిసేది. కష్టాలలో కూడా భగవంతుని నమ్మి నిలిచినవాడే నిజమైన భక్తుడు. అటువంటి వారికి ఉన్నదే నిజమైన భక్తి. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి తిట్టడం సరికాదు. సుఖాలు ఇచ్చినప్పుడు పొగిడావా? లేదు కదా!! పరమాచార్య స్వామివారు అలా చెయ్యకపోయి ఉంటే ఆవిడకు స్వామివారిలో కామాక్షి దర్శనం అయ్యుండేది కాదు. స్వామివారు అలా చెయ్యడం వల్ల ఆవిడ మనస్సు క్లేశపడి పురాకృత పాపం శేషం పోయి అమ్మవారి దర్శనం అయ్యింది. మహాత్ములు ఏమి చేసినా అది లోకకళ్యాణానికే!!] --- నాగలక్ష్మి, తిరుచ్చి. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 2 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #కంచి పరమాచార్య వైభవం

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 6 शेयर
Venugopal Krishnan Sep 26, 2019

ఆగి ఒకసారి చూశారు ❗❗ మా నాన్న శ్రీ రామానుజం గారు ఒక న్యాయవాది. మాది కులిత్తలై అగ్రహారంలోని శ్రీవైష్ణవ కుటుంబం. మేము శ్రీమఠానికి పెద్ద భక్తులం. మహాస్వామి వారు, జయేంద్ర సరస్వతి స్వామివారు ఎప్పుడు యాత్రకు వచ్చినా మా ఇంట్లోనే బస చేసేవారు. ఇది అరవైలలో జరిగిన సంఘటన అనుకుంటా. ఆ అగ్రహారంలో పిల్లాపాపలతో ఒక కుటుంబం ఉండేది. అక్కడి ప్రముఖులలో వారి కుటుంబం కూడా ఒకటి. వారు ప్రధానంగా ఏదో వ్యాపారం చేసేవారు. బాగా కలిసివచ్చి హాయిగా ఉండేవారు. వారిది అంతా ధార్మికమైన సంపాదన. చాలాకాలం పాటు హాయిగా సాగిన వారి జీవితాలలో హఠాత్తుగా సమస్యలు మొదలయ్యాయి. వాళ్ళ ఇంట్లో కొన్ని భయంకరమైన సంఘటనలు జరగడం మొదలయ్యాయి. నేలపైన జుత్తు పెద్ద ఉండలుగా కనపడడం, వసారా మధ్యలో మానవ అశుద్ధము కనపడడము, అద్దాలు పగలడం వంటివి కనపడడం మొదలయ్యాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో వాళ్ళకి అర్థం కావడం లేదు. వీటితో పాటు వాళ్ళ ఇంట్లోని వాళ్ళు ఎవరైనా బయటకు వెళితే చాలు వాళ్ళ బట్టలన్నీ చిరిగిపోయేవి. ఇది ఆడవాళ్ళ విషయంలో కూడా జరిగేది. ఇవన్నీ వినడానికి నమ్మేలాగా లేకపోయినా ఆ అగ్రహారంలో చాలామంది వీటీని ప్రత్యక్షంగా చూసారు. తరువాత వాళ్ళు ఇదంతా చేతబడి వల్ల జరిగినది అని తెలుసుకున్నారు. వారు ఈ విషయానికి చాలా భయపడ్డారు. కాని దీని పరిష్కారం కనిపెట్టలేక పోయారు. ఆ సమయంలో మహాస్వామివారు ఆ ప్రాంతానికి పర్యటనకు వచ్చి ఆ అగ్రహారానికి కూడా వచ్చారు. స్వామివారికి ఆ అగ్రహారం ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్వామివారు అందరిని యోగక్షేమాలు విచారిస్తుండగా, ఆ వీధిలో నివసించే వారు ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పి వారికి సహాయం చెయ్యవల్సిందిగా అడిగారు. మాహాస్వామి వారు విషయం అంతా విన్నారు కాని ఏమి చెప్పలేదు. తరువాతిరోజు స్వామివారు వారి శిష్యులతో కలిసి ఆ వీధిలో వెళ్తుండగా, చుట్టూ ఉన్నవారు ఆ ఇంటివైపు చూపించారు. మహాస్వామివారు ఆగి ఒకసారి ఆ ఇంటిలోకి నేరుగా చూసి ముందుకు వెళ్ళిపోయారు. ఆ ఒక్క చూపు ఆ ఇంటిలో ఉన్న సమస్యలన్నిటిని పారద్రోలింది. ఆ క్షణం నుండి ఆ ఇంటికి చేసిన చేతబడి ప్రభావాలు పూర్తిగా మాయమైపోయాయి. కుటుంబంలో అందరికి ప్రశాంతత చేకూరింది. వారు మళ్ళా వారి వ్యాపారం చూసుకుంటూ ఆడవారు కూడా ధైర్యంగా బయట తిరగగలిగారు. నాకు ఈ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా మహాస్వామి వారి ఈ చిత్రపటం స్ఫురణకు వస్తుంది. మహాస్వామివారి చూపులవల్ల ఎటువంటి క్షుద్ర శక్తి అయినా నాశనం చెయ్యబడుతుంది. అలాగే వారి కరుణా విలాసం భక్తులను రక్షిస్తుంది. ఆ చూపులకు ఎంతటి శక్తి అని ఇప్పటికి నాకు ఆశ్చర్యం వేస్తుంది. --- శ్రీరామ్, కులిత్తలై అగ్రహారం అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #కంచి పరమాచార్య వైభవం

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर
Venugopal Krishnan Sep 22, 2019

పది చాలు పెరియవా ! ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి పండరీపురం వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి దర్శనానికి వచ్చిన అమాయక పల్లె ప్రజలను చూసి నాకు ఒక సంఘటన గుర్తువచ్చింది. ఇది ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేసే ఒక మాజీ ఉద్యోగి నాతో పంచుకున్న అనుభవం. ఆయన ఒకసారి స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు మౌనంగా ఉన్నారు. ధ్యానంలో ఉన్నారని తలచి అక్కడున్నవారందరూ స్వామివారి అనుగ్రహ వీక్షణాల కోసం కింద కూర్చున్నారు. కొద్దిసేపటి తరువాత ఒక పేద రైతు ఏడుస్తూ వచ్చి, తన కుమార్తె వివాహానికి ధన సహాయం చెయ్యవలసిందిగా మహాస్వామి వారిని అర్థించాడు. మహాస్వామి వారు కళ్ళు తెరిచి విషయం ఏమిటని అడుగగా, “నా కుమార్తె వివాహం నిశ్చయమైంది. పెళ్ళికొడుకు తరుపు వారు పది బంగారు సవర్లు కావాలని అడుగుతున్నారు. మీరే నాకు సహాయం చెయ్యాలి” అని చెప్పాడు. ”నా దగ్గర బంగారం ఎక్కడిది? నేనెలా నీకు సహాయం చెయ్యగలను?” అని అడిగారు స్వామి. ”మీరు నా జీవితంలో ఎప్పుడూ నాకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. మరి ఇప్పుడెలా నాకు “లేద”ని చెప్పగలరు. మీరే నాకు సహాయం చెయ్యాలి” అని విన్నవించాడు. అతనికి తనపై గల భక్తిని నమ్మకాన్ని చూసి స్వామివారు ఇలా అన్నారు. “నీకు తెలుసా మనమందరం అమ్మ కామాక్షి పిల్లలం. ఆమె సన్నిధికి వెళ్ళి ప్రార్థించు. ఆవిడే నిన్ను రక్షించగలదు” “నాకు మీరు తప్ప ఏ దైవమూ లేదు. నేను మిమ్మల్నే ప్రార్థిస్తాను” అని అక్కడే నిలబడిపోయాడు. ”నేను చెప్తున్నాను, కామాక్షి అమ్మ దగ్గరకి వెళ్ళి మనఃస్ఫూర్తిగా అమ్మని ప్రార్థించు. వెళ్ళు” అతను అయిష్టంగానే కళ్ళ నీరు కారుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని కల్మషం లేని భక్తి స్వామివారిని కదిలించింది. స్వామివారితో మాట్లాడాలని చాలా మంది ఆత్రుతగా వేచియున్నారు. చాలాసేపు అక్కడ నిశ్శబ్ధం తాండవించింది. దాదాపు ఒక గంట తరువాత, స్వామివారు అందరితో మాట్లాడటం మొదలుపెట్టారు. మరో గంట తరువాత ఈ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఉద్యోగి వంతు వచ్చింది. అంతలోనే ఒక గుజరాతీ జంట స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరించి ఒక పళ్ళెంలో పళ్ళు, కొన్ని బంగారు సవర్లను సమర్పించారు. వాటిని చూసి స్వామివారు ఆ బహుమానాన్ని స్వీకరించడానికి నిరాకరించారు. “మీ ఆశీస్సులు మాకు కలిగితే, పదకొండు సవర్ల బంగారం సమర్పించుకుంటామని మేము మొక్కుకున్నాము. మీ ఆశీస్సులవల్ల మేము రక్షింపబడ్డాము కాబట్టి మేము మొక్కు తీర్చుకుంటున్నాము పెరియవా. దీన్ని మీరు స్వీకరించండి స్వామి. ఇది మీది కనుక మీరు ఏమైనా చేసుకోండి” అని పట్టుబట్టారు. వాళ్ళను వేచి ఉండమని చెప్పి, అక్కడున్న వార్లో ఎవరిదగ్గరైనా కారు ఉందా అని విచారించారు. ఆ ఉద్యోగి తన వద్ద ఉందని ఎక్కడికి వెళ్ళాలో సెలవియ్యండని ప్రార్థించాడు. ”నువ్వు అతణ్ణి చూశావు కదా? కామాక్షి అమ్మవారి గుడి దగ్గరకు వెళ్ళి అతణ్ణీ తీసుకుని రా” అరగంటలో అతణ్ణి తీసుకునివచ్చారు. అతను ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. రాగానే స్వామివారి పాదాలపై పడ్డాడు. “అమ్మను మనఃస్పూర్తిగా ప్రార్థించావా?” అని అడిగారు స్వామివారు. ”నాకు ఏ ప్రార్థనా తెలియదు. అమ్మ ముందుకు వెళ్ళి నా కష్టం చెప్పుకుని ఏడ్చాను అంతే!” “నీ ప్రార్థనకి అమ్మ కరుణించింది. ఇదిగో ఆవిడ ఇచ్చిన బహుమానం” అని ఆ పళ్ళెం చూపించారు. ఆనందంతో అతని ముఖం వెలిగిపోయింది. వాటిని చూసి, “నాకు పది చాలు పెరియవా. పదకొండు వద్దు” అని అమాయకంగా ఆనందంతో నీరు నిండిన కళ్ళతో అభ్యర్తనపూర్వకంగా స్వామివారి వేపు చూశాడు. చమ్మగిల్లని కళ్ళతో ఒక్కరు కూడా లేరు అక్కడ. వారందరికి కేవలం స్వామివారి అవ్యాజ కరుణే అతని సమస్యను పరిష్కరించిందని నమ్మకం. కాని కొందరికి అది ఒక అద్భుతంగానో, కాకతాళీయంగానో అనిపించవచ్చు. --- ఎ. ప్రసన్న కుమార్, “ఎ సేజ అట్ పంధర్ పూర్” నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #కంచిపరమాచార్య వైభవం

+8 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
Venugopal Krishnan Sep 21, 2019

గాయత్రీ మంత్రం........ ఒక మహాసిద్ధుణ్ణి కలిశాము. ఆయన గాయత్రి కొన్ని కోట్ల సిద్ధి పొందిన మహాత్ములు. ఆయన నిజానికి ఋగ్వేదీయుడు. తన వేదాన్ని సంగోపాంగంగా నేర్చుకుని, సంస్కృత భాషలో మహాపండితుడై, నిత్యానుష్టానపరాయణుడై, శ్రీవిద్యోపాసకులుండేవారు. ఆయనకు ఒక సంస్కృత పాఠశాలలో ఉద్యోగం వచ్చింది సంస్కృత అధ్యాపకుడిగా. కాని అది ఓరియంటల్ కాలేజి, ఏవో విరాళాలతో నడుస్తాయి. ఒకసారి తనిఖీకి ఎవరో వచ్చారుట. వచ్చినప్పుడు ఆ కళాశాల నిర్వాహకులన్నారు, “నీకు జీతం ఇస్తున్నాము కాని, నీకు ఇవ్వాల్సినదాంట్లోంచి తగ్గించి ఇస్తున్నాము ఇంతకాలం. కనుక వాళ్ళదగ్గర ఏం చెబుతావంటే, అంతా ఇస్తున్నట్టు చెప్పు” అని. అతను అనుష్టానపరుడు కాబట్టి అబద్ధమాడరాదు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. అనుష్టానపరుడు అబద్ధం చెబితే అంతవరకూ చేసిన అనుష్టానం శక్తి పోతుంది. కనుక ఆడనన్నాడు. ఈ రాజకీయాలు చూడగానే ఆయన నిశ్చయించుకున్నాడు, “ఇకపై నౌకరీ చెయ్యను. చొక్కా వేసుకోను” అని తీసేసాడట ఆ రెండు. ఆ తరువాత తిన్నగా ఏం చేశాడంటే, మనస్సు వేదన పడింది కదా. కాలం ఎలా తయారయ్యిందేంటని. తిన్నగా కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి చరణ సన్నిధికి వెళ్ళారు. కూర్చునున్నాడంతే. ఎందుకంటే ధర్మం విషయంలో గ్లాని ఏర్పడినప్పుడు, మహాత్ములే ఓదార్పు. వాళ్ళను చూడగానే హమ్మయ్య అనిపిస్తుంది. ధర్మమేమవుతుందా అని భయం కలిగినప్పుడు ఒక్క మహాత్ముడు కనపడగానే ఒక ఊరట. భారతదేశంలో అలా ఊరడించడానికి ఎప్పుడూ మహాత్ములు కనపడుతూనే ఉంటారు కావలనుకున్నవాళ్ళకి. మహాస్వామివారి వద్దకెళ్ళి కూర్చుంటే, ఆయనకేం చెప్పాలా? వివరిద్దామనుకుంటే ఆయనొక మందహాసం చేసి, “అన్నీ తెలుసు నాయనా! కొంతకాలం గాయత్రీ మంత్రం పునశ్చరణ చెయ్యి” అని చెప్తారట. సంధ్యావందంనంలో గాయత్రి చెయ్యడం వేరు. పునశ్చరణ అంటే గాయత్రీ మంత్రాన్ని ఇరవైనాలుగు లక్షల గాయత్రి సాంగోపాంగంగా! చెయ్యాలి. చెయ్యు అని చెప్పారు. ఆయన నిజానికి పెద్ద సంపన్నులేంకారు. ఎందుకంటే విద్యున్నవాడు సంపత్తు తేవాలని తాపత్రయపడడు. రోజూ పూటా గడిచి, కూడు, గూడు, గుడ్డకు లోటులేకుంటే చాలు. మిగిలిన సమయమంతా విద్య సముపార్జనే. కాని ఇప్పుడు కుటుంబం ఉంది ఆయనకి కనుక పోషించాలి. ఇప్పుడు పునష్చరణకు కూర్చుంటే పోషించేదెవరు? ఆయనకు గోదావరి సీమలో కొద్దిగా నేల ఉందంతే. తన పిల్లల సాయంతో ఒక కుటీరం వేసుకొని సంకల్పం చెప్పి పునశ్చరణకు ఉపక్రమించారు. పునశ్చరణ దీక్షాకాలంలో క్షేత్రం విడిచిపెట్టకూడదు కనుక అలాగే ఉన్నారు. చాలా పద్ధతిగా చేస్తున్నారు. ఇక రెండు మూడు రోజులలో పూర్తవుతుందనగా పల్లెలో ఉన్న వాళ్ళమ్మగారికి తీవ్రమైన ఉదరవ్యాధి వచ్చింది. పట్టణానికి తీసుకుని వెళ్ళి చికిత్స చేయించాలి. ఈయనేమో ఊరు దాటకూడదు. ఏంచెయ్యాలి? అప్పుడు వారి తల్లి ఒక మాటందిట “గాయత్రి కాపాడుతుంది. నువ్వు ఇక్కడే జపం చేసుకో. పునశ్చరణ పూర్తి చేసుకో” అందిట. తల్లి మాటతో పునశ్చరణ పూర్తయ్యింది, కడుపునెప్పి తగ్గిపోయింది. గాయత్రి మంత్ర సిద్ధుడయ్యారు ఆ మహాత్ములు. ఆ మహనీయులు వేరెవరో కాదు 'శ్రౌత శిరోమణి', 'దైవ శిరోమణి' వేల యజ్ఞాయాగాదుల యాజ్ఞకర్త "బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు". --- బ్రహ్మశ్రీ సామవేదం శణ్ముఖశర్మ గారి “సంధ్యావందనం” ప్రవచనం నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

+6 प्रतिक्रिया 1 कॉमेंट्स • 6 शेयर