🚩ఓం గణపతియే నమః🚩 మిత్రులందరికి శుభ రవివారం శుభ దినం శుభ శుభోదయపు వందనాలు🙏🙏🙏🙏🙏 *సూర్యునికి ప్రియమైన నామములు* సూర్యుడు, రవి, నిత్య, కార్యభాను, భాస్కర, మతంగ, మార్తాండ, వివస్వంత, ఆదిత్య, ఆదిదేవ, రశ్మిమాలి, దివాకర, దీప్త, అగ్ని, మిహిర, ప్రభాకర, మిత్ర, అదితిసంభవ, గోపతి, దిక్పతి, ధాత, విధాత, అర్య్మణ, వరుణ, పూష, భగ, మిత్ర, పర్జన్య, అంశు, హితకృత్, ధర్మ, తపన,హరి, హరిదశ్వ, విశ్వపతి, విష్ణు, బ్రహ్మ, త్ర్యంబక, ఆత్మ, సప్తలోకేశ, సప్తసప్తి, ఏక, ఏకచక్రరధ, జ్యోతిష్పతి, సర్వప్రాణభృత్, సర్వభూతహిత, శివ, ఆర్తిహర, పద్మప్రబోధ, వేదాదిమూర్తి, కాధిజ, తారాసుత, భీమజ, పావక, ధిషణ, కృష్ణ అదితిపుత్ర, లక్ష్య. ఈ 58 నామాలు నిత్యం చదువుకుంటే ఆ సూర్యనారయణుడి అనుగ్రహం పొందవచ్చు. ఆయనకు ఈ నామాలలో ఏ ఒక్క నామంతో అయిన నమస్కరిస్తే అత్యంత ప్రీతి. *ఓం ఆదిత్యాయ నమః* *🌞శుభ శూర్యోదయం🌞* 🙏🌅🙏SATYAVARAPU VENKANNABABU & VARALAKSHMI🙏🌅🙏

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*🚩సాయిభక్తుల అనుభవమాలిక - 113 వ భాగం🚩* ☘️🌼☘️🌼☘️🌼☘️🌼☘️🌼☘️ గురుపూర్ణిమరోజుతో ముడిపడివున్న అనుభవాలు: నేను ఇవ్వాలనుకున్న దక్షిణను బాబా స్వీకరించారు పండ్లు నైవేద్యంగా పెట్టే భాగ్యాన్నిచ్చారు బాబా. నాకోసం ట్రైన్ గంట ఆలస్యం చేసిన బాబా గురుపూర్ణిమరోజు నేను ఇవ్వాలనుకున్న దక్షిణను బాబా స్వీకరించారు సాయిబంధువు రాజేష్ తోలాని తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: నేను మస్కట్(ఒమెన్‌)లో నివసిస్తున్నాను. 2019, జులై 16, గురుపూర్ణిమరోజు ఉదయాన నేను బాబా గుడికి వెళ్తూ కొంత డబ్బు హుండీలో వేయాలని అనుకున్నాను. అయితే నా పర్సు కారులోనే మర్చిపోయాను. ఆ విషయం గుళ్ళోకి వెళ్లి విఘ్నేశ్వరునికి నమస్కరిస్తుండగా గుర్తుకువచ్చి బాధతో నన్ను నేను తిట్టుకున్నాను. దర్శనం చేసుకుని నా కారు వద్దకు తిరిగి వచ్చేసరికి ఒక వయసు పైబడిన వ్యక్తి నా కారు ప్రక్కన నిలబడి ఉన్నాడు. నేను చాలా సంవత్సరాలుగా ఆ మందిరానికి ప్రతి మంగళవారం వెళ్తున్నాను. కానీ ఆ వ్యక్తిని అంతకుముందెన్నడూ చూడలేదు. అతనిని చూసిన మరుక్షణం సచ్చరిత్రలోని 'స్వచ్ఛమైన మనస్సుతో బాబాకి దక్షిణ ఇవ్వాలనుకుని మర్చిపోతే, బాబానే ఏదో ఒక రూపంలో వచ్చి ఆ దక్షిణను స్వీకరిస్తారు' అన్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే హుండీలో వేయాలనుకున్న మొత్తాన్ని ఆ వృద్ధునికి ఇచ్చాను. అతను చిరునవ్వుతో ఆ డబ్బు తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. "థాంక్యూ బాబా!" గురుపూర్ణిమనాడు పండ్లు నైవేద్యంగా పెట్టే భాగ్యాన్నిచ్చారు బాబా. 2019, జులై 15న సాయిబంధువు హరిణి తాను పొందిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: సాధారణంగా ప్రతిరోజూ నేను బెల్లంతోపాటు ఏదైనా పండును నైవేద్యంగా బాబాకు పెడతాను. ఒకవేళ పండ్లు లేకుంటే బెల్లం మాత్రమే నైవేద్యం పెడతాను. గురుపూర్ణిమకు 4 రోజుల ముందు నుండి బెల్లం మాత్రమే పెడుతున్నాను. 2019, జులై 15 సాయంత్రం 'రేపు గురుపూర్ణిమ కదా! బాబాకి పండ్లు నైవేద్యంగా పెడదాం' అని అనుకుని 'పండ్లు తీసుకుని రమ్మ'ని నేను నా భర్తకి మెసేజ్ పెట్టాను. తన నుండి నాకు రిప్లై రాకపోవడంతో తను నా మెసేజ్ చూడలేదేమో అనుకున్నాను. అయితే తను ఇంటికి వస్తూ 4 ఆపిల్స్ తీసుకొచ్చారు. తను నా మెసేజ్ చూసి ఆ ఆపిల్స్ తీసుకొచ్చారని అనుకున్నాను. కానీ నేను మేసేజ్ చేసేటప్పటికే తను ఆఫీసు నుండి బయలుదేరి దారిలో ఉన్నందువల్ల మొబైల్ చూసుకోలేదని చెప్పారు. సాధారణంగా నేను పండ్లు, పువ్వులు మొదలైనవి తెమ్మని మెసేజ్ పెడితేనే తను తీసుకుని వస్తారు. అలాంటిది ఆరోజు నా మెసేజ్ చూడకుండానే తను పండ్లు తీసుకొచ్చారు. నా మనసు తెలిసిన బాబా తను పండ్లు తీసుకుని ఇంటికి వచ్చేలా చేసి గురుపూర్ణిమనాడు నా మనసుకు నచ్చేవిధంగా ఆయనను పూజించుకునే భాగ్యాన్ని కల్పించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" నాకోసం ట్రైన్ గంట ఆలస్యం చేసిన బాబా సాయిబంధువు సెంథిల్ సచిన్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: నేను గురుపూర్ణిమ సందర్భంగా శిరిడీ సందర్శించి బాబా దర్శనం చేసుకున్నాను. 2019, జులై 17న నా తిరుగు ప్రయాణానికి పూణే నుండి మధ్యాహ్నం 3.45 కి ట్రైన్ ఉంది. కాబట్టి శిరిడీ నుండి పూణే వెళ్ళడానికి ఉదయం 10 గంటలకున్న ఒక ప్రైవేట్ బస్సుకు టికెట్ బుక్ చేసుకున్నాను. అయితే 10 గంటలకు బయలుదేరాల్సిన బస్సు 10.30కి బయలుదేరింది. బయలుదేరటమే ఆలస్యమనుకుంటే డ్రైవర్ కూడా చాలా నెమ్మదిగా బస్సు నడుపుతూ, ఎక్కడికి అక్కడ బస్సు ఆపుతున్నాడు. దానికితోడు సుమారు 40 నిమిషాలు లంచ్ కోసం ఆపేశాడు. ఇక నా రైలు తప్పిపోవడం ఖాయం అనిపించింది. నిరాశతో బాబాను తలచుకుని, "రైలు తప్పిపోయే సందర్భంలో నేను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి బాబా" అని అనుకున్నాను. ఏమి జరిగిందో ఊహించగలరా?! కొద్దిసేపటికి నేను నా చేతిలో ఉన్న మొబైల్ లోని యాప్‌లో ట్రైన్ స్టేటస్ చూస్తే, ట్రైన్ గంట ఆలస్యంగా ఉంది. అది చూసి నాకు సంతోషంగా అనిపించింది. నేను స్టేషన్‌ చేరుకుని 15 నిమిషాలు వేచి ఉన్నాక ట్రైన్ వచ్చింది. బాబా నా ట్రైన్‌ను గంట ఆలస్యం చేసారు. ఆయన చూపిన దయకు కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

+5 प्रतिक्रिया 1 कॉमेंट्स • 0 शेयर

+8 प्रतिक्रिया 1 कॉमेंट्स • 12 शेयर

+4 प्रतिक्रिया 1 कॉमेंट्स • 8 शेयर

_*🚩రేపు వాడపల్లి చందన వెంకన్న కల్యాణ తీర్థం🚩*_ 🕉🔔🕉️🔔🕉️🔔🕉️🔔🕉️🔔🕉️ *ఏడువారాల వెంకన్న ‘వాడపల్లి’లో ఉన్నాడు….!!* తూర్పుగోదావరి జిల్లా. గోదావరి రెండుగా చీలి ప్రవహిస్తోంది. కలియుగ పుణ్యథామంగా విలసిల్లుతున్న వాడవల్లి గ్రామంలోని వెంకన్న గురించి చెప్పుకుని తరించాల్సిందే! గౌతమి వశిష్ట పాయలుగా విడి సుమారు 100కిమీ మేర ప్రయాణించి సముద్రుణ్ణి చేరుతుంది. రాజమండ్రి నుండి అటు ధవళేశ్వరం మీదుగా 30 కిమీ ప్రయాణం చేసినా.. ఇలా రావులపాలెంనుడి 8 కిమీ ప్రయాణం చేసినా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామం చేరుకోవచ్చు. ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాటేమంటే ఒక ఏడువారాలు వాడపల్లి వెంకన్నను దర్శిస్తే అనుకున్నది నెరవేరుతుందని. పుణ్యతీర్థాల దర్శనం గురించి మనకు పురాణేతిహాసాలు చెబుతూనే ఉన్నాయి. భారతంలో ప్రతీపుడు అనేక పుణ్య తీర్థాల్లో స్నానం ఆచరించిన తర్వాతే శంతనుడు జన్మించాడు. తీర్థ స్నానాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గోదావరి నదీ ప్రవాహం అనేక మూలికా ద్రవ్యాలతో కూడుకున్నది. ఎన్నో వనాలనుండి నీరు ప్రయాణించుకుంటూ వస్తోంది. అందుకే నదీ స్నానం పరమ పుణ్యఫలం. అక్కడే భగవంతుని ప్రతిష్టలు జరిగాయి. ఈ వాడపల్లి క్షేత్రంకు అదే మహత్తు ఏర్పడటానికి కారణం. చందన వెంకన్న అని ఈయనకు పేరు. చందన వృక్షం మానులో ఈయన ఉన్న విషయాన్ని గ్రామ వాసులు కనుగొని ప్రతిష్టించారు. ఒకసారి పురాణ చరిత్రను చూద్దాం! *☘స్థల పురాణం☘* కలియుగంలో ప్రజలు ఆహార విహారాదులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అధర్మం పాలు పెరిగింది. స్వార్థం పెరిగి కామ క్రోథాదులతో జనం అధర్మజీవనం గడుపుతన్నారని వైకుంఠంలో సనకసనందనాదులు శ్రీమన్నారాయణుణ్ణి వేడుకున్నారు. తాను గౌతమీ నదీతీరంలోని నౌకాపురం వద్ద్ద లక్ష్మీ సమేతుణ్ణై చందన వృక్షపేటికలో వెలుస్తాను అని చెప్పడం, నారదుడు ఈవిషయాన్ని అందరికి చేరవేయడం జరిగింది. కొంతకాలానికి నౌకాపురం(ఇప్పటి వాడపల్లి) ప్రజలకు గౌతమీ గోదావరిలో కొట్టుకొస్తున్న వృక్షం కనిపించింది. తీరా ఒడ్డునకు తీసుకొద్దామంటే దారిలో మాయమయ్యేది. కలి కల్మషం వల్ల మీరు దీనిని గుర్తించలేకపోతున్నారని పండితులకు స్వామి కలలో కనబడి ‘నదీగర్భంలో కృష్ణ గరుడ వాలినచోట చందనపేటికలో ఉన్నానని‘ తెలుపడంతో అందరూ వెళ్ళి చందన పేటికను కనుగొన్నారు. దానిని ఒడ్డునకు చేర్చి నిపుణుడైన శిల్పితో తెరిపిస్తే దానిలో శంఖ, చక్ర, గదలతో కంఠంలో వనమాలతో నుదుట ఊర్ధ్వపుండ్రాలతో పద్మాలవంటి కనులతో ఒప్పుతున్న స్వామి దివ్యమంగళ విగ్రహం కనబడింది. దేవర్షి నారదుడు అక్కడికి చేరుకుని గతంలో స్వామి మునులకు ఇచ్చిన వరాన్ని గుర్తు చేసుకుని ఇది విష్ణువు అర్చావతారంగా గుర్తెరిగి పురజనులకు తెలిపాడు. కలియుగంలో పాపం పెచ్చుమీరిన తరుణంలో స్వామి దర్శనంతో ఆలోచన సవ్యమై జీవనం సుఖంగా సాగుతుందనేది పురాణ ఇతివృత్తం. పెద్ద తిరుపతి, ద్వారకా తిరుమల(చిన్నతిరుపతి)లానే కోనసీమ తిరుపతిగా నౌకాపురమనే ఇప్పటి వాడపల్లి క్షేత్రం ఎంతో ఖ్యాతి గడించింది. నిలువెత్తు దివ్యమంగళ స్వరూపం చూడగానే ఆనందింప చేసే రూపంగా లక్ష్మీ స్వరూపుడై వెంకన్నదర్శనమిస్తాడు. *☘ఆలయం☘* మూడు మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలతో దేవాలయం కట్టింపజేసి లయం ముందుభాగంలో పదహారు స్తంభాలతో కూడిన యజ్ఞశాల కనిపిస్తాయి. ప్రధానాలయానికి కుడివైపున క్షేత్రపాలకుడు మరియు ద్వాదశ గోపాలాలలో ఒకటిగా చెప్పుకునే నారద ప్రతిష్టితమైన శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణు గోపాలస్వామి, త్తరం వైపున అలివేలుమంగ, ఆగ్నేయ భాగంలో రామానుజులు, ఆలయ అభిముఖంగా గరుత్మంతుని ఆలయం కనిపిస్తాయి. అలాగే ఇదే ప్రాంగణంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరుని ఆలయం దర్శనమిస్తుంది. పెద్దాపురం సంస్థానాధీశుడు రాజా వత్సవాయి తిమ్మగజపతి రాజు 1759లో స్థిరాస్థులు సమర్పించారు. గజేంద్రుడు అనే ఓడల వ్యాపారి ఇక్కడే నివసించేవాడు. దీనికి ఓడపల్లి అనే గ్రామంగా విలసిల్లి తర్వాత వాడపల్లిగా వినుతికెక్కింది. తన ఓడలన్నీ భ్రదంగా ఒడ్డుకు చేరితే గుడి కట్టిస్తానని మొక్కుకుని గజరాజు ఈ క్షేత్రం నెలకొల్పినట్టు స్థానికుల వాక్కు. *☘చైత్రశుద్ధ ఏకాదశి☘* ఈరోజున స్వామి కల్యాణం తీర్థం జరగుతాయి. వాడపల్లి తీర్థం అంటే ఈ ప్రాంతంలో ఎంతో ప్రశస్థి కెక్కింది. మరో విశేషమేమంటే సంతానం కలగని వారు ఈయనను దర్శించుకున్నతర్వాత సంతానవంతులౌతారు. అందుకే పటికబెల్లం, హారతి, చిల్లరలతో సంతానం కలిగిన తర్వాత తూకం వేసి స్వామికి సమర్పించడం కద్దు. అంతేకాదు హారతికర్పూరం తోను తులాభారం వేస్తారు. ఈ వేడుకలు చూసి తరించాల్పిందే. కలియుగంలో పాప ప్రక్షాలన కోసం భగవదారాధన తప్పనిసరి. పుణ్యక్షేత్రాల ఫలితం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే దేవతార్చన ప్రాంతాల్లో మంత్ర శక్తి (వైబ్రేషన్స్) ఉంటాయనడానికి ఆధునిక కాలంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर