రమేష్ Feb 17, 2020

🙏అక్కమహాదేవి గురించి విన్నారా🙏 అక్కమహాదేవి. ఈ పేరు వినగానే శ్రీశైలంలో ఆమె పేరు మీదుగా ఉన్న ఒక గుహ గుర్తుకువస్తుంది. విశాలమైన ఆ గుహలో ఆమె సుదీర్ఘకాలం తపస్సు చేసుకుందని చెబుతారు. కానీ అక్కమహాదేవి కేవలం ఒక భక్తురాలు మాత్రమే కాదు. సమాజాన్ని ధిక్కరించిన ఒక విప్లవకారిణి. భక్తి ఉద్యమానికి కొత్త ఊపు ఇచ్చిన రచయిత్రి. ఆ పరమేశ్వరుని తన భర్తగా భావించిన భక్తురాలు. అక్క అన్న పేరు నిజానికి ఒక బిరుదు మాత్రమే. ఈ భక్తురాలి అసలు పేరు మహాదేవి. శివభక్తులైన ఆమె తల్లిదండ్రులు ఆమెను సాక్షాత్తూ ఆ పార్వతీదేవి అవతారంగా భావించారు. అందుకనే ఆమెకు మహాదేవి అన్న పేరు పెట్టారు. నిజంగానే పార్వతీదేవి పుట్టిందా అన్నట్లు మహాదేవి మొహం తేజస్సుతో వెలిగిపోతూ ఉండేదట. దానికి తోడు నిత్యం శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ తనదైన లోకంలో ఉండేదట. మహాదేవి పుట్టిన ఊరు కర్ణాటకలోని ఉడుతడి అనే చిన్న గ్రామం. ఒకసారి ఆ రాజ్యాన్ని ఏలే కౌశికుడు అనే రాజు ఆ గ్రామపర్యటనకు వెళ్లాడు. అక్కడ అందరితో పాటుగా రాజుగారి ఊరేగింపును చూస్తూ నిల్చొన్న మహాదేవిని చూసి రాజు మనసు పారేసుకున్నాడు. వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ మహాదేవి మనసు అప్పటికే పరమేశ్వరుని మీద లగ్నమైపోయింది. అలాగని రాజుగారి మాట కాదంటే తన కుటుంబానికి కష్టాలు తప్పవు. అందుకని మహాదేవి ఒక మూడు షరతులతో రాజుగారిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నదట. ఆ పరమేశ్వరుని తనకు తోచిన రీతిలో, తోచినంతసేపు ధ్యానించుకోవచ్చునన్నది ఆ షరతులలో ఒకటి. అక్కమహాదేవి షరతులకు లోబడి రాజుగారు ఆమెను వివాహం చేసుకున్నారు. కానీ అనతికాలంలోనే ఆమె షరతులను అతిక్రమించాడు. దాంతో ఆమె కట్టుబట్టలతో రాజమందిరం నుంచి బయటకు వచ్చేశారు. తర్వాత కర్ణాటకలో వీరశైవానికి కేంద్రంగా ఉన్న కళ్యాణ్కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ బసవేశ్వరుడు, అల్లమ ప్రభువు వంటి ప్రముఖులు ప్రజలందరినీ భక్తిబాటలో నడిపిస్తున్నారు. అలాంటి పండితులందరూ ప్రవచనాలు చేసేందుకు, తమ వాదనలు వినిపించేందుకు అక్కడ అనుభవ మండపం పేరుతో ఒక వేదిక ఉండేది. మహాదేవి ఆ అనుభవ మండపాన్ని చేరుకుని... శివుని మీద తనకి ఉన్న అభిప్రాయాలు, అనుభూతులను పంచుకున్నారు. మహాదేవి వాదనాపటిమను, పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన పెద్దలంతా ఆమెకు ‘అక్క’ అన్న బిరుదుని అందించారు. అలా మహాదేవి కాస్తా అక్కమహాదేవిగా మారింది. అక్కమహాదేవి భక్తిని గమనించిన బసవేశ్వరుడు ఆమెను శ్రీశైలం వెళ్లవలసిందిగా సూచించాడట. దాంతో ఆమె ఎన్నో కష్టానికి ఓర్చి శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధికి చేరుకుంది. ఆనాటి శ్రీశైలం అంటే మాటలా! దుర్గమమైన అడవులు, క్రూరమృగాలు, ఎడతెగని కొండలు, దారిదోపిడీగాళ్లతో ఆ ప్రాంతం భయానకంగా ఉండేది. అలాంటి ప్రాంతంలో ఒక వివస్త్రగా ఉన్న సన్యాసిని సంచరించడం అంటే మాటలు కాదు. కానీ ఆమె భక్తి ముందు అలాంటి పరిస్థితులన్నీ తలవంచక తప్పలేదు. ఆలయానికి సమీపంలో ఉన్న ఒక గుహలో, మనిషి కూర్చోవడానికి మాత్రమే వీలుండే ఒక మూలన ఆమె తన తపస్సుని సాగించారు. కొన్నాళ్లకి శ్రీశైలంలోని కదళీవనంలో ఆ మల్లికార్జునిలో అంకితమైపోయారు. అక్కమహాదేవి మహాభక్తురాలే కాదు... గొప్ప రచయిత్రి కూడా. కన్నడలో ఆమె 400లకు పైగా వచనాలు రాసినట్లు గుర్తించారు. ప్రతి వచనంలోనూ ‘చెన్న మల్లికార్జునా!’ అనే మకుటం కనిపించడం వల్లే అవి అక్కమహాదేవి రాసిన వచనాలుగా భావిస్తున్నారు. ఆమె వచనాలలో శివుని పట్ల ఆరాధన, ఈ ప్రకృతి పట్ల నమ్మకం, ఐహిక సుఖాల పట్ల వైరాగ్యం స్పష్టంగా కనిపిస్తాయి. వీటిలో ఆధ్యాత్మిక రహస్యాలను చెప్పే గూఢార్థాలు కూడా ఉన్నాయని నమ్ముతారు. కన్నడలో ఈమెని తొలి రచయిత్రిగా భావించేవారూ లేకపోలేదు. అక్కమహాదేవి రాసిన వచనాలను తెలుగులోకి కూడా అనువదించారు. దొరికితే తప్పకుండా చదవండి. అందులో అరుదైన ఆణిముత్యాలు ఎన్నో కనిపిస్తాయి. మచ్చుకి ఒక వచనం ఇదిగో.... మట్టిపెల్లలవలె కరిగికరిగి, ఇసుకదిబ్బలవలె జరిగి జరిగి కలలో కలవరపడి నేను వెరగొందిగి అవములో నిప్పువలె చుట్టిచుట్టి కందితిని ఆపదలో ఆప్తులనెవరిని కాన వెదకి కానని తనువును, కలసిన కూడని సుఖమును నాకు కరుణించుమో చెన్నమల్లికార్జునా! 🙏శ్రీ మాత్రే నమః🙏

+4 प्रतिक्रिया 1 कॉमेंट्स • 0 शेयर
రమేష్ Feb 17, 2020

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 4 शेयर
రమేష్ Feb 16, 2020

+8 प्रतिक्रिया 0 कॉमेंट्स • 16 शेयर
రమేష్ Feb 16, 2020

+7 प्रतिक्रिया 2 कॉमेंट्स • 11 शेयर
రమేష్ Feb 15, 2020

--: గురు అష్టకం (శ్రీ శంకరాచార్య) :-- ------------------------------------------ 1. శరీరమ్ సురూపమ్ తథా వా కళత్రమ్ యశస్చారు చిత్రమ్ ధనమ్ మేరుతుల్యమ్ మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం , తతః కిం తతః కిమ్ 2. కళత్రమ్ ధనమ్ పుత్ర పౌత్రాధి సర్వమ్ గృహమ్ బాంధవా సర్వ మేతాధి జాతమ్, మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం , తతః కిం తతః కిమ్ 3. షడన్గాది వేదో ముఖే శాస్త్ర విద్య కవిత్వాది గద్యమ్, సుపద్యమ్ కరోతి మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం , తతః కిం తతః కిమ్ 4. విదేశేషు మాన్య, స్వదేశేషు ధన్య సదాచార వృత్తేషు మత్తో న చాన్యా మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం , తతః కిం తతః కిమ్ 5. క్షమా మండలే భూప భూపాల వృందై సదా సేవితమ్ యస్య పాదారవిందమ్ మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం , తతః కిం తతః కిమ్ 6. యశో మే గతమ్ భిక్షు దాన ప్రతాప జగద్వస్తు సర్వమ్ కరే యః ప్రసాదత్ మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం , తతః కిం తతః కిమ్ 7. న భోగే, న యోగే, న వా వాజి రాజౌ న కాంతా ముఖే నైవ విత్తేషు చిత్తమ్ మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం , తతః కిం తతః కిమ్ 8. అరణ్యే న వాసస్య గేహే న కార్యే న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యె మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం , తతః కిం తతః కిమ్ 9. గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ, యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ లభేద్వాఞ్చితార్థం పదం బ్రహ్మసంఙ్ఞం, గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నమ్

+14 प्रतिक्रिया 0 कॉमेंट्स • 6 शेयर
రమేష్ Feb 14, 2020

🌺మహాలక్ష్మీ అనుగ్రహం పొందడానికి............!!🌺 సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉండరు. ఆమె దృష్టి మన మీద పడడం కోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలూ చేస్తూ ఉంటాము. కానీ, శ్రీ లక్ష్మి దేవి యొక్క నివాస స్థానాలు, ఆమె ప్రీతి కొరకు ఏమి చేయాలి అనేది మనం సూక్ష్మంగ తెలుసుకొందాము. పూజలు, వ్రతాలూ చేయలేని వాళ్ళు జీవన విధానంలో కొద్ది మార్పులు చేసుకోవడం ద్వారా లక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు. సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పడేయకూడదు. గడప..లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మీద కాలు వేయడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు. పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మి దేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమ తో అలంకరించాలి. ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసిన మంచిదే. శుచి, శుభ్రత ఉన్న ఇళ్లు లక్ష్మి దేవికి ఆలవాలం. కనుక, ఇంట్లోని పనికిరాని వస్తువులు, విరిగి పోయిన, చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి. చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, చిరిగి, వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మి దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారే వాకిలి ఉడ్చి ముగ్గులు వేసుకోవాలి. ఇంటి ఇల్లాలు గట్టిగ గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు. ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం కోట్లడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తి గా ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మి దేవి ప్రవెశించదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించే వారు, బద్దకస్తులు ఎక్కడ ఉంటారో, అక్కడ లక్ష్మి దేవి ఉండదు. ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది. సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసిన మంచిదే. సత్యవాదులు, ధార్మిక , నైతిక ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మి దేవి ప్రసన్నురాలై ఉంటుంది. వెండి, బంగారు వంటి లోహల్లో, రత్నాలు, ముత్యాలు లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది. అతిగా మాట్లాడే వారు, గురువులను, పెద్దలను అగౌరవ పరిచేవారు, జూదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్న చోట లక్ష్మి దేవి ఉండలేదు. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి, ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి, లక్ష్మి పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు..! ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః..!! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर