m.sreenivasareddy May 20, 2019

🍀🌸💖💚🧚‍♂💚💖🌸🍀 🌸 *జీవితం* 🌸 🌸 మహాభారతంలోని ప్రముఖులైన ఇద్దరు మహోన్నతులు - కృష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది... కర్ణుడు కృష్ణుడుని అడిగాడు... నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది.. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పా..కాదే.. ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు..ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో.. పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు.. పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు.. ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది.. ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే.. నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే.. అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని అడిగాడు కర్ణుడు... 🌸 దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణునికి చెప్పాడు... నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను.. నేను పుట్టటం కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది.. నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లితండ్రి నుండీ వేరుచేయబడ్డాను.. చిన్నతనంలో నువ్వు కత్తులు , రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు.. 🌸 నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను... నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి..అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు..కానీ ఎన్నో దాడులు ఎదుర్కున్నాను.. నాచుట్టూ ఉన్న వారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా.. నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు.. 🌸 మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడానూ.. సాందీపుని రుషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభం అయ్యింది.. నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు.. నేను నాకిష్టమైన అమ్మాయిని చేసుకోలేకపోయాను..పైగా నన్ను వివాహం చేసుకున్నవారు..వారు నన్ను కోరుకుని కొందరూ, నేను రాక్షసుల నుండీ కాపాడబడినవారు కొందరూనూ.. 🌸 జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమునవడ్డునుంచీ దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది.. అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డపేరు నాకొచ్చింది.. సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచిపేరు వస్తుంది... అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు...పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణం అన్న నింద వేస్తారు అందరూ నాపైన... ఒకటి గుర్తుంచుకో కర్ణా.. 🌸 జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి.. జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగానే ఉండదు.. దుర్యోధనుడు అవనీ యుధిష్టరుడు అవనీ అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే.. ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి తెలుసు.. మనకు ఎంత అన్యాయం జరిగినా.. మనకు ఎన్ని పరాభవాలు జరిగిన.. మనకు రావల్సినది మనకు అందకపోయినా... మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం...అదే చాలా ముఖ్యమైనది.. 🌸 జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో..అనే కారణాలు మనకు అధర్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా (licence ) అనుకోకూడదు..మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు...ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు..అని కర్ణునికి కృష్ణుడు బోధించాడు.. “శ్రీకృష్ణం వందే జగద్గురుం” Thank you....💚💜💚 All is well..... 💜💚💜 🍀🌸💖💚🧚‍♂💚💖🌸🍀

+8 प्रतिक्रिया 2 कॉमेंट्स • 14 शेयर
m.sreenivasareddy May 20, 2019

[20/05, 9:20 AM] +91 94412 09132: ఆయుర్వేదం నందు వివరించబడిన ఆరోగ్య సూత్రాలు - 6 . * దాహం కలిగినపుడు నీళ్లు తాగకుండా భోజనం చేయరాదు . ఆకలిగా ఉన్నప్పుడు భోజనం చేయకుండా నీరు తాగరాదు. దాహముగా ఉన్నప్పుడు భోజనం చేయుట వలన కడుపులో గుల్మరోగం అనగా గడ్డ ఏర్పడును . ఆకలిగా ఉన్నప్పుడు నీళ్లు తాగడం వలన జలోదరం ఏర్పడును . * బాగా అలిసిపోయిన వెంటనే భోజనం చేయుట వలన లేక నీరు తాగడం వలన జ్వరం వచ్చును. లేదా వాంతి అగును. * రాత్రి సమయం నందు నువ్వులు చేర్చిన ఆహారాన్ని దేన్ని తినరాదు. గోధుమలు కంటికి మంచివే కాని నూనెతో చేయబడిన గోధుమ ఆహారం కంటికి చెడు చేయును .చపాతి వంటి వాటిని నూనె లేకుండా చేసుకుని తినవలెను . * పులుపు రసం గల ఏ ఆహారపదార్థాన్ని పాలతో పుచ్చుకోకూడదు. అలానే పండ్లను , పాలను ఒకే సమయములో వాడరాదు. అరటి పండును మజ్జిగతో కాని , పెరుగుతో కాని కలిపి వాడరాదు. * ముల్లంగి , ఆకుకూరలు తిని వెంటనే పాలు తాగరాదు. పిప్పళ్లు , మిరియాలు , తేనె , బెల్లముతో చేర్చి కాచి ఆకుకూరను వాడరాదు. బచ్చలికూర , నువ్వులు కలిపి వాడకూడదు. అలా కలిపి వాడినచో విరేచనాలు ఏర్పడవచ్చు. * బియ్యాన్ని బాగా కడిగి ఉడికించి గంజివార్చి వండి వేడిగా ఉండు అన్నం త్వరగా జీర్ణం అగును. ఇలాకాక గంజి వార్చి వండినది , పాలు , మాంస పదార్థాలు చేర్చి వండినటువంటి అన్నం త్వరగా జీర్ణం కాదు. * కొద్దిగా వేయించి బాగుగా ఉడికించిన పొట్టులేని కందిపప్పు వంటకం త్వరగా జీర్ణం అగును. ఆరోగ్యాన్ని ఇస్తుంది. బాగా ఉడికించి నెయ్యిలాంటి చమురు పదార్థాన్ని చేర్చి వండిన కూర వంటకం ఆరోగ్యాన్నీ ఇచ్చును. * భోజనం చేయునపుడు మధ్యమధ్యలో కొద్దికొద్దిగా చన్నీళ్ళను తాగవలెను . దీనివలన ఆహారంలో రుచి ఏర్పడును . బాగా నమిలి తిన్న ఆహారం జీర్ణం అగును. * చన్నీళ్ళను తాగుటవలన మద్యము తాగుటచేత వచ్చు మైకం , నీరసం , మూర్చ,వాంతి , తలతిరుగుట, దాహం , వేడి , మంట , శరీరంలో రంద్రాల నుంచి రక్తం కారు రక్తపిత్తవ్యాధి , విషదోషం వంటి సమస్యలు పోవును . * వాతము మొదలగు దోషాలు , జఠరాగ్ని ఇవి సరైన స్థితిలో లేనివారికి , జ్వరం మొదలగు వ్యాధుల చేత బలహీనుడు అయినవారికి చన్నీళ్ళు తాగుట నిషేదించబడినది. వీరు చన్నీళ్లు సేవించుట వలన మూడు దోషములు ప్రకోపిస్తాయి. వీరు వేడినీటిని గాని లేదా కాచి చల్లార్చిన నీటినికాని సేవించవలెను . * వేడినీరు అకలిని పుట్టించును . ఆహారాన్ని జీర్ణం చేయును . గొంతుకకు మంచిది . మూత్రసంచిని శుభ్రపరచును . ఎక్కిళ్ళు , కడుపు నొప్పి , జ్వరం, వాతరోగాలు , కఫరోగాలు , దగ్గు , జలుబు , ఉబ్బసం , డొక్కలో నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారికి వేడినీరు మంచిది . వాంతులు , విరేచనాలు అయ్యేవారికి కూడా చాలా మంచిది . * ఒకసారి కాచబడిన నీరు మరలా కాచి తాగరాదు . కడుపు నందు విషములా మారి రోగాలను తెచ్చిపెట్టును . * బావినీటిని తాగి అవి జీర్ణం అవ్వడానికి మునుపే ఏటినీటిని తాగరాదు. అదేవిధముగా ఒక ఊరినీటిని తాగి అవి జీర్ణం అవ్వడానికి మునుపే వేరే ఊరి నీరు తాగరాదు. చన్నీళ్ళను తాగి అవి సంపూర్ణంగా జీర్ణం అవడానికి ముందే కాచి చల్లార్చిన నీళ్లను తాగరాదు. వేడిగా ఉన్న నీరు తాగినవెంటనే చన్నీళ్లను తాగకూడదు . పైన చెప్పిన నియమాలను పాటించకుండా నీళ్లను సేవించువారికి జలుబు , తలనొప్పి , దగ్గు మొదలయిన సమస్యలతో ఇబ్బంది పడటం జరుగును. కాచి చల్లార్చిన నీటిని తీసుకునే అలవాటు కలిగి ఉండటం చాలా మంచిది . చన్నీళ్లు తాగిన అవి సంపూర్ణంగా జీర్ణం అగుటకు ఆరు గంటల సమయం పట్టును . కాచి చల్లార్చిన నీరు జీర్ణం అగుటకు మూడు గంటల సమయం పట్టును . కాగి గోరువెచ్చగా ఉండు నీరు ఒకటిన్నర గంటల కాలంలో జీర్ణం అగును. తరవాతి పోస్టులో మరిన్ని ఆరోగ్య విషయాల గురించి తెలియచేస్తాను . గమనిక - నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను. మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది. రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు. ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. కొరియర్ చార్జీలు కూడ ఇందులోనే పైన మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు . పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి. ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . కాళహస్తి వేంకటేశ్వరరావు 9885030034 అనువంశిక ఆయుర్వేద వైద్యులు [20/05, 10:38 AM] msvreddy13: 🍀🌸💖💚🧚‍♂💚💖🌸🍀 🌸 *దానం* 🌸 🌸 ఒక చేపలు పట్టేవాడు ఒక చేపను పట్టుకుని మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ చేపను మహారాజుగారికి సమర్పించి ఇలా అన్నాడు. " మహారాజా! ఈ చేప చాలా ప్రత్యేకమైనది.... ఇది మీదగ్గర ఉంటేనే బాగుంటుంది." అన్నాడు.చేప చాలా బాగుందని రాజుగారు ముచ్చటపడి ఆ చేపను తీసుకుని అతనికి 500 వరహాలు ఇచ్చాడు. అదిచూసిన మహారాణికి చిన్న చేపకు 500 వరహాలు ఇవ్వడం నచ్చలేదు. 🌸 రాజుగారితో ఇలా అంది. " మహారాజా! చేపను తెచ్చి ఇచ్చిన అతనికి 500 వరహాలు ఇవ్వడం నాకు నచ్చలేదు. ఆ చేపను ఇచ్చేసి ఆ వరహాలను వెనక్కు తీసుకోండి" దానికి మహారాజు ఇలా అన్నాడు. " ఒక చేపలు పట్టి బ్రతుకుతున్న వ్యక్థికి ఇచ్చిన కానుకను వెనక్కి తీసుకోవడం మంచిదికాదు. ఆ ఆలోచన మానుకో " కానీ రాణి ససేమిరా ఒప్పుకోలేదు. ఎలాగైనా వరహాలను వెనక్కు తీసుకోవాలని రాజుగారిని ఒత్తిడిచేసింది. చేసేదేంలేక రాజుగారు ఒప్పుకుని ఎలా వెనక్కుతీసుకోవాలో చెప్పమని రాణినే అడిగారు. దానికి రాణి ఇలా అన్నది. " చేప ఆడదో ...మగదో అడిగి తెలుసుకోండి...వాడు ఆడది అంటే మాకు మగ చేపకావాలి అనీ... మగచేప అని అంటే మాకు ఆడచేపలే కావాలని చెప్పి తెలివిగా చేపను వెనక్కి ఇచ్చివరహాలు వెనక్కు తీసుకుందాం " రాజుగారు ఆ చేపలు పట్టే వాణ్ణి పిలిచి చేప ఆడదా మగదా అని అన్యమనస్కంగా అడిగాడు . 🌸 దానికి ఆ చేపలు పట్టెవాడు ఇలా సమాధానం ఇచ్చాడు. " మహారాజా! ఆడచేప కాదు...మగచేపకాదు. చాలా వింతైన చేప కాబట్టే మీకు ఇచ్చాను" ఆ సమాధానానికి మెచ్చి రాజుగారు మరొక 500 వరహాలు ఇచ్చాడు అలా ఇస్తున్నప్పుడు ఒక వరహా జారి కిందపడిపోయింది. దానికోసం అతను వెదుకుతుండగా మహారాణి మళ్ళి ఇలా అన్నది. " చూశారా! మహారాజా! వాడి పిసినారితనం..... మిమ్మల్ని ఎలా బురిడీ కొట్టించి మరొక 500 వరహాలు కొట్టేశాడు. అతన్ని అడగండీ" రాజు గారు అతన్ని ఇలా అడిగాడు " నీకు 1000 వరహాలు వచ్చాయి కదా! మళ్ళీ కిందపడిపోయిన ఒక్క వరహా కోసం ఎందుకు అంతలా వెతుకుతున్నావు." దానికి ఆ చేపలు పట్టేవాడు ఇలా సమాధానం చెప్పడు. " మహారాజా! నాకు , నా కుటుంబానికి సరిపడా సంపాదనను మీరే నాకు కల్పిస్తున్నారు. అలాంటి మీరంటే చాలా గౌరవం మాకు. ఆ వరహా మీద మీ రూపు ఉంటుంది కదా! పొరపాటునకూడా దాన్ని ఎవరూ తొక్కడం నాకు ఇష్టంలేదు మహారాజా! అందుకే ఆ ఒక్క వరహాను వెతుకుతున్నాను. క్షమించండి మహారాజా! అది విన్న మహారాజు మరొక 500 వరహాలు కానుకగా ఇచ్చి పంపించారు. 🌸 మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని తక్కువగా అంచనా వేయకూడదు... వాస్తవానికి ఇక్కడ మనం గమనిస్తే మనం దానమనేది చేస్తే అది తిరిగి మరికొన్ని రేట్లయి తిరిగి వస్తుంది... అదే మన జీవితం లో అన్యయించుకుంటే మనం మన పిల్లలకు దాన దర్మాల గురించి స0స్కృతి సంప్రదాయాల గురించి నేర్పుతామ్... అదే మానవత్వంను మన ఇళ్లల్లో నింపుకోవడం అంటే ... అదే భారతీయత కూడా... అందుకే మనం అనునిత్యం మానవత్వంతో మనుగడ సాగిద్దాం... Thank you.... 💚💖💚 All is well..... 💖💚💖 🍀🌸💖💚🧚‍♂💚💖🌸🍀

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

+5 प्रतिक्रिया 1 कॉमेंट्स • 0 शेयर
m.sreenivasareddy May 20, 2019

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर