Dvsraju Feb 25, 2020

*సర్వాంతర్యామి* దేవుడు సర్వాంతర్యామి అని వేదం ఘోషిస్తుంది, మరి సర్వాంతర్యామి అయినప్పుడు ఆ దేవుడు ఒక రూపం, ఒక విగ్రహం గా ఎలా ఉంటాడు? సర్వాంతర్యామి అనగా సర్వం వ్యాపించి ఉన్నవాడు, ఈ సృష్టి అంతా నిండినవాడు అని. అలా అంతా వ్యాపించినది, ఈ సృష్టి అంతా నిండినది ఏంటిది...? అది శక్తి, ఆ శక్తే దేవుడు, అంతకు మించింది లేదు. మరి అలాంటి శక్తి ఒక రూపంగా ఉంటె మిగతా అంతా ఎవరు ఉన్నారు? మరి వేదంతో పోల్చితే సబబుగా అనిపిస్తుందా? ఆలోచించండి... దేవుడికి ఒక విగ్రహ రూపమే ఉంటే అందులోనే ఉంటాడు అంతేగానీ అంతటా ఎలా ఉంటాడు, దేవుడికి విగ్రహ రూపం లేదు కాబట్టే అతను సర్వాంతర్యామి. మరి ఈ విగ్రహాలు ఎలా వచ్చాయి? మనం మనుషులం, మనం ఒక ఆకారంలో ఉన్నాము కావున మనలోని మనస్సుకు ఆకారం లేని వాటిని అర్ధం చేసుకోవటం కష్టం అనిపిస్తుంది, మరియొక సమయంలో స్వీకరించదు కూడా... భారతదేశంలోని పురాణ పురుషులు ఇలాంటి కష్ట సాధనను సిద్దించుకోని నిరాకారి అయిన ఆ సర్వాంతర్యామి యొక్క సత్యాన్ని తెలుసుకొని ముక్తిని పొందారు. అదే సాధనను తమ శిష్యులకు ఉపదేశించారు. అలా అలా... కొంత కాలానికి ఈ సాధన మెల్లి మెల్లిగా మరుగున పడే స్థాయికి వచ్చింది. ఎందుకంటే ముందుగా చెప్పినట్లు ఇది చాలా కష్ట సాధన, ఇక్కడ మీకు మీరే సాధనలోని మెట్లను అధిగమించాలి, ఇందులో ఎక్కడైనా పొరపాటు పడితే తిరిగి మళ్ళి మొదటి మెట్టుకు పడిపోతారు. ఇంతటి కష్ట సాధనను అభ్యసించే వారు కరువైన సమయంలో ఆనాటి ఋషులు ప్రజలను ముక్తి మార్గంలోకి నడిపించడానికి ఈ సాధనకు ముందుగా కొంత సరళమైన అభ్యాస సాధన చేకురుస్తే దానితో సిద్దించిన జ్ఞానంతో ఈ కష్ట సాధన చేయటం సులువు అవుతుందని తలచి దాని ముందు యోగ సాధనను జోడించారు. ఈ యోగ సాధన కొంత సులభతరంగా ఉన్నందునా ... ఇది ప్రజాభిమానం పొందింది. ఇలా కొంత కాలం గడిచేకొద్ది ఈ విద్య కూడా మెల్లి మెల్లిగా అంతరించె దశకు వచ్చింది, ఎందుకనగా మానవులలోని బుద్ది కుశలతలోని మార్పుల కారణంగా మొదటి కష్ట సాధన ఉన్న కాలం నుండి ఇప్పటి కాలం వరకు మానవుడిలో చాలా మార్పులకారణంగా ఈ యోగ సాధన అప్పటి కాలంలో సరళంగా తోచిన ఇప్పటి కాలానికి అది మరింత కష్టంగా మారింది. ఆ యుగం నుండి ఈ యుగం వచ్చేసరికి.. ఈ యోగ సాధన సంసార బంధంలో ఉన్నవారు చేయలేరు, ఏ బంధం లేని వారికే ఈ సాధన అనే స్థితికి వచ్చారు. ఇలా ఉంటె మానవుడి మోక్ష సాధన జరగదు. అందుకు మన ఋషులు ఆలోచించి, వీరు బంధంలో ఇరుక్కుపోయి అసలైన సాధనను వదులుకుంటున్నారు అని గాడి తప్పిన మన ఆలోచనలకు ఇంకా అతి సరళమైన ఒక క్రమశిక్షణ సాధన అవసరం అని గుర్తించి, మన కోసం ఒక సరళమైన మార్గమును యోగసాధన ముందు జోడించారు. ఒక ఆకారంలో ఉన్న మనస్సును ముందుగా దారిలోకి తెచ్చే ప్రయత్నంగా ఆకారం లేని దేవుడికి ఒక రూపం ఇచ్చారు. సాధన సిద్దించాక తెలుసుకోవల్సిన సర్వాంతర్యామిని ముందుగానే లభించిందనే ధ్యాసతో సాధన మొదలుపెట్టి తర్యాత ఆ మనస్సు దారిలోకి వచ్చాక విగ్రహంలో ఉన్నది దేవుడు కాదు, ఆ రూపానికి అతీతంగా ఉన్నదే దేవుడు, ఎందుకనగా దేవుడనగా శక్తి. ఆ శక్తి అనేది రూపంగా ఉండడు అనే జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం సిద్దించాక తిరిగి వెనుకంజ వేయలేరు, అసలైన జ్ఞానం అందుకోవడానికి ఎంతటి కష్ట సాధనైనా సాగిస్తారని తలచి దేవుడికి ఒక విగ్రహ రూపం ఇచ్చారు. ఇది ఏంతో సులువుగా ఉన్నందున దీనికే ప్రజలు ఇష్టపడినారు. అలా ఆలా.. కాలం గడుస్తున్నకొద్దీ అది కాస్త మొహంగా మారి దేవుడిని ఆ రూపంలోనే బందించుకొని, ఆ విగ్రహ బంధంలో ఇరుక్కుపోయి మతాలని, కులాలని ఏర్పరుచుకొని గొడవలు, కొట్లాటలు పెట్టుకొని అసలైన సాధనకు దూరం అవుతున్నాడు. ఇలాంటి సాధనతో ఇంకా మొదటి మెట్టులోనే ఉంటూ... దేవుడు సాక్షాత్కరిస్తాడు అని ఆ మోహ బంధంతోనే జీవితాలను ముగిస్తున్నారు. ఇలా అయితే ఎన్ని జన్మలు పట్టాలి అసలు జ్ఞానం సిద్దించడానికి. ఏ సాధనైనా ధర్మంతో సాగాలి. దర్మం ఏమి చెబుతుంది? ధర్మం ఎక్కడ దేవుడి విగ్రహం గురించి ప్రస్తావించలేదు. దేవుడికి ఒక రూపమే ఉంటె ఆ రూపం ఎలా ఉండాలి? అందరి ప్రజల దేవుడి రూపంగా ఉండాలి, మరి ఆలా లేదే... ఒక మతం ఇది దేవుడి రూపం అంటే మరొక మతం అంటారు అది కాదు మా దేవుడి రూపమే దేవుడు అని. అంటే దేవుడనేవాడు ఒక్కడు కాదా...? మరి ఎంత మంది? దేవుడు అంటే ఒక శక్తి, దాన్ని మించింది లేదు. అలాంటప్పుడు శక్తి అనేది ఒకటే ఉంటుంది. అలాంటి ఈ విశ్వ శక్తి ఒక రూపంగా ఎలా ఉంటుంది? అది సర్వవ్యాప్తం అయినది. ఆ శక్తే దేవుడు అంతేతప్ప ఈ విగ్రహాలు కాదు. దీనిని చాల బాగా అర్ధం చేసుకోండి. అప్పటికాలంలో సాధనలు చాలా కష్టంగా ఉండేవి, వాటిని సరళంగా మీకు అందించడానికి మీ మనస్సును ఒక మార్గంలో నడిపించడానికి మొదటి మెట్టు శిక్షణగా ఈ రూపాలను సృష్టించారు, ఎందుకనగా ఇంత ముందు చెప్పుకున్నాం మనుష్యుడు ఒక రూపంలో ఉండి రూపానికి అతీతంగా ఉన్న జ్ఞానంను అందుకోవడానికి మనస్సు అవరోదంగా ఉంది, కావున ఆ మనస్సును దారిలో వేయడానికి వారు బయటకూడా ఒక రూపం సృష్టించి సాధన చేయమన్నారేగాని అదే దేవుడు అని అలానే పట్టుకోమనలేదు. దాని వలన మనం మొదటి మెట్టులోనే ఉండి... వాళ్ళు ఏర్పరిచిన సాధనలో అంతిమ మెట్టు అయినా ఆ రూపాతీతంగా ఉన్న శక్తిని చేరుకోలేము. వేదాల్లో ఎక్కడ చెప్పలేదు దేవుడికి ఒక రూపం ఉందని. ఇది ఈ మద్యే వచ్చినదే. పైన చెప్పిన ఆ కష్ట సాధన ఇంకా ఇప్పటి కాలంలో కూడా ఉంది, ఇగ రెండవ సాధన... యాగ సాధన గురించి మీకు చెప్పవల్సిందేమీలేదు, ఇప్పుడు ఎక్కడ విన్న అదే వినబడుతుంది. ఎన్నుకోండి ఎలా వెళ్ళాలి ఈ జ్ఞానార్జన కోసం అని, అది మాత్రం మీ వంతు... దేవుడు సర్వాంతర్యామి, ఒక శక్తి, రూపాతీతుడు.. అలాంటి జ్ఞానంను అందిపుచ్చుకుందాం, అందరం కలిసి జీవిద్దాం... మోక్షం సాధిద్దాం ఈ జన్మలోనే. 🕉🌞🌎🌙🌟🚩

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Dvsraju Feb 25, 2020

తారళ్య మరుతే హనుమతే రామభక్త హనుమతే రక్షమాం తారళ్య మరుతే హనుమతే రామభక్త హనుమతే రక్షమాం శ్రీరామదాస విభో రక్షమాం శ్రీరామదాస విభో రక్షమాం lతారళ్యl వజ్రతను శూర కపీశ్వర విఖ్యాత యథామతి సాహస వాక్పటు కుశల ఆమోద రామనామ హనుమతే ఆమోద రామనామ హనుమతే lతారళ్యl లంకాదహన భయ ఖేద నాశన సీతా వరగుణ ప్రసాద దాయక పవన సుకుమార హనుమతే పవన సుకుమార హనుమతే lతారళ్యl జప తపిరంతర మత్యేషు విజయ దుస్స్వప్న పీఢా విలయన కారణ గదాహస్త మణిమయ హనుమతే గదాహస్త మణిమయ హనుమతే lతారళ్యl మంగళం తవ కరుణామృతం మంగళం శుభ వచనామృతం మంగళం స్వామి గురువందనం మంగళం రామ హృది వందనం *జై వీర హనుమాన్* *🌞శుభ శుభోదయం🌞* 🙏🐒🙏🐒🙏🐒🙏🐒🙏🐒🙏

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर
Dvsraju Feb 25, 2020

🌷🙏శ్రీకృష్ణ🙏🌷 కర్ష యతి ఇతి కృష్ణ అని తెలుపుతుంది నిరుక్తము. మనసును చిలికి వెన్న తీస్తాడు అని తలువ వచ్చు. లేక భూమి దున్ని భక్తిబీజము నాటి సత్ఫలితమునందిస్తాడని చెప్పవచ్చు. నల్లగా ఉంటాడు అనీ చెప్పవచ్చు, ఇవికాక 'క' అంటే బ్రహ్మ. 'ఋ' అంటే అనంతుడు. 'ష' అంటే శివుడు. 'ణ' అంటే ధర్మము. 'అ' అంటే విష్ణువు. విసర్గ (అః) అంటే నరనారాయణులు. కృష్ణునిలో కృషి ఉంది. కర్షణ ఉంది, ఆకర్షణ ఉంది, సంకర్షణ ఉంది. (అందుకే ఉపసర్గలు) అని సద్గురు శివానందమూర్తి గారు తమ అనుగ్రహ భాషణములో ఒక పర్యాయము పేర్కొన్నారు. కృష్ణుని తెలుసుకొనుట సులభమైన విషయము కాదు. అది మహామహులకే అంతుబట్టని విషయము. నేనో ఒక పిపీలిక పాదమును. మహనీయుల వల్ల విన్నది, నేను చదివి తెలుసుకొన్నది, నాకు గుర్తున్నంతవరకు తెలియజేయ ప్రయత్నము చేస్తాను. కృష్ణ తత్వము తెలుసుకొనుటకు భాగవతము మాత్రమే చాలదు. ముఖ్యముగా బ్రహ్మవైవర్త పురాణము, హరివంషమే కాకుండా భారతము కూడా చదువవలసి వుంటుంది. మస్త్య కూర్మ వరాహస్య నారశిమ్హస్య వామనః రామో రామస్య రామస్య బుద్ధః కల్కి రేవచ అన్న ప్రచారములోనుండే శ్లోకములో శ్రీకృష్ణ అవతారము కనిపించదు, కానీ రామావతారము వుంది. రాముడు పరోఖముగా, మనము ఎటువంటి నీతి నియమములను పాటించవలెను అని తానే ఆదర్శముగా నిలిచి మనలను అనుసరించమన్నాడు. తన భగవత్తత్వమును ప్రదర్శించలేదు. పైగా రామలక్ష్మణభరత శత్రుఘ్నులుగా తానే ఉద్భవించుతాడు, కాకపోతే నిష్పత్తులు మారుతాయి. అంటే పైన తెలిపినవి అన్నీ అంశలే. ఈ కృష్ణావతారము అలాంటిది కాదు. విష్ణువు దశావతారములలోని ఒక్కొక్క అవతారములో ఒక్కొక్క దుష్టశక్తిని దునుమాడుతూ వచ్చినాడు. ద్వాపరములో త్రుణావర్తుడు, శకటాసురుడు, పూతన వంటి రాక్షసులు వున్నా వారు కంస, జరాసంధాది మానవ రాజన్యులకు లోబడి పనిచేసినవారే! అంటే ద్వాపరము లో అసుర గణములకు బదులుగా అసుర గుణములు భూమిపై వ్యాప్తిలోనికి వచ్చినాయి. అధర్మము ప్రబలింది, అజ్ఞానము వ్యాపించింది. అందువల్ల శ్రీకృష్ణుడు భూమిపై అవతరించవలసివచ్చినది. అసలు వ్యాసులవారే 'కృష్ణస్తు భగవాన్ స్వయం' - అని అన్నారు. వాల్మీకి ఆ మాట అనలేదు. రాముడూ ఆమాట చెప్పలేదు. అందుకే పైన తెలిపిన శ్లోకములో శ్రీకృష్ణుడు లేడు. శ్రీకృష్ణుడికి కంస జరాసంధ శిశుపాల, నరకాసురాదులందరూ ఒక విధముగా బంధువులే! అయినా ధర్మ సంస్థాపన కొరకు, సాధువులను రక్షించుట కొరకు ఆయన ఉద్భవించినాడు. మిగతా అవతారములలోలేని విశిష్ఠత ఈ అవతారమునకు మాత్రమే వుంది. ఈ అవతారములో మాత్రమె 'కృష్ణం వందే జగద్గురుం' అన్నారు. ఈ కృష్ణుడు త్రిమూర్తులలో విష్ణువు కాదు. పరాశక్తి, శివుడు, సుబ్రహ్మణ్యుడు ఇలా అనేక దేవతల సంగమం ఆయన. ఆయనే భగవద్గీతలో చేబుతాడు 'యోగక్షేమం వహామ్యహం' అని. యోగం అంటే లేనిదీ లభించుట క్షేమం అంటే ఉన్నది నిలుపుకొనుట. ఇటువంటి ఉపదేశాలు మనకు విష్ణువు బోధించినట్లు ఇతర అవతారములలో అగుపించవు. ఆసలు ఈ విహయమును గమనించండి. విష్ణు సహస్ర నామమావళిని భీష్ముడు ధర్మజునకు బోధించితే శ్రీకృష్ణుడే స్వయంగా ధర్మ రాజునకు శివసహస్రనామావళిని బోధించుతాడు. ప్రభాస తీర్థములో (నేటి సోమనాథ్)శివ దీక్ష శివ పూజ నిర్వహించుతాడు. శివ పూజా ప్రాశస్త్యం బోధించాడు. పైగా ప్రభాస తీర్థంలో (సోమనాథ క్షేత్రం)శివ దీక్ష, శివ పూజా నిర్వహించుతాడు. అర్జునుని శివునికై తపస్సుచేసి పాశుపతం పొందమని చెబుతాడు. శివుని బోధరూపం దక్షిణామూర్తి. అంతేకాక శ్రీకృష్ణుని భంగిమ, ముఖ్యముగా మోవికి మురళిని ఆనించియుండేది, నటరాజ తాండవము లోని పాద భంగిమ యొక్క కుంచిత పాదమును గుర్తుకు తెస్తుంది. ఆయన వేణువు శివుడే. కృష్ణుడు వంశీ మోహనుడైతే, శివుడు వంశ మోహనుడు (శివసహస్ర నామాలలో ఒకపేరు). సుబ్రహ్మణ్యుని శివగురువు అంటారు. ఆయన వాహనం నెమలి. అందుకే కృష్ణుడు శిఖిపింఛమౌళి. కృష్ణునిబోధలు భగవద్గీత, ఉత్తర గీత, ఉద్ధవ గీతలు భ్రమర గీతలు. కృష్ణుని భంగిమ విష్ణువు ఆవాసము క్షీరసముద్రమని మనము వింటాము,అంటాము. క్షీర సముద్రము, ఇక్షుసముద్రము, అన్న పేర్లు సంకేతములు. రంగు మాత్రమే పరిగణనలోనికి తీసుకోవలెను కానీ రుచికాదు. ఆవిధముగా క్షీరసముద్రమును మనము ఆధునిక పరిభాషలోని Milky Way గా తీసుకొనవచ్చు. ఆయన సృష్టికోసం విశ్వాన్ని సృష్టించినాడు. ఆది బ్రహ్మాండము. దీనిలో భూమితొ సహా భూ, భువ, సువ, మహ, జన, తప, సత్య - అనే 7 ఊర్ధ్వలోకాలు , అతల, వితల,సుతల, తలాతల, రసాతల పాతాళ మనే 7అధోలోకాలు సృష్టించినాడు. సృష్టి కొనసాగింపునకు సత్యలోకములో బ్రహ్మను సృష్టించినాడు. ఇక్కడ మనము తెలుకొనవలసిన ముఖ్యమగు విషయము ఒకటి వుంది. ఈ బ్రహ్మలోకంపైన వైకుంఠం, కైలాసం, గోలోకం, మణిద్వీపం ఉంటాయి. అక్కడ లక్ష్మీనారాయణులు, శివపార్వతులూ, రాధాకృష్ణులూ, లలితా పరమేశ్వరి వరుసగా వారి వారి లోకాలలో ఉంటారు. సంఖ్యులు ప్రకృతి పురుషుడు అని చేసిన ప్రతిపాదనకు పుష్టిని కూర్చుటయే సరస్వతీబ్రహ్మ, లక్ష్మీనారాయణ, సాంబశివ ( స+అంబ+శివ) తత్వము. ఆవిధముగా గోలోక నివాసులు రాధా కృష్ణులు. 'గొ' అన్న శబ్దమునకు గల అనేకార్థములలో కిరణములు, వేదములు, వృషభ జాతి అన్న అర్థములు వున్నాయి. అందుకే కృష్ణభూమిపైన గోలోకమునే ప్రతిష్ఠించినాడు. రేపల్లెలో ఆలమందలతోనే కదా ఆయన అనుబంధము. బ్రహ్మవైవర్త పురాణములోని కృష్ణ ఖండములో ఈ వివరాలను మనమ తెలుసుకొనగలము. శ్రీ కృష్ణునికి మానినీ చిత్తచోరుడనే ఒక ప్రథ అన వచ్చు అపప్రథ అనవచ్చు. మగవారికన్నా ఆడువారిలో చంచల స్వభావమేక్కువ అని పెద్దలు చెబుతారు. అందుకే స్త్రీ కి చంచల అన్నపేరు కూడా వుంది. ఈ చంచల స్వభావము కలిగినది చిత్తము అంటే మనసు. శ్రీకృష్ణుడు మనసు దొంగాలించినాడు అంటే వేరెవ్వరికీ అణుమాత్రముకూడా చోటు లేక తానె నిండియున్నాడని అర్థము. మరి వారే అట్లుంటే ఇక మగవారిని గూర్చి తలువనే అక్కరలేదు. గోకులము వదలి అన్న బలరామునితో కూడి, అక్రూనితో మధుర వేడలినతరువాత ఆయన కార్యకలాపములు మారిపొయినాయి. పైగా గోకులములో శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు తక్కిన వారంతా స్త్రీలే! బృందావనములో వల్లభాచార్యుల వారిని చూడ దలచి సాధ్వి మీరాబాయి సందేశమునంపితే ఆయన ఆడువారిని చూడనంటాడు. అప్పుడు ఆమె జవాబుగా బృందావనములో కృష్ణుడు ఒక్కడే పురుషుడు అని పంపుతుంది. తన తప్పు తెలుసుకొని వల్లభులవారు మీరాబాయిని కలుస్తారు.ఈ విధముగా ఆయన మానినీ చిత్తచోతుడైపోయినాడు. ఇంకొక విచిత్రమైన విషయము ఏమిటంటే అసలాయనకు ‘కృష్ణ’ అన్న నామకరణము ఎవరు చేసినట్లు? చెరసాలలో బారసాల జరుగలేదు కదా! నందవ్రజములో గర్గమహాముని వస్తే ఆయనకు బాలుని చూపితే ఆయన “ఈ బాలుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఈతనిని ‘కృష్ణ’ అన్న పేరుతో పిలవండి అనిచేప్పినారు. ఈ ప్రకారముగా ఆయన గూర్చి ఏమి చెప్పుకొన్నా విచిత్రమే! పైగా అతిచిన్నవయసులోనే మహాబలవంతులగు రాక్షసులను చంపడము వేరు ఏ అవతారమునందునూ జరుగలేదు. కృష్ణునికీ కాత్యాయనీ వ్రతానికీ గోపికావస్త్రాపహరణానికీ సంబంధం ఏమిటి అన్నది ఒకసారి చూస్తాము. వ్రజభూమిలోగోపికలు నందకిశోరుడే భర్తకావాలని కాత్యాయనీవ్రతంచేస్తారు. కాళిందిలో(యమునలో) స్నానంచేసి అమ్మవారిని పూజిస్తారు. తమ వస్త్రాలు ఒడ్డునే ఉంచి నదిలోదిగుతారు. స్నానంచేస్తూండగా కృష్ణుడు వచ్చిఆ వస్త్రములు అపహరించి ఆప్రక్కన ఉన్న వృక్షంపైన ఎక్కి వాళ్ళను పిలుస్తాడు. మీరు వస్త్రాలు లేకుండా వ్రతభంగం చేసినారు. (నదీ స్నానమునాచారించునపుడు వస్త్ర ఆచ్చాదన లేకుండా స్నానము చేయకూడదు.) పైకి వచ్చి నమస్కారంచేయండి. అనిచెబుతాడు. కథ తెలిసినదే. గోపికలు జీవాత్మలు. అజ్ఞానం వస్త్ర రూపంలో వారిని కప్పి యుంచింది. అజ్ఞానపు తెరతొలగిస్తే అంతా పరమాత్మస్వరూపమే. చెట్టుపైనా క్రిందనూ ఉన్న వస్తువు ఒకటే. వ్రతఫలం అప్పటికప్పుడు పురుషరూపంలో కాత్యాయనియే ఐన కృష్ణ దర్శనం లభించింది. వారి అజ్ఞానపు తెరలు తొలగినవి. (కాత్యాయని కృషుడి రూపంలో ఎన్నో సార్లు జ్ఞాన బోధ చేసి అనుగ్రహించింది) నింద కన్నాయకు. పైన తెలిపిన విషయములనుబట్టి శ్రీకృష్ణుడు సకలదేవతా స్వరూపమని, కేవలము విష్ణ్వంష కాదని తెలియవస్తుంది. ఈపరమాత్మ తత్వము ఎంతైనా చెప్పుకొంటూ పోవచ్చు. అసలు గోలోక వాసి మరియు రాదా సమేతుడగు శ్రీ కృష్ణుని ఎంతోమంది ఎన్నోవిధములుగా తమ మతమునకు మూలపురుషునిగా చేకొన్నారు. మహారాష్ట్రమున జ్ఞానేశ్వర్, నామదేవ్, జనాబాయి, ఏక్ నాథ్, మరియు తుకారాం తమతమ పంథాలో శ్రీకృష్ణుని సాధించిన మహాభక్తులు. మీరాబాయి సరేసరి. చైతన్య మహాప్రభు యొక్క గౌడీయ సాంప్రదాయమును ISCON వారు ప్రపంచాదేశాలలోనే ఎంతో ప్రాచుర్యమునకు తెచ్చినారు. కలిసంతారణ ఉపనిషత్తు లోని ‘హరే కృష్ణ (1) హరేకృష్ణ(2) కృష్ణ కృష్ణ హరే హరే(3) హరేరామ(4) హరేరామ(5) రామరామ హరే హరే(6) ’ అన్నది వీరి మహా మంత్రము. వియత్నాం, కంబోడియ, థాయ్ లాండ్ లో కృష్ణభక్తిని విస్తారముగా మనము చూడవచ్చు. ఈ విధముగా శ్రీకృష్ణుడు విష్ణు స్వరూపునిగా కాకుండా గోలోక వాసియగుచు కృష్ణునిగానే కొలువబడినాడు 🌷🙏హరే క్రిష్ణ🙏🌷

+2 प्रतिक्रिया 1 कॉमेंट्स • 0 शेयर
Dvsraju Feb 24, 2020

#శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం - ఫాల్గుణ మాసం. ఫాల్గుణమాసంలో మొదటి పెన్నెండు రోజులు, అంటే శుక్లపక్షపాడ్యమి మొదలు ద్వాదశి వరకూ శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన రోజులు. ప్రతి రోజూ తెల్లవారు ఘామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, శిరస్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన అనంతరం, శ్రీమహావిష్ణువును షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి, పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ పన్నెండురోజుల్లో ఒకరోజుగానీ లేదంటే ద్వాదశి నాడుగానీ వస్త్రాలు, వివిధదాన్యాలను పండితులకు దానముగా ఇవ్వడం మంచిది. శక్తివున్నవారు ఏదైనా వైష్ణవాలయానికి ఆవును దానమివ్వడం విశేష ఫలితాలనిస్తుంది. పూర్ణిమనాడు పరమశివుడిని, శ్రీకృష్ణపరమాత్మను, మహాలక్ష్మినీ పూజించడంతో పాటూ "లింగపురాణం" ను దానముగా ఇవ్వడం మంచిది. అట్లే ఈనాటి సాయంత్రం శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపవలెను. దీనిని డోలోత్సవం అని అంటారు. దీనినే కొన్ని ప్రాంతాలలో డోలాపూర్ణిమ అని అంటారు. నరాడోలాగతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం ఫాల్గున్యాం ప్రయతోభూత్వా గోవిందస్య పురంప్రజేత్‌ ఉయ్యాలలో అర్చింపబడిన పురుషోత్తముడైన గోవిందుని ఈ రోజున దర్శించిన భక్తులకు వైకుంఠప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ రోజున రంగుపొడులను, రంగునీళ్ళను చల్లుకోవాలని చెప్పబడింది. ఈ రోజున ఉదయాన్నే నూనెతో తలంటిస్నానం చేసి 'చూత కుసుమ భక్షణం' తప్పక చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పూజ ప్రకారం, ఇంటిని శుభ్రం చేసి, ఇంటి ప్రాంగణంలో తెల్లనిగుడ్డను ఆసనంగా తూర్పుముఖంగా కూర్చుని, ఒక ముత్తైదువుచే వందన తిలకం, నీరాజనాన్ని పొంది చందనంతో కూడిన మామిడి పువ్వులను తినాలి. చూతమగ్ర్యం వసంతస్య మాకందకుసుమం తద సచందనం పిచామ్యద్య సర్వకామ్యార్థ సిద్దయే అనే శ్లోకంతో మామిడిపూతను స్వీకరించాలి. అనంతరం రంగులను నృత్యగానాదులతో చల్లుకోవాలని చెప్పబడింది. అట్లే, హరిహరసుతుడు అయిన అయ్యప్పస్వామి వారు జన్మించిన దినం కూడా ఈనాడే కనుక వారిని పూజించడం విశేష ఫలితాలనిస్తుంది. ఫాల్గుణమాసంలో పూర్ణిమరోజున హోళీపండుగను నిర్వహిస్తుంటారు. ఈ పూర్ణిమ శక్తితో కూడినది. ఏ సంవత్సరమైనా పూర్ణిమ, ఉత్తరఫల్గుణి కలిసి వస్తే, ఆ రోజున మహాలక్ష్మిని షోడశోపచారాలతో ఆరాధించి, లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారా స్తోత్రాలను పారాయణం చేయడం మంచిది. హోళిరోజూన లక్ష్మీదేవిని ఆరాధిస్తే సమస్త శుభములు కలుగుతాయని పెద్దలవాక్కు. కొన్ని దక్షిణాది ఆలయాలలో ఫాల్గుణపూర్ణిమను చాలా గొప్పగా చేస్తారు. ఈ ఉత్సవం వెనుక ఒక కథ ఉంది. ఒకసారి పార్వతి తన ప్రభావం చేత శివుని కళ్ళు మూతపడేటట్లు చేసింది. శివుని కళ్ళు మూతపడినందు వల్ల జగమంతా అంధకారబంధురమైంది. శివుడు కోపగించు కోవడంతో, అలిగిన పార్వతీదేవి కాంచీపురానికి వచ్చి, తిరిగి శివుని అభిమానాన్ని పొందేందుకు ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించింది. ఒకానొక పాల్గుణపూర్ణిమనాడు మామిడి చెట్టు కింద పార్వతీదేవి ప్రాయశ్చిత్త కర్మకాండను పూర్తిచేసింది. అప్పుడు సంతసించిన శివుడు పార్వతిని అనుగ్రహించాడు. అప్పటినుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఫాల్గుణ మాసములో ఈ విధమైన పూజలను, దానాలను చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రవచనం.

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Dvsraju Feb 24, 2020

+11 प्रतिक्रिया 0 कॉमेंट्स • 4 शेयर
Dvsraju Feb 24, 2020

"చెరపకురా చెడేవు " పూర్వం ఒక రాజు ఉండేవాడు...పరమక్రూరంగా , దయ లేకుండా అందరినీ బాధపెట్టేవాడు.. అలాంటి రాజు ఒకరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన మంత్రులు అధికారులు ప్రజలు అందరినీ సమావేశపరిచి ఒక ప్రమాణం చేసాడు "నేను ఈ రోజు నుంచి ఎవ్వరినీ బాధపెట్టను , అందరితో మంచిగా ఉంటాను , దయగా ప్రవర్తిస్తాను" అని...మాట ఇచ్చినట్టే , మాటకు కట్టుబడి అతను మంచిగానే ఉన్నాడు..కొంతకాలానికి అందరూ అతన్ని దయగలమారాజు అనుకుంటున్నారు... మంత్రుల్లో ఒకరు ఈ మార్పు ఎలా సాధ్యం , తెలుసుకోకపోతే ఎలా అని చాలా కుతూహలంగా రాజు దగ్గరికి వెళ్ళి మీలో ఎందుకు ఉన్నట్టుండి అంత మార్పు వచ్చింది , కారణం చెప్తారా అని అడిగాడు... రాజు సమాధానం చెప్తున్నాడు.. నేను ఒకరోజు గుర్రం మీద అడవిలో తిరుగుతుంటే ఒక వేటకుక్క నక్కని వెంటాడుతోంది...నక్క కష్టపడి తన గుహలోకి వెళ్ళేలోపే వేటకుక్క నక్క కాలు కరిచింది...నక్క కుంటిది అయిపోయింది... ఆ రోజు కాసేపటికి పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాను..అక్కడ అదే వేటకుక్క ఉంది... ఒక మనిషి ఒక పెద్ద రాయి తీసుకుని వేటకుక్క మీదకి విసిరాడు ...ఆ రాయి కుక్కకాలుకి తగిలి వేటకుక్క కాలు విరిగింది.... అతను కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఒక గుర్రం అతన్ని బలంగా తన్నింది...అతను కిందపడి కాలు విరగ్గొట్టుకున్నాడు... ఆ గుర్రం పరిగెత్తుకుంటూ వెళ్ళబోయింది...ఒక గుంటలో పడి దాని కాలూ విరిగిపోయింది... వరుసగా జరిగిన ఈ సంఘటనలకు నాకు ఒక ఆలోచన తోచింది... నక్క కాలు కుక్క కరిస్తే , కుక్క కాలు మనిషి రాయి వల్ల విరిగింది , మనిషి కాలు గుర్రం తన్నినందువల్ల విరిగితే.. గుర్రం ఒక గుంటలో పడి కాలు పోగొట్టుకుంది... ఒకరికి చెడు చేస్తే అదే చెడు వేరే ఏ కారణంతో అయినా మనకీ జరుగుతుంది అని బాగా తెలిసొచ్చింది... అప్పుడు నా వల్ల ఎందరు బాధపడ్డారో..వారందరి వల్ల నేనూ బాధపడాల్సి వస్తే ఆ పరిస్థితి ఊహించుకుంటేనే వంట్లో వణుకు పుట్టింది...ఆ క్షణంలోనే నిజాయితీగా నిర్ణయించుకున్నాను...ఎవ్వరినీ ఇంక కష్టపెట్టకూడదు అని అందరితో దయగా ఉండాలి అనుకున్నాను అని రాజు వివరించాడు... ఇదంతా విన్న మంత్రి ఈ రాజుకి చాదస్తం ఎక్కువయినట్టుంది...రాజుని ఈ పరిస్థితుల్లో సింహాసనం నుంచి తప్పించి..కిరీటం నేను దక్కించుకోవచ్చు అని పన్నాగం పన్నుకుంటూ ఆలోచనల్లో పడి ముందున్న మెట్లు చూసుకోలేదు..మెట్ల మీద జారి పడి మంత్రి మెడ విరిగి లేవలేని స్థితికి చేరుకున్నాడు...రాజు పదవి కాదు కదా మనిషిగా కూడా ఒకరిమీద ఆధారపడేలా అయ్యాడు..ఒకరికి చెడు చేస్తే ఏదో ఒకసారి మనకీ అదే చెడు జరుగుతుంది అన్న మంచి విషయం ఈ కధ సారాంశం.. సర్వే జనా సుఖినోభవంతు *🤘నేటి సుభాషితం🤘* *మనలో దేవుడు జీవించాలంటే గర్వం మనలో నశించాలి”*

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 4 शेयर
Dvsraju Feb 24, 2020

*శ్రీ మూకశంకర* విరచిత *మూక పంచశతి* 🔱 *శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన*🔱 🌹 *పాదారవిందశతకం-శ్లోకం:భావము - 24* ▪▪▪▪▪▪▪▪▪▪▪ శ్లోకము:- *జగన్నేదం నేదం పరం ఇతి పరిత్యజ్య యతిభిః* *కుశాగ్రీయ స్వాంతైః కుశలధిషణైః శాస్త్రసరణౌ |* *గవేష్యం కామాక్షీ ధ్రువ మకృతకానాం గిరిసుతే* *గిరా మైదంపర్యం తవచరణ మాహాత్మ్య గరిమా ||24||* ▪▪▪▪▪▪▪▪▪▪▪ ********************************* *భావము:* శాస్త్రపద్దతిలో కుశాగ్రంలా చురుకైన సూక్ష్మబుద్దులుకల మేధావులైన యతులు ఈ దృశ్యమైనది జగత్ కాదు. వేదములకు వాస్తవంగా అన్వేషాణీయం గిరిసుతయైన కామాక్షీదేవీ నీ దివ్య చరణముల మహిమాతిశయం మాత్రమే సుమా అని గ్రహించారు. *ఆ తల్లి పాదపద్మాలకు నమస్కరిస్తూ ...*🙏🏼🙏🏼🙏🏼 ********************************🌹*లోకాస్సమస్తా స్సుఖినోభవంతు*🌹

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर