#శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము-7 🕉️ శ్లోకం 01 🕉️ విశ్వం విష్ణు ర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః|| భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః|| 1. విశ్వం --- విశ్వము అంతా తానే ఐన వాడు (నామ రూపాత్మకమై, చిత్రాతి చిత్రమై, వికసించి, విస్తరించి, విరాజిల్లుచు గాన వచ్చు సకల చరాచర జడ చైతన్య సంహితమగు ప్రపంచమే విశ్వము), సకల విషయములందును సంపూర్ణమైన వాడు. (అంతా తానైన వాడు). ఇది శ్రీ విష్ణుసహస్రనామములలో మొదటి నామము. అంతా భగవంతుడే అన్న భావంలో ఈ నామానికి భాష్యకారులు వ్యాఖ్యానం చెప్పారు 2. విష్ణుః --- అంతటనూ వ్యాపించి యున్నవాడు. సర్వ వ్యాపకుడు. (అంతటా తానున్నవాడు). 3. వషట్కారః --- వేద మంత్ర స్వరూపి, వషట్ క్రియకు గమ్యము (యజ్ఞములలో ప్రతిమంత్రము చివర మంత్రజలమును 'వషట్' అనే శబ్దముతో వదులుతారు) ; అంతటినీ నియంత్రించి పాలించు వాడు. 4. భూతభవ్యభవత్ ప్రభుః --- భూత కాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము - మూడు కాలములకు అధిపతి, మూడు కాలములలోను అన్నింటికి ప్రభువు. 5. భూతకృత్ --- సకల భూతములను సృష్టించువాడు; ప్రళయ కాలమున సకల భూతములను నాశనము చేయువాడు (భూతాని కృన్తతి). 6. భూతభృత్ --- సమస్త భూతములను పోషించువాడు, భరించువాడు. 7. భావః --- అన్నింటికి ఉనికియైనవాడు. తనలోని సర్వ విభూతులను ప్రకాశింపజేయువాడు. సమస్త చరాచర భూతప్రపంచమంత వ్యాపించి యుండు భగవానుడు. తాను తయారు చేసిన సృష్టి తనకన్నా అన్యముగాక పోవుటవేత తాను సర్వవ్యాపి అయినాడు. 8. భూతాత్మా --- సమస్త భూతములకు తాను ఆత్మయై యుండువాడు. సర్వ జీవకోటియందు అంతర్యామిగా యుండువాడు. సర్వభూతాంతరాత్మకుడైన భగవానుడు సమస్త శరీర మనుగడకు కర్తయై, సాక్షియై యుండు చైతన్యము. 9. భూతభావనః --- అన్ని భూతములను సృష్టించి, పోషించి, నిలుపువాడు. జీవులు పుట్టి పెరుగుటకు కారణమైనవాడు. తల్లిదండ్రులవలె జన్మనిచ్చి, పెంచి, పోషించు వాడు భగవానుడు. అతడే జగత్పిత. భావము : ఈ సృష్టి అంతయు విష్ణువు చే వ్యాప్తి చెంది యున్నది. అతడు విశ్వమంతయు నిండి అందు నివసించి యున్నవాడు. అతడే, జరిగినది, జరగబోవునది మరియు జరుగుచున్నది అను కాలము. అతడు ఈ సృష్టికి పాలకుడు కనుక జీవులకు సృష్టికర్త. అతడు భూతములకు ఆత్మ అయినవాడు. కనుక వానిని భరించి పోషించుచున్నాడు. తన ఉదరమందే జీవులను కల్పించుచున్నాడు. ఓం నమో నారాయణాయ విశ్వం విష్ణు ర్వషట్కారో భూతభవ్యభవత్ప్ర భుః అంటూ పూజించే నారాయణుడు సర్వవ్యాపి. సమస్త జగత్తు నారాయణ స్వరూపమే. ‘నరము’ - అనగా ఆత్మ. ఆ ఆత్మయందు ఉత్పన్నమైన ఆకాశాదులు నారములన్నారు. నారములు ఆయనముగా కలవాడు నారాయణుడు. బ్రహ్మము, శివుడను, ఇంద్రుడును, కాలము, దిశలు-విదిశలునూ నారాయణుడే. నిష్కళంకుడు. నిరంజనుడు, నిర్వికల్పుడు, అనిర్వచనీయుడు, నిరాకారుడు, దేవాదిదేవుడు ఇలా ఎన్ని చెప్పినా నారాయణుడు ఇది అని చెప్పడానికి వీలులేనివాడు. అందుకే నారాయణుని నిర్వచించడానికి అక్షరాలు లేవంటారు. నారాయణుడు తప్ప ఇతరమైనదేదీ ఈ లోకంలో లేదు. ఆ నారాయణుని తెలుసుకున్నవాడే విశ్వవేత్త అంటుంది యజుర్వేదం. ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షర మంత్ర మహిమను గూర్చి సామవేదం అద్భుతంగా వర్ణించి చెప్తున్నది. నారాయణ మహామంత్రానే్న తిరుమంత్రమని అంటారు. నామస్మరణ మాత్రం చేతనే సమస్త పాపములను నశింపచేసే ఈ అష్టాక్షరీ మంత్రాన్ని సద్గురువుల వద్ద ఉపదేశం పొందాలంటుంది శాస్త్రం. భవబంధాలను పారద్రోలే ఈ నారాయణ మంత్రం ప్రహ్లాదుని, జ్ఞాన, నామదేవ, తుకారాం, సక్కుబాయ, మీరాబాయ లాంటి ఎందరినో భాగవతోత్తములలుగా అందరిచేత స్మరింపచేసినట్లుగా మూగవాళ్లను మహా విద్వాంసులుగాను చేసింది. ఎంతోమంది గుడ్డివారు దృష్టిని పొందారు. పీడితులు, భయభీతులు, భయంకరమైన రోగాలచేత బాధపడేవారు కేవలం ఒక్కసారి నారాయణ నామ కీర్తనచేస్తే చాలు వారు సమస్త దుఃఖాలకు దూరమ వుతారు. సుఖాలను పొందుతారు ఈ విషయానే్న శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రం చెబుతుంది. సదా ధ్యానించవలసినవాడు కేవలం నారాయణుడే అని పద్మపురాణం చెబుతుండగా, నారాయణ నామం విన్నంతనే సమస్త దురితాలు దూరమవుతాయని వామన పురాణం అంటుంది. ‘నారాయణ’ ‘నా’ - అనే అక్షరం దేవుడు లేడనే బుద్ధిని తొలగిస్తుంది . ‘రా’ - అనే అక్షరం భగవత్ప్రేమనూ, వైరాగ్యాన్నీ, రక్షణనూ కల్పిస్తుంది. ‘య’ - అనే అక్షరం యోగానుష్ఠానాన్ని పొందిస్తుంది. అంతేకాదు యక్షరాక్షస భేతాళ భూతాదుల భయాన్ని పోగొడ్తుంది. ‘ణ’ - అనే అక్షరం భగవంతుణ్ణి వర్ణించే వాక్శుద్ధిని సిద్ధింపచేస్తుంది. కనుక నారాయణ అన్న నాలుగక్షరాలు మానవజన్మను సార్థకం చేస్తాయ అనడంలో అతిశయోక్తి లేదు. నారాయణ మంత్రం జపించేచోటున ఈతిబాధలు, కరువుకాటకాలు ఉండవు. భూతలమే స్వర్గలోకంలా భాసిస్తుంది. ఇంత ప్రభావమున్న శ్రీమన్నారాయణుని సదా స్మరించి, ఆ మంత్ర రాజమును సదా జపించి జన్మలను సార్థకం చేసుకోవాలి. శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రమ్ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం సంస్కృతం నుండి తెలుగుకు అనువదిస్తూ చెప్పిన ఈ శతకం శ్రీ పిన్నెల్లి వెంకట రామ గోపీనాథ్ గారిచే రచించబడినది మొత్తం 216 ఆటవెలదుల తో రచించబడిన ఈ శతకము విష్ణు సహస్ర నామాలకు చక్కని అచ్చ తెలుగులో అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా (ఆట వెలదులలో ....భావార్థాలతో...) రచించబడినది 1. విశ్వ వ్యాపకుండు, విశ్వమంత యతని వశమునందె యుండు వదల కుండ మూడు కాలములకు జూడ దానధిపతి వందనాలు హరికి వంద వేలు !! [అర్థాలు: విశ్వం ... చరాచర జగత్తు, విష్ణు ... అంతటా వ్యాపించి ఉన్నవాడు, వషట్కార ... వశమునందుంచుకున్నభూత భవ్య భవత్ప్రభు ... మూడు కాలాలకు అదిపతి. భావము: విశ్వమంతటా వ్యాపించి దానిని తన అదుపులో ఉంచుకున్నవాడు, భూత, వర్తమాన, భవిష్యత్కాలాలు మూడింటికీ అధిపతియూ నైన ఆ స్రీహరికి శత సహస్ర వందనాలు.] అన్ని భూతములకు నాత్మ తాను కాంతి నిచ్చు మరియూ గల్పించు శుభములు వందనాలు హరికి వంద వేలు !! భావము: సమస్త చరాచర జగత్తుకు (సృష్టి)కర్తయై, తానుగా భరిస్తున్నవాడు, అన్నిటా సమభావం కలిగి, అన్నిటికీ వెలుగు, శుభములు కల్పిస్తున్నవాడు అయిన ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు. *ఓం నమో నారాయణాయ*

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

బుద్ద నీలకంఠ ఆలయం ఇక్కడ విష్ణుమూర్తే నీలకంఠుడు! 🙏🕉️🔱🌸🌻🌷🙏🕉️🔱🙏 విష్ణుమూర్తిని తలచినంతనే శేషతల్పం మీద శయనించిన అనంత పద్మనాభుడి సమ్మోహన రూపం మన కనులముందు సాక్షాత్కరిస్తుంది. కానీ, స్వామి యోగ నిద్ర భంగిమలో, నింగివైపు చూస్తున్నట్లుగా విగ్రహం ఉండే క్షేత్రం నేపాల్‌లోని ఖాట్మండు లోయలోని బుద్ధనీలకంఠ ఆలయం. అయిదు అడుగుల విష్ణుమూర్తి విగ్రహం నీటిమీద తేలుతూ ఉండటం ఈ ఆలయానికున్న మరో ప్రత్యేకత. బుద్ధనీలకంఠ ఆలయం... ఈ పేరు వినగానే ఇదేదో బుద్ధుడి ఆలయం అనుకోకండి. ఇది మూడుమూర్తులా ఆ నారాయణమూర్తి క్షేత్రమే. బుద్ధనీలకంఠ అంటే పురాతన నీలి రంగు విగ్రహం అని అర్థం. నేపాల్‌ రాజధాని ఖాట్మండు లోయలో ఉందీ క్షేత్రం. స్వామి పేరుమీదుగానే బుద్ధనీలకంఠ అనే ఊరిపేరు కూడా స్థిరపడిపోయింది. ఈ ఆలయాన్ని నారాయణంతన్‌ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ఆది శేషువు మీద యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. సాధారణంగా వైష్ణవాలయాల్లో విష్ణుమూర్తి రూపాలు శయన మూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకుని ఉన్నట్లు ఉంటాయి. కానీ, ఇక్కడ మాత్రం వెల్లకిలా పడుకొని నింగివైపు చూస్తున్నట్టుగా ఉండే బుద్ధనీలకంఠుడి విగ్రహం కనిపిస్తుంది. ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత ఏమిటంటే, సుమారు అయిదు అడుగుల పొడవున్న ఈ భారీ రాతి విగ్రహం నీటిమీద తేలుతూ ఉండటమే. ఈ కారణంగానే భక్తులనే కాకుండా పర్యటకులనూ ఎక్కువగా ఆకర్షిస్తోందీ బుద్ధనీలకంఠ క్షేత్రం. స్థలపురాణం ఈ భారీ రాతి విగ్రహం వందల సంవత్సరాల నుంచీ నీటిలో తేలుతూ ఉందని ఈ ఆలయం మీద జరిగిన అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ విగ్రహ నిర్మాణానికి సంబంధించి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిదాని ప్రకారం... ఒక రైతు తన భార్యతో కలిసి పొలం దున్నుతుండగా, ఒక చోటుకు రాగానే నాగలి ఆగిపోయింది. అక్కడ భూమిలో నాగలి దిగిన ప్రదేశం నుంచి రక్తం బయటకు రావడం కనిపించింది. రక్తం వస్తున్న ప్రాంతంలో భూమిని తవ్వగా, భారీ విగ్రహం బయట పడింది. ఆ తర్వాత గ్రామస్థుల సహాయంతో ఈ విగ్రహాన్ని ఇప్పుడున్న ప్రదేశంలో ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. మరో కథనం ప్రకారం... ఏడో శతాబ్దంలో నేపాల్‌ ప్రాంతాన్ని గుప్త రాజు విష్ణుగుప్తుడు పాలించేవాడు. ఇతడికి సామంత రాజూ, ఖాట్మండు లోయను పాలిస్తున్న లిచ్చవి వంశీయుడైన భీమార్జున దేవుడు ఈ విగ్రహాన్ని తయారు చేయించి, ఇక్కడ ప్రతిష్ఠించాడని స్థానికులు చెబుతారు. హరిబోధిని... విష్ణుమూర్తి ఆలయాల్లో లేదా వైష్ణవ సంప్రదాయంలో ఏకాదశి రోజును పవిత్రమైనదిగా భావిస్తారు. శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసంగా కార్తిక మాసాన్ని చెబుతారు పండితులు. ఈ రెండింటినీ కలగలుపుతూ బుద్ధనీలకంఠ ఆలయంలో కార్తిక మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఎందుకంటే శివుడు హాలాహలాన్ని కంఠంలో దాచుకున్నప్పుడు ఆ వేడి తాళలేక ఈ ప్రాంతానికి వచ్చాడనీ ఇక్కడి కొలనులో నీళ్లు సేవించగానే మంట తగ్గి, కొంతసేపు సేదతీరాడనీ భక్తుల విశ్వాసం. దానికి గుర్తుగానే ఈ ఆలయంలో కార్తిక మాసం మొత్తం ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ నెలరోజులూ ఈ ప్రాంతం పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. కార్తిక శుద్ధ ఏకాదశి రోజున హరిబోధిని మేళాను నిర్వహిస్తారు. ఈ పండగ ముఖ్య ఉద్దేశం నిద్రపోతున్న మహావిష్ణువును మేల్కొల్పడం. ఈ మేళాలో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచీ లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. మేళతాళాలతో భజనలతో ఆ రోజు ఈ ప్రాంతమంతా విష్ణునామస్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది. బుద్ధనీలకంఠ ఆలయంతోపాటు పశుపతినాథ్‌ ఆలయం, స్వయంభూనాథ్‌ స్తూపం, మహాదేవ్‌ టెంపుల్‌, జానకీ మందిర్‌, వాల్మీకి ఆశ్రమాలు కూడా నేపాల్‌లో ప్రసిద్ధ హిందూ క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. ఇలా వెళ్లాలి... బుద్ధనీలకంఠ ఆలయాన్ని చేరుకోవడానికి రోడ్డు, రైలు మార్గాలతోపాటు విమాన సదుపాయాలూ ఉన్నాయి. భారతదేశం నుంచి నేపాల్‌ చేరుకోవడానికి వివిధ రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి నేపాల్‌ పర్యటక శాఖ ఆలయానికి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రైలుమార్గం ద్వారా... ఖాట్మండు స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రయాణించి ఈ ఆలయానికి చేరుకోవచ్చు

+10 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉 *ॐ* *ఓం నమః శివాయ* *ॐ* అష్టాదశ శక్తి పీఠాలు హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు (Shakthi Peethas) అంటారు. ఈ శక్తిపీఠాలను గుతించడానికి ఎటువంటి ఇతిహాసిక ఆధారాలూ లేవు . పురాణాలు , శాసనాల ఆధారముగా ఈ శక్తిపీఠాలను గుర్తించగలిగారు. ఈ శక్తిపీఠాలు మందే్శములోనే కాక ... పాకిస్తాన్‌, శ్రీలంక , టిబెట్ , నేపాల్ దేశాలలోనూ కనిపిస్తాయి . ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. పరిశోధకుల అంచనాల మేరకు ఆసియాఖండములో 52 శక్తిపీఠాలు ఉన్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. శక్తిపూజా నేపధ్యాన్ని తెలుసుకోవడము అవసరము . మానవుడు తిన బుద్ధి శక్తిని వికసించినప్పుడల్లా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి ఆలోచింపసాగాడు . ఈ శకులన్నిటి వెనుక ఒక విశిష్టశక్తి ఉన్నదని తెలుసుకొన్నాడు . ఆ శక్తినే " దేవుడు " అని అన్నాడు . ఆ దేవుడికి విభిన్న రూపాలను సమకూర్చి ... ఆడ , మగ అని విడదీసి పెళ్ళిల్లు చేసే ఆచారమూ తీసుకువచ్చాడు . ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క కార్యాన్ని అంకితమివ్వసాగాడు . అందులోనూ స్త్రీ దేవతకు ఎక్కుక మహిమనిస్తూ భయ భక్తులతో ఆరాధింప సాగాడు . ఈ ప్రక్రియలో త్రిమూర్తుల కల్పన రూపుదాల్చింది . వీరిని బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులన్నాడు . వారు క్రమముగా సృష్టి , స్థితి , లయ కర్తలని పేర్కొన్నాడు . వీరి భార్యలను సరస్వతి , లక్ష్మి , పార్వతి అనియూ వీరు .. .. విధ్య , ధన , మాతృరూపాలలో ఉన్నారని అన్నాడు . ఈ విధము గా ప్రకృతిశక్తి ఒక్కటే అయినా మానవుడు తకిష్టమైన రూపములో , తనకిష్టమైన రీతిలో ఆరాధించడము సాగిస్తూఉన్నాడు . * అష్టాదశ శక్తి పీఠాలు -పురాణ కధ ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ని శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి , సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలు' అని చెబుతోంది దేవీభాగవతం. కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది. అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం: లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్ సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్ సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్ అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి. అందులో ఒకటి శ్రీలంకలోనూ మరొకటి ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉంది. ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ(గయ-శిరోగయ, పిఠాపురం-పాదగయ, జాజ్‌పూర్‌-నాభిగయ) రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం మరో విశేషం. ఆ క్షేత్రాల గురించిన వివరాలు... * 1.శాంకరీదేవి లంకాయాం శాంకరీదేవి అంటే...మునులూ రుషుల లెక్కప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్యరేఖకు సున్నాడిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది. * 2.కామాక్షి సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితయై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలూ కలుగుతాయని ప్రతీతి. స్థలపురాణం ప్రకారం... మహిషాసురుణ్ని సంహరించిన చాముండేశ్వరీదేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏంచేయాలని శివుణ్ని అడగ్గా నేటి కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట. అలా ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో... ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆ ఆదిపరాశక్తి యోగపీఠంగానూ కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావిస్తారు భక్తులు. * 3.శృంఖల అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరూ కోల్‌కతకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న 'చోటిల్లామాత'ను అక్కడివారు శృంఖలా(శృంగళా)దేవిగా భావిస్తారు. కానీ... పశ్చిమబెంగాల్‌లో ఉన్న 'పాండువా'నే అసలైన శక్తిక్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళ' పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం. * 4.చాముండి హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది. * 5.జోగులాంబ మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో వెుదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీనముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి (సరస్వతీదేవి), వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి. * 6.భ్రమరాంబిక విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు... ఇక్కడ కొలువైన సతి 'శక్తి' భ్రమర(తుమ్మెద) రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు. * 7.మహాలక్ష్మి రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్‌ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్‌ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయకాలంలిో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్‌ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు. * 8.ఏకవీరాదేవి మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు. * 9.మహాకాళి సప్త వోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం కూడా. * 10.పురుహూతిక పురాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో)... తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు అదే. * 11.గిరిజాదేవి గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది. * 12.మాణిక్యాంబ సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీవిడిచిపెట్టి వెళ్లమన్నాడనీ అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణప్రతీతి. ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు. * 13.కామాఖ్య అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవికాలంలో మూడురోజులపాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. ఈ ఆలయం కూచ్‌బేహార్‌ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు. * 14.మాధవేశ్వరి అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ... సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వ్యవహరించడం కద్దు. * 15.సరస్వతి పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది. * 16.వైష్ణవీదేవి అమ్మవారి నాలుక హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు... 'జ్వాలాయాం వైష్ణవీదేవి' అంటే అది ఈ గుడి కాదనీ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమనీ చెబుతారు. * 17.మంగళగౌరి సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. ఇక... పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. ఆ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు. * 18.విశాలాక్షి సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి. ...ఇవీ ప్రధానమైన 18 శక్తిపీఠాలు. ఇంకా అమ్మవారి ఆభరాణాలు పడినచోట్లనూ లెక్కిస్తే 51 శక్తిపీఠాలని కొందరూ 108 పీఠాలని మరికొందరూ అంటారు. ఇందులో చాలా క్షేత్రాలు నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక తదితర దేశాల్లో ఒకప్పుడు ఉండేవని చెబుతారు. 🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉 🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉

+11 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

ఆషాడం మాసంలో పెళ్లిళ్లు ఎందుకు చేయరు 🙏 తెలుగు నెలల క్రమంలో ఆషాడం నాలుగోది. అయితే, ఈ మాసంలో వివాహాది శుభకార్యాలకు విరామం ఇస్తారు. అలాగే ఆషాడంలో కొత్తగా పెళ్లైన జంటలు దూరంగా ఉండాలని అంటారు. అత్తా అల్లుళ్లు ఎదురుపడకూడదనే ఆచారం కూడా ఉంది. ఆషాడ మాసంలో వివాహాలు, ఇతర శుభకార్యాలకు విరామం ఉంటుంది. శుభకార్యాలకు ఇది మంచిది కాదని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతారు. ఆషాడంలో ఎట్టిపరిస్థితుల్లో హిందువులు వివాహాలు జరిపించరు. అవసరమైతే మూడు, నాలుగు నెలలు వాయిదా వేస్తారు కానీ, ఈ మాసంలో మాత్రం భజంత్రీలు మోగించరు. అలాగే కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదనే ఆచారం కూడా ఉంది. ఈ సంప్రదాయం ప్రకారం ఆషాడ మాసం పవిత్రమైంది కాదా? ఆషాడ మాసంలో పెళ్లిళ్లు ఎందుకు చేయరు? చేస్తే ఏమవుతుంది ? మరి పూజలు, వ్రతాలకు మంచిదైనప్పుడు, వివాహాలకు ఎందుకు పనికిరాదు? దీని వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? సందేహాలు వ్యక్తమవుతాయి. ఆషాడ మాసాన్ని ఆది మాసం, అడి అని పిలుస్తారు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల. హిందూ పండితుల ప్రకారం ఆషాడ మాసం పవిత్రమైనది కాదు. ఇది ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఆది అంటే శక్తి అని అర్థం. కాబట్టి ఈ ఆషాడ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది. ఆషాడ మాసంలో వివాహాలే కాదు గృహప్రవేశం, శంకుస్థాపన లాంటి శుభకార్యాలు నిర్వహించడం మంచిది కాదంటారు. కనీసం మంచి పనులు ప్రారంభించరు. శుభకార్యాలకు మంచిది కాదు. కానీ పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకి సేవ లాంటి వాటికి శుభప్రదమైనది. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. పూజలు, పండుగలు, ప్రత్యేక సేవలతో ఆలయాలు కిటకిటలాడుతాయి... అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిగమ్నమై ఉంటారు. దీనివల్ల వారికి వివాహ తంతు నిర్వహించడానికి సమయం ఉండదని, దీని వల్లే ఆషాడ మాసంలో వివాహాలు నిర్వహించరనే వాదన కూడా ఉంది. ఉత్తరాయణం నుంచి దక్షిణాయణ కథల ప్రకారం ఆషాడ మాసం సమయంలో.. దేవుడు నిద్రలోకి వెళ్తాడట. దీనివల్ల.. పెళ్లి చేసుకున్న వాళ్లకు దేవుడి ఆశీస్సులు అందవనే నమ్మకంతో.. ఇలా ఆషాడంలో పెళ్లిళ్లకు బ్రేక్ వేసినట్లు చెబుతారు. అలాగే దక్షిణాదిన ఆషాడ మాసంలో రైతుల చేతిలో పంట ఉండదు, వ్యవసాయ పనులు మొదలవుతాయి. వివాహం చేయడానికి అవసరమైన డబ్బులు ఉండక ఇలా సంప్రదాయం పేరుతో ఆషాడంలో పెళ్లి చేయకూడదు అనే నిబంధన తీసుకువచ్చారని మరికొందరు పండితులు చెబుతున్నారు. అలాగే పూర్వకాలంలో పెళ్లి అంటే ఖాళీ ప్రదేశంలో పెద్ద పెద్ద పందిళ్లు వేసి నిర్వహించేవాళ్లు. ఆషాడ మాసంలో వర్షాలు, గాలులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటి వల్ల పెళ్లికి ఆటంకం ఏర్పడవచ్చు. అలాగే అతిథులకు వడ్డించే భోజనాలపై దుమ్ము, ధూళి పడే అవకాశం ఉంది. అంతేకాదు హోమాల వల్ల ప్రమాదాలకు అవకాశాలు ఉంటుంది. ఈ కారణాలతోనే ఆషాడంలో పెళ్లి తంతు నిర్వహించకపోవడం మంచిదని పెద్దవాళ్లు ఈ నిర్ణయానికొచ్చారు.🙏 ఏడుకొండలవాడా అందరిని చల్లగా చూడు తండ్రి🙏

+11 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

ఓం నమో వెంకటేశాయ 🙏 వేంకటేశ్వరుడ్ని కలియుగ దైవంగా భావిస్తారు. ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు. ఆయన్ను దర్శనం చేసుకోడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడ్డం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది లేదనుకుంటారు. శ్రీహరి సంపూర్ణదర్శనంతో మోక్షం లభించినట్టే ఫీలవుతారు. అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోడంతో పాటు- పాదాలను కూడా వీక్షించాలి. దీన్నే నిజపాద దర్శనం అంటారు. శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు, తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. మిగిలిన సమయాల్లో స్వామివారి మూలవిరాట్ నిజపాదాలు బంగారంతో తయారు చేసిన పాదకవచాలు తొడిగి కనిపిస్తాయి. శుక్రవారం అభిషేక సేవకు ముందు, బంగారు పాదకవచాలను పక్కకు తీసి- స్నానపీఠంపై ఉంచి ఆకాశగంగ తీర్థ జలాలతో అభిషేకిస్తారు. అభిషేక సేవానంతరం నిజపాద దర్శనం పేరిట- భక్తులను టికెట్లపై దర్శనానికి అనుమతిస్తారు. అదీ శ్రీవారి పాదాలకున్న విలువ. అందుకే శ్రీనివాసుడు తన చరణములే భక్తులకు శరణమంటూ తన కుడిచేతిని- పాదాల వైపు చూపి దర్శించుకో.. తరిస్తావంటాడు. ఆయన తానున్నాని సూచించడానికి పాదాలను విశేషంగా వినియోగిస్తారు. ఆనందనిలయంలో వెలసిన శ్రీవేంకటేశ్వరుడి విగ్రహం పరీక్షగా గమనిస్తే మనకో విషయం తెలుస్తుంది. అదేమిటో తెలుసా? ఆయన కుడిచేయి కింది వైపుగా చూపుతూ కనిపిస్తుంది. అంటే నా పాదములే నీకు శరణమని ఆయన సూచించడంగా దీన్ని అర్ధం చేసుకోవాలి. శ్రీవారి పాదాలకు అంత విలువ. అసలు శ్రీనివాసుడంటే శ్రీపాదములు. శ్రీపాదములంటే శ్రీనివాసుడని అర్ధమట. శ్రీహరిని అవమానించినవీ పాదములే సిరి అలిగినదీ ఆ పాదముల వల్లే భృగువు అహంకారమును తొలగించినదీ పాదములే లోకకళ్యాణము చేసినదీ ఆ పాదములే సిరి- హరి విడిపోయినదీ ఆ పాదముల వల్లే ఆమెను వెతుక్కుంటూ శ్రీవారు వైకుంఠము వదిలి వెంకటాద్రి చేరినగుర్తులూ పాదములే. మూడడుగుల్లో ఆనంద నిలయం చేరినదీ పాదములే.. శ్రీహరి అందునా శ్రీవేంకటేశ్వరుడి కథలో పాదములది ప్రముఖ స్థానం. ఆయన వైకుంఠం వదలడానికి కారణం పాదాలు. ఆయన "ఇల" వైకుంఠం వచ్చాడనడానికి గుర్తులు పాదాలే. ఆ మాటకొస్తే మహావిష్ణువు పాదములకు ఎంత విలువుందో శ్రీరామావతారంలో మరింత గొప్పగా తెలుస్తుంది. శ్రీరాముడి కాలు తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది. అందుకే గుహుడు నీ కాలు తగిలి రాయి ఆడది అయినాదంటా అని పాడాడు. అంతటి మహిమాన్వితమైనవి శ్రీవారి పాదములు. శ్రీకృష్ణావతారం అంతమైందే పాదముల వల్ల. బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేసాడని చెబుతుంది భాగవతం. ఇక వామనావతారంలోనూ బలితన తలను అప్పగించడానికి కారణం పాదమే. శ్రీహరి పాదములకు ఇంతటి విశిష్టత వుంది. అందుకే ఆ పాదములకు ఏదైనా జరిగితే భక్తుల హృదయాలు విలవిల్లాడుతాయి. ఈ మధ్య అలాంటి నారాయణ పాదాలు పగిలి పాదాల నుంచి బొటనవేలు వేరుపడింది. బొటనవేలు చెదరడాన్ని చూసి.. ఇది ఏ దుశ్శకునమో అనుకున్నారందరూ. వాటిని తిరిగి పునఃప్రతిష్టించారు. ఆగమశాస్త్రంలో ఈ పాదాల ఆరాధన లేదంటారు. శ్రీవారి విషయంలో ఇంత ప్రాముఖ్యత వున్న పాదములు ఆరాధనీయం ఎందుకు కాలేదు? అన్నది అటుంచితే శ్రీవారి పాదములు అంత సామాన్యమైనవి కావు. బ్రహ్మకడిగిన పాదములవి. బ్రహ్మము తానెడి పాదములవే. శ్రీహరి మహిమలన్నీ దాదాపు పాదముల్లోనే దాగి వుంటాయి. శ్రీవారు శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగుపెట్టినందుకు గుర్తట ఈ పాదములు. ఆయన ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పద్మావతీ దేవి ప్రేమలో పడ్డం, తర్వాత ఆమెతో పెళ్లి కావడం.. చకచకా జరిగాయి. తర్వాత ఇద్దరు దేవేరులకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారి ఇక్కడ భక్తుల కోర్కెలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిసాడు. అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయి? అలిపిరి ప్రదేశంలో తలయేరుగుండు దగ్గర కనిపించే పాదాల పేరు శ్రీపాదములు. కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమలనంబి. అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పిందిక్కడే. కొండ నుంచి నంబి, గోవిందరాజ పట్టణం నుంచి శ్రీమద్రామానుజులు.. ఈ ప్రదేశం చేరుకొని భగవారాధన చేసేవారట. దీని వల్ల స్వామి వారి దర్శనం ప్రొద్దున్న & సాయంత్రం మాత్రమే అవుతోందని బాధ పడేవారు. వేంకటేశ్వర స్వామి వారు ఆయన కలలో కనబడి ఏమని అభయం ఇచ్చారంటే - నా పాదాలని అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్సనం చేసుకోవచ్చు అని. మనం కొండని కాలి మార్గం గుండా వెళ్ళే ముందు అలిపిరిలో శ్రీవారి పాదములు అని కనిపిస్తాయి. ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే వచ్చాయి. ఎంతో గొప్ప మహానుభావుడాయన. కాలి నడక మార్గంలో వెళ్ళేవారికీ అలిపిరి ప్రదేశంలో కనిపిచే మండపం ,పడాల మండపం .దీనినే పాదాల మండపం అని కూడా అంటారు .క్రీ.శ .1628 కాలం నాటిది ఈ పాదాల మండపం .ఈ మండపంలో `పాదరక్షలు `లెక్కలేనన్ని ఉన్నాయి .`మాధవదాసు `అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక లేక ఇక్కడే శిలగా మరిపోయాడట .తెలుగువారికి శ్రావణ శనివారం చాలా ముఖ్యo .ఆ రోజు ఉపవాసం చేయడం ,పిండితాళిగలు వేయడం సంప్రదాయం .ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహర ప్రాంతంలోని హరిజనులు ఇంటిలో ,కంచి ప్రాంతంలోని హరిజనుని ఇంటిలో పాదముద్రలు పడతాయి .ఆ పాద ముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు .శ్రీకాళహస్తి నుండి ఒకరు ,కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పులున్ని నెత్తి పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాద రక్షలను ఆ పూజ మందిరంలో పెడతారు . ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతుంటాయట. కారణమేంటో తెలుసా.. తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామివారు కొండ దిగి వస్తారట. అలమేలు మంగమ్మ దగ్గరకి వెళ్లి తిరిగి కొండ ఎక్కే వేళ.. వాటిని ఇక్కడే వదిలి వెళతారని పురాణ ఇతిహాసం. నారాయణ పాదములు తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కి.మీ. దూరంలో `నారాయణ పాదం` ఉంది. శ్రీవారి శ్రీపాద ముద్రలున్న శిలఫలకం ఇక్కడే కనిపిస్తుంది. నారాయణగిరి పాదముల విషయంలో ఆగమ శాస్త్ర ప్రకారం పెద్దగా ఆరాధనలు జరగవని అంటారు. కానీ, పాద పూజ- ఛత్రస్థాపన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పుడు పునఃప్రతిష్ట చేసిన నారాయణగిరిలోనే ఈ ఉత్సవనిర్వహణ జరిగేది. వీటినే "నారాయణ పాదములు" అంటారు. ఆషాడ శుద్ద ఏకాదశి పర్వదినం అంటే ద్వాదశి తిది ఇక్కడే శ్రీపాద పూజ,ఛత్రస్టాపన ఉత్సవాలు జరుగుతాయి. శ్రీవారికి ప్రాతఃకాల మధ్యాహ్నకాల ఆరాధనం ముగిశాక అర్చకులు,ఏకాంగులు, అధికారులు,పరిచారకులు రెండు `భూచక్ర ` గొడుగులను, యమునోత్తరం నుండి పుష్పసరాలను,బంగారు బావి తిర్ద్దాన్ని సంసిద్ధం చేసుకొని మంగళ వాద్యాలతో బయలుదేరుతారు. మేదరగట్టు వద్దకు చేరగానే వాద్యాలు నిలిపి నారాయణగిరి వైపు కదులుతారు. ఆ గిరి మీదున్న శిలాఫలకంలోని శ్రీ పాదలకు బంగారు బావి జలంతో అభిషేకం చేస్తారు. హారతి ఆరగింపులు విర్వహిస్తారు. శ్రీవారి పాదాలున్న ప్రాంతంలోని చెట్లకు `భూచక్ర గొడుగులను` కట్టి వెనుకకు తిరుగుతారు. నారాయణగిరి దిగి బంగళాతోటకు వచ్చి చేరుతారు.ఆఫై ప్రసాద వినియోగం,వనభోజనం జరుగుతాయి. తదనంతరం మహాద్వారం చేరుకొంటారు. అలా శ్రీవారి పాదములను ఇన్ని రకాలుగా పూజించడం గౌరవించడం జరుగుతుంది.అసలు శ్రీవారిని ఆమూలాగ్రం దర్శించుకుంటే జన్మధన్యమైనట్టే. ఇక శ్రీనివాసుని పాదం దర్శించుకుంటే- ఆయన హృదయంలో శ్రీదేవితో సమానంగా స్థానం దొరికినట్టే భావిస్తారు🙏 ఏడుకొండలవాడ అందరిని చల్లగా చూడు తండ్రి🙏

+21 प्रतिक्रिया 2 कॉमेंट्स • 1 शेयर

🌺🌺🌺కర్ణుడిని ఏ అస్త్రంతో సంహరించారు? 🌺🌺🌺 విలువిద్యలో అర్జునుడితో సమానుడు. మహా భారత భీకర యుద్ధంలో చివరికంటూ పోరాడినవాడు. ఒకానొక దశలో అర్జునుడిపై పైచేయి సాధించిన కురుసేనాధిపతి.. కర్ణుడు. అన్ని అస్త్రాలు సంధించినా నేలకొరగని ఆ మహావీరుడు.. ఎలా నేలకొరిగాడు? అర్జునుడు ఇంతకీ ఏ అస్త్రం ప్రయోగించాడు? మహాభారత యుద్ధంలో ద్రోణుని మరణం అనంతరం కురుసేనాధిపతిగా కర్ణుడు బాధ్యతలు స్వీకరించాడు. విలువిద్యలో అర్జునుడితో సరిసమానుడు కావడం.. కౌరవ చక్రవర్తి సుయోధనుడికి అనుంగుమిత్రుడు కావడంతో కౌరవ శ్రేణుల్లో కర్ణుడంటే విపరీతమైన అభిమానం ఉండేది. అస్త్ర విద్యల్లో అర్జునుడితో పోటీపడగలవాడు కావడంతో కౌరవ శిబిరంలో ఆనందం తాండవించింది. మహాభారత యుద్ధంలో 17వ రోజు అర్జున, కర్ణుడి మధ్య భీకర యుద్ధం జరిగింది. సమవీరుల మధ్య జరిగిన పోరును యావత్‌ విశ్వం ఆసక్తిగా వీక్షించింది. అస్త్రశస్త్రాలను ఇరువురు సంధించుకుంటున్నారు. ఒక అస్త్రానికి మించిన అస్త్రాలు వేస్తున్నారు. ఇంతలో కర్ణుడు హఠాత్తుగా నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. అశ్వసేనుడు అనే నాగకుమారుడు సర్పముఖ బాణాకారంలో ఉన్నాడు. ఖాండవ వన దహనంలో అశ్వసేనుడు బాధితుడు. అర్జునుడిపై పగ తీర్చుకునేందుకు అస్త్రంగా మారి కర్ణుడి వద్దకు చేరాడు. వెలుగులు చిమ్ముతూ వస్తున్న నాగాస్త్రాన్ని చూసిన శ్రీకృష్ణ భగవానుడు రథాన్ని నేలలోకి కుంగేట్టు కాలితో తొక్కాడు. భీకర వేగంతో వచ్చిన నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని పడగొట్టింది. ప్రాణాపాయం నుంచి మాత్రం బయటపడ్డాడు. కర్ణుడిపై సవ్యసాచి వరుసగా అస్త్రాలు వేస్తున్నాడు. గాయాలబారిన పడుతున్నప్పటికీ కర్ణుడు వాటిని ఎదుర్కొంటూ బాణాలతో జవాబు చెబుతున్నాడు. ఈ సమయంలోనే కర్ణుడి రథం నేలలోకి కుంగిపోయింది. ఎడమ వైపు చక్రం నేలలోకి దిగడంతో ఎత్తేందుకు కిందకు దిగాడు. రథం కుంగడం శాప ప్రభావమే. అప్పటికే పరశురాముడు గతంలో ఇచ్చిన భార్గవాస్త్రం అతడికి గుర్తురాలేదు. ‘రథాన్ని ఎత్తేంత వరకు బాణాలు ప్రయోగించొద్దు.. ఇది యుద్ధధర్మం కాదు’ అని అర్జునుడిని కోరాడు. అంతలో అర్జున రథ సారథి శ్రీకృష్ణుడు బదులిస్తూ.. ‘పాండవులు బస చేసిన లక్క ఇంటిని కాల్పించి, మాయా జూదంతో వారి సంపదను అపహకరించి.. ద్రౌపదిని నిండు సభలో అవమానించి.. బాలుడైన అభిమన్యుడిని చంపారు కౌరవులు. అప్పుడేమైంది ఈ న్యాయం’’ అని ప్రశ్నించాడు. చివరగా అర్జునుడు అంజలికం అనే మహా అస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణ సుదర్శనం, మహదేవుడి శూలంతో సరిసమానమైన అస్త్రమది. ‘నేనే గనుక తపస్విని, గురువులకు సేవలతో సంతృప్తి కలిగించేవాడిని, పుణ్య కర్మలను ఆచరించేవాడినయితే ఈ బాణం కర్ణుడి తలను సంహరిస్తుంది’ అని ప్రతిజ్ఞ చేసి అస్త్రం సంధించాడు. వింటిని పూర్తిగా లాగి సంధించిన అంజలికం వెలువరించిన కాంతులతో ఇరు పక్షాలు భీతిల్లాయి. అత్యంత వేగంగా వెళ్లిన అంజలికం కర్ణుని శిరస్సును ఖండించింది. అస్తమిస్తున్న సూర్యుడి వలె కర్ణుడి తల కిందపడగా అతని దేహం నుంచి అత్యంత ప్రకాశమైన కాంతిపుంజం వెలువడి సూర్యుడిని చేరింది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

+19 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

ధ్యానం నీ లోపల, నీ బయట, సర్వత్రా వ్యాపించి వున్న పరమాత్మ ను దర్శించటానికి నీ లోనికి, నీ పయనం చేసి ఆత్మ దర్శనం పొందడం. మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం లో మన లోనికి మనం చేసే ప్రయాణం. ఆత్మ, పరమాత్మల కలయిక కోసం చేసే ప్రయత్నం లో ఓ మార్గం. వంచించే ఇంద్రియాలు ద్వారా పరమాత్మ ను గ్రహించ గల మన్న అజ్ఞానము ను వీడి, బాహ్య విషయముల నెరిగే మనస్సు ని, ఎగిసి పడే అహంకారాన్ని అంత మొందించి హృదయం లోని అవ్యక్తమైన కాంతి నీ, స్వస్వరూప స్థితి ని ఎరుక లోనికి తెచ్చే ప్రక్రియ. మనస్సు యొక్క నిశ్చలత్వం. మనల్ని పరమ సత్యాని కి దగ్గర గా తీసు కెళ్ళే మార్గం. ఇతర భావాలను విడిచి ఒకే ఒక భావం పై ఏకాగ్రత ను కల్గించడం. అంత రంగ చైతన్యము కు చేరువ కావడం. హృదయాంతర్గత ఆత్మ చైతన్యం లో జీవించడం. ధ్యానం దైవత్వాన్ని చేరుకోవడానికే తప్ప అనుభవాల కోసం కాదని గ్రహించాలి. ధ్యాన మంటే కొన్ని మాటలు పునరుక్తి చేస్తూ, జపం చేస్తూ నియమిత సమయం లో కళ్ళు మూసుకొని కూర్చొని చేసే ప్రక్రియ కాదు. ఏ పని చేస్తున్నను ధ్యానం జరుగుతూ ఉండాలి. అంటే చేస్తున్న ప్రతీ పని యందు సాక్షి భావం తో ఉండి పని చేయగలిగి నప్పుడు మాత్రమే అది అర్ధవంతమైన, ధ్యాన యుక్త మైన పరి పూర్ణ జీవితం అవుతుంది. ధ్యాన సాధన చేస్తున్న మొదట్లో ధ్యాన స్థితి లో ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానం చేయడానికి ఆలంబన గా తీసుకున్న ధ్యాన వస్తువు (నామం, రూపం, దీపం,శ్వాస మొదలగునవి) ఉంటాయి. ధ్యానం లో కొంత ప్రగతి సాధించాక ధ్యాన వస్తువు ఉండదు. ఇంకా ధ్యానం తీవ్రతరం అయ్యే సరికి ధ్యానం చేసే వ్యక్తి అంటే ధ్యాని కూడా ఉండడు. సమస్తమూ ధ్యానమందు లయమై పోతాయి. ధ్యాన కేంద్ర మైన విశ్వాత్మ లో అంటే పరమ చైతన్యం లో ధ్యాని దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, శ్వాస....అన్నీ అన్నీ సమీకృతమై వీలీనమైపోతాయి. ఇదీ పరిపూర్ణ ధ్యానస్థితి. ఇదే సంపూర్ణ ఆత్మధ్యానం. ఇదే ఆత్మనిష్ట. ధ్యాన యోగం యొక్క మహిమత్వాన్ని ఎన్నో శాస్త్రాలు ద్రువీకరిస్తున్నాయి. బ్రహ్మహత్యసహస్రాణి భ్రూణహత్య శతాని చ ఏతాని ధ్యానయోగశ్చ దహత్యగ్ని రివేంధనమ్ బ్రహ్మహత్యలును, నూరు గర్భిణీ హననము లైన పాపాలన్నియున్ను ఒక ధ్యాన యోగం చే, కట్టెలన్ని అగ్ని చే భస్మ మగు నట్లు భస్మ మగు చున్నవి. ముహుర్తమపి యో గచ్చే న్నాసాగ్రే మనసా సహ సర్వం తరతి పాప్మానం తస్య జన్మశతార్జితమ్ భ్రూ మధ్య మందు ప్రణవ మంత్రముల తో మనస్సు ను ఐక్య పరచి ఒక ముహుర్త మాత్రం ఎవరు ధ్యానింతురో, వారి యొక్క శత జన్మార్జితమైన పాపాలన్నియు నశించి నిర్మలు లగుదురు. నిమిషం నిమిషార్ధం వా ప్రాణినో ధ్యాత్మచింతకాః క్రతుకోటిసహస్రాణాం ధ్యానమేకం విశిష్యతే (ఉత్తరగీత) నిముషము గానీ, అర్ధ నిముషము గానీ ఆత్మ ధ్యానం చేసిన యెడల మానవులకు కోటి ఆశ్వ మేధాది యాగముల కంటే ఎక్కువ ఫలితముంటుంది. నాస్తి ధ్యానసమం తీర్ధం నాస్తి ధ్యానసమం తపః నాస్తి ధ్యానసమో యజ్ఞస్తస్మాద్ధ్యానం సమాచరేత్

+12 प्रतिक्रिया 1 कॉमेंट्स • 5 शेयर

* పూజలు ఎలాంటి సమయాల్లో చేయాలి? దేవతారాధన పూజలకు నిర్దుష్టమైన సమయం ఉంటుంది. ఈ పూజలను వేళాపాళా లేకుండా చేయరాదు. అందుకే మన పెద్దలు ఒక రోజులో ప్రభాతకాలం, మధ్యాహ్న, సాయంకాలాలు ఉంటాయని చెప్పారు. ఈ కాలాల్లోనే ప్రశాంతమైన చిత్తంతో శుచిగా పరమాత్మను పూజించాలి. దీన్ని బాహ్యపూజగా పరిగణిస్తారు. ఇది లోనికి మళ్లితే మానసిక పూజగా మారుతుంది. దానికి సమయాలుండవు. చివరకు "యద్యత్ కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్" అన్నట్లు ఏ పని చేసినా పూజయన్న భావం స్థిరపడాలి. అట్లే జపం కూడా. ప్రారంభంలో ఈ జపం మూల కూర్చుని, మాలపట్టుకుని జపం చేస్తూచేస్తూ చివరకు మాలలు వదిలి మనలో నిరంతరమూ జపం కొనసాగే స్థితికి చేరుకోవాలి. దానినే "అజపాజపస్థితి" అని పిలుస్తారు. అలాగే భగవంతునికి మనము అర్పించవలసినవి పదార్థాలు కావు. మనలోని అహంకారాలు, కామనలు వంటివే. అలాగే హారతులంటే కేవలం కర్పూరం వెలిగించడమే కాదు. మనలోని అహంకారాన్ని కర్పూరంలా వెలిగించి, పరమాత్మకు సమర్పించడం. పుష్పం సమర్పయామి అని పువ్వులకు మనలోని దుర్వాసనలను పట్టించి స్వామి పాదాల మీద సమర్పిస్తే ఆ పాదాలు ఆ దుర్వాసనలను శుద్ధం చేసి మళ్లీ మనకిస్తే వాటిని శిరస్సున ధరిస్తామని పురోహితులు చెబుతున్నారు.

+23 प्रतिक्रिया 2 कॉमेंट्स • 7 शेयर