పోతనామాత్యుడు అనువదించిన తెలుగు శ్రీమద్భాగవతం దశమ స్కందము లో.... పరీక్షిత్తు శుఖ ముని శ్రీకృష్ణుని లీలలు గురించి అడుగుట.... మా పెద్దలు మును వేల్పులు నోపని భీష్మాది కురుకులోత్తమ సేనా కూపారము నే కోలము ప్రాపున లంఘించి రొక్క బాలపదముగాన్ భీష్మాది కురువీరులతో నిండిన కౌరవసైన్యాన్ని తట్టుకోవడం దేవతలకు అయినా సాధ్యం కానిది. అలాంటి కౌరవసేనాసముద్రాన్ని మా పెద్దలైన పాండవులు ఒక పసిపిల్లవాడి అడుగును దాటినంత సులభంగా ఎలా దాటగలిగారు. ఏ తెప్ప సహాయంతో దాటగలిగారు. నేను మా అమ్మ గర్భంలో ఉండగా ద్రోణాచార్యుల వారి పుత్రుడు అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రంచేత బాధపడి నిశ్చేష్టుడను అయ్యాను. ఆ సమయంలో పాండవకులాన్ని నిలపెట్టడానికి శ్రీకృష్ణభగవానుడు చక్రాన్ని ధరించి నన్ను రక్షించాడు. కలసి పురుషమూర్తి కాలరూపములను లోకజనుల వెలిని లోన నుండి జన్మ మృత్యువులను సంసారముక్తుల నిచ్చు నతని చరిత మెల్లఁ జెపుమ. పురుషోత్తముడైన విష్ణువు పురుషరూపంతోనూ కాలరూపంతోనూ లోకంలోని జీవులందరి లోపలా బయటా కూడా ఉంటాడు. అలా ఉండి జననమరణాల నుండీ సంసారబంధాల నుండీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి పురుషోత్తముని చరిత్ర అంతా వివరంగా చెప్పు. స్వస్తి!! సశేషం!! హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే!!

+9 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

అట్లతద్ది వ్రతము అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు.కన్నెపిల్లలు ఎంతగానో ఎదురుచూసే పండుగ ఇది. కాబోయే భర్త గురించి వారి ఊహలు, ఆశలు నెరవేరాలని కోరుకుంటూ నోచుకునే నోము ఈ పండగలో ప్రత్యేకం. తెలుగింటి ఆడపిల్లలంతా ఉత్సాహంగా జరుపుకునే పర్వం ఇది. చల్లని రాత్రి దుప్పటి ముసుగు తీయకముందే నిదుర లేచి, పండిన గోరింటాకును చూసుకుని మురిసిపోవడం, తక్కువగా పండితే ముసలి మొగుడొస్తాడని వేళాకోళాలాడుకోవడం, పొద్దు పొడిచే లోపలే చద్ది తినడం, ఆడపిల్లలంతా ఒక్కచోటచేరి ఆటలాడటం, ఉయ్యాలలూగడం అన్నీ సరదాలే. దీన్ని ఎక్కువగా కృష్ణా, గోదావరి ప్రజలు జరుపుకుంటారు. త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలముతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగ చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్రీలు సౌభాగ్యము కోసం చేసుకొనే వ్రతమిది. చంద్రారాధన ప్రధానమైన పూజ, చంద్రకళల్లో కొలువైవున్నశక్తి అనుగ్రహం చేత స్రీసౌభాగ్యము పెరుగుతుంది. కుటుంబములో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతరార్ధముంది. నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగా పెడితే కుజదోష పరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము. రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగా వుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భదారణలోఎటువంటి సమస్యలుండవు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంబంధించిన దాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావము రాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా. అందుకే ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు. అట్లతద్దిలోని 'అట్ల'కు ఇంతటి వైద్యవిజ్ఞానము నిక్షిప్తం చేయబడివుంది.అట్లతద్ది పండుగను ఉత్తభారత దేశంలో 'కర్వా ఛౌత్' అనే పేరుతో జరుపుకుంటారు. ఉద్యాపన ఈ వ్రతం అశ్వయుజమాసం, బహుళ తదియనాడు ఉపవాసం చేసి, చంద్రోదయం అయ్యేవరకు ఏమీ తినకూడదు. గౌరీదేవికి పది అట్లు నివేదన చేయాలి. అలా తొమ్మిది సంవత్సరములు చేసి, 10వ సంవత్సరమున, 10మంది ముత్తైదువులను పిలిచి, వారికి తలంటు స్నానము చేయించి, 10 అట్లు, పసుపు, కుంకుమ, రవికల బట్ట, దక్షిణ తాంబూలము సమర్పించి, సంతృప్తిగా భోజనము పెట్టాలి. 10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఈ పండుగలో విశేషము. దీనినే 'ఉయ్యాలపండగ' అనీ, 'గోరింటాకుపండగ' అనీ అంటారు. ఈ పండగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహంతో పెళ్ళి కాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్తగా లభిస్తాడని, పెళ్ళైనవారికి పిల్లలు కలుగుతారని, ఐదవతనముతోపాటు, పుణ్యము లభిస్తుందని తరతరాలనుంచి వస్తున్న నమ్మకము. ఈ పండగ వైభవము పట్టణాలకంటే పల్లెలో ఎక్కువగా కనిపిస్తుంది. అందరూ ఉత్సాహముగా జరుపుకుంటారు. తొలి కోడి కూసినప్పుడే లేచి ఉట్టికింద కూర్చొని గోంగూరపచ్చడి, కందిపులుసు మొదలైన వాటితో చద్ది అన్నము తిని తాంబూలం వేసుకుంటారు. ఇక అప్పటి నుండి నిద్ర పోరు. ఆట పాటలతో గడుపుతారు. అట్లతద్దోయ్ ఆరట్లో, ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అని పాటలు పాడుతూ ఉయ్యాలలూగుతారు. ఉయ్యాలలు ఇంట్లోకాక తోటలలో పెద్ద పెద్ద చెట్లకి వేస్తారు. ఈ పండుగని అందరూ జరుపుకుంటారు. అందుకే అస్టాదశ వర్ణాలవారికి అట్లతద్దె అనే పేరు వచ్చింది. ఉయ్యాల పండుగ ఆడపిల్లలంతా పట్టు పరికిణీలతో ముచ్చటగా ముస్తాబవుతారు. ఉత్సాహంగా ఊయలలూగుతూ, పాటలు పాడుతూ, నేస్తాలతో పరిహాసాలాడుతూ ఆడుకుంటారు. ఊరిలో వుంటే పెద్ద చెట్టు దగ్గర ఉయ్యాల కట్టి అమ్మాయిలంతా అక్కడచేరి ఆడిపాడతారు. ఈ సందట్లో మగవారికి ప్రవేశం లేదు. ఆడవారిదే రాజ్యం. తదియ రోజున ఊయల ఊగకపోతే ముసలి మొగుడొస్తాడని నమ్ముతారు. అట్లతద్ది రోజున నోములు నోచుకునే వారుంటారు. ఈ నోముల వెనుక ఒక పురాణ కథ కూడా వుంది. అట్లతద్ది కథ ఒకప్పుడు రాజుగారి కుమార్తె, మంత్రి గారి కుమార్తె కలిసి నోము నోచుకోసాగారట. రాజుగారి కుమార్తె ఎంతో సుకుమారి. సాయంత్రం గడిచేలోపలే నీరసంతో స్పృహతప్పి పడిపోయింది. అది చూసి భయపడిన ఆమె అన్నగారు చెట్టుకు ఒక పెద్ద అద్దం కట్టించి కింద నిప్పును పెట్టాడు. అద్దంలో దాని ప్రతిబింబం సూర్యా స్తమయం అవుతున్న భ్రమను కలిగించడంతో రాజుగారి కుమార్తె తన దీక్షను విరమించి భోజనం పూర్తి చేసింది. తరువాత ఆమెకు ముసలివాడు, వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి భర్తగా వచ్చాడు. ఎన్నో కష్టాలకోర్చిన ఆమె భగవంతుని ప్రార్థించగా పార్వతీ పరమేశ్వరులు ఆమెకు స్వప్నంలో కనిపించారు. వ్రతభంగమైన కారణంగానే ఇలా జరిగింది కనుక ఆశ్వీయుజ బహుళ తదియ నాడు తిరిగి ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్పారు. ఆమె వ్రతాన్ని నిర్విఘ్నంగా ఆచరించి పూర్ణాయుష్కుడైన భర్తను, సుఖ,సంతోషాలను పొందిందని ఒక కథ. నోము విధానం నోము చేసుకునే స్త్రీలు ఉదయం ఉపవాసం చేసి సాయంత్రం పది పోగులతో దారాన్ని చేతికి కట్టుకుని, పదిమంది ముతైదులకు తలంటు స్నానం చేయించి, వాయినం ఇవ్వాలి. పసుపు, కుంకుమలు, రవికలగుడ్డ, తాంబూలంతోపాటుగా పదకొండు అట్లను వాయనంలో ఇస్తారు. పది సంవత్సరాలు ఈ నోమును నోచుకుంటారు. సంవత్సరానికి ఒక ముతైదుకు వాయినం ఇచ్చేవారు కొందరైతే, పదిమందికీ ఒకేసారి ఇచ్చేవారు కొందరు. వాయినం పుచ్చుకున్న అట్లను వారుతప్ప వేరొకరు తినకూడదనే నియమం వుంటుంది. నోము విధానంలో కొందరిది వేరొక పద్ధతి. ఈ నోము నోచుకునే అమ్మాయిలు ఐదుగురు ముత్తైదువులకి పదకొండు అట్లు, తాంబూలంతో కలిపి ఇస్తారు. బియ్యపు పిండితో చేసిన దీపాలను వెలిగించి ఆ అట్ల మీద పెట్టి ఇవ్వడం మరో సంప్రదాయం. అంతేకాక పోతురాజుకు పదకొండు అట్లను నైవేద్యంగా ఇస్తారు. అమ్మవారితోపాటు అయ్యవారి అంశగా ఇక్కడ పోతురాజును కొలుస్తారు. ప్రతిగ్రామంలోనూ అట్లతద్దికి ఆడవారంతా గ్రామదేవత గుడిదగ్గర ఈ వాయినాలను ఇచ్చి పుచ్చుకోవడం చేస్తారు. శాస్త్రీయ దృక్పథం ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడం ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం. వర్షాల సమయంలో విరివిగా లభించే ఉసిరి, గోంగూర వంటి వాటిని తినడం ద్వారా కంటిసమస్యలు రాకుండా ఉంటాయి. చేతులకు పెట్టుకునే గోరింటాకు వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. గోర్లకు ఆరోగ్యం కూడా. రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో గడపడం వల్ల ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లౌతుంది. ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. స్త్రీలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందించడం ఈ పండుగ ప్రత్యేకత అని ఇట్టే అర్థం అవుతుంది. సాంప్రదాయ వాదమైనా, శాస్త్రీయ దృక్కోణమైనా, పెద్దలు చెప్పే ఆచారమైనా మానవుల జీవన గతిలో కించిత్‌ మార్పును చొప్పించి, సంతోషాలను అందించేందుకు ఉద్దేశింపబడిందే. హైటెక్‌ యుగంలో పండుగలను కూడా సినిమాలతోనో, షికార్లతోనో గడిపేస్తున్నాం. అసలు పండుగల్లో దాగున్న ఆంతర్యమేమిటో అర్థం చేసుకుంటే సామాజిక ప్రగతికి అవి ఎంత దోహదకారులో తెలుస్తుంది.

+11 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

మానవుడు పుట్టిన దగ్గరనుంచి చనిపోయే దాకా కోరికల వలయంలో పడి సతమవుతూ ఉంటాడు. ఈ కోరికల్లో మనకు సుఖం లభిస్తూ ఉంటే, మరి మనకు దుఃఖం ఎందుకు కలుగు తోంది? కోరికలు ఉండటం తప్పా! కోరికలు తీర్చుకోవడం మంచిదా ! కాదా ! అలానే కోర్కెలు అణుచుకోవడం సరియైనదేనా ! అసలు వీటిగురించి ఎందుకు ఆలోచించాలి? అందరిలాగా జీవితం ఎందుకు గడపగూడదు? ఇక్కడ సమస్య ఏమిటి అంటే, కోరికలు కావాలి కానీ, వాటివల్ల మనకు దుఃఖం కలుగ కూడదు. ఒక వస్తువుని మనం పొందాలి అంటే, అందుకు మనకు అర్హత కావాలి. ఈ అర్హత అనేది మనకు లేనప్పుడు, మరియు మనము సరియైన ప్రయత్నం చేయనప్పుడు, మనకు ఆ వస్తువు దక్కదు. మనం అను కున్నది జరుగనప్పుడు మన మనసుకి కష్టం కలుగుతుంది. మన శాస్త్రాలన్నీ, కోరికలను నియంత్రించ మని, వాటిని అదుపులో ఉంచమని చెప్తాయి. కానీ సామాన్య మానవులకు ఇది చాలా కష్టతరం అయినది. అందుకే బాబా ఇలా అనేవారు. "నా భక్తులు రకరకాల కోరికలతో నా దగ్గరకు వస్తారు. మొట్టమొదట వారి కోరికలు తీర్చుతూ వారిని సక్రమ మార్గములో నడిపిస్తాను. వారికి విషయవాసనల మీదే మనస్సు ఉంటే, వాళ్ళు మామిడి పూతలాగా రాలిపొతారు". మనము ఈ కోరికల వలయము నుండి బయట పడాలి. బాబా మనకు ఇవ్వాలి అను కున్న ఖజానాని మనం పొందాలి. భగవంతుని పట్ల శ్రద్ధతో ఉండి, బాబా చూపిన మార్గములో నడిస్తే మనకు ఈ కొరికలవల్ల కలిగే దుఃఖము నుండి విముక్తి కలుగుతుంది. కోరికలను నియంత్రించే మార్గము - అర్థం చేసుకోవాల్సిన విషయాలు: విషయములందు ఆసక్తి : మనం వస్తువుల గురించి ఆలోచించే కొలది, వాటిమీద ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తివలన ఆ విషయములను పొందాలని అనిపిస్తుంది. ఈ విషయాన్నే భగవద్గీత సాంఖ్య యోగంలో భగవానుడు మనకు చెప్పడం జరిగింది. కోరిక కర్మకు దారి తీస్తుంది: మనము ఒక వస్తువు గురించి ఆలోచించగా, ఆలోచించగా, దాని మీద ఆసక్తి కలిగితే, మనస్సులో నానా విధములు అయిన సుఖాల ప్రాప్తి కొరకు ఇచ్ఛలు ప్రబలమగును. ఈ కోరిక తీరడానికి మనము ఏది అయిన చేయడానికి సిద్ధపడతాము. కోరికలోనుంచే కోపం పుడ్తుంది: మన కోరిక ప్రబలం అయినప్పుడు, ఆ కోరిక తీరనప్పుడు, మనము కారణాల కోసం వెదుకుతాము. ఈ కారణము ఒక పరిస్థితి వల్ల కాని, లేదా ఒక వ్యక్తి ద్వారా కాని సంభవిస్తే, మనకు చాలా క్రోధము కల్గుతుంది. కోపము వలన మనలో వివేకశక్తి నశిస్తుంది. అప్పుడు మంచిచెడ్డల గురుంచి ఆలొచించ ము. ఇటువంటి పరిస్తితుల్లో మనల్ని మనము నియత్రించుకోలేము. దీనివల్ల కష్టాలను కొని తెచ్చుకుంటాము. ఈ జన్మలో అనుభవించేదే కాకుండా, వచ్చే జన్మలో కూడా దీని ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. ఆ తరువాత అయ్యో నాకే కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని బాధపడతాము. కోరికలను హృదయముతో అర్థంచేసుకోవాలి: కోరికలు కలగడం సహజం. బాబా వాటిని అడగద్దు అని చెప్పలెదు. కానీ వాటిని తీర్చు కొనే ముందు, వాటిని నాకు సమర్పించు, అప్పుడు ఆ కోరిక నువ్వు తీర్చు కోవచ్చా లేదా అన్న విచక్షణ నీలో కల్గుతుంది అని చెప్పారు. మనము ఒక కోరిక గురుంచి ఆలోచించి నప్పుడు, లేదా దాన్ని అనుభవించినప్పుడు మన మానసిక పరిస్థితి ఏమిటీ అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనము విషయసుఖాలను ఇంద్రియాల ద్వారా అనుభవించ డానికి అలవాటుపడ్డాము. కాని ఇక్కడ ఒక మెట్టు ఫైకి ఎక్కి, వాటిని హృదయంతో ఆస్వాదించటం నేర్చుకోవాలి. మామూలుగా మనము ఈ సుఖాల తరంగా లను వస్తువుల వైపు పోనిస్తాము. దానివల్ల పూర్తి ఆనందాన్ని అనుభవించలేము. ఇలా మనము సుఖాల వైపు పరుగులు తీస్తూనే ఉంటాము. ఒక కోరిక చాలా కోరికలకు మూల కారణం అవుతుంది. కోరిక ఎప్పటికీ తీరదు. అందుకే, ఈ తరంగాలను హృదయం వైపు త్రిప్పాలి. వాటిని నిజంగా అర్థం చేసుకున్న ప్పుడు వాటి మీద వ్యామోహం తగ్గుతుంది. బాబా చెప్పిన సులభమైన మార్గం ఏమిటి? "విషయ సుఖాలను నాకు అర్పించి అనుభ వించు" అని చెప్పారు. మనము సాయిని స్మరించకుండా యే వస్తువును పంచ ఇంద్రియ ములతో అనుభవించరాదు. ఇలా చేయడం వల్ల మనకు విచక్షణా శక్తి వస్తుంది. ఆ కోరిక వల్ల ప్రాప్తించిన సుఖం యొక్క విలువ తెలుస్తుంది. ఆ విలువను మనం అర్థం చేసుకున్నప్పుడు, దానిపట్ల ఆసక్తి తగ్గుతుంది. అప్పుడు అరిషడ్వర్గాలు అదుపులో ఉంటా యి. మనస్సుకు శాంతి లభిస్తుంది. శాంతి కలిగితే, మనకు గురువు పట్ల శ్రద్ధ కుదురు తుంది. దీనివల్ల మనము బాబాను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాము. మనకు బాబా ద్యానము ఎన్నోరెట్లు వృద్దిపొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యం, మోక్షము మన వశమవును. సాయి బంధువులారా! కోరికలను అర్థం చేసు కుందాము.వాటి అవసరం మనకు ఎంతవరకు ఉందో తెలుసుకుందాము. మనకు అక్కరలేని వాటి కోసం పరుగులు ఆపేద్దాం. మన దృష్టిని సాయి వైపు మరల్చుదాము. సాయి అను గ్రహాన్ని పొంది, మామిడి పూతలాగ రాలిపోకుండా ఆయన బాటలో నడుద్దాం. Source :- saiarathi.blogspot.com

+10 प्रतिक्रिया 1 कॉमेंट्स • 11 शेयर

‘పద్మవ్యూహం’ రహస్యం ఏంటి 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 పద్మవ్యూహం శత్రు దుర్భేద్యం. అతిరథ మహారథులకే అంతుపట్టని రహస్యం. లోపలికి వెళ్ళిన కొద్దీ చావును దరికి చేర్చే మృత్యుబిలం. వలయాకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని ‘చక్రవ్యూహం’ అని కూడా వ్యవహరిస్తారు. ఏడు వలయాల్లో రథ, గజ, తురగ, పదాతి సైన్యాలతో శత్రు దుర్భేద్యమైనది పద్మవ్యూహం. అసలు ఏంటీ పద్మవ్యూహం? దాని గురించి అభిమన్యుడికి ఎలా తెలుసు? కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ఎలా వెళ్ళాడు? ఎందుకు తిరిగి రాలేకపోయాడు? ద్రోణుడికి అవమానం భీష్ముడి తర్వాత కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడిగా ద్రోణాచార్యుడు నియమితుడయ్యాడు. ఆపై రెండు రోజులు యుద్ధం జరిగినా ధర్మరాజును బంధించలేకపోయారంటూ దుర్యోధనుడు హేళనగా మాట్లాడాడు. దీనికి సిగ్గుపడి ‘నేను ఈరోజు గొప్ప వ్యూహాన్ని నిర్మిస్తాను. అది దేవతలు కూడా భేదించలేనిది. మహావీరుడైతే తప్ప దాన్ని భేదించటానికి ప్రయత్నించలేడు’ అని ద్రోణుడు ప్రకటించాడు. అదే పద్మవ్యూహం. పద్మవ్యూహం నిర్మాణం ఇలా.. కౌరవ సేనలను తామరపువ్వు ఆకారంలో నిలిపాడు ద్రోణుడు. వివిధ దేశాధిపతులు తామరపువ్వులోని రేకుల మాదిరి నిలిచారు. వారి కుమారులు పువ్వు మధ్యభాగంలో కేసరిలా నిలబడ్డారు. కర్ణుడు, దుశ్శాసనుడు సేనలతో కలిసి పద్మం లోపలి భాగాన, వారి మధ్య దుర్యోధనుడూ ససైన్యంగా నిలిచారు. సైంధవుడూ, అశ్వత్థామా, కృపాచార్యుడు, శకుని, కృతవర్మ, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, కౌరవులు, వారి కుమారులూ తమ స్థానాల్లో నిలిచారు. మహా వీరులైన పాండవుల్లో ఎవరికీ దానిలోకి ప్రవేశించటం సాధ్యం కాలేదు. (ఆ రోజు అర్జునుడిని సంశప్తకులు వ్యూహాత్మకంగా యుద్ధభూమికి దక్షిణంగా తీసుపోయారు) లోపలికి వెళ్లడం వారికి మాత్రమే తెలుసు దిక్కుతోచని పరిస్థితిలో ధర్మరాజుకు అభిమన్యుడుని పంపక తప్పలేదు. ‘కుమార అభిమన్యా..! ఈ పద్మవ్యూహంలో చొరబడటం నీకూ, నీ తండ్రి అర్జునుడూ, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడుకి మాత్రమే తెలుసు. మనల్ని చూసి నీ తండ్రి హేళన చేయకుండా ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించు’ అని కోరాడు. అభిమన్యుడు సమరోత్సాహంతో ‘నా తండ్రి నాకీ వ్యూహాన్ని ఛేదించే లోపల ప్రవేశించడం వరకూ చెప్పాడు. అలా ప్రవేశించి కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతాను’ అన్నాడు. ‘ఆ మాత్రం చాలు కుమారా! నువ్వు దారి చూపి పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తే, నీ వెనువెంటనే మేమంతా లోపలికి ప్రవేశిస్తాం’ అని సంతోషంగా ధర్మరాజు అన్నాడు. పక్కనే ఉన్న భీముడు కూడా ‘కుమారా! నువ్వు వూహ్యాన్ని ఛేదిస్తే చాలు. నీ వెంటనే నేనూ, దృష్టద్యుమ్నుడూ, ద్రుపదుడూ, సాత్యకీ, విరాటుడూ పద్మవ్యూహంలోకి ప్రవేశించి శత్రు సేనలను మట్టుపెడతాం’ అని భరోసా ఇచ్చాడు. ‘పద్మవ్యూహం రచించిన ద్రోణుడు మెచ్చుకునేలా వ్యూహంలోకి ప్రవేశించి శత్రు నిర్మూలనం చేస్తాను. అందరూ ప్రశంసించేలా రణరంగంలో వీర విహారం చేస్తాను’ అని సంకల్పం చెప్పిన అభిమన్యుడు అన్నంత పనీ చేశాడు. వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గం తెలియకపోయినా ఏ మాత్రం జంకలేదు. తన సారథి సుమిత్రుణ్ణి ద్రోణుడి వైపు రథం పోనివ్వమన్నాడు. మండే అగ్నిగోళంలా పద్మవ్యూహంలోకి.. అప్పుడు సుమిత్రుడు అభిమన్యుణ్ని మరోసారి ఆలోచించుకోమంటూ ఇలా హితవు పలికాడు. ‘నువ్వు బాలుడివి. నీ ఎదుట ఉన్నది ద్రోణుని సైన్యం. వారు అతిరథ మహారథులు. అత్యంత క్రూరాత్ములు. నీ చేతిలో మరణించేవారు కాదు’ అని అన్నాడు. సారథి సందేహాలను కొట్టి పారేసి మెరుపు వేగంతో మండే అగ్నిగోళంలా పద్మవ్యూహంలోకి చొచ్చుకుని పోయాడు అభిమన్యుడు. కౌరవ సేనలను కత్తికో కండగా నరకడం మొదలు పెట్టాడు. అతడి ధాటికి కురు సేన కకావికలమైంది. పద్మవ్యూహం చెల్లా చెదురైంది. కర్ణుడి కవచాన్ని పగలగొట్టాడు. బాణాల దెబ్బతో మూర్ఛిల్లపోయేలా చేశాడు. శల్యుణ్ణీ, దుశ్యాసనుణ్ణీ కూడా స్పృహ తప్పేలా చేశాడు. మరోవైపు అభిమన్యునికి సాయం చేసేందుకు పాండవులు అతడి వెంట పద్మవ్యూహంలోకి ప్రవేశించారు. అప్పుడు వారికి కౌరవుల బావమరిది జయద్రధుడు (సైంధవుడు) అడ్డు తగిలాడు. ఒక్క అర్జునుని తప్ప మిగతా పాండవులను ఒక్కరోజు మాత్రం నిలువరించే వరాన్ని పరమేశ్వరుడి నుంచి పొందాడు సైంధవుడు. దాంతో అతడి అస్త్రాల ధాటికి తట్టుకోలేక పాండవ సైన్యం పలాయనం చిత్తగించింది. మరోవైపు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయి దుర్యోధనుణ్ణే పారిపోయేలా చేశాడు. అతడి కొడుకైన లక్ష్మణ కుమారుడినీ, కోసల దేశాధీశుడైన బృహద్బలుణ్ణీ సంహరించాడు. యోధులపరంగా వ్యూహపరంగా బలమైన కౌరవ సేనలను ఎదుర్కోవటం కష్టమనే భావనను పటాపంచలు చేశాడు. అందరూ ఒక్కటై.. మోసం చేసి.. యుద్ధంలో వీర విహారం చేస్తున్నఅభిమన్యుడిని కపటోపాయంతో తప్ప మరో విధంగా నిలువరించలేమని ద్రోణుడు చెప్పగా, కౌరవ యోధులు యుద్ధనీతికి వ్యతిరేకంగా అభిమన్యుడిపై ఒక్కుమ్మడిగా దాడి చేశారు. నిరాయుధుణ్ణీ, విరథుణ్ణీ చేశారు. బాణ వర్షం కురపించారు. అప్పుడు అభిమన్యుడు రథంలోని చక్రాయుధాన్ని తీసుకుని గిరగిరా తిప్పుతూ సింహనాదం చేస్తూ యుద్ధం చేశాడు. అన్ని వైపుల నుంచీ చుట్టు ముట్టి ఆ ఆయుధాన్నీ ముక్కలు చేయగా, గదాయుధంతో పోరు సాగించాడు. అప్పటికే ఒంటరి పోరుతో అలసిపోయాడు. ఇంతలో దుశ్శాసనుని కుమారుడు అతడిని ఎదుర్కొన్నాడు. వారిద్దరికీ ఘోర సమరం జరిగింది. ఇద్దరి శరీరాల నుంచి రక్తం ధారలు కట్టింది. ఇద్దరూ తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచారు. ముల్లోకాలను వెలిగించే సూర్యుడు అస్తమించినట్లైంది. అడవిని బూడిద చేసిన దావాగ్ని ఆరిపోయింది. మహాసముద్రం ఇంకిపోయింది. విగత జీవుడైనప్పటికీ అభిమన్యుడిపై కౌరవులకు ఇంకా కసి తీరలేదు. వారంతా కలిసి అతడి శరీరాన్ని నిర్దయగా పొడిచి పొడిచి క్రూరంగా వ్యవహరించారు. అభిమన్యుడి మరణవార్త విని దుర్యోధనుడు తెగ సంబరపడిపోయాడట. ఇది చూసిన యుయుత్సుడు దుర్యోధనుడిపై మండిపడుతూ ‘ఏం చూసుకుని ఆనంద పడుతున్నావు. ఒక బాలుడిని, అదీ కుట్ర చేసి చంపడం మీ విజయమా’ అని ప్రశ్నించాడట. అభిమన్యుడికి ఎలా తెలుసు? యుద్ధవ్యూహాల్లో ఎంతో ప్రత్యేకత ఉన్న పద్మవ్యూహం పెద్ద రహస్యం, చిక్కుముడిగా ఉండిపోవటానికి కారణం దాన్ని భేదించే నైపుణ్యం కేవలం నలుగురికే తెలిసి ఉండటం. అందులో అర్జునుడు కూడా ఒకడు. పద్మవ్యూహంలో ప్రవేశించటం గురించి అభిమన్యుడి తల్లి, కృష్ణుడి సోదరి సుభద్ర తన భర్త అర్జునుడిని అడిగింది. అప్పటికి అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నాడు. పద్మవ్యూహం గురించి అర్జునుడు చెబుతుండగా, సుభద్ర ‘ఊ కొడుతూ’ నిద్రపోయింది. అయితే, ఆ తర్వాత నుంచి సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు ‘ఊ కొట్టడం’ మొదలు పెట్టాడు. అది గమనించని అర్జునుడు పద్మవ్యూహాంలోకి ఎలా వెళ్లాలో చెప్పేశాడు. ఏడు వలయాల్లో రథ, గజ, తురగ, పదాతి సైన్యాలతో శత్రుదుర్భేద్యమైనది పద్మవ్యూహాన్ని గజ వధ ద్వారా లోపలికి వెళ్లాలని అర్జునుడు రహస్యం చెప్పాడు. అయితే, సుభద్ర నిద్రపోవటం గమనించిన అర్జునుడు చెప్పడం మానేశాడట. ఇతిహాసమైనా ఇప్పటికీ ఎన్నో రూపాల్లో.. ఎవరైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు ‘పద్మవ్యూహంలో చిక్కుకుపోయాడు’ అంటారు. అదేవిధంగా, ఎవరినైనా తమ తెలివితేటలతో ఆధీనులుగా చేసుకున్నా, ‘నా పద్మవ్యూహంలో చిక్కాడు’ అంటూ సామెతగా వాడతారు. తెలుగులోనూ మహాభారత కథతో తెరకెక్కిన చిత్రాల్లో అభిమన్యుడి వీర, పరాక్రమాలను మనం చూశాం. తెలుగులో 1926లో ప్రచురించిన ‘పద్మవ్యూహాము’ అనే నాటక పుస్తకంలో పద్మవ్యూహం చిత్ర రూపంలో కనిపిస్తుంది. దీనిని సోమరాజు రామానుజరావు రాశారు. కర్ణాటకలోని హలిబేడు హోయసలేశ్వర దేవాలయం(12వ శతాబ్ది)లో అభిమన్యుడు పద్మవ్యూహంలో అడుగుపెడుతున్న దృశ్యాన్ని శిల్పరూపంలో చెక్కి శాశ్వతత్వం కల్పించారు.

+11 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

మంచినీ, సంకల్పాన్నీ తట్టిలేపే కథ!"🙏 ఒకానొక చిన్న పల్లెటూరు. అందులో చాలా పేరుగాంచిన జ్యోతిష పండితుడు నివసించేవాడు. ఆయన చెప్పిన మాట పొల్లుపోదనీ చెప్పిన జ్యోస్యం తప్పుకాదనీ ఆ ఊరి ప్రజల విశ్వాసం. ఆ నోటా ఈ నోటా విన్న ఓ పేదరైతు పక్కనున్న గ్రామం నుంచి జ్యోతిషుని దగ్గరకు వచ్చి తనకు జోస్యం చెప్పమని తన జాతకాన్ని అతనికి ఇస్తాడు. తనపై నమ్మకముంచి వచ్చినందుకు ఆ పేదరైతును కూర్చోమని సైగచేసి అతని జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తాడు. ఎటువంటి జాతకాలను చూసినా చలించని ఆ జ్యోతిషుడు పేదరైతు జాతకం చూస్తూనే కంగారు పడతాడు. ఎందుకంటే ఆ జాతకం ప్రకారం పేదరైతుకు ఆనాటి రాత్రి ప్రాణ గండం కనిపించడం వల్లనే! ఎంతటి నిజాన్నైనా చెప్పగలను కానీ రైతుతో సూటిగా ‘నీకు ప్రాణగండం ఉందని’ ఎలా చెప్పనని చింతించి ఎలాగోలా తనను తాను తమాయించుకొని రైతుకు ఏమాత్రం సందేహం రాకుండా ‘ఇవాళ నాకు చాలా పనిఉంది. మీ జాతకం నా దగ్గరే ఉంచి వెళ్ళండి. రేపు మీరు మళ్ళీ రాగలిగితే నేను నిశితంగా పరిశీలించి చెబుతాను’ అని అంటాడు. జ్యోతిషునిపై మర్యాదతో ఆ పేదరైతు సరేనని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు. రైతు వెళ్ళగానే జ్యోతిషుడు తన భార్యతో ఈ విషయం చెబుతాడు. కానీ మనసులో ‘పాపం పేదరైతు నేడు మరణిస్తాడే. నేను రేపు రమ్మన్నాననే తలంపుతో వెళ్ళిపోయాడే’నని చింతిస్తాడు జ్యోతిషుడు. పేదరైతు జ్యోతిషుని ఇంటినుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళుతున్నాడు. దారిలోనే చీకటి పడటంతో తలదాచుకోవడానికి స్థలాన్ని వెదకడం మొదలుపెట్టాడు. ఇంతలో కుండపోతగా వర్షం కురవసాగింది. కాస్త దూరంలో శిథిలావస్థలో శివుని ఆలయం కనిపించిందతనికి. అక్కడికి చేరుకొని ఆలయం ముందున్న మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూసి ఎంతో బాధపడ్డాడు. ప్రజలకు మనఃశ్శాంతినీ, భక్తి భావాలనూ పెంపొందించే ఆలయం నేడు ఈ దుస్థితికి చేరిందే. నా దగ్గర డబ్బుండుంటే నేను ఈ శివాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని చేసేవాణ్ణని మనసులో అనుకుంటాడు. మానసికంగానే ఎలా గోపురాన్ని నిర్మించాలి. రాజగోపురం ఎంత ఎత్తుగా ఉండాలి. మండపాలు ఎలాకడితే బాగుంటుంది. అలా పూర్తిగా కట్టబడిన శివాలయంలో అభిషేకాలూ, పూజలూ నిర్విఘ్నంగా జరుగుతుంటే ఎంత బాగుంటుందనీ శివుని ఆన ఉంటే తప్పక అది జరుగుతుందనీ అనుకుంటుండగానే మండపం పైభాగంలోంచి నల్లని త్రాచుపాము అతనిని కాటు వేయడానికి అతనిపై దూకపోతుంటే తప్పించుకొని ఆ ఆలయం నుండి బయటకు వచ్చేస్తాడు. మండపంతో సహా ఆ పాడుబడిన గుడి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అమ్మయ్య! బతికి పోయాననుకొని ఇంటికి చేరుకుంటాడా పేదరైతు. మరునాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవాలనుకొని జ్యోతిషుని దగ్గరకు వెళతాడు పేదరైతు. అతణ్ని చూసి ఆశ్చర్యపోయిన జ్యోతిషుడు నా గణనలో తప్పు జరిగి ఉంటుందని చాలా శాస్ర్తాలను తిరగేసి మళ్ళీ మళ్ళీ అతని జాతకాన్ని పరిశీలిస్తాడు. కానీ గణింపులో ఎక్కడా తేడాలేదు. అంతా సరిగ్గానే ఉంది. ఇక తప్పదన్నట్లు విషయం పేదరైతుకు వివరించి జ్యోతిషుడు నిన్న ఏం జరిగిందో ఏదీ మర్చిపోక తెలియజేయమని రైతుకు చెబుతాడు. జరిగిందంతా వివరిస్తాడు పేదరైతు. మంచి చేయాలనే కేవలం తలంపు మాత్రంగా అనుకున్నందుకే ఇంత గొప్ప ఫలితం చేకూరితే మనకు చేతనైనంత మంచి చేస్తే ఎటువంటి జీవితం లభిస్తుందో రైతుకు జరిగిన సంఘటనే నిదర్శనం! మనం బాగుండాలంటే మన ఆలోచనలు బాగుండాలి. మన ఆలోచనలు సత్సంకల్పాలయితే మన చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుంటే అందులోని మనం కూడా బాగుంటాం! అందుకే...... అందరూ బాగుండాలి - ! ...అందులో మనముండాలి 🙏 ఏడుకొండలవాడ అందరిని చల్లగా చూడు తండ్రి 🙏

+21 प्रतिक्रिया 2 कॉमेंट्स • 4 शेयर

+15 प्रतिक्रिया 1 कॉमेंट्स • 3 शेयर

మన ఇంద్రకీలాద్రిలో రేపు సరస్వతి రూపంలో దసరా సందర్భంగా వచ్చే మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవిని పూజించుకోడం సంప్రదాయం. చదువుల తల్లిగా, వాక్కుని నియంత్రించే వాగ్దేవిగా, బుద్ధిని వికసింపచేసే శక్తిగా సరస్వతీ అమ్మవారి ప్రాధాన్యత అంతాఇంతా కాదు. బాసర వంటి పుణ్యక్షేత్రం వెలసిన తెలుగునాట ‘సరస్వతీ నమస్తుభ్యం’ అంటూ ఆ తల్లిని ఆర్తిగా ప్రార్థించని హిందువు ఉండడు. ‘యా కుందేందు తుషార హార..’ అంటూ ఆ తల్లిని వర్ణించే శ్లోకాలని నిత్యం వింటూ ఉంటాము కదా! మరి ఆ రూపం వెనుక ఉన్న మర్మం ఏమిటో... పేరులోనే పెన్నిధి సరస్వతి అంటే ప్రవహించేది (నీరు కలిగినది) అన్న అర్థం ఉంది. వేదకాలంలో సరస్వతీ అనే నది ఉన్నదనీ, అది ఇప్పుడు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉన్నదని మనకు తెలిసిందే! ఆర్యులు తమ తొలి రోజులలో సరస్వతీ నదీ తీరానే నివసించారన్న వాదనలూ ఉన్నాయి. ఆ వాదనలకు బలాన్ని చేకూరుస్తూ రుగ్వేదంలో సరస్వతి నది ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. అలా తమకు జీవితాన్ని అందించిన నదీమతల్లిని జ్ఞానానికి కూడా ప్రతిరూపంగా భావించడంలో ఆశ్చర్యం ఏముంది. ‘ప్రవహించేది’ అన్న ఈ పేరు జ్ఞానానికి కూడా వర్తిస్తుంది. పైగా సరస్వతి అన్న పేరుకి ‘తన గురించి ఎరుకను కలిగించేది’ (సార, స్వ) అన్న తీరులో కూడా కొందరు అన్వయిస్తూ ఉంటారు. జ్ఞానానికి ఉండాల్సిన లక్ష్యం... తన గురించి తాను తెలుసుకోవడమే కదా! పుస్తకం అమ్మవారు నాలుగు చేతులలతో ఉన్న చిత్రాలు మనకి కనిపిస్తుంటాయి. ఆమె చేతులలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయుధం లేకపోవడం విశేషం. అమ్మవారు ఒక చేతిలో పుస్తకాన్ని ధరించి ఉంటారు. లౌకికమైన చదువులలో ముందుకు సాగేందుకు తగిన ధారణని అందిస్తానన్న అభయాన్ని అందిస్తుంటారు. వీణ చదువంటే కేవలం పుస్తక జ్ఞానమే కాదు కదా! జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ఏదో ఒక కళలో ప్రావీణ్యత ఉండాల్సిందే. అలా చదువులకే కాదు కళలకు కూడా తల్లి అని సరస్వతీ దేవి చేతిలో ఉండే వీణ గుర్తుచేస్తూ ఉంటుంది. వీణలో ఉండే ఏడు తంతులతో సప్తస్వరాలనూ పలికించవచ్చు. జీవితాన్ని పరిపూర్ణంగా గడపాలనీ, లయబద్ధంగా సాగిపోవాలనే సూచనను వీణ మనకు అందిస్తుంది. అక్షమాల పుస్తకాలు చదువుకోవడం, ఏదో ఒక కళలో ప్రావీణ్యత సంపాదించడం మంచిదే. మరి ఆధ్మాత్మిక సాధనో! ఏ పని చేస్తున్నా, ఏ లక్ష్యాన్ని ఛేదిస్తున్నా... మనసులో భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసం ఉండాలన్నది పెద్దల మాట కదా! నిరంతరం సాగే ఆ స్మరణకు చిహ్నమే అమ్మవారి చేతిలో ఉన్న జపమాల. కమలము సరస్వతీ అమ్మవారు కమలం మీద కూర్చుని ఉన్నట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. కమలం వికాసానికి, పవిత్రతకూ చిహ్నం. పాంపపంకిలమైన సంసారంలో ఉంటూ కూడా తనదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలనే తపనకు సూచన. జాగృతమైన కుండలినీ శక్తికి సైతం కమలం ప్రతిరూపం. అంటే చదువు, కళలు, భక్తి ఉంటే సరిపోదు... అందమైన వ్యక్తిత్వం కూడా ఉండాలని కమలం సూచిస్తోందన్నమాట. హంస హంస నీటినీ పాలనీ విడిస్తుందని పురాణకథలు చెబుతూ ఉంటాయి. ఇలాంటి హంసలు హిమాలయాల్లో ఉంటాయని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు. ఆ నమ్మకం సంగతి అలా ఉంచిదే లోకంలో మంచినీ చెడునీ విడిదీసే విచక్షణకు ప్రతీకగా ఈ హంసను పేర్కొంటూ ఉంటారు. అందుకనే ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చెందిన వ్యక్తిని పరమహంసగా సంబోధిస్తారు. నెమలి కొన్ని సందర్భాలలో హంసతో పాటుగా నెమలిని కూడా సరస్వతీదేవి వాహనంగా పేర్కొంటూ ఉంటారు. నెమలి మామూలు సందర్భాలలో ఒద్దికగా కనిపిస్తూనే తగిన వాతావరణం వచ్చినప్పుడు పురివిప్పి ఆడుతుంది. జ్ఞానాన్ని కలిగి ఉండటం ఎంత ముఖ్యమో.. దానిని ఆర్భాటం కోసం కాకుండా, అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలనే సూచన నెమలి అందిస్తోంది. పురివిప్పిన జ్ఞానానికి చిహ్నంగా నిలుస్తోంది. ధవళ వస్త్రాలు సరస్వతీ దేవి తెల్లటి వస్త్రాలను ధరించడమే కాదు... ఆమె చుట్టూ ఉన్న కమలము, హంస, పూలదండ, అక్షమాల వంటివి కూడా తెల్లటి రూపంలోనే ఉంటాయి. తెలుపు స్వచ్ఛతకు చిహ్నం. అంతేకాదు! దూది నుంచి లభించే వస్త్రం ఎప్పుడూ తెల్లగానే ఉంటుంది. దానికి రంగు వేయడంతోనే దాని సహజత్వాన్ని కోల్పోతుంది. ఎలాంటి ప్రలోభానికీ లొంగకుండా... రాజీలేని జీవితాన్నీ, మచ్చలేని వ్యక్తిత్వాన్ని కలిగి ఉండమని ధవళ వస్త్రాలు సూచిస్తున్నాయి. ప్రవహించే నీరు సరస్వతీదేవి పక్కన ఎప్పుడూ ప్రవహిస్తున్న నీరు కనిపిస్తూ ఉంటుంది. ప్రవాహం అభ్యున్నతికి చిహ్నం. ప్రవాహం మార్పుకి సూచని. ఎంత చదువు, విచక్షణ, వ్యక్తిత్వం ఉన్నా అది తనలోనే నిలిచిపోతే మనిషి బురదగుంటలా మారిపోతాడు. పదిమందికీ ఉపయోగపడి, లోకానికి ఆదర్శంగా నిలిచిన రోజునే అతని జీవితం సార్థకమవుతుంది. ప్రవహించే నీటిలా ఉరకలు వేసే సంతోషంలో గడుపుతూ, తన చుట్టుపక్కల వారి ఆర్తిని తీరుస్తూ జీవితాన్ని గడపమంటూ ఈ ప్రవాహం సూచిస్తోంది.

+23 प्रतिक्रिया 0 कॉमेंट्स • 9 शेयर