*_రేపు వరూధినీ ఏకాదశి_* 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *వరూధినీ ఏకాదశి రోజు స్త్రీలు మాంగల్య బలాన్ని , పురుషులు ధన సంపదలనూ పొందటానికి పాటించవలసిన నియమములు ఏమిటి ?* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ చైత్ర మాసం లో కృష్ణ పక్ష ఏకాదశినాడు వరూధినీ ఏకాదశిని జరుపుకుంటారు. ఈ వ్రతం ఉత్తర భారత దేశంలో ఎక్కువగా ప్రచారంలో ఉంది. వరూధినీ ఏకాదశి మహిమ భవిష్యోత్తర పురాణం లో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వరూధినీ ఏకాదశి వ్రత మహిమను గురించి చెబుతాడు. *‘ధర్మరాజా వరూధినీ ఏకాదశి వ్రతం* పాటించడం వలన స్త్రీలు మాంగల్య బలాన్ని పొందుతారు. పురుషులు సత్ప్రవర్తననూ , సంఘం లో గౌరవాన్నీ , ధన సంపదలనూ పొందుతారు. అంతే కాదు వరూధినీ ఏకాదశి వ్రతం ఆచరించడం పదివేల సంవత్సరాలు తపస్సు చేయడం తో సమానమైనది. సూర్య గ్రహణ సమయం లో సువర్ణదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. మాంధాత వరూధినీ ఏకాదశిని పాటించడం వలనే కష్టాలనుండీ బయటపడ్డాడు. ‘ అని స్వయంగా కృష్ణ భగవానుడే వరూధిని ఏకాదశి మహిమను కొనియాడాడు. ఏకాదశి రోజున ఉపవసించి , దైవదర్శనం చేసుకుని జాగరణను పాటించేవారు ఇహలోకం లో సకల శుభాలనూ పొందగలరు. వారికి పరలోకం లోనూ సద్గతులు సంప్రాప్తిస్తాయి. వరూధినీ ఏకాదశి రోజున కుంభమేళా స్నానం చేసిన వారికి విశేషఫలితాలు లభిస్తాయి. కుంభమేళా సమయం లో వచ్చే వరూధినీ ఏకాదశిని ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. *ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి.. ?* శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఏకాదశి రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానాన్ని ఆచరించి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయాలి. ఉపవాస దీక్షను పాటించాలి. ఏకాదశి రోజున హరినామ స్మరణం సకలపాప హరణం. అన్యమైన విషయాలలో మనస్సును చలించనీయక ఏకాగ్ర చిత్తం తో స్వామిని అర్చించాలి. ఉపవాస దీక్షలో పాలు పళ్ళు భుజించవచ్చు. ఆరోగ్యం సరిగా లేని వారు , చిన్న పిల్లలు వృద్ధులు ఉపవాసం చేయకపోయినా అపచారం కాదు. నేడు వైష్ణవాలయాలలో ఉత్తరద్వార దర్శనం చేసుకొని స్వామిని మనసారా ధ్యానించాలి. _*శ్రీ ధర్మశాస్తా ఫేస్ బుక్ గ్రూప్*_ https://www.facebook.com/groups/905812212874011/?ref=share _*అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి (ఫేస్ బుక్ గ్రూప్) (AP)*_ https://www.facebook.com/groups/246403766686776/?ref=share _*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్ - 1*_ https://chat.whatsapp.com/7xd0Q2jz2rK4bRTjHcShYG _*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్ - 2*_ https://chat.whatsapp.com/BuVOj6WkGGd6djbUZ3ze1o _*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్ - 3*_ https://chat.whatsapp.com/KBGIssR1z8k5njGZIiNRom _*వై.వెంకటసుబ్బారెడ్డి*_ 9849100044

0 कॉमेंट्स • 1 शेयर

_*శ్రీ దేవి భాగవతం - 283 వ అధ్యాయము*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *రుద్రాక్ష ప్రాశస్త్యము* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ *నారదు డిట్లనెను:* అనఘా ! రుద్రాక్షల కింత ప్రభావ ముండుటకును దానిని మహాత్ముల పూజించుటకును గల కారణమేమో తెలుపుము. నారాయణు డిట్లనియెనుః ఇదే ప్రశ్న మున్ను కుమారస్వామి శివపు నడిగెను. అపుడు శివుడు పల్కినపల్కులు వినిపింతును వినుము. ఈశ్వరు డిట్లనియెను: కుమారా! రుద్రాక్షమహిమ గూర్చి నీకు సంక్షేపముగ తెలుపుచున్నాను. చక్కగవినుము. తొల్లి త్రిపురాసురుడు దుర్జయుడై యుండెను. అతడు బ్రహ్మ- విష్ణువు మొదలుగాగల దేవతలను లెక్కచేయక వ్యవహరించెను. ఆ విషయము వారందఱు వచ్చినాతో తెలిపిరి. అపుడు నేను అఘోర మహాస్త్రమును లోక కల్యాణము కొఱకు తలంచితిని. అది సకల దేవమయము - మనోహరము- మహోజ్జ్వలము - ఘోరరూపము నైనది. అఘో రాస్త్రమును నేను త్రిపురవధకు దేవతల రక్షణకును సర్వ విఘ్నోపశాంతికిని స్మరించితిని. అపుడు నేను వేయి దివ్య వర్షములు కన్నులు మూసికొని యుంటిని. అంత నా కన్నులనుండి నీటి బిందువులు రాలెను. సేనాపతీ ! నా కన్నీటినుండి నా యానతి ప్రకారము మహారుద్రాక్ష వృక్షము లుద్బవించెను. అవి ముప్పది యెనిమిది భేదములుగనయ్యెను. నాకుడి నేత్రము నుండి ఎఱుపు పసుపు వర్ణముగల పండ్రెండు విధముల రుద్రాక్ష వృక్షము లుద్బవించెను. ఎడమ కంటినుండి తెల్లనివి పదారు విధములైనవి పుట్టెను. అగ్ని నేత్రమునుండి నల్లనివి పది విధములుగ నుద్బవించెను. తెల్ల రుద్రాక్షలు బ్రాహ్మణజాతివి. మిశ్రమము వైశ్యజాతివి. నల్లనివి శూద్రజాతివని తెలియవలయును. ఏకముఖము గల రుద్రాక్షసాక్షాత్తుగ శివుడే. అది బ్రహ్మహత్యా పాతకమును పాపును. రెండు ముఖములుగలది శివాశివుల స్వరూపము - అది సకల పాతకముల నడచివేయును. మూడు ముఖములు గలది అగ్నిరూపము. అది క్షణములో స్త్రీహత్యా దోషము దహించివేయగలదు. నాల్గు ముఖములు గలది బ్రహ్మరూపము. అది నరకహత్యాదోషము బాపగలదు. పంచముఖములు గలది కాలాగ్ని. తినరానివి తినుటవలన-పోరాని చోట్లకు పోవుటవలన గలుగు పాపములు నది తుడుచిపెట్టగలదు. ఈ పంచముఖ రుద్రాక్షదాల్చుట వలన సర్వపాపములును సమసిపోవును. ఆరు ముఖములు గలది షణ్ముఖుడు. దానిని కుడిచేతియందు ధరించవలయును. అటుల దాల్చిన నది బ్రహ్మహత్యాది పాతకములను పోకార్చును. సందేహింపరాదు. ఏడు ముఖములు గలది అనంగరూపమైనది. ఇది సౌభాగ్యవంతమైనది. దీనిని దాల్చుటవలన బంగారము దొంగలించిన పాపము తొలగును. పుత్రకా! అష్టముఖములుగలది సాక్షాత్తుగ వినాయకుడేసుమా! దీనిని దాల్చుటవలన అన్న-వస్త్ర-సువర్ణములకులోపము గలుగదు. కులముగాని స్త్రీని గురుపత్నిని తాకిన పాపముల ఇతర పాపముల మొత్తమును దీనిని దాల్చుటవలన నశించగలవు. అతనికి విఘ్నములు గలుగవు. అతడుతుదకు పరమపదమేగును. అష్టముఖరుద్రాక్ష దాల్చుట వలన నివన్నియును గల్గును. నవముఖములు గలది భైరవము. దీనినెడమ భుజమున దాల్చవలయును. అది భక్తి-ముక్తి గలిగించును. అది నాయంతబలము గలది. వేలు భ్రూణహత్యలు-నూఱు బ్రహ్మహత్యలును-నవముఖరుద్రాక్ష దాల్చుటవలన వెంటనే నశించగలవు. పదిముఖములు గలది సాక్షాత్తుగ దేవేశుడైన జనార్దనుడే. దీనిని దాల్చుటవలన గ్రహ-పిశాచ-బేతాళ-బ్రహ్మరాక్షస-పన్న గములవలని బాధలన్నియును తొలగిపోవను.పదునొకండు ముఖములుగల రుద్రాక్ష రుద్రుడే. దానిని తలపైదాల్చిన వాని పుణ్యఫలము వినుము. వేయి అశ్వమేధములు నూఱవాజపేయములు-పదివేల గోదానములు చేసినంద పుణ్యఫలితము. శీఘ్రముగ నేకాదశముఖ రుద్రాక్ష దాల్చుటవలన గల్గితీరును. పండ్రెండు ముఖముల రుద్రాక్షను చెవియందు దాల్చవలయును. దానివలన నిత్యము ద్వాదశాదిత్యులు ప్రసన్నులగుదురు. వానికశ్వమేధ-గోమేధములు చేసిన ఫలమబ్బును. వానికిపశువుల-శస్త్రముల-పులులవలన నెట్టి భయమును గలుగదు. అధివ్యాధులు గలుగవు. వాని కెట్టి భయమును వ్యాధియు గలుగదు. అతనికి ముమ్మాటికి భయములేదు. అతడు సఖి-ఈశ్వరుడేయగును. ఏనుగు-గుఱ్ఱము-జింక-కుక్క, -నక్క-పిల్యి-యెలుక-గాడిద-దుర్దురము మున్నగు జీవులను చంపినపానిము ద్వాదశముఖ రుద్రాక్ష దాల్చుటవలన తొలగును. అతడు పాపముక్తుడగును. సందేహములేదు. వత్సా! పదుడు ముఖముల రుద్రాక్ష లభించినచో అదికార్తికేయునితో సమము సకలార్దసాధనము. అతనికెల్లరసములు- రసాయనములును సిద్దించును. అతడెల్ల భోగ్యవస్తువులనుభవింపగలడు. సందేహము లేదు. ఎవ్వడు తలిదండ్రులను సోదరుని చంపునో వాడు దానిని దాల్చుటవలన పాపముక్తుడుగాగలడు. పుత్రా! షణ్ముఖా! పదునాల్గు ముఖముల రుద్రాక్ష లభించుట కష్టము. గొరకినచో దానినితలపై ధరించవలయును., అతడు శివస్వరూపు డగును. మునీ! మాటిమాటికి చెప్పనేల! అతడు దేవపూజ్యుడగును. పరమగతినందగలడు. ద్విజులొకే రుద్రాక్షను పరమభక్తితో తలపైదాల్చవలయును. ఇరువదారు రుద్రాక్షలుగల మాలికతలపై ఏబదిరుద్రాక్షలదిహృదయముపైపదారు రుద్రాక్షలది బాహువులందును పండ్రైండు రుద్రాక్షలది మణిబంధమందును దాల్చవలయును. షడాననా! నూటయెనిమిది రుద్రాక్షలమాలగాని-ఏబది రుద్రాక్షలమాలగాని-ఇరువదేడు రుద్రాక్షలమాలగాని ధరించిన లేక దానితో జపించినవాని కలంత ఫలములబ్బును. షణ్ముఖ! నూటయెనిమిది రుద్రాక్ష మాలదాల్చినవాడు క్షణక్షణ మశ్వమేధఫలితములందు గలడు. అతడిరువదొక్కతరముల వారినుద్దరించి శివలోకమందు ప్రతిష్ట గాంచగలడు. *ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమందలి ఏకాదశస్కంధమున నాలవయధ్యాయము.*

0 कॉमेंट्स • 0 शेयर

_*శ్రీ అగ్ని మహాపురాణం - 357 వ అధ్యాయం*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *ఉణాది సిద్ధ రూప నిరూపణ* 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 *కుమారస్వామి చెప్పెను.* ఇపుడు ధాతువు కంటే పరముగ వచ్చు ఉణాది ప్రత్యయములను గూర్చి చెప్పెదను. ఉణ్‌ - కారుః=శిల్పి జాయః. మాయః=పిత్తము. ట్లేగోమాయువు ఆయువు మొదలగునవి. ఉణాదులు బహుళముగ వచ్చును. ఆయుఃస్వాదువు హేతువు మొదలగునవి ఉణాది ప్రత్యయ సిద్ధములు. కింశారః=వరిముల్లు. కృకవాకుః=కోడి. గురుః=భర్త. మరుః శయివు=అజగరము. సరుః=ఆయుధము. స్వరుః=వజ్రము. త్రపు=సీసము. ఫల్గు=సారరహితము. క్రన్‌ ప్రత్యయము చేర్చగా గృధ్రః నిష్పన్న మగును. కిరచ్‌ - మందిరమ్‌ తిమిరమ్‌ (చీకటి). ఇలచ్‌ - సలిలమ్‌=(నీరు). బండిలమ్‌=కల్యాణము. క్వన్‌ప్రత్యయము చేర్చగా విద్వాన్‌=బుధుడు. శిబిరమ్‌=రహస్యమైన నివాస స్థానము. తున్‌ - హోతుః=పిల్లి. ఉణాదులు అభిధానమును బట్టి వచ్చుచుండును. కర్ణః=చెవి. మరియు కాముడు వాస్తు=గృహ భూమి జైవాతృక,=చంద్రుడు వహ - డిన్‌ - చేర్చగా అనడ్వాన్‌. జీవాతు=జీవన ఔషధము. వహ్‌ ధాతువునకు ని ప్రత్యయము చేర్చగా వహ్నిః. ఇనన్‌ - హరిణః=మృగము మరియు కాముకుడు. పాత్రము, కంబోజః=పాత్రము. సరండః=బాండము, చతుష్పదము. హేరండః=వృక్షము. వరండః=సామవేదము. స్ఫారం=అత్యధికము. క్రన్‌ పత్యయము చేర్చగా చీరము సిద్ధించును. వల్కలము; ఫారుః=పిరికివాడు. ప్రచండః=గురుడు. జవసమ్‌ = తృణము. జగత్‌=భూలోకము. కృశానుః=అగ్ని, సూర్యుడు. వర్వరః=కుటిలుడు, ధూర్తుడు. చత్వరమ్‌=చతుష్పదము. చీవరమ్‌=బిక్షువులుకప్పకొనువస్త్రము. మిత్రః=సూర్యుడు. పుత్రః=కుమారుడు. పితా=తండ్రి. వృదాకుః=వ్యాఘ్రము వృశ్చికము. గర్తః=గొయ్యి. భరతః=నటుడు. ఇంకను ఉణాదులున్నవి. *శ్రీ అగ్ని మహా పురాణమున ఉణాది సిద్ధ రూప నిరూపణ మను మూడు వందల యేబది ఏడవ అధ్యాయము సమాప్తము.*

0 कॉमेंट्स • 0 शेयर

_*శ్రీ శివ మహాపురాణం - 164 వ అధ్యాయం*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *గణేశుని వివాహము* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ *బ్రహ్మ ఇట్లు పలికెను -* ఇదే సమయములో విశ్వరూపుడనే ప్రజాపతి గణేశుని ప్రయత్నమును గురించి చక్కగా విచారించి ప్రసన్నమనస్కుడై సుఖమును పొందెను. విశ్వరూప ప్రజాపతికి దివ్యమగు రూపము గలవారు, శుభాకారము గలవారు, సర్వావయముల యందు సౌందర్యముగలవారు, సిద్ధి బుద్ధి అను పేర ప్రసిద్ధి చెందిన ఇద్దరు కుమార్తెలు గలరు. పార్వతీ పరమేశ్వరులు గణేశునకు వారిద్దరితో వావాహ మహోత్సవమును ఆనందముతో చేయించిరి. దేవతలందరు ఆనందముతో ఆ వివాహమునకు వచ్చిరి. పార్వతీ పరమేశ్వరుల మనోరథము ఈడేరెను. విశ్వరూపుడు ఆ వివాహమును చేసి ఆనందించెను. ఋషులు దేవతలు కూడ పరమానందమును పొందిరి. గణేశుడు కూడ వారిద్దరినీ పొంది ఆ కాలములో గొప్ప సుఖమును పొందెను. ఓ మహర్షీ! ఆ సుఖమును వర్ణించుట సంభవము కాదు. కొంత కాలము తరువాత మహాత్ముడగు గణేశునకు ఇద్దరు భర్యలయందు ఇద్దరు దివ్యపుత్రులు జన్మించిరి. సిద్ధి యను గణేశుని భార్యకు క్షేముడను కుమారుడు కలిగెను. బుద్ధికి పరమ సుందరుడైన లాభుడనే కుమారుడు కలిగెను. ఈ విధముగా గణేశుడు ఈహకు అందని సుఖము ననుభవించు చుండగా, రెండవ కుమారుడు భూమిని చుట్టి తిరిగి వచ్చెను. అంతలో మహాత్ముడగు నారదుడు అతని ఇంటికి వచ్చి ఇట్లు చెప్పెను : నేను సత్యమును చెప్పుచున్నాను. నేను మోసపు బుద్ధితో గాని, ఈర్ష్య వలన గాని అసత్యమును చెప్పుట లేదు. నీ తల్లి దండ్రులగు పార్వతీ పరమేశ్వరులు నీకు చేసిన దానిని లోకములో ఇతరులెవ్వరూ తమ పుత్రులకు చేయరు. నేను ముమ్మాటికీ సత్యమును చెప్పుచున్నాను. భూమిని చుట్టి వచ్చుట అను మిషను కల్పించి నిన్ను ప్రయత్న పూర్వకముగా బయటకు పంపి గణేశునకు మిక్కిలి శోభాకరము, శ్రేష్టము అగు వివాహము చేయబడెను. గణేశుడు విశ్వరూపప్రజాపతి యొక్క కుమార్తెలగు అతిశయించిన అందముగల ఇద్దరు కన్యలను ఆనందముతో వివాహమాడెను. అతనికి సుందరాంగనలగు ఆ ఇద్దరు పత్నులయందు ఇద్దరు పుత్రులు కలిగిరి. సిద్ధి అను నామెకు క్షేముడు, బుద్ధి అను నామెకు సర్వసుఖముల నిచ్చే లాభుడు కలిగిరి. ఈ గణేశుడు ఇద్ధరు భార్యమలయందు ఇద్దరు శుభపుత్రులను పొందినాడు. తల్లి దండ్రుల అంగీకారముతో నాతడు ఎడతెరపి లేని సుఖము ననుభవించుచున్నాడు. కుమారా! నీవు వారి మోసపూరితమగు ఆజ్ఞకు బద్ధుడవై సముద్రములతో అడవులతో కూడి యున్న భూమిని చుట్టి వచ్చితివి. దానికి లభించిన ఫలము ఇది. కుమారా! నీవు ఆలోచింపుము. వ్యక్తికి ప్రభులగు తల్లిదండ్రులే మోసమును చేసినచో, ఇతరులు కూడ మోసమును ఎట్లు చేయకుందురు? నీ తల్లి దండ్రులు చేసిన పని యోగ్యముగా లేదు. నీవు కూడ ఆలోచించుము. నా మనస్సునకు వారు చేసిన పని శుభకరమని తోచలేదు. తల్లి విషమునిచ్చినచో, తండ్రి అమ్మివేసినచో, రాజు సర్వస్వమును అపహరించినచో, ఎవనికి ఏమి చెప్పవలెను? కుమారా! ఎవరైతే ఇట్టి గొప్ప అనర్ధమును కలిగించే కర్మను చేయుదురో, అట్టి వారి ముఖమును శాంతిని గోరు బుద్ధిశాలి చూడకుండుట మేలు. వేదశాస్త్రములు, మరియు స్మృతులు ఇట్టి నీతిని దృఢముగా బోధించు చున్నవి. ఆ నీతిని నేను నీకు విన్నవించితిని. నీకు నచ్చిన రీతిని ఆచరింపుము. *బ్రహ్మ ఇట్లు పలికెను -* ఓ నారదా! మహేశ్వరుని మనస్సులో ధ్యానించే నీవు ఆ కుమారునితో ఈ వాక్యమును పలికి మౌనమును వహించితివి. కోపమనే అగ్నితో మండిపడుచున్న స్కందుడు తండ్రికి నమస్కరించి, తల్లిదండ్రులు వారించిననూ వినక, క్రౌంచపర్వతమునకు వెళ్లెను. 'నీవు ఇపుడు ఎట్లు వెళ్లెదవు?' అని వారించి నిషేధించిననూ ఆతడు 'కుదరదు' అని బదులిడి వెళ్లిపోయెను. తల్లిదండ్రులారా! నేను ఇచట క్షణకాలమైననూ ఉండరాదు. ఏలయన, మీరు ప్రేమను ప్రక్కన బెట్టి నా యందు కపటమును చేసితిరి. ఓ మునీ! ఇట్లు పలికి ఆతడు అచటకు వెళ్లెను. ఇప్పటికినీ అచటనే యున్నాడు. ఆయన దర్శన మాత్రముచే సర్వమానవుల పాపములను పోగొట్టును. ఓ దేవర్షీ! ఆ దినమునుండి శివపుత్రుడగు కార్తికేయుని బ్రహ్మ చర్యము స్థిరముగా నుండెను. కార్తికేయుని నామము ముల్లోకములలో ప్రసిద్ధమైనది. ఆ శ్రేష్ఠ పవిత్ర నామము సర్వపాపములను పోగొట్టి బ్రహ్మచర్యమునిచ్చును. ప్రతి సంవత్సరములో కార్తీక మాసము నందు దేవతలు, శిష్యులతో గూడి ఋషులు, మరియు మునిశ్రేష్ఠులు కుమారుని దర్శనముకొరకు వెళ్లు చుందురు. ఎవడైతే కార్తీక మాసములో కృత్తికానక్షత్రమునాడు కుమారస్వామిని దర్శించునో, వాని పాపములన్నియు భస్మమై, మనస్సులో కోరిన ఫలములు లభించును. స్కందుడు దూరమగుటచే దుఃఖమును పొందిన ఉమాదేవి కూడా దీనురాలై శివునితో 'ప్రభూ! నన్ను అచటకు తీసుకొని వెళ్లుడు' అని పలికెను. ఆమె సుఖము కొరకు శంభుడు ఆమెతో గూడి స్వయముగా ఆ పర్వతమునకు వెళ్లి మల్లికార్జునుడు అను పేర అచట జ్యోతిర్లింగమై వెలసి జనులకు సుఖములనిచ్చు చున్నాడు. ఈనాటికీ శివుడు పార్వతితో గూడి అచట దర్శనమిస్తూ, తన భక్తులందరి కోర్కెలనీడేర్చుచూ సత్పురుషులకు శరణమై ఉన్నాడు. పార్వతీ పరమేశ్వరులు వచ్చి నారని తెలిసిన ఆ కుమారస్వామి విరక్తుడై మరియొక చోటకు పోవుటకు సంసిద్ధుడాయెను. దేవతలు, మునులు ప్రార్థించగా ఆతడు కూడా మూడు యోజనముల దూరమును విడచి అచటనే ఉండెను. ఇట్లు అదే స్థానములో కార్తికుడు కూడ ఉన్నాడు. పార్వతీ పరమేశ్వరులు పుత్ర స్నేహముచే ఆర్ద్రమైన హృదయము గల వారై ప్రతి పర్వమునందు కుమారస్వామిని చూచుటకు అచటికి వెళ్లు చుందురు. ఓ నారదా! అమావాస్య నాడు శంభుడు, పూర్ణిమనాడు పార్వతి తప్పని సరిగా అచటకు స్వయముగా వెళ్లుచుందురు. ఓ మహర్షీ! నీవు ప్రశ్నించిన విధముగా నేను కార్తీక గణశుల పరమ పవిత్ర గాథను వివరించితిని. ఈ గాథను వినిన బుద్ధిమంతుడగు మానవుడు పాపములన్నిటి నుండియూ విముక్తుడై తాను కోరుకునే శుభకామనలనన్నింటినీ పొందగలడు. ఎవరైతే ఈ గాథను పఠించెదరో, పఠింపజేసెదరో, వినెదరో, వినిపించెదరో వారు కోర్కెలనన్నిటినీ పొందెదరనుటలో సందేహము లేదు. బ్రహ్మణుడు బ్రహ్మతేజస్సును. క్షత్రియుడు విజయమును, వైశ్యుడు ధనసమృద్ధిని పొందెదరు. శ్రూద్రుడు సత్పురుషులతో సమానుడగును. రోగి ఆరోగ్యవంతుడగును. భయపడినవాడు భయవిముక్తుడగును. అట్టి మానవుడు భూతప్రేతాది బాధలచే పీడింపబడడు. ఈ గాథ పుణ్యమును, కీర్తిని, సుఖమును, ఆయుర్దాయమును వర్ధిల్ల జేయును. సాటిలేని ఈ గాథ పుత్ర పౌత్రాదులనిచ్చి స్వర్గప్రాప్తిని కలిగించును. ఈ గాథ ముక్తిని ఇచ్చును. శ్రేష్ఠ మగు శివ జ్ఞానము నిచ్చును. పార్వతీ పరమేశ్వరులకు ప్రీతికరమగు ఈ గాథ శివభక్తిని వర్థిల్ల జేయును. భక్తులు, మరియు కామనలు లేని ముముక్షువులు ఈ గాథను సర్వదా వినవలెను. సదాశివ స్వరూపము, మంగళకరమునగు ఈ గాథ శివాద్వైతము నిచ్చును. *శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు కుమారఖండలోగణశ వివాహము అనే ఇరువదియవ అధ్యాయము ముగిసినది.* *కుమార ఖండము ముగిసినది.* *ఓం నమశ్శివాయ*

0 कॉमेंट्स • 0 शेयर

_*శ్రీ అగ్ని మహాపురాణం - 356 వ అధ్యాయం*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *తద్ధిత నిరూపణ* 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 *స్కందుడు చెప్పెను.* ఇపుడు త్రివిధ తద్ధితను చప్పెదను. సామాన్య తద్ధిత వృత్తి ఈ విధముగా నుండును. ''లచ్‌'' ప్రత్యయము చేర్చగా ''హంసలః'', ''వత్సలః'' మొదలగునవి సిద్ధించును. ''ఇలచ్‌'' ఫేనిలం ''శ'' - లోమశః ''న'' - పామనః. ''ఇలచ్‌'' - పిచ్ఛిలమ్‌. ''అణ్‌'' - పాజ్ఞః, ఆర్చకః, దంత శబ్దమునకు ఉరచ్‌ - దంతురః. ''ర'' - మధురమ్‌, సుషిరమ్‌. ''వ'' - కేశవః. ''య'' - హిరణ్యమ్‌. ''వ'' - మాలవః. ''వలచ్‌'' - రజస్వలా. ''ఞణి'' - ధనీ, ఘరీ, హస్తీ. ''టికన్‌'' - ధనికమ్‌. ''విన్‌'' - పయస్వీ, మాయావీ. ''యచ్‌'' - ఊర్ణాయుః. ''మిన్‌'' - వాగ్మీ. ''ఆలచ్‌'' - వాచాలః. ''ఆటచ్‌'' - వాచాటః. ''ఇవాచ్‌'' - ఫలినః, బర్హిణః. ''కన్‌'' - వృందారకః. ''ఆలుచ్‌'' - శీతం నసహతే శీతాలుః, హిమంనసహతే హమాలుః, వాత శబ్దమునకు ''ఉలచ్‌'' - వాతులః ఆపత్యార్థమున ''అణ్‌'' - వాషష్ఠ కౌరవః. ఇది వాని నివాసము యను అర్థమున అణ్‌, పాంచాలః, మాథురః. తెలుసుకొను చున్నాడు. చదువు చున్నాడు యను అర్థమున అణ్‌. చాంద్రకః ''వున్‌'' - క్రమకః, క్రోశకః, ప్రియంగూనాం భవం క్షేత్రమ్‌ ఇత్యాద్యర్థము నందు ''తఖయ్‌'' - ప్రయ్యంగ వీనకమ్‌, మౌద్గీనమ్‌, కౌద్రవిణమ్‌. అపత్యార్థమున అణ్‌. వైదేహః, ఇయ్‌ - దాక్షిః, దాశ రథిః, ''ఫక్‌'' - నాడాయనః. ''ఫయ్‌'' - ఆశ్వాయనః. ''యయ్‌'' - గార్గ్యః, వాత్స్యః ''ఢక్‌'' - వైన తేయః, హేరక్‌ - చాటకేరః. ''ఢ్రక్‌'' - (ఐరక్‌) గౌధేరకః. ''ఆరక్‌'' - గౌధారః. ''ఘ'' - క్షత్రియః. ''ఖ'' - కులీనః. ఞ - కౌరన్యర్‌, ''యత్‌'' - మూర్థన్య ముఖ్య మొదలగునవి, సుగంధి అనురూపము ''ఇ'' వచ్చుటచే ఏర్పడినది. తారకాది శబ్దములకు ఇతచ్‌ ప్రత్యయము. తారకతమ్‌ మొదలగునవి. ''అనఙ్‌'' - కుండోధ్నీ పుష్పధన్వా, సుధన్వా, చుంచుప్‌ - విత్తచుంచుః, చణ్‌ - కేశ చణః రూపప్‌ - పటరూపకమ్‌. ఈయన్‌ - పఠీయాన్‌, తరప్‌ - అక్షతరాం, వచతితరాం, తమప్‌ - అతితమాం, మృద్యీతమాం కల్పప్‌- ఇంద్ర కల్పః, అర్కకల్పః, ''దేశీయ'' - రాజ దేశీయః. ''దేశ్య'' - రాజదేశ్యః. ''జాతీయ'' - పటుజాతీయః. ''మాత్రచ్‌'' - జానుమాత్రమ్‌, ద్వయసచ్‌ - ఊరుద్వయసమ్‌. దగ్నచ్‌ - ఊరుదగ్నమ్‌. ''టయప్‌'' - పంచతయః, టక్‌ - దౌవారికః. ఇంత వరకు తద్థితసామాన్య వృత్తి చెప్పబడినది. ఇపుడు అవ్యయ తద్ధిత వృత్తి చెప్పబడుచున్నది. యస్మాత్‌ అను అర్థమున తసిల్‌ చేర్చగ, యతః అని అగును. ''త్రల్‌'' - యత్రతత్ర అస్మిన్కాలే అను అర్థమున అధునా ఇదానీం అను రూపములు ఏర్పడును. దా అను చేర్చగాసర్వ స్మిన్‌ అనునర్థమున సర్వదా అను రూపము ఏర్పడును. తస్మిన్కాలే అను అర్థమున రిహిల్‌ - తర్హి అస్మన్‌కాలే=ఇహ. కస్మిన్‌కాలే=కర్హి. థాల్‌ - యథా. థం - కథమ్‌ పూర్వస్యాం దిశి యను నర్థము అస్తాతి ప్రత్యయము. ఉదాహరణము పురస్తాత్‌. తుల్యే - అహని=సద్యః పూర్వాబ్దే=వరుత్‌. పూర్వతరాబ్దే=పరారి అస్మిన్‌ సంవత్సరే=ఐషమః వరస్మిన్నహని అనునర్థమున పరశబ్దమున ఏద్యవి ప్రత్యయము చేర్చగ పరేద్యవి యగును. అస్మిన్నహని అను నర్థమున ద్యచేర్చగా అద్య అగును. ద్యున్‌ చేర్చగా పూర్వేద్యుః అగును. దక్షిణస్యాం దిశి యను అర్థమున దిక్షిణా, దిక్షిణాహి అను రూపములగును. ఉత్తరస్యాంధిశి అనునర్థమున ఉత్తరా, ఉత్తరాత్‌ అని అగును. ఉపరి అను దానికి ఇష్టాతి చేర్చగా ఉపరిష్టాత్‌ అగును ఉత్తర శబ్దమునకు ఏనచ్‌ ఉత్తరేణ, ఆచ్‌ - దక్షిణా, ఆహి - దక్షిణాహి, ధా - ద్విధా, ధ్యముయ్‌ - ఐకథ్యమ్‌, ధమయ్‌ - ద్వైధం, త్రైధం, ఆచ్‌ - ద్విధా, త్రిధా మొదలగునవి ఇంతవరకు నిపాత తద్ధితలు చెప్పబడినవి. ఇపుడు భావ వాచకములు చెప్పబడుచున్నవి. ''పటోర్భావః'' అను అర్థమున త్వ, తత్‌ చేర్చగా పటుత్వము, పటుతా పృథు శబ్దమునకు ఇమనిచ్‌, ప్రథిమా, సుఖ శబ్దమునకు ష్యయ్‌ - సౌఖ్యమ్‌. స్తేన శబ్దమునకు యత్‌=సై#్తన్యమ్‌, సఖి, సఖ్యమ్‌. కపేర్భావః కాపేయమ్‌. యక్‌ - పథ్యమ్‌. అణ్‌ - ఆశ్వమ్‌ కౌమారకమ్‌ ¸°వనము. కన్‌ - ఆచార్యకమ్‌ ఇట్లే ఇతర తద్దితలను కూడ గ్రహించవలెను. *శ్రీ అగ్ని మహా పురాణమున తద్ధిత నిరూపణ మను మూడు వందల యేబది ఆరవ అధ్యయము సమాప్తము.*

0 कॉमेंट्स • 0 शेयर

_*శ్రీ దేవి భాగవతం - 281 వ అధ్యాయము*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *ఆచార నిరూపణము* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ శ్రీనారాయణు డిట్లనెను : వేదములు షడంగములతో చదివినను ఆచారము లేనివానిని పవిత్రుని చేయవు. ఱక్కలు వచ్చిన పక్షులు గూటిని వదలిపెట్టునట్లే అవి వానిని వదలిపెట్టును. పండితుడైనవాడు బ్రహ్మ ముహుర్తమందే లేచి తన నిత్యకృత్యములు నెఱవేర్చుకొనవలయును. రేతిరి చివరిజాములో వేదాభ్యాస మొనర్పవలయును. కొంతసేపుతన యిష్ట దైవమును గూర్చి యాత్మచింతన మొనర్పవలయును. యోగియైనవాడు మొదట చెప్పినట్లు బ్రహ్మధ్యాన మొనర్పవలయును. నారదా! జీవబ్రహ్మల యైక్యమే క్షణమున జరుగునో యదే క్షణమున నతడు జీవన్ముక్తుడు గాగలడు. రాత్రి యేబదియైదు గడియల కుషఃకాలము; ఏబదియేడు గడియల కరుణోదయము; ఏబది యెనిమిది గడియలకు ప్రభాతము. తర్వాత సూర్యోదయము నగును. ద్విజోత్తమా! ప్రాతఃకాలముననే లేచి మానవుడు బాణము పోవునంత దూరముగాని యంత కెక్కువ దూరముగాని నైరృత దిశగ నేగి మలమూత్రముల విసర్జించవలయును. బ్రహ్మచారియైన వాడు జందెము చెవికి తగిలించుకొని విసర్జింపవలయును. గృహస్థుడును - వానప్రస్థుడును జందెము ముందునకు లాగి వీపునకు వేసికొనవలయును. గృహస్థుడు జందెమును వెనుకకు వేసికొని చెవికి తగిలించుకొని విసర్జింపవలయును. బ్రహ్మచారి చెవికి మాత్రము తగిలించుకొని విసర్జింప వలయును. మల విసర్జనము చేయు చోట మొదట గడ్డి పఱచవలయును. తర్వాత తన తలకు గుడ్డ చుట్టుకొని మాటాడక ఉమ్మివేయక ఉండవలయును. దున్నిన నేల నీరు శ్మశానము పర్వతము జీర్ణ దేవాలయము పుట్ట పచ్చని పైరు మీదను గుంట లందును దారులలోను నడచుచుగాని నిలబడిగాని రెండు సంజల యందును భోజనము చేయుచును పండ్లు తొముకొనుచును దేవపితృ కార్యములు చేయుచును స్త్రీ పురుషుల పొందికయందును గురు సన్నిధిలోను మలమూత్రములు విసర్జింపరాదు. దేవ-ఋషి-పిశాచోరగ-రాక్షసులారా! మీ రీ చోటు వదలివెళ్ళుడు. నేను మనమూత్ర విసర్జనము చేయుచున్నాను. అని వారిని ప్రార్థించి తర్వాత యథావిధిగ విసర్జింపవలయును. బ్రాహ్మణుని - అగ్నిని - వాయువును - నీటిని - సూర్యుని చూచుచు నెప్పుడును మలమూత్రముల విసర్జింపరాదు. పగలుత్తర ముఖముగ రేయి దక్షిణ ముఖముగ విసర్జింపవలయును. దానిపై సూర్యకిరణములు పడకుండుటకై యాకులలములు గప్పవలయును. మట్టి చల్లవలయును. నీటి దగ్గఱ బహిర్బూమికి వెళ్ళినచో లింగము చేత బట్టుకొని నీటిచెంత కేగవలయును. లేక మొదలే పాత్రలో నీరు తీసుకొని పోవలయును. బ్రాహ్మణుడు - క్షత్రియుడు - వైశ్యుడు - శూద్రుడు వరుసగ తెల్లని - యెఱ్ఱని - పచ్చని - నల్లని మట్టి తీసికొనవలయును. అది దొరుకనిచో నా ప్రదేశమందున్న మట్టితో శుభ్రము చేసికొనవలయును. దేవాలయము - ఇల్లు ఎలుకల కన్నముల మట్టిని శౌచము చేయగ మిగిలిన మట్టిని శౌచక్రియకు వాడరాదు. మూత్రమందుకన్న శౌచమున రెండింతలుగ మైథునమున మూడింతలుగ శుద్ధి చేసికొనవలయును. మూత్రించినపుడు లింగము నొకసారి చేతిని మూడుసార్లు రెండుచేతులను రెండుసార్లు శుద్ధి చేసికొనవలయును. శౌచమున దానికి రెండింతలుగ శుద్ధిచేసికొనవలయును. మలవిసర్జనమున లింగమును మట్టితో రెండుసార్లు గుదస్థానము నైదుసార్లు చేతిని పదిసార్లు రెండు చేతుల నేడుసార్లు శుద్ధిచేసికొనవలెను. తెలిసినవాడు మొదట నెడమ పాదమును పిదప కుడి పాదమును ప్రతిది నాల్గుసార్లు చొప్పున మట్టితో శుద్ధి చేసికొనవలయను. ఇంతవఱకును గృహస్థుని శౌచ విధానము తెల్పబడెను. దీనికి రెండింతలు బ్రహ్మచారి మూడింతలు వానప్రస్థుడు నాలు గింతలు సన్యాసియును శుద్ధిచేసికొని పవిత్రుడు గావలయును. శౌచక్రియ కుపయోగించుమట్టి పచ్చి యుసరిక కాయంత యుండవలయును. అంతకెప్పుడును తగ్గరాదు. ఇంతవఱకును పగలు చేయవలసిన శౌచక్రియ తెలుపబడెను. రేతిరి దీనిలో సగము చేసిన చాలును. రోగముతో నున్నవాడు దానిలో సగమును పయనించువాడు దానిలో సగము చేసిన చాలును స్త్రీలు బాలురు శూద్రులు వృద్ధులు వీరు చెడువాసన పోవునంతవఱకు శౌచక్రియ నిర్వర్తించినచాలును. వీరికి సంఖ్యానియమము లేదు. అన్ని వర్ణముల వారికిని మురికి - చెడువాసన తొలగినపుడే శుద్ధియగునని మను భగవానుడు ప్రకటించెను. ఈ శౌచక్రియ అంతయు నెడమచేతనే చేయవలయును గాని కుడిచేతి నుపయోగించరాదు. బొడ్డునకు క్రింద నెడమచేతితోను పైని కుడిచేతితోను శౌచక్రియచేయవలయును. ఇట్లు ద్విజులు చేతులను శౌచక్రియ యందుపయోగంచవలయును. ఇతరముల గాదు. తెలిసినవాడు మలమూత్ర విసర్జన సమయమున పాత్ర పట్టుకొనరాదు. ఎవడైన మోహముతో నటుల పట్టుకొనినచో వాడు ప్రాయశ్చిత్తము చేసికొనవలయును. ఎవడైన మోహముతోగాని సోమరితనమునగాని శౌచక్రియ చేసికొన నిచో అతడు మూడురాత్రులు నీరు మాత్రము త్రాగుచు గాయత్రిని జపించినచో శుద్ధడగును. కనుక దేశ - కాల - పాత్రము లెఱిగి శౌచక్రియ నిర్వర్తింపవలయును. అలసత్వముచూపరాదు. మల విసర్జనము తర్వాత పండ్రెండు మార్లు పుక్కిలించి యుమియవలయును. మూత్రించిన పిదప నాల్గుసార్లు పుక్కిలించవలయును. అంత కెప్పుడును తగ్గరాదు. మొగమువంచి యెడమ వైపుగ పుక్కిలించవలయును. ఆ పిదప నాచమించి శుభ్రముగ పండ్లు తోముకొనవలయును. పండ్లుతోము పుడక పండ్రెం డంగుళములుగ నుండవలయును. పాలుగారుచెట్టు ముండ్లచెట్టు పుడకకు మంచిది. అది చిటికెనవ్రేలంత లావుండవలయును. మామిడి - మేడి - కడిమి - రేగు - లొద్దుగు - సంపంగి పుల్లలు తోముకొనుట కుపయోగించవలయును. అన్నము తినుటకును - శత్రులను చంపుటకు నీ వృక్షమందు సోమరాజు ప్రత్యక్ష మగుగాక! అది నా ముఖమునకు సిరి - యశము నిచ్చి శుద్ధి చేయుగాక! వన స్పతీ! నీవు నా కాయువు - బలము - కీర్తి - వర్చస్సు - సంతతి - పశువులు - సిరిసంపదలు - విజ్ఞానము - మేధాశక్తినిమ్ము. అను మంత్రము నుచ్చరింపవలయును. పండ్లు తోముటకు నిషిద్ధ దినములందు పండ్రెండు మార్లు నీరు పుక్కిలించిన దంత ధావనమయినట్లగును. నిషిద్ధదినములందు తోముకొనిన సూర్యుని కొట్టినంత దోషము. అది కులనాశహేతు వగును. పాడ్యమి - షష్ఠి - నవమి - ఏకాదశి - అమావాస్య తిథులును - ఆదివారమును నిషిద్ధ దినములు. ఈ నాళ్లలోపుడకతో పండ్లు తోముకొనరాదు. తొముకనిననేడు కులములను హతమొనర్చిన వాడగును. ముఖము కడిగిన తర్వాత ముమ్మా రాచమనము చేసి ముఖము తుడుచుకోవలయును. తర్వాత నీటితో బొటనవ్రేలితో చూపుడు వ్రేలితోను ముక్కు పుటములను బొటనవ్రేలితో కన్నులు చెవులను బొటనవ్రేలితో చిటికెన వ్రేలితో బొడ్డును అరచేతిలో హృదయమును అన్ని వ్రేళ్లలో తలను తాకవలయును. *ఇది శ్రీదేవీభాగవత మహాపురాణ మందలి యేకాదశ స్కంధమున రెండవ అధ్యాయము.*

0 कॉमेंट्स • 0 शेयर

_*రేపటి నుండి డొల్లు కర్తరి ప్రారంభం*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ వాస్తు కర్తరీ - 4 మే నుండి 28 మే 2021 వరకు డోల్లు కర్తరీ 4 మే 2021 న , నిజ కర్తరి 11 మే 2021 న ప్రారంభమవుతుంది మరియు వాస్తు కర్తరీ 28 మే 2021 న ముగుస్తుంది. వాస్తు కర్తరీ శ్రీ ప్లవ నామ సంవత్సర చైత్ర మాస బహుల నవమి , 4 మే 2021, సాయంత్రం 3.14 గంటలకు ప్రారంభమై 28 మే 2021 న రాత్రి 8.08 గంటలకు (వైశాఖ మాస బహుల తృతీయ) ముగుస్తుంది. సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 3 వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మద్య కాలాన్ని *“కర్తరీ”* అంటారు. అంటే భరణి నాలుగో పాదం , కృత్తిక నాలుగు పాదాలు , రోహిణి మొదటి పాదం మొత్తం ఆరు పాదాలలో సూర్యుడు ఉన్న కాలం కర్తరీ అంటారు. దీనినే *“కత్తెర”* అని కూడ అంటారు. కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు. డిగ్రీలలో చెప్పాలంటే మేషరాశిలో (డిగ్రీల 23°-20' నిమిషాలు ) నుండి వృషభరాశిలో ( డిగ్రీల 26°-40' నిమిషాలు ). సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజే *“డొల్లు కర్తరీ”* ప్రారంభమవుతుంది. దీనినే *"చిన్న కర్తరీ"* అని కూడా అంటారు. సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించే రోజుతో డొల్లు కర్తరీ అంతమై *"నిజకర్తరి"* ప్రారంభమవుతుంది. సూర్యుడు రోహిణి నక్షత్ర రెండవ పాదం ప్రవేశంతో కర్తరీ త్యాగం అవుతుంది. *కర్తరీలో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవి :-* కర్తరిలో గృహసంబంధమయిన పనులు చేయవద్దన్నారు. నాటి రోజులలో వేసవిలో గృహ సంబంధమయిన పనులు తప్పించి మరొక పని వుండేది కాదు. వేసవి నుంచి వడగాలుపుల నుంచి రక్షణకే ఈ కర్తరి చెప్పి , కర్ర , రాతి మొదలగు పనులను వద్దన్నారు. నిజానికి నక్షత్రమాన ప్రకారంగా వచ్చే కార్తెలు కర్షక , కార్మిక పంచాంగం అనవచ్చు. భరణి మూడు నాలుగు పాదాలలో సూర్యుడున్నపుడు డోల్లు కర్తరి , కృత్తిక నాలుగు పాదాలు , రోహిణి రెండు పాదాలలో సూర్యుడు ఉన్నప్పుడు పెద్ద కర్తరి అంటాం. కర్తరి అంటే కత్తెర అని అర్ధం , దేనికి కత్తెర ? ఎండలో పనికి కత్తెరన్నమాట. వేసవిలో మే నెలలో 4, 5 తారీకుల మొదలు మే 27, 28 దాకా కర్తరి ఉంటుంది. ఆ తరవాత చల్ల బడుతుంది కనక పనులు మొదలుపెట్టచ్చని చెప్పి ఉంటారు. వేసవిలో కార్మికుల భద్రతకోసం ఎంత గొప్ప ఏర్పాటు చేసేరో చూడండి. ఈ కార్తెలు ఒక రోజు ఇంచుమించులో ప్రతి సంవత్సరం ఒకలాగే వస్తాయి. కర్తరీలో చెట్లు నరకటం , నారతీయటం , వ్యవసాయం ఆరంభం , విత్తనాలు చల్లటం , భూమిని త్రవ్వటం , తోటలు వేయటం , చెఱువులు , బావులు , కొలనులు త్రవ్వటం , కొత్త బండి కొనటం , అదిరోహించటం , నూతన గృహ నిర్మాణం చేయటం , పాత గృహాలను బాగు చేయటం వంటి గృహ నిర్మాణ పనులు , దేవాలయాలు కట్టుట చేయరాదు. *కర్తరీలో చేసుకునే పనులు :-* కర్తరీలో ఉపనయనం , వివాహం , ప్రవేశాలు , యజ్ఞం , మండపాదులను కప్పటం వంటి పనులు చేయవచ్చును.

0 कॉमेंट्स • 2 शेयर