+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

🏵️🌹🌺🌻🌼🌷🌸💮 తృటి =సెకండ్ లో 1000 వంతు 100 తృటులు =1 వేద 3 వేదలు=1 లవం 3 లవాలు=1 నిమేశం.రెప్ప పాటుకాలం 3 నిమేశాలు=1 క్షణం, 5 క్షణాలు=1 కష్ట 15 కష్టాలు=1 లఘువు 15 లఘువులు=1 దండం 2దండాలు=1 ముహూర్తం 2 ముహూర్తాలు=1 నాలిక 7 నాలికలు=1 యామము,ప్రహారం 4 ప్రహరాలు=ఒక పూట 2 పూటలు=1 రోజు 15 రోజులు=ఒక పక్షం 2 పక్షాలు=ఒక నెల. 2 నెలలు=ఒక ఋతువు 6 ఋతువులు=ఒక సంవత్సరం. 10 సంవత్సరలు=ఒక దశాబ్దం 10 దశాబ్దాలు=ఒక శతాబ్దం. 10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది 100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు 4లక్షల 32 వెల సంవత్సరాలు= కలియుగం 8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం 12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం 17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం) 71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం 14 మన్వంతరాలు=ఒక కల్పం 200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు 365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సరం 100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి ఒక బ్రహ్మసమాప్తి=విష్ణుపూట మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట.. భాగవతాదారితం... 🏵️🌹🌺🌻🌼🌷🌸💮

0 कॉमेंट्स • 0 शेयर

+15 प्रतिक्रिया 3 कॉमेंट्स • 16 शेयर

విష్ణువు వేయి నామాలలో ప్రస్తుతము 801 నుండి 900 వరకు మరియు వాటి అర్థం .......... 801) అక్షోభ్య: - క్షోభ తెలియనివాడు. 802) సర్వవాగీశ్వరేశ్వర: - వాక్పతులైన బ్రహ్మాదులకు కూడ ప్రభువైన భగవానుడు. 803) మహాహ్రద: - గొప్ప జలాశయము. 804) మహాగర్త : - అగాధమైన లోయ వంటివాడు. 805) మహాభూత: - పంచభూతములకు అతీతమైనవాడు. 806) మహానిధి: - సమస్త భూతములు తనయందు ఉన్నవాడు. 807) కుముద: - కు అనగా భూమి . అట్టి భూమి యొక్క భారమును తొలగించి మోదమును కూర్చువాడు. 808) కుందర: - భూమిని చీల్చుకుపోయినవాడు. 809) కుంద: - భూమిని దానమిచ్చినవాడు. 810) పర్జన్య: - మేఘము వర్షించి భూమిని చల్లబరుచునట్లు జీవుల తాపత్రయములను తొలగించి,వారి మనస్సులను శాంతింపచేయువాడు భగవానుడు. 811) పావన: - పవిత్రీకరించువాడు. 812) అనిల: - ప్రేరణ చేయువాడు, సదా జాగరూకుడు. 813) అమృతాశ: - అమృతము నొసంగువాడు. 814) అమృతవపు: - అమృతస్వరూపుడు శాశ్వతుడు. 815) సర్వజ్ఞ: - సర్వము తెలిసినవాడు. 816) సర్వతోముఖ: - ఏకకాలమున సర్వమును వీక్షించగలవాడు. 817) సులభ: - భక్తితో తనను స్మరించువారికి సులభముగా లభ్యమగువాడు. 818) సువ్రత: - మంచి వ్రతము గలవాడు. 819) సిద్ధ: - సత్వస్వరూపుడై, పూర్ణరూపుడై భగవానుడు సిద్ధ: అని తెలియబడువాడు. 820) శత్రుజిత్ - శత్రువులను జయించువాడు. 821) శత్రుతాపన: - దేవతల విరోదులైన వారిని,సజ్జనులకు విరోధులైన వారిని తపింప చేయువాడు. 822) న్యగ్రోధ: - సర్వ భూతములను తన మాయచే ఆవరించి ఉన్నవాడు. 823) ఉదుంబర: - అన్నముచేత విశ్వమును పోషించువాడు. 824) అశ్వత్ధ: - అశాశ్వతమైన సంసార వృక్ష స్వరూపుడు. 825) చాణూరాంధ్ర నిషూదన: - చాణూరుడను మల్లయోధుని వధించినవాడు. 826) సహస్రార్చి: - అనంతకిరణములు కలవాడు. 827) సప్తజిహ్వ: - ఏడు నాలుకలుగల అగ్నిస్వరూపుడు. 828) సప్తైథా: - ఏడు దీప్తులు కలవాడు. 829) సప్తవాహన: -ఏడు గుఱ్ఱములు వాహనములుగా కలవాడు. 830) అమూర్తి: - రూపము లేనివాడు. 831) అనఘ: - పాపరహితుడు. 832) అచింత్య: - చింతించుటకు వీలుకానివాడు. 833) భయకృత్ - దుర్జనులకు భీతిని కలిగించువాడు. 834) భయనాశన: - భయమును నశింపచేయువాడు. 835) అణు: - సూక్షాతి సూక్షమైనవాడు. 836) బృహుత్ - మిక్కిలి పెద్దది అయిన బ్రహ్మము స్వరూపము. 837) కృశ: - సన్ననివాడై, అస్థూలమైనవాడు. 838) స్థూల: - స్థూల స్వరూపము కలిగియున్నవాడు. 839) గుణభృత్ - సత్వరజోస్తమో గుణములకు ఆధారమైనవాడు. 840) నిర్గుణ: - గుణములు తనలో లేనివాడు. 841) మహాన్ - దేశకాలాదుల నధిగమించి యున్నవాడు. 842) అధృత: - సర్వము తానే ధరించియుండి, తనను ధరించునది మరియొకటి లేనివాడు. 843) స్వధృత: - తనకు తానే ఆధారమైనవాడైన భగవానుడు. 844) స్వాస్య: - విశ్వశ్రేయమునకై వేదములను వెలువరించినవాడు. 845) ప్రాగ్వంశ: - ప్రాచీనమైన వంశము కలవాడు. 846) వంశవర్థన: - తన వంశమును వృద్ధినొందించువాడు. 847) భారభృత్ - భారమును మోయువాడు. 848) కథిత: - వేదములచేత సర్వోత్తముడుగా కీర్తించబడినవాడు. 849) యోగీ - ఆత్మజ్ఞానము నందే సదా ఓలలాడు వాడు. 850) యోగీశ: - యోగులకు ప్రభువు. 851) సర్వ కామద: - సకల కోరికలను తీర్చువాడు. 852) ఆశ్రమ: - జీవులకు విశ్రాంతి స్థానమైనవాడు. 853) శ్రమణ: - భక్తిహీనులను, వివేకరహితులను శ్రమ పెట్టువాడు. 854) క్షామ: - సర్వ జీవులను క్షీణింపజేయువాడు. 855) సుపర్ణ: - రమణీయ పత్రములు కలిగిన వృక్షము తానైనవాడు. 856) వాయువాహన: - వాయు చలనమునకు కారణభూతుడైనవాడు. 857) ధనుర్ధర: - ధనస్సును ధరించినవాడు. 858) ధనుర్వేద: - ధనుర్వేదము తెలిసినవాడు. 859) దండ: - దండించువాడు. 860) దమయితా - శిక్షించువాడు. 861) దమ: - శిక్షానుభవము ద్వారా ఏర్పడు పవిత్రత తానైనవాడు. 862) అపరాజిత: - పరాజయము తెలియనివాడు. 863) సర్వసహ: - సమస్త శత్రువులను సహించువాడు. 864) నియంతా - అందరినీ తమతమ కార్యములందు నియమించువాడు. 865) అనియమ: - నియమము లేనివాడు. 866) ఆయమ: - మృత్యుభీతి లేనివాడు. 867) సత్త్వావాన్ - సత్త్వము గలవాడు. 868) సాత్త్విక: - సత్త్వగుణ ప్రధానుడైనవాడు. 869) సత్య: - సత్పురుషుల విషయములో మంచిగా ప్రవర్తించువాడు. 870) సత్యధర్మ పరాయణ: - సత్య విషయమునందును, ధర్మ విషయమునందును దీక్షాపరుడైనవాడు. 871) అభిప్రాయ: - అభిలషించు వారిచేత అభిప్రాయపడువాడు. 872) ప్రియార్హ: - భక్తుల ప్రేమకు పాత్రుడైనవాడు. 873) అర్హ: - అర్పింపబడుటకు అర్హుడైనవాడు. 874) ప్రియకృత్ - తన నాశ్రయించినవారికి ప్రియము నొసగూర్చువాడు. 875) ప్రీతివర్ధన: - భక్తులలో భవవంతునిపై ప్రీతిని వృద్ధి చేయువాడు. 876) విహాయన గతి: - ఆకాశము ఆశ్రయముగ గలదియైన విష్ణుపదము తానైనవాడు. 877) జ్యోతి: - తన ప్రకాశము చేత సర్వమును ప్రకాశింపచేయువాడు. 878) సురుచి: - అందమైన ప్రకాశము గలవాడు. 879) హుతభుక్ - యజ్ఞములందు ఆవాహన చేయబడిన దేవతల రూపమున హవిస్సులను స్వీకరించువాడు. 880) విభు: - సర్వ లోకములకు ప్రభువైనవాడు. 881) రవి: - తన విభూతియైన సూర్యుని ద్వారా భూమినుండి సర్వరసములను గ్రహించువాడు. 882) విలోచన: - వివిధ రూపముల ద్వారా ప్రకాశించువాడు. 883) సూర్య: - ప్రాణులకు ప్రాణశక్తిని ప్రసాదించువాడు. 884) సవితా: - సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు. 885) రవిలోచన: - సూర్యుడు నేత్రములుగా కలవాడు. 886) అనంత: - అంతము లేనివాడు. 887) హుతభుక్ - హోమద్రవ్యము నారిగించువాడు. 888) భోక్తా - భోగ్యవస్తువైన ప్రకృతిని అనుభవించువాడు. 889) సుఖద: - భక్తులకు ఆత్మసుఖము నొసంగువాడు. 890) నైకజ: - అనేక రూపములలో అవతరించువాడు. 891) అగ్రజ: - సృష్ట్యారంభమునకు ముందే ఆవిర్భవించినవాడు. 892) అనిర్వణ్ణ: - నిరాశ నెరుగనివాడు. 893) సదామర్షీ - సజ్జనుల దోషములను క్షమించువాడు. 894) లోకాధిష్టానం - ప్రపంచమంతటికి ఆధారభూతుడు. 895) అధ్బుత: - ఆశ్చర్య స్వరూపుడు. 896) సనాత్ - ఆది లేనివాడు. 897) సనాతన సమ: - సృష్టికర్త యైన బ్రహ్మకు పూర్వము కూడా యున్నవాడు. 898) కపిల: - ఋషులలో కపిలుడు తానైనవాడు. 899) కపి: - సూర్యరూపుడు. 900) అవ్యయ: - ప్రళయకాలము నందు సమస్తము తనలో సర్వేజనా సుఖినోభవంతు

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

🏵️🌹🥀🌺🌻🌼🌷🌸💐💮 నేటి నుంచి అమర్‌నాథ్ యాత్ర.... సహజ సిద్ధంగా మంచుతో ఏర్పడే శివలింగాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే అమర్‌నాథ్ యాత్రికుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జమ్ము నుంచి తొలి బృందం ఆదివారం నాడు అమర్‌నాథ్ యాత్రకు బయల్దేరుతుందని అధికారులు పేర్కొన్నారు. 46 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర కోసం ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 1.5 లక్షల మంది యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, యాత్రికులకు భద్రతతోపాటు సౌకర్యాల కల్పనకు అన్ని ఏర్పాట్లు చేశామని జమ్ము డివిజనల్ కమిషనర్ సంజీవ్ వర్మ పేర్కొన్నారు. సంప్రదాయంగా ఈ యాత్ర రెండు మార్గాల ద్వారా ప్రారంభమవుతుంది. ఒకటి అనంతనాగ్ జిల్లా పహల్గామ్ మార్గంలో 36 కిమీ పొడవున, రెండవది గండెర్బాల్ జిల్లా బల్తాల్ 14 కిమీ మార్గం పొడవున ఈ యాత్ర ప్రారంభమవుతుంది.అనంత్‌నాగ్ జిల్లా నుంచి పహాల్‌గామ్ ట్రాక్ నుంచి 36 కిలోమీటర్లు, గండేర్బల్ జిల్లా నుంచి 14 కిలోమీటర్ల దూరంలో గల బాల్టల్ రూట్ నుంచి అమర్‌నాథ్‌ను చేరుకోనున్నారని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. సాధువులతో సహా వందలాది మంది జమ్ముకు రావడం ప్రారంభించారు. యాత్రికుల భద్రతకు ఇతర సదుపాయాలకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సంజీవ్ వర్మ చెప్పారు. వివిధ సెక్యూరిటీ సంస్థల ద్వారా యాత్రికులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని ఆయన తెలిపారు. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని 3880 మీటర్ల ఎత్తులో గుహలో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని గత ఏడాది 2,85,006 మంది యాత్రికులు దర్శించి పూజలు చేయగా 2015 లో 3,52,771మంది, 2016లో 3,20,490 మంది, 2017లో 2,60,003 మంది యాత్రికులు దర్శించుకున్నారు. అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది ఆగస్టు 15న జరిగే రక్షాబంధన్ నాటితో ముగుస్తుంది. జమ్మూ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎంకే సిన్హా జమ్మూ-కాశ్మీర్ గేట్‌వే నుంచి, పంజాబ్ సరిహద్దు నుంచి కొనసాగే యాత్రకు అన్నిరకాల భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయా ప్రాంతాల్లో బేస్ క్యాంపులు, యాత్రీకులు బస చేసే కేంద్రాలు, విశ్రాంతి గృహాలు, సామూహిక వంట కేంద్రాల్లో ఎలాంటి ఉగ్రవాద బెదిరింపులకు తావులేకుండా ఉండేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఉగ్రవాదిల బెరింపులు, యాత్రీకులను భయాందోళనకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. 🏵️🌹🥀🌺🌻🌼🌷💐🌸💮

0 कॉमेंट्स • 0 शेयर

🏵️🌹🥀🌺🌼🌷🌻🌸💮 దిక్కులు :- """""""""""""" (1) తూర్పు, (2) పడమర, (3) ఉత్తరం, (4) దక్షిణం మూలలు :- """""""""""""""" (1) ఆగ్నేయం, (2) నైరుతి, (3) వాయువ్యం, (4) ఈశాన్యం వేదాలు :- """"""""""""" (1) ఋగ్వే దం, (2) యజుర్వేదం, (3) సామవేదం, (4) అదర్వణ వేదం పురుషార్ధాలు :- """"""""""""""""""""" (1) ధర్మ, (2) అర్థ, (3) కామ, (4) మోక్షా పంచభూతాలు :- """"""""""""""""""""""" (1) గాలి, (2) నీరు, (3) భూమి, (4) ఆకాశం, (5) అగ్ని. పంచేంద్రియాలు :- """""""""""""""""""""""""" (1) కన్ను, (2) ముక్కు, (3) చెవి, (4) నాలుక, (5) చర్మం. లలిత కళలు :- """"""""""""'"'""""""" (1) కవిత్వం, (2) చిత్రలేఖనం, (3) నాట్యం, (4) సంగీతం, (5) శిల్పం. పంచగంగలు :- """"""""""""""""""""" (1) గంగ, (2) కృష్ణ, (3) గోదావరి, (4) కావేరి, (5) తుంగభద్ర. దేవతావృక్షాలు :- """""""""""""""""""""""" (1) మందారం, (2) పారిజాతం, (3) కల్పవృక్షం, (4) సంతానం, (5) హరిచందనం. పంచోపచారాలు :- """"""""""""""""""""""""" (1) స్నానం, (2) పూజ, (3) నైవేద్యం, (4) ప్రదక్షిణం, (5) నమస్కారం. *రామాంజనేయులు* పంచామృతాలు :- """"""""""""""""""""""""" (1) ఆవుపాలు, (2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర, (5) తేనె. పంచలోహాలు :- """"""""""""""""""""" (1) బంగారం, (2) వెండి, (3) రాగి, (4) సీసం, (5) తగరం. పంచారామాలు :- """""""""""""""""""""""" (1) అమరావతి, (2) భీమవరం, (3) పాలకొల్లు, (4) సామర్లకోట, (5) ద్రాక్షారామం షడ్రుచులు :- """"""""""""""""" (1) తీపి, (2) పులుపు, (3) చేదు, (4) వగరు, (5) కారం, (6) ఉప్పు. అరిషడ్వర్గాలు (షడ్గుణాలు) :- """"""""""""""""""""""""""""""""""""""" (1) కామం, (2) క్రోధం, (3) లోభం, (4) మోహం, (5) మదం, (6) మత్సరం. ఋతువులు :- """""""""""""""""""" (1) వసంత, (2) గ్రీష్మ, (3) వర్ష, (4) శరద్ఋతువు, (5) హేమంత, (6) శిశిర సప్త ఋషులు :- """""""""""""""""""""""" (1) కాశ్యపుడు, (2) గౌతముడు, (3) అత్రి, (4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ, (6) జమదగ్ని, (7) వశిష్ఠుడు. తిరుపతి సప్తగిరులు :- """"""""""""""""""""""""""""""" (1) శేషాద్రి, (2) నీలాద్రి, (3) గరుడాద్రి, (4) అంజనాద్రి, (5) వృషభాద్రి, (6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి. సప్త వ్యసనాలు :- """""""""""""""""""""""" (1) జూదం, (2) మద్యం, (3) దొంగతనం, (4) వేట, (5) వ్యభిచారం, (6) దుబారఖర్చు, (7) కఠినంగా మాట్లాడటం. సప్త నదులు :- """""""""""""""""""""" (1) గంగ, (2) యమునా, (3) సరస్వతి, (4) గోదావరి, (5) సింధు, (6) నర్మద, (7) కావేరి. నవధాన్యాలు :- """""""""""""""""""""""" (1) గోధుమ, (2) వడ్లు, (3) పెసలు, (4) శనగలు, (5) కందులు, (6) నువ్వులు, (7) మినుములు, (8) ఉలవలు, (9) అలసందలు. నవరత్నాలు :- """''''"""""""""""""""" (1) ముత్యం, (2) పగడం, (3) గోమేధికం, (4) వజ్రం, (5) కెంపు, (6) నీలం, (7) కనకపుష్యరాగం, (8) పచ్చ (మరకతం), (9) ఎరుపు (వైడూర్యం). నవధాతువులు :- """""""""""""""""""""""" (1) బంగారం, (2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి, (5) ఇనుము, (6) కంచు, (7) సీసం, (8) తగరం, (9) కాంతలోహం. నవరసాలు :- """"""""""""""""""" (1) హాస్యం, (2) శృంగార, (3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర, (6) భయానక, (7) బీభత్స, (8) అద్భుత, (9) వీర నవదుర్గలు :- """"""""""""""""""" (1) శైలపుత్రి, (2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట, (4) కూష్మాండ, (5) స్కందమాత, (6) కాత్యాయని, (7) కాళరాత్రి, (8) మహాగౌరి, (9) సిద్ధిధాత్రి. దశ సంస్కారాలు :- """""""""""""""""""""""""" ( 1 ) వివాహం, ( 2 ) గర్భాదానం, ( 3 ) పుంసవనం , ( 4 ) సీమంతం, ( 5 ) జాతకకర్మ, ( 6 ) నామకరణం, ( 7 ) అన్నప్రాశనం, ( 8 ) చూడకర్మ, ( 9 ) ఉపనయనం, (10) సమవర్తనం దశావతారాలు :- """"""""""""""""""""""""" ( 1 ) మత్స్య, ( 2 ) కూర్మ, ( 3 ) వరాహ, ( 4 ) నరసింహ, ( 5 ) వామన, ( 6 ) పరశురామ, ( 7 ) శ్రీరామ, ( 8 ) శ్రీకృష్ణ, ( 9 ) బుద్ధ, (10) కల్కి. జ్యోతిర్లింగాలు :- """""""""""""""""""""""" హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం . కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు . మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2) గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2) మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4) ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం) తమిళనాడు ~ రామలింగేశ్వరం తెలుగు వారాలు :- """"""""""""""""""""""""" (1) ఆది, (2) సోమ, (3) మంగళ, (4) బుధ, (5) గురు, (6) శుక్ర, (7) శని. తెలుగు నెలలు :- """"""""""""""""""""""""" ( 1 ) చైత్రం, ( 2 ) వైశాఖం, ( 3 ) జ్యేష్ఠం, ( 4 ) ఆషాఢం, ( 5 ) శ్రావణం, ( 6 ) భాద్రపదం, ( 7 ) ఆశ్వీయుజం, ( 8 ) కార్తీకం, ( 9 ) మార్గశిరం, (10) పుష్యం, (11) మాఘం, (12) ఫాల్గుణం. రాశులు :- """""""""""""" ( 1 ) మేషం, ( 2 ) వృషభం, ( 3 ) మిథునం, ( 4 ) కర్కాటకం, ( 5 ) సింహం, ( 6 ) కన్య, ( 7 ) తుల, ( 8 ) వృశ్చికం, ( 9 ) ధనస్సు, (10) మకరం, (11) కుంభం, (12) మీనం. తిథులు :- """""""""""""""" ( 1 ) పాఢ్యమి, ( 2 ) విధియ, ( 3 ) తదియ, ( 4 ) చవితి, ( 5 ) పంచమి, ( 6 ) షష్ఠి, ( 7 ) సప్తమి, ( 8 ) అష్టమి, ( 9 ) నవమి, (10) దశమి, (11) ఏకాదశి, (12) ద్వాదశి, (13) త్రయోదశి, (14) చతుర్దశి, (15) అమావాస్య /పౌర్ణమి. నక్షత్రాలు :- """"""""""""""""" ( 1 ) అశ్విని, ( 2 ) భరణి, ( 3 ) కృత్తిక, ( 4 ) రోహిణి, ( 5 ) మృగశిర, ( 6 ) ఆరుద్ర, ( 7 ) పునర్వసు, ( 8 ) పుష్యమి, ( 9 ) ఆశ్లేష, (10) మఖ, (11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త, (14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ, (17) అనురాధ, (18) జ్యేష్ఠ, (19) మూల, (20) పూర్వాషాఢ, (21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం, (23) ధనిష్ఠ, (24) శతభిషం, (25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర, (27) రేవతి. తెలుగు సంవత్సరాల పేర్లు :- """""""""""""""""""""""""""""""""""""" ( 1 ) ప్రభవ :- 1927, 1987, 2047, 2107 ( 2 ) విభవ :- 1928, 1988, 2048, 2108 ( 3 ) శుక్ల :- 1929, 1989, 2049, 2109 ( 4 ) ప్రమోదూత :- 1930, 1990, 2050, 2110 ( 5 ) ప్రజోత్పత్తి :- 1931, 1991, 2051, 2111 ( 6 ) అంగీరస :- 1932, 1992, 2052, 2112 ( 7 ) శ్రీముఖ :- 1933, 1993, 2053, 2113 ( 8 )భావ. - 1934, 1994, 2054, 2114 9యువ. - 1935, 1995, 2055, 2115 10.ధాత. - 1936, 1996, 2056, 2116 11.ఈశ్వర. - 1937, 1997, 2057, 2117 12.బహుధాన్య.- 1938, 1998, 2058, 2118 13.ప్రమాది. - 1939, 1999, 2059, 2119 14.విక్రమ. - 1940, 2000, 2060, 2120 15.వృష.- 1941, 2001, 2061, 2121 16.చిత్రభాను. - 1942, 2002, 2062, 2122 17.స్వభాను. - 1943, 2003, 2063, 2123 18.తారణ. - 1944, 2004, 2064, 2124 19.పార్థివ. - 1945, 2005, 2065, 2125 20.వ్యయ.- 1946, 2006, 2066, 2126 21.సర్వజిత్తు. - 1947, 2007, 2067, 2127 22.సర్వదారి. - 1948, 2008, 2068, 2128 23.విరోధి. - 1949, 2009, 2069, 2129 24.వికృతి. - 1950, 2010, 2070, 2130 25.ఖర. 1951, 2011, 2071, 2131 26.నందన. 1952, 2012, 2072, 2132 27 విజయ. 1953, 2013, 2073, 2133, 28.జయ. 1954, 2014, 2074, 2134 29.మన్మద. 1955, 2015, 2075 , 2135 30.దుర్మిఖి. 1956, 2016, 2076, 2136 31.హేవళంబి. 1957, 2017, 2077, 2137 32.విళంబి. 1958, 2018, 2078, 2138 33.వికారి. 1959, 2019, 2079, 2139 34.శార్వారి. 1960, 2020, 2080, 2140 35.ప్లవ 1961, 2021, 2081, 2141 36.శుభకృత్. 1962, 2022, 2082, 2142 37.శోభకృత్. 1963, 2023, 2083, 2143 38. క్రోది. 1964, 2024, 2084, 2144, 39.విశ్వావసు. 1965, 2025, 2085, 2145 40.పరాభవ. 1966, 2026, 2086, 2146 41.ప్లవంగ. 1967, 2027, 2087, 2147 42.కీలక. 1968, 2028, 2088, 2148 43.సౌమ్య. 1969, 2029, 2089, 2149 44.సాధారణ . 1970, 2030, 2090, 2150 45.విరోధికృత్. 1971, 2031, 2091, 2151 46.పరీదావి. 1972, 2032, 2092, 2152 47.ప్రమాది. 1973, 2033, 2093, 2153 48.ఆనంద. 1974, 2034, 2094, 2154 49.రాక్షస. 1975, 2035, 2095, 2155 50.నల :- 1976, 2036, 2096, 2156, 51.పింగళ 1977, 2037, 2097, 2157 52.కాళయుక్తి 1978, 2038, 2098, 2158 53.సిద్ధార్ధి 1979, 2039, 2099, 2159 54.రౌద్రి 1980, 2040, 2100, 2160 55.దుర్మతి 1981, 2041, 2101, 2161 56.దుందుభి 1982, 2042, 2102, 2162 57.రుదిరోద్గారి 1983, 2043, 2103, 2163 58.రక్తాక్షి 1984, 2044, 2104, 2164 59.క్రోదన 1985, 2045, 2105, 216 60.అక్షయ 1986, 2046, 2106, 2166. 🙏ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం..

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर