చంద్ర Oct 18, 2019

+12 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
చంద్ర Oct 17, 2019

జన్మనక్షత్ర పాదమును బట్టి శ్రీవిష్ణు సహస్త్రనామ స్తోత్ర పారాయణం… హరిః ఓమ్.. అశ్వని 1వ పాదం విశ్వం విష్ణు ర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః 01 భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః అశ్వని 2వ పాదం పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః 02 అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ అశ్వని 3వ పాదం యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః 03 నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః అశ్వని 4వ పాదం సర్వ శ్శర్వ శ్శివ స్థ్సాణుః భూతాది ర్నిధి రవ్యయః 04 సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః భరణి 1వ పాదం స్వయంభూ శ్శంభు రాదిత్యః పుష్క రాక్షో మహాస్వనః05 అనాదినిదనో ధాతా విధాతా ధాతు రుత్తమః భరణి 2వ పాదం అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః 06 విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవి రో ధ్రువః భరణి 3వ పాదం అగ్రాహ్య శ్వాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్ధనః 07 ప్రభూత స్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరమ్ భరణి 4వ పాదం ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః 08 హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః కృత్తిక 1వ పాదం ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః 09 అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతి రాత్మవాన్ కృత్తిక 2వ పాదం సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః 10 అహ స్సంవత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః కృత్తిక 3వ పాదం అజ స్సర్వేశ్వర స్సిద్ధః సిద్ధి స్సర్వాది రచ్యుతః 11 వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్సృతః కృత్తిక 4వ పాదం వసు ర్వసుమనా స్సత్యః సమాత్మా సమిత స్సమః 12 అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రోహిణి 1వ పాదం రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శ్శుచిశ్రవాః 13 అమృత శ్శాశ్వతః స్థాణుః వరారోహో మహాతపాః రోహిణి 2వ పాదం సర్వగ స్సర్వవిద్భానుః విష్వక్సేనో జనార్ధనః 14 వేదో వేదవి దవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః రోహిణి 3వ పాదం లోకాధ్యక్ష స్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః 15 చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్ర శ్చతుర్భుజః రోహిణి 4వ పాదం భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః 16 అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః మృగశిర 1వ పాదం ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘ శ్శుచి రూర్జితః 17 అతీంద్ర స్సంగ్రహ స్సర్గో ధృతాత్మా నియమో యమః మృగశిర 2వ పాదం వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః 18 అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబ లః మృగశిర 3వ పాదం మహాబుద్ది ర్మహావీర్యో మహాశక్త ర్మహాద్యుతిః 19 అనిర్దేశ్యవపు శ్శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్ మృగశిర 4వ పాదం మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః 20 అనిరుద్ధ స్సురానందో గోవిందో గోవిదాం పతిః ఆరుద్ర 1వ పాదం మరీచి ర్దమనో హంసః సుపర్ణో భజగోత్తమః 21 హిరణ్యనాభ స్సుతపాః పద్మనాభః ప్రజాపతిః ఆరుద్ర 2వ పాదం అమృత్యు స్సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిర ? 22 అజో దుర్మర్షణ శ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ఆరుద్ర 3వ పాదం గురు ర్గురుతమో ధామ సత్య స్సత్య పరాక్రమః 23 నిమిషో నిమష స్స్రగ్వీ వాచస్పతి రుదారధీః ఆరుద్ర 4వ పాదం అగ్రణీ ర్గ్రామణీ శ్శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః 24 సహస్రముర్దా విశ్వాత్మా సహస్రాక్ష స్సహస్స్రపాత్ పునర్వసు 1వ పాదం ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్దనః 25 అహ స్సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః పునర్వసు 2వ పాదం సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ సృడ్ విశ్వభుగ్ విభుః 26 సత్కర్తా సత్కృత స్సాధుః జహ్ను ర్నారాయణో నరః పునర్వసు 3వ పాదం అసం ఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శ్శిష్టకృ చ్ఛుచిః 27 సిద్ధార్ధః సిద్ధసంకల్పః సిద్ధిర స్సిద్ధిసాధనః పునర్వసు 4వ పాదం వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదదః 28 వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శ్శ్రుతిసాగరః పుష్యమి 1వ పాదం సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః 29 నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశ నః పుష్యమి 2వ పాదం ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః 30 బుుద్ధ స్స్పష్టాక్షరో మంత్రః చంద్రాంశు ర్భాస్కరద్యుతిః పుష్యమి 3వ పాదం అమృతాంశూద్భవో భానుః శశబిందు స్సురేశ్వరః 31 ఔషధం జగత స్సేతుః సత్యధర్మ పరాక్రమః పుష్యమి 4వ పాదం భూతభవ్య భవన్నాథః పవనః పావనోనలః 32 కామహా కామకృత్ కాన్తః కామః కామప్రదః ప్రభుః ఆశ్లేష 1వ పాదం యుగాదికృ ద్యుగావర్తో నైకమాయో మహాశనః 33 అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్రజిదనన్తజిత్ ఆశ్లేష 2వ పాదం ఇష్టో విశిష్ట శ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః 34 క్రోధహః క్రోధకృత్ కర్తా విశ్వబాహు ర్మహీధరః ఆశ్లేష 3వ పాదం అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః 35 అపాంనిధి రధిష్టానం అప్రమత్తః ప్రతిష్ఠితః ఆశ్లేష 4వ పాదం స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః 36 వాసుదేవో బృహద్భానుః ఆదిదేవ: పురన్దరః మఖ 1వ పాదం అశోక స్తారణ స్తారః శూర శ్శౌరి ర్జనేశ్వరః 37 అనుకూల శ్శతావర్తః పద్మీ పద్మ నిభేక్షణః మఖ 2వ పాదం పద్మనాభో రవిందాక్షః పద్మగర్భ శ్శరీరభృత్ 38 మహర్ధి బుుద్దో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః మఖ 3వ పాదం అతుల శ్శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః 39 సర్వ లక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః మఖ 4వ పాదం విక్షరో రోహితో మార్గో హేదు ర్దామోదర స్సహః 40 మహీధరో మహాభాగో వేగవా నమితాశనః పుబ్బ 1వ పాదం ఉద్భవ: క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః 41 కరణం కారణం కర్తా వికర్త గహనో గుహః పుబ్బ 2వ పాదం వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః 42 పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్ట శ్శుభేక్షణః పుబ్బ 3వ పాదం రామో విరామో విరతోమార్గో నేయో నయో నయః 43 వీర శ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవి దుత్తమః పుబ్బ 4వ పాదం వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః 44 హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయు రధోక్షజః ఉత్తర 1వ పాదం బుుతు స్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః 45 ఉగ్ర స్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ : ఉత్తర 2వ పాదం విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ 46 అర్థో నర్థో మహాకోశో మహా భోగో మహాధనః ఉత్తర 3వ పాదం అనిర్విణ్ణ స్థ్సవిష్ఠో భూః ధర్మయూపో మహామఖః 47 నక్షత్రనేమి ర్నక్షత్రీ క్షమః క్షామ స్సమీహనః ఉత్తర 4వ పాదం యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాంగతిః 48 సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ హస్త 1వ పాదం సువ్రత స్సుముఖ స్సూక్ష్మః సుఘోష స్సుఖద స్సుహృత్49 మనోహరో జితక్రోధో వీరబాహు ర్విదారణః హస్త 2వ పాదం స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ 50 వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః హస్త 3వ పాదం ధర్మగుప్ ధర్మకృత్ ధర్మీ సదసక్షర మస్తక్షరమ్ 51 అవిజ్ఞాతా సహస్రాంశుః విధాతా కృతలక్షణః హస్త 4వ పాదం గభస్తినేమి స్సత్త్వస్థః సింహో భూతమహేశ్వరః 52 ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృత్ గురుః చిత్త 1వ పాదం ఉత్తరో గోపతి ర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః 53 శరీరభూతభృ ద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః చిత్త 2వ పాదం సోమపో మృతప స్సోమః పురుజిత్ పురుసత్తమః 54 వినయో జయ స్సత్యసంధో దాశార్హ స్సాత్వతాంపతిః చిత్త 3వ పాదం జీవో వినయితా సాక్షీ ముకుందో మిత విక్రమః 55 అంభో నిధి రనంతాత్మా మహోదధిశయోంతకః చిత్త 4వ పాదం అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోద నః 56 ఆనన్దో నన్దనో నన్దః సత్యధర్మా త్రివిక్రమః స్వాతి 1వ పాదం మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః 57 త్రిపద స్త్రిదశాధ్యక్షః మహాశృంగః కృతాంతకృత్ స్వాతి 2వ పాదం మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ 58 గుహ్యో గ భీరో గహనో గుప్త శ్చక్ర గదాధరః స్వాతి 3వ పాదం వేధాః స్వాంగో జితః కృష్ణో దృఢ స్సంకర్షణో చ్యుతః 59 వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః స్వాతి 4వ పాదం భగవాన్ భగహా నందీ వనమాలీ హలాయుధః 60 ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణు ర్గతిసత్తమః విశాఖ 1వ పాదం సుధన్వా ఖండపరశుః దారుణో ద్రవిణప్రదః 61 దివిస్పృక్ సర్వ దృక్ వ్యాసో వాచస్పతి రయోనిజః విశాఖ 2వ పాదం త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ 62 సన్న్యాసకృ చ్ఛమ శ్శాంతో నిష్ఠాశాంతిః పరాయణః విశాఖ 3వ పాదం శుభాంగ శ్శాంతిద స్స్రష్టా కుముదః కువలేశయః 63 గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో వృషప్రియః విశాఖ 4వ పాదం అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః 64 శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః అనురాధ 1వ పాదం శ్రీదశ్శ్రీశః శ్రీనివాసః శ్రీనిధి శ్శ్రీవిభావనః 65 శ్రీధర శ్శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః అనురాధ 2వ పాదం స్వక్ష స్స్వం గ శ్శతానందో నంది ర్జ్యోతి ర్గణేశ్వరః 66 విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్న సంశయః అనురాధ 3వ పాదం ఉదీర్ణ స్సర్వతశ్చక్షుః అనీశ శ్శాశ్వతః స్థిరః 67 భూశయో భూషణో భూతిః విశోక శ్శోకనాశనః అనురాధ 4వ పాదం అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః 68 అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః జ్యేష్ఠ 1వ పాదం కాలనేమి నిహావీర శౌరిః శూర శ్శూరజనేశ్వరః 69 త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః జ్యేష్ఠ 2వ పాదం కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః 70 అనిర్దేశ్యవపు ర్విష్ణుః వీరో నంతో ధనంజయః జ్యేష్ఠ 3వ పాదం బ్ర హ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః 71 బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః జ్యేష్ఠ 4వ పాదం మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః 72 మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః మూల 1వ పాదం స్తవ్య స్త్సవప్రియ స్త్సోత్రం స్తుత స్త్సోతా రణప్రియః 73 పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః మూల 2వ పాదం మనోజవ స్తీర్థకరో వసురేతా వసుప్రదః 74 వసుప్రదో వాసుదేవో వసు ర్వసుమనా హవిః మూల 3వ పాదం సద్గతి స్సత్కృతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః 75 శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాస స్సుయామునః మూల 4వ పాదం భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయోనలః 76 దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో థాపరాజితః పూర్వాషాడ 1వ పాదం విశ్వమూర్తి ర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్ 77 అనేకమూర్తి రవ్యక్తః శతమూర్తి శ్శతాననః పూర్వాషాడ 2వ పాదం ఏకో నైక స్స వః కః కిం యత్తత్పద మనుత్తమమ్ 78 లోకబంధు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః పూర్వాషాడ 3వ పాదం సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చంద నాంగదీ 79 వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచల శ్చలః పూర్వాషాడ 5వ పాదం అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్ 80 సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః ఉత్తరాషాడ 1వ పాదం తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్ర భృతాం వరః 81 ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః ఉత్తరాషాడ 2వ పాదం చతుర్మూర్తి శ్చతుర్బాహుః చతుర్వ్యూహశ్చతుర్గతిః 82 చతురాత్మా చతుర్భావః చతుర్వేదవి దేకపాత్ ఉత్తరాషాడ 3వ పాదం సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః 83 దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ఉత్తరాషాడ 4వ పాదం శుభాంగో లోకసారంగః సుతన్తు స్తనువర్ధనః 84 ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః శ్రవణం 1వ పాదం ఉద్భవ స్సుందర స్సుందో రత్ననాభ స్సులోచనః 85 అర్కో వాజసని శ్శృంగీ జయంతః సర్వవిజ్జయీ శ్రవణం 2వ పాదం సువర్ణ బిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః 86 మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః శ్రవణం 3వ పాదం కుముదః కున్దరః కుందః పర్జన్యః పావనో నిలః 87 అమృతాంశో మృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః శ్రవణం 4వ పాదం సులభ ససువ్రత స్సిద్ధః శత్రుజి చ్ఛత్రుతాపనః 88 న్యుగ్రోధోదుమ్బరో శ్వత్థః చాణూరాంధ్ర నిషూదనః ధనిష్ట 1వ పాదం సహస్రార్చి స్సప్తజిహ్వః సప్తైధా స్సప్తవాహనః 89 అమూర్తి రనఘో చింత్యో భయకృత భయనాశనః ధనిష్ట 2వ పాదం అణుర్ బృహత్ కృశః స్థూలో గుణభృ న్నిర్గుణో మహాన్90 అధృత స్స్వదృత స్స్వాస్థ్య: ప్రాగ్వంశో వంశ వర్ధనః ధనిష్ట 3వ పాదం భారభృత్ కథితో యోగీ యోగీశ స్సర్వ కామదః 91 ఆశ్రమ శ్శ్రమణః క్షామః సుపర్ణో వాయు వాహనః ధనిష్ట 4వ పాదం ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితాదమః 92 అపరాజిత స్సర్వసహో నియంతా నియమో యమః శతభిషం 1వ పాదం సత్త్వవాన్ సాత్విక స్సత్యః సత్యధర్మ పరాయణః 93 అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః శతభిషం 2వ పాదం విహాయసగతి ర్జ్యోతిః సురచి ర్హుతభు గ్విభుః 94 రవి ర్విరోచన స్సూర్యః సవితా రవి లోచనః శతభిషం 3వ పాదం అనంత హుతభుగ్భోక్తా సుఖదో నైకదో గ్రజః 95 అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః శతభిషం 4వ పాదం సనాత్ సనాతనతమః కపిలః కపి రవ్యయః 96 స్వస్తిద స్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః పూర్వాభాద్ర 1వ పాదం అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః 97 శబ్ధాతిగ శ్శబ్ద సహః శిశిర శ్శర్వరీకరః పూర్వాభాద్ర 2వ పాదం అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః 98 విద్వత్తమో వీతభయః పుణ్య శ్రవణ కీర్తనః పూర్వాభాద్ర 3వ పాదం ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్న నాశనః 99 వీరహా రక్షణ స్సంతో జీవనః పర్యవస్థితః పూర్వాభాద్ర 4వ పాదం అనంత రూపో నంతశ్రీః జితమన్యు ర్భయాపహః 100 చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ఉత్తరాభాద్ర 1వ పాదం అనాది ర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః 101 జననో జన జన్మాదిః భీమో భీమపరాక్రమః ఉత్తరాభాద్ర 2వ పాదం ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః 102 ఊర్ధ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణ : ఉత్తరాభాద్ర 3వ పాదం ప్రమాణం ప్రాణనిలయః ప్రాణధృత్ ప్రాణ జీవనః 103 తత్త్వం తత్త్వవి దేకాత్మా జన్మమృత్యు జరాతిగః ఉత్తరాభాద్ర 4వ పాదం భూర్భువ స్స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః 104 యజ్ఞో యజ్ఞపతి ర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః రేవతి 1వ పాదం యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః 105 యజ్ఞాంతకృత్ యజ్ఞ గుహ్యం అన్న మన్నాద ఏవచ రేవతి 2వ పాదం ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః 106 దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాశనః రేవతి 3వ పాదం శంఖభృత్ నందకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః 107 రథాంగపాణి రక్షోభ్యః సర్వ ప్రహరణాయుధః (శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమః ఇతి) రేవతి 4వ పాదం వనమాలీ గదీ శార్ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ| 108 శ్రీమన్నారయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు|| (పై శ్లోకములు రెండింటిని రెండుమార్లు చ‌దువ‌లెను) (సేకరణ)

+13 प्रतिक्रिया 1 कॉमेंट्स • 2 शेयर
చంద్ర Oct 16, 2019

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
చంద్ర Oct 16, 2019

మనుషులంతా ఒక్కటే! 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 తోటి మనుషులనే కాదు, జంతువులను సైతం ఆత్మీయతాభావంతో చేరదీసే సంస్కృతి మనది. ఒక పావురాన్ని రక్షించడం కోసం శిబిచక్రవర్తి తన శరీరం నుంచి మాంసం కోసి డేగకు సమర్పించాడు. అంటరానితనం వంటి మరకలు చరిత్రలో కొంతకాలం కనిపించినా వాటిని తుడిచేసి, ప్రక్షాళన చేసిన ఘనత మన సంస్కరణవాదులది. ఆదిశంకరాచార్య ప్రతిపాదించిన అనర్ఘసూత్ర రత్నం ఏకాత్మ భావనా సిద్ధాంతం(అద్వైతం)! దైవం పరమాత్మ. ఆ ప్రత్యగాత్మ అంశ అయిన జీవాత్మ అందరిలోనూ ఉంది. ఉన్నది రెండు కాదు- ఒక్కటే! అద్వైత సిద్ధాంతం ప్రకాశమానమై భరతభూమిలో వెలుగొందింది. దేహాలు శాశ్వతం కాకపోయినా ఆత్మ నశించే వస్తువు కాదని అద్వైత సిద్ధాంత కర్త శంకరాచార్య బోధించారు. ప్రామాణికంగా ఆ భావన మహోత్తమమైనది. రుజువులు సైతం పరిపూర్ణంగా కనిపిస్తాయి. ఓ అవసరార్థికి సాయం అందిస్తే అతడికి ఆనందం కలుగుతుంది. సాయం అందించిన వ్యక్తికీ ఆనందం కలుగుతుంది. గ్రహీత-ప్రదాత... ఇద్దరికీ ఆనందం కలగడానికి కారణం ఇద్దరిలోని ఆత్మా ఒక్కటే! కష్టాల్లో ఉన్నవారిని చూసినప్పుడు సున్నిత హృదయుల కన్నులు చెమ్మగిల్లుతాయి. తమకు చేతనైన సాయం వారికి అందిస్తారు. అక్కడా ఏకాత్మే! అద్వైత వేదాంతం మేధావుల కోసమేనా, సామాన్యులకు అర్థంకాదా అన్న మీమాంస ఈనాటిది కాదు. ఒక సమూహంలోని వారు అందరూ తమను తాము క్షుణ్నంగా తెలిసిఉన్న కారణంగా తామంతా ఒక్కటే అన్న భావనకు లోటు రాదు. ఎరుక లేని సమాజంలో మనిషిని భయం ఆవహిస్తుంది. కొత్త ప్రదేశాలకు సందర్శనకోసం వెళ్లినవారికి అది అనుభవైకవేద్యమే! విహిత భావన వల్ల మనిషిలో మానసిక అలజడి తగ్గుతుంది. చిరకాల పరిచయం వల్ల రోత కలుగుతుందన్నది సామెత! కొత్తకోసం మళ్ళీ అన్వేషణ మొదలవుతుంది. వస్తు వైవిధ్యం, భావ వైవిధ్యం మనిషిపై గొప్ప ప్రభావం చూపుతాయి. వస్తువులో మూల వైవిధ్యసారాన్ని ఆత్మ అంటారు. అందరూ ఆ పరమాత్మ నుంచే పుట్టి అసంఖ్యాకంగా విస్తరిల్లినవారు గనుక ఆత్మీయులుగా జీవించవలసిన అవసరం, నేపథ్యం ఉంది. అందరూ ఆత్మజులే, ఆత్మీయులే! మానవులు జన్మించే తీరులో, పెరుగుదలలో, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పనిచేసే తీరులో, ప్రజ్ఞలో మనుషులందరినీ ఒకేరీతిగా భగవంతుడు సృజించాడు. మలిచాడు. అందివచ్చే అవకాశాల కారణంగా ఒక్కొక్కరు ఒక్కోరీతిగా వ్యక్తంకావడం ప్రకృతి ధర్మం! రంగు, రూపుల్లో తేడాలు కొట్టొచ్చినట్లు కనబడినా ప్రజ్ఞ, మేధ, ఇచ్ఛ, ప్రాణశక్తుల్లో అందరూ సమానులే అన్నది పండితుల భావన. గురువు శిష్యుడిలోని అజ్ఞానాన్ని తొలగించినంత మేర అతడు జ్ఞాని అవుతాడని పెద్దలంటారు. నోబెల్‌ బహుమతి లాంటి గొప్ప గొప్ప పురస్కారాలను అందుకున్నవారిలో తెల్లవారు, నల్లవారు, స్త్రీలు, పురుషులు అందరూ ఉన్నారు. విభిన్న జాతీయతల కారణంగా ఆహార విహారాల్లో తేడాలుంటాయి. కరుణ, స్నేహార్ద్రత, మానవత్వం అందరిలోనూ ఉన్నాయి. ఏ కొందరో భగవంతుడికి ఇష్టులుగా పుడతారన్న భావనకు ప్రామాణిక నిర్ధారణ లేదు. భగవంతుడు కరుణామయుడు! ఆయనకు అందరూ సమానులే అని అన్ని మతాలూ చెబుతాయి. కుల మత వర్గ జాతీయతా భావనలకు అతీతంగా విశ్వమానవులంతా ఒక్కటే అన్న సచ్ఛింతనతో జీవించినప్పుడు దైవం నిర్దేశించిన అద్వైత స్ఫూర్తికి జవసత్వాలు ఇచ్చినవారమవుతాం! మానవులంతా ఏకాత్మ స్వరూపులన్న ఆలోచన- తోటివారి కారణంగా అప్పుడప్పుడూ పుట్టుకొచ్చే నిరాశ, నిస్పృహలు, భయాందోళనలను దూరం చేస్తుంది. అదే మనిషి ఆనందమయ జీవన సౌరభాన్ని వెదజల్లడానికి దోహదపడుతుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

+10 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
చంద్ర Oct 14, 2019

" ఓం స్వామి యే శరణం " అదిగదిగో అయప్ప కొండ అదియే పంఛగిరులకొండ అదియే శభరి మళ కైలాసం వైకుంఠం మించిన కొండది భక్తజనుల నిలయమది " అదిగదిగో" పడిపూజలు చేసి ధరిద్రాన్ని నెయ్యి దారగ చేసి ఇరుముడిని నింపి పెద్ద దారిన నడిచితే పాపాలన్ని పూలగ మార్చిన శభరి మళ అది "అదిగదిగో " పంఛేంద్రీయాలు చేసిన పాపాలన్నీ పంపా తీరానా వృక్షాలుగ మార్చిన కొండఅది అయప్పకొండది అరవై నాల్గు లక్షల జన్మల పాపంను అగ్నిగుండములో ఆహుతి చేసే పంఛగిరుల కొండ అది " అదిగదిగో" అజ్ఞాన హృదయం లో పట్టబంధమై జ్ఞాన జ్యోతిని వెలిగించే పంచేంధ్రీయ పీఠమది ఆత్మపీఠమది నరక లోకానికి ముక్తిమార్గం చూపే పదినెనిమిది దారుల పుణ్యమార్గమది "అదిగదిగో " మాయను మాయంచేసి అమృతం పంచే అమ్మనిలయది అమ్మగన్నఅమ్మ మంజుమాత కొండది శనిదేవుడు ప్రశాంతుడైన కొండది కలిపురుషుడు కానరాని కొండది గరుడు అలంకారప్రియుని మోసకొచ్చిన కొండది "అదిగదిగో " అఖిల లోకాలకు జ్యోతి రూపమై నిలిచినకొండది నెను నాది అంకార మమకార రాగద్వేషాలను రూపుహమాపి తత్వమసి భోధను నింపిన గురుపీఠమది భక్తులకు పీఠమది అయప్పనిలయమది ఆఙ్ఞాన చీకటి తొలగించి ఙ్ఞాన జ్యోతిని నింపిన కొండది. "అదిగదిగొ" " నా స్వామికి అంకితం "

+15 प्रतिक्रिया 0 कॉमेंट्स • 9 शेयर
చంద్ర Oct 11, 2019

ఈ కవచం పఠించడం వలన అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగును... రుద్ర కవచము అర్థాలతో ... శ్లో: ప్రణమ్యామి శిరసా దేవం స్వయం భుం పరమేశ్వరం. ఏకం సర్వ గతం దేవం సర్వ దేవ మయం విభుం. భావము:- తనకు తానుగా ఉద్భవించిన వాడును, అంతటను నిండి యున్న యేకైక దైవమును, సకల దేవతా స్వరూపుడును, అగు పరమేశ్వరునకు శిరసు వంచి నమస్కరింతును. శ్లో:-రుద్ర వర్మ ప్రవక్షామి అంగ ప్రాణస్య రక్షయే. అహో రాత్ర మయం దేవం రక్షార్థం నిర్మితం పురా. భావము:- అంగ ప్రాణముల రక్షణ కొఱకు రుద్ర కవచమును - అహో ర్తమయుడైన ఆ దేవ దేవుని చేత రక్షణ కొఱకు అతి పురాతన కాలములోనిర్మింప బడిన రుద్ర కవచమును అంగ ప్రాణ రక్షణ కొఱకు చెప్పు చున్నాను. శ్లో:-రుద్రో మే చాగ్రతః పాతు ముఖం పాతు మహేశ్వరః శిరో మే యీశ్వరః పాతు లలాటం నీలలోహితః భావము:- రుద్రుడు ముందు నన్ను రక్షించు గాక. నా ముఖమును మహేశ్వరుడు రక్షించు గాక. నా శిరమును ఈశ్వరుడు రక్షించు గాక. నా లలాటమును నీలలోహితుడు రక్షించు గాక. శ్లో:-నేత్రయోస్త్రయంబకః పాతు ముఖం పాతు మహేశ్వరః కర్ణయోః పాతుమే శంభుర్నాసికాయాం సదాశివః. భావము:- నా నేత్రములను త్ర్యంబకుడు రక్షించు గాక. నా ముఖమును మహేశ్వరుడు రక్షించు గాక. నా చెవులను శంభుడు రక్షించు గాక. నా ముక్కును సదా శివుడు రక్షించు గాక. శ్లో:-వాగీశః పాతు మే జిహ్వా మోష్ఠా పాతంబికాపతిః శ్రీ కంఠః పాతు మే గ్రీవాం బాహూంశ్చైవ పినాక ధృత్. భావము:- నా నాలుకను వాగీశుడు రక్షించు గాక. నా పెదవులను అంబికా పతి రక్షించు గాక. నా కంఠమును శ్రీ కంఠుడు రక్షించు గాక. నా బాహువులను పినాక ధారి రక్షించు గాక. శ్లో:-హృదయం మే మహా దేవ ఈశ్వరో వ్యాత్ స్తనాంతరం నాభిం కటిం స వక్షశ్చ పాతుస్ఛర్వ ఉమాపతిః భావము:- నా హృదయమును మహా దేవుడు రక్షించు గాక. నా స్తనాంతరమును ఈశ్వరుడు రక్షించు గాక. నా నాభిని, కటిని, వాటితో పాటు వక్ష స్తలమును ఉమా పతి రక్షించు గాక. శ్లో:-బాహు మధ్యాంతరంచైవ సూక్ష్మ రూపస్సదా శివః సర్వం రక్షతు సర్వేశో గాత్రానిచ యధా క్రమం భావము:- బాహు మధ్యాంతరమును కూడా సూక్ష్మ రూపియైన సదా శివుడు రక్షించు గాక. నా శరీరమును యధా క్రమముగా అన్నిటినీ సర్వేశ్వరుడు రక్షించు గాక. శ్లో:-వజ్ర శక్తి ధరంచైవ పాశాంకుశధరం తధా. గండ శూల ధరం నిత్యం రక్షతు త్రి దశేశ్వరః భావము:- వజ్ర శక్తిని ధరించిన వాడును, పాశమును అంకుశమును ధరించిన వాడును గండ శూల ధారియు నగు త్రిదశేశ్వరుడు నన్ను నిత్యము రక్షించు గాక. శ్లో:-ప్రస్థానేషు పదే చైవ వృక్షమూలే నదీ తటే సంధ్యాయాం రాజ భవనే విరూపాక్షస్తు పాతు మాం. భావము:- ప్రయాణముల యందును, మార్గముల యందును, వృక్ష మూలమునందు, నదీ తటముల యందు, సంధ్యా సమయము లందు, రాజ భవనముల యందు, నన్నా విరూపాక్షుడు రక్షించు గాక. శ్లో:-శీతోష్ణాదధ కాలేషు తుహిన ధ్రుమ కంటకే నిర్మానుష్యే సమే మార్గే త్రాహి మాం వృషభ ధ్వజ. భావము:- సీతా కాలమునందు, వేసవి కాలము నందు, మంచునందు, వృక్ష కంటకములయందు, నిర్మానుష్య ప్రదేశములయందు,సమ మార్గమునందు, వృషభ ధ్వజుడు నన్ను రక్షించు గాక. శ్లో:-ఇత్యేతద్రుద్ర కవచం పవిత్రం పాప నాశనం మహాదేవ ప్రసాదేవ దుర్వాసో ముని కల్పితం. భావము:- అను యీ విధమైనటువంటి రుద్ర కవచము పవిత్రమైనదియు, పాప నాశనమును కూడ. ఆ మహా దేవుని ప్రసాదము చేత దుర్వాస మునిచే కల్పింప బడినది. శ్లో:-మమాఖ్యాతం సమాసేన స భయం విందతే క్వచిత్. ప్రాప్నోతి పరమారోగ్యం పుణ్యమాయుష్య వర్ధనం భావము:- నా చేత సంక్షిప్తముగా చెప్పబడిన దీనిని భయ భక్తులతో యెవరు వింటారో పరమ ఆరోగ్యము పొందుతారు. పుణ్యము, ఆయుర్దాయము, పెరుగును. శ్లో:-విద్యార్థీ లభతే విద్యా ధనార్థీ లభతే ధనం. కన్యార్థీ లభతే కన్యాం స భయం విందతే క్వచిత్. భావము:- విద్య కోరు వారికి విద్య లభించును. ధనము నాశించు వారికి ధనము లభించును. కన్య నాశించు వారికి కన్య లభించును. భయ రహితులై యుందురు. శ్లో:-అపుత్రో లభతే పుత్రం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్ త్రాహి త్రాహి మహా దేవ త్రాహి త్రాహి త్రయీ మయ. భావము:- సంతానము లేని వారికి సంతానము కలుగును. మోక్షము కోరు వారికి మోక్షము లభించును. రక్షించు మహాదేవా రక్షించు. రక్షించు త్రయీమయా రక్షించు. శ్లో:-త్రాహి మాం పార్వతీ నాథ త్రాహి మాం త్రిపురాంతక పాశం ఖట్వాంగ దివ్యాస్త్రం త్రి శూలం రుద్రమేవచ. భావము:- ఓ పార్వతీ పతీ! నన్ను రక్షించుము. ఓ త్రిపురాంతకా! నన్ను రక్షించుము. పాశము, ఖట్వాంగ దివ్యాస్త్రము, త్రిశూలము ధరించిన రుద్రునకు నమస్కరింతును. శ్లో:-నమస్కరోమి దేవేశ త్రాహి మాం జగదీశ్వర శత్రు మధ్యే సభా మధ్యే గ్రామ మధ్యే గృహాంతరే. భావము:- దేవేశా! నమస్కరిస్తున్నాను. ఓ జగదీశ్వరా! శత్రు మధ్యమున, సభా మధ్యమున, గ్రామ మధ్యమున, గృహాంతరమున, నన్ను రక్షించుము. శ్లో:-గమనాగమనేచైవ త్రాహి మాం భక్త వత్సల త్వం చిత్తం త్వం మానసంచ త్వం బుద్ధిస్త్వం పరాయణం. భావము:- ఓ భక్త వత్సలా! ప్రయాణ సమయములలో వెళ్ళి వచ్చే సమయములందు నన్ను కాపాడుము. నీవే చిత్తము, నీవే మనస్సు, నీవే బుద్ధి. సర్వము నిన్నే పరాయణుడిగా కలవాడను. శ్లో:-కర్మణా మనసాచైవ త్వం బుద్ధిశ్చ యధా సదా జ్వర భయం ఛింది సర్వ జ్వర భయం ఛింది గ్రహ భయం. ఛింది భావము:- కర్మ చేత, మనసు చేత, బుద్ధి చేత ఎల్లప్పుడూ నాకు నీవే సుమా. జ్వరభయము నశించు గాక, సమస్త జ్వర భయము నశించు గాక. గ్రహ భయము నశించు గాక. శ్లో:- సర్వ శత్రూన్నివత్యాపి సర్వ వ్యాధి నివారణం. అస్య రుద్ర లోకం గచ్ఛతి శ్రీ రుద్ర లోకం స గచ్ఛతి. భావము:- నమస్త శత్రువులను నశింపఁ బడును సమస్త వ్యాధులు నివారింపఁ బడును. ఇది పఠించిన వారు రుద్రలోకమును చేరుదురు. అట్టి వారు తప్పక రుద్ర లోకమును చేరుదురు. ఓం నమః ఇతి స్వస్త్యస్తు...

+36 प्रतिक्रिया 1 कॉमेंट्स • 8 शेयर
చంద్ర Oct 10, 2019

🌺🌺🌺చిరునవ్వు 🌺🌺🌺 👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑 ఇష్టదైవం మన ముందుకొచ్చి నిలబడినట్టు ఊహించుకుంటే, ఆ ముఖంలో మనకు అప్రసన్నత, అసహనం, ఉగ్రత్వం కనిపించవు. ప్రేమకు, కరుణకు చిరునామా అయిన చిరునవ్వే కనిపిస్తుంది. అదే మనం ఏ రాక్షసుడి రూపాన్నో, భూత ప్రేతాల రూపాన్నో ఊహించుకొంటే- ఆ ముఖాల్లో చిరునవ్వు కనిపించదు. క్రోధావేశాలు కనిపించి భయపెడతాయి. పరిచితులైన బంధుమిత్రుల్లో కూడా, మనకు బాగా ఇష్టమైనవాళ్లు (కూతురు, మనవడు) తలపునకు వస్తే, వాళ్లు చిరునవ్వుతో కనిపిస్తారు. మన ముఖం మీదా చిరునవ్వు వెలుగుతుంది. నచ్చనివాళ్లు (పైఅధికారి, టెక్కు చూపించే పొరుగువాళ్లు) మనసులో మెదిలితే- వాళ్ల ఏడుపు ముఖం, రుసరుసలు, విసవిసలు ముందు గుర్తుకొస్తాయి. మన ముఖమూ కొంచెం ముడుచుకుపోతుంది. నవ్వు ముఖం (కృతకంగా నవ్వు పులుముకొన్న ముఖం కాదు!) చూస్తేనే మనసుకు శాంతి, ఆనందం, సుముఖత కలుగుతాయి. చిరచిరలాడుతూ కనిపించే ముఖాలు అశాంతిని, భయాన్ని, అసౌకర్యాన్ని, విముఖతను కలిగిస్తాయి. ఇది నిత్యానుభవం. ‘నేను మీవైపు ఎప్పుడూ నవ్వుతూ చూస్తుంటే, మీరు మాత్రం ఎప్పుడూ కొరకొరలాడుతూ చూస్తారెందుకు?’ అని అడిగిందట స్మృతి అనే భారతీయ క్రికెట్‌ క్రీడాకారిణి, తన ప్రత్యర్థి జట్టు బౌలర్లను. ఈ రోజుల్లో క్రికెట్లో వేగంగా బంతి విసిరే ఆటగాళ్లు, ప్రత్యర్థులను, తమ బంతులతోనే కాక, మాటలతోనూ చూపులతోనూ కూడా భయపెట్టేందుకు ప్రయత్నించే ఆనవాయితీ వచ్చింది కదా! ప్రతిపక్షం ఆటగత్తెలు స్మృతితో ‘నీ చిరునవ్వు మమ్మల్ని దహించి వేస్తుంది!’ అంటారట. స్మృతి సాధించిన విజయాలకు ఆమె చిరునవ్వు ఒక కారణం అయితే, ఆమె ప్రత్యర్థులకు ఆ చిరునవ్వు వల్ల కలిగే అసౌకర్యం మరొక కారణం. ఆమె పట్ల వాళ్లు వైముఖ్యం, శత్రుత్వం చూపాలన్నా చూపలేరు! కురుక్షేత్ర యుద్ధారంభంలో అర్జునుడు అకస్మాత్తుగా, అవసర సమయంలో విషాదంలో మునిగిపోయినప్పుడు, శ్రీకృష్ణుడు చిర్రుబుర్రులాడలేదు. చిరునవ్వు ముఖంతో గీతాబోధ చేశాడు. శ్రీరాముడి స్మితభాషిత్వం- చిరునవ్వు నవ్వుతూ మాట్లాడటం- జగమెరిగిన సుగుణం. మనిషి భావోద్రేకాలనుబట్టి శ్వాస వేగం మారుతుందని అందరూ అంగీకరిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటే శ్వాస కుదురుగా ఉంటుంది. అలాగే శ్వాస సాఫీగా ఉంటే, మనసూ స్తిమితంగా ఉంటుంది. మనసును నియంత్రించటం కంటే, శ్వాసను నియంత్రించటం కొంత తేలిక. కాబట్టి శ్వాస మీద దృష్టి ఉంచి దాన్ని స్తిమితపరిస్తే మనసు కూడా స్తిమితపడుతుంది అంటారు యోగులు. అదే చిరునవ్వుకూ వర్తిస్తుంది. అన్ని పరిస్థితుల్లోనూ చిరునవ్వు చెరగకుండా ఉంచుకొని అందరి పట్లా సుముఖత, సౌహార్దం ప్రదర్శించేవారి మనసు ఆనందమయంగా ఉంటుందంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. నవ్వు ముఖం కొందరికి జన్మతః వచ్చే వరం. అందం, ఆరోగ్యం, బుద్ధి బలం, శరీర దారుఢ్యం వంటి లక్షణాల్లాగా పిత్రార్జితం సంక్రమించినట్టు వారసత్వంగా వస్తుంది. అలా వస్తే అదృష్టమే. అలా రాకపోయినా, ఎన్నో సుగుణాల లాగా దీన్నీ అభ్యాసంతో, సాధనతో, స్వయంకృషితో ‘స్వార్జితం’గానూ సమకూర్చుకోవచ్చు. ముఖంమీద చిరునవ్వు తొలగకుండా ఉంచుకోవటం అభ్యాసం చేస్తే అది మనకు, మనతో వ్యవహరించేవారికి సైతం ప్రయోజనకరం. పిల్లలకు పసితనం నుంచి ఏవేవో నేర్పడానికి, ఇంటా బయటా ఎన్నెన్నో ఏర్పాట్లు చేస్తుంటాం. వాటితోపాటు వాళ్లకు ఈ స్మితభాషిత్వంలోనూ కొంత శిక్షణ ఇస్తే, లోకంలో మానవ సంబంధాలు మరింత ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా వెల్లివిరుస్తాయి! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ

+14 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
చంద్ర Oct 3, 2019

* పసుపు గురించి తెలుసుకుందాం పసుపును ప్రసాదంగా ఇంటికి తీసుకొస్తే ఏం చేయాలి.....? పసుపుని సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని ముఖ్య వస్తువులు ఎవరి నుంచి అయినా పొందవచ్చు. వాటికి మైల ఉండదు. అవేమిటంటే... Soma Sekhar 1. పసుపు, 2. కుంకుమ, 3. పూలు, 4. పళ్లు, 5. తమలపాకు, 6. వక్క, 7. పాలు, 8. పెరుగు, 9. నేయి, 10. తేనె, 11. కూరగాయలు, 12. తులసి, 13. గంధం అరగదీసే సానరాయి, 14. గంధం చెక్క వీటిలో పసుపుకు మొదటి స్థానం కల్పించబడింది. అలానే సుమంగళులకు తాంబూలం లేదా ఆకు, వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తరువాత కుంకుమ ఇస్తారు. పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగుళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగల్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు. దేవీ ఆలయాల్లో, నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. గోదాదేవి లేదా ఆండాళ్ అమ్మవారి దేవాలయానికి మీరు వెళ్లినప్పుడు మీకు పసుపు ప్రసాదాన్ని అందిస్తే మీరు ఏం చేస్తారు? పసుపును ఇంటికి తీసుకు వచ్చి వంటల్లో లేదా స్నానం చేసేందుకు ఉపయోగిస్తారు. అయితే ఇకపై అలా చేయవద్దు. ప్రసాదంగా పసుపును పొంది ఇంటికి తీసుకు వచ్చినప్పుడు చేయాల్సిన విధాన క్రమం: Soma Sekhar 1. దేవుని ప్రసాదమైన పసుపును ప్రతి దినం పూజాస్థానంలో ఉంచి పూజిస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాలా ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ధి చెందుతాయి. 2. పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మరోగాలు నయం అవుతాయి. పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తారు. 3. పసుపుతో గౌరీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే వధువుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోయి, త్వరలో వివాహం నిశ్చయమవుతుంది. 4. దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతాయి. 5. దుకాణాల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారమవుతుంది. 6. పసుపు నీటితో ఇంటిని కడిగితే ఆ ఇంటికి ఆ ఇంటివారికి డబ్బుకు సమస్య రాదు, అప్పుల బాధ తొలగిపోతుంది. 7. కామెర్లు ఉన్నవారి ఇంటి వారు పసుపును దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలగిపోతుంది. 8. ప్రతి సంవత్సరం కామెర్లు వచ్చేవారు సుమంగుళులకు పసుపు రంగు చీర తాంబూలాలను దానంగా ఇస్తే కామెర్ల సమస్య తలెత్తదు. 9. గృహదేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవ కళ పెరుగుతుంది. 10. వ్యాపారం జరుగని దుకాణాల్లో శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లాపెట్టెలో ఉంచితే వ్యాపారం బాగా అవుతుంది.

+13 प्रतिक्रिया 1 कॉमेंट्स • 12 शेयर