*దర్బలు..!!* *దర్భకు ఇంతటి విశిష్టత లభించడం వెనుక కధ ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ దర్భని పిత్రు కార్యక్రమాలలో వాడతారు. యజ్ఞాది కార్యక్రమాలకి, దైవ పూజాది కార్యక్రమాలలోనూ వాడతారు. అలాగే గ్రహణ సమయములో పాలు పెరుగు మొదలయిన ఆహారపదార్దాలమీద వేస్తారు. దర్భకు ఇంతటి విశిష్టత లభించడం వెనుక ఒక కధ ఉంది. కశ్యప ప్రజాపతి కృతయుగం నాటి వాడు. ఆయనకు కద్రువ, వినత అనే ఇద్దరు బార్యలు వుండేవారు. వారు సంతానం కోసం భర్త కశ్యపుని ఆరాధించారు. ఆయన సంతుష్టుడై వరములను కోరుకొమ్మని చెప్పాడు. కద్రువ అగ్ని తేజులు, దీర్గ దేహులు, మంచి బలవంతులు అయిన వేయి మంది పుత్రులు తనకు కావాలని కోరింది. V వినత తన సవతి బిడ్డల కంటే భుజపరాక్రమము కలవారు, బలాధికులు అయిన ఇద్దరు పుత్రులు కావాలని కోరింది. కశ్యపుడు వారు కోరిన వరాలను ఇచ్చాడు. కొంతకాలానికి వారి గర్భములనుండి గుడ్లు ఉద్భవించాయి. కొన్ని వందల సంవత్సరముల తరువాత, కద్రువ గుడ్లు ఒకటొకటిగా బద్దలై శేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు, మహోదరుడు, మొదలయిన వేయి మంది నాగులు జన్మించాయి. వినత తనకు ఇంకా పిల్లలు పుట్టలేదు సవతికి పుట్టేసారు అనే ఆత్రంతో ఒక గుడ్డుని బద్దలుకొట్టింది. దానిలోనుండి పై భాగం మాత్రమే తయారై నడుము నుండి కింది భాగం ఏర్పడని పుత్రుడు అనూరుడు జన్మించాడు. తాను వికలాంగునిగా జన్మించడానికి కారణమైన తల్లిని తొందరపడి గుడ్డు ని బద్దలు కొట్టావు కాబట్టి సవతికి దాసివిగా ఉండమని శపించాడు. రెండో గుడ్డు దానతట అది బద్దలయ్యేవరకు దానిని రక్షించమని దానిలో నుండి పుట్టేవాడు మహా బలవంతుడు అయి తల్లికి దాస్య విముక్తి కలిగిస్తాడని చెబుతాడు. అనూరుడు సూర్యుడికి రధసారధిగా వెళ్తాడు. పాల సముద్రం నుండి మధన సమయంలో పుట్టిన వుచ్చైశ్వం ఇంద్రుడు స్వీకరించాడు. అది ఒకరోజు క్షీర సముద్ర తీరంలో తిరుగుతూ వుంది. అదే సమయంలో వినత,కద్రువలు విహారార్దామై సముద్ర తీరానికి వచ్చి వుచ్చైశ్వం తోకలో నలుపు ఉంటుందని కద్రువ, ఉండదని వినత వాదించుకుంటూ పందెం కడతారు ఎవరు గెలిస్తే వారు రెండో వాళ్ళకు దాస్యం చెయ్యాలని వారి పందెం. వినత దగ్గరకు వెళ్లి చూద్దామని కద్రువతో చెప్పగా, కద్రువ ఇప్పుడు పొద్దుపోయింది. అదీకాక భర్త సేవకు సమయము మించిపోతోంది రేపు వద్దాము అని చెప్పి వినతను తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన పిదప తన కుమారులయిన నాగులను పిలిచి తమ పందెం గురించి చెప్పి, మీరు ఇష్ట రూపదారులు కావున గుర్రం తోకను నల్లగా చేయమని అడుగుతుంది. నాగులందరూ తాము తప్పు చేయమని అబద్దం చెప్పమని చెబుతారు. దానితి కద్రువకు కోపం వచ్చి జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి చస్తారు అని కుమారులను శపించింది. శాపానికి భయపడిన కర్కోటకుడు వుచ్చైశ్వం తోకను చుట్టుకుని తోక నల్లగా కనపడేలా చేసాడు. దాంతో వినత ఓడిపోయి కద్రువకు దాసీ అయింది. అలా దాస్యం చేస్తూ కొంతకాలం గడపగా వినత రెండో గుడ్డు బద్దలై గరుత్మంతుడు పుట్టాడు. పుట్టడంతోనే పర్వతాలను కదిలింపజేసాడు సముద్రాలను సంక్షోభింపజేసాడు. సూర్య కాంతితో ప్రకాశిస్తూ భయంకర వేగంతో ఆకాశం లోకి ఎగిరాడు. అతడిని చూసిన దేవతలు అగ్ని దేవుడు అనుకుని అగ్ని దేవుడిని స్తుతించే మంత్రాలతో స్తుతించారు. గరుడుడు వచ్చి తల్లికి నమస్కరించి, సవతి తల్లికి కూడా నమస్కరించాడు. తనకు నమస్కరించిన గరుడుడి ఆకారం తేజస్సు చూసి అసూయ చెంది నా పుత్రులు కోరిన పనులు చేస్తూ వారిని వీపున మోస్తూ తిరగమని ఆదేశించింది. గరుత్మంతుడు కూడా వారు చెప్పిన పనులన్నీ చేస్తూ వస్తున్నాడు. వారికి అడ్డమయిన సేవలు చేస్తూ వారిచేత మాటలు పడుతూ విసుగు చెంది తల్లి దగ్గరకు వెళ్లి దాస్యానికి కారణమేమిటి అని అడిగి తల్లి ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకుని పాముల వద్దకు వెళ్లి మాకు దాస్య విముక్తి కలిగించమని దాని కొరకై వారు కోరినది తెచ్చి ఇస్తానని చెబుతాడు. పాములు గరుడుడి బల, పరాక్రమాలను పొగిడి అమృతాన్ని తెచ్చి ఇచ్చినట్లయితే దాస్యం నుండి విముక్తి కలిగిస్తామని చెబుతాయి. గరుడుడు తల్లికి నమస్కరించి, ఇంద్ర లోకానికి ఎగురుతూ వెళ్లి అక్కడ విషసర్పాల పర్యవేక్షణలో భయంకరమయిన అగ్ని జ్వాలల మద్యలో ఉంచిన అమృతాన్ని ఎదిరించిన పరివారాన్ని ఓడించి తీసుకుంటాడు. ఇంద్రుడు గరుడుడితో యుద్ధం చేసి గరుడుడి పరాక్రమాన్ని గ్రహించి "అమృతాన్ని క్రూరులయిన పాములకి ఇస్తే వారి సంఖ్య పెరిగి లోకానికి చేటు వాటిల్లుతుంది "అని చెప్పగా, గరుడుడు "అమృతాని వారికి తెచ్చి ఇయ్యడమే నా ఒప్పందం కనుక నేను వారికి అమృతాన్ని అప్పగిస్తాను నువ్వు దానిని తిరిగి తెచ్చుకో "అని చెబుతాడు. గరుడుడు అమృతాన్ని తీసుకుని తన ఆశ్రమానికి వచ్చి అమృతాన్ని దర్భ గడ్డి మీద పెడతాడు. నాగులు దానిని చూసి పరుగు పరుగున రాగా వారితో గరుడుడు, నేను మీరు చెప్పినట్టు అమృతాన్ని తెచ్చి ఇచ్చాను ఇంతటితో మా దాస్యం తీరిపోయింది స్నానం చేసి శుచి అయి అమృతాన్ని సేవించండి.. అని చెబుతాడు. అప్పుడు నాగులందరూ స్నానానికి పరిగెత్తగా అదృశ్య రూపంలో అక్కడే వున్న ఇంద్రుడు అమృత భాండం తో సహా వెళ్ళిపోతాడు. నాగులు వచ్చి అమృత భాండం లేకపోవడం చూసి దర్భల మీద ఏమయినా కొంచెం అమృతం వలికిందేమో అని వాటిని నాలికతో నాకగా పాముల నాలుక రెండుగా చిరిగిపోయింది అప్పటి నుండి నాగులకు రెండు నాలుకలు. అమృత భాండాన్ని దర్భ మీద ఉంచారు కావున దర్భ పవిత్రం అయింది.

0 कॉमेंट्स • 0 शेयर

*నేటి సత్కర్మలే మనకు ఉన్న ఏకైక అవకాశం* *మన జీవితాలలో చాలా కష్టాలకు కారణం పూర్వ జన్మ కర్మలే. ప్రారబ్ద కర్మ ఎలా ఉంటుందో, పురాణాల లోనే కాకుండా నిత్య జీవితంలో కూడా అనుభవిస్తూ ఉంటాం మనం...* *రాముడు దండకారణ్యం లో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి, కారణం , ఒక మహాపతివ్రత శాపం !* *దేవాసుర సంగ్రామం సమయంలో, మృతసంజీవనీ మంత్ర బలంతో చావు లేకుండా, ఇంకా దౌర్జన్యాలు చేస్తున్న రాక్షసులను తుదముట్టించడానికి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు,, అప్పుడు, తనను శరణు వేడిన రాక్షసులను తన ఆశ్రమంలో దాచి , వారి నీ చంపకుండా తాను గుమ్మం ముందు నిలుస్తుంది ఆ ఋషి పత్ని !* *మహావిష్ణువు విధి లేక, ఆమెను కూడా రాక్షస సంహారం లో భాగంగా తన సుదర్శన చక్రం తో హతమారుస్తాడు !, ఇది తెలిసి అక్కడికి వచ్చిన ఆమె భర్త, మహా తపోధనుడు, హతురాలై పడి ఉన్న భార్య శవాన్ని చూసి విలపిస్తూ శపిస్తాడు ఆ సాధ్వీ మని భర్త ,!, తన భార్యను హతమార్చి, తమకు వియోగం కల్పించినందుకు అతడు కూడా భార్యావియోగము తో బాధపడాలి అని ! అందుకే రాముని వనవాసానికి కైక, లేదా మందర , లేదా దశరథుడు కారణం కాదనీ, వారు నిమిత్త మాత్రులని తెలుస్తోంది. !అంటే రాముడు కూడా కర్మానుభవం అనుభవించి తీరాల్సిందే !..* *అలాగే రామునికి పట్టాభిషేకం నిర్ణయించి, రాత్రికి రాత్రి అనుకోని విపరీత పరిణామాలు చోటు చేసుకున్న సందర్భమున,,,తీరా కైకమ్మ వరాల విషయంగా, వనవాసం చేయడానికి, వెళ్తున్న రాముడిని చూసి లక్ష్మణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు,, "ఈ ముసలి తండ్రిని చంపి,, రాముడి పట్టాభిషేకానికి అడ్డుగా వచ్చిన వారు ఎవరైనా సరే వారిని నరికేస్తానని !" అంటాడు,* *అప్పుడు రాముడు తమ్మునితో ,, "నాయనా,! నిన్నటి రోజున నాకు పట్టాభిషేకం నిర్ణయించిన తండ్రీ గారు,,* *నేనంటే అపరిమిత ప్రేమ కలిగిన తండ్రిగారు, ఇప్పుడు మౌనంగా ఉండటం, అది ఆయన తప్పు కాదు,! అతి బలీయం విధివిధానం! అది ఎంత బలవత్తరం గా ఉంటుందో తెలుసుకో.!* *పైగా నాకు వనవాస యోగం ఉందని ప్రాజ్ఞులు చెప్పారు, ఈ ప్రారబ్దకర్మ ను తప్పించడం ఎవరి తరమూ కాదు!* *అందుచేత, కోపాన్ని తగ్గించుకొని,, నేను. తండ్రీ గారి ఆజ్ఞను పాలించెందుకు నీవు నాకు సహకరించు లక్ష్మణా !"అంటాడు,* *భగవద్గీత లో చెప్పిన "స్థితప్రజ్ఞత" అంటే ఇదే ! కష్టాల్లో కృంగిపోవడం, సుఖాల్లో పొంగిపోవడం కాకుండా, వాటిని దైవానుగ్రహం గా భావించడం , తన కర్మానుభవంగా గుర్తించడం, భావ్యం !""అని రాముడి నడవడి ద్వారా మనం గ్రహించాలి,!* *భగవద్గీత లోని 18 వ అధ్యాయం ,61 వ శ్లోకం లో ," ప్రతీ జీవునిలో అంతర్యామిగా ఉంటూ, జీవుడి కర్మలకు అనుగుణంగా బుద్దిని ప్రేరేపిస్తూ ఉంటాను !!""అని గీతాచార్యుడు శ్రీకృష్ణా భగ వానుడు , చెప్పినట్టుగా, సీతారాముల కష్టాల కు కారణం వారి పూర్వజన్మల కర్మలే. కాని మరెవరో కార కులు కా దు !! . వారే కాదు , భూమిపై జన్మించిన ఏ ప్రాణీ కూడా కర్మలకు అతీతుడు కాడు.! దానికి ఎవరినో బాధ్యులు చేయకూడదు.!.* *మనం కర్మలు చేయవలసిందే! , ఆ కర్మల ఫలితం, సుఖమైనా, సుఖమైనా, ఇష్టమున్నా లేకున్నా, రాముడైనా, కృష్ణుడైనా అనుభవించ వలసినదే !! వాలిని చెట్టు చాటున దాక్కుని ఒక్క బాణం వేటుకు హతమార్చిన రామునికి , కృష్ణ నిర్యాణం కోసం అదే బాణం దెబ్బతో ఒక వేటగాడి చేతిలో చేసిన కర్మ ఫలితం తాను అనుభవించాల్సి వస్తుంది ! అలా కృష్ణావతారం సుసంపన్నం అయ్యింది.!.* *మరో దృష్టాంతము. !! ద్రౌపది వస్త్రాహరణం చేసిన దుష్ట చతుష్టయం తో బాటు,, తమ కళ్ళ ముందు ఒక అబల పై అత్యాచారాన్ని ఆపకుండా చూస్తూ ఉండిపోయిన మహానుభావులు భీష్మ, ద్రోణ, కృపా చార్యులు కూడా , జరిగిన పాపాన్ని పంచుకొక తప్పలేదు,, భారత మహా రంగంలో మిడత ల వలె మాడి పోయారు. !* *అలా అన్యాయం చేస్తున్నవారితో బాటు, సమర్థత ఉండి, జరగకుండా అడ్డుకునే శక్తి ఉండి కూడా, అన్యాయం చూస్తూ ఉన్నవారు కూడా అంతే పాపాత్ములు, శిక్ష కు పాత్రులు. అవుతున్నారు ! ఎంతటి ప్రజ్ఞాశాలి అయినా కూడా, ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి కదా.!* *అందుకే రామాయణ భారత భాగవతాలు, సారం సత్కర్మలు చేస్తే సత్ఫలితాలు,, వస్తాయి అని ! సద్భావన అనేది భగవంతుడు సర్వాంతర్యామి అని గ్రహించిన ప్పుడే కదా !* *అందుకే దేవుడు మనిషికి అనుగ్రహించిన రెండు వరాలు ఒకటి జ్ఞానం! రెండు మాట్లాడే ప్రతిభ ! వీటిని తమ తమ జీవితాల్లో సత్ ప్రవర్తన, సత్ చింతన తో, సద్వినియోగం చేసుకోవాలి! ఉత్కృష్టమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి ! ఇదే పరమాత్మ ఆంతర్యం కూడా ! , పరపీడ నం పాపాన్ని తాపాన్ని,, కలిగిస్తుంది,,!,* *ఏ చరిత్ర వినినా, ఏ జీవితం చూసినా, ""అహింసా పరమో ధర్మః "" ! అనగా నవ్వులాటకైనా ఇతరులను, ఏ ప్రాణిని హింసించరాదు, !బాధ పెట్టరాదు.! ఎందుకంటే ఆ శరీరంలో ఉన్నది కూడా పరమాత్ముడే,!, అతడు అంతర్యామిగా అంతటా ఉంటూ అన్నీ గమనిస్తూ,, మన లోనే ఉంటూ మన పాపపుణ్యాల కర్మలను లెక్కలు వేస్తూ ఉన్నాడన్న సత్యం మరవకూడదు..* *నీ ఆనందాన్ని ఇతరుల ఆనందంలో వెదకాలి.. అంటే తోటివారు తృప్తిగా సంతోషంగా ఉండడానికి నీ వంతు కృషి, మనసా వాచా కర్మణా, సహాయం చేస్తూ ఉండాలి , ఇదే మానవ ధర్మం, జీవన గీతం, సృష్టి రహస్యం కూడా ఇదే !*

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 4 शेयर