గీత Oct 18, 2019

*లక్ష్మ కటాక్షం ఎక్కడ ఉండదు?* భగవద్భక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవి రాదు.శ్రీ హరి కుడా ఉండడు.శంఖద్వని వినిపించని చోట,తులసిని పూజించని చోట,శంకరుని అర్చించని చోట,బ్రహ్మవేత్తలకు అతిధులకు భోజనసత్కారాలు జరగని చోట‌‌‌లక్ష్మి దేవి నివసించదు.ఇల్లు కళ కళ లాడుతూ ఉండని చోట,ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట,విష్ణువును ఆరాధించకుండ.ఏకాదశి మరియు జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు.హృదయములో పవిత్రత లోపించిన ఇతరులను హింసింస్తున్న ఉత్తములను నిందిస్తున్న లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది. అనవసరంగా గడ్డిపరకలను తెంచిన,చెట్లను కులగొట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది. నిరాశావాదులను,సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాని,తడి పాదాలతో నిద్రపోయేవారిని,వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులుగా మాట్లాడేవారిని,తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు. పశుపక్షులను హింసించే చోట వుండనే వుండదు.సంపద మీద దురాస ఎక్కువగా కలవారి ఇంట వుండదు. *మరి లక్ష్మీ దేవి ఎక్కడ ఎక్కడ వుంటుంది అంటే?* శ్రీహరి దివ్యచరిత్ర,గుణగానం జరిగేచోట,సాలగ్రామం,తులసి,శంఖద్వని ఉన్నచోట లక్ష్మి విరజిల్లుతుంది.ఇలా శ్రీహరి లక్ష్మీకటాక్షం ఎలా కలుగుతుందో ఎలాకలగాలో చెప్పారు.అన్నిటి కంటే సంతృప్తికి మించిన ధనం ఎక్కువలేదు.దానితోనే సంతోషము కలుగుతుంది. అప్పుడు ఎల్లవేళ శ్రీ మహాలక్ష్మి కరుణ మనతోనే వుంటుంది. సంపద మన ఆధీనంలో ఉండాలికాని మనం సంపద ఆదీనంలో ఉండకూడదు.ఏకాస్త గర్వించిన అహంకారము చూపిన ఐశ్వర్యం జారిపోతుంది.సద్వినియోగమే సంపద పరమార్ధము.అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది.ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం. (సేకరణ)

+31 प्रतिक्रिया 1 कॉमेंट्स • 1 शेयर
గీత Oct 17, 2019

https://goo.gl/ZLK01K

+11 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर
గీత Oct 17, 2019

ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవం చాలా సంవత్స రాల క్రితం జరిగింది. నేను డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఉద్యోగం కోసం హైదరాబాదు లో నా స్నేహితులతో కలిసి ఉంటున్న రోజులు. ఆరోజుల్లో నాకు బాబా గురించి అసలేమీ తెలీదు, ఆయన ఫోటో కూడా చూడలేదు. నాతో ఉన్న నా రూమ్మేట్ తమిళనాడు నుంచి వచ్చాడు. ఒకరోజు అతను తమిళ పుస్తకం చదువుతుంటే కుతూహలంతో అదేమిటని అడిగాను. అది సద్గురువైన షిరిడీసాయిబాబా సత్ చరిత్ర అని చెప్పాడు. అది వినగానే నేను ఆ పుస్తకమే కనక తెలుగులో ఉంటే నేను కూడా చదివేవాడిని అన్నాను. మరునాడు మా ఊరి నుంచి మా నాన్నగారు నన్ను చూడటానికి వచ్చారు. మేమిద్దరము మానాన్నగారి స్నేహితుని ఇంటికి చూడటానికి వెళ్లాము. వారి ఇంటినుంచి బయలుదేరి వచ్చటప్పుడు మానాన్నగారి స్నేహితుడు తన వద్ద సాయి సత్చరిత్ర అదనం గా మరొక పుస్తకం ఉన్నదని నువ్వు చదువుతావా అని నన్నడిగారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. నాకు మాటలు రాలేదు.ఆయన ఇచ్చిన పుస్తకాన్ని తీసుకుని అప్పటినుండీ చదవడం ప్రారంభించాను. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయమేమిటంటే, నేను మా నాన్నగారి స్నేహితుని యింటికి వెళ్ళడం అదే మొదటిసారి. ఆయన నాకు ఆ పుస్తకాన్ని ఇచ్చేముందు కూడా మేము సాయి గురించి కూడా మాట్లాడుకోలేదు. ఈ సంఘటన నన్ను సాయి పాదాల చెంతకు చేర్చింది. 🌷ఓంసాయిరాం🌷

+11 प्रतिक्रिया 2 कॉमेंट्स • 1 शेयर
గీత Oct 16, 2019

మనిషిని మలిచిన మహర్షి🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 ఏనాటి రామకథ...ఇప్పటికీ ప్రాతఃస్మరణీయమే.ఏం వింటే ధర్మం కరతలామలకమవుతుందో, సత్య స్వరూపం ఆవిష్కృతమవుతుందో, హృదయం ఆనందంతో నిండిపోతుందో... అలాంటి కథకు రూపకర్త వాల్మీకి. కావ్య రూప తపస్సు చూసి మానవ జాతికి మహోపకారం చేసిన మహర్షి ఆయన. మనిషికి పుట్టుకతోనే పితృ రుణం, దేవరుణం, రుషి రుణం అనే మూడు రకాల రుణాలుంటాయి. రుషులకు ఎందుకు రుణ పడి ఉండాలనే దానికి సనాతన ధర్మం వివరణనిస్తోంది. ఆ రుషులు మానవాళికి మార్గదర్శక సూత్రాల్లాంటి శాస్త్రాలను అందిస్తారు. జాతి హితం కోసం విజ్ఞానాన్ని రూపొందిస్తారు. దీనికోసం అంతులేని తపస్సు చేస్తారు. కాబట్టి మనిషి రుషికి పుట్టుకతోనే రుణపడి ఉండాలి. అలాంటి రుషుల్లో ఒకరు రామాయణకర్త వాల్మీకి మహర్షి. ఎందుకంటే రామాయణం ఒక కావ్యం మాత్రమే కాదు మానవ జీవితానికి ఓ దిక్సూచి. ఎవరీయన? తపస్సు అంటే తపించడం. తాననుకున్న లక్ష్యం కోసం కష్టతరమైన సాధన చేసి ఓ లక్ష్యాన్ని చేరుకోవడం. తపస్సు అంటే దహించేది అని కూడా అర్థం ఉంది. అహంకార మమకారాలను, దేహాభిమానాన్ని, హింస, కుటిలత్వం వంటివాటిని దహించడమే తపస్సు. రామనామాన్ని జపిస్తూ తీవ్ర తపస్సు చేసి, తన పూర్వ కర్మలను అందులో దగ్ధం చేసి రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహర్షిగా వాల్మీకి గురించి చెబుతారు. బోయవాడైన ఈయన రుషిగా మారిన తరువాత ఓ వేటగాడి చేతిలో క్రౌంచ పక్షుల జంటలో ఒకటి మరణించడం చూసినప్పుడు కలిగిన ఆవేదన రామాయణ రచనకు కారణమైందని అంటారు. దీంతో పాటు మరికొన్ని కథలు కూడా వాల్మీకి గురించి ఉన్నాయి. ‘వేద వేద్యే పరే పుంసిజాతే దశరథాత్మజే! వేదః ప్రాచేత సాదాసీత్‌ సాక్షాత్‌ రామాయణాత్మనా’ ఈ శ్లోకంలో రామాయణం సాక్షాత్తు వేద సమానమని, ప్రాచేతసుడు దీన్ని రచించాడనే అర్థం కనిపిస్తుంది. భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రాచేతస గణం అనే రుషి వంశాలున్నాయి. అందులోనివాడే రామాయణకర్త అయిన వాల్మీకి అని పండితాభిప్రాయం. వాల్మీకి గురించి సనత్కుమార మహర్షి వ్యాసుడికి వివరించినట్లు చెప్పే కథ స్కాంద పురాణం అవంతీ ఖండంలో కనిపిస్తుంది. ‘వాల్మీకిరభ వద్బ్రహ్మా వాగ భూత్తస్య రూపిణీ’ అని అందులో ఉంది. వాల్మీకి బ్రహ్మ అంశతో జన్మించాడని దీనికి అర్థం. అందులో అగ్నిశర్మ అనే పేరుతో కనిపిస్తాడీయన. కిరాత ముఠాతో కలిసి దారిదోపిడీలు, హత్యలు చేస్తున్న సమయంలో సప్తరుషుల బోధన వల్ల మహర్షిగా మారాడని పురాణ గాథ. కొంచెం అటు, ఇటుగా ఇలాంటి కథే మరొకటి వినిపిస్తుంది. చెడు సావాసాలతో కిరాతుడిగా మారిన రత్నాకరుడికి నారదమహర్షి ‘రామ’ నామాన్ని ఉపదేశించాడు. ఆ నామం జపిస్తూ తీవ్రమైన తపస్సు చేసిన ఆయన చుట్టూ పుట్టలు పెరిగాయి. ఆ పుట్టల మధ్య నుంచి బయటపడ్డ రత్నాకరుడే వాల్మీకి అయ్యాడని ఉంది. శోకం నుంచి శ్లోకం అదొక ప్రశాంత సమయం. ఎటు చూసినా ఓ దివ్యమైన ఆనందానుభూతి. సంధ్యాసమయం కావటంతో శిష్యుడైన భరద్వాజుడితో కలిసి తమసా నదీ తీరానికి చేరుకున్న వాల్మీకి ఆ ప్రకృతికాంత పులకింతల్ని చూసి తానూ అనిర్వచనీయమైన ఆనందానుభూతిలో ఉన్నాడు. ఏదో తెలియని పరవశం అతడి హృదయంలో పరుగులెత్తుతోంది. అంతలో... లోకంలో తామిద్దరమే ఉన్నామన్నంత భావనతో స్వేచ్ఛగా ఒకదానితో ఒకటి కలిసి ఉన్న క్రౌంచపక్షుల జంటను దూరంగా ఉన్న ఓ చెట్టుకొమ్మ మీద చూశాడాయన. వాటి పరవశాన్ని చూసి ఎంతో ముచ్చట పడుతున్నాడు. హఠాత్తుగా ఓ వేటగాడు విడిచిన బాణం తగిలి అక్కడిక్కడే కిందపడి ప్రాణాలు విడిచింది మగపక్షి. అది చూసి తట్టుకోలేక పోయింది ఆడ పక్షి. భర్త దేహం చుట్టూ తిరుగుతూ రోదిస్తోంది. ఈ సన్నివేశం వాల్మీకిని కలిచివేసింది. అప్పటిదాకా అమితానందంతో ఉన్న వాల్మీకి హృదయం అత్యంత విషాదంతో నిండిపోయింది. ఇంతటి ఘోరానికి కారణమైన బోయవాడి వైపు కోపంగా చూస్తూ... మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః । యత్‌ క్రౌంచ మిథునాదేకమ్‌ అవధీః కామమోహితమ్‌ ।। అనురాగభావంతో ఉన్న క్రౌంచపక్షిని చంపిన కిరాతుడా! నువ్వు శాశ్వతమైన అపకీర్తిని పొందుతావంటూ అప్రయత్నంగా పలికాడు వాల్మీకి. అమితమైన దుఃఖంలో వాల్మీకి నోటి వెంట అప్రయత్నంగా వచ్చిన ఈ శ్లోకంతోనే రామాయణ మహాకావ్య రచన ప్రారంభమైంది. వియోగదుఃఖంలో ఉన్న క్రౌంచపక్షి రామాయణ రచనకు ప్రేరణగా నిలచింది. 📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿 రామాయణంలో ఏమున్నాయి? వాల్మీకి రామాయణం ఓ మహాకావ్యం. సకల శాస్త్రాలు, సర్వధర్మాలు ఇందులోనే ఉన్నాయి. రామో విగ్రహవాన్‌ ధర్మః అన్నా...జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అని బోధించినా పదం, శబ్దం, భావం, గమనం, గమకం... అన్నీ శిఖర సమానంగా కనిపిస్తాయి. ఈ కావ్య సంపుటిని గాయత్రీ మంత్ర సంపుటితో మంత్రబద్ధం చేశాడని పరిశోధకులు చెబుతారు. రామాయణంలోని ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో గాయత్రీ మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలను నిక్షిప్తం చేశాడు. అందుకే రామాయణం కావ్యమే కాదు ఒక మహామంత్రమని అంటారు. ఇందులోని శ్లోకాలు అనుష్టుప్‌ ఛందస్సులో ఉండి, గానం చేయడానికి వీలుగా ఉంటాయి. అందుకే రామాయణాన్ని కుశలవుల ద్వారా విన్న రుషులు ‘అహో గీతస్య మాధుర్యం శ్లోకానాం చ విశేషతః చిరని ర్వృత్త మప్యేతత్‌ ప్రత్యక్ష మివ దర్శితమ్‌!’ అని ప్రశంసించారు. 💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫 * రామాయణం మొత్తాన్ని పరమ యోగానికి నిదర్శనంగా చెబుతారు. ఇందులోని ఆరు కాండలనూ షట్చక్రాలతో పోలుస్తారు. కైకేయి వరం యాచించినప్పుడు మూలాధారం, చిత్రకూట పర్వంలో సీతారాములు వనవాసం చేసేటప్పుడు స్వాధిష్టానం, అత్రి, అనసూయ, అగస్త్యుల ఆతిథ్యాన్ని స్వీకరించేటప్పుడు మణిపూరం, కబంద వధలో అనాహతం, పంపా సందర్శనలో విశుద్ధి, సుగ్రీవాజ్ఞలో ఆజ్ఞాచక్రాలతో నిరూపిస్తారు. సీతా సందర్శనం సహస్రార చక్రానికి చేరడంగా యోగాచార్యులు భావిస్తారు. 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿 * ఈ మహాకావ్యంలో వైద్యశాస్త్రాన్ని, ఔషధాలను గురించి కూడా ఎన్నో ఆసక్తికరమైన విశేషాలున్నాయి. యుద్ధకాండలో లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోయినప్పుడు వానర సేనలోని సుషేణుడు లక్ష్మణుడు మళ్లీ తెలివిలోకి రావడానికి ఉపాయం ఉందని చెప్పాడు. హిమాలయాల్లోని ఓషధీ పర్వతంపై దక్షిణ శిఖరంలో విశల్యకరణి, సువర్ణకరణి, సంజీవని, సంధాన కరణి అనే పరమ ఔషధాలున్నాయని, వాటిని హనుమంతుడితో త్వరగా తెప్పించమని చెప్పాడు. వీటిలో విశల్యకరణి శరీరంలో నాటుకున్న బాణాలను తొలగించి గాయాలను మాన్పుతుంది. సువర్ణకరణి శరీరకాంతిని సహజ స్థితికి తెస్తుంది. సంజీవని స్పృహలోకి తెచ్చి చైతన్యాన్ని కలిగిస్తుంది. సంధానకరణి విరిగిన ఎముకలను అతికిస్తుందని అందులో వివరిస్తారు. * నీతి సహితంగా రామాయణాన్ని చూసినప్పుడు అందులోని పాత్రలన్నీ ఏదో ఒక నీతిని పరిచయం చేస్తూ కనిపిస్తాయి. విచిత్రమేంటంటే వాల్మీకి తనంతట తాను బోధించినట్లు ఎక్కడా కనిపించదు. కథలో అంతర్లీనంగా పాత్ర పోషణలో భాగంగా ధర్మం ధ్వనిస్తుంటుంది. 👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑 * దశరథుడి మరణానికి ముందు భరతుడికి వచ్చిన కల... లంకలో సీతమ్మకు కాపలాగా ఉన్న త్రిజటకు వచ్చిన కలలాంటిది రామాయణంలో స్వప్నశాస్త్ర ప్రస్తావనకు ఉదాహరణ. వాల్మీకి స్పృశించని శాస్త్రం ఏదీలేదని రామాయణాన్ని చదివితే అర్థమవుతుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 రామాయణం ఓ మంత్రశాస్త్ర నిధి కూడా. యాగ రక్షణ కోసం విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు వెళ్లినప్పుడు బల, అతిబల విద్యలను, మహత్తర అస్త్రాలను ఉపదేశించిన సందర్భంలో మంత్ర వైభవం కళ్లకు కడుతుంది. ఆదిత్య హృదయంలాంటి దివ్య స్తోత్రాన్ని అగస్త్యుడు శ్రీరామచంద్రుడికి ఉపదేశించాకే రావణ వధ జరిగింది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

+7 प्रतिक्रिया 1 कॉमेंट्स • 0 शेयर
గీత Oct 15, 2019

దారిద్ర్య దహన శివస్తోత్రం శివుడిని ఆరాధిస్తే ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రం. అన్నీ ఉన్నా అనుభవించే అవకాశం లేకపోవడం దరిద్రం. ఏమీ లేకున్నా, ఆనందంగా ఉండటం ఒక రకంగా ఐశ్వర్యమే. శివారాధన వలన లేమి నశించి, సకలమూ సిద్ధిస్తాయి. అన్ని రకాల దరిద్రాలు దూరమవుతాయి.వశిష్ట మహర్షి విరచితమైన దారిద్ర్య దహన శివస్తోత్రం పఠించి, మహాదేవుని అనుగ్రహంతో మన దరిద్రాలను దూరం చేసుకుందాం. విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ | కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 1 || గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ | గంగాధరాయ గజరాజ విమర్ధనాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 2 || భక్తప్రియాయ భవరోగ భయాపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ | జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 3 || చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండల మండితాయ | మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 4 || పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంకుశాయ భువనత్రయ మండితాయ ఆనంద భూమి వరదాయ తమోపయాయ | దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 5 || భానుప్రియాయ భవసాగర తారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ | నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 6 || రామప్రియాయ రఘునాథ వరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవ తారణాయ | పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 7 || ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ | మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 8 || వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణమ్ | సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనమ్ | త్రిసంధ్యం యః పఠేన్నిత్యం న హి స్వర్గ మవాప్నుయాత్ || 9 || || ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్ర్యదహన శివస్తోత్రమ్ సంపూర్ణమ్౹౹

+22 प्रतिक्रिया 5 कॉमेंट्स • 3 शेयर
గీత Oct 14, 2019

ఓం నమశ్శివాయ🙏 ఫ్రెండ్స్ నేను చెప్పేది నిజం ఏ ఫలము ఆశించకుండా మనం చేసే పనిలో మనం నిమగ్నమై ఉంటే ఆ పరమాత్మ మనకు తోడుగా ఉంటాడు కచ్చితంగా. నేను మీకు చెప్పేవి కాపీ చేసి పెడుతున్నాను అని నన్ను నానారకాల మాటలతో అవహేళన చేశారు నవ్వుకున్నారు కొందరు అవును నేను కాఫీ చేస్తున్నాను ఏ చేయకూడదా ఈ పేజీ నుంచి నేను ఏ ఫలము ఆశించటం లేదు ఆ విషయం నా శివయ్య కు తెలుసు. నేను మంచి చెప్తున్నాను ఏ ఫలము ఆశించకుండా ఆ పరమాత్మ గురించి మనలను మనం ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి నేను చదివింది నేను చూసింది దానికి తోడు నా అనుభవాలు నాకు తెలిసినది ఒక అమ్మ లా నా ఫ్రెండ్స్ కు చెబుతున్న టీచర్ పాఠాలు చెప్తుంది పుస్తకం చూసి ఆవిడా రాసినద ఆ పుస్తకం రాసి చెప్పాలి అంటే ఏ టీచర్ పాఠాలు చెప్పరు అమ్మ మంచి కథ చదువుతుంది లేదా ఎక్కడో మంచి మాటలు వింటుంది వాటికి ఇంకా కొన్ని మంచి మాటలు కలిపి అవి పిల్లలకు చెప్తుంది. ఆవిడ రాసినవా అని పిల్లలు అడిగితే సమాధానం లేదు ఆ తల్లి దగ్గర. కర్మలు రెండు రకాలు.. 1. కామ్యకర్మలు.. ఫలాపేక్ష ఆశించి చేసేవి.. 2. నిష్కామ కర్మలు.. ఫలాపేక్ష లేకుండా ఇతరుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని చేసేవి... కామ్యకర్మలు:-ఫలాపేక్ష ఆశించి చేసేవి. జనన మరణ బంధకాలు, అశాశ్వతాలు. ఫలములను ఆశించకుండా కర్మలు చేయుట కష్టము, ఎందుకంటే ఏఫలితము లేకుండా ఎవ్వరునూ కర్మచేయజాలడు. మరి ఇచ్చట నిష్కామంగా కర్మలు చేయుము అంటే అర్ధం, ఏ కర్మలైనా భగవంతుని ప్రీతితో,.. సమాజ శ్రేయస్సును దృష్టియందు ఉంచుకొని చేయవలెను. కొందరు సమాజ, భగవంతుని సేవ చేసే విధముగానే కర్మలు చేసినట్లు కనిపిస్తారు. ప్రచారం కోసం తపన పడతారు. వారు ఫలాపేక్ష ఆశించి ప్రతి పనిలో నాకు లాభము ఎంత, నేను కీర్తిని ఎంత పొందుతాను అనే దృష్టితో చేస్తున్నారు. అలా చేయడం జననమరణ హేతువులై, నికృష్ట జన్మకు దారితీస్తాయి ! నిష్కామకర్మలు:-సమత్వబుద్ధితో చేయబడేవి. ఇవి ద్వంద్వములకు అతీతమైనది. చేయుటయందే దృష్టికానీ, ఫలితములపై ఉండదు. ఇలా ఫలాపేక్ష రహితంగా ఈశ్వర బుద్ధితో,సమాజ శ్రేయస్సు దృష్టితో చేయుట వలన సంఘములో శాశ్వత కీర్తిని పొందవచ్చు. అంతే కాకుండా అది మోక్ష ప్రాప్తికి సోపానంగా మారుతుంది ఆ పరమాత్మ పాదాల చెంత కాసింత చోటు ఇస్తండు 🙏 శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 🙏

+14 प्रतिक्रिया 2 कॉमेंट्स • 2 शेयर
గీత Oct 10, 2019

+26 प्रतिक्रिया 1 कॉमेंट्स • 12 शेयर