కౌశల్ Oct 18, 2019

మహాలక్ష్మి అమ్మవారి రెండుచేతుల్లోను పద్మాలు ఎందుకు? చిహ్నంగా ఒకటి సరిపోతుందిగా !!! మహాలక్ష్మి అమ్మవారిని శ్రీసూక్తంలో పద్మ విశేషాలతో వర్ణిస్తారు. ఋగ్వేదంలో అమ్మవారి గురించి ఎన్నో ఋక్కులు కనబడతాయి. “పద్మాననే పద్మ ఊరు పద్మాక్షీ పద్మ సంభవే” అని అన్ని పద్మ విశేషణాలు వాడారు. పద్మాల వంటి కన్నులు కలది, పద్మం ఆధారంగా ఉన్నది, పద్మం వంటి మోము కలది, పద్మం నుండి పుట్టినది అని సూక్తం వర్ణిస్తుంది. పంకం నుండి పుట్టినది పద్మం కానీ ఆ చిక్లీతను (బురదను) అంటించుకోదు. సంసారంలో ఆ పద్మంలాగా ఉండాలని సూచిస్తుంది. పద్మం సూర్యుని చూసి వికసిస్తుంది, అలాగే మనం కూడా పరమాత్మ వైపు మంచి విషయాలపై మాత్రమె నీకు అనురక్తి ఉండాలి అని మరొక సంకేతార్ధం. నీటి మీద ఉన్న ఆ పద్మం చాలా చంచలం. ఆ పువ్వు మీద ఆసీనురాలైన ఆవిడ కూడా ధర్మం ఉన్నన్నాళ్ళే వారి దగ్గర ఉంటుంది. విష్ణు నాభి కమలం నుండి ఉద్భవించాడు చతుర్ముఖ బ్రహ్మ, అటుపై అక్కడనుండి సృష్టి ఆవిర్భావం. ఆ బ్రహ్మతత్త్వాన్ని తెలిపే సంకేతంగా మరొక పద్మం. అమ్మవారి రెండు కర కమలాలలో భౌతిక, ఆధ్యాత్మిక ఉన్నతి అనుగ్రహాలు ఉన్నాయి. వాటికి చిహ్నంగా అలా కనిపిస్తుంది. ఆవిడ రూపాన్ని ఋషులు, మహర్షులు ధ్యానతపస్సులో దర్శించి తరించారు. వాటినే మనకు అందించారు. ఆ విశేషాలు మరింత విపులంగా ఏ ఏ రూపంలో ఏమి ధరించిందో క్రింద వివరంగా ఉన్నాయి. లక్ష్మీదేవి 16 రకాల సంపదను అనుగ్రహించే తల్లి: జ్ఞానం, తెలివి, బలం, శౌర్యం, వీరం, అందం, జయం, కీర్తి, ధృతి, నైతికత, ధనం, ధాన్యం, ఆనందం, ఆయుష్షు, ఆరోగ్యం మరియు సంతానం. ఆవిడ మానవుల కోరికలను తీర్చేందుకు ఎనిమిది రూపాలలో అష్టలక్ష్మిగా సుప్రసిద్ధం. 1. ఆదిలక్ష్మి ( అనాది, మహాలక్ష్మి ), ఆదినారాయణుని నిత్యానుపాయిని. ఆవిడ శ్రీమన్నారాయణునికి సేవ చేస్తున్నట్టు మహర్షులు దర్శించారు. పతికి సేవ చేస్తున్నట్టు కనబడే ఆవిడ సృష్టికి సేవ చేస్తున్నట్టు సంకేతార్ధం. ఈవిడ ఒక చేతితో పద్మం, ఒక చేతిలో తెల్లని ఝండాతో అభయ, వరద ముద్రలతో చతుర్భుజములతో అగుపిస్తుంది. సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే | మునిగణమండిత మోక్షప్రదాయిని మంజుళభాషిణి వేదనుతే || పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే | జయజయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ || 1 || 2. ధనలక్ష్మి – ధనం అంటే భౌతికంగా బంగారం, డబ్బు అనిపించినా ధృతి, శౌర్యం, వ్యక్తిత్వం, ప్రతిభ, ధైర్యం ఇలా ఎన్నో అర్ధాలు వస్తాయి. ఎర్రటి వస్త్రంతో, శంఖచాక్రాలతో, కలశంతో, ధనుస్సు, పద్మాలతో, అభయ ముద్రతో షష్టభుజిగా దర్శించారు ఋషులు ఈవిడను. అహికలికల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే | క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే || మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే | జయజయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్ || 2 || 3. ధాన్యలక్ష్మి – ఆరోగ్యకరమైన శరీరం, మనస్సుకు కావలసిన గ్రాసం అనుగ్రహించే తల్లి. హరిత వర్ణ చీరలో, రెండు పద్మాలతో, ధాన్యంతో, చేరుకుగడతో, అరటి గెలతో, వరద అభయముద్రలతో అష్టభుజిగా దర్శించారు. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే | సురగణపూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే || భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే | జయజయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మామ్ || 3 || 4. గజ లక్ష్మి – పాలసముద్ర మధనంలో ఉద్భవించిన గజలక్ష్మి ఇంద్రుని కరుణించి, ఆర్తులకు ధనం, గౌరవం, స్థితి, అనుగ్రహం, ప్రతిష్టలను ఇచ్చి రక్షించే తల్లి. రెండు గజాలు ఈవిడకు అభిషేకం చేస్తుండగా ఎర్రటి వస్త్రంతో కమలంలో కూర్చుని రెండు కరములలో రెండు పద్మాలతో, వరద అభయ హస్తాలతో, అక్షయపాత్ర ద్వారా అక్షయమైన ధనాన్ని అనుగ్రహించే ముద్రలో దర్శించి తరించి మనకు ఆ రూపాన్ని అందించారు. జయ జయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే | రథగజతురగపదాదిసమావృత పరిజనమండిత లోకనుతే || హరిహరబ్రహ్మసుపూజితసేవిత తాపనివారిణి పాదయుతే | జయజయ హే మధుసూదనకామిని గజలక్ష్మి రూపేణ పాలయ మామ్ || 4 || 5. సంతాన లక్ష్మి – ఈవిడ దయవలన మానవాళికి సత్సంతానభాగ్యం కలుగుతోంది. ఈవిడ రెండు చేతులలో కళాశాలతో, ఖడ్గం, డాలు ధరించి, అభయ ముద్రతో, ఒక చేతితో పద్మం ధరించిన ఒక పిల్లవాని ఒడిలో కూర్చోబెట్టుకుని కనబడుతుంది. అహిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే | గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్తభూషిత గాననుతే || సకల సురాసుర దేవమునీశ్వర మానవవందిత పాదయుతే | జయజయ హే మధుసూదనకామిని సంతానలక్ష్మి త్వం పాలయ మామ్ || 5 || 6. ధైర్యలక్ష్మి/వీరలక్ష్మి – శౌర్యం, బలం ధైర్యం కేవలం బాహ్యంలోనే కాక కష్టాలను అధిగమించే శక్తిని అనుగ్రహించే ధైర్య లక్ష్మి తల్లి. శంఖ చక్రాలతో, ధనుస్సు, బాణం, ఖడ్గం, పాత్రలను ధరించి, అభయ వరద హస్తాలతో అష్టభుజిగా దర్శనం ఇస్తుంది ఈవిడ. జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే | అనుదినమర్చిత కుంకుమధూసరభూషిత వాసిత వాద్యనుతే || కనకధరాస్తుతి వైభవ వందిత శంకరదేశిక మాన్య పదే | జయజయ హే మధుసూదనకామిని విజయలక్ష్మి సదా పాలయ మామ్ || 6 || 7. విద్యాలక్ష్మి – జ్ఞానం, విద్య అనుగ్రహించే అమ్మ. శ్వేత వర్ణ వస్త్రధారి. రెండు పద్మాలతో, అభయ వరద హస్తాలతో అనుగ్రహించే అమ్మవారు. ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే | మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతిసమావృత హాస్యముఖే || నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే | జయజయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి సదా పాలయ మామ్ || 7 || 8. విజయలక్ష్మి – అన్నింటా జయం కలిగించే తల్లి. శంఖచక్రాలు, డాలు, ఖడ్గ పాశాలతో, పద్మం ధరించి అభయ వరద ముద్రలతో అష్టభుజిగా దర్శనం అనుగ్రహిస్తుంది అమ్మవారు. ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభి నాద సుపూర్ణమయే | ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్యనుతే || వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గప్రదర్శయుతే | జయజయ హే మధుసూదనకామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మామ్ || 8 || నిత్యం మా వేంకటేశుని వక్షస్థలంపై వసించి మమ్మల్ని అనుగ్రహించి, మా తరపున మా మొరలు మా స్వామికి నివేదించి మనల్ని రక్షిస్తూ, అనుగ్రహిస్తున్న మా అమ్మ లక్ష్మి దేవకి సాష్టాంగనమస్కారం చేస్తూ ఆవిడ అనుగ్రహాన్ని అభిలషిస్తూ వాట్సాప్ నుండీ సేకరించినది ఓం శ్రీ మహా లక్ష్మీ నమోస్తుతే

+19 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
కౌశల్ Oct 17, 2019

https://goo.gl/ZLK01K

+14 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
కౌశల్ Oct 17, 2019

ఓం నమశ్శివాయ🙏 ఫ్రెండ్స్ యాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన వలన ఆధ్యాత్మిక ప్రయోజనం లభిస్తుందా అని చాలామందికి చిన్న సందేహం మనం పుణ్యక్షేత్రాలకు తిరిగేది కూడా ఆలోచనలు తగ్గించుకోడానికే ! మనకి రోజూ ఉండే పనులు పుణ్యక్షేత్రాల్లో ఉండవు. కనుక ఆ పనులకు సంబంధించిన ఆలోచనలన్నీ తగ్గిపోతాయి. మన మనసుకు వ్యాపకాలు అలవాటయ్యాయి. అందుకే ఇతర ఊళ్ళకు వెళ్ళినప్పుడు కలిగే శాంతిని కూడా బోర్ (విసుగు)గా భావిస్తాం. పుణ్యక్షేత్రాల్లో ఉన్నప్పుడు మనకి ఆలోచనలు తగ్గినందువల్ల వచ్చే ఆనందాన్ని అనుభవించాలి. పుణ్యక్షేత్రాల్లో కూడా ఏసి గదులకోసం, మంచి భోజనం కోసం వెతుక్కుంటే అది మన ఇంటితో సమానమే. ఒక అప్పు తీర్చేందుకు మరోక అప్పుచేస్తే అప్పిచ్చినవాడు మారతాడుగానీ అప్పుమారదు. మనం భక్తితో చేసే పనులు అలాంటివి కాకూడదు. మొక్కులు తప్పుకాదు. కానీ మన భక్తికి అవి మాత్రమే లక్ష్యం కాదు. వ్రతదీక్షలు మన కోర్కెలను ఆపటానికి ఆలంబనగా ఉండాలి ఆ పరమాత్మ మన హృదయంలో కొలువైలా ఉండాలి ఆ తండ్రి తన పాదాల చెంత చేరు వరకు మన చేయి పట్టి నడిపింపిచేలా ఉండాలి🙏 శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి🙏

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
కౌశల్ Oct 16, 2019

నన్ను కాపాడేవారెవరు? ఉత్తర భారతదేశంలో ఉద్యోగం చేసుకుంటున్న పరమాచార్య స్వామివారి భక్తుడొకరికి పెద్ద దుఃఖం కలిగింది. తన చెవుల్లో ఎప్పుడూ ఏదో వినబడుతూ ఉంటుంది. ఆ స్వరం ఏవేవో విషయాలన్నిటిని చెబుతూ ఉంటుంది. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా అది వదలకుండా ఏవేవో చెబుతూ ఉండేది. ఎన్నో సార్లు ఆ బాధని భరించలేక నిద్రనుండి మేల్కొనేవాడు. అది ఎవరి గొంతు? బహుశా ఆంజనేయ స్వామివారి గొంతు అనుకుని అదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పాడు. అప్పుడే అసలు కథ మొదలైంది. చాలామంది తమ కష్టాలు తీర్చమని అతని ముందు వరుసలు కట్టడం మొదలుపెట్టారు. అలాగే భవిష్యత్తు చెప్పమని కూడా అడగడం మొదలుపెట్టారు. దాని కొరకు అతడు ఒక రోజు కేటాయించవలసి వచ్చింది. అతను కూడా ఎటువంటి ధనం ఆశించకుండా చెప్పేవాడు. కనుక అలా వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరగసాగింది. అలా అడిగినవారికి అందరికి అతని చెవుల్లో వినబడే శబ్దాలను విని వాటిని చెప్పేవాడు. చివరగా అతను మానసిక ప్రశాంతతను కోల్పోయాడు. సాలీడు గూడులో చిక్కుకున్న పురుగులాగా విలవిలలాడిపోయాడు. “నన్ను కాపాడేవారెవరు?” అని భోరున విలపించాడు. నా వద్దకు రా అన్నట్టుగా కనపడుతున్న మహాస్వామివారే తనను కాపాడగలరని తెలుసుకొని వారి పాదపద్మముల యందు శరణాగతిని వేడాడు. “నేనున్నాను. నావద్దకు రా” అని స్వామివారు భరోసా ఇచ్చినట్టు భావించాడు. “పెరియవ తప్ప నాకు వేరొకరు దిక్కు లేదు. నా చెవుల్లో ఎప్పుడూ ఏవో మాటలు వినబడుతున్నాయి. మొదట హనుమంతులవారే అలా మాట్లాడుతున్నారు అని అనుకున్నాను. వారి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి అనుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని అంచనాలు నిజం అయ్యాయి కూడా కాని మొత్తానికి నేను మనఃశాంతిని కోల్పోయాను. నాకు ఇక ఉత్తరభారతంలో ఉండడం ఇష్టం లేదు. నాకు ఎలాగైనా బదిలీ కావాలి. దయచేసి నాపైన మీ కరుణను ప్రసారించండి పెరియవ” అని వేడుకున్నాడు. “ఇవన్ని నాకెందుకు చెబుతున్నావు? నీకు ఆంజనేయ స్వామి వారి ఆశిస్సులు ఉన్నాయి కదా? మరి ఆంజనేయ స్వామికే ఎందుకు చెప్పుకోకూడదు?” అని స్వామివారు నవ్వుతూ అన్నారు. అతను చాలా సిగ్గుపడ్డాడు. “పెరియవ నాకు నేనుగా ఆ గొంతు ఆంజనేయ స్వామివారిది అని అనుకున్నాను. అది ఎ దయ్యమో నాకు తెలియదు. నన్ను నిద్రపోవడానికి కూడా వదలడం లేదు. అందరూ నమ్మినా నేను మాత్రం అది నమ్మను. నేను ఏమి మాట్లాడకపోయినా ఏవో పనికిమాలిన విషయాలు నాకు వినిపిస్తూనే ఉంటాయి. ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను. పెరియవ రక్షించండి” “ఎప్పుడూ రామ నామం జపిస్తూ ఉండు. కుంబకోణం దగ్గరలోని గోవిందపురంలో బోధేంద్రుల అధిష్టానం ఉంది. అక్కడకు వెళ్లి కొన్నిరోజులపాటు ఉండు” అని ఆదేశించి ప్రసాదం ఇచ్చి పంపించారు. పదిరోజుల తరువాత ఆ భక్తుడు గోవిందపురం నుండి వచ్చాడు. అతని మొహం సంతోషంతో వెలిగిపోతోంది. పరమాచార్య స్వామికి సాష్టాంగం చేశాడు. “ఏమిటి? ఆంజనేయస్వామి వారు రామ సేవకు వెళ్లిపోయారా?” అని కొంటెగా అడిగారు. గోవిందపురం వెళ్ళగానే తాని బాధ తీరిపోయింది. ఇక ఎప్పుడూ ఆ గొంతు అతనికి వినబడలేదు. భగవంతుని నామాన్ని నిరంతరమూ జపించడం వల్ల సహజమైన లేదా అసహజమైన ఆలోచనలు, మాటలు ఇక వినబడవు. పొరపాటున విన్నా అవి మన మనస్సుకి చేరి మనః శాంతిని పోగొట్టవు. అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్ శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

+11 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
కౌశల్ Oct 15, 2019

https://goo.gl/ZLK01K

+10 प्रतिक्रिया 0 कॉमेंट्स • 14 शेयर
కౌశల్ Oct 15, 2019

జై హనుమాన్.... స్వామి యే శరణం అయ్యప్ప... అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఎవరన్నా చనిపోయిన వారు ఎదురొస్తేనే పక్కకు జరిగి పోతాము. చావులకు కూడా వెళ్ళము. మరి అలాంటిది నేరుగా సమాధుల వద్దకు (వావర్ స్వామి - ఈయన ఒక అరబ్ ముస్లిం) పోవడమేంటి ? ఇంకా కామెడీ ఏమిటంటే ఇస్లాం పుట్టే 2000 సంవత్సరాలు కూడా కాలేదు... 12వ శతాబ్దంలో ఈ వావర్ స్వామి, అయ్యప్ప స్వామి తో కలిసి యుద్దం చేశాడంట, అది మెచ్చి అయ్యప్ప స్వామి పాండాల రాజుతో చెప్పి దర్గా కట్టించాడంట... అవ్వ... నవ్వి పోదురు గానీ... దీన్ని బట్టి అర్ధం అయ్యిందేంటంటే మనం అత్యంత నిష్టతో 41 రోజుల పాటు చేసిన పూజలంతా ఆఖరు క్షణంలో సర్వ నాశనం కావాలనే ఈ ఎదవలు పందులతో కలిసి ఆడుతున్న దొంగ నాటకం ...!? ఇది పందులు, కమ్మీల కుట్ర కాక మరేంటి...!? నేను చెప్పిన దాంట్లో తప్పేమన్నా వుంటే సరి చేయండి... జై శ్రీ రామ్...! కట్టర్ హిందూ...

+10 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
కౌశల్ Oct 14, 2019

కేశవ నామాల విశిష్టత ఫలితాలు... మనము ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా, ఏ యజ్ఞము చేయాలన్నా సంకల్పానికి ముంచుగా ఆచమనము చేస్తూ కేశవాయనమః,,నారాయణాయనమః,, మాధవాయనమః అని ఉద్ధరిణితో నీళ్ళు తీసుకుని 3సార్లు తీర్థము తీసుకుని,తరువాత గోవిందాయనమః అని నీరు వదలుతాము.ఈ 24 కేశవ నామాలు చెప్పడంలో విశిష్టత ఏమి? దాని విషయము, అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది.ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో చానిపైన పరిపూర్ణమైన విశ్వాసము కలుగుతుంది.ప్రీతితో కార్యము చేస్తాము. *1. ఓం కేశవాయనమః* (శంఖం _చక్రం_గద_పద్మం) బ్రహ్మ రుద్రులకు ప్రవర్తకుడూ,నియామకుడూ అయినందువల్ల శ్రీహరి ‘కేశవుడు’అనబడుతున్నాడు.ఈ కేశవుడు గాయత్రిలోని ‘తత్’ అన్న మొదటి అక్షరానికీ,‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అన్న మహామంత్రం లోని ‘ఓం ’అన్న అక్షరానికీ,ఇరవై నాలుగు తత్వాలలో మొదటిదైన అవ్యక్త తత్వానికీ,మార్గశీర్షమాసానికీ,శుక్లపక్షంలో లలాటంమీద ధరించే ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలలో ఒకటైన నామానికీ,మేషరాశికీ,ఆహారపదార్థాలలో ఒకటైన అన్నానికీ నియామకుడు. *2. ఓం నారాయణాయనమః* (పద్మం_గద_చక్రం_శంఖం) నాశరహితుడైనందువల్ల విష్ణువు ‘నరుడు’ ఆయన చేత,సృష్టించబడిన జలం ‘నార’అనబడుతోంది.ప్రళయోదకం మీద శయనించిన విష్ణువు ‘నారాయణుడు’ అయ్యాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘న’అక్షరానికీ,గాయత్రిలోని‘స’అన్న అక్షరానికీ,మహత్తత్వానికీ,పౌష్యమాసానికీ,శుక్లపక్షంలో ఉదరం మీద ధరించే నామానికీ,వృషభరాశికీ, పరమాన్నానికీ, ప్రాతఃకాలానికీ నియామకుడు. *3. ఓం మాధవాయ నమః* (చక్రం_శంఖం_పద్మం_గద) ‘మధు’నామక యదువంశ శాఖలో జన్మించడంవల్లా,రమాదేవికీ పతి అయినందువల్లా,సర్వోత్తముడు అయినందువల్లా,శ్రీహరి ‘మాధవుడు’ అయ్యాడు. ఈ మాధవుడు వాసుదేవ మహామంత్రంలోని‘మో’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘వి’అన్న అక్షరానికీ,అహంకారతత్వానికీ,మాఘమాసానికీ,శుక్లపక్షంలో హృదయంమీద ధరించే నామానికీ,మిథునరాశికీ,భక్ష్యాలకూ నియామకుడు. *4. ఓం గోవిందాయ నమః* (గద_పద్మం_శంఖం_చక్రం) వేదాల మూలంగా పొందబడేవాడూ,భూమినీ,గోవులనూ రక్షించేవాడూ,మోక్షప్రదుడూ అయినందువల్ల శ్రీహరి ‘గోవిందుడు’ అనబడుతాడు.ఈ గోవిందుడు వాసుదేవ మంత్రంలోని‘భ’అన్న అక్షరానికీ’గాయత్రిలోని“తుః”అన్న అక్షరానికీ,మనస్తత్త్వానికీ,పాల్గుణ మాసానికీ, శుక్లపక్షంలో కంఠ మధ్యలో ధరించే నామానికీ,కర్కాటక రాశికీ,నేయికీ నియామకుడు. *5. ఓం విష్ణవే నమః* (పద్మం_శంఖం_చక్రం_గద) జ్ఞానానందాది సమస్త గుణాలతో,దేశతఃకాలతః వ్యాప్తుడైనందువల్లా సర్వోత్తముడై ఉన్నందువల్లా శ్రీహరి “విష్ణువు” అనబడుతున్నాడు. ఈ విష్ణువు వాసుదేవ మహా మంత్రంలోని‘గ’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘వ’అన్న అక్షరానికీ కర్ణతత్త్వానికీ,చైత్రమాసానికీ,శుక్లపక్షంలో ఉదరం యొక్క దక్షిణ పార్శ్వంలో ధరించే నామానికీ,సింహరాశికీ,పాలకూ నియామకుడు. *6.ఓం మధుసూదనాయ నమః* (శంఖం_పద్మం_గద_చక్రం) “మధు”నామక దైత్యుడిని సంహరించినందువల్లా,సాత్త్విక లోకానికి సుఖాన్ని ప్రసాదించేవాడైనందువల్లా శ్రీహరి‘మధుసూదనుడు’ అనబడుతున్నాడు. ఈ మధుసూదనుడు వాసుదేవ మహామంత్రంలోని‘వ’అన్న అక్షరానికీ,గాయత్రిలోని ‘రే’అన్న అక్షరానికీ,త్వక్ తత్త్వానికీ,వైశాఖమాసానికీ,శుక్లపక్షంలో కుడిస్తనంమీద ధరించే నామానికీ,కన్యారాశికీ,మధుర భక్ష్య విశేషానికీ నియామకుడు.ఈ మధుసూదనుడు‘హస్తిని’నాడిలో ఉంటాడు *7. ఓం త్రివిక్రమాయ నమః* (గద_చక్రం_శంఖం_పద్మం) మూడు వేదాలనూ,మూడు కాలాలనూ,సత్త్వాది మూడు గుణాలనూ,భూరాది మూడు లోకాలనూ,త్రివిధ జీవులనూ,చేతన అచేతన మిశ్రములన్న త్రివిధ ద్రవ్యాలనూ తన స్వరూపంతో వ్యాపించి నెలకొన్న కారణంగా శ్రీహరి ‘త్రివిక్రముడు’ అనబడుతాడు. వాసుదేవ మహామంత్రంలోని “తే”అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘ణి’అన్న అక్షరానికీ,నేత్ర తత్త్వానికీ,జ్యేష్ఠమాసానికీ,శుక్లపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ,తులా రాశికీ,వెన్నకూ నియామకుడు. *8. ఓం వామనాయ నమః* (చక్రం_గద_పద్మం_శంఖం) అపేక్షిత సుఖాలనూ,అభీష్టాలనూ కరుణించేవాడూ,మోక్ష విరోధులైన దైత్యులను అంధకారంలో నెట్టివేసేవాడూ అయినందువల్ల శ్రీహరి‘వామనుడు’ అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘వా’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘యం’అన్న అక్షరానికీ జిహ్వాతత్త్వానికీ,ఆషాడమాసానికీ,శుక్ల పక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికీ,వృశ్చికరాశికీ,పెరుగుకూ నియామకుడు. *9. ఓం శ్రీధరాయ నమః* (చక్రం_గద_శంఖం_పద్మం) శ్రీ శబ్దవాచ్య అయిన మహాలక్ష్మికి కూడా ధారణకర్తా,పోషణకర్తా అయినందువల్లా లక్ష్మిని సర్వదా తన వక్షస్థలంలో ధరించి ఉండడం చేతా శ్రీహరి‘శ్రీధరుడు’ అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘సు’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘భ’అన్న అక్షరానికీ,ఘ్రాణతత్త్వానికీ,శ్రావణమాసానికీ,శుక్లపక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికీ,ధనూరాశికీ,ముద్దపప్పుకూ నియామకుడు. *10. ఓం హృషీకేశాయ నమః* (చక్రం_పద్మం_శంఖం_గద) ఇంద్రియ నియామకుడూ,రమ,బ్రహ్మ,రుద ్రాదులకు ఆనందాన్ ని ఇచ్చేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘హృషీకేశుడు’ అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని ‘దే’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘ర్గో’అన్న అక్షరానికీ,వాక్‍తత్త్వానికీ,భాద్రపద మాసానికీ,శుక్లపక్షంలో ఎడమ భుజంమీద ధరించే నామానికీ,మకర రాశికీ,ఆకుకూరలతో తయారుచేసిన పదార్థాలకూ నియామకుడు. *11. ఓం పద్మనాభాయ నమః* (పద్మం_చక్రం_గద_శంఖం) నాభిలో పద్మాన్ని కలిగినవాడూ,భక్తుల మనస్సులో ప్రకాశించేవాడూ,సూర్యకాంతి వంటి కాంతి కలిగినవాడూ అయినందువల్ల శ్రీహరి‘పద్మనాభుడు’ అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రం లోని‘వా’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘దే’అన్న అక్షరానికీ,పాణితత్త్వానికీ, ఆశ్వయుజమాసానికీ,శుక్ల పక్షంలో కంఠం ఎడమభాగంలో ధరించే నామానికీ,కుంభరాశికీ,కూరగాయలతో తయారుచేసే పదార్థాలకు నియామకుడు. *12. ఓం దామోదరాయ నమః* (శంఖం_గద_చక్రం_పద్మం) యశోదచేత పొట్టకు బిగించబడిన తాడుగలవాడూ,ఇంద్రియనిగ్రహం కలిగిన ఋషులతో క్రీడించేవాడూ,దానశీలురకు ఆనందాన్ని ఇచ్చేవాడూ,దైత్యులకు దుఃఖం కలిగించేవాడూ,దయాయుక్తులైన జీవులతో క్రీడించేవాడూ అయినందువల శ్రీహరి‘దామోదరుడు’ అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘య’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘వ’అన్న అక్షరానికీ,పాదతత్త్వానికీ,కార్తీకమాసానికీ,శుక్లపక్షంలో మెడపైన ధరించే నామానికీ,మీనరాశికీ,అన్ని రకాల పుల్లని పదార్థాలకీ నియామకుడు. *13. ఓం సంకర్షణాయ నమః* (శంఖం_పద్మం_చక్రం_గద) భక్తుల చిత్తాన్ని ప్రాపంచిక విషయాలనుండి మరలించి వైరాగ్య భావాన్ని కరుణించేవాడైనందువల్ల శ్రీహరి‘సంకర్షణుడు’ అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని‘స’అన్న అక్షరానికీ,పాయు తత్త్వానికీ,కృష్ణపక్షంలో నుదిటిపై ధరించే నామానికీ,ఆమ్ల మిశ్రమాలు కాని పదార్థాలకీ, మనోమయకోశానికీ,క్షత్రియవర్ణానికీ,స్త్రీశరీరానికీ,ఋతుసామాన్యానికీ,రుద్రునికీ,మధ్యాహ్నసవనానికీ,ఆవేశరూపాలకూ,రాజసద్రవ్యాలకూ,త్రేతాయుగానికీ,శరదృతువుకూ నియామకుడు. *14. ఓం వాసుదేవాయ నమః* (శంఖం_చక్రం_పద్మం_గద) త్రిలోకాలకూఆవాసస్థానమైనవాడూ,సర్వాంతర్యామీ,సర్వశక్తుడూ,సర్వచేష్టకుడూ,సర్వాభీష్టప్రదుడూ,యోగ్యజీవులకు ముక్తిని అనుగ్రహించేవాడూ,వసుదేవసుతుడూ అయినందువల్ల శ్రీహరి ‘వాసుదేవుడు’అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని‘ధీ’అన్న అక్షరానికీ,ఉపస్థతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఉదరమధ్యంలో ధరించే నామానికీ,పంచదారకూ,బెల్లానికీ,బ్రాహ్మణవర్గానికీ,పురుషశరీరానికీ,సాయంసవనానికీ,అవతారరూపాలకూ,శుభద్రవ్యాలకూ,కృతయుగానికీ,హేమంత ఋతువుకూ నియామకుడు. *15. ఓం ప్రద్యుమ్నాయ నమః* (శంఖం_గద_పద్మం_చక్రం) అసదృశమైన కాంతీ,యశస్సు కలిగి ఉన్నందువల్ల శ్రీహరి ‘ప్రద్యుమ్నుడు’అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని‘మ’అన్న అక్షరానికీ,శబ్దతత్త్వానికీ,కృష్ణపక్షంలో హృదయభాగంలో ధరించే నామానికీ,వడపప్పు మొదలైన పదార్థాలకూ,వైశ్యవర్ణానికీ,స్త్రీ శరీరానికీ,అయనానికీ,ప్రాతఃసవనానికీ,లీలారూపాలకూ,పీతవర్ణ ద్రవ్యాలకూ,ద్వాపరయుగానికీ,వర్ష ఋతువుకూ నియామకుడు. *16. ఓం అనిరుద్ధాయ నమః* (గద_శంఖం_పద్మం_చక్రం) ఎవ్వరిచేతా నిరోధించబడనివాడూ,సర్వశక్తుడూ,గుణపూర్ణుడూ,మనస్సుతో సంపూర్ణంగా తెలియబడనివాడూ,జ్ఞానుల మనసులలో ధ్యానంతో బంధించబడేవాడూ,వేదవిరుద్ధ ఆచార నిరతులను సంహరించేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘అనిరుద్ధుడు’అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని‘హి’అన్న అక్షరానికీ,స్పర్శతత్త్వానికీ,కృష్ణపక్షంలో కంఠ మధ్యభాగంలో ధరించే నామానికీ,చేదుపదార్థాలకూ,శూద్ర వర్ణానికీ,అన్నమయకోశానికీ,భోగ్యవస్తువులన్నింటికీ, అబ్దానికీ, నల్లని ద్రవ్యాలకూ, కలియుగానికీ, గ్రీష్మఋతువుకూ నియామకుడు. *17. ఓంపురుషోత్తమాయనమః* (పద్మం_శంఖం_గద_చక్రం) దేహనాశంగల సర్వజీవులూ క్షరపురుషులు.ఏ విధమైన నాశనమూలేని అప్రాకృత శరీరంగల శ్రీమహాలక్ష్మిదేవి అక్షరపురుష.ఈ ఉభయ చేతనులకంటే సర్వోత్తముడైనందువల్ల శ్రీహరి‘పురుషోత్తముడు’అనబడుతున్నాడు ఈయన గాయత్రిలోని ‘థి’అన్న అక్షరానికీ,రూపతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఉదరం కుడిభాగంమీద ధరించే నామానికీ,ఇంగువ,యాలకులు,ఆవాలు,కర్పూరాలకూ నియామకుడు. *18. ఓం అధోక్షజాయ నమః* (గద_శంఖం_చక్రం_పద్మం) ఇంద్రియ నిగ్రహం కలిగిన వసుదేవాదులవల్ల ప్రాదుర్భవించినవాడూ,నిత్యజ్ఞానస్వరూపుడూ,అక్షయకుమారుడిని సంహరించిన హనుమంతుడిచేత తెలియబడేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘అధోక్షజుడు’ అనబడుతాడు. ఈయన గాయత్రిలోని‘యో’అన్న అక్షరానికీ,రసతత్త్వానికీ,కృష్ణపక్షంలో కుడిస్తనంమీద ధరించే నామానికీ,పాలకూ,పానకమూ,మజ్జిగకూ,పచ్చిపులుసుకూ,నేతితో,నూనెతో వేయించిన పదార్థాలకూ నియామకుడు. *19. ఓం నారసింహాయ నమః* (పద్మం_గద_శంఖం_చక్రం) నరుడిలాగా,సింహంలాగా ఉభయాత్మకమైన శరీరం కలిగివున్నందువల్ల శ్రీహరి ‘నారసింహుడు’అనబడుతాడు. ఈయన గాయత్రిలోని ‘యో’అన్న అక్షరానికీ,గంధతత్త్వానికీ, కృష్ణపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ,బూడిద గుమ్మడికాయ,నువ్వులు,మినుములతో తయారుచేసిన వడియాలు మొదలైన పదార్థాలకూ,ఈశాన్య దిక్కుకూ నియామకుడు. *20. ఓం అచ్యుతాయ నమః* (పద్ మం_చక్రం_శంఖం_గద) శుద్ధజ్ఞానానందాలే దేహంగా క లవాడూ,సకలగుణ పరిపూర్ణుడూ,సత్య సంకల్పుడూ అయినందువల్ల సర్వదా పూర్ణకాముడూ,దోషరహితుడూ అయినందువల్లా శ్రీహరి ‘అచ్యుతుడు’అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని‘నః’అన్న అక్షరానికీ,ఆకాశతత్త్వానికీ,కృష్ణపక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికీ,ఉద్దిపప్పుతో తయారుచేసే వడ మొదలైన వాటికి నియామకుడు. *21.ఓంజనార్థనాయనమః* (చక్రం_శంఖం_గద_పద్మం) సముద్రంలో ఉండి తరచుగా దేవతల్ని పీడించే మధు,కైటభ,హయగ్రీవాది దైత్యులను మర్దనం చేసినవాడూ, మోక్షప్రదుడూ, జన్మలేనివాడూ, సంసారదుఃఖాన్ని పరిహరించేవాడూ,సుజీవులచేత పొందబడేవాడూ అయినందువల్ల శ్రీహరి‘జనార్ధనుడ’య్యాడు. ఈ జనార్ధనుడు గాయత్రిలోని ‘ప్ర’అన్న అక్షరానికీ,వాయుతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికీ,ఉప్పుకూ,నైరుతి దిక్కుకూ నియామకుడు. *22.ఓంఉపేంద్రాయనమః* (గద_చక్రం_పద్మం_శంఖం) ఇంద్రుడిని అనుజుడిగా పొంది ఉన్నందువల్ల శ్రీహరి ‘ఉపేంద్రుడు’ అనబడుతున్నాడు. ఈ ఉపేంద్రుడు గాయత్రిలోని‘చో’అన్న అక్షరానికీ,తేజోతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఎడమ స్తనం మీద ధరించే నామానికీ,అరటిపండు,కొబ్బరికాయ మొదలైన ఫలాలకీ,వాటి రసాలకీ,తూర్పు దిక్కుకూ నియామకుడు. *23. ఓంహరయేనమః* (చక్రం_పద్మం_గద_శంఖం) భక్తుల పాపాలను పరిహరించేవాడు కావడంచేత నారాయణుడు‘హరి’అనబడుతున్నాడు. ఈ హరి గాయత్రిలోని ‘ద’ అన్న అక్షరానికీ,అపోతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఎడమ భుజంమీద ధరించే నామానికీ,తాంబూలానికీ నియామకుడు. *24. ఓంకృష్ణాయనమః* (గద_పద్మం_చక్రం_శంఖం) సృష్టి,స్థితి,సంహార నియమనాదుల వల్ల సకల జగత్తునూ తనలోనికి లాగికొనువాడూ,పూర్ణానంద స్వరూపుడూ, నీలవర్ణ దేహకాంతికలవాడూ అయినందువల్ల శ్రీహరి“కృష్ణుడు”అనబడుతున్నాడు. ఈ కృష్ణుడు గాయత్రిలోని‘యాత్’ అన్న అక్షరానికీ,పృథ్వీతత్త్వానికీ,కృష్ణపక్షంలో మెడమీద ధరించే నామానికీ, త్రాగేనీటికీ, దైహిక కర్మకూ నియామకుడు.

+12 प्रतिक्रिया 2 कॉमेंट्स • 6 शेयर
కౌశల్ Oct 11, 2019

https://goo.gl/ZLK01K

+15 प्रतिक्रिया 1 कॉमेंट्स • 4 शेयर