🌺🌺అసిధారావ్రతం🌺🌺🌺 💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫 ధర్మాన్ని దీక్షతో తపస్సులా ఆచరించాలి. మనసా, వాచా, కర్మణా పాటించాలి. చేతనలోను, అచేతనలోను ధర్మబద్ధులై ఉండాలి. ధర్మరాజు బ్రహ్మవేత్త, పండితుడు, జ్ఞాని, సత్యవంతుడు, స్థితప్రజ్ఞుడు. విదురుడి ప్రశంస పొందినవాడు. ధర్మచింతనతో, ధర్మానురక్తితో భీష్ముడి అభిమానానికి పాత్రుడై రాజనీతిని, దానిలోని రహస్యాలను ఆయన నుంచి గ్రహించినవాడు. ధర్మజుడి ధర్మనిష్ఠకు దర్పణమే యక్షప్రశ్నా ఘట్టం. ఇది మహాభారతంలోని అరణ్య పర్వంలోనిది. అజ్ఞాతవాసం చేస్తున్న పాండవులు ద్వైతవనానికి చేరుకున్నారు. అప్పుడు తన అరణి (నిప్పు పుట్టించడానికి ఉపయోగపడే కొయ్య)ని ఒక మృగం అపహరించిందని, దాన్ని తనకు సంపాదించిపెట్టమని ఓ పండితుడు ధర్మరాజును ప్రార్థిస్తాడు. ఆ ప్రయత్నంలో వెళ్ళిన తన సోదరులు ఎంతసేపటికీ రాకపోవడంతో ధర్మరాజు బయలుదేరి ఒక సరస్సు దగ్గర విగతజీవులైన భీమ, అర్జున, నకుల, సహదేవులను చూస్తాడు. ఖిన్నుడవుతాడు. నోరు పిడచ కట్టుకుపోవటంతో నీరు తాగడానికి సరస్సులో దిగుతుండగా ఓ యక్షుడి హెచ్చరిక వినిపిస్తుంది. తన ప్రయత్నాన్ని విరమించుకుని అతడి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సంసిద్ధుడవుతాడు. అవే యక్షప్రశ్నలు. యక్షుడు అడిగిన ప్రశ్నలు తత్వజ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి చెందినవి. ఆత్మవిద్యలో మనిషికి సహాయపడగలవి మనసు, ప్రాణం, ఇంద్రియ నిగ్రహం. వీటి సముపార్జనకు జ్ఞానసంపన్నులైన గురువులను ఆశ్రయించాలి. భూమి కంటే గొప్పది తల్లి. ఆకాశం కంటే ఎత్తయిన వ్యక్తి తండ్రి. వీరికి సేవ చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మనిషికి దానమే ఎంతో కీర్తినిస్తుంది. సత్యమే స్వర్గం. సత్యపథం ఆనందాన్నిస్తుంది. ఆ ఆనందస్థితే స్వర్గం. ధర్మరాజు చెప్పిన కొన్ని సమాధానాల సారాంశమిది. భూతదయ కలిగి ఉండటం ఉత్తమ ధర్మం. మోక్ష సాధనమైన ప్రణవం నశించని ఫలం. అది శాశ్వతమైనది. ఆ ప్రణవంలో నిశ్చలతకు మనోనిగ్రహమే శరణ్యం. ఈ మనో నిగ్రహమే సంసారం వల్ల ఏర్పడే శోకాన్ని తట్టుకుని అధిగమించే మానసిక స్థైర్యాన్నిస్తుంది. ఆత్మతత్వాన్ని బోధపరుస్తుంది. ఈ మనోనిగ్రహాన్ని సత్పురుషుల సాంగత్యంతోనే పొందగలం. వీరితో స్నేహాన్ని వీడక, జీవితాంతం నిలుపుకోవాలి. ధర్మంలో ప్రీతి, భక్తి కలవాడు సద్గతిని పొందుతాడన్న ధర్మరాజు సమాధానం విన్న యక్షుడు అతడి జ్ఞాన సంపదకు ఎంతో సంతోషించాడు. యుధిష్ఠిరుడి ధర్మనిష్ఠ ఆచరణలో ఏ పాటిదో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది. ‘రాజా, నీ సమాధానాలతో ఎంతో తృప్తి పొందాను. నీ తమ్ముళ్లలో ఒకరిని కోరుకో’ అన్నాడు. నకులుణ్ని బతికించమని కోరుకున్న ధర్మరాజును- ధనుర్విద్యా పారంగతుడు అర్జునుణ్ని గాని, అమేయ బల సంపన్నుడైన భీముణ్ని గాని ఎందుకు ఎంచుకోలేదని యక్షుడు ప్రశ్నించాడు. ధర్మరాజు తన తల్లి కుంతికి తానున్నాడు కనుక పినతల్లి కుమారుణ్ని జీవింపజేయమని అడిగానన్నాడు. యుధిష్ఠిరుడి ధర్మనిష్ఠకు పరమానందాన్ని పొందిన యక్షరూపంలో ఉన్న యముడు అందరికీ ప్రాణదానం చేశాడు. యక్షుడి ప్రశ్నలకు ధర్మరాజు ఇచ్చిన సమాధానాలు అతడి ధర్మతత్వ గూఢతను, గాఢతను, అందుకున్న లోతులను తెలియజేస్తాయి. ధర్మతత్వ శోధనలో అతడి జిజ్ఞాస ఆచరణలో ఎంతవరకు నిలబడగలదో పరీక్షించేందుకే తన ఎంపిక నిర్ణయాన్ని విశదపరచమని ధర్మరాజును అడిగాడు. నిజానికి అతడి ధర్మాచరణ నిష్ఠను లోకవిదితం చేయడమే యముడి సంకల్పం. తనకు సత్యంకన్నా సమత గొప్పదని, తన ధర్మశీలతను నిశితంగా గమనించే లోకానికి తాను జవాబుదారుణ్నని ధర్మరాజు అంటాడు. ధర్మాచరణ విశిష్టత చూపడానికి యక్షప్రశ్నలు, వాటికి యుధిష్ఠిరుడు చెప్పిన సమాధానాలు అద్భుత ప్రమాణంగా కలకాలం నిలుస్తాయి!

+10 प्रतिक्रिया 1 कॉमेंट्स • 14 शेयर

+11 प्रतिक्रिया 1 कॉमेंट्स • 0 शेयर

+13 प्रतिक्रिया 1 कॉमेंट्स • 1 शेयर

దశమహావిద్యలు అని పేర్కొనబడిన మంత్రవిద్యలకు 10 మంది దేవతలు అధిపతులుగా ఉన్నారు. ఈ దశమహావిద్యలలో ఏడవ అవతారం అతి విచిత్రమైన అవతారం. తాంత్రికులు ఎక్కువగా సిద్ధిని పొందటానికి ఈమెను స్మశానాలలో రాత్రివేళలలో పూజిస్తుంటారు. మరి దశమహావిద్యలు ఏంటి? విచిత్ర అవతారం గల అమ్మవారు ఎవరనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దశమహావిద్యలలో అతి విచిత్రమైన అవతారం ధూమవతి. ఈమె ఒక వితంతువుగా కనిపిస్తుంది. దీనికి వెనుక ఒక కథ ఉంది, ఒక నాడు పరమశివుడు ధ్యానంలో ఉండగా పార్వతీదేవి ఆకలిగా ఉంది అని అడుగగా శివుడు వేచి ఉండమని చెప్పాడు, మరల కొంత సమయం గడిచాక పార్వతిదేవి శివుని చూచి ఆకలి అని అడుగగా శివుడు మరల వేచి ఉండమని చెప్పెను, అది విని పార్వతిదేవి మిక్కిలి కోపంతో శివుని మ్రిగేసింది. ఆమెలో ఉన్న శివుడు కోపంతో మూడోకన్ను తెరచి పార్వతిదేవితో ఇలా అన్నాడు ఈ లోకంలో పురుషుడు అనే వాడు ఉండడు అనెను, దాని ప్రతిఫలమే ఆమె వితంతువు రూపం. శివుడు మూడో కన్ను తెరువగా ఆమెలో నుండి పొగ రాసాగింది అందువల్లనే ఆమెకు ధూమవతి అని పేరు వచ్చినది అని చెబుతారు ఈమె చూడటానికి వికారంగా, చేతిలో చాటతో, పొగసూరిన బట్టలతో, మెల్లకళ్ళతో, గుర్రంలేని బండిపై కూర్చుని ఉంటుంది. ఈమె వికారమైన రూపం మనకి సౌందర్యాన్ని మించింది ఎంతో ఉందని తెలియజేస్తుంది. ఇక ధూమవతి సిద్ధిని ప్రసాదించే తల్లి. ఈమెను ముఖ్యంగా వితంతువులు, పెళ్ళికాని వారు పూజిస్తుంటారు. ఈమెకు చాలా అరుదుగా గుడులు ఉంటాయి. తాంత్రికులు ఎక్కువగా సిద్ధిని పొందటానికి ఈమెను స్మశానాలలో రాత్రివేళలలో పూజిస్తుంటారు. ఈమెను చూస్తేనే ఎవరికైనా తీవ్రమైన భయాందోళనలు కలుగుతాయి. కానీ ఈమెను ఆరాధించేవారికి అపూర్వమైన వరాలను ఇచ్చి ఆదరిస్తుంది.

+8 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

🌼🌿ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహం లో భాగవత ప్రవచనం ఇస్తున్నారు..అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి, ఒక మూల దాక్కున్నాడు. భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది. తల్లి యశోద, కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము అని అనుకున్నాడు. దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు. బ్రాహ్మణుడు భయపడి ‘నా దగ్గర ఏమీ లేదు ‘ అని అన్నారు. దొంగ, మీ దెగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ పడటంలేదు. మీరు చెప్పిన, నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు, ఎక్కడ ఉంటాడో చెప్పండి’ అని అన్నాడు. బ్రాహ్మణుడు ఆలోచించి, “బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు రోజూ ఇద్దరు పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు , తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు ఛాయలో , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండే వాడే, నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు”అని ఆ దొంగ నుండి తప్పించుకోటానికి చెప్పాడు దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు.యమునా నది తీరం వద్ద కూర్చుని, ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు. ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది , ఇద్దరు పిల్లలు వస్తున్నారు.ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి, పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ. బాల కృష్ణుడిని చూడగానే, దొంగ మనసులో ఆనందం కలిగి, అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ, ‘ఏ తల్లి కన్న బిడ్డో, ఇంత అందంగా ఉన్నాడు ‘ అని అనుకున్నాడు. ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది.. తరువాత చూస్తే, దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది. అది తీసుకుని,ఆ దొంగ బ్రాహ్మణుడి దెగ్గరకి వెళ్లి, జరింగింది అంతా చెప్పాడు. ఆనందభాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన చోటు, తనకు చూపించమని దొంగని అడిగాడు. ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగానే, దొంగకి కనిపించిన బాల కృష్ణుడు, బ్రాహ్మణుడికి, కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణిడిని ,నీవు ఒక దొంగని అనుగ్రహించావు , నాకు కూడా దర్శనం ఇవ్వవా?” అని బాధపడ్డాడు. అప్ప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు ‘ *నీవు భాగవత* *పురాణమును కేవలము* *ఒక కథగా* *చదివావు* , *కాని , దొంగ,* *నువ్వు చెప్పిన* *కథని, మాటలని* *మనస్ఫూర్తిగా నమ్మాడు.* అపార నమ్మకం ,సమర్పణ శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను.” నీతి: పురాణాలను చదవడమే కాకుండా, దానిలో ఉన్నవి అనుభవించడం నేర్చుకోవాలి.

+14 प्रतिक्रिया 7 कॉमेंट्स • 6 शेयर

🌼🌿శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ శివ మానసపూజ స్తోత్రమ్ 🌼🌿 మనకు మహానుభావులు..జగద్గురువులైన శ్రీశంకరభగవత్పాదులు..సాక్షాత్తు కైలాస శంకరులే కాలడి శంకరులుగా వచ్చారు, వారు శరీరంలో ఉన్నది 32 సం!! ఐనా మనకు చాలా మహానీయమైన ఆత్మతత్వ గ్రంథాలు & దైవీ స్తోత్రాలు ఇచ్చారు, పురాణ, ఇతిహాసాలు, భక్తుల చరిత్రలు, మహా భక్తులైనవారు ఇచ్చిన స్తోత్రాలు చదివినా తరించవచ్చు, లేదా నామాన్ని పట్టుకున్నా తరించబడతారు. అందులో *మహాద్భుత స్తోత్రం శ్రీశివమానస పూజ స్తోత్రం.* మనకు శరీరం ఇచ్చి జ్ఞానం పొంది మోక్షం వైపు అడుగు వేయమని ఈశ్వరుడు ఈ శరీరం ఇచ్చినా అజ్ఞానికి అవేమి పట్టవు, విషయసుఖాలే మధురం అని అంటాడు, కొంత మంది నిజంగానే సమయం లేకుండా వుంటారు, అందుకే అందరికోసం శంకరభగవత్పాదులు అద్భుతమైన స్తోత్రం ఒకటి ఇచ్చారు అదే *"శివ మానస పూజ స్తోత్రం"* దాని తాత్పర్యం . దీనిని చదువుకుంటే ఈశ్వరుడికి అన్ని ఉపచారాలు చేసేసినట్టే అని శంకరుల అభిమతం, అందుకే ఈ వివరణ. అసలు అలా పూజ హృదయంలో నిత్యం జరగాలి లేదా కనీసంలో కనీసం ఉభయ సంధ్యాల్లో చేసి హృదయమున ఆ విశ్వేశ్వరుడిని నిలుపుకోవాలి అని శంకరుల ఉదేశ్యం. శ్రీ శివ మానస స్తోత్రం రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యామ్బరం నానారత్నవిభూషితం మృగమదామోదాఙ్కితం చన్దనమ్ జాతీచమ్పకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ !! 1 !! ఓ పశుపతీ, నీకు నేను పూజ ఇలాచేస్తున్నాను. రత్నఖచితమైన ఆసనము సమర్పిస్తున్నాను. గంగాజలములతో అభిషేకము చేస్తున్నాను. నానారత్నములచే అలంకరింపబడిన దివ్యమైన వస్త్రము సమర్పిస్తున్నాను. కస్తూరీ మిశ్రితమైన గంధము నీకు అలదుతున్నాను. మల్లెలు, చంపకములు, మారేడుదళాలు, ధూపము, దీపమూ నీకు సమర్పిస్తున్నాను. ఈ ఉపచారములన్నీ, దేవా, నా హృదయములో కల్పిస్తున్నాను. ఓ దయానిధీ, స్వీకరించు. సౌవర్ణే నవరత్నఖణ్డరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పఞ్చవిధం పయోదధియుతం రమ్భాఫలం పానకమ్ । శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖణ్డోజ్జ్వలం తామ్బూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు !! 2 !! శంభో! నీకు నేను భోజనం ఇలా అర్పిస్తున్నాను. నవరత్నఖచితమైన స్వర్ణపాత్రయందు పాయసము, నెయ్యి, పంచ భక్ష్యాలు, పాలు, పెరుగు, అరటిపండు, పానకము, శాకములతో అర్పిస్తున్నాను. శుద్ధ జలమూ, రుచికరమూ, కర్పూరముతోకూడినదీ అయిన తాంబూలమూ సమర్పిస్తున్నాను. నీకు ఈ భోజనం, ప్రభూ, నా హృదయంలో కల్పిస్తున్నాను, స్వీకరించు. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలమ్ వీణాభేరిమృదఙ్గకాహలకలా గీతం చ నృత్యం తథా । సాష్టాఙ్గం ప్రణతిః స్తుతిర్బహువిధా హ్యేతత్సమస్తం మయా సఙ్కల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో 3 శివా! ఇక నీ భోజనానంతర ఉపచారాలు చూడవయ్యా!. నీకు ఛత్రం పడుతున్నాను, రెండు చామరాలతో వీస్తున్నాను. విసనకఱ్ఱతో గాలిని వీస్తున్నాను, నిర్మలమైన అద్దమూ సమర్పిస్తున్నాను. వీణ, భేరి, మృదంగ వాయిద్యాల కోలాహలంతో, గానమూ, నృత్యమూ సమర్పిస్తున్నాను. నీకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. నిన్ను బహువిధాలుగా స్తుతిస్తున్నాను. ఈ సమస్తమూ , ప్రభో! నీకు నా హృదయములో చేసే ఈ పూజను స్వీకరించు. ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః । సఞ్చారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శమ్భో తవారాధనమ్4 శంభో! నీవే నా ఆత్మవు. అమ్మవారు నా బుద్ధి. నా ప్రాణాలు నీ సహచరులు. నా శరీరము నీ ఇల్లు. నా ఇంద్రియభోగములు నీ పూజా వస్తువులు. నా నిద్ర నీ సమాధిస్థితి. నా నడక నీకు ప్రదక్షిణము. నా మాటలన్నీ నీ స్తోత్రాలు. శివా, నేను ఏ ఏ పనులు చేస్తున్నానో, అవి అన్నియూ నీ ఆరాధనయే. కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధమ్ విహితమవిహితం వా* *సర్వమేతత్క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవశమ్భో ॥ 5॥ శ్రీ మహాదేవా! శంభో! కరుణా సముద్రా! నేను కరచరణాదులతోనూ, శరీరంతోనూ, మాటలతోనూ, నా చేతలతోనూ, చెవులతోనూ, కళ్ళతోనూ, మనస్సుతోనూ చేసిన అపరాధములు, అవి చెయ్యదగినవైనా చెయ్యకూడనివైనా సరే, వాటన్నింటినీ క్షమించు. జయ జయ శంకర. ప్రతిరోజు చదువుకుందాము. ఈశ్వరుడివైపుకి ఒక్కొక్క అడుగు వేద్దాం, అందునా బాహ్యపూజకంటే అంతరమున చేసే పూజకీ త్వరగా పలుకుతాడు శంకరుడు, (సేకరణ)

+18 प्रतिक्रिया 2 कॉमेंट्स • 2 शेयर

+25 प्रतिक्रिया 1 कॉमेंट्स • 23 शेयर

రాహువుకు శరీరమంతా విషమైతే.. తోకలో మాత్రం అమృతం ఉంటుందట..!! మహిళలు మంగళ, శుక్రవారాల్లో దుర్గాపూజ చేస్తుంటారు. దుర్గాదేవిని మంగళ, శుక్రవారాల్లో భక్తిశ్రద్ధలతో పూజించి.. కోరిన కోరికలు నెరవేరాలని సంకల్పించుకుంటారు. యువతులైతే వివాహ ప్రాప్తి కోసం.. వివాహితులైతే దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం అమ్మవారిని పూజించడం విశ్వాసం. ముఖ్యంగా వారంలోని ఈ రెండు రోజుల్లో దుర్గాపూజ చేయడం ద్వారా మహిళలు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఇందులో మంగళవారం రాహుకాల పూజకు ప్రత్యేక విశిష్టత ఉంది. రాహు దోషాలు నివృత్తి కావాలంటే మంగళవారం రోజున రాహు కాలంలో దుర్గాదేవిని స్మరిస్తూ పూజ చేయాలని పురోహితులు అంటున్నారు. దుర్గాదేవి శ్రీకృష్ణుడికి సోదరి కావడంతో విష్ణు అవతార తిథులైన అష్టమి, నవమి తిథుల్లోనూ అమ్మవారిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇంకా అమ్మవారిని.. అమావాస్య, పౌర్ణమి, మంగళ, శుక్ర, ఆదివారాల్లో పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. 💐రాహు దోషం తొలగిపోవాలంటే....!!💐 రాహు గ్రహానికి, దుర్గాదేవికి ఓ సంబంధం ఉంది. రాహు గ్రహానికి అధిదేవత దుర్గాదేవి. అందుచేత రాహు కాలంలోనే దుర్గాపూజ జరుగుతోంది. ఆదివారం రాహు కాల పూజ విశిష్టమైనది. రాహువుకు శరీరమంతా విషంతో నిండివుంటుంది. కానీ తోకలో మాత్రం అమృతం ఉంటుంది. అందుచేత ఆదివారం సూర్యుడు అస్తమించే సంధ్యాకాలానికి ముందు వచ్చే రాహుకాలంలో ఆయన తోక అమృతంగా మారివుంటుంది. అంటే ఆదివారం సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటలలోపు దుర్గాదేవిని పూజించినట్లైతే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. అనారోగ్య సమస్యలు, ఈతిబాధలు, రుణబాధలు తొలగిపోవాలంటే.. ఆదివారం సాయంత్రం రాహుకాలంలో దుర్గాదేవి కంటూ ప్రత్యేకంగా గల ఆలయంలో ఒక నిమ్మపండును సగంగా కోసి.. నిమ్మరసాన్ని పిండేసి.. నిమ్మపండును ప్రమిదల్లా తిప్పి.. అందులో నెయ్యి పోసి ఐదు వత్తులతో దీపమెలిగించాలి. ఈ దీపాలు అమ్మవారిని చూసేట్లు వెలిగించాలి. ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారికి మల్లెపువ్వులు లేదా పసుపు చామంతులను మాత్రమే సమర్పించాలి. అర్చన చేయాలనుకుంటే అమ్మవారి పేరు మీదే పూజ చేయాలి. దీపం వెలిగించాక అమ్మవారిని మూడుసార్లు ప్రదక్షణ చేసుకుని నమస్కరించుకోవాలి. దుర్గాస్తుతి చేయాలి. దుర్గాపూజ తర్వాత నవగ్రహ ప్రదక్షణలు కూడదు. ఇంటికొచ్చాక పూజగదిలో నెయ్యిదీపమెలిగించి.. ఐదు అగరవత్తులు, కర్పూరంతో పూజ చేయాలి. ఇలా తొమ్మిదివారాల పాటు దుర్గాదేవిని పూజిస్తే.. కుజదోషాలు పటాపంచలవుతాయని పండితులు చెప్తున్నారు

+14 प्रतिक्रिया 1 कॉमेंट्स • 16 शेयर