శ్రీరామరక్ష 🌺🌺 🌺🌺 🌺🌺 పాహి రామప్రభో పాహిరామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో " పాహి " శ్రీమన్మహాగుణస్తోమాభిరామ మీ నామకీర్తనలు వర్ణింతు రామప్రభో సుందరాకార మన్మందిరోద్ధార సీతేందిరా సంయుతానంద రామప్రభో " పాహి " ఇందిరాహృదయారవిందాధిరూఢా ఇందిరాకార సానంద రామప్రభో ఎందునేఁ జూడ మీ సందరానందముల్ కందునో కన్నప లింపొద రామప్రభో " పాహి " పుణ్యచారిత్రలావణ్య తారుణ్యగాం భీర్యదాక్షిణ్య శ్రీరామచంద్రప్రభో కందర్పజనక నాయందు రంజలి సదా నందుండవై పూజలందు రామప్రభో " పాహి " విందుగాఁ జెవులకు న్విందుగా నీ కథల్ కందుఁగా మిమ్ము సొంపొంద రామప్రభో వందనము చేసి మునులందఱును ఘనులైరి విందవైనట్టి గోవింద రామప్రభో " పాహి " బృందారకాదిసద్బృందార్చితపదార విందసందర్శితానంద రామప్రభో తల్లివి న్నీవె మా తండ్రివి న్నీవె మా దాతవు న్నీవె మా భ్రాత రామప్రభో " పాహి " పల్లవాధరలైన గొల్ల భామలఁగూడి యుల్లమలరఁగను రంజిల్లు రామప్రభో మల్ల రంగంబునందెల్ల మల్లులఁ జీరి యల్ల కంసుని జంపు మల్ల రామప్రభో " పాహి " కొల్లలుగ నీ మాయ వెల్లివిరియఁగఁజేయ సల్లాపమునఁ గ్రీడ సల్పు రామప్రభో తమ్ముఁడు న్నీవు పార్శ్వమ్ములంజేరి విల్లమ్ము లెక్కిడి నిల్చు టిమ్ము రామప్రభో " పాహి " క్రమ్ముకొని శాత్రవులు హుమ్మనుచు వచ్చెదరు ఇమ్మైనబాణము ల్చిమ్ము రామప్రభో రమ్ము నాకిమ్మ యభయమ్ము నీ పాదముల్ నమ్మినానయ్య శ్రీరామచంద్రప్రభో " పాహి " కంటి మీ శంఖమున్గంటి మీ చక్రమున్ గంటి మీ పాదము ల్గంటి రామప్రభో వింటి మీ మహిమ వెన్నంటి తమ్ముఁడు నీవు జంట రారయ్య నా వెంట రామప్రభో " పాహి " మేము మీవారమైనాము రక్షింపు మన్నాము జాగేల శ్రీరామచంద్రప్రభో నా మనోవీథిపైఁ బ్రేమతే నుండు మీ భూమిజాసహిత జయరామచంద్రప్రభో " పాహి " మీ మహత్త్వంబు విన్న మనస్సందుఁ బ్రే మంబువేమఱుఁ బుట్టు స్వామి రామప్రభో ఏమిరా యన్న మీ కేమి నేరమ్ముచే సేము గాకున్న దూ ఱేమి రామప్రభో " పాహి " శ్యామలం సుందరం కోమలం జానకీ కాముకం త్వాం భజే రామచంద్రప్రభో కామితార్థమ్ములిచ్చే మహత్త్వమ్మవు నా మెుఱాలించు నా స్వామి రామప్రభో " పాహి " కామితప్రదుఁడవై ప్రేమతో రక్షించు స్వామి సాకేతపురి రామచంద్రప్రభో అన్న రావన్న నీకన్న నామీదఁనెన రున్న వారేరి నా యన్న రామప్రభో " పాహి " ******* ***** ******** ***** ******* *********** ************ ****** అవ్యయుడవైన నీ యవతారములఁ దలఁచి దివ్యులైనారు మునులయ్య రామప్రభో శ్రీరామ నీ నామ మే వేళ స్మరియింతు స్వామి దయసేయు సంపదలు రామప్రభో " పాహి " సర్పశేషశయాన యెప్పుడును నిను మఱువ నొప్పుగా బ్రోవు వరదప్ప రామప్రభో పట్టాభిరామ నిను బ్రభుఁడవని నమ్మితిని కష్టపెట్టకను చేపట్టు రామప్రభో " పాహి " పాహి శ్రీరామ నీపాద పద్మాశ్రయుఁడ పాలింపుమీ భద్రశైల రామప్రభో పాహి రామప్రభో పాహి రామ.. పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో పాహి రామప్రభో పాహిరామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 భద్రాచల శ్రీ రామదాసు 🌺🌺🌺🌺🌺🌺🌺 కోదండరామా.... శరణాగతోహం 🙏🙏🙏🙏🙏🙏

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

శ్రీరామరక్ష 🌺🌺 🌺🌺 🌺🌺 శ్రీరామ నీనామ మేమి రుచిరా ఓ రామ నీనామ మెంత రుచిరా " శ్రీరామ " కరిరాజ బ్రహ్లాద తరణిజ విభీషణులఁ గాచిన నీ నామ మేమి రుచిరా " శ్రీరామ " కదళీ ఖర్జూరాది ఫలములకన్నను పతితపావననామ మేమి రుచిరా " శ్రీరామ " దధిఘృతమధురస ఫలములకన్నను పతితపావననామ మేమి రుచిరా " శ్రీరామ " నవరసపరమాన్న నవనీతములకన్న అధికమౌ నీ నామ మేమి రుచిరా " శ్రీరామ " పనస జంబు ద్రాక్ష ఫలరసములకంటె అధికమౌ నీ నామ మేమి రుచిరా " శ్రీరామ " అంజనాతనయ హృత్కంజతలమునందు రంజిల్లు నీ నామ మేమి రుచిరా " శ్రీరామ " సదాశివుఁడు నిను సదా భజించెడి సదానందనామ మేమిరుచిరా " శ్రీరామ " సారము లేని సంసారమునకు సం తారకమగు నామమేమి రుచిరా " శ్రీరామ " శరణన్న జనముల పరుగున రక్షించు బిరుదు గల్గిన నామమేమి రుచిరా " శ్రీరామ " తుంబురునారదుల్ బండుమీఱంగ గానంబు చేసెడి నామమేమి రుచిరా " శ్రీరామ " అరయ భద్రాచల శ్రీరామదాసుని నేలిన నీనామ మేమి రుచిరా " శ్రీరామ " శ్రీరామ నీనామ మేమి రుచిరా ఓ రామ నీనామ మెంత రుచిరా 🌺🌺 🌺🌺 🌺🌺🌺🌺🌺 భద్రాచల శ్రీరామదాసు 🌺🌺🌺🌺🌺🌺 కోదండరామా.... శరణాగతోహం 🙏🙏🙏🙏🙏🙏

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर