Mymandir Telugu Nov 13, 2019

+69 प्रतिक्रिया 10 कॉमेंट्स • 55 शेयर
Krishna Kishore Kola Nov 13, 2019

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

కార్తీక పురాణము 17వ అధ్యాయము కార్తీకమాసంలో పదిహేడవ రోజు చేయవలసిన విధులు : 17వ రోజు బహుళ విదియ వనభోజనము మంచిది. ఉల్లి, ఉసిరి, చద్ది, మజ్జిగ, ఎంగిలి తగిలినవి, తరిగిన వస్తువులు తినకూడదు. బంగారం, ధనము దానం చేయాలి. పదిహేడవ రోజు చేయవలసిన పారాయణము : అంగీరసుడు చేసిన జ్ఞానబోధ : ఓ మునిశ్రేష్ఠులారా! ఓ ధనలోభీ! మీకు కలిగిన సందేహాలకు సమాధానము చెప్పుచున్నాను శ్రద్ధగా వినండి. కర్మవలన ఆత్మకు దేహధారణ కలుగుచున్నది. కావున, శరీర ఉత్పత్తికి కర్మ కారణము అగుచున్నది. శరీరధారణము వలన ఆత్మకర్మను చేయును కనుక, కర్మ చేయుటకు శరీరమే కారణము. స్థూల సుక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. దానిని మీకు నేను చెప్తాను వినండి! “ఆత్మ” అనగా ఈ శరీరమును అహంకారముతో ఆవరించి ఉన్నది అని అంగీరసుడు చెప్పగా "ఓ మునీంద్రా! నేను ఇంత వరకు ఈ దేహమే ఆత్మయని భావించుచున్నాను. కనుక "అహంబ్రహ్మ - నేను బ్రహ్మను” అనే దానిని వివరించి చెప్పండి” అని కోరాడు. అప్పుడు అంగీరసుడు ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి, "నేను-నాది” అని చెప్పబడు జీవత్మాయే “అహం” అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మా "న:” అను శబ్దము. ఆత్మకు (కుండ మొదలైన) వస్తువులవలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞానరూపి శరీర ఇంద్రి యములు మొదలగువాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడు ఒకేరీతి ప్రకాశించుచు ఉండునదే “ఆత్మ” అనబడను. “నేను” అనునది శరీర ఇంద్రియాలలో కూడా నామరూపంతో ఉండి నశించునవియే గాక, ఇట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటి అందునూ “నేను”, “నాది” అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించవలెను. ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునట్లు శరీర, ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే, అవి ఆత్మవలన తమ పనిని చేయును. నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి, మేల్కొన్న తర్వాత "నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉన్నది” అనుకొనేదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును, ప్రకాశింప చేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపము అగుట వలన, దాని ద్వారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువు ఏదో అదియే "పరమాత్మ” అని గ్రహింపుము. "తత్వమసి" మొదలైన వాక్యములందలి “త్వం” అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం “తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము "తత్త్వమసి” అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును భోదించును. ఈ విధంగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపము ఒక్కటియే నిలుచును. అదియే "ఆత్మ దేహలక్షణములుండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గానీ, ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ". ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో, అదేవిధంగా ఒక దేహాంతర్యామి అగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులచే కర్మ ఫలములను అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు, జీవులు ఆ కర్మ ఫలమను అనుభవింతురనియు నీవు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తిగలవాడై గురుశుశ్రూష చేసి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి పొందవలయును. మంచిపనులు తలచిన చిత్తశుద్దియు, దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్టానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు - అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి సప్తదశాధ్యాయము - పదిహేడవ రోజు పారాయణ పూర్తి అయినది.

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

+10 प्रतिक्रिया 1 कॉमेंट्स • 11 शेयर
Kolli Madhava Kumar Nov 13, 2019

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
9848729132 Nov 13, 2019

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Karuna.u Nov 13, 2019

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर

+14 प्रतिक्रिया 0 कॉमेंट्स • 7 शेयर

+7 प्रतिक्रिया 1 कॉमेंट्स • 5 शेयर
Ramanujam Thuppal Nov 13, 2019

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
C.S.Misra. Nov 13, 2019

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 4 शेयर
PitlaGopal Nov 13, 2019

+19 प्रतिक्रिया 2 कॉमेंट्स • 18 शेयर

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
శ్రీ Nov 13, 2019

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

🌼🌿శ్రీశైలం క్షేత్రం - స్థల పురాణం🌼🌿 ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లిఖార్జున లింగము, అమ్మవారి కంఠం( గ్రీవం ) పడిన స్థానం కనుక అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబికా శక్తి పీఠము శ్రీశైలంలో ఒకే ఆవరణలో వెలిశాయి. శ్రీశైల స్థల పురాణం మేరకు శ్రీమల్లి కార్జున స్వామి ఆలయం 10వ శతాబ్దానిదనీ, భ్రమరాంబాలయం 16వ శతాబ్దానిదని ఆధునిక చరిత్రకారులు చెప్తున్నప్పటికీ ఇది చాలా ప్రాచీన మైనది. శ్రీశైల స్థల పురాణమంతయు స్కాందపురాణములోని “శ్రీశైల ఖండము” అనుపేర గలదు. ఈ ప్రాంతంలో శిలాదుడనే మహర్షి శివుని గురించి ఘోర తపస్సు చేయగా పరమశివుడు ఆ మహర్షి తపమునకు మెచ్చి ప్రత్యక్షమై వరము కోరుకోమని అడిగెను. అప్పుడు శిలాదుడు స్వామి నాకు నీ వరం చేత పుత్రుడు పొందేలా వరం ప్రాసాదించు అని కోరుకున్నాడు.ఆ వర ప్రభావంచేత శిలాదుడికి నందీశ్వరుడు,పర్వతుడనే ఇద్దరు కుమారులు జన్మించారు. వీరిలో పర్వతుడు స్వామి వారి గురించి మరలా తపస్సు చెయ్యగా స్వామి ప్రత్యక్షమయ్యి నీకు సాయుజ్య ముక్తి నిస్తున్నాను అని వరమివ్వగా, పర్వతుడు స్వామికి నమస్కరించి పరమేశ్వరా! "నీవు నన్ను పర్వతంగా మార్చి నా మీదే నువ్వు కొలువుండేలా, నాయందు ముక్కోటి దేవతలు, సర్వ తీర్థములు, సమస్త ఓషధులు వసించేలా" వరం ప్రసాదించు అని అడిగెను. అదివిని శంకరుడు ఎందుకు అలాంటి వరం కోరుకొంటున్నావు అనగా నేనొక్కడిని తరించడంకాదు, ఇక్కడికి వచ్చిన ప్రతిభక్తుడూ తరించేందుకు అనువుగా ఈవరాన్ని కోరుతున్నాను. ఈ తీర్థాలలో స్నానమాడిన వారికి సమస్త పాపాలూ నశించాలి, ఇక్కడ లభించే ఓషధులతో ఎటువంటి రోగమైనా నశించాలి, శ్రమకోర్చి వచ్చిన వారందరూ నీ దర్శనాన్ని,అనుగ్రహాన్నీ పొందాలి. అందుకనే ఈవరంకోరుతున్నాను అని పర్వతుడు తెలుపగా బొళా శంకరుడు సంతోషించి వరం ప్రసాదించాడు. శివుడు లింగరూపంలో అక్కడ అవతరించాడు. ఇక్కడ పరమేశ్వరుడు మల్లిఖార్జునిగా,పార్వతీ దేవి భ్రమరాంబికా దేవిగా స్వయంభువులుగా వెలిసారు. మల్లికార్జున నామ ప్రశస్తి : స్వామి వారిని మల్లిఖార్జునుడు అని పిలవడానికి ఒక పురాణగాధ ఉన్నది. పూర్వం తలిదండ్రులపై కోపించిన కుమారస్వామి కైలాసం నుండి వచ్చి క్రౌంచ పర్వతం చేరాడు. ఆ పర్వతమే నేడు శ్రీశైలం అయినది. కుమారస్వామి వచ్చి ఉన్నచోట మద్దిచెట్టుకు మల్లెతీగ అల్లుకుని ఉన్నది. కుమారునికోసం వచ్చిన శంకరుడు ఆచెట్టు క్రిందనే లింగ రూపంలో వెలిశాడు కనుక స్వామిని “మల్లికార్జునుడు” అంటారు. అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు. మరొక కథ కూడా ఉన్నది : పూర్వం చంద్రవంశపు రాజు అయిన చంద్రగుప్తుని కుమార్తె చంద్రావతి శివుని పరమ భక్తురాలు. ఎపుడూ శివునిని ద్యానిస్తూ గడిపేది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు సతీ సమేతుడై సాక్షాత్కరించి ఏమి వరము కావలెనో కోరుకోమ్మని అడగగా అంత చంద్రావతి స్వామీ! నేను మీ శిరముపై ఉంచిన మల్లెపూల దండ ఎన్నటికీ వాడి పోకుండా ఉండేలా వరం ప్రాసాదించమని కోరింది. అపుడు ఆ దండను శివుడు గంగ,చంద్రవంకల మద్య ధరిస్తాడు. శిరమున మల్లెపూల దండ ధరించాడు కావున స్వామి వారికి మల్లిఖార్జునుడు అనే పేరు వచ్చిందని అంటారు. వృద్ధ మల్లిఖార్జునుడు : పూర్వం అమ్మవారు తపమాచరించి పరమేశ్వరుని ఇక్కడకు వచ్చి తనను వివాహమాడవలసినదిగా ప్రార్థించారు. అందుకు స్వామివారు ఒక వృద్ధుని రూపంలో వచ్చి ప్రత్యక్షమౌతారు. అమ్మవారు స్వామీ ఏమిటి ఈ అవతారం అని ప్రశ్నించగా నేను అనాదినుండీ ఉన్నవాడను నారూపం ఇదే! ఇష్టమైనచో వివాహమాడుము అని తెలుపుతారు. అందుకు అమ్మ మాహాదేవా! మీ తత్వం నాకు తెలియనిది కాదు. మీ మనోహరత్వం నాకు బాగా తెలుసును మీరు ఏరూపంలో ఉన్నా నాకు ఆమోదమే అని తెలిపి స్వామిని వివాహం చేసుకుంటారు. అలా వచ్చిన స్వామే వృద్ధ మల్లిఖార్జునుడు. నేటికీ లింగ రూపంలో ప్రథాన ఆలయానికి కుడివైపున ఉన్నారు. భ్రమరాంబికా నామ ప్రశస్తి : పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే మరియు చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. ఈవరం తో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్ధించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతి ని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈరాక లో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన అమ్మవారు అరుణాసురుని సంహరించడానికి వెళతారు. ఆదిశక్తి ఎంతసేపు యుద్ధం చేసినా అరుణాసురుని చంపలేక పోతుంది. చివరికి అతని వరప్రభావమని తలచి షట్పదిఅయిన భ్రమర ( తుమ్మెద ) రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడి సైన్యాన్ని సంహరిస్తాయి. అమ్మవారు పేద్ద తుమ్మెదగా వచ్చి అరుణాసురుని సంహరిస్తుంది. అరుణాసురుని సంహరించిన తరువాత భ్రమరాంబ దేవతలకోరిక మేరకు శ్రీశైలం నివాసయోగ్యమని తలచి తనంతట తానుగా వచ్చి “భ్రమరాంబికాదేవి”గా ఇక్కడవెలసింది. ఈ గాథ వైవస్వత మన్వంతరంలో జరిగింది. ఐతే అంతకు ముందు ఏనాడో ఈ క్షేత్రం వెలసి ఉంది. ఆనాడు “అర్థనారీశ్వరీ దేవియే” మహాశక్తిగా, క్షేత్ర దేవతగా మల్లికార్జునునితో పాటు వెలసి ఉంది. ఇందుకు నిదర్శనంగా అర్థనారీశ్వరీ దేవాలయం మల్లికార్జున స్వామి ఆలయానికి ప్రక్కనే ఉంది. అంతేకాదు. అర్థనారీశ్వరీదేవియే మహాదేవి అయినట్లు, క్షేత్ర దేవత అయినట్లు శ్రీశైల మహాసంకల్పం కూడా ''... అర్థనారీశ్వరీ భ్రమరాపరమేశ్వరీ ముఖ్యదశ కోటి మహాశక్తి స్థానానాం...'' అనడంలో నిరూపిత మయింది. " ఆయన్ని దర్శించుకుంటే జన్మాంతరం కైలాస లోకానికి వెళ్లినప్పుడు ఈ జీవి శ్రీశైలాన్ని దర్శించాడా లేదా అని ప్రశ్నవేస్తారట. అప్పుడు సాక్షిగణపతి మనకు సాక్షిగానిలబడి వచ్చాడని తెలుపుతాడట. అందువలన శ్రీశైలం వచ్చిన వారు "సాక్షిగణపతి" ని తప్పక దర్శించి గోత్రనామాలు తెలుపుకోవాలి కుమ్మరి కేశప్పకు అటిక(కుండ పెంకు)లో శివుడు బంగారు లింగరూపంలో ప్రత్యక్షమైన ప్రదేశం "హటకేశ్వరం". ఇక్కడ అగస్త్యుడు తపస్సుచేశాడని ప్రతీతి. ఆదేవాలయానికి ప్రదక్షిణలు చేస్తే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని ప్రతీతి. ఆదిశంకరులు తపస్సు చేసిన ప్రదేశ "ఫాలధార-పంచధార" ఇక్కడే శంకరులు సౌందర్యలహరి, శివానందలహరి రచించారట. ఇచట శంకరులను చంపడానికి గజదొంగ ఒకడు ప్రయత్నించ బోతే నృసింహస్వామి సింహంగా వచ్చి అతనిని హతమార్చారు. "శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే" "శిఖరేశ్వరం" మీదున్న నంది మీద నువ్వులు పోసి నందిని తిప్పి నందికొమ్ములలో నుండి శ్రీశైల దేవాలయ శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు. శ్రీశైలం కొండలన్నిటిలోనూ ఈ శిఖరేశ్వరం అత్యంత ఎత్తైనది.

+21 प्रतिक्रिया 2 कॉमेंट्स • 8 शेयर

_*🚩శ్రీ శివ మహా పురాణము - 17🚩*_ 🕉🍀🕉🍀🕉🍀🕉🍀🕉🍀🕉 *రామేశ్వర లింగము* ☘☘☘☘☘☘☘☘☘ రామేశ్వర లింగము చాలా గొప్ప లింగము. మహాబలసంపన్నుడయిన రావణాసురుని సంహారం అంత తేలికయినది కాదు. దీనికి పరమ మంగళప్రదుడయిన శంకరుని అనుగ్రహం కావాలి. ‘ఈశ్వరా’ లంకా పట్టణమునందు ప్రవేశించి రావణుడే పది తలలతో నాకంటపడినా ధర్మము తప్పనంత సంయమనంతో కూడిన బుద్ధి నాయందు ప్రచోదనమయి యుద్ధం జరుగుగాక’ అని శ్రీరాముడు శంకరుని ప్రార్థించాడు. రాముడు ఎన్నడూ ధర్మము తప్పలేదు. శ్రీరాముడు శంభు లింగమును ఆరాధన చేశాడు. ఒక శివలింగమును పెట్టి దానిని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాడట. అనగా రామచంద్ర మూర్తికి ఎన్ని విద్యలు వచ్చో అన్ని విద్యలతో శంకరుడు ప్రీతి చెందేటట్లుగా ప్రవర్తించాడు. తనకు ఏ విభూతి ఉంటే ఆ విభూతిని ఈశ్వర ప్రసాదం కొరకు వినియోగించాడు. స్వామిన్ శంభో మహాదేవ సర్వదా భక్తవత్సలా పాహిమాం శరణాపన్నం తద్భక్తం దీనమానసం!! ఈశ్వరా, నేను నీ భక్తుడిని, దీనుడిని. ఎప్పుడయినా నానుండి కోపం బయటకు రావచ్చు. బాహ్యమునందు గొప్ప బలపరాక్రమములు గల రావణాసురుణ్ణి నేను నిగ్రహించాలి. మీరు శివుడు, మంగళప్రదులు. నన్ను ఆశీర్వదించాలి. జయమును ఇవ్వాలి. కాబట్టి శంకరా నన్ను అనుగ్రహించండి అన్నాడు. అనేసరికి శంకరుడు ప్రత్యక్షం అయి శ్రీరాముని చేత పూజలు అందుకున్నాడు. శ్రీరాముడు నీవు ఇక్కడనే వసించు. ఇక్కడ వసించిన నిన్ను రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడిన లింగము అనే పేరుతో లోకమంతా నిన్ను ఆరాధన చేస్తుంది. అన్నాడు. శివుడే ఇప్పుడు శ్రీరాముడిగా వెళుతున్నాడు. శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః’ – లంకకు వెడుతున్న శ్రీరామునికి పరమశివుని ఆశీర్వచనం కలిగింది. ‘నీవు జయమును పొందుతావు అని పరమశివుడు ఆశీర్వదించాడు. ఇప్పుడాయన రామచంద్రమూర్తి కోరిక మేరకు ఒక శివలింగంగా కూడా ఆవిర్భవించారు. రావణుని సంహరించి తిరిగి పుష్పకవిమానంలో రామచంద్ర మూర్తి సీతమ్మ తల్లితో కలిసి వెడుతూ కిందికి చూపించారు. ‘సీతా, ఇదిగో సేతువు. అదిగో అక్కడే నాకు మహాదేవుడు సాక్షాత్కరించి నన్ను అనుగ్రహించాడు’ అని చెప్పారు. రామాయణంలో యుద్ధకాండలోని శ్లోకములలో ఈపాదం ఉంది. ఆయన శివపూజ చేశాడు అనడంలో ఏమీ సందేహం లేదు. ఇక్కడ మనకి ఒక సందేహం కలగవచ్చు. సముద్రం దాటేముందు రామచంద్రమూర్తి పూజ చేసిన సందర్భంలో శివలింగం ఆవిర్భవించింది అని చెప్పుకున్నాము. కానీ ఈవేళ రామేశ్వరం దీవియందున్న శివలింగమును రామచంద్రమూర్తి స్థాపిత లింగంగా పూజ చేస్తున్నాం. రెండూ ఒకటేనా? అలా అయితే స్థలపురాణంలో రావణ సంహారం అయిపోయిన తర్వాత రామచంద్ర మూర్తి ప్రతిష్ఠ చేయడం కోసం హనుమను కాశీ పట్టణం పంపించి విశ్వనాథ లింగము నొకదానిని తీసుకురమ్మంటే హనుమ కించిత్ ఆలస్యంగా వస్తే సీతాదేవి సైకత లింగముతయారుచేసిందని, దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశారని రామేశ్వరంలో చెప్తుంటారు. పైగా అక్కడ సరస్వతీ బావి, సావిత్రీ బావి, గాయత్రీ బావి మున్నగు బావులు ఉన్నాయి. ఈ రెండు శివలింగములు ఒకటేనా? ఈవిషయమును మహానుభావుడు మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు ‘రామాయణమునందు ధర్మ సూక్ష్మములు’ అనే గ్రంథంలో పరిష్కారం చేశారు. ఆయన ఒకమాట చెప్పారు. కూర్మపురాణంలోంచి ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ ‘యావస్సేతుశ్చతావశ్చ కాస్యాంయత్రతిరోహితః’ ‘నేను తిరోహితుడనై ఉంటాను. అందరికీ నేను కనపడను, కనపడకుండా ఉంటాను అని శంకరుడు అన్నాడు. కనపడకుండా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడి రామచంద్రమూర్తి చేత పూజలందుకున్న శంకరుడు సముద్రమునకు ఈవలి ఒడ్డున సాక్షాత్కరించాడు అని మీరు ఒక నమస్కారం చేసి ద్వీపంలోకి వెడితే అక్కడ రామేశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సీతమ్మ తల్లి చేతులతో పోగుచేయబడిన మట్టితో ఏర్పడిన శివలింగ దర్శనం అవుతుంది. వ్యాసుడు స్కాందపురాణంలో నాగర ఖండమునందు ఈ శివలింగం ప్రతిష్ఠితం చేయబడడం యథార్థమే అని చెప్పి ఉన్నాడు. కాబట్టి అది రామేశ్వర లింగమే. హనుమ కూడా శివుని అవతారమే అని శివపురాణం చెప్తుంది. హనుమ కూడా రాక్షస సంహారమునందు ప్రధాన పాత్ర పోషించాడు. హనుమ చేతితో కూడా ఒక శివలింగం ప్రతిష్ఠ అవాలి అని విశ్వనాథుడు భావించి ఉంటాడు. అందుచేతనే కించిత్ ఆలస్యం అయితే ముహూర్తం అయిపోతుందని సీతమ్మ ప్రతిష్ఠించాలి. తన సంకల్ప ముహుర్తమై హనుమ ప్రతిష్ఠించాలీ. అందుకని ఈశ్వర సంకల్పముగా సీతమ్మ తల్లి అక్కడ ఇసుకను ప్రోగుచేస్తే అది శివలింగం అయింది. ఇపుడు దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ట చేశాడు. దానిని రామనాథ లింగము అని పిలుస్తారు. రెండవది హనుమ తీసుకు వచ్చిన లింగము. అది కాశీనుండి తేబడింది కాబాట్టి దానిని విశ్వనాథ లింగము అని పిలుస్తారు. ఆ బావులలో ఉండే నీటియందు ఓషధీశక్తులు ఉంటాయి. ఆ బావుల నీటితో స్నానం చేయాలి. రామేశ్వరంలో మనం సముద్రస్నానం చేస్తాము. రామేశ్వర దర్శనం అద్భుతమయిన దర్శనం. అక్కడ రైల్వేస్టేషన్లో ఒక గొప్పతనం ఉంది. కొత్త ప్లాట్ ఫారం కట్టడం కోసమని తవ్వితే అక్కడ పెద్ద దక్షిణామూర్తి విగ్రహం బయటపడింది. ఆ దక్షిణామూర్తిని భారతీయ రైల్వే వారు మరోచోట పెట్టకుండా రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనే ఉన్న పెద్ద రావిచెట్టు క్రింద పెట్టారు. మీరు రైల్వేస్టేషనులోనే దక్షినామూర్తిని దర్శనం చేసుకోవచ్చు. అక్కడే శంకరాచార్యుల వారు తీసుకు వచ్చిన శివలింగములలో ఒక శివలింగం ఉంది. అది స్ఫటికలింగం. దానిని సూర్యోదయం కాకుండా దర్శనం చెయ్యాలి. ఆ లింగం చాలా చిత్రంగా ఉంటుంది. అటువంటి స్ఫటికలింగం మరొకటి శ్రీకాళహస్తిలో ఉంది. కానీ అక్కడ విన్యాసములేవీ కనపడవు. దాని వెనకాల ఒక లైటు వెలుగుతూ ఉంటుంది. కానీ రామేశ్వరంలోని స్ఫటికలింగం అలా కాదు. తెల్లవారుజామున ఆ శివలింగమునకు అర్చకులు పూజచేస్తారు. అలా మంత్రములు చదువుతూ పూజ చేస్తున్నప్పుడు ఒక ఎర్రని పువ్వు తెచ్చి ఆ స్ఫటిక లింగం ముందర పెడితే మొత్తం ఆ శివలింగం అంతా ఎర్రగా మారిపోతుంది. ఆ పువ్వును తీసేస్తే మరల మీకు తెల్లటి లింగం కనపడుతుంది. అదీ స్ఫటికలింగ దర్శనం చేయవలసిన విధానం. అనగా నిర్గుణమయిన పరబ్రహ్మము శుద్ధసత్వంతో ఉంటాడు. ఆయనయందు లోకము ప్రకాశిస్తూ ఉంటుంది. ఎవరయినా ఈ రామేశ్వర లింగం దగ్గరకు వెళ్లి కాశీ పట్టణంలో ఉన్న గంగను తీసుకు వెళ్ళి ఆ రామేశ్వర లింగమును గంగధారలతో అభిషేకిస్తే అలా అభిషేకం చేసినవాడు కైలాసమును చేరుకుంటున్నాడు. గంగ అనగా జ్ఞానము. కాశీ గంగతో అభిషేకం చేయడం వలన ఉన్నది ఒక్కటే పదార్ధం అన్న ఎరుక లోపల బాగా నిలబడాలి. ఇది నిలబడడం రామేశ్వర దర్శనం. అది చేసిన వాడు సంసార సముద్రమును దాటి ఈశ్వరుని పొందుతున్నాడు. కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి పరమయోగ్యమయిన క్షేత్రము రామేశ్వర క్షేత్రము. ఇక్కడ ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. కాశీ వెడతానని సంకల్పం చేసి వెళ్లకపోతే ఆర్తి పొందితే కాశీ వెళ్ళిన పుణ్యం ఇవ్వబడుతుంది. కానీ రామేశ్వరం వెడతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే మహాపాపమును ఖాతాలో వేస్తారు. కాబట్టి రామేశ్వరం వెడదాం అనుకున్నాను అని అనకూడదు. ‘ఈశ్వరుడు నన్ను రామేశ్వరం తీసుకు వెళ్లాలని ప్రార్థిస్తున్నాను’ అని అనాలి. ఆ బాధ్యతను ఆయన మీద పెట్టెయ్యాలి. అపుడు ఆయనే మిమ్మల్ని రామేశ్వరం తీసుకువెడతాడు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

+8 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर