సాయి రామ్

Kotha Ramakrishna Nov 18, 2019

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
Kotha Ramakrishna Nov 18, 2019

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
Mymandir Telugu Nov 14, 2019

*"శ్రీ సద్గురు సాయి పాదపూజ*" (జపమాల)..!! 108. *"ఓం తీర్థపాదాయ చరణం శరణం*".. అనగా తీర్థముతో నిండిన పాదము లేదా పాద తీర్థముగా తీసుకొనవచ్చును. సాయిబాబాను ధ్యానించుట ఎట్లు? సాయిభక్తులు బాబాను ధ్యానించ వలెననగా సాయిబాబా పాదములే ముఖ్యమార్గము. జీవిత పరమార్ధమును పొందుటకు సద్గురు సాయి నాథుని పాదము లనే ధ్యానించవలెను కాని ఇంకొక మార్గము లేదు. 1వ నామము నుండి ఈ 108వ నామ ము వరకు, ప్రతి నామము ప్రక్కన *చరణం శరణం* అని వ్రాయబడినది. శిరిడి సాయి *సర్వాణ్యంగాని పూజ* లో అతి ముఖ్యమైన అంగపూజ సద్గురి పాదములే. ఎటువంటి వారికైనను ముక్తిని కల్గించేది ఆ సాయి పాదములే. ఎవరికైనను ఆపద కల్గినపుడు సాయి పాదములను ధ్యానించిన యెడల సాయిబాబా అట్టి భక్తుని యొక్క ఆపదలను తొలగిస్తారు. యావత్ ప్రపంచము లోని చరాచర జీవకోటి ప్రాణులందరికి శరణం ఆ సాయినాథుని చరణం మాత్రమే. ఆ పాదాలను నమ్ముకున్న భక్తులందరో కలరు. వారి సంసారము ఏ ఒడుగుదొడుగులు లేకుండా శాంతము గా సాగిపోతుంది. పాఖడే అను సాయిభక్తునికి (సాయి సమాధి చెందిన పిదప) బాబా ఒక స్వప్నముచూపెను. లోతైన సముద్రములో పాఖడే నడుము వరకు దిగి ఉండగా హటాత్తుగా రత్నములు తాపిన సింహాసనముపై శ్రీసాయి కూర్చుని ఉండెను. వారి పాదములు మటుకు నీటిలో ఉండెను. శ్యామా కూడా పాఖడే ప్రక్కన ఉండెను. పాఖడే బాబా పాదములు నీటిలో వుండుట చే పాదములు కనపడక పోవుటచే శ్రీ సాయితో ఇట్లనెను. *"ఓ దేవా నీటిలో నున్న నీ పాదములను బైటకు తీయుము*." బాబా తన పాదములు తీయగా క్షణమైనా ఆలస్యము చేయక, బాబా పాదములపై పాఖడే పడి మ్రొక్కెను. సాయి పాఖడేను దీవించి ఇట్లనెను. *"ఇక పొమ్ము నీవు క్షేమమును పొందెదవు. భయముకాని ఆందోళన కాని అవసరము లేదు*". సాయిబాబా ఒక సందర్భములో ఇలాఅన్నారు "ఈ లోకములో అనేక మంది యోగులుకలరు. కాని మన గురువు అసలైన తండ్రి. మనము మన గురువు యొక్క పలుకులను మరువ రాదు. హృదయ పూర్వకముగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వశ్య శరణాగతిని వేడుము. భక్తితో వారి పాదము లకు మ్రొక్కు ము. ఇక నీవు దాటలేని భవసాగరము లేదు. సాక్షాత్తు సాయినాధుడే గురుపాదములెంత పవిత్రమైనవో మహిమాన్వితమో వాటిని నమ్ముకున్న వారికి ఎంత సుఖము కలదో చెప్పినారు. అలాంటి సద్గురు సాయి పాదములను, పంచా మృతములతో సర్వాంణ్యంగాని పూజ అనగా సాయి శిరస్సు నుండి వారి పాదములు దాకా పైన చెప్పబడిన 1వ నామం నుండి ఈ 108వ నామం వరకు బాబాకు అభిషేకం చేయ బడినది. ఆ అభిషేక తీర్థం సాయి పాదములపై జాలు వారుతున్నది. అట్టి తీర్థంపై 108 నామములు సమాప్తం అయిన సందర్భముగా బాబా పాదములకు సాష్టాంగ ప్రణామము చేసి వారి పాద తీర్థము గైకొనుచు శ్రీసాయిని *"ఓం తీర్థపాదాయ చరణం శరణం*" అని శ్రీసాయికి చిట్ట చివరిదైన అంగపూజ చేసి సాయి అంగములలో పాదములకు సంబంధించిన నామం *"ఓం తీర్థ పాదాయ నమః పాదౌపూజయామి*" అని స్మరిస్తూ ఆ అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజైన శ్రీసమర్ధ సద్గురు సాయినాధునిపై 108 నామాలతో శ్రీ సద్గురు సాయి పాదపూజ (జపమాల) అనునిత్యం జరుపు కుందాం. సమాప్తం...🙏

+104 प्रतिक्रिया 5 कॉमेंट्स • 43 शेयर