సమాజం కోసం

Batchu Aravind Dec 12, 2019

+8 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
B Ravi Nov 30, 2019

ఒకానొక గ్రామమున ఒక పురోహితుడు కలడు. అ గ్రామములోని దేవాలయమున అతడు పూజాకైంకర్యములు జరుపుచుండును. ప్రతిదినము ప్రభాత సమయముననే లేచి స్నానసంధ్యాదులను నిర్వర్తించుకొని దేవాలయమునకు వెళ్లి తన విధులను సక్రమముగా నెరవేర్చుకొని ఇంటికి వచ్చుచుండెను. అతనిది ఒక చిన్న పెంకుటిల్లు. ఆ యిల్లు అతడు కట్టించినదికాదు. అతని వంశములో ఎవరో పూర్వికులు కట్టించినది. దానిని తరతరములనుండియు ఆతని పూర్విజులు అనుభవించుచుండిరి. కొంత కాలము క్రిందట పురోహితుని తండ్రి దానిని అనుభవించుచు రాగా, అతడు పరమపదించిన పిదప ఆ యిల్లు పురోహితుని వశమయ్యెను. పురోహితుడు స్వయంకృషిచే ఉన్నత విద్యను చక్కగ అభ్యసించి, విరామ సమయములందు విధ్యార్థులకు "టూషణ్లు" చెప్పుకొనుచు అచిర కాలములో కొంత సంపదను గడించెను. తనకు పిత్రార్జితముగా సంక్రమించిన ధనముతో అద్దానిని చేర్చి ఆ గ్రామమునందు నూతనముగా ఒక సుందర విశాల ఆధినిక రమణియ భవనమును కట్టించి, ఒకానొక సుముహూర్తమున అందు గృహప్రవేశమును గావించెను . వంశపరంపరగా వచ్చిన తన పాత ఇంటిలోని సామానునంతటిని అపుడు నూతన గృహమునకు వెనువెంటనే అతడు తరలించి వేయ దొడగెను. పాత్రలు, పెట్టెలు, మంచములు, ఒకటన నేల సామాను మొత్తము బండ్లపై నూతన భవంతికి తరలిపోవదొడగెను. ఈ ప్రకారముగ పాతయింటి లోని వస్తువులన్నియు బయటకు వెళ్ళినవి కాని ఒక్క వస్తువు మాత్రము అచటనుండి కదలి రాలేదు. అది ఒక నిలువుటద్దము. చాలాపెద్దది. ఏ పూర్వికులు దానిని తయారు చేయించారో కాని అది ఒక అద్భుతమైన పనితనముతో గూడిన వస్తువిశేషము. ఆ నిలువుటద్దము గదినుండి బయటకు రాలేదు. ఏలయనగా, ద్వారములో అది పట్టలేదు. ద్వారము చిన్నది. అద్దము పెద్దది. కావున ఒక చిక్కుసమస్య ఏర్పడినది. ఆ గ్రామములోను, పరిసర గ్రామములోను గల హేమా హేమీలందరు వచ్చి వారివారి శక్తియుక్తులన్నిటిని ప్రయోగించి చూచిరి. కాని విఫలులైరి. అద్దము బయటకు రాలేదు. పురోహితునకు ఏమిచేయుటకు తోచలేదు. ఆ ఊరిలో విశేషముగ పలుకుబడిగల వ్యక్తి యగటవలన అతడు దీర్ఘముగ యోచించి ఊరి పెద్దలందరిని ఒకచోట సమావేశపరచి అద్దము ఇంటి నుండి బయటకు వచ్చు మార్గములను అన్వేషింప దొడగెను. ఆ పురజన మహాసభయందు ఒక్కొక్కరు వారివారికి తోచిన సలహాలను ఇచ్చుచుండిరి. సభామధ్యమునుండి ఒక పురప్రముఖుడు లేచి 'సభాసదులారా! నా వాక్యం ఆలకించండి. ఇది చాలా చిక్కుసమస్య. ఈ సమస్యను మనం దీర్ఘంగా , దూరంగా, తీక్షణంగా యోచించి తగుపరిష్కారం చేయవలసి యున్నది. మన గ్రామములో ఇందరు పెద్దలు, ఇందరు విజ్ఞానసంపన్నులు, ఇందరు శేముషీధురంధరులు ఉండగా ఈ సమస్యను విడదీయలేకపోవుట సముచితంగా తోచలేదు. ఇపుడు అద్దము బయటకు రావలసియున్నది. ద్వారమో చాలా చిన్నదిగా ఉన్నది. కాబట్టి పాత ద్వారము కొట్టివైచి కొంత పెద్దదిగా చేసినచో అద్దము అమాంతముగా బయటకి రాగలదు' - అని చెప్పి కూర్చుండెను. వెనువెంటనే మరొయొక పుర ప్రముఖుడు లేచి దాని కీప్రకారముగ ఆక్షేపణ చెప్ప దొడంగెను. మహాశయా! మీరు చెప్పిన ఉపాయము బాగానే ఉన్నదిగాని, తరతరములనుండి అవిచ్చిన్నముగ వచ్చుచున్న ఇంటిని పగులగొట్టుట న్యాయసమ్మతము కాదు. ఇల్లు యథాప్రకార ముండునట్లు ఉపాయం ఆలోచించండి! అపుడు మరియొక సభ్యుడు లేచి 'అయ్యా! నామాట ఆలకించండి. అద్దం పెద్దది. ద్వారం చిన్నది. కాబట్టి అద్దాన్ని రెండుగా చీలిస్తే సునాయాసంగా బయటకు పోతుంది' - అని విజ్ఞానపూర్వకమగు సలహా నొసంగగా తత్‌క్షణమే ప్రక్కనున్నవాడు లేచి 'మహానుభావా! అంతపని చేయకండి. అద్దాన్ని చీల్చడానికి దానిమీద కత్తిపెడితే అది రెండు ముక్కలు కావచ్చు . పది ముక్కలు కావచ్చు. అది వారి వారి అదృష్టంపై ఆధారపడి ఉంటుంది' అని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పి ఊరకుండెను. ఈ ప్రకారముగ ఆ సభలో వాదోపవాదములు చెలరేగెను. సమస్యకు తగు నిర్ణయము కుదరలేదు. పూర్వపక్షప్రతిపక్షములు లెక్క లేనన్ని వచ్చిపడెను. వారి వాదవివాదములతో భావసంఘర్షణలతో సభాస్థల మంతయు ప్రతిద్వనింపదొడగెను. కాని సమస్య ఏమాత్రం పరిష్కారము కాలేదు. అట్టి విపత్కర విపరీత పరిస్థితియందు ఒక వృద్ధుడు సభామధ్యము నుండి చివుక్కున లేచి 'అయ్యా! సభాసదులారా! మీలో తగవులాడుకోవద్దు. ఇది ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరిపోసుకునే సందర్భం కాదు. ఒక జటిలమైన , విజ్ఞానవంతమైన సమస్యకు పరిష్కారం ఆలోచించవలసిన సమయమిది. అద్దం బయటికి రావడానికి అందరూ వారి వారి సలహాలు ఇస్తున్నారు. మంచిదే, ద్వారం చిన్నది. లోనగల అద్దం పెద్దది. అని అందరూ ఉద్ఘాటిస్తున్నారు. కాని అసలా అద్దం లోపలికి ఎట్లా రాగలిగిందో ఊహించండి. పెద్ద అద్దం చిన్న ద్వారం గుండా లోపలికి ఎట్లా వచ్చింది? దీని నెవరైనా ఆలోచించారా? ఇపుడా లోచించవలసిన ముఖ్య విషయం అద్దం బయటికి ఎలా పోతుందని కాదు అసలా అద్దం లోపలికి ఎలారాగలిగింది' అని వృద్ధుని సమయోచితమగు వాక్యమును విని సభ్యులెల్లరు భేష్‌ భేష్‌ అని సంతోషముతో చప్పట్లు కొట్టి ఆలోచనానిమగ్నులైరి. నీతి: లోకములో జనుల 'దుఃఖ మెట్లు తొలగగలదు? దుఃఖము తొలగుటకు మార్గమేమి?' అని ఆలోచించుచున్నారు. కానీ మహర్షులగు వారు 'అసలు దుఃఖమెట్లు వచ్చినది?' అని యోచించి అజ్ఞానము వలననే దేహము, దేహము వలన దుఃఖము వచ్చినదని గుర్తెరింగి ఆ అజ్ఞానమును ముందు తొలగించి వైచినచో దుఃఖము దానంతట అదియే తొలగిపోగలదని నిశ్చయించి అద్దాని నివారణకై జ్ఞానమును, అత్మ విచారణను లోకమున చక్కగ ప్రబోధ మొనర్చిరి.

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
B Ravi Nov 28, 2019

https://play.google.com/store/apps/details?id=com.saiuniversalbookstore.TeluguStories అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో చాలామంది పిల్లలు ఉండేవారు. వారిలో లలిత, రాజులు మంచి స్నేహితులు. ఒకనాడు ఆ ఊరి పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. అప్పుడు సోము అనే పిల్లవాడు అక్కడున్న పిల్లలతో "ఒరే! మన ఊరి చివరి పెద్ద బంగళా పక్కన ఉన్న పెద్ద పూలచెట్టులోంచి, ఒక్క పువ్వును ఈ రోజు రాత్రికి గనక వెళ్లి తెంపుకొస్తే, వాళ్లకు నేను పది నెమలి ఈకలను ఇస్తాను"అని చెప్పాడు. రాజుకి నెమలి ఈకలంటే చాలా ఇష్టం. కానీ వాడికి చీకటంటే మాత్రం చాలా భయం. అందులోనూ ఆ రోజున అమావాస్య కూడాను! కానీ ఒకేసారి పది నెమలి ఈకలు వస్తాయనేసరికి వాడికి చాలా ఆశ పుట్టింది. దాంతో వాడు "నేను ఎలాగైనా సరే, ఈ రాత్రికి అక్కడికి వెళ్లి, ఆ పువ్వును తీసుకొచ్చి, నీకు చూపిస్తాను!" అని సోముతో పందెం కాశాడు. ఈ విషయం లలితకు తెలిసింది. లలిత చాలా ధైర్యవంతురాలు. ఆమె ఒక టార్చిలైటును తీసుకొని, ఆరోజు రాత్రి రాజు వెంట తనూ పెద్ద బంగళాకి బయలుదేరింది. ఇద్దరూ కలిసి బంగళాను సమీపిస్తుండగా, చీకట్లో రాజు కాలికి ఏదో తగిలినట్లనిపించింది! వెంటనే రాజు భయపడి, గట్టిగా "దెయ్యం!దెయ్యం!" అని అరిచాడు. అప్పుడు లలిత "భయపడకు రాజూ! నా దగ్గర టార్చిలైట్ ఉంది కదా! అదేమిటో చూద్దాం, ఆగు- ఒక్క నిముషం-" అంటూ అటు వైపుకు టార్చిలైటును వేసింది. చూస్తే అక్కడ ఒక చిన్న కుందేలు- భయం భయంగా రాజుకేసే చూస్తూ ఉన్నది! 'హమ్మయ్య!' అనుకుని ఇద్దరూ ముందుకు నడిచారు. బంగళా వచ్చేసింది- కానీ రాజుకు మాత్రం మనసులో ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి. అవన్నీ దయ్యాలే అనిపిస్తున్నాయి. చాలా భయం వేస్తోంది. బంగళా గేటు తీసేసరికి, రాజు ఏపనీ చెయ్యలేని స్థితిలోకి వెళ్లిపోయాడు.అప్పుడు లలిత తనే పెద్ద పూలచెట్టు పైకెక్కి, ఒక పువ్వును కోసుకొని వచ్చింది. ఇద్దరూ చాలా ఆనందపడ్డారు. పువ్వును తీసుకొని వెనక్కి తిరిగారు. కానీ రాజుకు మాత్రం భయం తగ్గలేదు. కటిక చీకటి.. దారి మధ్యలో ఏదేదో కనిపిస్తోంది. మిణుగురు పురుగులు తిరుగుతూ ఉన్నాయి.. ఏవేవో గుర్తుకు వస్తున్నాయి! రాజు అలా భయపడుతూండగానే వాళ్లిద్దరూ ఊరు చేరుకున్నారు. లలిత రాజుకి పువ్వును ఇచ్చేసి, టాటా చెప్పి, వాళ్ల ఇంటికి పోయింది. ఇక ప్రొద్దున్నే చెట్టు దగ్గర రాజు కోసం పిల్లలంతా ఎదురు చూస్తున్నారు. రాజు ఆ పువ్వును తీసుకెళ్ళి సోముకు ఇచ్చాడు. కానీ, సోము మాట నిలుపుకోలేదు. పది నెమలి ఈకల్ని ఇవ్వలేదు రాజుకు. "రాత్రి నువ్వు లలితని తోడు తీసుకెళ్లి, ఈ పువ్వును తీసుకు వచ్చావు. -లేకపోతే నీకు ఒక్కడికే అంత ధైర్యం ఎక్కడిది బాబూ!" అని సోము రాజును ఎగతాళి చేశాడు. రాజు ఒప్పుకోలేదు. తానొక్కడే వెళ్లి వచ్చానని బొంకటం మొదలుపెట్టాడు. "ఒక వేళ నువ్వు లలితను తోడు తీసుకొని పోకపోతే- అదిగో చూడు , లలిత అక్కడ ఉంది. నువ్వు వెళ్లి, ఆమెను ఒక దెబ్బ కొట్టిరావాలి!" అంటూ మరో పందెం కాశాడు సోము. రాజుకి ఈ పందెం ఇష్టం లేదు. అయినా తను పందెంలో ఓడిపోతే అందరూ తనని వెక్కిరిస్తారని, అతను పోయి లలిత చెంప మీద ఒక్క దెబ్బ కొట్టాడు. దాంతో రాజు ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. సోము రాజుకు పది నెమలి ఈకల్ని ఇచ్చేశాడు. రాజుకు నెమలి ఈకలు అయితే దొరికాయి- కానీ, ఆ తరువాత లలిత ఇక రాజు ముఖం చూడలేదు. బంగారం లాంటి వాళ్ల స్నేహం ఒక్క పనికిమాలిన పందెం కారణంగా చెడిపోయింది!

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

నవగ్రహ దోషాలు పోవాలంటే ఈ మంత్రాలను మననం చేయండి!! అందరూ శని పీడిస్తుంది, గురువు బాగులేడు, రాహుకేతువుల దోషం ఉంది ఇలా రకరకాలుగా బాధపడుతుంటారు. అయితే అందరికీ ఆయా గ్రహశాంతులు, జప, తర్పణ,హోమాలు చేయించడం సాధ్యం కాదు. అయితే వారు భక్తి, శ్రద్ధలతో నవగ్రహ గాయిత్రీని జపిస్తే తప్పక దోష ప్రభావం తగ్గడమే కాకుండా వారికి అనుకూల ఫలితాలు సైతం వస్తాయిని పండితుల ఉవాచ. ఆయా గ్రహాలకు సంబంధించిన నవగ్రహ గాయత్రీ మంత్రాలను తెలుసుకుందాం… నవగ్రహ దోషాలను తొలగించే నవగ్రహ గాయత్రి మంత్రం. న గాయత్య్రాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్ అంటే తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రం లేదని అర్థం. గాయత్రి మంత్రం గురించి ఋగ్వేదంలో తొలుత వివరించారు. గాయత్రి అనే పదం గయ త్రాయతి అను పదాలతో కూడుకుని ఉంది. గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ అని ఆదిశంకరాచార్యులు తనభాష్యంలో వివరించారు. గాయత్రి మంత్రాన్ని రూ జపించవచ్చు. కాకపోతే కొన్ని నియమనిబందనలుఈ మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జపించినా లేదా విన్నా వెలువడే ధ్వని తరంగాలు మనసును, శరీరాన్ని ఉల్లాసపరిచి, తేజోవంతం చేస్తాయి. ఇక నవగ్రహ గాయత్రీ మంత్రాలు ఆయా గ్రహాలకు… సూర్య గాయత్రి: ఓం భాస్కరాయ విద్మహే! మహాధ్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్యః ప్రచోదయాత్!! చంద్ర గాయత్రి: ఓం అమ్రుతేశాయ విద్మహే! రాత్రిన్చరాయ ధీమహి తన్నశ్చంద్రః ప్రచోదయాత్!! కుజ గాయత్రి: ఓం అన్గారకాయ విద్మహే! శక్తి హస్తాయ ధీమహి తన్న: కుజః ప్రచోదయాత్!! బుధ గాయత్రి: ఓం చంద్ర సుతాయ విద్మహే! సౌమ్య గ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్!! గురు గాయత్రి: ఓం వృషభద్వజాయ విద్మహే! కృణి హస్తాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్!! చంద్ర గాయత్రి: ఓం సురాచార్యాయ విద్మహే!! దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్!! శుక్ర గాయత్రి: ఓం భార్గవాయ విద్మహే! మంద గ్రహాయ ధీమహి తన్నః శనిః ప్రచోదయాత్!! రాహు గాయత్రి: ఓం శీర్ష రూపాయ విద్మహే! వక్ర పందాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్!! కేతు గాయత్రి: ఓం తమోగ్రహాయ విద్మహే! ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్!! ఎవరెవరికి ఏ గ్రహం అనుకూలంగా లేదో ఆ గ్రహానికి సంబంధించిన గాయత్రీని ప్రాతఃకాలమందే స్నానం ఆచరించి శుభ్రవస్త్రధారియే శౌచాశౌచాలు పాటిస్తూ పఠిస్తే తప్పక మంచి ఫలితాలు వస్తాయి.

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर