శ్రీ రామ

Ravi Kumar Oct 18, 2019

చిన్న ఆధ్యాత్మిక కధ కష్టము, కన్నీళ్ళు, సంతోషము, భాధ ఏవి శాశ్వతంగా ఉండవు అని తెలియజేసే అద్భుతమైన సన్నివేశంను వివరించే కథ మీ అందరి కోసం.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులూ కన్నీళ్ళూ కలగలసినదే జీవితం. కష్టమూ శాశ్వతం కాదు. సంతోషమూ శాశ్వతమూ కాదు. "ఓరోజు శ్రీ మహవిష్ణు శిరస్సుపైనున్న కిరీటం స్వామివారి పాదరక్షలను చూసి హేళన చేసింది, కించపరిచింది. ‘‘నేను శ్రీ మహవిష్ణు శిరస్సుపై దర్జాగా ఉన్నాను. నువ్వేమో స్వామివారి పాదాల దగ్గరున్నావు. అంతెందుకు మనుషులు కూడా నిన్ను తొడుక్కుని ఊరంతా తిరుగుతారు. కానీ ఇంటికి వచ్చేసరికి మాత్రం నిన్ను గుమ్మంలోనే విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోతారు. నీకు లభించే మర్యాద అంతేసుమా. కానీ నా విషయానికి వస్తే నన్ను స్వామివారు శిరస్సుపై ధరించడమే కాకుండా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అంతేకాదు, అన్ని అర్హతలున్న చోట మాత్రమే నన్ను ఉంచుతారు. నిన్ను బయటే ఉంచినట్టు నన్ను బయటకు విసరరు’’ అని పాదరక్షలను చూసి పకపకా నవ్వింది కిరీటం. అయినా పాదరక్షలు కిరీటంతో ఎలాంటి వాదనకూ దిగలేదు. కానీ శ్రీ మహవిష్ణు ఏదో పనిమీద బయటకు వెళ్ళినప్పుడు పాదరక్షలు తమ గోడు వినిపించాయి స్వామివారికి. కన్నీళ్ళు పెట్టుకున్నాయి. పాదరక్షల బాధనంతా విన్న స్వామివారు ‘‘పాదరక్షకులారా, నా పాదాలకు రక్షణ ఇస్తున్న మీరు ఎందుకు బాధ పడుతున్నారు. మిమ్మల్ని నేనెప్పుడు తక్కువ చేయలేదుగా. కిరీటం అన్నా మాటలకు బాధపడుతున్నారా..’’ అని అడిగాడు. వెంటనే పాదరక్షలు తమ గోడునంతా మళ్ళీ విడమరిచి చెప్పాయి. వాటిని విన్న స్వామివారు ‘‘ఇందుకా బాధ పడుతున్నారు, దాన్ని మరచిపొండి. కిరీటం మాటలు పట్టించుకోకండి. నేను రామావతారంలో మిమ్మల్ని పద్నాలుగేళ్ళపాటు సింహాసనంలో ఉంచి రాజ్యపాలన చేయిస్తాను. సరేనా..’’ అని హామీ ఇచ్చాడు. ఆ మేరకే రాముడుగా అవతారమెత్తినప్పుడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అప్పుడు సోదరుడు భరతుడు రాముడి పాదుకలను తీసుకుని వాటిని సింహాసనంలో ఉంచి పాలన చేశాడు. అప్పుడు పాదుకలు తమ స్థితిని తలచి ఎంతగానో సంతోషించాయి. భరతుడు ప్రతిరోజూ సింహాసనం ముందు కూర్చుని పాదుకలకు నమస్కరించినప్పుడల్లా అతని శిరస్సుపై ఉన్న కిరీటం సిగ్గుతో తల వంచి తన తప్పుకు, పాదుకలను కించపరచి మాటాడినందుకు మానసికంగా బాధపడింది. ఈ సంఘటనతో తెలుసుకోవలసిన విషయమేమిటంటే ఎవరినీ చిన్నచూపు చూడకూడదు. అదేవిధంగా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులూ కన్నీళ్ళూ కలగలసినదే జీవితం. కష్టము శాశ్వతం కాదు, అలాగే సంతోషమూ శాశ్వతం కాదు. *****ఓం నమో భగవతే వాసుదేవాయ.****

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
Dvsraju Oct 18, 2019

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
sharat kuchi Oct 17, 2019

+9 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर
Dvsraju Oct 17, 2019

👉🏿శ్రీ రాముడు ఎప్పుడు పుట్టాడు? ఈ ప్రశ్నకి అందరూ I think it is Navami…అని తడబడినా, Sri Rama Navami is a holiday for us” అంటారు. శ్రీ రాముని year of birth ఎవరు చెప్తారు? చెబితే గిబితే ఆ వాల్మీకి మహర్షే చెప్పాలి కదా?? చెప్పాడండీ. ఏమని చెప్పాడు? తన రామాయణ కావ్యంలోనే చెప్పాడు (అయితే క్రీస్తుకు ముందో తర్వాతో అనో శక సంవత్సరాలో లేవు కాక మనకు తెలిసే రీతి లో చెప్పలేదు) కానీ, చాలా నిర్దిష్టంగానూ, నిర్దుష్టంగానూ చెప్పాడు. ముందుగా శ్రీ రామ చంద్రుడు పుట్టినప్పుడు ఉన్న గ్రహరాశుల గురించి వాల్మీకి ఏం చెప్పాడో చూద్దాం:-⤵️ ________________________________ శ్రీ రామచంద్రుని జనన కాలమందు... సూర్యుడు (Sun) మేష రాశి(Aries) లోనూ, గురుడు( Jupiter) కర్కాటక రాశి (Cancer)లోనూ కుజుడు(Mars) మకర రాశి (Capricorn)లోనూ శని (Saturn)తులారాశి (Libra) లోనూ శుక్రుడు (Venus)మీన రాశి (Pisces)లోనూ ఉఛ్ఛ స్థితిలో కొలువై ఉన్నారు. °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° ఇంతే కాదు ఆ రోజు.... *చైత్ర శుధ్ధ నవమి* అనీ *కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో* స్వామి జన్మించాడని వాల్మీకి తెలిపాడు. ఆ సమయంలో పునర్వసు నక్షత్ర యుక్తమైన చంద్రుడు బృహస్పతితో కలసి అప్పుడే క్షితిజ రేఖ మీద ఉదయిస్తున్నకర్కాటక రాశిలో వెలిగి పోతున్నాడనీ చెప్పాడు. ఇన్ని వివరాలు ఇచ్చాడు సరే, దీనిని బట్టి ఆ సమయం ఫలానా అని ఇతమిథ్థంగా తెలుసు కోవడమెలా? ఇదిగో ఇక్కడే మన ఆధునిక శాస్త్రవిజ్ఞానం అక్కరకు వచ్చింది. ______________________________ Planetarium Gold అనే Software సాయంతో కంప్యూటర్ ద్వారా ఆ సమయం సరిగ్గా క్రీస్తు పూర్వం 5114 సంవత్సరం జనవరి నెల 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల పది నిమిషాలని కనిపెట్టారు. °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° అంటే శ్రీ రాముడు జన్మించి ఇప్పటికి 7133 సంవత్సరాలైందన్నమాట. (🚩జై శ్రీరాం) అయితే.... 1) ఇక్కడ ఎవరికైనా ఒక అనుమానం రావచ్చు. ఆయా నక్షత్రం గ్రహాలు రాశులు అవే స్థానాల్లో గతంలో వేరే రోజు కూడా ఉండి ఉండవచ్చుకదా అని. నిజమే, కాని ఇవన్నీ అచ్చంగా అవే స్థానాల్లో ఉండడమన్నది 25690 సంవత్సరాలలో ఒకసారి మాత్రమే జరుగుతుందట. 2) కాని నాలాటి వాడికి మరో సందేహం కూడా వస్తుంది. అదేమిటంటే గడచిన పాతిక వేల సంవత్సరాలలో కాకుండా అంతకు ముందు ఎప్పుడైనా ఈ గ్రహస్థితులిలాగే ఉన్నప్పుడు శ్రీ రాముడు జన్మించి ఉండ వచ్చుకదా? అని. కానీ..... మన భూమి మీద ఇప్పటి వరకు వచ్చిన *ఆఖరి హిమయుగం* గడచి, మళ్లీ నాగరికత వర్థిల్లడం జరిగి నేటికి 12000 సంవత్సరాలు మాత్రమే అయిందని ఆథునిక శాస్త్రవిజ్ఞానం చెబుతోంది. ఇక్కడ మరో విషయం కూడా గమనించాల్సి ఉంది. *శ్రీ రాముడు ఐతిహాసిక పురుషుడు కాడు. చారిత్రక పురుషుడు.* మానవ జన్మనెత్తి ఆ సేతు హిమాచలం నడయాడిన కోసలరాజకుమారుడు. మన దేశంలో... శ్రీ రాముడు తిరుగాడిన ప్రదేశాలనీ... సీతమ్మ వారు మెట్టిన స్థలాలనీ... పూజలందుకుంటున్న తావులకు కొదవే లేదు. ఇవి మనదేశంలోనే కాదు శ్రీ లంకలో కూడా ఉన్నాయి. ఈ చిహ్నాలు మనం గుర్తించే విధంగా ఇంకా ఉన్నాయంటే ఇప్పుడు మనం గుర్తించిన *7133 సంవత్సరాలకంటే మరొక పాతిక వేల సంవత్సరాల ముందువై ఉండే అవకాశం లేదని* చెప్పుకోవచ్చు. ✅ అందుచేత మన శాస్త్రజ్ఞులు పరిశోధించి, నిక్కచ్చిగా చెప్పిన *క్రీ. పూ.5114 సంవత్సరంలో జనవరి 10 తేదీనే* మన శ్రీ రామచంద్రుని జన్మదినంగా అంగీకరించి ఆనందిద్దాం. ✅ ఆరోజు మన చాంద్రమానం ప్రకారం సరిగ్గా *చైత్రశుధ్ధ నవమే* అయింది. *మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలను* జనన కాలంగా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మనం ప్రతియేటా శ్రీ రామనవమి నాడు ఇదే సమయంలో వేడుకలను జరుపుకుంటాము కదా?🕉 ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. అవన్నీ మరోసారి వివరిస్తాను. బహుముఖ శాస్త్రీయ పరిశోధనల తర్వాత మనకు వెల్లడించినవారు *Institute of Scientific Research on Vedas (I-SERVE) - Delhi Chapter* Director శ్రీమతి సరోజ్ బాల గారు. కీ.శే.శ్రీ పుష్కర్ భట్నాగర్ గారు(USA)నుంచి సంపాదించిన *Planetarium Gold అనే సాఫ్ట్ వేర్ ద్వారా* ఇది సాధ్యమయింది. ఈ శాస్త్రజ్ఞుల బృందానికి అభినందనలు తెలుపుకుంటూ ఈ విషయాలను అందరితో పంచుకునే అవకాశాన్ని కలుగజేసిన *I-SERVE* - Delhi Chapter వారికి కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను. ఈ పరిశోధనా కృషి అంతా వారిదే. నేను అరటిపండు ఒలిచి ముందు పెట్టానంతే. మీరు ఆస్వాదించండి. 🚩 *జై శ్రీరాం*🚩 🚩🚩 *జైజై శ్రీరాం🚩🚩* 🚩🚩🚩 *జైజైజై శ్రీరాం*🚩🚩

+19 प्रतिक्रिया 1 कॉमेंट्स • 3 शेयर