వేదాలు_ ఆధ్యాత్మిక చింతన

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 74 / Sri Vishnu Sahasra Namavali - 74 🌹* *నామము - భావము* 📚. ప్రసాద్ భరద్వాజ *🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷* *మూల నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం* *🍀 74. మనోజవ స్తీర్థకరో వసురేతా వసుప్రదః|* *వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః|| 74 🍀* 🍀 690. మనోజవః - మనస్సువలే అమితవేగము కలవాడు. 🍀 691. తీర్థకరః - సకలవిద్యలను రచించినవాడు. 🍀 692. వసురేతాః - బంగారం వంటి వీర్యము గలవాడు. 🍀 693. వసుప్రదః - ధనమును ఇచ్చువాడు. 🍀 694. వసుప్రదః - మోక్షప్రదాత 🍀 695. వాసుదేవః - వాసుదేవునకు కుమారుడు. 🍀 696. వసుః - సర్వులకు శరణ్యమైనవాడు. 🍀 697. వసుమనాః - సర్వత్ర సమమగు మనస్సు గలవాడు. 🍀 698. హవిః - తానే హవిశ్వరూపుడైనవాడు. సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Vishnu Sahasra Namavali - 74 🌹* *Name - Meaning* 📚 Prasad Bharadwaj *🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷* *Sloka for Moola 2nd Padam* *🌻manōjavastīrthakarō vasuretā vasupradaḥ |* *vasupradō vāsudevō vasurvasumanā haviḥ || 74 || 🌻* 🌻 690. Manōjavaḥ: One who, being all pervading, is said to be endowed with speed likes that of the mind. 🌻 691. Tīrthakaraḥ: Tirtha means Vidya, a particular branch of knowledge or skill. 🌻 692. Vasu-retāḥ: He whose Retas (Semen) is gold (Vasu). 🌻 693. Vasupradaḥ: One who gladly bestows wealth in abundance. He is really the master of all wealth, and others who seem to be so are in those positions only because of His grace. 🌻 694. Vasupradaḥ: One who bestows on devotees the highest of all wealth, namely Moksha. 🌻 695. Vāsudevaḥ: The son of Vasudeva. 🌻 696. Vasuḥ: He in whom all creation dwells. 🌻 697. Vasumanaḥ: One whose mind dwells equally in all things. 🌻 698. Haviḥ: Havis or sacrificial offerings. Continues... 🌹 🌹 🌹 🌹 🌹 #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

*🌹. గీతోపనిషత్తు -197 🌹* ✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ *📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚* శ్లోకము 38 *🍀 37. యోగ వికారములు - కర్తవ్య విముఖులకు యోగము లేదు. త్రికరణ శుద్ధిగ కర్తవ్యములను నిర్వహించువారికే యోగము కుదురును. జీవితమున కర్తవ్య నిర్వహణము యోగ సాధనమున భాగమే. యోగమునకు కర్మయోగ సిద్ధాంతము మొదటి మెట్టు. యజ్ఞార్థ జీవనము రెండవ మెట్టు. ద్వంద్వములను దాటుట మూడవ మెట్టు. తటస్థుడై యుండుట నాల్గవ మెట్టు. అట్టివాడు ఆత్మ సంయమమునకు కృషి చేయవచ్చును. 🍀* కచ్చిన్నో భయవిభ్రష్ట శ్చిన్నాభ్రమివ నశ్యతి | అప్రతిష్ఠ మహాబాహో విమూఢ బ్రహ్మణః పథి || 38 అర్జునుడు తన పరిప్రశ్నము నింకను కొనసాగించెను. ఉభయభ్రష్టుడు చెదిరిన మేఘమువలె నశించిపోవును గదా?అందువలన యోగమార్గము ననుసరించు అయతి ఇహపరములను మోసము చెంది నశించును గదా? ప్రస్తుత కాలమున ప్రతివారును యోగవిద్య యందు ప్రవేశించి యోగులు కావలెనని ఆకాంక్షించు చున్నారు. ఇట్టి ఆకాంక్షను ఆవేశ మావరించి కర్తవ్య విముఖులగు చున్నారు. కర్తవ్య విముఖులకు యోగము లేదు. కర్తవ్యము నుండి పారిపోవు వారికి యోగము కుదరదు. కర్తవ్యములను తప్పించుకు తిరుగు వారికి యోగము కుదరదు. కర్తవ్య నిర్వహణమున వక్రబుద్ధిని ప్రదర్శించు వారికి యోగము కుదరదు. త్రికరణ శుద్ధిగ కర్తవ్యము లను నిర్వహించువారికే యోగము కుదురును. జీవితమున కర్తవ్య నిర్వహణము యోగ సాధనమున భాగమే. అందువలన ప్రపంచమును మోసగించుచు యోగము సాధించుటకు వీలుపడదు. కుటుంబ పోషణము, సంఘము నందు వృత్తి ఉద్యోగ వ్యాపార మార్గమున సహకారము, జీవుల ఎడల కారుణ్యబుద్ధి, తలిదండ్రుల ఎడల భక్తి ఇత్యాదివి లేకుండ యోగ ప్రవేశము నిష్ఫలము. కర్మ ఫలములను ఆశ్రయించుచు యోగాభ్యాసము చేయువానికి మనసు నిలుకడగ నుండదు. మిక్కుటమగు ఇష్టాయిష్టములందు కొట్టు మిట్టాడువానికి యోగము జరుగదు. అట్టి వానికి ప్రశాంతత యుండదు. తటస్థబుద్ధి, సమబుద్ధి అనునవి మృగ్యములై, రాగ ద్వేషములతో జీవించును. సంకల్పములు పుట్టలు పుట్టలుగ వచ్చు చుండగ యోగాభ్యాసము చేసి ఉపయోగము లేదు. యోగవిద్య సత్వగుణ సంబంధితము. రజస్తమస్సుల కది అందదు. రజోగుణ ప్రేరితుడైన వాని నుండి నిత్యము సంకల్పములు కోకొల్లలుగ వచ్చుచుండును. అవి మానవుని బాహ్య ప్రపంచములోనికి నెట్టు చుండును. ఇట్టివాడు యోగము పేరున కర్తవ్య నిర్వహణము మాని భ్రష్టుడగుట జరుగును. యోగమునకు కర్మయోగ సిద్ధాంతము మొదటి మెట్టు. యజ్ఞార్థ జీవనము రెండవ మెట్టు. ద్వంద్వములను దాటుట మూడవ మెట్టు. తటస్థుడై యుండుట నాల్గవ మెట్టు. అట్టివాడు ఆత్మ సంయమమునకు కృషి చేయవచ్చును. సోపాన క్రమమును పాటింపక అడ్డదిడ్డముగ తోచినది చేయువారు యోగ సాధకుల మని భ్రమపడుటయే గాని, యోగము సిద్ధింపనేరదు. అక్షరములను సరిగ నేర్వక గ్రంథములను రచింతునని పూనుకున్నట్లుండును. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెనలు వేసినట్లు, యోగ సాధన పేరున రకరకములుగ వికారములు ప్రకటింపబడు చుండును. ఇవి యన్నియు నరజాతి పోకడలు. అర్జునుడు నరుడగుటచే నరుల ప్రతినిధిగ ఈ పరిప్రశ్నమును చేసెను. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 74 / Sri Lalita Sahasranamavali - Meaning - 74 🌹* 🌻. మంత్రము - అర్ధం 🌻 📚. ప్రసాద్ భరద్వాజ *🍀. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।* *వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀* 🍀 327. కళావతీ - కళా స్వరూపిణీ. 🍀 328. కలాలాపా - కళలను ఆలాపనా స్వరూపముగా కలిగినది. 🍀 329. కాంతా - కామింపబడినటువంటిది. 🍀 330. కాదంబరీ ప్రియా - పరవశించుటను ఇష్టపడునది. 🍀 331. వరదా - వరములను ఇచ్చునది. 🍀 332. వామనయనా - అందమైన నేత్రములు గలది. 🍀 333. వారుణీమదవిహ్వలా - వరుణ సంబంధమైన పరవశత్వము చెందిన మనోలక్షణము గలది. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 74 🌹* 📚. Prasad Bharadwaj *🌻 74. kalāvatī kalālāpā kāntā kādambarīpriyā |* *varadā vāmanayanā vāruṇī-mada-vihvalā || 74 || 🌻* 🌻 327 ) Kalavathi - She who is an artist or she who has crescents 🌻 328 ) Kalaalapa - She whose talk is artful 🌻 329 ) Kaantha - She who glitters 🌻 330 ) Kadambari priya - She who likes the wine called Kadambari or She who likes long stories 🌻 331 ) Varadha - She who gives boons 🌻 332 ) Vama nayana - She who has beautiful eyes 🌻 333 ) Vaaruni madha vihwala - She who gets drunk with the wine called varuni(The wine of happiness) Continues... 🌹 🌹 🌹 🌹 🌹 #లలితాసహస్రనామ #LalithaSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹 https://t.me/srilalithachaitanyavijnanam http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

Join and Share ALL 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/ https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg Join and Share విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/ Join and Share 🌹. Daily satsang Wisdom 🌹 www.facebook.com/groups/dailysatsangwisdom/ https://t.me/Seeds_Of_Consciousness https://pyramidbook.in/dailywisdom Join and Share 🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹 www.facebook.com/groups/vivekachudamani/ https://pyramidbook.in/vivekachudamani Join and Share భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM www.facebook.com/groups/maharshiwisdom/ https://pyramidbook.in/maharshiwisdom Join and Share 🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹 https://t.me/srilalithachaitanyavijnanam http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ Join and share Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా www.facebook.com/groups/avataarmeherbaba/ Join and Share Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు www.facebook.com/groups/theosophywisdom/ Join and Share 🌹. శ్రీ దత్త చైతన్యం - Sri Datta Chaitanyam 🌹 www.facebook.com/groups/dattachaitanyam/ Join and Share 🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 www.facebook.com/groups/masterek/ Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर