వినాయకుడు

lakshmi Aug 19, 2019

మహాగణపతి పురాణము, ప్రథమాధ్యాయము , ప్రస్తావన , శ్లోకం : శుక్లాం బరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విగ్నోప శాంతయే !! ముల్లోకముల అన్నింటిలోనూ గల 14 భువనలలోనూ పరమ పావనమైనది భూలోకము. భూలోకములో పుణ్య మైనది పురాణ ప్రాశస్యము గలది భారతావని . వేద ప్రవచనాలతో, వేదాధ్యయన , అభ్యాసాలతో , యజ్ఞయాగాదులతో, భక్తి , వేదాంత , ఆధ్యాత్మిక, వైరాగ్య, మోక్ష విధానాలతో , ఐహిక ఆముష్మిక చింతనలతో అలరారే పుణ్యభూమి భారతావని. కనుకనే , సృష్టికాలం నుండి ' దుష్టశిక్షణ -- శిష్టరక్షణ' నిమిత్తం భగవంతుడి అవతారాలన్నీ భారతభూమి యందు సంభవించాయి. వేద వేదాంత ములకు పుట్టినిల్లు అయిన ఈ పుణ్య భూమి యందు మునులు, మహర్షులు , యోగులు, వేదాంతులు, ఆర్యులు, ఆచార్యులు , మఠాధిపతులు, పీఠాధిపతులు, అవతార పురుషులు జన్మించి తమ తమ శాంతి, ప్రేమ , సత్య, ధర్మ, అహింస ప్రబోధాలులతో భారతీయులను ఉత్తమ మార్గానా నడిపిస్తూ వచ్చారు. ఈ పరమ పవిత్ర భారతావనిలో నిత్యం వేద పఠనం యజ్ఞయాగాదులు జరుగుతూ ఉంటాయి మునులు, మహర్షులు, మొదలుకొని సామాన్యుల వరకు నిత్యం ధ్యాన ,యోగ , తపస్సులు ఆచరిస్తూ భారతావనికి పవిత్రతను సంతరింపజేసేసారు. అట్టి తో బోధనలకు ఆలవాలమైనది నైమిశారణ్యము. భారత భూమి యందు ఉత్తరమధ్య ప్రాంతమున వెలసిన నైమిశారణ్యము అనాదిగా ఎందరెందరో తపస్సంపన్నులకు ఆవాసంగా విరాజిల్లుతోంది. ఇచ్చట నిత్యం మునులు వేద పఠనం గావిస్తూ ఉంటారు . మహర్షులు విశ్వశాంతి కోసం యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తూ ఉంటారు. భగవంతుని లీలా విశేషాలను గుణగణాలను గానం చేస్తుంటారు. పురాణ శ్రవణలతో హరికథ గానామృతం ఝరులతో నిరంతరం దివ్య జ్ఞాన శోభలతో విరాజిల్లుతూ ఉంటుంది నైమిశారణ్యం. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ.🙏🙏🙏

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

🌼🌿ఈ రోజు సంకటహర చవితి.🌼🌿 నారదమహర్షి చేసిన శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం సంకటహర చవితి రోజు 4 సార్లు చదవడం వలన గణపతి అనుగ్రహంతో మనం జీవితంలో సంకటాలు తొలగిపోతాయి. ఓం శ్రీ గణేశాయ నమః ఓం గం గణపతయే నమః శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం, గౌరీ పుత్రం వినాయకం | భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుః కామార్ధసిద్ధయే | 1 | ప్రధమం వక్రతుండం చ,ఏకదంతం ద్వితీయకం | తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్ధకం | 2 | లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ | సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తధాష్టమం | 3 | నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకం | ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననం | 4 | ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః | న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికరం ప్రభో! | 5 | విద్యార్ధీ లభతే విద్యాం, ధనార్ధీ లభతే ధనం | పుత్రార్ధీ లభతే పుత్రాన్,మోక్షార్ధీ లభతే గతిం | 6 | జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్ | సంవత్సరేణ సిద్ధిం చ,లభతే నాత్ర సంశయః | 7 | అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ | తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః | 8 | || ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం || ఓం శాంతిః శాంతిః శాంతిః శ్రావణ మాసంలో వచ్చిన ఈ సంకష్టహర చవితి పేరు హేరంబ సంకష్టహర చవితి. ఓం హేరంబాయ నమః నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాను అనే చెప్పే గణపతి రూపమే హేరంబ గణపతి. ఈ రోజు గణపతిని శ్రద్ధగా వేడుకుంటే, ఆపదల్లో రక్షిస్తాడు.

+134 प्रतिक्रिया 13 कॉमेंट्स • 127 शेयर

+5 प्रतिक्रिया 1 कॉमेंट्स • 1 शेयर