లక్ష్మీదేవి

Dvsraju Jan 22, 2021

దిగ్గజములు నిను దిక్కుగ తలచి ప్రక్కనే నిలచి ప్రణతులు చేసి అమృతధారల అభిషేకించగ కొలువుతీరిన శ్రీ గజలక్ష్మి శ్రీ గజలక్ష్మీ రావమ్మ మా సిరితల్లి రావమ్మ పద్మవాసిని పద్మలోచని పద్మహస్తవు పద్మిని పద్మగంధిని పద్మసుందరి పద్మనాభుని రాణివి చరణములే పద్మాలు మాకు శరణ్యాలు మా మదిలో భావాలు నీ దరి దీపాలు భోగాలు భాగ్యాలు నీ వరాలు మారాగ యోగాలు వందనాలు lదిగ్గజములుl పైడి మువ్వల కాలి అందెలు ఘల్లుఘల్లున మ్రోగగా రంగవల్లుల ఇంటి ముంగిట పాదముంచవే శ్రీకరి మాఇళ్ళు వాకిళ్ళు నీకిక కోవెలలు పసుపుండే గడపల్లో కనబడు నీసిరులు సౌందర్య మాధుర్య దివ్యమూర్తి సౌభాగ్య సౌశీల్య భవ్యకీర్తి lదిగ్గజములుl నిత్య పూజల నిన్ను కొలిచి చూపు చలువను కోరగా మంచిమాటల స్వర్ణమాలలు పాటలై నిను వేడగా కళకళగా మాకలలే పండించే జననీ తళతళలా పదములలో విచ్చేయవె తల్లీ ఆహ్వానమందించే మాగృహాలు నీస్వామితో రావె అంతేచాలు lదిగ్గజములుl 🌷🌷🐘🌷🌷🐘🌷🌷🐘🌷🌷

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Annapoorna Jan 19, 2021

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Prabhakar MV Jan 15, 2021

+22 प्रतिक्रिया 1 कॉमेंट्स • 33 शेयर
Prabhakar MV Jan 16, 2021

+10 प्रतिक्रिया 0 कॉमेंट्स • 8 शेयर