రథసప్తమి శుభాకాంక్షలు

Mymandir Telugu Feb 12, 2019

#రథసప్తమి 12-02-2019 ఒక పక్షములో వచ్చే ఏడవ తిథిని సప్తమి అంటారు. ఒక్కొక్క తిథి ఒక్కొక్క దేవతకు ప్రత్యేకమైనది. సప్తమి తిథి సూర్యభగవానుడికి ప్రత్యేకమైనది. మాఘ మాసములో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి ఆయనకు మరింత ప్రత్యేకత కలిగినది. కనుక ఆరోజున మనం రథ సప్తమి పండుగ జరుపుకొంటాము. మకరసంక్రమణం రోజున సూర్యుడు ఉత్తరానికి తిరుగుతాడని తెలుసు. ఆ ఉత్తరపు నడక ఈరోజు నుంచి సరియైన దిశలో సాగుతుంది. సూర్యుడి రథసారథి అయిన అరుణుడు రథాన్ని ఈరోజు నుండి ఈశాన్య దిక్కువైపు పోనిస్తాడు. అలాగే సూర్యుడి రథానికి ఒకే ఒక్క చక్రం ఉంటుందని ప్రతీతి. ఆ చక్రమే కాలచక్రం. సూర్యుడి రథాన్ని లాగే ఏడు గుర్రాలు ఇంద్రధనుస్సులోని ఏడు రంగులు. అలాగే ఏడు గుర్రాలు వారములోని ఏడు రోజులకు ప్రతీకలని కూడా ఒక నమ్మకం. అందుకనే వారములోని మొదటి రోజైన ఆదివారం సూర్యభగవానుడికి కేటాయించబడింది. కనుకనే ఈ మాసములో వచ్చే అన్ని ఆదివారములలోను సూర్యుడికి విశేష ఆరాధన జరుగుతుంది. సూర్యుడి రథచక్రాన్ని సంవత్సరం అని కూడా అంటారు. ఇందులో 12 రాశులు ఉంటే, సూర్యుడు ఒక్కో రాశిలో ఒక్కో మాసం చొప్పున సంవత్సర కాలం ప్రయాణం చేస్తాడు. మాఘమాసములో స్నానానికి విశేష ఫలితం ఉంది. ఈ రథసప్తమి నాడు చేసే స్నానానికి మరింత ప్రత్యేకత ఉన్నది. ఈ రోజున 7 జిల్లేడు ఆకులను తెచ్చి ఒకటి నెత్తిమీద, రెండు భుజాల మీద, మరో రెండు మోకాళ్ళ మీద, ఆఖరి రెండు పాదాల మీద ఉంచి స్నానం చెయ్యాలి. ఈ జిల్లేడు పాత్రలనే అర్క పత్రాలు అంటారు. ఇవి సూర్యునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. నెత్తిమీద పెట్టిన జిల్లేడు ఆకులోరేగుపండును కూడా ఉంచుతారు. రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు: *నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!! *యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు! తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!! *ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్! మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!! *ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే! సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!! స్నానం అరుణోదయ సమయానికి పూర్తి చేసి, ఆవు పిడకలతో దాలిని ఏర్పాటు చేసి, దానిపై ఆవుపాలు, బెల్లము ఉపయోగించి బియ్యం పరమాన్నం తయారుచేసి ఆ ప్రసాదాన్ని చిక్కుడు ఆకులలో ఉంచి సూర్యునికి నైవేద్యం పెడతారు. అలాగే చిక్కుడు కాయలతో రథములా తయారుచేసి అక్కడ ఉంచుతారు. ఈ రోజున తరిగిన కూర తినకూడదని పెద్దలు చెప్తారు. అందువలన చిక్కుడు కాయలను చేతితో తుంపి ఆ కూరను వండుకుంటారు. రథసప్తమి రోజున క్రొత్తగా వివాహం అయిన ఆడపిల్లలచేత గ్రామకుంకుమ, కైలాస గౌరి వంటి నోములు పట్టేవారు ఆ కథను చదివి అక్షతలు నెత్తిన చల్లుకుంటారు. ఆ విధముగా చేయటం వలన వారికి ఆ నోము చెయ్యటానికి అర్హత కలిగినట్లుగా భావిస్తారు.

+224 प्रतिक्रिया 2 कॉमेंट्स • 242 शेयर
MS REDDY Feb 12, 2019

+48 प्रतिक्रिया 3 कॉमेंट्स • 42 शेयर
Dunga Ramesh Feb 12, 2019

+18 प्रतिक्रिया 1 कॉमेंट्स • 16 शेयर
DHANA 51 @ Feb 11, 2019

రధసప్తమి శుభాకాంక్షలు

+35 प्रतिक्रिया 0 कॉमेंट्स • 7 शेयर