మన పురాణాలు

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 228 🌹* రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ *🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 50. అధ్యాయము - 5 *🌻. సంధ్య యొక్క చరిత్ర - 4 🌻* బ్రహ్మో వాచ | వసిష్ఠ పుత్ర గచ్ఛ త్వం సంధ్యాం జాతాం మనస్వినీమ్‌ |తపసే ధృతకామాం చ దీక్షసై#్వనాం యథా విధి || 36 మందాక్షమభవత్తస్యాః పురా దృష్ట్వై వ కాముకాన్‌ | యుష్మాన్మాం చ తథాత్మానం సకామాం మునిసత్తమ || 37 అభూత పూర్వం తత్కర్మ పూర్వం మృత్యుం విమృశ్యసా | యుష్మాకమాత్మనశ్చాపి ప్రాణాన్‌ సంత్యక్తుమిచ్ఛతి || 38 సమర్యాదేషు మర్యాదాం తపసా స్థాపయిష్యతి | తపః కర్తుం గతా సాధ్వీ చంద్ర భాగాఖ్య భూధరే || 39 న భావం తపసస్తాత సానుజానాతి కంచన | తస్మాద్య థోపదేశాత్సా ప్రాప్నోత్విష్టం తథా కురు || 40 బ్రహ్మ ఇట్లు పలికెను - పుత్రా! వసిష్టా! అభిమానవతియగు నాకుమార్తె సంధ్య వద్దకు నీవు వెళ్లుము. ఆమె తపస్సును చేయగోరు చున్నది. ఆమెకు యథావిధిగా దీక్షను ఇమ్ము (36). ఓ మహర్షీ! నన్ను, మిమ్ములను కామ వికారముతో కూడి యుండగా పూర్వము ఆమె చూచి, తాను కూడ కామ వికారమును పొందుటను గాంచి, చాల సిగ్గుపడెను (37). నా యొక్క, మీ యొక్క ఈ ముందెన్నడూ జరుగని, పాప భావనతో చూచుట అనే కర్మను ఆమె తలపోసి, ప్రాణములను వీడ నిశ్చయించుకున్నది (38). ఆమె తపస్సుచే లోకములయందు మర్యాదను నెలగొల్ప గలదు. తపస్సును చేయుటకై ఆ సాధ్వి చంద్ర భాగ పర్వతమునకు వెళ్లినది (39). వత్సా! ఆమెకు తపస్సు ను గురించి ఏమియూ తెలియదు కావున, నీవు ఆమెకు ఉపదేశించి, ఆమెకు హితము కలుగునట్లు ప్రయత్నించుము (40). ఇదం రూపం పరిత్యజ్య నిజం రూపాంతరం మునే . పరిగృహ్యాంతికే తస్యాస్తపశ్చర్యాం నిదర్శయన్‌ || 41 ఇదం స్వరూపం భవతో దృష్ట్వా పూర్వం యథాత్ర వామ్‌ | నాప్నుయాత్సాథ కించిద్వై తతో రూపాంతరం కురు || 42 నారదేత్థం వసిష్టో మే సమాజ్ఞప్తో దయావతా |తథాస్త్వితి చ మాం ప్రోచ్య య¸° సంధ్యాంతికం మునిః || 43 తత్ర దేవ సరః పూర్ణం గుణౖర్మానస సంమితమ్‌ | దదర్శ స వసిష్ఠోsథ సంధ్యాం తత్తీరగామపి || 44 ఓ మహర్షీ! ఈ నీ నిజరూపమును వీడి, మరియొక రూపమును స్వీకరించి, ఆమె వద్దకు వెళ్లి, ఆమె చేయు తపస్సును పరిశీలించుము (41). ఆమె నిన్ను ఇచట పూర్వము చూచినది. ఇదే రూపములో నిన్ను చూచినచో, ఆమె ఏదేని వికారమును పొందవచ్చును. కావున రూపమును మార్చుము (42). ఓ నారదా! నేను ఈ తీరున వసిష్ఠుని దయా బుద్ధితో ఆజ్ఞాపించితిని . ఆయన ' అటులనే యగుగాక' అని నాతో పలికి సంధ్య వద్దకు వెళ్లెను (43). ఆ వసిష్ఠ మహర్షి అచట గుణములలో అన్ని విధములా మానససరోవరమును పోలియున్న దేవరస్సును, దాని తీరమునందున్న సంధ్యను చూచెను (44). తీరస్థయా తయా రేజే తత్సరః కమలోజ్జ్వలమ్‌ | ఉద్యదిందు సునక్షత్రం ప్రదోషే గగనం యథా || 45 మునిర్దృష్ట్వాథ తత్ర సుసంభావం స కౌతుకీ | వీక్షాంచక్రే సరస్తత్ర బృహల్లోహిత సంజ్ఞకమ్‌ || 46 చంద్రభాగా నదీ తస్మా త్ర్పాకారాద్దక్షిణాంబుధిమ్‌ | యాంతీ సా చైవ దదృశే తేన సాను గిరేర్మహత్‌ || 47 నిర్భిద్య పశ్చిమం సా తు చంద్ర భాగస్య సా నదీ | యథా హిమవతో గంగా తథా గచ్ఛతి సాగరమ్‌ || 48 ప్రదోషకాలమునందు ఉదయించే చంద్రునితో నక్షత్రములతో ఆకాశము నిండియున్నట్లు, ఆ సరస్సు తీరమునందున్న ఆమెతో మరియు కమలములతో నిండి ఉజ్జ్వలముగా ప్రకాశించెను (45). వసిష్ఠ మహర్షి ఉత్కంఠ గలవాడై గొప్ప నిర్ణయము గల ఆమెనచట దర్శించెను. మరియు అచట బృహల్లోహితమను పేరు గల ఆ సరస్సును చూచెను (46). ప్రాకారము వలెనున్న ఆ పర్వతమునుండి దక్షిణ సముద్రము వరకు వ్రవహించుచున్న చంద్రభాగా నదిని ఆయన దర్శించెను. ఆనది ఆ పర్వతము యొక్క గొప్ప సానువును (47) భేదించుకొని, పశ్చిమము వైపునకు ప్రవహించెను. హిమవత్పర్వతము నుండి సముద్రము వైపునకు పయనించే గంగవలె ఆనది శోభిల్లెను (48). తస్మిన్‌ గిరౌ చంద్రభాగే బృహల్లోహితతీరగామ్‌ | సంధ్యాం దృష్ట్వాథ పప్రచ్ఛ వసిష్ఠస్సాదరం తదా || 49 అపుడు ఆ చంద్ర భాగ పర్వతమునందు బృహల్లోహితమనే సరస్సు యొక్క తీరము నందున్న సంధ్యను చూచి, వసిష్ఠుడు ఆ దరముతో నిట్లు ప్రశ్నించెను (49). సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 226 🌹* రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ *🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 50. అధ్యాయము - 5 *🌻. సంధ్య యొక్క చరిత్ర - 2 🌻* బ్రహ్మో వాచ | అహం స్వతనయాం సంధ్యాం దృష్ట్వా పూర్వమథాత్మనః | కామాయాశు మనోsకార్షం త్యక్తా శివ భయాచ్చ సా || 14 సంధ్యా యాశ్చలితం చిత్తం కామబాణ విలోడితమ్‌ | ఋషీణామపి సంరుద్ధ మానసానాం మహాత్మనామ్‌ || 15 భర్గస్య వచనం శ్రుత్వా సోపహాసం చ మాం ప్రతి | ఆత్మనశ్చలితత్వం వై హ్యమర్యాదమృషీన్‌ ప్రతి || 16 కామస్య తా దృశం భావం మునిమోహకరం ముహుః | దృష్ట్వా సంధ్యా స్వయం తత్రోపయమా యాతి దుఃఖితా || 17 బ్రహ్మ ఇట్లు పలికెను - పూర్వము నేను నాకుమార్తె యగు సంధ్యను చూచి వెంటనే ఆమెను కామించితిని. కాని శివుని భయము వలన అధర్మమును వీడితిని (14). మన్మథుడు బాణములచే ప్రహారము చేయగా, సంధ్య యొక్క మనస్సు చలించెను. మనోనిగ్రహము గలవారు, మహాత్ములునగు ఋషులకు కూడ మనో వికారము కలిగెను (15). శివడు నాతో పరిహాస పూర్వకముగా పలికిన మాటలను సంధ్య విన్నది. తాను పొందిన మనోవికారమును, ఋషుల విషయములో జరిగిన అమర్యాదను కన్నది (16). మునులకు కూడా మోహమును కలిగించే కాముని సామర్థ్యమును పరిశీలించినది. ఆమె మిక్కిలి దుఃఖితురాలై అచట నుండి వెళ్లిపోయెను (17). తతస్తు బ్రహ్మణా శ##ప్తే మదనే చ మయా మునే | అంతర్భూతే మయి శివే గతే చాపి నిజాస్పదే || 18 అమర్ష వశమా పన్నా సా సంధ్యా మునిసత్తమ | మమ పుత్రీ విచార్యైవం తదా ధ్యాన పరాsభవత్‌ || 19 ధ్యాయంతీ క్షణమేవాశు పూర్వం వృత్తం మనస్వినీ | ఇదం విమమృశే సంధ్యా తస్మిన్‌ కాలే యథోచితమ్‌ || 20 ఓ మహర్షీ! నేను మన్మథుని శపించి అంతర్ధానమైతిని. శివుడు తన ధామకు వెళ్లెను (18). ఓ మహర్షీ! ఆ సంధ్య జరిగిన వృత్తాంతమును సహించలేక పోయెను. నా కుమారైయగు సంధ్య అపుడు ఇట్లు తలపోసి, ధ్యానమగ్నురాలు అయెను (19). అభిమానవతియగు ఆ సంధ్య జరిగిన వృత్తాంతమును ధ్యానము చేయు చున్నదై, ఆ కాలమునకు ఉచితమగు విధానములో, ఇట్లు విమర్శ చేసుకొనెను (20). సంధ్యో వాచ | ఉత్పన్న మాత్రాం మాం దృష్ట్వా యువతిం మదనేరితః | అకార్షీత్సాను రాగోsయమభిలాషం పితా మమ || 21 పశ్యతాం మానసానాం చ మునీనాం భావితాత్మనామ్‌ | దృష్ట్వై వ మామమర్యాదం సకామమభవన్మనః || 22 మమాపి మథితం చిత్తం మదనేన దురాత్మనా | యేన దృష్ట్వా మునీన్‌ సర్వాంశ్చ లితం మన్మనో భృశమ్‌ || 23 ఫలమేతస్య పాపస్య మదనస్స్వయమాప్తవాన్‌ | యస్తం శశాప కుపితః శంభోరగ్రే పితామహః || 24 సంధ్య ఇట్లు పలికెను - నేను యువతిగా జన్మించిన మరుక్షణములో, మన్మథునిచే ప్రేరితుడైన నా తండ్రి నన్ను మన్మథ వికారముతో కామించెను (21). మానసపుత్రులు, అంతః కరణ శుద్ధి గల మునులు చూచుచుండగా ఆయన నన్ను మర్యాద లేని విధముగా చూచి, మనస్సులో కామనను పొందినాడు (22). దుర్మార్గుడగు మన్మథుడు నా మనస్సును కూడ కల్లోల పెట్టగా , ఆ మునుల నందరినీ చూచుచున్న నా మనస్సు మిక్లిలి చలించెను (23). ఈ పాపమునుకు ఫలమును మన్మథుడు పొందినాడు. శంభుని యెదుట పితామహుడు కోపించి వానిని శపించినాడు (24). సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 225 🌹* రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ *🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 50. అధ్యాయము - 5 *🌻. సంధ్య యొక్క చరిత్ర - 1 🌻* సూత ఉవాచ | ఇత్యాకర్ణ్య వచస్తస్య బ్రహ్మణో మునిసత్తమః | స ముదోవాచ సంస్మృత్య శంకరం ప్రీతమానసః || 1 సూతుడిట్లు పలికెను - మునిశ్రేష్ఠుడగు నారదుడు బ్రహ్మ యొక్క ఈ మాటలను విని, సంతసించిన మనస్సు గలవాడై, శంకరుని స్మరించి ఆనందముతో నిట్లనెను (1). నారద ఉవాచ | బ్రహ్మన్‌ విధే మహాభాగ విష్ణు శిష్య మహామతే | అద్భుతా కథితా లీలా త్వయా చ శశిమౌలినః || 2 గృహీతదారే మదనే హృష్టే హి స్వగృహం గతే | దక్షే చ స్వగృహం యాతే తథా హి త్వయి కర్తరి || 3 మానసేషు చ పుత్రేషు స్వస్వధామసు | సంధ్యా కుత్ర గతా సా చ బ్రహ్మపుత్రీ పితృప్రసూః || 4 కిం చకార చ కేనైవ పురుషేణ వివాహితా | ఏతత్సర్వం విశేషేణ సంధ్యాయాశ్చరితం వద || 5 నారదుడిట్లు పలికెను - హే బ్రహ్మన్‌! విధీ! మహాత్మా! విష్ణుశిష్యా! మహాప్రాజ్ఞా! నీవు చంద్రశేఖరుని అద్భుత లీలను చెప్పితివి (2). మన్మథుడు వివాహమాడి ఆనందముతో తన గృహమునకు వెళ్లగా, దక్షుడు తన గృహమును చేరుకొనగా జగత్కర్తవగు నీవు కూడ గృహమును పొందగా (3), మానసపుత్రులు కూడ తమ తమ ధామములకు చేరుకొనగా, బ్రహ్మ పుత్రి, పితృదేవతలకు తల్లి అగు సంధ్య ఎచటకు వెళ్లెను ? (4) ఆమె ఏమి చేసెను? ఏ పురుషుని వివాహమాడెను? నీవు సంధ్య యొక్క చరిత్ర నంతనూ విస్తారముగా చెప్పుము (5). సూత ఉవాచ | ఇత్యాకర్ణ్య వచస్తస్య బ్రహ్మ పుత్రస్య ధీమతః | సంస్మృత్య శంకరం భక్త్యా బ్రహ్మా ప్రోవాచ తత్త్వవిత్‌ || 6 సూతుడిట్లు పలికెను - బుద్ధిమంతుడు బ్రహ్మపుత్రుడునగు ఆ నారదుని మాటను విని, తత్త్వవేత్తయగు బ్రహ్మ భక్తితో శంకరుని స్మరించి ఇట్లు పలికెను (6) బ్రహ్మో వాచ | శృణు త్వం చ మునే సర్వం సంధ్యాయాశ్చరితం శుభమ్‌ | యచ్ఛృత్వా సర్వకామిన్య స్సాధ్వ్యస్స్యు స్సర్వదా మునే || 7 సా చ సంధ్యా సుతా మే హి మనో జాతా పురాs భవత్‌ | తపస్తప్త్వా తనుం త్యక్త్వా సైవ జాతా త్వరుంధతీ || 8 మేధాతి థేస్సుతా భూత్వా మునిశ్రేష్ఠస్య ధీమతీ | బ్రహ్మ విష్ణు మహేశాన వచనా చ్చరితవ్రతా || 9 వవ్రే పతిం మహాత్మానం వసిష్ఠం శంసితవ్రతమ్‌ | పతివ్రతా చ ముఖ్యా భూద్వంద్యా పూజ్యా త్వభీషణా || 10 బ్రహ్మ ఇట్లు పలికెను - ఓ మహర్షీ! శుభకరమగు సంధ్య యొక్క చరితమును నీవు పూర్తిగా వినుము. ఓ మునీ! దీనిని ఎల్లవేళలా వినే స్త్రీ లందరు సాధ్వీమణులగుదురు (7). ఆ సంధ్య ముందుగా నాకు కుమారైయై పుట్టెను. ఆమె తపస్సును చేసి, శరీరమును వీడి అరుంధతియై జన్మించెను (8). బుద్ధి మంతురాలగు ఆమె గొప్ప ముని యగు మేథా తిథికి కుమారైయై జన్మించెను. గొప్ప నిష్ఠ గల ఆమె బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మాటచే (9) మహాత్ముడు, ప్రశంసింపదగిన తపోనిష్ఠుడునగు వసిష్ఠుని భర్తగా వరించెను. మంచి మనసు గల ఆమె పతివ్రతలలో శ్రేష్ఠురాలై జగత్తునకు నమస్కిరింపదగిన పూజ్యురాలు అయెను (10). నారద ఉవాచ | కథం తయా తపస్తప్తం కిమర్థం కుత్ర సంధ్యయా | కథం శరీరం సా త్యక్త్వాsభవన్మేధాతిథే స్సుతా || 11 కథం వా విహితం దేవైర్బ్రహ్మ విష్ణు శివైః పతిమ్‌ | వసిష్ఠం తు మహాత్మానం సంవవ్రే శంసిత వ్రతమ్‌ || 12 ఏతన్మే శ్రోష్యమాణాయ విస్తరేణ పితామహ | కౌతూహల మరుంధత్యాశ్చరితం బ్రూహి తత్త్వతః || 13 నారదుడిట్లు పలికెను - ఆ సంధ్య తపస్సును ఎచట, ఎందుకొరకు, ఎట్లు చేసెను? ఆమె ఎట్లు శరీరమును వీడి మేధాతిథి కుమార్తెగా జన్మించెను? (11) బ్రహ్మ విష్ణు శివులచే నిర్ణయింపబడిన వాడు, ప్రశంసింపదగిన తపో నిష్ఠ గలవాడు, మహాత్ముడు అగు వసిష్ఠుని ఆమె భర్తగా ఎట్లు వరించెను? (12) ఓ పితామహా! నేను ఈ అరుంధతీ చరిత్రను విన గోరుచున్నాను ఉత్కంఠ గల నాకు ఈ చరిత్రసారమును విస్తరముగా చెప్పుము (13). సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 223 🌹* రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ *🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 49. అధ్యాయము - 4 *🌻. కాముని వివాహము - 2 🌻* తస్యా భ్రూయుగలం వీక్ష్య సంశయం మదనోsకరోత్‌ | ఉత్సాదనం మత్కోదండం విధాత్రాస్యాం నివేశితమ్‌ || 10 కటాక్షాణా మాశుగతిం దృష్ట్వా తస్యా ద్విజోత్తమ | ఆశు గంతుం నిజాస్త్రాణాం శ్రద్దధేన చచారుతామ్‌ || 11 తస్యాస్స్వభావ సురభి ధీర శ్వాసానిలం తథా | ఆఘ్రాయ మదనశ్శద్ధాం త్యక్తవాన్మలయాంతికే || 12 పూర్ణేందు సదృశం వక్త్రం దృష్ట్వా లక్ష్మ సులక్షితమ్‌ | న నిశ్చికాయ మదనో భేదం తన్ముఖ చంద్రయోః || 13 ఆమె కను బొమలను చూచి, ' బ్రహ్మ నా ధనస్సును లాగుకొని ఈమె కనుబొమలను మలచినాడా యేమి?' అని మన్మథుడు సందేహపడెను (10). ఓ ద్విజశ్రేష్ఠా! ఆతడు ఆమె యొక్క వేగము గల చూపులను పరికించి, తన అస్త్రముల యందు శ్రద్ధను శీఘ్రమే కోల్పోయెను. ఆమె ఇతర సౌందర్యమునైననూ ఆతడు పరికించలేదు (11). స్వభావ సిద్ధముగా పరిమళముగల ఆమె యొక్క నిటారైన శ్వాస వాయువును ఆఘ్రాణించి మన్మథుడు మలయమారుతము నందు విశ్వాసమును విడిచిపెట్టెను (12). పూర్ణిమనాటి చంద్రుని బోలియున్న, చిన్న మచ్చతో శోభించే ఆమె ముఖమును చూచి, మన్మథుడు ఆమె ముఖమునకు, చంద్రునకు గల భేదమును ఎరుంగలేపోయెను (13). సువర్ణ పద్మకలికాతుల్యం తస్యాః కుచద్వయమ్‌ | రేజే చూచుకయుగ్మేన భ్రమరేణవ వేష్టితమ్‌ || 14 దృఢీపీనోన్నతం తస్యాస్త్సనమధ్యం విలంచినీమ్‌ | ఆనాభి ప్రతలం మాలాం తన్వీం చంద్రాయితాం శుభమ్‌ || 15 జ్యాం పుష్పధనుషః కామః షట్పదావలి సంభ్రమామ్‌ | విసస్మార చ యస్మాత్తాం విసృజ్యైనాం నిరీక్షతే || 16 గంభీరనాభి రంధ్రాంతశ్చతుః పార్శ్వత్వగావృతమ్‌ | ఆననాబ్జేsక్షణద్వంద్వ మారక్తక ఫలం యథా || 17 బంగరుపద్మముల మొగ్గలవంటి ఆమె కుచ ద్వయము భ్రమరములు వాలినవా యన్నట్లున్న చూచుకములతో ప్రకాశించెను (14). దృఢముగా బలిసి ఎత్తుగా నున్న ఆమె స్తనముల మధ్యలో నాభి గహ్వరము వరకు వెన్నెల వలె తెల్లనైన సన్నని మాల వ్రేలాడుచుండెను. శుభకరమగు (15) ఆ మాలను నిరీక్షించుచూ, మన్మథుడు తుమ్మెదల పంక్తిచే నిర్మితమై అల్లకల్లోలముగా నున్న పుష్పధనుస్సు యొక్క నారిత్రాటిని మరిచిపోయెను (16). అన్ని వైపుల మృదువగు చర్మముచే ఆవరింపబడియున్న నాభీరంధ్రములోతుగనున్నది. పద్మము వంటి ఆమె ముఖమునందలి రెండు కన్నులు ఎర్రని ఫలముల వలె ప్రకాశించుచున్నవి (17). క్షీణాం మధ్యేన వపుషా నిసర్గాష్టాపదప్రభా | రుక్మవేదీవ దదృశే కామేన రమణీ హి సా || 18 రంభా స్తంభాయతం స్నిగ్ధం యదూరు యుగలం మృదు | నిజశక్తి సమం కామో వీక్షాం చ క్రే మనోహరమ్‌ || 19 ఆరక్త పార్‌ష్ణి పాదాగ్ర ప్రాంతభాగం పదద్వయమ్‌ | అను రాగమివానేన మిత్రం తస్యా మనోభవః || 20 తస్యాః కరయుగం రక్తం నఖరైః కింశుకోపమైః | వృత్తాభిరంగులీభిశ్చ సూక్ష్మా గ్రా భిర్మనోహరమ్‌ || 21 సన్నని నడుము గలది, సహజముగా బంగరు వన్నె గలది అగు ఆ రమణి మన్మథునకు బంగరు వేదిక వలె కన్పట్టెను (18). అరటి బోదెల వలె పొడవైనది, స్నిగ్ధమృదు మనోహరము అగు ఆమె యొక్క ఊరు ద్వంద్వమును చూచి మన్మథుడు తన సమ్మోహనశక్తితో సమమైనదిగా భావించెను (19). ఆమె రెండు పాదముల అగ్రములు, మధ్య భాగము, మడమలు మిక్కిలి ఎర్రగా నుండి, ఆమెకు ప్రియుడగు మన్మథుని యందు గల అనురాగము వాటి యందు ప్రకటమైనదా అన్నట్లుండెను (20). ఆమె చేతులు ఎర్రగా నుండి, చిగుళ్లవంటి గోళ్లతో, గుండ్రని సన్నని అగ్రములు గల వ్రేళ్లతో మనోహరముగా నుండెను (21). సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर