ప్రవచనాలు

Dvsraju Oct 23, 2019

ఒక జంట ఓడలో ప్రయాణిస్తున్నారు. ఉన్నట్టుండి ఓడ మునిగిపోతోంది. అందరూ లైఫ్ బోట్ లోకి వెళ్తున్నారు, ఆ లైఫ్ బోట్లో ఇంక ఒక్కరికే స్థానం ఉంది, జంట మాత్రమే ఇంక ఓడలో మిగిలింది, భార్య భర్త ఎవరో ఒక్కరే లైఫ్ బోట్లోకి వెళ్ళగలరు. ఇద్దరూ ఆలోచిస్తున్నారు, ఉన్నట్టుండి భర్త భార్యను మునిగిపోతున్న ఓడలోనే ఉంచేసి తాను మాత్రం లైఫ్ బోట్లోకి దూకేసాడు. వెనక నుంచి భార్య అరుస్తూ ఏదో చెప్తోంది. తరగతిలో పిల్లలకి ఈ కధ చెప్తున్న ఉపాధ్యాయురాలు కధ చెప్పటం ఇక్కడ ఆపేసింది. పిల్లలూ, ఆవిడ భర్తతో ఏమని ఉంటుందో చెప్పగలరా అని పిల్లలని ప్రశ్నించింది, టీచర్. పిల్లలు ఒకేసారి చెప్పారు, ఇంత మోసమా, నిన్ను గుడ్డిగా నమ్మాను, అని ఉండచ్చు టీచర్ అన్నారు. ఒక బాబు మౌనంగా కూర్చుని ఉన్నాడు, టీచర్ ఆ బాబుని అడిగింది నువ్వేమి చెబుతావు అని. ఆ బాబు చెప్పాడు, మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి, అని చెప్పి ఉంటుంది అన్నాడు. టీచర్ కళ్ళల్లో ఆశ్చర్యం, నీకు ఈ కధ ముందే తెలుసా, అని అడిగింది. బాబు తల అడ్డంగా ఊపాడు, లేదు, నాకు ఈ కధ తెలీదు, మా అమ్మ జబ్బుతో చనిపోతూ మా నాన్నకు చెప్పింది, మన బాబు జాగ్రత్త అని.. అన్నాడు. ఈ సారి టీచర్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఈ కధలో భార్య కూడా ఇదే చెప్పింది, నీ సమాధానం సరి అయినది అని చెప్పింది టీచర్. ఇహ కధ విషయానికి వస్తే భర్త ఇంటికి చేరి తమ కూతురిని కంటికి రెప్పలా కాపాడుతూ చూసుకుంటూ, బాగా చదివించి, పెళ్ళి చేసి మంచి జీవితాన్ని కూతురికి అందించి ఒక రోజు కన్ను మూసాడు. తండ్రి వస్తువులని ఒకచోట చేర్చి పక్కన పెట్టేయాలి అని కూతురు తండ్రి వస్తువులు సర్దుతోంది. తండ్రి డైరీ కనపడింది, అందులో రాసుకున్నాడు, భార్యకు చెప్పుకుంటున్నట్టు, నీతోపాటే ఓడలో ఉండి మునిగిపోయి నీళ్ళ కిందే నీతోనే ఎప్పటికీ ఉండిపోవాలి అనిపించింది, కానీ మనమ్మాయిని ఎవరు చూసుకుంటారు, నిన్ను బతికిద్దామనుకుంటే, నీ ప్రాణాంతక జబ్బు చివరి స్టేజ్ లో ఉంది, ఎలానూ నువ్వు మరణం అంచుల్లో ఉన్నావు. మరి మనమ్మాయికి ఎవరు తోడు.అందుకే ఎక్కువ ఆలోచిస్తే బలహీనపడిపోతానేమో అనిపించి లైఫ్ బోట్లోకి దూకేసాను. మనసులో ఎంత ఏడ్చుకున్నానో నీకు తప్ప ఇంకెవరికి అర్ధం అవుతుంది, అని డైరీలో భార్యకి చెప్పుకున్నాడు. పైపైన ఏదో చూసి ఎప్పుడూ ఎదుటి మనిషిని నిర్ణయించకూడదు, ఎవరు ఏంటీ అని, మనకి తెలియని లోతులు చాలా ఉండచ్చు వారి జీవితాల్లో. ఎప్పుడూ తొందరపడి ఏ మనిషినీ నిందించకూడదు, అనుమానించకూడదు, అవమానించకూడదు.

+5 प्रतिक्रिया 2 कॉमेंट्स • 11 शेयर
Dvsraju Oct 23, 2019

మనసును ప్రశాంత స్థితిలో ఉంచడానికి మార్గం ఒకటే ఉంది. కోరికల వల నుంచి దాన్ని బయటకు పడవెయ్యాలి. ప్రపంచ మహాసాగరంలో ఊగిసలాడే పడవ వంటిది మానవ శరీరం. కర్మానుభవాలనే గాలులే ఆ నావను నడుపుతుంటాయి. దేహమనే పడవకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి. ఆ పడవ నడిపే సరంగు నిమిత్తమాత్రుడు. ఈ చిల్లుల పడవను సాక్షిగా నడిపిస్తుంటాడు. ఈ తొమ్మిది రంధ్రాలను చూసుకొంటూ జీవన ప్రయాణం సాగించకపోతే, పడవలోకి నీళ్లు వచ్చేసి, అది మునిగిపోతుంది. అనుభవశాలి అయిన సరంగు పడవను ఆవలి గట్టుకు భద్రంగా చేరుస్తాడు. ఇంద్రియ నిగ్రహంతోటే ఇది సాధ్యం. పరస్త్రీలను కోరడం మహాపాపం. తెలిసి కూడా కోరికలను వదలకపోతే మనసు పాపపంకిలమైపోతుంది. ఇతరుల్ని తిట్టడం, లేక వారి తిట్లను వినడం రెండూ నిరర్థకమే! నిందించడానికి అలవాటుపడిన నాలుక సాధించుకొనేదేదీ ఉండదు... పోగొట్టుకోవడం తప్ప. వస్తువుల మీద ఉన్న అభిమానం, దురదృష్టానికి దారి తీస్తుంది. వస్తువును పొంది, తరవాత పోగొట్టుకొంటే అది మహాబాధ కలిగిస్తుంది. వివేకవంతమైన మనసు, తనకేది కావాలో తేల్చుకోగలదు. అశాశ్వతమైన వస్తువులకు అది ఎప్పుడూ దూరంగా ఉంటుంది. పామునోట సగం శరీరంతో ఇరుక్కొన్న కప్ప, తనను మింగబోతున్న మృత్యువును గ్రహించలేదు. పైగా అది తన ముందున్న కీటకాలను తినాలని తాపత్రయ పడుతుంది. అదే చిత్రం. దీనిని దురాశ కాక మరేమిటని అంటారు? ఇలాంటి మనసును అదుపులో ఉంచుకోవడం ఎలా? తన ప్రయాణాన్ని ప్రారంభించిన నది, మూలం వదిలి సముద్రం చేరేదాకా, పల్లంవైపుగా సాగుతుంది. వర్షకాలంలో అధికంగా నీరుచేరితే బావిలోని నీరు తీపితనాన్ని కోల్పోతుంది. ఆ బావి నీరే వేసవిలో తియ్యగా మారిపోతుంది. ‘అతిసర్వత్రవర్జయేత్‌’ అన్నారు. అధికం ఎప్పుడూ అనర్థమే! అధికమైన కోరికలతో తామసగుణం పెరిగిపోతుంది. అవి లేకపోతే తామసం నశించి సత్త్వగుణం పెరుగుతుంది. సత్త్వ రజస్తమో గుణాలు మూడూ ప్రకృతి సహజమైనవే! పవిత్రత, వివేకం, విజ్ఞానం- ఇవన్నీ సత్త్వగుణాలు. ఆందోళన, ఆగ్రహం, అస్తిమతత్వం- ఇవన్నీ రజోగుణాలు. జడత్వం, అజ్ఞానం, భ్రాంతి- ఇవన్నీ తమోగుణాలు. మనసుకు ఉన్న మొదటి లక్షణం- అన్నీ పొందాలనుకోవడం. పోగొట్టుకోవడానికి అది ఇష్టపడదు. పైగా అవమానకరంగా భావిస్తుంది. వస్తువును పొందే ప్రయత్నం అంతా నిజానికి ఒక యాతన వంటిది. సత్సంగం, సత్సాంగత్యం, సజ్జనమైత్రి... మనసుకు ఎంతో స్తిమితాన్ని ఇస్తాయి... 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 6 शेयर
Dvsraju Oct 22, 2019

'అహం బ్రహ్మస్మి' నేను 'బ్రహ్మంను అని, బ్రహ్మ జ్ఞానం సంపాదించాలని అంతరార్థం. నేనే బ్రహ్మంను అంటే నా దేహం లో 'బ్రహ్మం ఉన్నాడు . నేనే బ్రహ్మం మనం చేసేది మనసా, వాచా, కర్మణా అంతరాత్మ చెప్పిందే అయితే నిశ్చయంగా మనం 'బ్రహ్మమే"! దీని ప్రకారం బ్రహ్మం ఎవరో కాదు, నేనే అని ఈ ఉపనిషత్తు వాక్యం చెబుతుంది. ఇక మరో మహావాక్యం తత్వమసి. తత్వం అంటే నువ్వు, నువ్వు కూడా బ్రహ్మంవే అని దీని అర్థం. సామవేదంలోని చాందోగ్యోపనిషత్తు నుంచి వచ్చిన వాక్యం ఇది. మరో మహత్తర వాక్యం 'అయమాత్మా బ్రహ్మ'. అంటే ఈ ఆత్మే బ్రహ్మం అని అర్థం. అధర్వణవేదంలోని ముండకోపనిషత్తు నుంచి ఈ వాక్యం వచ్చింది. ఈ మహత్తర వాక్యాల సారాన్నంతా మళ్లీ ఒకే వాక్యంలో చేర్చి చెప్పటం జరిగింది. అదే 'సర్వం ఖల్విదం బ్రహ్మ'. అంటే ఈ సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే తప్ప మరేమీ కాదు!ఈ వాక్యాల సారం అర్థమయితే చాలు, భగవంతుడు మరెక్కడో లేడు-మన అందరిలోనూ, అన్ని జీవుల్లోనూ ఉన్నాడనే భావన వస్తుంది. మన అంతరంగంలో అన్వేషిస్తే దీనికి సరైన సమాధానం లభిస్తుంది. బయట వెతికితే ఏమీ లభించదు .శంకరులు "అహం బ్రహ్మస్మి" అన్నారు. వెంటనే శిష్యులు కూడా "అహం బ్రహ్మస్మి" అన్నారు. మరి కొందరు అహంకారులు "అహం పరబ్రహ్మస్మి" అన్నారు. ఇంకా కొందరు అహంకారులు "అహం పరాత్పర బ్రహ్మస్మి" అన్నారు. అనగా శంకరులు నేను బ్రహ్మము అనగా కొందరు శిష్యులు నేను బ్రహ్మమునే అనియు, మరి కొందరు శిష్యులు నేను బ్రహ్మము కన్న అధికమైన పరబ్రహ్మము అనియు, నేను పర బ్రహ్మము కన్న ఇంకా అధికమగు పరాత్పర బ్రహ్మమనియు అన్నారు. బ్రహ్మమగు శంకరులు చెప్పిన విషయాన్నిఎవరూ గ్రహించలేక పోయారు! ఈ తత్వసారాన్ని తెలుసుకోవాలంటే అహంకారాన్ని పూర్తిగా వదలివేయాలి! చాలా మంది అహంకారం, గర్వం ఒకటే అని అనుకుంటారు . గర్వం వేరు, అహంకారం వేరు. 'అహం' అన్నది 'నేను' అనే వ్యక్తిత్వ భావన ఎక్కువైతే వచ్చేది. 'నేను' కు మూలంలోకి వెళ్ళితే తప్ప 'అహం' అసలు స్వభావం తెలియదు. ' అహం బ్రహ్మస్మి ' అన్నారు పెద్దలు.' అహం ' అంటే 'ఆత్మ' అని వారి భావన. నిర్గుణ బ్రాహ్మ్య స్థితి కలిగి 'సోహం' మంత్రమును శ్వాస, నిశ్వాసాల ద్వారా నిరంతరము జపించేవారికి ఆత్మతత్త్వము తెలుస్తుందని కొందరి అభిప్రాయం. 'సోహం' అనగా 'అదే నేను' అని అర్థం. 'అహం బ్రహ్మస్మి' అనే మహావాక్యానికి ఇది మంత్రరూపం. ఇది ప్రతివ్యక్తిలోను వారికి తెలియకుండా ఉఛ్వాసలో 'సో' అని, నిశ్వాసలో 'హం' అని నిత్య సాధన జరుగుతుంటుంది. దీన్నే'అజపాగాయత్రి' అని అంటారు. దైవమూ ఒక్కటేనని, అలాంటి ప్రజ్ఞ కలిగినప్పుడు ఆ మనిషి దివ్యాత్మని అనుభవిస్తాడనే " ఆత్మ జ్ఞానాన్ని మహనీయులు కొందరు చెప్పారు.. ప్రతి మనిషిలోను భగవంతుడు కొలువై ఉంటాడు. అందుకే అన్నారు "అహం బ్రహ్మస్మి" అని !కానీ చాలా కొద్దిమంది మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకుంటారు. సాధన చేసి అంధకారాన్ని పారద్రోలాలి! శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీతలో, ఆత్మ సిద్ధాంతాన్ని గురించి చెప్పాడు. ఆత్మ నాశనం కానిదని, శస్త్రం ఏదీ ఛేదించలేనిదని , అగ్ని దహించలేనిదని, నీరు తడపలేనిదని, వాయువు ఆర్పలేనిదని అని వివరించాడు. అహం అనే మాటని "నేను" గా అనువదిస్తే వచ్చే అర్ధం నేను బ్రహ్మంని (ఇక్కడ బ్రహ్మ అనే మాట త్రిమూర్తుల్లో బ్రహ్మ కాదు, పరమ చైతన్యం) అని అర్ధం! కాబట్టి ప్రతి ప్రాణి ఆ చైతన్యమే! దేవుడు మనలోనే ఉన్నాడు, మనం దేవుడిలో ఉన్నాం. ఆ దివ్య చైతన్యంలో మనం కూడా భాగం అవ్వటం గురించి సాధన చేయాలి. ఆత్మ ఒక్కటే. అది పరిమితమైతే అహంకరణం, పరిమితం కానప్పుడు అది అనంతము, సత్యమూనూ అని శ్రీ రమణులు చెప్పారు. ''నేనెవ్వరు?'' అన్న విచారణా మార్గం సాధకులకు తెలియాలి. శివుడికి లింగభేదం లేదు. తనలో అటువంటి భేదాన్ని సృష్టించబోయిన మన్మధుడిని దహించాడు. కాముడిని జయించాడు. శివుడు అవసరమైతే విషం పుచ్చుకుంటాడు. సన్యాసిగా మన్మధుడిని కాల్చినవాడే, పార్వతిని వివాహమాడిన సంసారి శివుడు. పూర్ణ మదం: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమే వా వశిష్యతే. 🙏🌹🌺🌺🌹🙏

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर