గీతా సారం

*🌹. శ్రీమద్భగవద్గీత - 602 / Bhagavad-Gita - 602 🌹* ✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 📚. ప్రసాద్ భరద్వాజ *🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 13 🌴* 13. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే | సాంఖ్యే కృతాన్తే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ || 🌷. తాత్పర్యం : ఓ మహాబాహుడవైన అర్జునా! వేదాంతము ననుసరించి కర్మలు సిద్ధించుటకు ఐదు కారణములు గలవు. వాని నిపుడు నా నుండి ఆలకింపుము. 🌷. భాష్యము : ప్రతికర్మకు కూడా ఫలము నిశ్చయమైనప్పుడు కృష్ణభక్తిరసభావితుడు తను చేయు కర్మల ఫలితములచే సుఖదుఃఖములను అనుభవింపడనుట ఎట్లు సంభవమనెడి ప్రశ్న ఉదయించును. కాని అది ఎట్లు సాధ్యమో తెలియజేయుటకు శ్రీకృష్ణభగవానుడు వేదాంత తత్త్వమును ఉదహరించుచున్నాడు. ప్రతికార్యమునకు ఐదు కారణములు గలవనియు మరియు కార్యముల సిద్ధికి ఈ ఐదు కారణములను గమనింపవలెననియు శ్రీకృష్ణభగవానుడు తెలియజేయుచున్నాడు. సాంఖ్యమనగా జ్ఞానకాండమని భావము. అలాగుననే వేదాంతము ప్రసిద్ధులైన ఆచార్యులచే ఆమోదింపబడిన జ్ఞానము యొక్క చరమస్వరూపము. శ్రీశంకరాచార్యులు కూడా ఆ వేదాంతసూత్రములను యథాతథముగా స్వీకరించిరి. కనుక ప్రామాణమును సర్వదా గ్రహించవలెను. చరమనిగ్రహము పరమాత్ముని యందే కలదు. ఇదే విషయము “సర్వస్య చాహం హృది సన్నివిష్ట:” అని ఇంతకు పూర్వమే భగవద్గీత యందు తెలుపబడినది. అనగా పరమాత్ముడు ప్రతియొక్కరిని వారి పూర్వకర్మలను గుర్తు చేయుచు వివిధకర్మల యందు నియుక్తుని చేయుచున్నాడు. అంతరము నుండి కలుగు అతని నిర్దేశమునందు ఒనర్చబడు కృష్ణభక్తిభావనాకర్మలు ఈ జన్మయందు కాని, మరుజన్మ యందు కాని ఎటువంటి ప్రతిచర్యను కలుగజేయవు. 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Bhagavad-Gita as It is - 602 🌹 ✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 📚 Prasad Bharadwaj *🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 13 🌴* 13. pañcaitāni mahā-bāho kāraṇāni nibodha me sāṅkhye kṛtānte proktāni siddhaye sarva-karmaṇām 🌷 Translation : O mighty-armed Arjuna, according to the Vedānta there are five causes for the accomplishment of all action. Now learn of these from Me. 🌹 Purport : A question may be raised that since any activity performed must have some reaction, how is it that the person in Kṛṣṇa consciousness does not suffer or enjoy the reactions of work? The Lord is citing Vedānta philosophy to show how this is possible. He says that there are five causes for all activities, and for success in all activity one should consider these five causes. Sāṅkhya means the stock of knowledge, and Vedānta is the final stock of knowledge accepted by all leading ācāryas. Even Śaṅkara accepts Vedānta-sūtra as such. Therefore such authority should be consulted. The ultimate control is invested in the Supersoul. As it is stated in the Bhagavad-gītā, sarvasya cāhaṁ hṛdi sanniviṣṭaḥ. He is engaging everyone in certain activities by reminding him of his past actions. And Kṛṣṇa conscious acts done under His direction from within yield no reaction, either in this life or in the life after death. 🌹 🌹 🌹 🌹 🌹 #భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

🌹. శ్రీమద్భగవద్గీత - 34 / Bhagavad-Gita - 34 🌹 ✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 📚. ప్రసాద్ భరద్వాజ 🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము 🌴 శ్లోకము 34 34. ఆచార్య: పితర: పుత్రాస్తథైవ చ పితామహా: | మాతులా: శ్వశురా: పౌత్రా: శ్యాలా: సంబంధినస్తథా || 🌷. తాత్పర్యం : ఓ మధుసుధనా! ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బందువులందరును .. 🌷. భాష్యము : 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Bhagavad-Gita as It is - 34 🌹 ✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 📚. Prasad Bharadwaj Verse 34 34. ācāryāḥ pitaraḥ putrās tathaiva ca pitāmahāḥ mātulāḥ śvaśurāḥ pautrāḥ śyālāḥ sambandhinas tathā 🌷 Translation O maintainer of all living entities, I am not prepared to fight with them even in exchange for the three worlds, let alone this earth. 🌻. Purport : 🌹 🌹 🌹 🌹 🌹 #భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*🌹. గీతోపనిషత్తు -195 🌹* ✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ *📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚* శ్లోకము 36 *🍀 35. స్థిరత్వము - స్థిరచిత్తము లేనివారికి బ్రహ్మముతో యోగము చెందుట అశక్యము. స్వాధీనమైన మనస్సు కలిగి దైవముతో యోగించుటకు ప్రయత్నించు వానికి సాధ్యమగును. దర్శనము అనుభూతి కలుగవలె నన్నచో స్థిర చిత్తము పునాదిరాయి. ప్రతినిత్యము ఒక పనిని అదే సమయమున నిర్వర్తించుట, అంతే శ్రద్ధతో నిర్వర్తించుట, ఆసక్తితో రుచి కలిగి నిర్వర్తించుట వలన అస్థిరత్వము నుండి చిత్తమునకు స్థిరత్వ మేర్పడును. నిరంతరత్వము, దీర్ఘకాలము అను రెండంశము ఆధారముగ నేర్వవలసిన విషయమును నేర్చుట సిద్ధించును. మరియొక మార్గము లేదు. 🍀* అసంయతాత్మనా యోగో దు ప ఇతి మే మతిః | వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తు ముపాయతః || 36 స్థిరచిత్తము లేనివారికి బ్రహ్మముతో యోగము చెందుట అశక్యము. స్వాధీనమైన మనస్సు కలిగి దైవముతో యోగించుటకు ప్రయత్నించు వానికి నే తెలిపిన ఉపాయము చేత సాధ్యమగును. ఇది నా అభిప్రాయము. చంచలమైన మనస్సు ఐహిక జీవనమునకు గూడ వినియోగ పడదు. అట్టి మనస్సునకు సామర్థ్యముండదు. ఒక కార్యము పై ఎక్కువ సేపు నిలచి పనిచేయుట కూడ యుండదు. దీక్షతో ఏకాగ్ర మైన మనస్సుతో కార్యములను నిర్వర్తించినపుడు కార్యసిద్ధి కవకాశము మెండుగ నుండును. చిందులు వేయు మనస్సునకు ఎట్టి అవకాశము ఉండదు. చిందులు వేయు మనసును అనాదిగ మర్కటముతో పోల్చుదురు. మర్కట మనగ కోతి. కోతి ఒక చెట్టుపై నిలకడగ ఉండదు. ఒక కొమ్మపై అసలుండదు. ఏ పండును పూర్తిగ భుజించదు. తోటలో సమృద్ధిగ పండ్లున్నపుడు అన్ని పండ్లను ఎంగిలి చేయుటయేగాని, సమగ్రముగ భుజింపదు. ఒక పండు తినుచు మరొక పండును చూచును. అపుడున్న పండును విసర్జించి మరియొక పండునకై గెంతును. ఇట్లే సామాన్య మానవులు కూడ గమ్యమున నడవక ప్రక్కదారులను పట్టి పోవుచుందురు. అట్టి వారు కార్యములను చక్కబెట్టలేరు. బాధ్యతలను సమగ్రముగ నిర్వర్తించలేరు. ఒక పాఠ్యాంశమును కూడ పరిపూర్ణముగ పఠించ లేరు. ఒక పని చేయుచున్నపుడు మరియొక పని గుర్తు వచ్చు చుండును. ఉదాహరణకు భోజనము చేయునపుడు వృత్తిపరమైన భావములు స్ఫురించుట, తత్కారణముగ భోజనమును అనుభూతి చెందలేరు. అట్లే వృత్తి యందున్నపుడు మరియొక అంశము పైకి మనస్సు గెంతును. అందువలన వృత్తి నిర్వహణము జరుగును. నిదురించుచున్నపుడు తాను చేయవలసిన పనులు, మరచిన పనులు జ్ఞప్తికి వచ్చి నిదుర పట్టదు. ఏ పనియందైనను ఏకాగ్రత ఉండకుండుట వలన పని చెడి, ఎక్కువ పని ఏర్పడును. పనులు జరుగుట మానును. దానితో అసహనత, కోపము పెరుగును. ఇట్లు మనస్సు పెట్టు తిప్పలు, త్రిప్పటల వలన అలసిపోవుటయే యుండును. జీవచైతన్యము ఒక ప్రవాహముగ సాగదు. ఇట్లు ఎంతైనను సామాన్య మానవుని మనస్సు గూర్చి విశ్లేషించవచ్చును. ఆరాట పడుటయే గాని, తగు విధమగు ఆచరణముండక పోవుటచే, స్థిరము లేక సూత్రము తెగిన గాలిపటమువలె జీవితము గాలి వాటున సాగుచుండును. ఇట్లు వృత్తములలో గిరగిర తిరుగు చిత్తమును నిగ్రహించుట గాలిపటమునకు సూత్రము కట్టుట వంటిది. ఎద్దు ముక్కునకు త్రాడు వేయుట వంటిది. గుఱ్ఱమునకు కళ్ళెము కట్టుట వంటిది. అపుడే ప్రయాణము సాగును. జీవన ప్రయోజనము నెరవేరును. ఇది నిస్సంశయము. కళ్ళెము లేని గుజ్జముపై ప్రయాణము గమ్యమునకు చేర్చదు. ముక్కుకు త్రాడు వేయని ఎద్దుతో పొలము దున్నలేము. అట్లు మనస్సును అంతరంగమునుండి పట్టనిచో అది పలు విధముల పరుగెట్టు చుండును. అంతరంగమందు సుందర తేజోరూపమునో, జ్యోతినో లేక స్పందనాత్మక చర్యనో పట్టుట వలన క్రమముగ స్థిరమగు మనసు ఏర్పడును. అట్టి స్థిరమనస్సు అంతర్ముఖముగ అంతరంగమున దర్శించినచో ఆసక్తికరము, రుచికరము అగు బుద్ధి ఆవరణము గోచరించును. అందు ప్రవేశించిన వానికి బుద్ధియను వెలుగునకు మూలమగు దానియందు ఆసక్తి కలుగును. ఇట్లు అంతరంగమును శోధించుచు తన మూలమును చేరుట వలన యోగము పరిపూర్ణ మగును. పరమాత్మ, జీవాత్మ, బుద్ధి, స్థిరచిత్తము ఒకే సూత్రముగ, తేజోమయముగ గోచరించును. పై విధమగు దర్శనము అనుభూతి కలుగవలె నన్నచో స్థిర చిత్తము పునాదిరాయి. స్థిరచిత్త మేర్పడుటకే అనేకమగు ప్రాథమిక దీక్ష లున్నవి. ప్రతినిత్యము ఒక పనిని అదే సమయమున నిర్వర్తించుట, అంతే శ్రద్ధతో నిర్వర్తించుట, ఆసక్తితో రుచి కలిగి నిర్వర్తించుట వలన అస్థిరత్వము నుండి చిత్తమునకు స్థిరత్వ మేర్పడును. అట్లేర్పడుటకు చాలకాలమట్లే నిర్వర్తించవలెను. నిరంతరత్వము, దీర్ఘకాలము అను రెండంశము ఆధారముగ నేర్వవలసిన విషయమును నేర్చుట సిద్ధించును. మరియొక మార్గము లేదు. భగవంతుడు శ్రీ కృష్ణుడు ఈ శ్లోకమున "స్థిరచిత్తము లేనిచో యోగము లేదు. ఇది నా మతము" అని పలికినాడు. కేవలము ఇది తన అభిప్రాయమని తెలిపినను మరియొక మార్గము లేదని తెలియవలెను. అభ్యాసము చేతను, వైరాగ్యము చేతను స్థిరచిత్త మేర్పరచుకొన వచ్చును. అపుడే యోగమున కర్హత కలుగును. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

*🌹. శ్రీమద్భగవద్గీత - 601 / Bhagavad-Gita - 601 🌹* ✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 📚. ప్రసాద్ భరద్వాజ *🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 12 🌴* 12. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ: ఫలమ్ | భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్ || 🌷. తాత్పర్యం : ఇష్టము, అనిష్టము, ఇష్టానిష్ఠమిశ్రితము అనెడి మూడు విధములైన కర్మఫలములు త్యాగికానటువంటి వానికి మరణము పిదప కలుగుచున్నవి. కాని సన్న్యాసాశ్రమమునందున్న వారికి మాత్రము సుఖదుఃఖములను కలిగించు అట్టి ఫలములు కలుగుటలేదు 🌷. భాష్యము : శ్రీకృష్ణభగవానునితో గల నిత్యసంబంధ జ్ఞానముతో వర్తించు కృష్ణభక్తిరసభావితుడు సర్వదా ముక్తస్థితి యందే యుండును. కనుక అతడు మరణము పిదప తన కర్మఫలములచే సుఖించుటగాని, దు:ఖించుటగాని జరుగదు. 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Bhagavad-Gita as It is - 601 🌹* ✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 📚 Prasad Bharadwaj *🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 12 🌴* 12. aniṣṭam iṣṭaṁ miśraṁ ca tri-vidhaṁ karmaṇaḥ phalam bhavaty atyāgināṁ pretya na tu sannyāsināṁ kvacit 🌷 Translation : For one who is not renounced, the threefold fruits of action – desirable, undesirable and mixed – accrue after death. But those who are in the renounced order of life have no such result to suffer or enjoy. 🌹 Purport : A person in Kṛṣṇa consciousness acting in knowledge of his relationship with Kṛṣṇa is always liberated. Therefore he does not have to enjoy or suffer the results of his acts after death. 🌹 🌹 🌹 🌹 🌹 #భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर