అమ్మవారు

Eswar Tanikella May 9, 2021

#శ్రీసూక్తం తెలుగులో #అర్థసహితంగా తెలుసుకోండి.. ఓం హిర'ణ్యవర్ణాం హరి'ణీం సువర్ణ'రజతస్ర'జాం | చంద్రాం హిరణ్మ'యీం లక్ష్మీం జాత'వేదో మ ఆవ'హ || ఓ అగ్నిదేవా! బంగారు మేని ఛాయ గల, పాపాలను నాశనము చేసే, బంగారు మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడిన, చంద్రుని వలె చల్లగా ఆహ్లాదకరంగా, సువర్ణమయమైన యున్న మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. తాం మ ఆవ'హ జాత'వేదో లక్ష్మీమన'పగామినీ''మ్ | యస్యాం హిర'ణ్యం విందేయం గామశ్వం పురు'షానహమ్ || ఎవరి కరుణ, కటాక్షములతో నాకు బంగారము, ఆవులు, గుర్రాలు, బంధువులు సంప్రాప్తమైనవో ఆ మహాలక్ష్మిని నా వద్దకు ఆవాహనము చేయుము. ఆమె నా వద్ద నుండి వీడిపోకుండా చూడుము. అశ్వపూర్వాం ర'థమధ్యాం హస్తినా''ద-ప్రబోధి'నీమ్ | శ్రియం' దేవీముప'హ్వయే శ్రీర్మా దేవీర్జు'షతామ్ || గుర్రాలతో ఉన్న రథం మధ్యలో ఆసీనమైనది, తన రాకను ఏనుగు ఘీంకార నాదంతో సూచిస్తున్న ఆ శ్రీదేవిని ఆహ్వానిస్తున్నాను.తల్లీ నీవు నా వద్ద సంతోషముగా నెలకొని ఉండుము. కాం సో''స్మితాం హిర'ణ్యప్రాకారా'మార్ద్రాం జ్వలం'తీం తృప్తాం తర్పయం'తీమ్ | పద్మే స్థితాం పద్మవ'ర్ణాం తామిహోప'హ్వయే శ్రియమ్ || చక్కని చిరునవ్వుతో, బంగారు కోటలో నివసించే, కరుణ, తేజస్సు, ఆనంద రూపిణియై, ఆనందము ప్రసాదించునది, పద్మములో ఆసీనురాలై, పద్మము వంటి ఛాయకలది అయిన ఆ శ్రీదేవిని ఇక్కడ సాక్షాత్కరించమని ప్రార్థిస్తున్నాను చంద్రాం ప్ర'భాసాం యశసా జ్వలం'తీం శ్రియం' లోకే దేవజు'ష్టాముదారామ్ | తాం పద్మినీ'మీం శర'ణమహం ప్రప'ద్యేఽలక్ష్మీర్మే' నశ్యతాం త్వాం వృ'ణే || చంద్రుని పోలినది, తేజోవంతమైనది, తన కీర్తి చంద్రికలతో ప్రకాశించుచున్నది, దేవతలచే పూజిన్చబడుచున్నది, కరుణా స్వరూపిణి, పద్మమును ధరించినది, 'ఈం' అనే బీజమంత్రానికి భావంగా ఉన్నది అయిన మహాలక్ష్మిని నేను శరణు వేడుతున్నాను.ఓ దేవీ! నిన్ను ప్రార్థిస్తున్నాను, నా దారిద్ర్యం పోయేలా కరుణించు ఆదిత్యవ'ర్ణే తపసోఽధి'జాతో వనస్పతిస్తవ' వృక్షోఽథ బిల్వః | తస్య ఫలా'ని తపసాను'దంతు మాయాంత'రాయాశ్చ' బాహ్యా అ'లక్ష్మీః || సూర్యుని తేజస్సు కలిగిన ఓ తల్లి! వనానికి అధిపతియైన బిల్వవృక్షం (మారేడు చెట్టు) నీ తపోమహిమచే ఉద్భవించినది. నీ తపస్సు వలన కలిగిన దాని ఫలాలు అజ్ఞానము మనే లోని ఆటంకాన్ని, అమంగళకరమైన బయటి ఆటంకాన్ని తొలగిస్తాయి గాక! ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణి'నా సహ | ప్రాదుర్భూతోఽస్మి' రాష్ట్రేఽస్మిన్ కీర్తిమృ'ద్ధిం దదాదు' మే || కుబేరుడు, కీర్తి ఐశ్వర్యాలతో నన్ను వెన్నంటి రావాలి. నీ అనుగ్రహం పూర్తిగా నిండిన ఈ దేశంలో నేను జన్మించాను. సకల సంపదలను నాకు ప్రసాదించు! క్షుత్పి'పాసామ'లాం జ్యేష్ఠామ'లక్షీం నా'శయామ్యహమ్ | అభూ'తిమస'మృద్ధిం చ సర్వాం నిర్ణు'ద మే గృహాత్ || ఆకలి దప్పికలతో కృశించినది,శ్రీదేవి కంటే ముందుగా జన్మించిన జ్యేష్టాదేవిని (అలక్ష్మి)నేను నాశనం చేస్తాను. నా గృహము నుండి అభాగ్యము, కొరతలను పూర్తిగా నిర్మూలించి నన్ను అనుగ్రహించు. గంధద్వారాం దు'రాధర్షాం నిత్యపు'ష్టాం కరీషిణీ''మ్ | ఈశ్వరీగ్^మ్' సర్వ'భూతానాం తామిహోప'హ్వయే శ్రియమ్ || సుగంధానికి నిలయమైనది, జయింప అలవికానిది, ఎల్లప్పుడూ పుష్టినిచ్చేది, సకల సంపదలు కలిగిన, సమస్త జీవులకు అధినాయిక యైన మహాలక్ష్మిని ఇక్కడ ఆవాహన చేస్తున్నాను. మన'సః కామమాకూతిం వాచః సత్యమ'శీమహి | పశూనాం రూపమన్య'స్య మయి శ్రీః శ్ర'యతాం యశః' || ఓ శ్రీదేవి! మనస్సులో జనించే ఉత్తమమైన కోరికలూ, సంతోషము, వాక్కులో సత్యము, గోసంపద చే, ఆహార సమృద్ధిచే కలిగే ఆనందాన్ని నేను చవి చూడాలి. నాకు కీర్తి కలుగచేయుము కర్దమే'న ప్ర'జాభూతా మయి సంభ'వ కర్దమ | శ్రియం' వాసయ' మే కులే మాతరం' పద్మమాలి'నీమ్ || కర్దమ మహర్షి! నీకు పుత్రికగా జన్మించిన మహాలక్ష్మి నాకు సాక్షాత్కారించాలి. తామరపువ్వుల మాల ధరించిన, సిరిసంపదలకు అధిదేవత, తల్లి అయిన ఆమెను నా కులములో ఎల్లప్పుడూ నివసింప చేయాలి. ఆపః' సృజంతు' స్నిగ్దాని చిక్లీత వ'స మే గృహే | ని చ' దేవీం మాతరం శ్రియం' వాసయ' మే కులే || మహాలక్ష్మి పుత్రుడవైన ఓ చిక్లీత! నీరు, చక్కని ఆహారపదార్థాలను ఉత్పత్తి చేయుగాక! నా ఇంట నీవు నివసించాలి. దేవీ, నీ మాత అయిన ఆ మహాలక్ష్మి నా కులములో నిరంతరమూ నివసించేలా అనుగ్రహించు. ఆర్ద్రాం పుష్కరి'ణీం పుష్టిం సువర్ణామ్ హే'మమాలినీమ్ | సూర్యాం హిరణ్మ'యీం లక్ష్మీం జాత'వేదో మ ఆవ'హ || ఓ అగ్నిదేవ! కరుణ కలిగిన మనసు కలది, పద్మవాసిని, లోకానికి ఆహారము ఇచ్చి పోషించేది, కుంకుమ రంగు కలది, తామరపువ్వుల మాల ధరించినది, చంద్రునివలె ఆహ్లాదకరమైనది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. ఆర్ద్రాం యః కరి'ణీం యష్టిం పింగలామ్ ప'ద్మమాలినీమ్ | చంద్రాం హిరణ్మ'యీం లక్ష్మీం జాత'వేదో మ ఆవ'హ || అగ్నిదేవా! దయకలిగినది, గంభీరముగా యుండెడిది, దండము చేత బూనినది, అందమైన శరీరచాయ కలిగినది, సూర్యునివలె ప్రకాశించునది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము తాం మ ఆవ'హ జాత'వేదో లక్షీమన'పగామినీ''మ్ | యస్యాం హిర'ణ్యం ప్రభూ'తం గావో' దాస్యోఽశ్వా''న్, విందేయం పురు'షానహమ్ || అగ్నిదేవా! ఎవరి వలన నేను అంతులేని బంగారుము, గోవులు, సేవకులు, గుర్రాలు ప్రాప్తించుకుంటానో , అట్టి మహాలక్ష్మిని నన్ను వదలి వెళ్లిపోకుండా కృప చూపుము. ఎవరు లక్ష్మీదేవి కృప కొరకు ప్రార్తిస్తున్నారో, వారు ఇంద్రియాలు నిగ్రహించి, ప్రతిరోజూ ఆజ్యముతో హోమము చేయాలి. పైన తెలిపిన పదిహేను మంత్రాలను సదా జపిస్తూ ఉండాలి ఓం మహాదేవ్యై చ' విద్మహే' విష్ణుపత్నీ చ' ధీమహి | తన్నో' లక్ష్మీః ప్రచోదయా''త్ || మూడు లోకాలను తన కుటుంబముగా చేసుకున్నది, తామర కొలనులో ఉద్భవించినది, మహావిష్ణువుకు ప్రియమైనది అయిన నీకు నమస్కరిస్తున్నాను. శ్రీ-ర్వర్చ'స్వ-మాయు'ష్య-మారో''గ్యమావీ'ధాత్ పవ'మానం మహీయతే'' | ధాన్యం ధనం పశుం బహుపు'త్రలాభం శతసం''వత్సరం దీర్ఘమాయుః' || సుప్రసిద్ధులు, ఋషులు అయిన ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు ముగ్గురు ఈ సూక్తంలోని ఋషులు, మహాలక్ష్మియే దేవత. పద్మము వంటి ముఖము, ఊరువులు, కన్నులు కలదానా! పద్మము నుండి ఉద్భవించిన తల్లి!, నేను దేని వలన సుఖాన్ని పొందుతానో దాన్ని ప్రసాదించు. గుర్రాలను, గోవులను, సంపదలను ఇచ్చే, ధనానికి అధిదేవతయైన మహాలక్ష్మి! కోరికలన్నీ నెరవేరేటప్పుడు కలిగే సుఖాన్ని ఇచ్చే సంపదను నాకు ప్రసాదించు ఓం శాంతిః శాంతిః శాంతిః' || అందరు శాంతి సుఖాలతో ఉండాలి శాంతి , శాంతి, శాంతి 🙏☯️🕉️🌞🔱🚩

+1 प्रतिक्रिया 1 कॉमेंट्स • 2 शेयर

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 262 / Sri Lalitha Chaitanya Vijnanam - 262 🌹* *సహస్ర నామముల తత్వ విచారణ* ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ మూల మంత్రము : *🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁* *🍀 63. సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా । సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ ॥ 63 ॥ 🍀* *🌻262. 'తుర్యా'🌻* తురీయావస్థ యందు పరమాత్మ అనుభవము ఉన్ననూ జాగ్రత్ నిద్రావస్థలు కూడ కలుగు చుండును. తురీయావస్థ సిద్ధించిన యోగులు, సిద్ధులు కూడ అపుడపుడూ నిద్రించుట, మేల్కాంచుట యున్నది. పరమాత్మ అనుభవము కూడ యుండును. శ్రీదేవి పరమాత్మైక, పరదేవత ఆమెకు అనుభవించుట అను స్థితి లేదు. ఆమె అన్ని అవస్థలకు అతీతమైనది. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 262 🌹* *1000 Names of Sri Lalitha Devi* ✍️. Ravi Sarma 📚. Prasad Bharadwaj *🌻Turyā तुर्या (262)🌻* This is the fourth stage of consciousness. It cannot be experienced automatically. This stage can be attained only through meditation. This stage is not related to any of the three earlier stages. In the waking stage we are associated with consciousness. In the dream stage our mind is associated with our consciousness. In the third stage of dream-less sleep, consciousness has no part to play as the mind at this stage is at rest. But in turya stage, one has to tune his mind to become unaware of consciousness. This can be attained only by practice. In this stage one is neither the Brahman nor his own self. If one is able to advance to the next stage of turyātīta, he merges with the Brahman. If he falls from turya stage, he is again bound by worldly actions and the associated miseries. She exists in the form of turiya stage. This state of consciousness is witnessing the consciousness of the other three stages (in the deep sleep, consciousness is inactive). The consciousnesses in the other three stages are subjected to modifications. In this stage, the consciousness alone remains looking up for something Superior that has not been experienced by it so far. Therefore the normal consciousness ceases to exist in this stage. Only when we talk about consciousness, we talk about subject and object. There is no subject and object and in fact nothing exists. This stage of ‘nothing exists’ leads to the transformation of awareness. This can possibly be interpreted as a seed ready to sprout. The transformed consciousness leads to the single pointed or focused consciousness to know about the Brahman or even ready to merge with it. The final stage is yet to be reached in this state. Continues... 🌹 🌹 🌹 🌹 🌹 #లలితాసహస్రనామ #LalithaSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹 https://t.me/srilalithachaitanyavijnanam http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Eswar Tanikella May 8, 2021

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर