मायमंदिर फ़्री कुंडली
डाउनलोड करें

Om namah shivaya

Om namah shivaya

+29 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर
Gopalam Ravi kumar Jun 19, 2019

*🕉పంచ కేదారాలు ఎలా చేరాలో తెలుసుకుందాం.🕉* 🔔☘🔔☘🔔☘🔔☘☘🔔☘🔔 కురుక్షేత్ర యుద్ధం ముగుసిసిన తరవాత పాండవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులను చంపిన పాపం పోగొట్టు కోవడానికి శివ దర్శననానికి వెళ్ళారు వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్ట పడని ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపం ధరించి ఉత్తర దిశగా పయన మయ్యాడు. పాండవులు పట్టు వదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుని పట్టుకోవడానికి భీమశేనుడు ప్రయత్నించగా ఈశ్వరుడు మాయమయ్యాడు. అప్పుడు ఈశ్వరుని శరీర భాగాలు ఐదు ఛోట్ల ప్రతిష్టితమై అవి పుణ్య క్షేత్రాలుగా భాసిల్లాయి. శివ పురాణం లో వర్ణించబడిన పంచ కేదారాలను పంచఆరామాలని పిలుస్తుంటారు. అవి వరసగా 1.కేదారినాధ్, 2.తుంగ నాధ్, 3.రుద్ర నాధ్, 4.మధ్య మహేశ్వర్, 5.కల్పేశ్వర్. నేపాల్ లోని ఘోరక్ నాధ్ తెగ వారు పంచకేదార యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. భారతీయులూ ఈ యాత్రకు ప్రాధాన్యత ఇస్తారు. ఖాట్మండు లోని పశుపతి నాధ్ ఆలయ నిర్మాణానికి ఈ పొంచ కేదారాల నిర్మాణానికి పోలికలు ఉంటాయి. *కేదారినాధ్* ద్వాదశ జ్యీతిర్లింగాలలో ప్రసిద్ధి చెందింది పంచ కేదారాలలో మొదటిది కేదారనాధ్. పాడవులకు అందకుండా పారి పోయిన శివుని మూపురభాగం ఉన్న చోటు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడి లొంగం ఎనిమిది గజముల పొడవు, నాలుగు గజముల ఎత్తు, నాలుగు గజముల వెడల్పు ఉంటుంది. ఈక్కడి లింగం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవులు తమ అంతిమ దశలో స్వర్గారోహణ ఇక్కడ నుండి ప్రారంభించారు. శంకరాచార్యులు మోక్షం పొందిన క్షేత్రం ఇదే. సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరచి ఉంచే ఈ ఆలయం ప్రతి సంవత్సరం అక్షయత్రుతియ నాడు తెరుస్తారు. కాత్రిక మాసంలో వచ్చే యమద్వివిదియ నాడు మూసి వేస్తారు. ఈ మధ్య కాలంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 11,758 అడుగుల ఎత్తులో ఉంటుంది. హృషీ కేశ్ వరకు రైలు మార్గం ఉంటుంది. అక్కడి నుండి దాదాపు 250 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి గౌరీ కుండ్ చేరుకుని అక్కడి నుండి శిఖరానికి 14 మైళ్ళ దూరం కాలి నడకన చేరాలి. కానీ భక్తులు అనేక మంది డోలీలు, గుర్రాలపై ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. *తుంగనాధ్* పంచ కేదారాలలో రెండవది తుంగనాధ్. శివుని చేతులు లింగ రూపంలో వెలసిన క్షేత్రం ఇది. ఇది సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది కేదారానికంటే ఎత్తైన ప్రదేశం. తుంగనాధుడంటే శిఖరాలకు అధిపతి అని అర్ధం. ఈ ఆలయంలోని లింగం ఒక అడుగు ఎత్తున చేతులను పోలి ఉంటుంది. స్వల్పంగా ఎడమ వైపు వాలి ఉంటుంది. గర్భగుడిలో శివునితో వ్యాస, గణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి. ప్రమధ గణాల విగ్రహాలు ఉంటాయి. పాండవుల చిత్రాలు గోడలో చెక్కి ఉంటాయి. ఆలయానికి కుడి వైపున పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. వేరొక వైపున ఐదు ఆలయాలు ఉంటాయి . అవి పంచకేదారెఆల నమూనాలు. ఈ ఆలయాన్ని అర్జునుడు నిర్మించారని స్థల పురాణం చెప్తుంది. శిటా కాలంలో ఉత్సవ విగ్రహాలను ముకునాధ్ మఠానికి తరలించి పూజలు నిర్వహిస్తారు. *రుద్రనాధ్* పంచ కేదారాలలో మూడవది రుద్రనాధ్. నంది రూపంలో ఉన్న శివుని ముఖ భాగం వెలసిన చోటు ఇదే. అరమోడ్పు కన్నులతో భువనమోహనంగా ముఖ లింగ రూపంలో ఉండే స్వామిని నీలకంఠ్ మహాదేవ్ అని భక్తులు పిలుస్తారు. తెల్ల వారు ఝామున అభిషేక వేళలో స్వామి వెండి తొడుగు తొలగిస్తారు. నిజరూప దర్శననానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7,500 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయానికి వెనుక భాగంలో వైతరణీ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు తమ పూర్వీకులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు. ఈ ఆలయానికి సమీప గ్రామం గోపేశ్వర్.గోపేశ్వర్ నుండి 24 మైళ్ళు క్లిష్టమైన కొండ దారిలో కాలి నడకన ప్రయాణించి ఆలయానికి చేరాలి కనుక పంచ కేదారాలలో ఇది చాలా కష్ట తరమైనది గా భావిస్తారు. శీతాకాలంలో ఇక్కడి విగ్రహాలను గోపేశ్వర్కు తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. *మధ్య మహేశ్వర్* పంచ కేదారాలలో నాలుగవది మధ్య మహేశ్వర్. విశ్వనాధుని నాభి భాగం లింగంగా వెలసిన క్షేత్రం. నంది రూపంలూ ఉన్న ఈశ్వరుని భీమసేనుడు పట్టుకున్న గుప్త కాశీకి 24 మైళ్ళ దూరంలో ఉన్న ఈ క్షేత్రం ఎత్తు సముద్ర మట్టానికి 11,470 అడుగులు. ఈ ఆలయానికి ఎడమ వైపున రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి ఒకటి పార్వతీ దేవిది, ఒకటి అర్ధ నారీశ్వరునిది. ఈ మూడు ఆలయాలను భీమసేనుడు నిర్మించాడని చెప్తారు. ఆలయానికి కుడి వైపున చలువరాతితో నిర్మించిన సరస్వతీ దేవి ఆలయం ఉంటుంది. శీతా కాలంలో ఇక్కడి విగ్రహాలను యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. *కల్పనాధ్* పంచ కేదారాలలో చివరిది కల్పనాధ్. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. హృషీకేశ్ బద్రీనాధ్ రోడ్డు మార్గంలో 12 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయం చేరుకోవచ్చు. శివుని ఝటాఝూటం ఇక్కడ లింగ రూపంలో వెలసిందని స్థల పురాణం చెప్తుంది. ఈ ఆలయంలో సంవత్సరమంతా పూజలు నిర్వహిస్తారు. కోడలపై దట్టమైన అడవుల మధ్య చిన్న గుహలో వెలసిన ఈ స్వామిని ఝటేశ్వర్ అని భకులు పిలుస్తారు. అత్రి, అనసూయల పుత్రుడైన దుర్వాస మహర్షి ఈ ఆలయప్రాంగణంలో ఉన్న కల్ప వృక్షం కింద తపస్సు చేసి శివుని నుండి అనేక వరాలు పొందాడని ప్రతీతి.

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

శివునికి తల్లి అయిన భక్తురాలి గాధ పార్వతీపరమేశ్వరులు ఈ జగత్తుకి ఆదిదంపతులని భక్తుల నమ్మకం. ఆ ఆదిదంపతులని నిరంతరం తలచుకుని, నిష్ఠతో కొలుచుకున్న భక్తులకు కొదవ లేదు. అలాంటి ప్రతి భక్తునిదీ ఓ దివ్య గాథే! తమిళనాట 6-8 శతాబ్దాల మధ్య నివసించిన శివభక్తులలో కొందరిని నయనార్లుగా పిలిచే సంప్రదాయం ఉంది. 63 మందిగా ఉన్న ఈ నయనార్లలో ఒకరైన `కరైక్కాల్‌ అమ్మయార్‌` అనే భక్తురాలి కథే ఇది… కరైక్కాల్‌ అమ్మయార్‌ చిన్నపాటి పేరు పునీతవతి. పేరుకి తగినట్లుగా ఆమె శివభక్తితో పునీతురాలిగా ఉండేది. వారి కుటుంబం తమిళనాట ఉన్న కరైక్కాల్‌ అనే పట్నంలో నివసించేవారు(ప్రస్తుతం ఇది పుదుచ్చేరి ఆధీనంలో ఉంది). పునీతవతికి చిన్ననాటి నుంచే శివుడంటే మహా ప్రీతి. నిరంతరం శివనామస్మరణ చేయడమే కాకుండా, ఇంటికి వచ్చిన శివభక్తులకు ఆతిథ్యాన్ని ఇచ్చేది పునీతవతి. యుక్తవయసు రాగానే పునీతవతిని పరమదత్తన్‌ అనే యువకునికి ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు. పరమదత్తన్‌ అందంలోనే కాదు… సంపదలోనూ, వ్యక్తిత్వంలోనూ గొప్పవాడే. ఒకపక్క భార్యగా పరమదత్తన్‌ బాగోగులను చూసుకుంటూనే, ఎప్పటిలా శివభక్తుల సేవను కూడా కొనసాగించింది పునీతవతి. మధ్యలో ఒక చిన్న సంఘటనే కనుక జరగకపోతే… పునీతవతి సాధారణ గృహిణిగానే ఉండిపోయేది. ఒకనాడు పరమదత్తన్‌ ఎవరో రెండు మామిడి పంఢ్లను ఇస్తే, వాటిని ఇంటికి పంపాడు. అదే సమయంలో ఎవరో శివభక్తుడు పునీవతి గుమ్మం దగ్గరకి వచ్చి నిల్చొన్నాడు. ఇంట్లో చూస్తేనేమో వంట పూర్తికాలేదు. భక్తుని నిరీక్షింపచేసేందుకు కానీ, ఖాళీ కడుపుతో తిప్పి పంపేందుకు కానీ పునీతవతికి మనసు ఒప్పలేదు. దాంతో తన చేతిలో ఉన్న రెండు మామిడిపండ్లలో ఒకదానిని అతనికి అందించింది. మిగిలిన పండుని తన భర్త కోసం భద్రపరిచింది. ఆ రాత్రి భోజనాల సమయంలో పరమదత్తన్‌ ఆ మామిడిపండును ఎంతో ఇష్టంగా తిన్నాడు. ఆ రుచి అతనికి నచ్చడంతో రెండో మామిడిపండుని కూడా ఇవ్వమని అడిగాడు. ఆ మాటలకు ఏం చేయాలో పాలుపోలేదు పునీతవతికి. వంటింట్లోకి వెళ్లి బిక్కమొగం వేసుకుని నిల్చొంది. `పరమేశ్వరా ఇప్పుడేం చేసేది!` అని మనసులో అనుకుందో లేదో అరచేతిలో ఓ అద్భుతమైన మామిడిపండు ప్రత్యక్షమైంది. తన చేతిలోకి ప్రత్యక్షమైన మామిడిపండుని సంతోషంగా భర్తకు అందించింది పునీతవతి. అయితే దాన్ని రుచి చూసిన పరమదత్తన్‌ ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. తన జీవితంలో అంత మధురమైన మామిడిపండుని తిననేలేదు. ఇందాక తిన్న మామిడిపండు ఇలాంటిది కానేకాదు. `ఇది నేను పంపిన మామిడిపండులా లేదే! ఇదెక్కడిది?` అని భార్యని అడిగాడు పరమదత్తన్‌. అబద్ధం చెప్పడం తెలియని పునీతవతి జరిగింది చెప్పేసింది. పరమదత్తన్‌కు తన భార్య గొప్ప శివభక్తురాలు అని తెలుసు కానీ, ఆమె భక్తిలో ఇంతటి మహిమ ఉందని తెలియదు. అందుకని ఆమెను పరీక్షించేందుకు `నువ్వు చెప్పిందే నిజమే అయితే మరో పండుని నాకోసం తెప్పించు చూద్దాం!` అంటూ సవాలు విసిరాడు. సాక్షాత్తూ ఆ పరమేశ్వరుని మహిమకే పరీక్ష పెట్టడంతో తనని తాను నిరూపించుకోక తప్పలేదు పునీతవతికి. శివుని తల్చుకుని చేయిని చాచగానే మరో మామిడిపండు ప్రత్యక్షం అయ్యింది. అయితే దానిని పరమదత్తన్‌ ముట్టుకోగానే అదృశ్యం అయిపోయింది. జరిగిన సంఘటనతో అవాక్కైపోయాడు పరమదత్తన్‌. అలాంటి భక్తురాలికి తాను తగిన భర్తను కాదనుకున్నాడు. అలాగని ఆమెను ఇంటి నుంచి పంపివేయడం కూడా భావ్యం కాదనుకున్నాడు. అందుకని తానే ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి మరో పట్నానికి వెళ్లిపోయి వ్యాపారస్తునిగా స్థిరపడ్డాడు. మరో పెళ్లి చేసుకుని భార్యాబిడ్డలతో కాలం గడపసాగాడు. కొన్నాళ్లు నిరీక్షించిన తరువాత కానీ పునీతవతికి తన భర్త ఆచూకీ తెలియరాలేదు. తన భర్త గురించి తెలిసిన వెంటనే అతన ఇంటికి చేరుకుంది పునీతవతి. పునీతవతిని చూడగానే ఆమెకు సాష్టాంగపడ్డాడు పరమదత్తన్‌. తాను చాలా సామాన్యుడిననీ, పరమభక్తురాలైన ఆమెను తగనని చెప్పి మోకరిల్లాడు. దాంతో `ఇక నాకు భర్త కూడా లేడు కాబట్టి, ఆ శివుని కోసమే జీవితాన్ని అర్పస్తాను. పరమశ్వరా! సంసార జీవితానికి దూరంగా ఉన్న నాకు ఈ అందం కూడా వద్దు. నాలోని అందాన్ని తొలగించు` అని శివుని ప్రార్థించింది పునీతవతి. దాంతో ఆమెలోని ముగ్థత అంతా తొలగిపోయి, అతి సామాన్య రూపంలోకి మారిపోయింది. ఆనాటి నుంచీ పునీతవతి శివభక్తిలో లీనమైపోయింది. పంచాక్షరిని జపిస్తూ, పరమశివుని క్షేత్రాలను దర్శిస్తూ హిమాలయాలలోని కైలాసగిరిని చేరుకుంది. శివునికి నివాసమైన ఆ పర్వతాన్ని తన కాళ్లతో తొక్కడం ఇష్టం లేకపోయింది పునీతవతికి. అందుకని తలకిందులుగా ఆ పర్వతాన్ని ఎక్కసాగిందట. ఆ వింత దృశ్యాన్ని చూసిన పార్వతిదేవి `ఆమె ఎవర`ని అడగడంతో `నా భక్తులను కన్నతల్లిలా కాచుకున్న పునీతురాలు` అన్నాడట శివుడు. చివరికి ఆయనే పునీతవతికి ఎదురేగి `బాగున్నావామ్మా` అంటూ క్షేమసమాచారాలను అడిగాడట. అప్పటి నుంచి ఆమెకు `అమ్మయార్‌` అన్న పేరు స్థిరపడిపోయింది. శివుని అభీష్టం మేరకు అమ్మయార్‌ తన జీవితం చివరి వరకూ చెన్నైకి పశ్చిమాన ఉన్న `తిరువలంగడు` అనే ఊరిలోని శివాలయంలో నివసించారు. అమ్మయార్‌ శివుని మీద కొన్ని కీర్తనలని కూడా స్వరపరిచారు. ప్రపంచంలోనే తొలి స్త్రీ స్వరకర్త `కరైక్కాల్‌ అమ్మయార్‌` అంటారు కొందరు. కరైక్కాల్‌ పట్నంలో ఆమె పేరున ఒక గుడి కూడా ఉంది. ఇక శివభక్తులను తల్చుకునే చోట ఆమె ప్రస్తావన ఎలాగూ ఉంటుంది ఓం నమః శివాయ

+8 प्रतिक्रिया 1 कॉमेंट्स • 0 शेयर
avl Jun 19, 2019

+9 प्रतिक्रिया 1 कॉमेंट्स • 1 शेयर
MURALI KRISHNA Jun 19, 2019

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

అరుణాచలం: శివుడూ చదువుకున్నాడు! ఎవరైనా, ఎంతటివారైనా నేర్చుకునే సమయంలో విద్యార్థిగా ఉండాల్సిందే. ఈ విషయంలో అభ్యంతరాలు పనికిరావు. కై లాస పర్వతంపై తన శిలాపీఠం మీద పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా కొలువై ఉన్నాడు. అంతా తానై, అన్నీ తానే అయిన శివుడికి సైతం ఆ రోజు పెద్ద సందేహం వచ్చింది. ప్రణవం అంటే ఏమిటి? ప్రణవతత్త్వం ఏమిటి? ఎంతగా ఆలోచించినా తనకు బోధపడటం లేదు. బ్రహ్మ, విష్ణువులను అడిగినా తమకు సాధ్యం కాదన్నారు. నీ బిడ్డ షణ్ముఖుడే ఇందుకు సమర్థుడని చెప్పారు. దాంతో శివుడు నేరుగా కుమారస్వామినే తన సందేహం తీర్చమని అడిగాడు. 'చెప్పేది నేను. వినేది నువ్వు. నీ సందేహం తీర్చే నాది గురుస్థానం. వినే నీది శిష్యస్థానం. కాబట్టి, నువ్వు కింద కూర్చుంటే నేను పీఠం మీద కూర్చుని బోధ చేస్తానన్నాడు కుమారుడు. సరేనన్నాడు శివుడు. బిడ్డే స్వయంగా తండ్రికి ప్రణవ తత్త్వాన్ని ఉపదేశించాడు. పరమేశ్వరుడు విద్యార్థిగా మారి మానవ జాతికి మహోపకారం చేశాడు. ప్రణవ తత్త్వం లోకానికి అందింది. ఇక్కడ స్కందుడు గొప్ప గురువు. పరమేశ్వరుడు ఉత్తమ విద్యార్థి.🙏 తలకెక్కితే తిప్పలే! ఎంత నేర్చుకున్నా విద్యార్థికి గర్వం ఉండకూడదు ఈ ఒక్క దుర్లక్షణం వల్ల నేర్చుకున్నదంతా నిరుపయోగమైపోతుంది. యా జ్ఞవల్క్యుడు బాష్కలమహర్షి దగ్గర రుగ్వేదం, జైమిని వద్ద సామవేదం, అరుణి మహర్షి వద్ద అధర్వణవేదం అధ్యయనం చేశాడు. ఆ తర్వాత వైశంపాయనుడి వద్దకు యజుర్వేదం నేర్చుకోడానికి వెళ్లాడు. ఆ రుషి వద్ద వేదంతో పాటు మరెన్నో విషయాలు నేర్చుకున్నాడు. తనను మించిన విద్యావంతుడు లేడనే అహంకారం అతడిలో ఏర్పడింది. ఓసారి వైశంపాయనుడికి బ్రాహ్మణుని కాలితో తన్నిన దోషం తగిలింది. అతడి పాపాన్ని పోగొట్టే శక్తి తనవద్ద మాత్రమే ఉందంటూ గురువుతో గర్వంగా పలికాడు యాజ్ఞవల్క్యుడు. దీంతో ఆగ్రహించిన గురువు తాను నేర్పిన విద్యను పూర్తిగా వదలి వెళ్లిపొమ్మని అతడిని శపించాడు. దీంతో నేర్చుకున్న విద్యను రక్తపు ముద్దల రూపంలో అక్కడే వదలివెళ్లాడు. వాటిని స్వీకరించిన తిత్తిరి పక్షులు వేదాల్ని పలికాయి. అవే కృష్ణ యజుర్వేదంగా ఆవిర్భవించాయి. ఆ తర్వాత యాజ్ఞవల్క్యుడు సూర్యుడిని ఉపాసన చేసి, ఆయన ద్వారా శుక్ల యజుర్వేదం నేర్చుకోవాల్సి వచ్చింది.🙏 దేవతలే దిగిరారా! ఆటంకాలకు లొంగితే జ్ఞానశూన్యుడిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. కష్టాన్ని తట్టుకుంటేనే విజ్ఞానపు లోకానికి దారి తెలుస్తుంది. జా బాలికి తండ్రి ఎవరో తెలియదు. తల్లి జాబాల అతడికి ఉపనయన సంస్కారం చేసి, గురువు హరిద్రుమతుడి వద్దకు విద్యాభ్యాసానికి పంపింది. తండ్రి ఎవరో తెలియకపోవడంతో అవమానాల పాలయ్యాడు. విద్య నేర్చుకునే సమయం వచ్చే వరకు గోవుల్ని మేపుతూ అడవిలోనే ఉండమని ఆదేశించాడు గురువు. మరోమాట మాట్లాడకుండా అడవికి చేరుకున్నాడు జాబాలి. కానీ, మనస్సు మాత్రం నిత్యం జ్ఞానాన్వేషణ కోసం పరితపిస్తూనే ఉంది. అతడి సత్యనిష్ఠకు మెచ్చుకున్న దేవతలే స్వయంగా అతడు మేపుతున్న గోవుల్లో చేరి, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తారు. ఆశ్రమానికి చేరుకున్న జాబాలి ముఖంలోని దివ్యతేజస్సు చూసి గురువు ఆశ్చర్యపోతాడు. అప్పటినుంచి సత్యకామ జాబాలిగా జాబాలి లోక ప్రసిద్ధి పొందాడు. విద్యార్థికి నేర్చుకోవాలన్న తపన, స్థిరచిత్తం ఉంటే దైవమే దిగి వస్తుందనటానికి ఇతని కథ చక్కటి ఉదాహరణ.🙏 ప్రలోభాలకు లొంగకుండా... తాను నేర్చుకోదలచిన విషయం మీద విద్యార్థికి పట్టుసడలని శ్రద్ధ ఉండాలి. ఎన్ని ఆకర్షణలు వచ్చినా వాటికి బందీ కాకూడదు. తం డ్రి వాజశ్రవుడు కోపంతో 'నిన్ను యముడికి దానం చేస్తా'నని అనటంతో అతని మాట నిలబెట్టడం కోసం నచికేతుడు నేరుగా యమలోకానికి వెళ్లాడు. యమదర్శనం కోసం ద్వారం వద్ద మూడురోజులు నిరీక్షించాల్సి వచ్చింది. దివ్యతేజస్సుతో ఉన్న బాలుడు తన కోసం నిరీక్షించిన విషయం తెలుసుక్ను యమధర్మరాజు దర్శనమిచ్చి, ముచ్చటపడి వరాలు కోరుకోమన్నాడు అప్పుడు నచికేతుడు వరాలుగా తన ప్రశ్నలకు సమాధానం ఇమ్మని అడిగాడు. మరణం తర్వాత మనిషి ఏమవుతాడు? జనన మరణ చక్రాల సంచారం ఎందుకు?... అనేవి ఆ ప్రశ్నలు. అప్పుడు యముడు ఇదంతా బ్రహ్మజ్ఞానం. నీ వయస్సు చిన్నది. నీకు అర్థం కాదు. నీకు మణులు, బంగారం, ఇంకా చాలా ఇస్తానని ప్రలోభపెట్డాడు. నాకివేమీ వద్దు. ఆత్మజ్ఞానమే ముద్దు అంటూ పట్టుబట్టాడు నచికేతుడు. బాలుడి శ్రద్ధకు అబ్బురపడిన యముడు అతడికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. ఇదే కఠోపనిషత్‌గా అవతరించింది.🙏 హనుమ కథ వినుమా! చదువు సుఖంగా అందదు. ఇందుకోసం తపించాలి. వేగం, పట్టుదల, ధారణ, కష్టానికి తట్టుకునే శక్తి విద్యార్థికి చాలా అవసరం. ఇవన్నీ ఉంటేనే నేర్చుకోవటం సాధ్యమవుతుంది. త ల్లి ఆదేశంతో సూర్యభగవానుడి వద్ద విద్య నేర్చుకునేందుకు వెళ్లాడు హనుమ. నేను ప్రతిక్షణం సంచరిస్తూ ఉంటాను. నా దగ్గర చదువుకోవటం సాధ్యం కాదన్నాడు సూర్యుడు. అయినా పట్టువదలకుండా తూర్పు, పశ్చిమ పర్వతాల మీద చెరో కాలు ఉంచి, సూర్యగమనానికి అనుగుణంగా ముఖం వరకు తన శరీరాన్ని తిప్పుతూ విద్యాభ్యాసం చేశాడు ఆంజనేయుడు. ఇంతటి సాధన చేశాడు కాబట్టే నవ వ్యాకరణ పండితుడయ్యాడు. ఎవరెన్ని విధాలుగా ని రుత్సాహపరిచినా, చివరకు ఎంచుకున్న గురువే వద్దని వారించినా నిరుత్సాహ పడకూడదు. విద్య నేర్చుకునే విషయంలో ఏర్పడే విఘ్నాలే ఇవన్నీ అనే స్పృహ కలిగి ఉండాలి. వాటిని తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. అప్పుడే ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చని హనుమ నిరూపించాడు.

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर

+13 प्रतिक्रिया 1 कॉमेंट्स • 3 शेयर

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Mymandir Telugu Jun 17, 2019

జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఏమి చేయాలి ? దయచేసి అందరికీ షేర్ చేయండి మనకు ప్రతి మాసంలో పౌర్ణమి వస్తుంది.. భగవంతుడు ని ప్రసన్నం చేసుకోవడానికి అనుగ్రహం కోసం పౌర్ణమి పూజలు విశేషంగా జరుపుకుంటారు.. అయితే ఈ జేష్ఠ పౌర్ణమి అనేది ప్రత్యేకించి కష్టాలు తీరదనికే చేసుకోవాలి..ఈ మాసంలో సోమవారం వచ్చిన అమావాస్య ని సోమవతి అమావాస్యగా జరుపుకున్నారు ఆ రోజు రావి చెట్టు ప్రదర్శనలు చేసే ప్రత్యక్షంగా నారాయణుడికి రావి చెట్టు రూపంలో పూజించారు , అలాగే ఈ మాసంలో వచ్చిన పౌర్ణమి కూడా చాలా విశేషమైన రోజు... చాలా అరుదుగా జేష్ఠ పౌర్ణమి సోమవారం రోజు కలిసి వచ్చింది.. ఇది ఎన్నో సమస్యలకు పరిహారం చేసుకునే అవకాశం ఉంటుంది... అవి ఏంటో తెలుసుకుందాము.. 1. సహజంగా జేష్ఠ నక్షత్రం బలి నక్షత్రం వీళ్ళు నిత్యం శివుడికి సోమవారం ఆవు నైయి తో దీపము పెట్టడం వల్ల ఎన్నో ఆటంకాలనుండి ఉపశమనం లభిస్తుంది, అయితే ఈ సోమవారం పౌర్ణమి రోజున ఇంట్లో మొదటి సంతానం కొడుకు కావచ్చు కూతురు కావచ్చు ఏ వయసు వారు అయినా కావచ్చు ఇంట్లో ,(గుడిలో అయితే ఇంకా మంచిది ) ఆవు నైయి తో దీపారాధన చేసి శివుని అష్టోత్తరం చేయాలి... ఇలా చేస్తే వారి తో పాటు వారి కుటుంబం అంతా మంచి జరుగుతుంది.. ఒక్కరే సంతానం ఉన్న ఇంట్లో పిల్లవాడు తండ్రి ఈ దీపారాధన సంతానం పెరు తో చేసుకోవాలి... 2. తరచుగా గొడవ పడుతున్న భార్య భర్తల, విడిపోయే పరిస్థితిలో ఉన్నవారు ఈ పౌర్ణమి రోజు తల స్నానం చేసి ఇంట్లో శివుడికి , చింబిలి (బియ్యం,నువ్వులు, బెల్లం, నైయి mixcy లో వేసి పొడి చేసి ముద్దగా చేసి ఆ ముద్దలో దీపంలాగా చేసి అందులో నైయి పోసి దీపం పెట్టాలి రెండు చింబిలి ఉండలు దీపం పెట్టాలి) కొద్దిగా చింబిలి కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టి సంకల్పం చెప్పుకోవాలి మీరు మీ భర్త అన్యోన్యంగా ఉండాలి అని కోరుకొని అర్ధనారీశ్వర స్త్రోత్రం 11 సార్లు పారాయణం చేసి హారతి ఇవ్వాలి... చింబలి లోని దీపం కొండెక్కాక అది కూడా ప్రసాదంగా తినవచ్చు... ఆ రోజు ఒక్కపూట అల్పాహారం తీసుకుని సాయంత్రం 6.గ దాటాక శివాలయంలో దీపారాధన చేసి చంద్రుడికి నమస్కరించు కుని రాత్రికి బోజనం చేయాలి.. (ఇది కూతురు కాపురం కోసం అని సంకల్పం చెప్పుకుని తల్లి కూడా చేయవచ్చు...) 3.. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారు లేక వారి పేరుతో ఎవరైనా చేయవచ్చు... మట్టితో శివలింగం అది పుట్ట మన్ను అయితే చాలా విశేషం లేదా శుభ్రంగా ఉన్న మట్టితో స్వయంగా శివలింగాన్ని చేసి ఒక ఆసనం ఏర్పాటు చేసి వైద్యనాద్ స్త్రోత్రం తో 11 సార్లు విభూదితో అర్చన చేయాలి, మ్రుతున్జయ మంత్రం (త్రయంబకం) 108 సార్లు చదవాలి, కొబ్బరి బెల్లం నైవేద్యంగా పెట్టాలి... పూజ తర్వాత ఆ శివలింగాన్ని నీటిలో కలిపి చెట్లకు పోయావచ్చు.... 4. అప్పులు ఎక్కువ గా ఉంది వడ్డీ లు కట్టుకుంటూ ఎంత కి అప్పులు తీరని వాళ్ళు, ఉద్యోగం లేని వారు, ఉద్యోగం ఉన్న తగిన జీతం రాని వాళ్ళు, వ్యాపారంలో లాభాలు లేని వారు...ఇలాగే మట్టితో శివలింగాన్ని చేసుకుని బాగా అలంకరించి.. చలిబిండి నైవేద్యం పెట్టి 16 సార్లు దారిద్ర్య దహన స్త్రోత్రం పారాయనఁ చేస్తూ శివుడికి బియ్యం పిండి తో అర్చన చేయాలి... ఆ రోజు శివాలయంలో దీపారాధన ప్రదోష కాలంలో పెట్టి ప్రదోష అష్టకమ్(సత్యం బ్రవీమి) ఒకసారి చదువుకోండి... శివదర్శనం చేసుకోండి... 5. విహహం ఆలస్యం, జాతక దోషం, బుద్ధి మాంద్యం ఉన్నవాళ్లు.. బియ్యం పిండిలో గంధం కలిపి శివలింగం చేసుకుని...విభూదితో.. శివ పంచాక్షరీ స్త్రోత్రం 11 సార్లు అర్చన చేసి, పానకమ్, కొబ్బరికాయ, సుండలు నైవేద్యం పెట్టి పూజ అయ్యాక ఆ ప్రసాదం కొద్దిగా తిని పంచి పెట్టాలి. సంకల్పం లో వివాహం మంచి సంబంధం కుదరాలి అని చెప్పుకోవాలి... ఆ శివలింగాన్ని నీటిలో కలిపి తులసి మొక్కకు కానీ రావి చెట్టుకు కానీ పోయాలి... 6. కుజదోషం తో ఇబ్బందులు పడుతున్న వారు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపాద లేని వారు ఆ రోజు సుబ్రమణ్య స్వామి కి బెల్లం నువ్వులు కలిపిన చింబిలి నివేదన చేసి అష్టోత్రం తో పూజ చేసి ఏకభుక్తం చేయాలి ఒక్కపూట బోజనమ్ చేసి సాయంత్రం శివాలయంలో దీపం పెట్టాలి... 7. జేష్ఠ నక్షత్రం వారు ఐదు వేపచెట్లకు నీరు పోయాలి... 8. దూరంగా ఉన్న పిల్లలు అంటే హాస్టల్ లో విదేశాల్లో ఉన్నవారి కోసం వారి కుటుంబ సభ్యులు ఈ సోమవారం అమావాస్య రోజు శివాలయంలో అబీషేకం చేయించు కోవడం మంచి, వారే కాదు శివనుగ్రహం కోసం ఎవరు అబీషేకం చేయించు కున్నా చేసినా మంచిది.. 9. ఇంక చివరిగా మన శివ భక్తుల కోసం ఈ సోమవారం పౌర్ణమి రోజున బిల్వదలాలతో అర్చన చేసిన , అభేషేకం, శివ నామ స్మరణం మరింతగా శివాను గ్రహము కలిగిస్తుంది. దయచేసి అందరికీ షేర్ చేయండి అందరం అరుణాచల శివ అని వ్రాసి శివానుగ్రహం పొందుదాం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

+183 प्रतिक्रिया 11 कॉमेंट्स • 137 शेयर

దైవం మానుష రూపేణా ... భక్తి నమ్మకాలకు నిదర్శనం దయచేసి అందరికీ షేర్ చేయండి ఈశ్వర్ అనే ఒక ప్రఖ్యాత డాక్టర్, వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప అవార్డును అందుకోవడానికి వేరే నగరానికి బయలుదేరాడు. రెండూ గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది. కాన్‌ఫరెన్సుకు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒక కారు అద్దెకు తీసుకుని ప్రయాణం కొనసాగించాడు. మళ్ళి కొంతసేపు అయిన తరువాత, విపరీతమైన గాలివాన, వర్షం . . . దానితో ఈ వాతావరణంలో ముందుకు సాగలేకఆగిపోయాడు. భరించలేని ఆకలి, అలసట, వేళకు వెళ్ళలేకపోతున్నాను అనే చికాకులతో ఉన్నాడు ఆ డాక్టరు, కొంతదూరం ముందుకు వెళ్ళాక, అతనికి ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఆ ఇంట్లోకి వెళ్ళి వారి ఫోను ఉపయోగించుకుందాము అనుకున్న ఆ డాక్టరుకు ఆ ఇంటి తలుపు తీసిన ఒక ముసలామె తన ఇంట్లో కరంటు, ఫోను సౌకర్యాలు లేవు అని, బాగా వర్షంలో తడిసిపోయినందున తన ఇంట్లో కొంత సేపు విశ్రాంతి తీసుకోమని, వెచ్చగా ఉండేందుకు టీ, కొంత ఆహారం తేబుల్ మీద పెట్టి తను పూజ చేసుకోవడానికి వెళ్ళింది. ఆమె పక్కన ఉయ్యాలలో ఒక పసివాడు ఉన్నాడు. ఆమె గురించిన వివరాలు తెలుసుకుందామనుకున్నాడు కాని ఆమె పుాజలొ వుంది. ఆమె పూజ ముగించి వచ్చిన తరువాత, ఆమె మంచి మనసుకు ఆమె పుాజలొ చేసిన విన్నపాలు అన్నీ ఆ భగవంతుడు వింటాడు అని భరోసా ఇచ్చాడు. ఆ ముసలామె చిరునవ్వు నవ్వి, భగవంతుడు నేను కోరిన అన్ని కోరికలూ తీర్చాడు ఒక్కటి తప్ప, ఎందుకనో ఈ కోరిక మాత్రం తీర్చడం లేదు అని చెప్పింది. ఆమెకు అభ్యంతరం లేకపోతే, ఆమెకు కల కోరిక ఏమిటో చెప్పమని, తాను సాధ్యమైనంత సహాయపడతానని చెప్పాదు వైద్యుడు. ఆమె ఇలా చెప్పటం ప్రారంభించింది. "ఈ ఉయ్యాలలో ఉన్నవాడు నా మనుమడు. అతనికి ఒక అరుదైన క్యాన్సర్ వ్యాధి సోకింది. ఎంతో మంది వైద్యులకు చూపించాము. ఎవ్వరూ నయం చేయలేకపోయారు. ఒక్క ఈశ్వర్ అన్న ఆయన మాత్రమే ఈ వ్యాధి తగ్గించగలడు, ఆయన ఇక్కడికి చాలా దూరంలో ఉన్నాడు. అందుకే వైద్యం మీద ఆశ వదిలేసి, భగవత్ ప్రార్ధనలతో జీవితం గడిపేస్తున్నాను అని చెప్పింది. వింటున్న డాక్టరు కళ్ళల్లో నీళ్ళు "భగవంతుడు మీ ప్రార్ధనలు వినడమే కాదు, ఆ డాక్టరును మీ వద్దకే తీసుకువచ్చాడు కూడా. విమానం పాడయ్యి గాలివానలో చిక్కుకుని నేను మీ ఇంటికి వచ్చాను. కాదు కాదు ఈ పరిస్థితి సృష్టించి ఆయనే నన్ను మీ వద్దకు పంపాడు. ఆ డాక్టర్ ఈశ్వర్ ను నేనే." అని బదులిచ్చాడు. అప్పుడు ఆ క్షణం అతను అందుకోవలసిన అవార్డు అతనికి గుర్తు రాలేదు. పూజించండము లోని మహత్యం అదే. మనం వెళ్ళలేని చోటుకు కూడా దాని శక్తి వెళుతుంది. కావలసినది నమ్మకం అంతే. 1. ఆరాధించడం 2. విన్నవించడము 3. నమ్మడము ...ఇవే పూజించడానికి కావలసిన అంశాలు. భగవంతుని నమ్మి మనం ఆరాధించితే మనకు కావలసినది ఆయన తప్పక మనకు లభింపచేస్తాడు. దయచేసి అందరికీ షేర్ చేయండి ఓం నమః శివాయ

+21 प्रतिक्रिया 1 कॉमेंट्स • 16 शेयर
Sharat Kuchi Jun 19, 2019

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB