షిరిడి మాఝే పండరిపుర..!!🌷🙏🌷 ఉపోద్ఘాతం..!!🌷 షిరిడీయే పండరీపురమని, సాయిబాబాయే విఠలేశ్వరుడనే వారు ఎందరో ఉన్నారు. అనుభవాలు వారికి ఉన్నాయి. షిరిడీలో పాండురంగని భక్తుల జ్ఞాపకాలు చిరస్థాయిగా ఉండి పోయాయి - కొన్ని తీపి గురుతులు: షిరిడీ ఆరతులలో పండరీ నాథుని భక్తుల గేయాలు సగానికి పైగానే ఉన్నాయి. సాయిబాబా తుకారాం, జ్ఞానేశ్వరుల ఆరతులు రాగానే నమస్కరించే వారు చేతులు జోడించి. సాయికి తుకారాం అభంగాలంటే చాల ఇష్టం. సాయిబాబా చావడిలో నిద్రించేటప్పుడు లక్ష్మణ్ భట్ జోషి అనే కుర్రవాడి చేత తుకారాం పాటలు పాడించుకొనే వాడు. బాబా సలహాపై కాకా సాహెబ్ దీక్షిత్ ప్రతి నిత్యం ఏకనాథ మహారాజ్ విరచితమైన భాగవతము' మరియు 'భావార్ధ రామాయణము' లను పారాయణ చేసేవాడు. ఖాన్ సాహెబ్ అబ్దుల్ కరీం ఖాన్ హిందూస్తానీ సంగీత విద్వాంసుడు. ఆయన ఒకసారి షిరిడీ వచ్చి సాయి బాబాను దర్శించాడు. బాబాను చూసి ఆయనకు యోగి అని అర్థమయింది. కుశల ప్రశ్నల అనంతరం ఖాన్ సాహెబ్ ను మరాటిఠీలో భజన పాడుమని సాయిబాబా అడిగారు. ఖాన్ సాహెబ్ “హెచి దాన దేగే దేవా...." అనే తుకారాంఅభంగాన్ని పీలూ రాగంలో ఎంతో భక్తిగా పాడాడు. సాయి బాబా కనులు మూసుకుని శ్రద్దగా ఆ భజన విన్నారు. భజన పూర్తి అయ్యాక సాయి బాబా కళ్ళు తెరచి ఇలా ప్రశంసించాడు. “ఎంత అద్భుతంగా పాడాడు. ఎంత భక్తిగా ప్రార్ధించాడు. వినగానే అతడి ప్రార్ధనను మన్నించాలని పించేలా ఉన్నది”. సాయిబాబా తుకారాం వ్రాసిన అభంగాలను వినటమే కాకుండా “తుకారాం గాథ" అనే తుకారాం అభంగాల సంపుటాన్ని వీక్షించాడు. ఆ దృశ్యం హేమాడ్ పంత్ రచించిన సాయి సచ్చరిత మొదటి ఎడిషన్ 1930లో ముద్రితమై యున్నది. పాండురంగని తుకారాం ఏమి అర్ధించాడో ఆ అభ్యర్ధనే సాయికి కూడా చెల్లుతుంది. తుకారాం అభ్యర్ధన ఇది: “పాండురంగా! మా కష్టాల గురించి మీరు తప్ప మమ్మల్ని అడిగేదెవరు? ఎవరితో మా సుఖదుఃఖాల గురించి చెప్పుకోవాలి? మా ఆకలి దప్పులను నివారించేదెవరు? ఈ తాపాన్ని ఎవరు చల్లారుస్తారు? మా కిష్టమైన ఆహారాన్ని మేమడిగినప్పుడు ఇచ్చి ఆ కోరిక తీర్చు వారెవరు? మా భారాన్ని ఎవరి మీద పెట్టాలి? మీరు తప్ప భరించే వారెవరు? ఓ స్వామీ! మీకంతా తెలుసు మీ చరణాలకు సాష్టాంగ నమస్కారం!" అంటాడు తుకారం తన అభంగాలలో. షిరిడీలో ఒక రైతు ఉండే వాడు, పేరు అనంతరామ్ శివరాం పాటిల్ గోండ్కర్. అతడు ప్రొద్దున లేవగానే ద్వారకమాయికి భక్తితో నమస్కరించేవాడు, సాయి బాబాయే స్వయంగా సపత్నేకర్ అనే భక్తునితో “అరె! మాటి మాటికి ఎందుకు నమస్కారం పైన నమస్కారం. గౌరవాదరాలతో ఒకసారి చేస్తే చాలు” అన్నారు. ఆ మాటలను క్రియారూపంగా శివరాం పాటిల్ గోండ్కర్ ఆచరించే వాడు - ఒక నమస్కారం భక్తితో చేసేవాడు. ఈ విషయంలోనే కాబోలు వేమన "భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు" అని వ్రాశారు. ఇంకా శివరాం పాటిలకు వేదాలు, వేదాంగాలు ఏమీరావు 25, 30 తుకారాం అభంగాలు మాత్రం వచ్చు. ఆయనకు ఖాళీ సమయం దొరికితే చాలు ఆ అభంగాలను పాడుకునేవాడు, పాడుతున్న ఆయనే కాదు, వినుచున్న వారు కూడా ధన్యులు కదా! వాటిలో లీనమైపోయేవాడు. కాలంలోని ప్రతి క్షణం విలువైనదే అని సమయాన్ని వృధా కాకుండా తుకారాం అభంగాలను పాడుకునే వాడు. ఒకసారి ఆయన ఉదయాన్నే గడ్డం గీయించుకుని వచ్చాడు ఇంటికి. స్నానానికి వేడినీరు కాస్తున్నారు ఇంట్లోని వారు. వేడి నీరు కాగేవరకు కాలం వృధా చేయదలచు కోలెదు. సమయం ఉన్నది గదా అని గోడకు చేరబడి తుకారాం అభంగాలు పాడటం మొదలు పెట్టాడు. అలా పాడుతూ, పాడుతూ అనంతులు అక్కడే అనంతునిలో లీనమై నాడు. తెలుగు వారికి కృష్ణుడంటే ప్రీతి. కృష్ణుని కంటే, కృష్ణుని రూపాలంటే ఇంకా ప్రీతి. అందుకే తిరుపతిలోని వెంకటేశ్వరుడు, ఇంకొంచెం దూరంలో పండరీపురంలో ఉన్న పాండు రంగడు ఆరాధ్య దైవాలయ్యారు. పండరీపురం చుట్టూ ప్రవహించే నది పేరు భీమానది. పండరీపురము చెంత ఇది అర్ధచంద్ర ఆకారములో ప్రవహించుటచే చంద్రభాగ నదీ అంటారు. భీమా నది వెన్నెల వలే విహరించే కృష్ణవేణికి ఉపనది. కృష్ణవేణి పుష్కరాల సందర్భంగా ఆ తీర్ధ, దైవక్షేత్రాల స్మరణ చేయటం దర్శనం లాంటిదే. కనుక ఆ గాథ స్మరణ భాగ్యాన్ని,తద్వారా ఆనందాన్ని ఆ పాండురంగడు అందరికి కలిగిస్తారని మా విశ్వాసం. జై శ్రీ కృష్ణ జై పాండురంగ!! జై సాయినాథ్!!!

షిరిడి మాఝే పండరిపుర..!!🌷🙏🌷
ఉపోద్ఘాతం..!!🌷

షిరిడీయే పండరీపురమని, సాయిబాబాయే విఠలేశ్వరుడనే వారు ఎందరో ఉన్నారు.
అనుభవాలు వారికి ఉన్నాయి. షిరిడీలో పాండురంగని భక్తుల జ్ఞాపకాలు చిరస్థాయిగా
ఉండి పోయాయి - కొన్ని తీపి గురుతులు:

షిరిడీ ఆరతులలో పండరీ నాథుని భక్తుల గేయాలు సగానికి పైగానే ఉన్నాయి. సాయిబాబా తుకారాం, జ్ఞానేశ్వరుల ఆరతులు రాగానే నమస్కరించే వారు చేతులు జోడించి.

సాయికి తుకారాం అభంగాలంటే చాల ఇష్టం. సాయిబాబా చావడిలో నిద్రించేటప్పుడు
లక్ష్మణ్ భట్ జోషి అనే కుర్రవాడి చేత తుకారాం పాటలు పాడించుకొనే వాడు.

బాబా సలహాపై కాకా సాహెబ్ దీక్షిత్ ప్రతి నిత్యం ఏకనాథ మహారాజ్ విరచితమైన
భాగవతము' మరియు 'భావార్ధ రామాయణము' లను పారాయణ చేసేవాడు.

ఖాన్ సాహెబ్ అబ్దుల్ కరీం ఖాన్ హిందూస్తానీ సంగీత విద్వాంసుడు. ఆయన
ఒకసారి షిరిడీ వచ్చి సాయి బాబాను దర్శించాడు. బాబాను చూసి ఆయనకు యోగి అని అర్థమయింది. కుశల ప్రశ్నల అనంతరం ఖాన్ సాహెబ్ ను మరాటిఠీలో భజన పాడుమని సాయిబాబా అడిగారు. 

ఖాన్ సాహెబ్ “హెచి దాన దేగే దేవా...." అనే తుకారాంఅభంగాన్ని పీలూ రాగంలో ఎంతో భక్తిగా పాడాడు. సాయి బాబా కనులు మూసుకుని శ్రద్దగా ఆ భజన విన్నారు. భజన పూర్తి అయ్యాక సాయి బాబా కళ్ళు తెరచి ఇలా ప్రశంసించాడు. “ఎంత అద్భుతంగా పాడాడు. ఎంత భక్తిగా ప్రార్ధించాడు. వినగానే
అతడి ప్రార్ధనను మన్నించాలని పించేలా ఉన్నది”.

సాయిబాబా తుకారాం వ్రాసిన అభంగాలను వినటమే కాకుండా “తుకారాం గాథ" అనే తుకారాం అభంగాల సంపుటాన్ని వీక్షించాడు.
ఆ దృశ్యం హేమాడ్ పంత్ రచించిన సాయి సచ్చరిత మొదటి ఎడిషన్ 1930లో ముద్రితమై యున్నది.

పాండురంగని తుకారాం ఏమి అర్ధించాడో ఆ అభ్యర్ధనే సాయికి కూడా చెల్లుతుంది.

తుకారాం అభ్యర్ధన ఇది:
“పాండురంగా!
మా కష్టాల గురించి మీరు తప్ప మమ్మల్ని అడిగేదెవరు?
ఎవరితో మా సుఖదుఃఖాల గురించి చెప్పుకోవాలి?
మా ఆకలి దప్పులను నివారించేదెవరు?
ఈ తాపాన్ని ఎవరు చల్లారుస్తారు?
మా కిష్టమైన ఆహారాన్ని మేమడిగినప్పుడు ఇచ్చి ఆ కోరిక తీర్చు వారెవరు?
మా భారాన్ని ఎవరి మీద పెట్టాలి?
మీరు తప్ప భరించే వారెవరు?
ఓ స్వామీ! మీకంతా తెలుసు
మీ చరణాలకు సాష్టాంగ నమస్కారం!"
అంటాడు తుకారం తన అభంగాలలో.

షిరిడీలో ఒక రైతు ఉండే వాడు, పేరు అనంతరామ్ శివరాం పాటిల్ గోండ్కర్.
అతడు ప్రొద్దున లేవగానే ద్వారకమాయికి భక్తితో నమస్కరించేవాడు, సాయి బాబాయే స్వయంగా సపత్నేకర్ అనే భక్తునితో “అరె! మాటి మాటికి ఎందుకు నమస్కారం పైన నమస్కారం. గౌరవాదరాలతో ఒకసారి చేస్తే చాలు” అన్నారు. 

ఆ మాటలను క్రియారూపంగా శివరాం పాటిల్ గోండ్కర్ ఆచరించే వాడు - ఒక నమస్కారం భక్తితో చేసేవాడు. ఈ విషయంలోనే కాబోలు వేమన "భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు" అని వ్రాశారు. ఇంకా శివరాం పాటిలకు వేదాలు, వేదాంగాలు ఏమీరావు 25, 30 తుకారాం అభంగాలు మాత్రం వచ్చు.

ఆయనకు ఖాళీ సమయం దొరికితే చాలు ఆ అభంగాలను పాడుకునేవాడు, పాడుతున్న ఆయనే కాదు, వినుచున్న వారు కూడా ధన్యులు కదా! వాటిలో లీనమైపోయేవాడు. కాలంలోని ప్రతి క్షణం విలువైనదే అని సమయాన్ని వృధా కాకుండా తుకారాం అభంగాలను పాడుకునే వాడు.

ఒకసారి ఆయన ఉదయాన్నే గడ్డం గీయించుకుని వచ్చాడు ఇంటికి. స్నానానికి వేడినీరు కాస్తున్నారు ఇంట్లోని వారు. వేడి నీరు కాగేవరకు కాలం వృధా చేయదలచు
కోలెదు. సమయం ఉన్నది గదా అని గోడకు చేరబడి తుకారాం అభంగాలు పాడటం
మొదలు పెట్టాడు. అలా పాడుతూ, పాడుతూ అనంతులు అక్కడే అనంతునిలో లీనమై నాడు.

తెలుగు వారికి కృష్ణుడంటే ప్రీతి. కృష్ణుని కంటే, కృష్ణుని రూపాలంటే ఇంకా ప్రీతి. అందుకే తిరుపతిలోని వెంకటేశ్వరుడు, ఇంకొంచెం దూరంలో పండరీపురంలో ఉన్న పాండు రంగడు ఆరాధ్య దైవాలయ్యారు.

పండరీపురం చుట్టూ ప్రవహించే నది పేరు భీమానది. పండరీపురము చెంత ఇది
అర్ధచంద్ర ఆకారములో ప్రవహించుటచే చంద్రభాగ నదీ అంటారు. భీమా నది వెన్నెల
వలే విహరించే కృష్ణవేణికి ఉపనది. కృష్ణవేణి పుష్కరాల సందర్భంగా ఆ తీర్ధ, దైవక్షేత్రాల
స్మరణ చేయటం దర్శనం లాంటిదే. కనుక ఆ గాథ స్మరణ భాగ్యాన్ని,తద్వారా ఆనందాన్ని
ఆ పాండురంగడు అందరికి కలిగిస్తారని మా విశ్వాసం.
జై శ్రీ కృష్ణ జై పాండురంగ!! జై సాయినాథ్!!!

+23 प्रतिक्रिया 0 कॉमेंट्स • 10 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB