శ్వేతా
శ్వేతా Oct 10, 2019

ధ్యానం నీ లోపల, నీ బయట, సర్వత్రా వ్యాపించి వున్న పరమాత్మ ను దర్శించటానికి నీ లోనికి, నీ పయనం చేసి ఆత్మ దర్శనం పొందడం. మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం లో మన లోనికి మనం చేసే ప్రయాణం. ఆత్మ, పరమాత్మల కలయిక కోసం చేసే ప్రయత్నం లో ఓ మార్గం. వంచించే ఇంద్రియాలు ద్వారా పరమాత్మ ను గ్రహించ గల మన్న అజ్ఞానము ను వీడి, బాహ్య విషయముల నెరిగే మనస్సు ని, ఎగిసి పడే అహంకారాన్ని అంత మొందించి హృదయం లోని అవ్యక్తమైన కాంతి నీ, స్వస్వరూప స్థితి ని ఎరుక లోనికి తెచ్చే ప్రక్రియ. మనస్సు యొక్క నిశ్చలత్వం. మనల్ని పరమ సత్యాని కి దగ్గర గా తీసు కెళ్ళే మార్గం. ఇతర భావాలను విడిచి ఒకే ఒక భావం పై ఏకాగ్రత ను కల్గించడం. అంత రంగ చైతన్యము కు చేరువ కావడం. హృదయాంతర్గత ఆత్మ చైతన్యం లో జీవించడం. ధ్యానం దైవత్వాన్ని చేరుకోవడానికే తప్ప అనుభవాల కోసం కాదని గ్రహించాలి. ధ్యాన మంటే కొన్ని మాటలు పునరుక్తి చేస్తూ, జపం చేస్తూ నియమిత సమయం లో కళ్ళు మూసుకొని కూర్చొని చేసే ప్రక్రియ కాదు. ఏ పని చేస్తున్నను ధ్యానం జరుగుతూ ఉండాలి. అంటే చేస్తున్న ప్రతీ పని యందు సాక్షి భావం తో ఉండి పని చేయగలిగి నప్పుడు మాత్రమే అది అర్ధవంతమైన, ధ్యాన యుక్త మైన పరి పూర్ణ జీవితం అవుతుంది. ధ్యాన సాధన చేస్తున్న మొదట్లో ధ్యాన స్థితి లో ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానం చేయడానికి ఆలంబన గా తీసుకున్న ధ్యాన వస్తువు (నామం, రూపం, దీపం,శ్వాస మొదలగునవి) ఉంటాయి. ధ్యానం లో కొంత ప్రగతి సాధించాక ధ్యాన వస్తువు ఉండదు. ఇంకా ధ్యానం తీవ్రతరం అయ్యే సరికి ధ్యానం చేసే వ్యక్తి అంటే ధ్యాని కూడా ఉండడు. సమస్తమూ ధ్యానమందు లయమై పోతాయి. ధ్యాన కేంద్ర మైన విశ్వాత్మ లో అంటే పరమ చైతన్యం లో ధ్యాని దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, శ్వాస....అన్నీ అన్నీ సమీకృతమై వీలీనమైపోతాయి. ఇదీ పరిపూర్ణ ధ్యానస్థితి. ఇదే సంపూర్ణ ఆత్మధ్యానం. ఇదే ఆత్మనిష్ట. ధ్యాన యోగం యొక్క మహిమత్వాన్ని ఎన్నో శాస్త్రాలు ద్రువీకరిస్తున్నాయి. బ్రహ్మహత్యసహస్రాణి భ్రూణహత్య శతాని చ ఏతాని ధ్యానయోగశ్చ దహత్యగ్ని రివేంధనమ్ బ్రహ్మహత్యలును, నూరు గర్భిణీ హననము లైన పాపాలన్నియున్ను ఒక ధ్యాన యోగం చే, కట్టెలన్ని అగ్ని చే భస్మ మగు నట్లు భస్మ మగు చున్నవి. ముహుర్తమపి యో గచ్చే న్నాసాగ్రే మనసా సహ సర్వం తరతి పాప్మానం తస్య జన్మశతార్జితమ్ భ్రూ మధ్య మందు ప్రణవ మంత్రముల తో మనస్సు ను ఐక్య పరచి ఒక ముహుర్త మాత్రం ఎవరు ధ్యానింతురో, వారి యొక్క శత జన్మార్జితమైన పాపాలన్నియు నశించి నిర్మలు లగుదురు. నిమిషం నిమిషార్ధం వా ప్రాణినో ధ్యాత్మచింతకాః క్రతుకోటిసహస్రాణాం ధ్యానమేకం విశిష్యతే (ఉత్తరగీత) నిముషము గానీ, అర్ధ నిముషము గానీ ఆత్మ ధ్యానం చేసిన యెడల మానవులకు కోటి ఆశ్వ మేధాది యాగముల కంటే ఎక్కువ ఫలితముంటుంది. నాస్తి ధ్యానసమం తీర్ధం నాస్తి ధ్యానసమం తపః నాస్తి ధ్యానసమో యజ్ఞస్తస్మాద్ధ్యానం సమాచరేత్

ధ్యానం

నీ లోపల, నీ బయట, సర్వత్రా వ్యాపించి వున్న పరమాత్మ ను దర్శించటానికి నీ లోనికి, నీ పయనం చేసి ఆత్మ దర్శనం పొందడం. 

మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం లో మన లోనికి మనం చేసే ప్రయాణం.

ఆత్మ, పరమాత్మల కలయిక కోసం చేసే ప్రయత్నం లో ఓ మార్గం.

వంచించే ఇంద్రియాలు ద్వారా పరమాత్మ ను గ్రహించ గల మన్న అజ్ఞానము ను వీడి, బాహ్య విషయముల నెరిగే మనస్సు ని, ఎగిసి పడే అహంకారాన్ని అంత మొందించి హృదయం లోని అవ్యక్తమైన కాంతి నీ, స్వస్వరూప స్థితి ని ఎరుక లోనికి తెచ్చే ప్రక్రియ.

మనస్సు యొక్క నిశ్చలత్వం.

మనల్ని పరమ సత్యాని కి దగ్గర గా తీసు కెళ్ళే మార్గం.

ఇతర భావాలను విడిచి ఒకే ఒక భావం పై ఏకాగ్రత ను కల్గించడం.

అంత రంగ చైతన్యము కు చేరువ కావడం.

హృదయాంతర్గత ఆత్మ చైతన్యం లో జీవించడం.

ధ్యానం దైవత్వాన్ని చేరుకోవడానికే తప్ప అనుభవాల కోసం కాదని గ్రహించాలి. 

ధ్యాన మంటే కొన్ని మాటలు పునరుక్తి చేస్తూ, జపం చేస్తూ నియమిత సమయం లో కళ్ళు మూసుకొని కూర్చొని చేసే ప్రక్రియ కాదు. 

ఏ పని చేస్తున్నను ధ్యానం జరుగుతూ ఉండాలి. 

అంటే చేస్తున్న ప్రతీ పని యందు సాక్షి భావం తో ఉండి పని చేయగలిగి నప్పుడు మాత్రమే అది అర్ధవంతమైన, ధ్యాన యుక్త మైన పరి పూర్ణ జీవితం అవుతుంది.

ధ్యాన సాధన చేస్తున్న మొదట్లో ధ్యాన స్థితి లో ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానం చేయడానికి ఆలంబన గా తీసుకున్న ధ్యాన వస్తువు (నామం, రూపం, దీపం,శ్వాస మొదలగునవి) ఉంటాయి. 

ధ్యానం లో కొంత ప్రగతి సాధించాక ధ్యాన వస్తువు ఉండదు. 

ఇంకా ధ్యానం తీవ్రతరం అయ్యే సరికి ధ్యానం చేసే వ్యక్తి అంటే ధ్యాని కూడా ఉండడు.

సమస్తమూ ధ్యానమందు లయమై పోతాయి.

ధ్యాన కేంద్ర మైన విశ్వాత్మ లో అంటే పరమ చైతన్యం లో ధ్యాని దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, శ్వాస....అన్నీ అన్నీ సమీకృతమై వీలీనమైపోతాయి. 

ఇదీ పరిపూర్ణ ధ్యానస్థితి. 

ఇదే సంపూర్ణ ఆత్మధ్యానం. 

ఇదే ఆత్మనిష్ట.

ధ్యాన యోగం యొక్క మహిమత్వాన్ని ఎన్నో శాస్త్రాలు ద్రువీకరిస్తున్నాయి.

బ్రహ్మహత్యసహస్రాణి భ్రూణహత్య శతాని చ
ఏతాని ధ్యానయోగశ్చ దహత్యగ్ని రివేంధనమ్ 

బ్రహ్మహత్యలును, నూరు గర్భిణీ హననము లైన పాపాలన్నియున్ను ఒక ధ్యాన యోగం చే, కట్టెలన్ని అగ్ని చే భస్మ మగు నట్లు భస్మ మగు చున్నవి.

ముహుర్తమపి యో గచ్చే న్నాసాగ్రే మనసా సహ 
సర్వం తరతి పాప్మానం తస్య జన్మశతార్జితమ్ 

భ్రూ మధ్య మందు ప్రణవ మంత్రముల తో మనస్సు ను ఐక్య పరచి ఒక ముహుర్త మాత్రం ఎవరు ధ్యానింతురో, వారి యొక్క శత జన్మార్జితమైన పాపాలన్నియు నశించి నిర్మలు లగుదురు.

నిమిషం నిమిషార్ధం వా ప్రాణినో ధ్యాత్మచింతకాః
క్రతుకోటిసహస్రాణాం ధ్యానమేకం విశిష్యతే 
(ఉత్తరగీత)

నిముషము గానీ, అర్ధ నిముషము గానీ ఆత్మ ధ్యానం చేసిన యెడల మానవులకు కోటి ఆశ్వ మేధాది యాగముల కంటే ఎక్కువ ఫలితముంటుంది.
                  
నాస్తి ధ్యానసమం తీర్ధం నాస్తి ధ్యానసమం తపః
నాస్తి ధ్యానసమో యజ్ఞస్తస్మాద్ధ్యానం సమాచరేత్

+12 प्रतिक्रिया 1 कॉमेंट्स • 5 शेयर

कामेंट्स

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB