_*శ్రీ శివ మహాపురాణం - 148 వ అధ్యాయం*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *కుమారాభిషేకము* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ *బ్రహ్మ ఇట్లు పలికెను -* ఇంతలో ఉత్తమమైనది, అద్భుతమైనది, నిత్మశోభ గలది, విశ్వకర్మచే నిర్మించబడినది, వంద చక్రములు గలది, మిక్కిలి విస్తీర్ణమైనది, మనోవేగముతో పయనించునది, మనోహరమైనది, పార్వతిచే పంపబడినది, శ్రేష్ఠగణములచే చుట్టు వారబడి యున్నది అగు రథము అచట కనబడెను. అనంతుడు , గొప్ప జ్ఞాని , పరమేశ్వర తేజస్సంభూతుడు అగు కార్తికుడు దుఃఖముతో నిండిన హృదయముతో రథము నెక్కెను. అదే సమయములో దుఃఖపీడితలైన కృత్తికలు ఉన్నతస్త్రీలవలె జుట్టు విరబోసుకొని అచటకు వచ్చి ఇట్లు పలికిరి. *కృత్తికలిట్లు పలికిరి -* ఓ దయాసముద్రా ! నీవు నిర్దయుడవై మమ్ములను విడచి వెళ్లుచున్నావు. పెంచిన తల్లులను ఈ తీరున కుమారుడు విడిచి వెళ్లుట ధర్మము కాదు. నిన్ను మేము ప్రేమతో పెంచినాము గనుక, ధర్మము ప్రకారంగా నీవు మా కుమారుడవు: మేము ఏమి చేయుదుము? ఎచటకు వెళ్లెదము? ఇట్లు పలికి ఆ కృత్తికలందరు కార్తికుని గుండెలకు హత్తుకొని కుమారుని వియోగము కారణంగా వెంటనే మూర్ఛిల్లిరి. ఓ మునీ! కుమారుడు వారికి అద్యాత్మ వచనములను బోధించి, వారిని దోడ్కొని శివగణములతో బాటు రథము నధిష్ఠించెను. కుమారుడు శివగణములతో బాటు అనేక సుఖకరములగు మంగళములను చూస్తూ, వింటూ, తండ్రి యొక్క మందిరమునకు వెళ్లెను. కుమారుడు మనో వేగముతో పయనింప సమర్ధమగు రథముపై నందీశ్వరునితో గూడి అక్షయవట వృక్ష మూలము నందు గలకైలాసమును చేరెను. అనేక లీలలను ప్రదర్శించుటలో సమర్ధుడగు ఆ శివ పుత్రుడైన కుమారుడు కృత్తికలతో, శివగణములతో కూడి ఆనందముగా అచట ఉండెను అపుడు దేవతాగణములు, ఋషులు, సిద్ధులు, చారణులు అందరు విష్ణువుతో బ్రహ్మతో గూడి కుమారుని రాకను శివునకు చెప్పిరి. అపుడు గొప్ప హర్షముతో గూడిన శివుడు విష్ణు బ్రహ్మలతో, దేవతలతో, ఋషులతో మరియు ఇతరులతో కలిసి కుమారుని చూచివెళ్లెను. అనేక శంఖములు, భేరీలు, తూర్యములు వివిధరీతులలో మ్రోగింపబడినవి. ఆనందముతో నిండిన మనస్సులు గల దేవతలు గొప్ప ఉత్పవమును చేసిరి. అదే సమయములో వీరభద్రుడు మొదలగు గణములన్నియూ ఆడుతూ పాడుతూ అనేక తాళములను వాయించుచూ శివుని వెనుక నడచిరి. సంతసించిన మనస్సులు గలవారు, ఇతరులచే స్తుతింపబడుచున్నవారు అగు శివగణములు జయశబ్దములను, నమశ్శబ్దములను పలుకకుతూ శివుని గుణములను కీర్తిస్తూస్తుతించిరి. సర్వశ్రేష్టుడు, రెల్లుగడ్డి యందు పుట్టినవాడు అగు ఆ శివపుత్రుని చూచుటకు వారు వెళ్లిరి. పార్వతి నగరమంతటా రాజమార్గమును పద్మరాగము మొదలగు మణులచే అలంకరింపజేసి, సుందరముగా మంగళకరముగా చేసెను. ఆమె భర్త, పుత్రులు గల పతివ్రతలగు స్త్రీలతో కూడియున్నదై, లక్ష్మి మొదలగు ముప్పది దేవీమూర్తులు ఎదుట నడువగా విచ్చేసెను. శివుని ఆజ్ఞచే రంభ మొదలగు అప్సరసలు దివ్యవేషములను ధరించి నవ్వుతూ పాడుతూ నర్తించిరి. శంకరునితో పోల్చదగిన గంగా పుత్రుడగు కుమారుని చూచినవారందరు ముల్లోకములలో వ్యాపించు చున్న గొప్ప తేజస్సును చూచిరి. అట్టి తేజస్సుచే చుట్టు వారబడి యున్నవాడు, బాలుడు, పుటము పెట్టిన బంగారము వంటి కాంతి గలవాడు, సూర్యునితో సమమగు వర్చస్సు గలవాడు అగు కుమారునకు అందరు వెంటనే నమస్కరించిరి. వారు అతని ఎడమవైపున, కుడివైపున చేరి శిరస్సులను వంచి నమస్కరిస్తూ నమశ్శబ్దమును పలుకుతూ నిలబడిన వారై హర్షమును పొందిరి. నేను, విష్ణువు, ఇంద్రుడు, మరియు సర్వదేవతలు కుమారుని చుట్టు ముట్టి భూమిపై దండమువలె సాష్టాంగ ప్రణామమును చేసితిమి. ఇంతలో శివుడు, మహానందముతో నున్న పార్వతియు కలిసి మహోత్సవపురస్సరముగా విచ్చేసి ఆనందముతో కుమారుని చూచిరి. జగత్తునకు ఏకైక బంధువు, ప్రేమ స్వరూపుడు, పాములే అలంకారముగా గలవాడు, పరమాత్మ అగు శివుడు పరాభట్టారికయగు భవానితో గూడి పుత్రుని గాంచి చాల ఆనందించెను. అపుడు శక్తిని ధరించి యున్న స్కందుడు ఆ పార్వతీ పరమేశ్వరులను చూచి రథము నుండి వెను వెంటనే క్రిందకు దిగి శిరస్సు వంచి నమస్కరించెను. మంగళకరుడు, పరమేశ్వరుడు, స్నేహ స్వరూపుడు అగు శివుడు ప్రసన్నుడై ప్రేమతో కుమారుని కౌగిలించు కొని శిరస్సుపై ముద్ధిడెను. మిక్కిలి తొందరతో కూడిన పార్వతి గుహుని కౌగిలించుకొని ప్రేమతో నిండిన హృదయము గలదైస్తన్యము నిచ్చెను. అపుడు దేవతలు భార్యలతో గూడి ఆనందముతో నీరాజనమిచ్చిరి. ఆకాశము జయఘోషతో నిండి పోయెను. ఋషులు వేదధ్వనితో, గాయకులు గానము చేయుచూ అనేకులు వాద్యములతో కుమారుని వద్దకు విచ్చేసిరి. భవానీ పతియగు మహేశ్వరుడు అపుడు దివ్యకాంతులతోవెలు గొందు చున్న కుమారుని తన తొడపై కూర్చుండ బెట్టుకొనెను. కుమారుడు కూర్చుండుటచే సాక్షాత్తు శివుడు శోభను పొంది పుత్రుడు గలవారిలో శ్రేష్ఠుడాయెను. మహాసుఖమును పొందిన కుమారుడు శివుని ఆజ్ఞచే మహోత్సాహ వంతులగు తన గణములతో మరియు దేవతలతో గూడి శివుని మందిరమునకు విచ్చేసెను. దేవతోత్తములు చుట్టు వారియుండగా, ఋషులు నమస్కరించు చుండగా ఒక్కచోటనున్న ఆ ఇద్దరు దంపతులు అపుడెంతయో ప్రకాశించిరి. కుమారుడు శివుని ఒడిలో ఆనందముతో నాడు కొనెను. శివుని కంఠము నందున్న వాసుకిని చేతులతో పీడించెను. దయానిధియగు శంభుడు దయా దృష్టితో బాలుని చూచి నవ్వి గిరిజతో ఆ విషయమును చెప్పెను. శివుడు లీలచేత ఆ ఆకారమును ధరించెను. అపుడు పార్వతీ సమేతుడు, జగత్తునకు ఏకైక బంధువు, సర్వవ్యాపి, ముల్లోకములకు ఏకైక ప్రభుడు అగు మహేశ్వర భగవానుడు మహానందమును పొంది చిరునవ్వులను వెదజల్లెను. ప్రేమచే కంఠము బొంగురుపోవుట వలన ఆయన ఏమియూ మాటలాడలేదు. అపుడు జగన్నాధుడగు శంభుడు లోకాచారము ననుసరించి ఆనందమయుతో కార్తికుని సుందరమగు రత్నసింహాసనముపై కూర్చుండబెట్టెను. సర్వతీర్థముల జలములు రత్నములు పొదిగిన వంద ఘటములలో నుండెను. వేదమంత్రములచే పవిత్రములైన ఆ జలములతో శివుడు ఆనందముతో కుమారుని అభిషేకించెను. మిక్కిలి శ్రేష్ఠమగు రత్నములతో అలంకరింపబడిన కిరీటమును, అంగదములను, వైజయంతీ మాలను, మరియు చక్రమును విష్ణువు ఆతనికి ఇచ్చెను. శివుడు శూలమును, పినాకమనే ధనస్సును, పరశువును, శక్తిని, పాశుపత సంహారాస్త్రములను, పరమవిద్యను అతనికి ఇచ్చెను. నేను యజ్ఞ సూత్రమును, వేదములను, వేదమాతను, కమండలమును, బ్రహ్మాస్త్రములను మరియు శత్రు సంహార విద్యను ఇచ్చితిని. ఇంద్రుడు ఐరావతమును మరియు వజ్రమును అతనికి ఇచ్చెను. వరుణుడు తెల్లని గొడుగును, రత్నమాలను ఇచ్చెను. సూర్యుడు మనోవేగముతో పరుగెత్తే రథమును, గొప్ప శక్తిగల కవచమును, యముడు యమదండమును, చంద్రుడు అమృతకలశమును ఇచ్చెను. అగ్ని తన కుమారునకు ప్రేమతో మహాశక్తిని ఇచ్చెను. నిర్‌ఋతి తన శస్త్రమును, వాయువు వాయవ్యాస్త్రమును ఇచ్చెను. కుబేరుడు గదను, ఈశుడు శూలమును ఇచ్చెను. దేవతలందరు అనేక శస్త్రాస్త్రములను ప్రీతితో నిచ్చిరి. తరువాత కామదేవుడు అతనికి కామాస్త్రమును, గదను, తన విద్యలను పరమానందముతో నిచ్చెను. క్షీరసముద్రుడు అమూల్యములగు రత్నములను గొప్ప రత్ననూపురమును, హిమవంతుడు దివ్యములగు అలంకారములను, వస్త్రములను , గరుడుడు చిత్ర బర్హణడను పేరు గల తన కుమారుని ఇచ్చిరి. పాదములే ఆయుధములుగా గలవాడు, బలశాలి అగు తామ్రచూడుడను పేరుగల వానిని అరుణుడు ఇచ్చెను. మహానందముతో నవ్వుచున్న పార్వతి అతనికి పరమైశ్వర్యమును, చిరంజీవి త్వమును ప్రీతితో నిచ్చెను. లక్ష్మి దివ్యసంపదను, రమణీయమగు గొప్పహారమును, సావిత్రి సంపూర్ణసిద్ధ విద్యను ఆనందముతో నిచ్చిరి. ఓ మునీ ! అచటకు వచ్చిన ఇతరదేవీ మూర్తులు, అతడు శిశువుగా నుండగా పాలించిన కృత్తికలు తమకు ప్రియమగు వస్తువులను అతనికి ఇచ్చిరి. ఓ మహర్షీ! అచట గొప్ప ఉత్సవము జరిగెను. అందరు ప్రసన్నులైరి. పార్వతీ పరమేశ్వరులు విశేషముగా సంతోషంచిరి. ఆ సమయములో ప్రతాపశాలి, తేజశ్శాలి అగు రుద్రుడు ఆనందముతో నవ్వి బ్రహ్మ మొదలగు దేవతలతో నిట్లనెను. *శివుడిట్లు పలికెను -* ఓ హరీ ! బ్రహ్మా ! దేవతలారా ! మీరందరు నా మాటను వినుడు. నేను అన్ని విధములుగా ప్రసన్నుడనైతిని. మీకు నచ్చిన వరములను కోరుకొనుడు. *బ్రహ్మ ఇట్లు పలికెను -* ఓ మునీ ! విష్ణువు మొదలగు దేవతలందరు ఆ శంభుని వచనమును విని ప్రసన్నమగు ముఖము గలవారై ప్రభువగు పశుపతి దేవునితో నిట్లనిరి. ఓ ప్రభూ! ఈ కుమారుని చేతిలో తారకుడు సంహరింబడ గలడు. ఈ ఉత్తమ చరిత్రము అందుకొరకు మాత్రమే ఘటిల్లినది. కావున తారకుని సంహరించుటకు సన్నద్ధులమై ఈనాడే బయలుదేరెదము. కుమారునకు అనుమతినిమ్ము. ఆతడు వానిని వధించి మాకు సుఖమును కలుగజేయుగాక!. అటులనే అని అంగీకరించి ఆ విభుడు అపుడు దయతో నిండిన హృదయము గలవాడై, తారకాసుర సంహారము కొరకు కుమారుని దేవతలకు అప్పగించెను. విష్ణువు బ్రహ్మ మొదలగు దేవతలందరు అపుడు శివుని అనుమతిని పొంది గుహుని ముందిడుకొనివెంటనే కైలాసము నుండి బయలు దేరిరి. శివుని శాసనముచే విశ్వకర్మ కైలాసమునుండి బయటకు వచ్చి ఆ పర్వతమునకు సమీపములో సుందరము, అద్భుతము అగు నగరమును నిర్మించెను. దానిలో సుందరము, దివ్యము, అద్భుతము, గొప్ప ప్రకాశము గలది అగు గృహమును గుహుని కొరకు నిర్మించెను. విశ్వకర్మ ఆ గృహములో గొప్ప సింహాసనమును నిర్మించెను. అపుడు బుధ్ధిశాలియగు హరి దేవతలచే సర్వతీర్థముల జలములతో కార్తికునకు భక్తితో మంగళాభిషేకమును చేయించెను. కార్తికుని అన్ని విధములగా అలంకరించి ప్రత్యేకముగా సంపాదించిన వస్త్రములను ధరింపజేసి ఆనందముతో ఉత్సవమును యథావిధిగా చుయించెను. విష్ణువు అతనికి ఆనందముతో బ్రహ్మాండాధిపత్యము నిచ్చి, తిలకము దిద్ది, దేవతలతో కలిసి పూజించెను. అతడు దేవతలతో, ఋషులతో గూడి, శివస్వరూపుడు, సనాతనుడు అగు కార్తికుని అనేక స్తోత్రములతో ప్రీతి పూర్వకముగా స్తుతించెను. గొప్ప సింహాసనము నందున్న వాడు, బ్రహ్మాండమునకంతకు ప్రభువు, రక్షకుడు అగు కార్తికుడు మిక్కిలి ప్రకాశించెను. *శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు కుమారఖండలో కుమారాభిషేకమనే అయుదవ అధ్యాయము ముగిసినది.*

_*శ్రీ శివ మహాపురాణం - 148 వ అధ్యాయం*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*కుమారాభిషేకము*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*బ్రహ్మ ఇట్లు పలికెను -*

ఇంతలో ఉత్తమమైనది, అద్భుతమైనది, నిత్మశోభ గలది, విశ్వకర్మచే నిర్మించబడినది, వంద చక్రములు గలది, మిక్కిలి విస్తీర్ణమైనది, మనోవేగముతో పయనించునది, మనోహరమైనది, పార్వతిచే పంపబడినది, శ్రేష్ఠగణములచే చుట్టు వారబడి యున్నది అగు రథము అచట కనబడెను. అనంతుడు , గొప్ప జ్ఞాని , పరమేశ్వర తేజస్సంభూతుడు అగు కార్తికుడు దుఃఖముతో నిండిన హృదయముతో రథము నెక్కెను. అదే సమయములో దుఃఖపీడితలైన కృత్తికలు ఉన్నతస్త్రీలవలె జుట్టు విరబోసుకొని అచటకు వచ్చి ఇట్లు పలికిరి.

*కృత్తికలిట్లు పలికిరి -*

ఓ దయాసముద్రా ! నీవు నిర్దయుడవై మమ్ములను విడచి వెళ్లుచున్నావు. పెంచిన తల్లులను ఈ తీరున కుమారుడు విడిచి వెళ్లుట ధర్మము కాదు. నిన్ను మేము ప్రేమతో పెంచినాము గనుక, ధర్మము ప్రకారంగా నీవు మా కుమారుడవు: మేము ఏమి చేయుదుము? ఎచటకు వెళ్లెదము?  ఇట్లు పలికి ఆ కృత్తికలందరు కార్తికుని గుండెలకు హత్తుకొని కుమారుని వియోగము కారణంగా వెంటనే మూర్ఛిల్లిరి.

ఓ మునీ! కుమారుడు వారికి అద్యాత్మ వచనములను బోధించి, వారిని దోడ్కొని శివగణములతో బాటు రథము నధిష్ఠించెను. కుమారుడు శివగణములతో బాటు అనేక సుఖకరములగు మంగళములను చూస్తూ, వింటూ, తండ్రి యొక్క మందిరమునకు వెళ్లెను. కుమారుడు మనో వేగముతో పయనింప సమర్ధమగు రథముపై నందీశ్వరునితో గూడి అక్షయవట వృక్ష మూలము నందు గలకైలాసమును చేరెను. అనేక లీలలను ప్రదర్శించుటలో సమర్ధుడగు ఆ శివ పుత్రుడైన కుమారుడు కృత్తికలతో, శివగణములతో కూడి ఆనందముగా అచట ఉండెను

అపుడు దేవతాగణములు, ఋషులు, సిద్ధులు, చారణులు అందరు విష్ణువుతో బ్రహ్మతో గూడి కుమారుని రాకను శివునకు చెప్పిరి. అపుడు గొప్ప హర్షముతో గూడిన శివుడు విష్ణు బ్రహ్మలతో, దేవతలతో, ఋషులతో మరియు ఇతరులతో కలిసి కుమారుని చూచివెళ్లెను. అనేక శంఖములు, భేరీలు, తూర్యములు వివిధరీతులలో మ్రోగింపబడినవి. ఆనందముతో నిండిన మనస్సులు గల దేవతలు గొప్ప ఉత్పవమును చేసిరి. అదే సమయములో వీరభద్రుడు మొదలగు గణములన్నియూ ఆడుతూ పాడుతూ అనేక తాళములను వాయించుచూ శివుని వెనుక నడచిరి.

సంతసించిన మనస్సులు గలవారు, ఇతరులచే స్తుతింపబడుచున్నవారు అగు శివగణములు జయశబ్దములను, నమశ్శబ్దములను పలుకకుతూ శివుని గుణములను కీర్తిస్తూస్తుతించిరి. సర్వశ్రేష్టుడు, రెల్లుగడ్డి యందు పుట్టినవాడు అగు ఆ శివపుత్రుని చూచుటకు వారు వెళ్లిరి. పార్వతి నగరమంతటా రాజమార్గమును పద్మరాగము మొదలగు మణులచే అలంకరింపజేసి, సుందరముగా మంగళకరముగా చేసెను. ఆమె భర్త, పుత్రులు గల పతివ్రతలగు స్త్రీలతో కూడియున్నదై, లక్ష్మి మొదలగు ముప్పది దేవీమూర్తులు ఎదుట నడువగా విచ్చేసెను.

శివుని ఆజ్ఞచే రంభ మొదలగు అప్సరసలు దివ్యవేషములను ధరించి నవ్వుతూ పాడుతూ నర్తించిరి. శంకరునితో పోల్చదగిన గంగా పుత్రుడగు కుమారుని చూచినవారందరు ముల్లోకములలో వ్యాపించు చున్న గొప్ప తేజస్సును చూచిరి. అట్టి తేజస్సుచే చుట్టు వారబడి యున్నవాడు, బాలుడు, పుటము పెట్టిన బంగారము వంటి కాంతి గలవాడు, సూర్యునితో సమమగు వర్చస్సు గలవాడు అగు కుమారునకు అందరు వెంటనే నమస్కరించిరి. వారు అతని ఎడమవైపున, కుడివైపున చేరి శిరస్సులను వంచి నమస్కరిస్తూ నమశ్శబ్దమును పలుకుతూ నిలబడిన వారై హర్షమును పొందిరి.

నేను, విష్ణువు, ఇంద్రుడు, మరియు సర్వదేవతలు కుమారుని చుట్టు ముట్టి భూమిపై దండమువలె సాష్టాంగ ప్రణామమును చేసితిమి. ఇంతలో శివుడు, మహానందముతో నున్న పార్వతియు కలిసి మహోత్సవపురస్సరముగా విచ్చేసి ఆనందముతో కుమారుని చూచిరి. జగత్తునకు ఏకైక బంధువు, ప్రేమ స్వరూపుడు, పాములే అలంకారముగా గలవాడు, పరమాత్మ అగు శివుడు పరాభట్టారికయగు భవానితో గూడి పుత్రుని గాంచి చాల ఆనందించెను. అపుడు శక్తిని ధరించి యున్న స్కందుడు ఆ పార్వతీ పరమేశ్వరులను చూచి రథము నుండి వెను వెంటనే క్రిందకు దిగి శిరస్సు వంచి నమస్కరించెను.

మంగళకరుడు, పరమేశ్వరుడు, స్నేహ స్వరూపుడు అగు శివుడు ప్రసన్నుడై ప్రేమతో కుమారుని కౌగిలించు కొని శిరస్సుపై ముద్ధిడెను. మిక్కిలి తొందరతో కూడిన పార్వతి గుహుని కౌగిలించుకొని ప్రేమతో నిండిన హృదయము గలదైస్తన్యము నిచ్చెను. అపుడు దేవతలు భార్యలతో గూడి ఆనందముతో నీరాజనమిచ్చిరి. ఆకాశము జయఘోషతో నిండి పోయెను. ఋషులు వేదధ్వనితో, గాయకులు గానము చేయుచూ అనేకులు వాద్యములతో కుమారుని వద్దకు విచ్చేసిరి.

భవానీ పతియగు మహేశ్వరుడు అపుడు దివ్యకాంతులతోవెలు గొందు చున్న కుమారుని తన తొడపై కూర్చుండ బెట్టుకొనెను. కుమారుడు కూర్చుండుటచే సాక్షాత్తు శివుడు శోభను పొంది పుత్రుడు గలవారిలో శ్రేష్ఠుడాయెను. మహాసుఖమును పొందిన కుమారుడు శివుని ఆజ్ఞచే మహోత్సాహ వంతులగు తన గణములతో మరియు దేవతలతో గూడి శివుని మందిరమునకు విచ్చేసెను. దేవతోత్తములు చుట్టు వారియుండగా, ఋషులు నమస్కరించు చుండగా ఒక్కచోటనున్న ఆ ఇద్దరు దంపతులు అపుడెంతయో ప్రకాశించిరి. కుమారుడు శివుని ఒడిలో ఆనందముతో నాడు కొనెను. శివుని కంఠము నందున్న వాసుకిని చేతులతో పీడించెను.

దయానిధియగు శంభుడు దయా దృష్టితో బాలుని చూచి నవ్వి గిరిజతో ఆ విషయమును చెప్పెను. శివుడు లీలచేత ఆ ఆకారమును ధరించెను. అపుడు పార్వతీ సమేతుడు, జగత్తునకు ఏకైక బంధువు, సర్వవ్యాపి, ముల్లోకములకు ఏకైక ప్రభుడు అగు మహేశ్వర భగవానుడు మహానందమును పొంది చిరునవ్వులను వెదజల్లెను. ప్రేమచే కంఠము బొంగురుపోవుట వలన ఆయన ఏమియూ మాటలాడలేదు. అపుడు జగన్నాధుడగు శంభుడు లోకాచారము ననుసరించి ఆనందమయుతో కార్తికుని సుందరమగు రత్నసింహాసనముపై కూర్చుండబెట్టెను. సర్వతీర్థముల జలములు రత్నములు పొదిగిన వంద ఘటములలో నుండెను. వేదమంత్రములచే పవిత్రములైన ఆ జలములతో శివుడు ఆనందముతో కుమారుని అభిషేకించెను.

మిక్కిలి శ్రేష్ఠమగు రత్నములతో అలంకరింపబడిన కిరీటమును, అంగదములను, వైజయంతీ మాలను, మరియు చక్రమును విష్ణువు ఆతనికి ఇచ్చెను. శివుడు శూలమును, పినాకమనే ధనస్సును, పరశువును, శక్తిని, పాశుపత సంహారాస్త్రములను, పరమవిద్యను అతనికి ఇచ్చెను. నేను యజ్ఞ సూత్రమును, వేదములను, వేదమాతను, కమండలమును, బ్రహ్మాస్త్రములను మరియు శత్రు సంహార విద్యను ఇచ్చితిని.

ఇంద్రుడు ఐరావతమును మరియు వజ్రమును అతనికి ఇచ్చెను. వరుణుడు తెల్లని గొడుగును, రత్నమాలను ఇచ్చెను. సూర్యుడు మనోవేగముతో పరుగెత్తే రథమును, గొప్ప శక్తిగల కవచమును, యముడు యమదండమును, చంద్రుడు అమృతకలశమును ఇచ్చెను. అగ్ని తన కుమారునకు ప్రేమతో మహాశక్తిని ఇచ్చెను. నిర్‌ఋతి తన శస్త్రమును, వాయువు వాయవ్యాస్త్రమును ఇచ్చెను. కుబేరుడు గదను, ఈశుడు శూలమును ఇచ్చెను. దేవతలందరు అనేక శస్త్రాస్త్రములను ప్రీతితో నిచ్చిరి.

తరువాత కామదేవుడు అతనికి కామాస్త్రమును, గదను, తన విద్యలను పరమానందముతో నిచ్చెను. క్షీరసముద్రుడు అమూల్యములగు రత్నములను గొప్ప రత్ననూపురమును, హిమవంతుడు దివ్యములగు అలంకారములను, వస్త్రములను , గరుడుడు చిత్ర బర్హణడను పేరు గల తన కుమారుని ఇచ్చిరి. పాదములే ఆయుధములుగా గలవాడు, బలశాలి అగు తామ్రచూడుడను పేరుగల వానిని అరుణుడు ఇచ్చెను. మహానందముతో నవ్వుచున్న పార్వతి అతనికి పరమైశ్వర్యమును, చిరంజీవి త్వమును ప్రీతితో నిచ్చెను.

లక్ష్మి దివ్యసంపదను, రమణీయమగు గొప్పహారమును, సావిత్రి సంపూర్ణసిద్ధ విద్యను ఆనందముతో నిచ్చిరి. ఓ మునీ ! అచటకు వచ్చిన ఇతరదేవీ మూర్తులు, అతడు శిశువుగా నుండగా పాలించిన కృత్తికలు తమకు ప్రియమగు వస్తువులను అతనికి ఇచ్చిరి. ఓ మహర్షీ! అచట గొప్ప ఉత్సవము జరిగెను. అందరు ప్రసన్నులైరి. పార్వతీ పరమేశ్వరులు విశేషముగా సంతోషంచిరి. ఆ సమయములో ప్రతాపశాలి, తేజశ్శాలి అగు రుద్రుడు ఆనందముతో నవ్వి బ్రహ్మ మొదలగు దేవతలతో నిట్లనెను.

*శివుడిట్లు పలికెను -*

ఓ హరీ ! బ్రహ్మా ! దేవతలారా ! మీరందరు నా మాటను వినుడు. నేను అన్ని విధములుగా ప్రసన్నుడనైతిని. మీకు నచ్చిన వరములను కోరుకొనుడు.

*బ్రహ్మ ఇట్లు పలికెను -*

ఓ మునీ ! విష్ణువు మొదలగు దేవతలందరు ఆ శంభుని వచనమును విని ప్రసన్నమగు ముఖము గలవారై ప్రభువగు పశుపతి దేవునితో నిట్లనిరి. ఓ ప్రభూ! ఈ కుమారుని చేతిలో తారకుడు సంహరింబడ గలడు. ఈ ఉత్తమ చరిత్రము అందుకొరకు మాత్రమే ఘటిల్లినది. కావున తారకుని సంహరించుటకు సన్నద్ధులమై ఈనాడే బయలుదేరెదము. కుమారునకు అనుమతినిమ్ము. ఆతడు వానిని వధించి మాకు సుఖమును కలుగజేయుగాక!.

అటులనే అని అంగీకరించి ఆ విభుడు అపుడు దయతో నిండిన హృదయము గలవాడై, తారకాసుర సంహారము కొరకు కుమారుని దేవతలకు అప్పగించెను. విష్ణువు బ్రహ్మ మొదలగు దేవతలందరు అపుడు శివుని అనుమతిని పొంది గుహుని ముందిడుకొనివెంటనే కైలాసము నుండి బయలు దేరిరి. శివుని శాసనముచే విశ్వకర్మ కైలాసమునుండి బయటకు వచ్చి ఆ పర్వతమునకు సమీపములో సుందరము, అద్భుతము అగు నగరమును నిర్మించెను. దానిలో సుందరము, దివ్యము, అద్భుతము, గొప్ప ప్రకాశము గలది అగు గృహమును గుహుని కొరకు నిర్మించెను. విశ్వకర్మ ఆ గృహములో గొప్ప సింహాసనమును నిర్మించెను.

అపుడు బుధ్ధిశాలియగు హరి దేవతలచే సర్వతీర్థముల జలములతో కార్తికునకు భక్తితో మంగళాభిషేకమును చేయించెను. కార్తికుని అన్ని విధములగా అలంకరించి ప్రత్యేకముగా సంపాదించిన వస్త్రములను ధరింపజేసి ఆనందముతో ఉత్సవమును యథావిధిగా చుయించెను. విష్ణువు అతనికి ఆనందముతో బ్రహ్మాండాధిపత్యము నిచ్చి, తిలకము దిద్ది, దేవతలతో కలిసి పూజించెను.

అతడు దేవతలతో, ఋషులతో గూడి, శివస్వరూపుడు, సనాతనుడు అగు కార్తికుని అనేక స్తోత్రములతో ప్రీతి పూర్వకముగా స్తుతించెను. గొప్ప సింహాసనము నందున్న వాడు, బ్రహ్మాండమునకంతకు ప్రభువు, రక్షకుడు అగు కార్తికుడు మిక్కిలి ప్రకాశించెను.


*శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు కుమారఖండలో కుమారాభిషేకమనే అయుదవ అధ్యాయము ముగిసినది.*

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Papa's proud May 13, 2021

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 4 शेयर
nisha May 13, 2021

+7 प्रतिक्रिया 1 कॉमेंट्स • 1 शेयर
Radhe Krishna May 13, 2021

+73 प्रतिक्रिया 15 कॉमेंट्स • 32 शेयर
Malti Bansal May 13, 2021

+31 प्रतिक्रिया 1 कॉमेंट्स • 14 शेयर
Dolly Rawal May 13, 2021

+8 प्रतिक्रिया 1 कॉमेंट्स • 7 शेयर
Mamta Chauhan May 13, 2021

+148 प्रतिक्रिया 53 कॉमेंट्स • 65 शेयर
sanjay Awasthi May 13, 2021

+156 प्रतिक्रिया 24 कॉमेंट्स • 96 शेयर

+74 प्रतिक्रिया 7 कॉमेंट्स • 12 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB