_*శ్రీ శివ మహాపురాణం - 140 వ అధ్యాయం*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *పెండ్లి వారి భోజనములు* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ *బ్రహ్మఇట్లు పలికెను -* కుమారా ! అపుడు మహాభాగ్యవంతుడు, పర్వతరాజు, విద్వాంసుడునగు హిమవంతుడు భోజనము కొరకు ప్రాంగణమును ఏర్పాటు చేసెను. ఆయన దానిని తుడిపించి, చక్కగా సుగంధ ద్రవ్యములను చల్లించి, అనేక వస్తువులచే శ్రద్ధగా అలంకరింపజేసెను. అపుడు హిమవంతుడు దేవలనందరినీ, ఇతరులను, ఈశ్వరుని, తన కుమారులగు పర్వతుల చేత, మరియు ఇతరులచేత ఆహ్వానింప జేసెను. ఓ మునీ ! ఆ ప్రభుడు పర్వతుని ఆహ్వానమును విని అచ్యుతునితో గూడి, దేవతలు మొదలగు వారందరితో కలిసి ఆనందముతో ఆచటకు భోజనము కొరకై వెళ్లెను. హిమవంతుడు శివుని ఇతరులనందరిని యథావిధిగా మంచిగా సత్కరించి ఇంటి లోపల మంచి పీటలపై ఆనందముతో కూర్చుండబెట్టెను. అనేక మధుర పదార్థములను వడ్డించిన తరువాత ఆయన సమ్మానపూర్వకముగా చేతులు జోడించి భోజనమునకు అనుమతినిచ్చెను. అపుడచట సన్మానింపబడిన విష్ణువు మొదలగు దేవతలందరు సదాశివుని ముందిడుకొని భోజనము చేసిరి (7). అపుడు వారందరు ఒకే సారి అంతటా వరుసలో వేర్వేరుగా కూర్చుండి నవ్వుతూ భుజించిరి. మహాత్ములగు నంది, భృంగి, వీర భద్రుడు, వారి గణములు కుతూహలముతో గూడిన వారై వేర్వేరుగా భుజించిరి. ఇంద్రాది దేవతలు, మహాత్ములగు లోకపాలకులు వివిధ శోభలతో గూడిన వారై అనేక హాస్యోక్తులను పలుకుతూ భుజించిరి. మునులు, విప్రులు, భృగువు మొదలగు ఋషులు అందరు వేర్వేరు పంక్తులలో కూర్చుండి ప్రీతితో భుజించిరి. చండీ గణములందరూ కుతూహలమునకు కలిగించువారై అనేక హాస్యవచనములను పలుకుతూ ఆనందముతో పళ్లెరముల యందు భుజించిరి. విష్ణువు మొదలగు వారందరు ఈ తీరున ఆనందముగా భుజించి నీటిని త్రాగి ప్రీతితో విశ్రమించుట కొరకై తమ తమ నివాసములకు వెళ్లిరి. మేన యొక్క ఆజ్ఞచే సాధ్వీమణులు శివుని భక్తితో ప్రార్థించి పరమోత్సవముతో కూడియున్న గృహమునందు నివసింప జేసిరి. శంభుడు మేనచే ఈయబడిన మనోహరమగు రత్న సింహాసనమునందు కూర్చుండి ఆనందముతో వాసగృహమును పరికించెను. మెరిసి పోయే అనేక రత్న దీపములతో శోభిల్లునది, రత్నములు పొదిగిన పాత్రలతో ఘటములతో కూడియున్నది, ముత్యములతో మణులతో విరాజిల్లునది అగు మందిరమును చూచెను. రత్నపుటద్దముల శోభతో విరాజిల్లునది, తెల్లని చామరములతో అలంకరింపబడినది, ముత్యముల మణుల మాలలతో అలంకరింపబడినది, మహాసంపదలతో కూడియున్నది , సాటిలేనిది, మహా దివ్యమైనది, రంగు రంగులది, మిక్కిలి మనోహరమైనది, చిత్తమునకు ఆహ్లాదమును కలిగించునది, నేలపై వివిధ రచనల శోభ గలది , శివుడు ఇచ్చిన వర ప్రభావము వలననే నిర్మాణమైనది, శివలోకమను నామధేయము గలది , అనేక సుగంధ ద్రవ్యములచే పరిమిళ భరతమైనది, చందనము, అగరులతో కూడినది, పుష్పశయ్యలతో కూడియున్నది అగు గృహమును చూచెను. అనేక చిత్ర విచిత్రములతో ప్రకాశించునది, విశ్వకర్మచే నిర్మింపబడినది, శ్రేష్ఠ రత్నములతో తయారైన శ్రేష్ఠ హారములతో అలంకరింపబడినది అగు గృహమును చూచెను. ఆ గృహములో ఒకచోట దేవతలచే నిర్మింపబడిన మిక్కిలి అందమగు వైకుంఠము, మరియు బ్రహ్మలోకము, మరియొక చోట లోకపాలకుల నగరము , ఒకచోట రమ్యమగు కైలాసము, మరియొక చోట ఇంద్ర భవనము, వీటన్నిటిపై విరాజల్లే శివలోకము రచింపబడి యుండెను. అందరిచే ఆశ్చర్యముతో చూడబడే ఇట్టి గృహమును చూచి మహేశ్వరుడు హిమవంతుని ప్రశంసించి సంతుష్టుడాయెను. ఆ భవనములో ఉత్తమము అతిరమణీయము అగు రత్నపర్యంకముపై పరమేశ్వరుడు ఆనందముతో కూడిన వాడై లీలగా శయనించెను. హిమవంతుడు తన సోదరులను, ఇతరులను చక్కని మృష్టాన్నముతో ఆనందింపజేసి ఇతర కృత్యములను కూడ చేసెను. హిమవంతుడు ఇట్లు కార్యమగ్నుడై యుండగా, ప్రియతముడగు ఈశ్వరుడు నిద్రించుచుండగా, రాత్రి గడచిపోయి, ప్రాతఃకాలమయ్యెను. అపుడా ప్రభాత సమయములో జనులు ధైర్యోత్సాహములతో నిండినవారై అనేక రకముల వాద్యములను మ్రోయించిరి. విష్ణువు మొదలగు దేవతలందరు ఆనందముతో నిద్రలేచి తమ ఇష్టదైవమగు ఈశ్వరుని స్మరించి తొందరగా సంసిద్ధులైరి. వారు కైలాసమునకు వెళ్లుటకై ఉత్సుకత గలవారై తమ వాహనములను సిద్ధము చేసుకొని ధర్ముని శివుని వద్దకు పంపిరి. యోగి యగు ధర్ముడు అపుడు వాసగృహమునకు వచ్చి నారాయణుని ఆజ్ఞచే యోగిశ్రేష్ఠుడగు శివునితో సమయానురూపముగా నిట్లు పలికెను. *బ్రహ్మ ఇట్లు పలికెను -* ధర్ముని ఈ మాటలను విని మహేశ్వరుడు నవ్వి, దయా దృష్టితో చూచి శయ్యను వీడెను. 'ఓ ధర్మా! నీవు ముందు అచటకు వెళ్లుము. నేను కూడా శీఘ్రమే రాగలను. సందేహము వలదు' అని ఆయన నవ్వి పలికెను. శంకరుడిట్లు పలుకగా ఆతడు జనుల నివాసమునకు వెళ్లెను. శంభు ప్రభుడు కూడా అచటకు స్వయముగా వెళ్లవలెనని తలంచెను. ఆ విషయము తెలిసి స్త్రీలందరు అచటకు గొప్ప ఉత్సాహముతో వచ్చిరి. వారు శంభుని పాద ద్వయమును చూచుచూ మంగళ గానములను పాడిరి. అపుడు శంభుడు లోకాచారమునను సరించి ప్రాతః కృత్యములను పూర్తి చేసుకొని మేనా హిమవంతుల అనుమతిని తీసుకొని జనావాసమునకు వెళ్లెను. ఓ మునీ! అపుడు మహోత్సవమారంభమాయెను. వేదధ్వని మొదలాయెను. జనులు నాల్గు విధముల వాద్యములను మ్రోగించిరి. శంభుడు అపుడు తన స్థానమునకు వచ్చి లోకాచారముననుసరించి మునులను, విష్ణువును, నన్ను నమస్కరించెను. దేవతలు మొదలగు వారు ఆయనకు నమస్కరించిరి. తరువాత జయధ్వానములు, సమశ్శబ్దములు, శుభకరమగు వేదధ్వని కలిసి పెద్ద కోలాహలము ప్రవర్తిల్లెను. *శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు పార్వతీఖండలో పెళ్లివారి భోజనమును వర్ణించే ఏబది రెండవ అధ్యాయము ముగిసినది.*

_*శ్రీ శివ మహాపురాణం - 140 వ అధ్యాయం*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*పెండ్లి వారి భోజనములు*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*బ్రహ్మఇట్లు పలికెను -*

కుమారా ! అపుడు మహాభాగ్యవంతుడు, పర్వతరాజు, విద్వాంసుడునగు హిమవంతుడు భోజనము కొరకు ప్రాంగణమును ఏర్పాటు చేసెను. ఆయన దానిని తుడిపించి, చక్కగా సుగంధ ద్రవ్యములను చల్లించి, అనేక వస్తువులచే శ్రద్ధగా అలంకరింపజేసెను. అపుడు హిమవంతుడు దేవలనందరినీ, ఇతరులను, ఈశ్వరుని, తన కుమారులగు పర్వతుల చేత, మరియు ఇతరులచేత ఆహ్వానింప జేసెను. ఓ మునీ ! ఆ ప్రభుడు పర్వతుని ఆహ్వానమును విని అచ్యుతునితో గూడి, దేవతలు మొదలగు వారందరితో కలిసి ఆనందముతో ఆచటకు భోజనము కొరకై వెళ్లెను.

హిమవంతుడు శివుని ఇతరులనందరిని యథావిధిగా మంచిగా సత్కరించి ఇంటి లోపల మంచి పీటలపై ఆనందముతో కూర్చుండబెట్టెను. అనేక మధుర పదార్థములను వడ్డించిన తరువాత ఆయన సమ్మానపూర్వకముగా చేతులు జోడించి భోజనమునకు అనుమతినిచ్చెను. అపుడచట సన్మానింపబడిన విష్ణువు మొదలగు దేవతలందరు సదాశివుని ముందిడుకొని భోజనము చేసిరి (7). అపుడు వారందరు ఒకే సారి అంతటా వరుసలో వేర్వేరుగా కూర్చుండి నవ్వుతూ భుజించిరి.

మహాత్ములగు నంది, భృంగి, వీర భద్రుడు, వారి గణములు కుతూహలముతో గూడిన వారై వేర్వేరుగా భుజించిరి. ఇంద్రాది దేవతలు, మహాత్ములగు లోకపాలకులు వివిధ శోభలతో గూడిన వారై అనేక హాస్యోక్తులను పలుకుతూ భుజించిరి. మునులు, విప్రులు, భృగువు మొదలగు ఋషులు అందరు వేర్వేరు పంక్తులలో కూర్చుండి ప్రీతితో భుజించిరి. చండీ గణములందరూ కుతూహలమునకు కలిగించువారై అనేక హాస్యవచనములను పలుకుతూ ఆనందముతో పళ్లెరముల యందు భుజించిరి.

విష్ణువు మొదలగు వారందరు ఈ తీరున ఆనందముగా భుజించి నీటిని త్రాగి ప్రీతితో విశ్రమించుట కొరకై తమ తమ నివాసములకు వెళ్లిరి.  మేన యొక్క ఆజ్ఞచే సాధ్వీమణులు శివుని భక్తితో ప్రార్థించి పరమోత్సవముతో కూడియున్న గృహమునందు నివసింప జేసిరి. శంభుడు మేనచే ఈయబడిన మనోహరమగు రత్న సింహాసనమునందు కూర్చుండి ఆనందముతో వాసగృహమును పరికించెను. మెరిసి పోయే అనేక రత్న దీపములతో శోభిల్లునది, రత్నములు పొదిగిన పాత్రలతో ఘటములతో కూడియున్నది, ముత్యములతో మణులతో విరాజిల్లునది అగు మందిరమును చూచెను.

రత్నపుటద్దముల శోభతో విరాజిల్లునది, తెల్లని చామరములతో అలంకరింపబడినది, ముత్యముల మణుల మాలలతో అలంకరింపబడినది, మహాసంపదలతో కూడియున్నది , సాటిలేనిది, మహా దివ్యమైనది, రంగు రంగులది, మిక్కిలి మనోహరమైనది, చిత్తమునకు ఆహ్లాదమును కలిగించునది, నేలపై వివిధ రచనల శోభ గలది , శివుడు ఇచ్చిన వర ప్రభావము వలననే నిర్మాణమైనది, శివలోకమను నామధేయము గలది , అనేక సుగంధ ద్రవ్యములచే పరిమిళ భరతమైనది, చందనము, అగరులతో కూడినది, పుష్పశయ్యలతో కూడియున్నది అగు గృహమును చూచెను.

అనేక చిత్ర విచిత్రములతో ప్రకాశించునది, విశ్వకర్మచే నిర్మింపబడినది, శ్రేష్ఠ రత్నములతో తయారైన శ్రేష్ఠ హారములతో అలంకరింపబడినది  అగు గృహమును చూచెను. ఆ గృహములో ఒకచోట దేవతలచే నిర్మింపబడిన మిక్కిలి అందమగు వైకుంఠము, మరియు బ్రహ్మలోకము, మరియొక చోట లోకపాలకుల నగరము , ఒకచోట రమ్యమగు కైలాసము, మరియొక చోట ఇంద్ర భవనము, వీటన్నిటిపై విరాజల్లే శివలోకము రచింపబడి యుండెను. అందరిచే ఆశ్చర్యముతో చూడబడే ఇట్టి గృహమును చూచి మహేశ్వరుడు హిమవంతుని ప్రశంసించి సంతుష్టుడాయెను.

ఆ భవనములో ఉత్తమము అతిరమణీయము అగు రత్నపర్యంకముపై పరమేశ్వరుడు ఆనందముతో కూడిన వాడై లీలగా శయనించెను. హిమవంతుడు తన సోదరులను, ఇతరులను చక్కని మృష్టాన్నముతో ఆనందింపజేసి ఇతర కృత్యములను కూడ చేసెను. హిమవంతుడు ఇట్లు కార్యమగ్నుడై యుండగా, ప్రియతముడగు ఈశ్వరుడు నిద్రించుచుండగా, రాత్రి గడచిపోయి, ప్రాతఃకాలమయ్యెను. అపుడా ప్రభాత సమయములో జనులు ధైర్యోత్సాహములతో నిండినవారై అనేక రకముల వాద్యములను మ్రోయించిరి.

విష్ణువు మొదలగు దేవతలందరు ఆనందముతో నిద్రలేచి తమ ఇష్టదైవమగు ఈశ్వరుని స్మరించి తొందరగా సంసిద్ధులైరి. వారు కైలాసమునకు వెళ్లుటకై ఉత్సుకత గలవారై తమ వాహనములను సిద్ధము చేసుకొని ధర్ముని శివుని వద్దకు పంపిరి. యోగి యగు ధర్ముడు అపుడు వాసగృహమునకు వచ్చి నారాయణుని ఆజ్ఞచే యోగిశ్రేష్ఠుడగు శివునితో సమయానురూపముగా నిట్లు పలికెను.

*బ్రహ్మ ఇట్లు పలికెను -*

ధర్ముని ఈ మాటలను విని మహేశ్వరుడు నవ్వి, దయా దృష్టితో చూచి శయ్యను వీడెను. 'ఓ ధర్మా! నీవు ముందు అచటకు వెళ్లుము. నేను కూడా శీఘ్రమే రాగలను. సందేహము వలదు' అని ఆయన నవ్వి పలికెను. శంకరుడిట్లు పలుకగా ఆతడు జనుల నివాసమునకు వెళ్లెను. శంభు ప్రభుడు కూడా అచటకు స్వయముగా వెళ్లవలెనని తలంచెను. ఆ విషయము తెలిసి స్త్రీలందరు అచటకు గొప్ప ఉత్సాహముతో వచ్చిరి. వారు శంభుని పాద ద్వయమును చూచుచూ మంగళ గానములను పాడిరి.

అపుడు శంభుడు లోకాచారమునను సరించి ప్రాతః కృత్యములను పూర్తి చేసుకొని మేనా హిమవంతుల అనుమతిని తీసుకొని జనావాసమునకు వెళ్లెను. ఓ మునీ! అపుడు మహోత్సవమారంభమాయెను. వేదధ్వని మొదలాయెను. జనులు నాల్గు విధముల వాద్యములను మ్రోగించిరి. శంభుడు అపుడు తన స్థానమునకు వచ్చి లోకాచారముననుసరించి మునులను, విష్ణువును, నన్ను నమస్కరించెను. దేవతలు మొదలగు వారు ఆయనకు నమస్కరించిరి. తరువాత జయధ్వానములు, సమశ్శబ్దములు, శుభకరమగు వేదధ్వని కలిసి పెద్ద కోలాహలము ప్రవర్తిల్లెను.*శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు పార్వతీఖండలో పెళ్లివారి భోజనమును వర్ణించే ఏబది రెండవ అధ్యాయము ముగిసినది.*

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
deepak.goyal Apr 13, 2021

+18 प्रतिक्रिया 1 कॉमेंट्स • 12 शेयर
Ansouya M 🍁 Apr 13, 2021

🕉🙏🙏🙏🙏श्री गणेशाय नम ः🌷 🕉🙏🕉🕉🌷🌷जय श्री राधे कृष्ण 🙏🙏🕉 🌷🕉🌷🌷जय सिया राम 🌹🙏🌹 🌷🌷🌷🌷🕉🕉🕉जय बजरंगबली हनुमान 🙏 🌷🕉🙏🙏🌷🌷जय माता दी 🙏🌹 जय माता दी 🙏🌹 जय माता दी 🙏🌹 जय माता दी 🙏🌹 जय माता दी 🙏🌹 जय माता दी 🙏🌹 जय माता दी 🙏🌹 जय माता दी 🙏🌹 सर्व मंगल मागल्ये शिवे सर्वाथ साघिके शरणये त्रयमबके गौरी नारायणी नमोस्तुते 🙏🌷🙏🙏🌷🙏🙏🌷🙏🙏🙏🙏🙏🙏🙏हे जगदम्बिके आपकी जय हो।।🌷🙏🌷🌷🙏सम्पुर्ण प्राणियों की पीड़ा हरने वाली माता--मधु और कैटभ को मारने वाली तथा ब्रह्मा जी को वरदान देने वाली न माता आपको बारम्बार प्रनाम हो 🌷🙏🌷🕉 हे शैलपुत्रि कल्याणदात्रि मंगलकारिणी माता आप को बारम्बार प्रनाम है 🌷🕉🙏🌷🌷🙏🙏🌷🌷🌷सर्व मंगल मागल्ये शिवे सर्वाथ साघिके शरणये त्रयमबके गौरी नारायणी नमोस्तुते 🙏🌷🙏🙏🙏🙏सर्वस्वरूपे सर्वेशे सर्व शक्ति समन्विते ।। भयेभय्स्त्राहि नव देवी दुर्गे देवी नमोस्तुते 🌷🙏🌷🌷🌷🌷नवरातरों की पहली रात्रि पूजन की हार्दिक शुभकामनाएं आप सभी भक्ततों को जी 🌷🙏🌷🙏 शुभ संध्या मंगलमय हो 🙏🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🙏🙏🌷🌷🙏🌷

+84 प्रतिक्रिया 30 कॉमेंट्स • 8 शेयर
dhruv wadhwani Apr 13, 2021

+33 प्रतिक्रिया 10 कॉमेंट्स • 9 शेयर

+9 प्रतिक्रिया 1 कॉमेंट्स • 11 शेयर
Mohini 🙏 Apr 13, 2021

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Vishnujyotish Vishnu Apr 13, 2021

+1 प्रतिक्रिया 1 कॉमेंट्स • 0 शेयर

+54 प्रतिक्रिया 16 कॉमेंट्स • 94 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB