_*శ్రీ అగ్ని మహాపురాణం - 339 వ అధ్యాయం*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *శృంగారాది రసనిరూపణ* 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 *అగ్ని దేవుడు పలికెను.* అక్షరము, సనాతనము, జన్మ రహితము సర్వవ్యాప్తము పరబ్రహ్మ స్వరూపము, అద్వితీయము, జ్యోతి రూపము అగు ఏ చైతన్యము వేదాంతములలో చెప్పబడుచున్నదో దానికి ఆనందము సహజము. యది అపుడపుడు అభివ్యక్త మగును. ఈ అభివ్యక్తియే చమత్కారమనియు చెప్పబడును. దాని ప్రథమ వికారమునకు అహంకార మని పేరు. దాని నుండి అభిమానము పుట్టినది. ఈ భువనత్రయము ఈ అభిమానము నందే అంతర్గతమై యున్నది. అభిమానము నుండి రతి పుట్టును. యది వ్యభిచార్యాది భావసామాన్యముచే పరిపుష్టమై శృంగార మని చెప్పబడును. ఇతరమైన హాస్యాదులు ఈ శృంగార భేదములే. వాటికి ఆయా స్థాయీ భాములుండును. వాటి పరిపోషమే ఆ రసముల లక్షణము. సత్త్వాది గుణ సముదాయములు పరమాత్మ నుండి జనించును. రాగము నుండ శృంగారము తీక్‌ష్ణత్వము నుండి రౌద్రము, ఉత్సాహము నుండి వీరము, సంకోచము నుండి భీభత్సము పుట్టును. శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక భీభత్స అద్భుత శాంతములు తొమ్మిది రసములు. నాల్గు రసములు (శృంగార రౌద్ర వీర భీభత్సములు) సహజములు. త్యాగము లేని ధనము వలె, రసము లేని వాక్కు ప్రకాశించదు. అపారమైన కావ్య సంసారములో కవియే ప్రజాపతి. అతనికి ఈ సంసారము ఎట్లు ఇష్టమగునో అట్టి మార్పు చెందు చుండును. కవి శృంగారియైనచో కావ్య జగత్తు రసమయుమగును. అతడు రసహీనుడై నచో కావ్యము నీరస మగును. భావహీన మగు రసము, రస వర్ణితమగు భావము వుండవు. భావములు రసములను అభివ్యక్తము చేయను. ''భావ్యంతే రసాః ఏభిః'' యను వ్యుత్పత్తిచే భావములు చెప్పబడును. రతి మొదలగు స్థాయీ భావములు ఎనిమిది. స్తంబాదులు ఎనిమిది. మనస్సు కనుకూల మగు సుఖానుభవము రతి. హర్షాదులచే చిత్త వికాసము హాసము. చిత్రాది దర్శనము వలన కూడ హాసము కలుగును. చిత్తమునకు విక్లబత్వము భయ మని చెప్పుదురు. చెడ్డ వస్తుల నింద జుగుప్స. ఉత్కృష్ట మగు వస్తువులను చూచుటచే కలుగు చిత్త విస్తారము విస్మయము. స్తలబాదులగు ఎనిమిది భావములు సత్త్వము వల్ల కలుగును. రజ స్తమస్సులకు అతీతములు. భయరాగాదులచే కల్గిన చేష్టా విఘాతము స్తంభము. శ్రమరాగాదులతో కూడిన ఆంతర క్షోభముచే కలిగిన శరీర జలము స్వేదము. హర్షాదులచే దేహము పులకరించుట పులకోద్గమము. హర్షాది జన్య మగు వచన అస్పష్టత్వము స్వర భేదము. ఇష్ట క్షయాదులచే కలిగిన మనోవైక్లబ్యము శోకము. ప్రతికూలముగా ప్రవర్తించు వాని విషయమున తీక్‌ష్ణత్వము. క్రోధము పురుషార్థమును పూర్తి చేయుటకు యత్నము ఉత్సాహము. చిత్త క్షోభము కలిగిన ఉత్తంభము వేపథువు. విషాదాదుల వలన కాంతి కోల్పోవుట వైవర్ణ్యము. దుఃఖా నాందాదుల వలన కల్గిన నేత్ర జలము ఆశ్రువు లంఘనాదులచే ఇంద్రియములు పనిచేయ కుండుట ప్రళయము. వైరాగ్యాదులచే మనఃక్లేదము నిర్వేదము. మానసిక పీడాదుల వలన కలిగిన శరీర దౌర్బల్యము గ్లాని. అనిష్ట ప్రాప్తిని ఊహించుట శంక. మత్సరము అసూయ. మదిరాదుల ఉపయోగము వలన కలిగిన మానసిక మోహము మదము. ఎక్కువ పని చేయుటచే కలిగిన శరీర క్లాంతిశ్రమము. చిత్తమునకు శృంగారాది క్రియల యందు ద్వేషము ఆలస్యము. సత్త్వము నుండి తొలగుట దైన్యము. విషయములను గూర్చి ఆలోచించుట చింత. చేయదగిన ఉపాయము తెలియ జాలకుండుట మోహము. అనుభవించిన వస్తువును మరల ప్రతిబింబింప చేసుకొనుట స్మృతి. యథార్థ జ్ఞానము వలన విషయ నిర్ణయము మతి. అనురాగాదుల వలన కలిగిన ఒకానొక విధ మగు చేత స్సంకోచము వరడా. అస్థిరత్వము చపలతా. చిత్త ప్రసన్నతాహర్షము; ప్రతీకార వాంఛచే కలిగిన అంతః కరణ వైకల్యము ఆవేళము. కర్తవ్యము విషయము ఏమి తోచుకుండుట జడతా. అభీష్ట వస్తు ప్రాప్తిచే కలిగిన ఆనందము ధృతి. ఇతరుల యందు అనాదరమును, తన యందు ఉత్కర్ష భావన గర్వము. అభీష్ట వస్తువు యందు దైవాది విఘాతము విషాదము. ఈప్సిత సిద్ధికొరకై చంచలమైన మానసిక స్థితి ఔత్సుక్యము. చిత్తేంద్రియాదులు పనిచేయ కుండుట అపస్మారము. యుద్ధము లందు బాధాదుల వలన స్థిరముగ వుండ జాలక పోవుట త్రాజము చిత్త చమత్కారము వీప్ప. క్రోదము శమించకుండుట అమర్షము. చేతన హృదయము ప్రబోధము. ఇంగితాకారములను దాచుకొనుట అవహిత్థము. గురువుల విషయమున కోపముచే వాక్పారుష్యదండ పారుషయములు ఉగ్రత, ఊహ వితర్కము. మనస్సు శరీరము సరిగా వుండకపోవుట వ్యాధికామాదులచే అసంబద్ధ ప్రలాపము ఉన్మాదము. తత్త్వ జ్ఞానాదులచే చిత్తమాలిన్యము తొలగుట శమము. కావ్యాదులందు కవులు భావములను రసములను కూర్చవలెను. దేనిచే రత్యాదులు విభావితములగునో యది విభావము. విభావ్యతేయేన యని విగ్రహము. ఆలంబనము ఉద్దీపనము యని యది రెండు విధములు. ఈ రత్యాది భావర్గము దేనిని ఆధారముగా తీసుకుని పుట్టునో అది ఆలంబన విభావము. ఇది నాయకాదులను ఆధారముగా చేసుకుని పుట్టును. ధీరోదాత్త దీరోద్ధత, ధీరలలిత, ధీర ప్రశాంతులని నాయకులు నాలుగు విధములు. అనుకూలుడు, దక్షిణుడు, శఠుడు, దృష్టుడు యని మరి నాలుగు విధములు. శృంగారమున నాయకునకు పీఠ మర్దుడు, విలుడు, విదూషకుడు యని ముగ్గురు ధర్మ సచివులుగా వుందురు. వీరు అనునాయకులు. పీఠమర్దుడు శ్రీమంతుడై నాయకుని వలె బలవంతుడై వుండును. విటుడు నాయకుని దేశమునకు చెందిన వాడై వుండును. నవ్వించువాడు విదూషకుడు. నాయకుని నాయికలు కూడ ఎనివిధములుగా వుందురు. స్వకీయ, పరకీయ, పునర్భూ యని కౌశికుడు చెప్పెను. మరికొందరు, పునర్భూరికి బదులుగ సామాన్యను అంగీకరింతురు. ఈ నాయికలలో చాలభేదము లున్నవి. ఉద్దీపన విభావములు వివిధ సంస్కార రూపముల నుండి ఆలంబన విభాము నందు భావోద్ధీపనము చేయును. కర్మదుల చేతను గీతకాదుల చేతను, చతుష్టష్టి కళలు ఆరు విధములు, సాధారణముగ కోకన్మృతులు హాసోపహాకారములు. ఉద్బుద్ధములు సంస్కృతములు యగు భావములచే ఇచ్ఛాద్వేష ప్రయత్నముల సంయోగములచే కలుగు మనోవాణి బుద్ధి శరీర కార్యములను విద్వజ్జనులు అనుభావములందురు. "సః ఆనుభూయతే" అత్ర యని కాని సః అనుభవతి యని కాని దీని నిర్వచనము. మానసిక వ్యాపారము అధికముగా నున్నది మానసికారంభము. పౌరుషముసై#్త్రణము యని యది రెండు విధములు. శోభా, విలాస, మాధుర్యస్థైర్య గాంభీర్య లలిత ఔదార్య తేజస్సులను ఎనిమిది పౌరుషములు నీచులనింద ఉత్తములతో స్పర్ధ శౌర్యము చాతుర్యము వీటిచేమను ధర్మమునందు శోభకలుగును. యిది ఇంటిలో శోభవంటిది. భావ, హావ, హేళా, శోభ, కాంతి దీప్తి, మాధుర్య, శౌర్య, పాగల్భ్య, ఉదారతా, స్థైర్య గంబీరతలు యను పండ్రెండు స్త్రీల విభావములు. విలాస హావములను భావమందురు. ఇది కొంచెము హర్షముచే పుట్టును. వాక్సంబంధము వాగారంభము వీనికి పండ్రెండు భేదములున్నవి. మాటలాడుట ఆలాపము, ఎక్కువ మాటలాడుట ప్రలాపము దుఃఖవచనము విలాపము. మాటిమాటికి చెప్పుట యనులాపము, ఉక్తిప్రత్యుక్తులు సల్లాపము. మరొక విధముగ చెప్పుట అపలాపము. వార్తను మోసికొని పోవుట సందేశము. ఒక విషయమును ప్రతిపాదించుట నిర్దేశము. తత్త్వమును చెప్పుట అతిదేశము. యన్యవర్ణనము అపదేశము; శిక్షా పూర్వ కవచనము ఉపదేశము; వ్యాజోక్తివ్యపదేశము. ఇతరులకు విషము బోధించుటకై ఉత్తమ బుద్దినాశ్రయించి వాగారంభము చేయవలెను. దానికి రీతి, వృత్తి ప్రవృతియని మూడు భేదములు. *శ్రీ అగ్నిమహాపురాణమున శృంగారాది రసనిరూపణమను మూడువందల ముప్పదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.*

_*శ్రీ అగ్ని మహాపురాణం - 339 వ అధ్యాయం*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*శృంగారాది రసనిరూపణ*


🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥


*అగ్ని దేవుడు పలికెను.* అక్షరము, సనాతనము, జన్మ రహితము సర్వవ్యాప్తము పరబ్రహ్మ స్వరూపము, అద్వితీయము, జ్యోతి రూపము అగు ఏ చైతన్యము వేదాంతములలో చెప్పబడుచున్నదో దానికి ఆనందము సహజము. యది అపుడపుడు అభివ్యక్త మగును. ఈ అభివ్యక్తియే చమత్కారమనియు చెప్పబడును. దాని ప్రథమ వికారమునకు అహంకార మని పేరు. దాని నుండి అభిమానము పుట్టినది. ఈ భువనత్రయము ఈ అభిమానము నందే అంతర్గతమై యున్నది. అభిమానము నుండి రతి పుట్టును. యది వ్యభిచార్యాది భావసామాన్యముచే పరిపుష్టమై శృంగార మని చెప్పబడును. ఇతరమైన హాస్యాదులు ఈ శృంగార భేదములే. వాటికి ఆయా స్థాయీ భాములుండును. వాటి పరిపోషమే ఆ రసముల లక్షణము.

సత్త్వాది గుణ సముదాయములు పరమాత్మ నుండి జనించును. రాగము నుండ శృంగారము తీక్‌ష్ణత్వము నుండి రౌద్రము, ఉత్సాహము నుండి వీరము, సంకోచము నుండి భీభత్సము పుట్టును. శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక భీభత్స అద్భుత శాంతములు తొమ్మిది రసములు. నాల్గు రసములు (శృంగార రౌద్ర వీర భీభత్సములు) సహజములు. త్యాగము లేని ధనము వలె, రసము లేని వాక్కు ప్రకాశించదు. అపారమైన కావ్య సంసారములో కవియే ప్రజాపతి. అతనికి ఈ సంసారము ఎట్లు ఇష్టమగునో అట్టి మార్పు చెందు చుండును. కవి శృంగారియైనచో కావ్య జగత్తు రసమయుమగును. అతడు రసహీనుడై నచో కావ్యము నీరస మగును. భావహీన మగు రసము, రస వర్ణితమగు భావము వుండవు. భావములు రసములను అభివ్యక్తము చేయను. ''భావ్యంతే రసాః ఏభిః'' యను వ్యుత్పత్తిచే భావములు చెప్పబడును. రతి మొదలగు స్థాయీ భావములు ఎనిమిది. స్తంబాదులు ఎనిమిది. మనస్సు కనుకూల మగు సుఖానుభవము రతి. హర్షాదులచే చిత్త వికాసము హాసము. చిత్రాది దర్శనము వలన కూడ హాసము కలుగును. చిత్తమునకు విక్లబత్వము భయ మని చెప్పుదురు. చెడ్డ వస్తుల నింద జుగుప్స. ఉత్కృష్ట మగు వస్తువులను చూచుటచే కలుగు చిత్త విస్తారము విస్మయము. స్తలబాదులగు ఎనిమిది భావములు సత్త్వము వల్ల కలుగును. రజ స్తమస్సులకు అతీతములు. భయరాగాదులచే కల్గిన చేష్టా విఘాతము స్తంభము. శ్రమరాగాదులతో కూడిన ఆంతర క్షోభముచే కలిగిన శరీర జలము స్వేదము. హర్షాదులచే దేహము పులకరించుట పులకోద్గమము. హర్షాది జన్య మగు వచన అస్పష్టత్వము స్వర భేదము. ఇష్ట క్షయాదులచే కలిగిన మనోవైక్లబ్యము శోకము. ప్రతికూలముగా ప్రవర్తించు వాని విషయమున తీక్‌ష్ణత్వము. క్రోధము పురుషార్థమును పూర్తి చేయుటకు యత్నము ఉత్సాహము. చిత్త క్షోభము కలిగిన ఉత్తంభము వేపథువు. విషాదాదుల వలన కాంతి కోల్పోవుట వైవర్ణ్యము. దుఃఖా నాందాదుల వలన కల్గిన నేత్ర జలము ఆశ్రువు లంఘనాదులచే ఇంద్రియములు పనిచేయ కుండుట ప్రళయము.

వైరాగ్యాదులచే మనఃక్లేదము నిర్వేదము. మానసిక పీడాదుల వలన కలిగిన శరీర దౌర్బల్యము గ్లాని. అనిష్ట ప్రాప్తిని ఊహించుట శంక. మత్సరము అసూయ. మదిరాదుల ఉపయోగము వలన కలిగిన మానసిక మోహము మదము. ఎక్కువ పని చేయుటచే కలిగిన శరీర క్లాంతిశ్రమము. చిత్తమునకు శృంగారాది క్రియల యందు ద్వేషము ఆలస్యము. సత్త్వము నుండి తొలగుట దైన్యము. విషయములను గూర్చి ఆలోచించుట చింత. చేయదగిన ఉపాయము తెలియ జాలకుండుట మోహము. అనుభవించిన వస్తువును మరల ప్రతిబింబింప చేసుకొనుట స్మృతి. యథార్థ జ్ఞానము వలన విషయ నిర్ణయము మతి. అనురాగాదుల వలన కలిగిన ఒకానొక విధ మగు చేత స్సంకోచము వరడా. అస్థిరత్వము చపలతా. చిత్త ప్రసన్నతాహర్షము; ప్రతీకార వాంఛచే కలిగిన అంతః కరణ వైకల్యము ఆవేళము. కర్తవ్యము విషయము ఏమి తోచుకుండుట జడతా. అభీష్ట వస్తు ప్రాప్తిచే కలిగిన ఆనందము ధృతి. ఇతరుల యందు అనాదరమును, తన యందు ఉత్కర్ష భావన గర్వము. అభీష్ట వస్తువు యందు దైవాది విఘాతము విషాదము. ఈప్సిత సిద్ధికొరకై చంచలమైన మానసిక స్థితి ఔత్సుక్యము. చిత్తేంద్రియాదులు పనిచేయ కుండుట అపస్మారము. యుద్ధము లందు బాధాదుల వలన స్థిరముగ వుండ జాలక పోవుట త్రాజము చిత్త చమత్కారము వీప్ప. క్రోదము శమించకుండుట అమర్షము. చేతన హృదయము ప్రబోధము. ఇంగితాకారములను దాచుకొనుట అవహిత్థము. గురువుల విషయమున కోపముచే వాక్పారుష్యదండ పారుషయములు ఉగ్రత, ఊహ వితర్కము. మనస్సు శరీరము సరిగా వుండకపోవుట వ్యాధికామాదులచే అసంబద్ధ ప్రలాపము ఉన్మాదము. తత్త్వ జ్ఞానాదులచే చిత్తమాలిన్యము తొలగుట శమము.

కావ్యాదులందు కవులు భావములను రసములను కూర్చవలెను. దేనిచే రత్యాదులు విభావితములగునో యది విభావము. విభావ్యతేయేన యని విగ్రహము. ఆలంబనము ఉద్దీపనము యని యది రెండు విధములు. ఈ రత్యాది భావర్గము దేనిని ఆధారముగా తీసుకుని పుట్టునో అది ఆలంబన విభావము. ఇది నాయకాదులను ఆధారముగా చేసుకుని పుట్టును. ధీరోదాత్త దీరోద్ధత, ధీరలలిత, ధీర ప్రశాంతులని నాయకులు నాలుగు విధములు. అనుకూలుడు, దక్షిణుడు, శఠుడు, దృష్టుడు యని మరి నాలుగు విధములు. శృంగారమున నాయకునకు పీఠ మర్దుడు, విలుడు, విదూషకుడు యని ముగ్గురు ధర్మ సచివులుగా వుందురు. వీరు అనునాయకులు. పీఠమర్దుడు శ్రీమంతుడై నాయకుని వలె బలవంతుడై వుండును. విటుడు నాయకుని దేశమునకు చెందిన వాడై వుండును. నవ్వించువాడు విదూషకుడు. నాయకుని నాయికలు కూడ ఎనివిధములుగా వుందురు. స్వకీయ, పరకీయ, పునర్భూ యని కౌశికుడు చెప్పెను. మరికొందరు, పునర్భూరికి బదులుగ సామాన్యను అంగీకరింతురు. ఈ నాయికలలో చాలభేదము లున్నవి. ఉద్దీపన విభావములు వివిధ సంస్కార రూపముల నుండి ఆలంబన విభాము నందు భావోద్ధీపనము చేయును. కర్మదుల చేతను గీతకాదుల చేతను, చతుష్టష్టి కళలు ఆరు విధములు, సాధారణముగ కోకన్మృతులు హాసోపహాకారములు. ఉద్బుద్ధములు సంస్కృతములు యగు భావములచే ఇచ్ఛాద్వేష ప్రయత్నముల సంయోగములచే కలుగు మనోవాణి బుద్ధి శరీర కార్యములను విద్వజ్జనులు అనుభావములందురు. "సః ఆనుభూయతే" అత్ర యని కాని సః అనుభవతి యని కాని దీని నిర్వచనము. మానసిక వ్యాపారము అధికముగా నున్నది మానసికారంభము. పౌరుషముసై#్త్రణము యని యది రెండు విధములు.

శోభా, విలాస, మాధుర్యస్థైర్య గాంభీర్య లలిత ఔదార్య తేజస్సులను ఎనిమిది పౌరుషములు నీచులనింద ఉత్తములతో స్పర్ధ శౌర్యము చాతుర్యము వీటిచేమను ధర్మమునందు శోభకలుగును. యిది ఇంటిలో శోభవంటిది. భావ, హావ, హేళా, శోభ, కాంతి దీప్తి, మాధుర్య, శౌర్య, పాగల్భ్య, ఉదారతా, స్థైర్య గంబీరతలు యను పండ్రెండు స్త్రీల విభావములు. విలాస హావములను భావమందురు. ఇది కొంచెము హర్షముచే పుట్టును. వాక్సంబంధము వాగారంభము వీనికి పండ్రెండు భేదములున్నవి. మాటలాడుట ఆలాపము, ఎక్కువ మాటలాడుట ప్రలాపము దుఃఖవచనము విలాపము. మాటిమాటికి చెప్పుట యనులాపము, ఉక్తిప్రత్యుక్తులు సల్లాపము. మరొక విధముగ చెప్పుట అపలాపము. వార్తను మోసికొని పోవుట సందేశము. ఒక విషయమును ప్రతిపాదించుట నిర్దేశము. తత్త్వమును చెప్పుట అతిదేశము. యన్యవర్ణనము అపదేశము; శిక్షా పూర్వ కవచనము ఉపదేశము; వ్యాజోక్తివ్యపదేశము. ఇతరులకు విషము బోధించుటకై ఉత్తమ బుద్దినాశ్రయించి వాగారంభము చేయవలెను. దానికి రీతి, వృత్తి ప్రవృతియని మూడు భేదములు.


*శ్రీ అగ్నిమహాపురాణమున శృంగారాది రసనిరూపణమను మూడువందల ముప్పదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.*

0 कॉमेंट्स • 0 शेयर
VarshaLohar May 7, 2021

+52 प्रतिक्रिया 17 कॉमेंट्स • 13 शेयर

⛳🙏🕉️🙏🥀🌹जय श्री राम राम राम जी सभी🔔माया मंदिर के 🔔🎪🔔आदरणीय भाई बहनों को शुभ दोपहर की🙏 राम राम जी राम राम 🙏सभी पर श्री सीताराम जी की कृपा दृष्टि बनी रहे 🙏मंगलकामनाएं शुभकामनाएं जी🙏😌 प्रार्थना हे राम जी हम सब आपके नादान नासमझ बच्चे हैं आप हम सबकी भूल-चूक को क्षमा🙏🏻 करके पूरी पृथ्वी 🌍 पर बस्सी दुनिया की🗾🌍☠️🌎🦠🌏🐛इस बढ़ती बीमारी महामारी कोरोना 👺👹☠️🦠🦠वायरससे सभी की 🙏रक्षा कीजिए जैसे आपने असुरों का संघार 🏹🏹👹किया था त्रेता युग में इस युग में आपके लाडले कलयुग में भी अमरता का वरदान पाने वाले श्री पवन पुत्र हनुमान जी को अपनी आज्ञा देकर इस अदृश्य वायरस ☠️ शक्ति से हम सबकी रक्षा करवाइए सुना है प्रभु जी यह बीमारी हवा में गुल 🌬️🌀🌪️रही है😇 पवन पुत्र हनुमान जी सबकी रक्षा करें इस महामारी को दूर भगाए होनी होकर रहती है इतना तो हम भी जानते हैं 🙏😌परमपिता परमात्मा जी भक्त और भगवान का विश्वास आपस में एक दूसरे से टूटे🙏ना बस इतनी कृपा दृष्टि सभी सनातन धर्म प्रेमियों पर बनाए🙏😟 🙂रखना 🙏जय हो ज्ञान ✍️ की देवी गायत्री माता जी जय गुरु🙏 ओम भूर्भुव स्व तत्सवितुर्वरेंयं भर्गो देवस्य धीमहि धियो योन प्रचोदयात् 🙏जय श्री राम जय हो वीर बजरंगी हनुमान जी की सदा ही जय हो🙌🌹🌹🕉️🌹🌹⛳⛳⛳

+19 प्रतिक्रिया 3 कॉमेंट्स • 5 शेयर
Mamta Chauhan May 7, 2021

+79 प्रतिक्रिया 18 कॉमेंट्स • 31 शेयर

+5 प्रतिक्रिया 1 कॉमेंट्स • 0 शेयर
Meena Chorotiya May 7, 2021

+1 प्रतिक्रिया 1 कॉमेंट्स • 0 शेयर
malti jaiswal May 7, 2021

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Radhe rani May 7, 2021

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB