m v s murthy813 ql
m v s murthy813 ql Feb 23, 2021

+6 प्रतिक्रिया 1 कॉमेंट्स • 17 शेयर

कामेंट्स

Penubakam Feb 23, 2021
కోరన వచ్చిన పోతారు రాకున్నా పోతారు గోవిందా గోవిందా

Dvsraju Mar 4, 2021

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 7 शेयर
Dvsraju Mar 4, 2021

నిర్మలమైన మనస్సు పొందాలంటే - ఎలా సాధ్యం??? ప్రతీ ఒక్కరూ నిర్మలమైన మనస్సు కై కృషి చేస్తుంటాం. అంటే అన్నీ మంచి పనులే చేయాలి, అబద్ధాలు చెప్పకూడదు, ఎవరకీ హాని చేయకూడదు లాంటివి. కానీ ఒక్కసారి ఆలోచించిన ఆ ప్రయత్నంలో మనం ఎంతవరకూ సఫలమయ్యాం? ఎంత మంది సఫలీకృతులమయ్యాం? అంటే మాత్రం ఆ లెక్కకి మన చేతి వేళ్ళు సరిపోతాయేమో మరి కాదంటారా?... మనస్సనేది ఓ అద్భుతం, నిజానికి అది నిజంగా మన నియంత్రణలోనే ఉందా? మన మనస్సును మనం నియంత్రిస్తున్నామా లేదా మన మనస్సే మనల్ని నియంత్రిస్తుందా? నిజంగా ఆలోచించవల్సిన విషయమే, ఏంటి లోపం? ఎక్కడుంది లోపం?... మన బుద్ధి , మనశ్శక్తి మొండివి, మార్చలేనివి అంటే అద్భుతం కాదు కానీ, ఆధ్యాత్మిక బోధనలు వాటి మధ్య ఉంటూ మనం చేసే పనులు, అవి మంచివా, చెడ్డవా, చెయ్యొచ్చా, చెయ్యకూడదా అనే అలోచనల్లో సహాయం చేస్తూ, కొన్ని సమయాల్లో మన మనస్సును నియంత్రించడంలో తోడ్పడుతూ, ఏదో ఓ విశ్వాసం మనల్ని , మన మనశ్శక్తిని ముందుకు నడిపిస్తున్నాయేమో, అదే ఆధ్యాత్మికతేమో అంటే మాత్రం అదో అద్భుతమే... మన విశ్వాసాలు కొన్నిసార్లు మారవచ్చు. వాటిని కాపాడుకోవాలి, వాటిని ఎప్పుడూ ఆదరించాలి, వాటితోనే జీవనం సాగించడమంటే కష్టమేమో గానీ ఎప్పటికీ ఆధ్యాత్మికతంగా ఉంటే మనలోని దుష్ట శక్తులకు, చెడ్డ పనులు చేయలన్న ఆలోచనలకు ఈ ఆధ్యాత్మికతా ధోరణి అడ్డుపడుతూండడం వల్ల మనలోని దైవత్వాన్ని పంపొందించుకోగలమేమో, మన మనస్సు మన నియంత్రణలోనే ఉంటుందేమో... ఏదేమైనా మన ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే అలా ఆధ్యాత్మికత భావనలను పెంపొందించుకోవడం అంత సులభ తరమా? ఒకసారి ఆలోచించుకోవాలి!!! ఒక్కసారి గతాన్ని చూచిన, మనకి ఎందరో గొప్ప గొప్ప మహానుభావులున్నారు. గౌతమ బుధ్ధుడు, స్వామి వివేకానందుడు, మరెందరో మహానుభావులు, ఋషులు, యోగి పుంగవులు, వాళ్ళకి అంత ఆధ్యాత్మిక ధోరణి ఎలా వచ్చిందో ఎంత ఆలోచించినా మనకు తట్టదు... వారు వారి అన్ని విలాసాలను, సౌకర్యాలను త్యజించి, త్యాగం చేసి, ఒక్క దైవం మీదే మనస్సు లగ్నం చేయడం వల్లా, ఆ దేవునిపై వారు పెట్టుకున్న విశ్వాసము వల్ల!!! సాధ్యమయ్యింది... _అయితే అలా అన్నింటినీ ఒకేసారి త్యాగం చేయడం కష్టం... మెల్లిమెల్లిగా మనలోని ఉన్న దుష్ట శక్తులను, దూరాలోచనలను త్యాగం చేసి, త్యజించి, దైవత్వం మీద మనస్సు లగ్నం చేసిన నిర్మలమైన మనస్సును సాధించవచ్చును..._ *_ 🥀శుభమస్తు🥀_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 8 शेयर

0 कॉमेंट्स • 0 शेयर
Dvsraju Mar 3, 2021

కర్మ అనేది విధి, దీన్ని ఎప్పటికీ వదిలే ప్రయత్నం చేయకు జగత్తంతా ఈశావాస్యమని జ్ఞానం కలిగితే కర్మ అనేది అంటుకోవడం అనేదే ఉండదు. అట్లా హాయిగా అనుభవిస్తూ బ్రతుకు, ఇంతకంటే వేరొకటి కోరకు. శరీరాన్ని విడిచి పెట్టాలని అని ఎప్పుడూ అనకు. ఇది ఈశావాస్య ఉపనిషత్తులోని మొదటి రెండు మంత్రాలు చెప్పేది. కొంతమంది ఈ కష్టాలని భరించలేక దీన్ని వదిలితే హాయిగా ఉండొచ్చు అని అనుకుంటారు పాపం తరువాత ఏమిటో తెలియక. అది చెబుతుంది తరువాతి శ్లోకం. అసూర్యా నామ తే లోకా అంధేన తమసావృతాః | తాంస్తే ప్రేత్యాభిగచ్ఛంతి యేకే చాత్మహనో జనాః || తమ విధిని మరిచి తమ విధి నుండి విముఖతని చూపించడం అంటే ఆత్మ హత్యకు పాల్పడటం అనే అర్థం. శరీరంనుండి బయట పడటం అనేది తీవ్రమైన ఆత్మహత్య. ఎవడైనా ఆత్మహనుడనే పేరు. "ఆత్మహనో జనాః" ఇలాంటి ఆత్మజ్ఞుడైన వ్యక్తికి ఏమికలుగుతుందో తెలుసునా ? "అసూర్యా నామ తే లోకా" ఆసురలోకాల్లోకి వెళ్ళిపోతారు. ఎలా ఉంటాయి ఇవి ? "తమసా అంధేన ఆవృతాః" గాఢాందకారంలో ఉంటాయట. "ప్రేత్యా" శరీరం వదిలి పెట్టగానే అక్కడికి వెళ్తారు. ఇక్కడ కష్టం ఏర్పడ్డప్పుడు శరీరం వదలాలని అనుకుంటాం, ఆవల స్థితి తెలియదు కనుక అట్లా అనుకుంటాం. ఈ శరీరంతో కర్మ అనుభవిస్తున్నాం, ఇంద్రియాలు ఉన్నాయి కనుక ఎదో అనుభవించగలుగుతున్నాం. మనం డిల్లీ వెళ్ళాలనుకోండి, మొదట హైదరాబాదు వెళ్ళాలి. త్వరతో మనం ముందే హైదరాబాదు చేరుకున్నా డిల్లీకి వెళ్ళాల్సిన రైలు వచ్చే వరకు ఆగాల్సిందే. అట్లానే ఒక వ్యక్తి ఆయస్సు కంటే ముందే శరీరాన్ని వదిలితే వాడికి తరువాత లభించే శరీరం అప్పుడే లభించదు. వాడు చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి, కానీ శరీరం లేదు. శరీరంలోంచి బయటికి వెళ్ళినప్పుడు ఇంద్రియాలు వెంటవస్తాయి. ఇంద్రియాలు ఉంటాయి కానీ ఇంద్రియాలకి సహకరించే పరికరాలు అంటే కన్ను, ముక్కు అవేవీ ఉండవు. ఇప్పుడు మనకి ముక్కు నోరు మూసి వేస్తే ఎట్లా ఉక్కిరి బిక్కిరి అవుతామో అట్లాంటి స్థితి ఏర్పడుతుంది. మనం ఒక రంగులరాట్నంలో ఉన్నామనుకోండి, అది తిరిగేప్పుడు భయం వేసింది అందులోంచి బయటికి వద్దాం అనిపించింది, అది తనంతట అది ఆగేవరకు వేచి ఉండాల్సిందే తప్ప అందులోంచి దూకేసే ప్రయత్నం చేయకూడదు, అట్లా చేస్తే అంత కంటే దుర్భర స్థితి ఏర్పడుతుంది. అట్లానే శరీరాన్ని ముందే వదిలితే అనుభవించాలని ఉంటుంది కానీ అనుభవించలేక తిరుగుతూ ఉంటాడు. ఏడుస్తూనైనా బ్రతక వచ్చేమో గానీ అలాంటి దుర్భర స్థితిలోకి మనిషి వెళ్ళకూడదు. అట్లా కర్మమీద వైరాగ్యం అనేది ఏర్పడటం తప్పు. అంటే కర్మ చేయడం తప్పదు. కష్టం వస్తే ఎలా ? ఎదుర్కోవలసిందే. ఎలా ఎదుర్కోవడం ? "ఈశా వాస్యమ్" అని గుర్తుంచుకో, వాడు దయకలిగిన వాడు. మంచి కోసం కష్టం వచ్చిందని అనుకో. వాడు తప్పక సహకరిస్తాడు. అంటే వాడియందు భావనతో కర్మని విధిస్తుంది ఈశావాస్య ఉపనిషద్. 🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺

+8 प्रतिक्रिया 2 कॉमेंट्स • 15 शेयर

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 6 शेयर

0 कॉमेंट्स • 0 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB