+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 11 शेयर

*🌹. అసలైన స్పందన అవగాహనతోనే సాధ్యం 🌹* *🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀* ✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ ఏదైనా ఛలోక్తిని మీరు ఒక ఆంగ్లేయునికి చెప్పినప్పుడు అతను చాలా మర్యాద పూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. వెంటనే ఆ ఛలోక్తిని మీరు అతనికి మళ్ళీ వివరిస్తారు. అప్పుడు కూడా అతను చాలా మర్యాదపూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. అలా ఎప్పుడూ చాలా మర్యాదగా ప్రవర్తించేలా ఆంగ్లేయులందరికీ శిక్షణ ఇస్తారు. అర్థరాత్రి నిద్రాభంగమైనప్పుడు ఆ ఛలోక్తి అతనికి మళ్ళీ గుర్తుకొస్తుంది. అప్పుడు కూడా అతను చాలా మర్యాద పూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. అలా ప్రతి ఆంగ్లేయుడు మూడుసార్లు నవ్వుతాడు. అదే ఛలోక్తిని మీరు ఒక జర్మనీయునికి చెప్పినప్పుడు అతను చాలా మర్యాదపూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. అలాగే దానిని మీరు వివరించినప్పుడు కూడా అతను రెండవసారి మర్యాద పూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. కానీ, ఏ జర్మనీయుడూ మూడవసారి నవ్వడు. ఎందుకంటే, ఆ విషయం అతనికి గుర్తుంచదు. ఆ రకంగా వారు నిబద్ధీకరించబడతారు. అదే ఛలోక్తిని మీరు ఒక అమెరికన్‌కు చెప్పగానే అతను చాలా మర్యాద పూర్వకంగా చిరునవ్వు నవ్వు నవ్వి వెంటనే దాని గురించి పూర్తిగా మర్చిపోతాడు. అందుకే ఏ అమెరికన్ రెండవసారి నవ్వడు. అదే ఛలోక్తిని మీరు ఒక యూదునికి చెప్పినప్పుడు అతను ఏమాత్రం నవ్వకపోగా ‘‘పాత ఛలోక్తిని కూడా మీరు చాలా తప్పుగా చెప్తున్నారు’’అంటాడు. అది అతనికి కేవలం ఛలోక్తే కావచ్చు లేదా గొప్ప వేదాంతమో లేదా అతి చిన్న విషయమో లేదా చివరికి దేవుడైనా కావచ్చు. ఏదేమైనా పెద్ద తేడా ఏముండదు. ఎందుకంటే, అందరూ పెద్దల కోరిక ప్రకారం తమ సహజత్వాన్ని కూడా అణచుకుంటూ, వారు బోధించిన నిబద్ధీకరణలను పాటిస్తూ, పెరిగి పెద్దవారై, వారు ఆశించినట్లుగానే ప్రవర్తిస్తారు. వాస్తవానికి, ఎవరైనా తమ సహజత్వాన్ని మాత్రమే పని చెయ్యనివ్వాలి. కానీ, ఎవరూ అలా చెయ్యరు. పైగా, తమకు నూరిపోసిన దానినే అందరూ అనుసరిస్తారు. అందుకే అలాంటివారిని నేను ‘బానిసలు’ అంటాను. మీకు బోధించిన నిబద్ధీకరణలన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టిన మరుక్షణం వాటి ప్రభావం మీపై ఏమాత్రం ఉండక పోవడంతో మీకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. వెంటనే మీరు తొలిసారిగా మీ జీవితాన్ని నూతన దృక్పథంతో దర్శించడం ప్రారంభిస్తారు. అందువల్ల మీరు ఎలా ప్రవర్తిస్తారో, తరువాత ఏమి జరుగుతుందో ఎవరూ ఏమాత్రం ఊహించలేరు. ఎందుకంటే, అస్తిత్వం మీ ద్వారా స్పందిస్తోంది. అందువల్ల మీరు ఇప్పుడు మునుపటిలా లేరు. ఇంతవరకు కేవలం సమాజం మాత్రమే మీ ద్వారా స్పందిస్తూ వచ్చింది. కాబట్టి, ఎలాంటి ప్రణాళికలు, స్థిరమైన పూర్వ నిశ్చితాభిప్రాయాలు లేకుండా, ఏ క్షణంలో ఏమి జరిగినా అప్రమత్తతతో స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లైతే, మీరు ప్రామాణికంగా, వాస్తవంగా మారినట్లే. కాబట్టి, ‘‘అధికారికత, ప్రామాణికత’’అనే పదాలను మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మామూలుగా మీరు మతాచార్యుడు, రాజకీయ నాయకుడు, తల్లిదండ్రుల అధికారిక నిబద్ధీకరణల ప్రకారమే స్పందిస్తారు. సవాలు చేసే పరిస్థితి ఎప్పుడు ఎలాంటిది ఎదురైనా, స్వేచ్ఛాపరుడు ఎప్పుడూ తన ప్రామాణికతకు అనుగుణంగా పూర్తిగా స్పందిస్తూ ప్రవర్తిస్తాడే కానీ, ఏ అధికారానికీ తలవంచి ప్రవర్తించడు. కనీసం అలా జరుగుతుందని కూడా అతను ఏమాత్రం ఊహించలేదు. ఎందుకంటే, అతనికే తెలియకుండా అంతా జరిగిపోతుంది మీరు అడిగిన ప్రశ్నకు నేను ఏ సమాధానం చెప్తానో నాకే తెలియదు. నేను సమాధానం చెప్పిన తరువాత మాత్రమే ‘‘ఓహో, ఇదా మీ ప్రశ్నకు నా సమాధానం’’అని నాకు తెలుస్తుంది. నేను ఉన్నాను, మీరు అడిగిన ప్రశ్న ఉంది. కాబట్టి, మీ ప్రశ్నకు సమాధానం తప్పక లభిస్తుంది. అడిగిన దానికి వెంటనే చక్కగా స్పందిస్తూ సమాధానం చెప్పడమనేది ఒక ప్రామాణికమైన బాధ్యత. చైతన్యరహితులైన వ్యక్తులు-పిరికిగా, ధైర్యంగా, సహనంగా, అసహనంగా- ఇలా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో మీకు తెలుస్తూనే ఉంటుంది. కానీ, పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో మీరు ఏమాత్రం ఊహించలేరు. - ఇంకాఉంది. 🌹 🌹 🌹 🌹 🌹 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 47 🌹* ✍️. సద్గురు కె. పార్వతి కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ *🌻 32. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 1 🌻* ఈ కాలమున పరమగురువుల శిష్యులము అనుకునేవారు, సాధకుల మనుకొనేవారు, వారిని గూర్చి పరమగురువులు చెప్పినట్లుగా ఎన్నియో ముచ్చట్లు పలుకుతారు. అవి అన్నియు నిజమునకు భ్రాంతి దర్శనములే. వీటి నుండి బయటపడక పోయినచో ఏ సాధకుడూ పరమ గురువుల రాజ్యమున ఒక సైనికునిగా నిలబడలేడు. పరమ గురువు లిట్లు తెలుపుదురు. “నీ జీవితమునకు నీవే స్వామిత్వము వహింపుము. నీవే నీ సమస్యలను విచక్షణతో పరిష్కరించుకొనుము. తప్పులు చేసినచో తప్పించుకొనక సరిదిద్దుకొనుము. నిన్ను నీవు మరచి యితరులకే మైనా తోడ్పడగలవేమో చూడుము. నీయందు తప్పులు పట్టుటకు కానీ, నిన్ను శ్లాఘించుటకు కాని, బుజ్జగించుటకు కాని వీలుపడదు. అట్లు చేసినచో నీ అభివృద్ధిని ఆటంకపరచిన వారమగుదుము. ఎట్టి పరిస్థితులలోనూ విచక్షణను కోల్పోకుము. మరపు రానీయకుము. కర్తవ్యమున నిష్కర్షగ జీవింపుము.” అది 1919వ సంవత్సరం. కార్తీకమాసం. ఆహ్లాదకరమైన శరదృతువు కన్నుల కింపు గావించుచున్నది. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*🌹. వివేక చూడామణి - 36 / Viveka Chudamani - 36🌹* ✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు* *🍀. ఆత్మ స్వభావము - 4 🍀* 133. సాక్షిగా ఉన్న ఆత్మ మనస్సు యొక్క మార్పులను, అహాన్ని మరియు శరీరములోని వివిధ అంగములు, ప్రాణ శక్తిని గమనిస్తూ వాటి ఆకారములను పొందుతూ; ఎలా అయితే ఇనుప గుండు అగ్నిని తనలో నింపుకుని మార్పులేక ఉంటుందో అలా వానిలో ఐక్యమై గమనిస్తూంది. కాని అది ఏమి చేయదు, దానిలో ఏ మార్పు రాదు. 134. ఆత్మ ఎప్పుడు పుట్టదు, గిట్టదు, పెరగదు, తరగదు మరియు ఏ మార్పు చెందదు. శాశ్వతత్వము కలిగి ఉంటుంది. ఈ శరీరము నశించినప్పటికి ఆత్మకు చావులేదు. ఆకాశములోని ఘటము పగిలినప్పటికి అందులోని ఘటాకాశము విశ్వములో కలసినట్లు, ఈ ఆత్మ సర్వ స్వతంత్రము. అన్నింటిని అధిగమిస్తుంది, అన్నింటిలో ఉంటూ వాటికి అతీతముగా ఉంటుంది. 135. ఈ అత్యున్నతమైన ఆత్మ సదా మార్పు చెందే ప్రకృతి కంటే భిన్నమైనది. ఇది జ్ఞానసారము. పూర్తిగా ఈ భౌతిక ప్రపంచాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఎఱుక స్థితిలోనూ మరియు ఇతర స్థితులలోనూ అహం యొక్క ప్రభావమును బుద్ది, సాక్షిగా గమనించు చున్నది. సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 VIVEKA CHUDAMANI - 36 🌹* ✍️ Sri Adi Shankaracharya Swami Madhavananda 📚 Prasad Bharadwaj *🌻 Nature of Soul - 4 🌻* 133. The Knower of the modifications of mind and egoism, and of the activities of the body, the organs and Pranas, apparently taking their forms, like the fire in a ball of iron; It neither acts nor is subject to change in the least. 134. It is neither born nor dies, It neither grows nor decays, nor does It undergo any change, being eternal. It does not cease to exist even when this body is destroyed, like the sky in a jar (after it is broken), for It is independent. 135. The Supreme Self, different from the Prakriti and its modifications, of the essence of Pure Knowledge, and Absolute, directly manifests this entire gross and subtle universe, in the waking and other states, as the substratum of the persistent sense of egoism, and manifests Itself as the Witness of the Buddhi, the determinative faculty. Continues.... 🌹 🌹 🌹 🌹 🌹 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 243 🌹* 🌷. సద్గురు శివానంద 🌷 📚. ప్రసాద్ భరద్వాజ *🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 7 🌻* 48. ఎవరికి భవంతునిమీద పగ ఉంటుందో, వాడికి ఆయన కనపడడు, వాడిని పట్టించుకోడు. వాడెంత అపచారం చేసినా సహిస్తాడు, మాట్లాడడు. కాని, వాడిని కటాక్షించడు. ఎందుచేతనంటే, వాడికి తన ఉనికి తెలియటంకూడా ఆయన సహించడు. 49. కాబట్టి వాళ్ళ యందు పూర్తిగా భగవంతుడికి ఉపేక్ష ఉంటుంది. శత్రువులయందు శ్రద్ధ ఉండదు, భక్తుడియందే శ్రద్ధ ఉంటుంది. అలాకాకపోతే, శత్రువుమీద ఆయనకు కోపమే ఉండి ఉంటే, అది శ్రద్ధ అవుతుంది కదా!. 50. ఆసేతుశీతాచల పర్యంతం రామేశ్వరం నుంచీ కేదార్‌నాథ్ వరకు ఆ సంప్రదాయాలు, ఆ పూజలు, ఆ మంత్రాలు, ఆ విగ్రహాలు అవన్నీ ఏదో విచిత్రంగా ఉంటాయితప్ప తత్త్వం మాత్రం ఒక్కటే! 51. భారతీయతలో ఆ గురుతత్త్వం, ఆ ప్రబోధం, ఆ మార్గం, ఆ శరణాగతి అదంతాకూడా అలాగే ఉంటుంది. ఈ భారతీయ సంప్రదాయంలో ఈ మహర్షులు ప్రతిష్ఠించింది ఏమిటంటే, అది ఈశ్వరతత్త్వంకంటే, గురుతత్త్వం అనే చెప్పాలి. వాళ్ళు దానిని సుప్రతిష్ఠంచేసి దానికి శాశ్వతం ఇచ్చి వెళ్ళిపోయారు. 52. నిజంగా గురుతత్త్వమే అయిన ఈ ఋషుల చరిత్రలన్నీకూడా అమోఘమైనటు వంటివి. వీటిలో ప్రతీచోట బ్రహ్మవిష్ణు రుద్రులొస్తున్నారు. అంటే త్రిమూర్తులతీనే సన్నిహితసంబంధం కలిగిఉన్నప్పటికీ, వీరు మనుష్యులే! వాళ్ళు ఎంతోమందిని ఉద్ధరించారు. ఈ గురుతత్త్వం మాత్రం ఎప్పుడైనా ఈ భారతదేశంలో నశించదు. 53. ఈ సంప్రదాయం ఎప్పుడయినా, ఎప్పటికైనా భారతదేశ సంస్కృతికి కల్యాణప్రదమై పునరుజ్జీవన హేతువవుతుంది. ఈ సంస్కృతియొక్క పునరుజ్జీవనహేతువు దేంట్లో ఉండంటే, ఈ గురుతత్త్వంలోనే. సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam

0 कॉमेंट्स • 0 शेयर

*🌹 LIGHT ON THE PATH - 111 🌹* *🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀* ✍️. ANNIE BESANT and LEADBEATER 📚. Prasad Bharadwaj CHAPTER 8 - THE 20th RULE *🌻 20. Seek it not by any one road. - 4 🌻* 422. But, as is said here, self-sacrificing labour alone is not sufficient to gain for the man the highest development. He also needs to develop his devotion, and above all to develop his power of response to the inner light, because without that he will not be a perfect instrument. Without that he might be working away most energetically, but would be unable to respond to the touch, the hint from above, sufficiently quickly. He would need, as it were, to be pulled round energetically, instead of requiring just a gentle touch, which is all that should be necessary, and so would cause more trouble to his Master in training him. He must also learn something of the great plan, because, glorious as the work is, the man cannot do it perfectly unless he has knowledge. Therefore he must make a definite effort in the way of study to attain that. Much knowledge comes in actually doing the work, but there is every reason for us to take advantage of the accumulated experience of our forerunners and learn whatever we can by study, so that our work may be better done. 423. The vices of men become steps in the ladder, one by one, as they are surmounted. The virtues of men are steps indeed, necessary – not by any means to be dispensed with. Yet, though they create a fair atmosphere and a happy future, they are useless if they stand alone. 424. A.B. – Here both vices and virtues are called steps. This broad view cannot harm students, and is indeed necessary for the disciple, but it would be right in the world to take the narrow view, for vice must mean vices, and virtue must mean virtues, to undeveloped people. The broad view would confuse their ideas of morality; they cannot apply principles with understanding, and think of the moral bearing of each action, so they must have a list of things that are bad, for their avoidance, a set of religious and social commandments for their guidance. , It would be a mistake to upset the popular view of vice and virtue, although it permits many actions the disciple has outgrown. 425. But esotericists should learn to understand what they both mean, as manifestations of the Divine. The way to regard it is to think of every soul as a divine being, as a centre of outgoing energies pouring into the world. The life of man consists in the expression of the life of atma, and it finds expression outwards. In the earlier stages of its evolution there was nothing to be called vice or virtue, but simply an outrush of energies, very largely along lines which the standards achieved by society to-day would not approve. It is true that from the beginning of our human career most of us, especially those who had individualized at a high point from the animal kingdom, were in a position to use our intelligence to some extent, and so were able to learn many things by observation of others. But it remains a fact that nevertheless all of us in earlier stages must have done many things which would now be accounted evil. Those experiences taught us to do better, so they were steps or means of progress. And they also helped to make it possible for us to understand and help others who are going through such experiences now. All types of experiences are equally necessary; we could not know even partly what they are without every kind of expression, and should never be able to help other people if we did not understand. Continues... 🌹 🌹 🌹 🌹 🌹 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB