చంద్ర
చంద్ర Oct 10, 2019

🌺🌺🌺చిరునవ్వు 🌺🌺🌺 👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑 ఇష్టదైవం మన ముందుకొచ్చి నిలబడినట్టు ఊహించుకుంటే, ఆ ముఖంలో మనకు అప్రసన్నత, అసహనం, ఉగ్రత్వం కనిపించవు. ప్రేమకు, కరుణకు చిరునామా అయిన చిరునవ్వే కనిపిస్తుంది. అదే మనం ఏ రాక్షసుడి రూపాన్నో, భూత ప్రేతాల రూపాన్నో ఊహించుకొంటే- ఆ ముఖాల్లో చిరునవ్వు కనిపించదు. క్రోధావేశాలు కనిపించి భయపెడతాయి. పరిచితులైన బంధుమిత్రుల్లో కూడా, మనకు బాగా ఇష్టమైనవాళ్లు (కూతురు, మనవడు) తలపునకు వస్తే, వాళ్లు చిరునవ్వుతో కనిపిస్తారు. మన ముఖం మీదా చిరునవ్వు వెలుగుతుంది. నచ్చనివాళ్లు (పైఅధికారి, టెక్కు చూపించే పొరుగువాళ్లు) మనసులో మెదిలితే- వాళ్ల ఏడుపు ముఖం, రుసరుసలు, విసవిసలు ముందు గుర్తుకొస్తాయి. మన ముఖమూ కొంచెం ముడుచుకుపోతుంది. నవ్వు ముఖం (కృతకంగా నవ్వు పులుముకొన్న ముఖం కాదు!) చూస్తేనే మనసుకు శాంతి, ఆనందం, సుముఖత కలుగుతాయి. చిరచిరలాడుతూ కనిపించే ముఖాలు అశాంతిని, భయాన్ని, అసౌకర్యాన్ని, విముఖతను కలిగిస్తాయి. ఇది నిత్యానుభవం. ‘నేను మీవైపు ఎప్పుడూ నవ్వుతూ చూస్తుంటే, మీరు మాత్రం ఎప్పుడూ కొరకొరలాడుతూ చూస్తారెందుకు?’ అని అడిగిందట స్మృతి అనే భారతీయ క్రికెట్‌ క్రీడాకారిణి, తన ప్రత్యర్థి జట్టు బౌలర్లను. ఈ రోజుల్లో క్రికెట్లో వేగంగా బంతి విసిరే ఆటగాళ్లు, ప్రత్యర్థులను, తమ బంతులతోనే కాక, మాటలతోనూ చూపులతోనూ కూడా భయపెట్టేందుకు ప్రయత్నించే ఆనవాయితీ వచ్చింది కదా! ప్రతిపక్షం ఆటగత్తెలు స్మృతితో ‘నీ చిరునవ్వు మమ్మల్ని దహించి వేస్తుంది!’ అంటారట. స్మృతి సాధించిన విజయాలకు ఆమె చిరునవ్వు ఒక కారణం అయితే, ఆమె ప్రత్యర్థులకు ఆ చిరునవ్వు వల్ల కలిగే అసౌకర్యం మరొక కారణం. ఆమె పట్ల వాళ్లు వైముఖ్యం, శత్రుత్వం చూపాలన్నా చూపలేరు! కురుక్షేత్ర యుద్ధారంభంలో అర్జునుడు అకస్మాత్తుగా, అవసర సమయంలో విషాదంలో మునిగిపోయినప్పుడు, శ్రీకృష్ణుడు చిర్రుబుర్రులాడలేదు. చిరునవ్వు ముఖంతో గీతాబోధ చేశాడు. శ్రీరాముడి స్మితభాషిత్వం- చిరునవ్వు నవ్వుతూ మాట్లాడటం- జగమెరిగిన సుగుణం. మనిషి భావోద్రేకాలనుబట్టి శ్వాస వేగం మారుతుందని అందరూ అంగీకరిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటే శ్వాస కుదురుగా ఉంటుంది. అలాగే శ్వాస సాఫీగా ఉంటే, మనసూ స్తిమితంగా ఉంటుంది. మనసును నియంత్రించటం కంటే, శ్వాసను నియంత్రించటం కొంత తేలిక. కాబట్టి శ్వాస మీద దృష్టి ఉంచి దాన్ని స్తిమితపరిస్తే మనసు కూడా స్తిమితపడుతుంది అంటారు యోగులు. అదే చిరునవ్వుకూ వర్తిస్తుంది. అన్ని పరిస్థితుల్లోనూ చిరునవ్వు చెరగకుండా ఉంచుకొని అందరి పట్లా సుముఖత, సౌహార్దం ప్రదర్శించేవారి మనసు ఆనందమయంగా ఉంటుందంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. నవ్వు ముఖం కొందరికి జన్మతః వచ్చే వరం. అందం, ఆరోగ్యం, బుద్ధి బలం, శరీర దారుఢ్యం వంటి లక్షణాల్లాగా పిత్రార్జితం సంక్రమించినట్టు వారసత్వంగా వస్తుంది. అలా వస్తే అదృష్టమే. అలా రాకపోయినా, ఎన్నో సుగుణాల లాగా దీన్నీ అభ్యాసంతో, సాధనతో, స్వయంకృషితో ‘స్వార్జితం’గానూ సమకూర్చుకోవచ్చు. ముఖంమీద చిరునవ్వు తొలగకుండా ఉంచుకోవటం అభ్యాసం చేస్తే అది మనకు, మనతో వ్యవహరించేవారికి సైతం ప్రయోజనకరం. పిల్లలకు పసితనం నుంచి ఏవేవో నేర్పడానికి, ఇంటా బయటా ఎన్నెన్నో ఏర్పాట్లు చేస్తుంటాం. వాటితోపాటు వాళ్లకు ఈ స్మితభాషిత్వంలోనూ కొంత శిక్షణ ఇస్తే, లోకంలో మానవ సంబంధాలు మరింత ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా వెల్లివిరుస్తాయి! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ శ్రీరామ జయ రామ జయజయ రామ

🌺🌺🌺చిరునవ్వు 🌺🌺🌺
👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑
ఇష్టదైవం మన ముందుకొచ్చి నిలబడినట్టు ఊహించుకుంటే, ఆ ముఖంలో మనకు అప్రసన్నత, అసహనం, ఉగ్రత్వం కనిపించవు. ప్రేమకు, కరుణకు చిరునామా అయిన చిరునవ్వే కనిపిస్తుంది. అదే మనం ఏ రాక్షసుడి రూపాన్నో, భూత ప్రేతాల రూపాన్నో ఊహించుకొంటే- ఆ ముఖాల్లో చిరునవ్వు కనిపించదు. క్రోధావేశాలు కనిపించి భయపెడతాయి.
పరిచితులైన బంధుమిత్రుల్లో కూడా, మనకు బాగా ఇష్టమైనవాళ్లు (కూతురు, మనవడు) తలపునకు వస్తే, వాళ్లు చిరునవ్వుతో కనిపిస్తారు. మన ముఖం మీదా చిరునవ్వు వెలుగుతుంది. నచ్చనివాళ్లు (పైఅధికారి, టెక్కు చూపించే పొరుగువాళ్లు) మనసులో మెదిలితే- వాళ్ల ఏడుపు ముఖం, రుసరుసలు, విసవిసలు ముందు గుర్తుకొస్తాయి. మన ముఖమూ కొంచెం ముడుచుకుపోతుంది.
నవ్వు ముఖం (కృతకంగా నవ్వు పులుముకొన్న ముఖం కాదు!) చూస్తేనే మనసుకు శాంతి, ఆనందం, సుముఖత కలుగుతాయి. చిరచిరలాడుతూ కనిపించే ముఖాలు అశాంతిని, భయాన్ని, అసౌకర్యాన్ని, విముఖతను కలిగిస్తాయి. ఇది నిత్యానుభవం. ‘నేను మీవైపు ఎప్పుడూ నవ్వుతూ చూస్తుంటే, మీరు మాత్రం ఎప్పుడూ కొరకొరలాడుతూ చూస్తారెందుకు?’ అని అడిగిందట స్మృతి అనే భారతీయ క్రికెట్‌ క్రీడాకారిణి, తన ప్రత్యర్థి జట్టు బౌలర్లను. ఈ రోజుల్లో క్రికెట్లో వేగంగా బంతి విసిరే ఆటగాళ్లు, ప్రత్యర్థులను, తమ బంతులతోనే కాక, మాటలతోనూ చూపులతోనూ కూడా భయపెట్టేందుకు ప్రయత్నించే ఆనవాయితీ వచ్చింది కదా! ప్రతిపక్షం ఆటగత్తెలు స్మృతితో ‘నీ చిరునవ్వు మమ్మల్ని దహించి వేస్తుంది!’ అంటారట. స్మృతి సాధించిన విజయాలకు ఆమె చిరునవ్వు ఒక కారణం అయితే, ఆమె ప్రత్యర్థులకు ఆ చిరునవ్వు వల్ల కలిగే అసౌకర్యం మరొక కారణం. ఆమె పట్ల వాళ్లు వైముఖ్యం, శత్రుత్వం చూపాలన్నా చూపలేరు!
కురుక్షేత్ర యుద్ధారంభంలో అర్జునుడు అకస్మాత్తుగా, అవసర సమయంలో విషాదంలో మునిగిపోయినప్పుడు, శ్రీకృష్ణుడు చిర్రుబుర్రులాడలేదు. చిరునవ్వు ముఖంతో గీతాబోధ చేశాడు. శ్రీరాముడి స్మితభాషిత్వం- చిరునవ్వు నవ్వుతూ మాట్లాడటం- జగమెరిగిన సుగుణం.
మనిషి భావోద్రేకాలనుబట్టి శ్వాస వేగం మారుతుందని అందరూ అంగీకరిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటే శ్వాస కుదురుగా ఉంటుంది. అలాగే శ్వాస సాఫీగా ఉంటే, మనసూ స్తిమితంగా ఉంటుంది. మనసును నియంత్రించటం కంటే, శ్వాసను నియంత్రించటం కొంత తేలిక. కాబట్టి శ్వాస మీద దృష్టి ఉంచి దాన్ని స్తిమితపరిస్తే మనసు కూడా స్తిమితపడుతుంది అంటారు యోగులు. అదే చిరునవ్వుకూ వర్తిస్తుంది. అన్ని పరిస్థితుల్లోనూ చిరునవ్వు చెరగకుండా ఉంచుకొని అందరి పట్లా సుముఖత, సౌహార్దం ప్రదర్శించేవారి మనసు ఆనందమయంగా ఉంటుందంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.
నవ్వు ముఖం కొందరికి జన్మతః వచ్చే వరం. అందం, ఆరోగ్యం, బుద్ధి బలం, శరీర దారుఢ్యం వంటి లక్షణాల్లాగా పిత్రార్జితం సంక్రమించినట్టు వారసత్వంగా వస్తుంది. అలా వస్తే అదృష్టమే. అలా రాకపోయినా, ఎన్నో సుగుణాల లాగా దీన్నీ అభ్యాసంతో, సాధనతో, స్వయంకృషితో ‘స్వార్జితం’గానూ సమకూర్చుకోవచ్చు.
ముఖంమీద చిరునవ్వు తొలగకుండా ఉంచుకోవటం అభ్యాసం చేస్తే అది మనకు, మనతో వ్యవహరించేవారికి సైతం ప్రయోజనకరం. పిల్లలకు పసితనం నుంచి ఏవేవో నేర్పడానికి, ఇంటా బయటా ఎన్నెన్నో ఏర్పాట్లు చేస్తుంటాం. వాటితోపాటు వాళ్లకు ఈ స్మితభాషిత్వంలోనూ కొంత శిక్షణ ఇస్తే, లోకంలో మానవ సంబంధాలు మరింత ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా వెల్లివిరుస్తాయి!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ

+14 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB