_*శ్రీ దేవి భాగవతం - 266 వ అధ్యాయం*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *శక్తి రహస్య నిరూపణము* 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 *నారదు డిట్లనెను :* వేనిని వినుటవలన జీవు డీ జన్మసంసార బంధములనుండి విముస్తు డగునో యట్టి ప్రకృతులచరితలు చక్కగ వింటిని. ఇపుడు శ్రీరాధా దుర్గల గుఱించి మఱల వేదములందు చెప్పబడిన పరమ రహస్య విధానము వినదలచుచున్నాను. నారాయణ! వారిర్వురిని గూర్చి వివరముగ తెల్పితివి. అట్టి వారి చరిత్రలు వినిన వారి మనస్సులు వారి భక్తిలో మునిగిపోవును. ఎవరి యంశచే నీ చరాచర జగముత్పన్నమయ్యెనో నియమింపబడుచున్నదో యెవరి భక్తి వలన ముక్తి గల్గునో యట్టివారిని వారి పూజా విధానమును మరల కొంచెము విపులముగ తెలుపుము. నారాయణు డిట్లు పలికెను : నారదా! వేద రహస్యము తెల్పుచున్నాను వినుము. సారములలో సారము-పరాత్పరము పూర్వమెవరును చెప్పని రహస్యము. అది రహస్యము మగుటవలన నితరులకు తెలపురాదు. ఈ జగము లుద్బవించిన పిమ్మట ప్రకృతిరూప జగదీశ్వరునుండి ఇర్వురు శక్తు లుద్బవించిరి. ఒకరు కృష్ణుని ప్రాణాధిష్ఠానదేవి ఇంకొకరు కృష్ణుని బుధ్ధ్యధిష్ఠానదేవి. వీరిర్వురు సకల జీవులను నియమించగలరు ప్రేరేపించగలరు. ఈ విరాడ్విశ్వమంతయును వారి స్వాధీనమందుండు. వారి యనుగ్రహమునకు పాత్రులు గానివారికి ముక్తి దుర్లభము. కనుక వారి ప్రీతికి నా రిర్వురిని నిత్యము సంసేవింపవలయును. వారిలో మొదట రాధామంత్రము భక్తిమీర నాలకింపుము. బ్రహ్మ విష్ణ్వాదులచేత పరాత్పరుడు నిత్యము సేవింపబడును. అతడు శ్రీరాధా శబ్దమునకు చతుర్థీ విభక్తి తర్వాత స్వాహాశబ్దము. ఇది షడక్షర మహామంత్రము ధర్మార్థము లొసంగునది. దీనికి మాయాబీజము చేర్చినచో నది కోర్కులు తీర్చుచింతామని యగు " ఓం హ్రీం శ్రీరాధాయైస్వాహా" అను మూలమంత్రము. కోటి నోళ్ళతో కోట్ల నాలుకలతోను రాధామంత్ర మహిమ వర్ణింపనలవిగాదు. ఈ మంత్రము మొట్టమొదట శ్రీకృష్ణుడు భక్తితత్పరుడై గోలోక రాసమండలమున రాధాదేవి యాదేశము ప్రకారము జపించెను. కృష్ణుడు విష్ణునకు బ్రహ్మకు బ్రహ్మ ధర్మునకు ధర్ముడు నాకు నీ మంత్ర ముపదేశించెను. నే నీ మంత్రము జపించుట వలన నేను దీనికి ఋషినైతిని. బ్రహ్మాది దేవతలును నిత్యము రాధనే ధ్యానింతురు. రాధ నర్చింపకున్నచో శ్రీకృష్ణు నర్చించుట కధికారము లేదు. ఇది వైష్ణవు లందఱికి నియమము కనుక తొలుత రాధార్చనము చేయవలయును. శ్రీకృష్ణుని ప్రాణాధిష్ఠానదేవి రాధ. కృష్ణు డామెకు వశుడు. ఆమె రాసేశ్వరి. కృష్ణుడు లేక రాధ యుండజాలదు. సకల కామములు సిద్దింపచేయునది గాన ఆమెను రాధ యుందురు. ఈ స్కంధమున చెప్పబడిన మంత్రము లన్నిటికిని నారాయణుడను నేనే ఋషిని. ఈ రాధా మంత్రమునకు గాయత్రీ-ఛందము; రాధ-దేవత; ప్రణవము బీజము భువనేశ్వరి శక్తి. మూలమంత్రము నారుసార్లు చెప్పి షడంగన్యాసము చేయవలయును. పిదప శృంగార రసాధిదేవి-రాసేశ్వరి-మహాదేవియగు శ్రీరాధాదేవిని మదిలో ధ్యానించవలయును. సామవేదమున చెప్పబడిన విధముగ రాధ నిల్టు ధ్యానింపవలయును. తెల్లని చంపక వర్ణము గలది శారద చంద్రునివంటి ముఖము గలది కోటిచంద్రులుగల మేను గలది శారద కమలముల బోలు కన్నులు గలది పండిన దొండపండువంటిమోవి గలది సొంపైన పిఱుదులు గలది మొలనూలు గలది మొల్ల మొగ్గల వరుసలవలె వెల్గు జిమ్ము పలువరుసగలది దేవి. ఆమె తెల్లని దువ్వలువలు దాల్చి అగ్ని శుద్ధమైన మేలిముసుగు దాల్చియున్నది. లేత మొలకనవ్వులు విప్పారిన ముఖము గలది. ఏనుగు కుంభములవంటి స్తనముల గలది. రత్నభూషణభూషితయై నిత్యము పండ్రెం డేడుల వయసుతో నలరారు సౌందర్యలహరి ; భక్తనుగ్రహ పరాయణ; మల్లికా మాలతీ మాలల పరిమళములు గుబాళించు కేశపాశములు గలది. కుసుమకోమలి-లతాంగి-రాస మండల మధ్య వర్తిని. వరాభయ ముద్రలుకల కలములుగల శాంతమూర్తి. నిండారు పరువముతో విలసిల్లు తల్లి. రత్న సింహాసనాసీన- గోపీమండలనాయిక-వేదప్రబోధిత-పరమేశ్వరి. కృష్ణ ప్రాణాధిక ప్రియ. ఈ విధముగ రాధను ధ్యానించి సాలగ్రామమునగాని కలశమునగాని అష్టదళపద్మయంత్రమునగాని విధి విధానమున రాధ నావాహమనము చేయవలయును. ఇట్లా వాహనము చేసిన పిమ్మట మూలమంత్రముతో దేవి కాసనాదులు కల్పించవలయును. మూల మంత్రముతో రాధపాదములకు పాద్యమును కరముల కర్ఘ్యమును ఆచమనీయము నగసంగవలయును. తర్వాత రాధాదేవికి మధుపర్కమును పాలిచ్చు గోవును సమర్పించవలయును. పిదప స్నానశాలకు భక్తిభావముతో గొని పోవలయును. దేవి కభ్యంగ స్నాన మొనరించి పట్టు పుట్టములు కట్టబెట్టవలయును. పెక్కు సొమ్ములు దరింపజేసి మేనికి మంచి గందములందవలయును. రాధాదేవికితులసి గుత్తుల పూలమాలలు-పారిజాత-కమలములు మాలలు నర్పించవలయును. తర్వాత పవిత్రముగ దేవి పరివారమును పూజింపువలుయును. అగ్నేయమునైరృతివాయువ్యము ఈశాన్యములందు దిక్పూజ సలుపవలయును. తర్వాత అష్టదళయంత్రమునందు దక్షణము మొదలుకొని దిక్కులందు క్రమమున అష్ట శక్తుల నర్చింపవలయును. తూర్ప దళమున మాలావతిని అగ్నికోణమున మాధవిని దక్షిణమందు రత్నమాలను నైఋ%ుతిని సుశీలను పడమటి దళమున శశికళను తెలివిగలవాడు పూజింపవలయును. వాయువ్యము పారిజాతను ఉత్తరమున పరా వతిని; ఈశాన్యమున ప్రియకారిణియగు సుందరి నర్చింపవలయును. ఆమెకు బైట బ్రహ్మాదులను భూమిపై ఆశాపాలురను పూజింపవలయును. ఇట్లు వజ్రాయుధము మున్నగునాయుధములను దేవిని పూజింపవలయును. తర్వాత బుద్ధిమంతు డావరణ దేవతలను రాధను గంధము మున్నగు పూజ ద్రవ్యములతో రాజోపచారములతో పూజింపవలయును. ఆ తర్వాత రాధా సహస్రనామములతో దేవి నర్చింపవలయును. తప్పనిసరిగ మూలమంత్రము వేయి సార్లు జపించవలయును. ఈ విధముగ రాసేశ్వరి- పరమయగు రాధాదేవిని పూజించువాడు విష్ణు సమాను డగును. అతడు గోలోక మేగగలడు. కార్తిక పూర్ణిమ నాడు రాదా జన్మోత్సవము జరుపు భక్తుని చెంత రాసేశ్వరి- పరాదేవి కటాక్షముతో విలసిల్లును. ఏదో యొక కారణమున గోలోకవాసినియగు రాధ బృందావనమును వృషభాను నందినిగ నవతరించెను. ఇందు చెప్పబడిన మంత్రములకు చెప్పిన సంఖ్యప్రకారముగ పురశ్చరణ జరుపవలయును. దానికి దశాంశము హోమము చేయవలయును. నూగులు- తేనె- నెయ్యి- పాలు మున్నగు వస్తువులతో భక్తితో హోమము జరుపవలయును. నారదు డిట్లనెను: మహాత్మా| ఏ స్తోత్రమున రాధ ప్రసన్న మగునో తెల్పుము. నారాయణు డిట్లనెను : పరమేశాని ! రాసమండలవాసిని ! రాసేశ్వరి! కృష్ణ ప్రాణాధికప్రియా! నీకు నమస్కారములు. త్రైలోక్యజననీ ! కరుణాలయా! బ్రహ్మ విష్ణ్వాది దేవతలచే మనస్కరింబడు పదపద్మములుగల దేవి ! నమస్కారములు. సరస్వతి రూపిణీ ! సావిత్రి! శంకరీ!గంగ! పద్మావతి రూపా! షష్ఠీ మంగళచండికా ! నమస్కారములు. తులసీ ! లక్ష్మీ ! దుర్గాదేవీ ! సర్వస్వరూపిణీ ! నీకు నమస్కారములు తల్లీ! మూలప్రకృతి స్వరూపిణీ దేవీ! కరుణాలవాలా! మేము నిరంతరము నిన్నే కొలిచెదము ఘోర సంసార సాగరమునుండి సముద్ధరింపదగినదవే! దయ చూడుము ! ఈ విధముగ సంస్మరించుచు మూడువేళల స్తోత్రము చదువు వాని కెచ్చటను దుర్లభమైనది లేనేలేదు. అతడు తనువు చాలించిన మీదట గోలోకమందలి రాసమండలమున నివసింపగలడు. ఈ పరమ రహస్య మితరులకు చెప్పరాదు. ఇపుడు శ్రీదుర్గాదేవి పూజా విధాన మాలకింపుము. దుర్గామాతను స్మరించినంతనే మహాపద లన్నియు తొలిగిపోవును. ఎవడు దుర్గాదేవిని కొలువడో వాని కెచ్చటనేమియు నుండదు. ఆమె విశ్వమాత- శైవి- సర్వోపాస్య-సర్వశక్తి-మహాద్బుత చరిత్ర-సర్వ బుద్ధ్యధిష్ఠానదేవి- అంతర్యామి స్వరూపిణి- ఘోరా సంకటములు పాపున దగుటచే భువిపై దుర్గ యని ప్రసిద్ధి గాంచినది. ఈమె నిత్యమును శైవ-వైష్ణువుల చేత నుపాసింపబడుదగినది. మూలప్రకృతి స్వరూపుణి-సృష్టి స్థిత్యంతకారిణి. దుర్గ నవార్ణమంత్రము త్తమోత్తమమైనది. అది వాగ్బీజము శాంభవీ బీజము కామబీజములు గల్గియుండునది. చాముండాయై పదము చివర '' విచ్ఛే '' యను రెండవక్షరములుండును. '' ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే '' యను నవాక్షర మంత్రము కొల్చువారికి కల్పతరువు. దీనిని మనువు తెల్పెను. ఈ మంత్రమునకు బ్రహ్మ- విష్ణువు-మహేశులు ఋషులు; గాయథ్రి-ఉష్ణిక్‌-అనుష్టుప్పులు చందములు మహాకాళీ-మహాలక్ష్మీ-మహా సరస్వతులు దేవతలు; రక్తదంతికా దుర్గాభ్రామరీ బీజములు; నందా-శాకంభరీ భీభూదేవతలు శక్తులు; ధర్మార్థ కామమోక్షములందు దీని వినియోగము. (ఋషి- ఛందము-దేవతలను క్రమముగా శిరమున-ముఖమున- హృదయమున బీజత్రయమును దక్షిణస్తనమున శక్తి త్రయమును వామస్తనమున వ్యాపము చేయవలెను. పిమ్మట వాగ్బీజమును హృదయ మున మాయా బీజమును శిరమున కామ రాజబీజమును శిఖయందు చాముండాయై అను నాల్గక్షరములను కవచమున విచ్చేఅను రెండక్షరములను నేత్ర త్రయమున మోత్తమునవార్ణమంత్రమును అస్త్రమున న్యాసమొనర్పవలయును. ఈ అంగన్యాసమున చతుర్థ్యంతములయిన శిరసే మొదలగు పదముల చివర వరుసగా నమః స్వాహా - వషట్‌ - హుం - వౌషట్‌ - ఫట్‌- అను జాతి పదముల చేర్చవలెను. ఇక వర్ణ వ్యాసము; కామ రాజ బీజము మొదలు మూల మంత్రపు తొమ్మిది వర్ణములను వరుసగా శిఖా- దక్షిణ నేత్ర- వామనేత్ర - దక్షిణ వర్ణ - వామ కర్ణ- దక్షిణ నాసా - వామనాసా- ముఖ గుదములందు న్యాసము చేయవలెను. పరిష్కర్త.) ఖడ్గము-శంఖము-చక్రము గద విల్లమ్ములు పరిషు శూలము భుశుండి శిరము శంఖము దాల్చినది త్రిణయన నానా భూషణభూషిత నల్లని కాటుక కొండవంటి రూపు పది పాదములు ముఖములుగలది మధుకైటభనాశమునకు మున్ను బ్రహ్మయే దేవిని సంస్తుతించెనో యా కామబీజ స్వరూపిణి యగుమహాకాళిని ధ్యానించుచున్నాను. అక్షమాల- పరశు- గద-కులిశము-పద్మము- ధనువు- కుండి- కరండము-శక్తి- కత్తి-చర్మము- అంబుజము-ఘంటిక-పానపాత్ర-శూలము-పాశము-సుదర్శనమునను నాయుధములు దాల్చు అరుణప్రభ రక్తకమలాసన మాయాబీజ స్వరూపిణి మహిషాసురమర్దిని యగు మహాలక్ష్మిని ఘంట- శూలము- హలము - ముసలము- సుదర్శనము- ధనుర్భాణములను కరములందు దాల్చి మొల్ల పూలకాంతు లీను శుంభాది దైత్య సంహారిణి నవార్ణమంత్రమందలి వాగ్బీజమున కధిదేవత- సచ్చిదానంద స్వరూపిణియైన మహాసరస్వతిని ధ్యానించుచున్నాను. ఇక దేవీయంత్రము గూర్చి వినుము. త్రికోణము-తర్వాత షట్కోణము-తర్వాత అష్టదశములు తర్వాత ఇరువదినాల్గు దళములు. భూగృహ నిర్మాణము గలదానిగ చింతింపవలయును. సాలగ్రామము కలశము యంత్రము ప్రతిమ బాణలింగము వీనిలో దేని యందైనను సూర్యనందైనను నిశ్చలబుద్ధితో దేవి నారాధింపవలయును. యంత్రమునకు తూర్పున సరస్వతితోడి బ్రహ్మను నైరృతకోణమున లక్ష్మితో విష్ణువును ధ్యానించవలయును. వాయుకోణమున పార్వతితోడి శంభుని ఉత్తరమున సింహమును దక్షిణమున మహాసురుడైన (సాయుజ్యమొందుట వలన) మహిషుని పూజింపవలయును. తర్వాత ఆరు కోణములందు నందజ- రక్తదంత- శాకంభరి-శివ-దుర్గ-భీమ-భ్రామరిలను పూజింపవలయును. తర్వాత అష్టదళములందుబ్రాహ్మి - మహేశ్వరి-కౌమరి- వైష్ణవి- వారాహి- నారసింహ- ఐంద్రి- చాముండలను బూజింపవలయును. తరువాత నిరువది నాల్గు దళములందు క్రమముగ విష్ణుమాయ-చేతన-బుద్ది-నిత్ర-క్షుధ-ఛాయ- పరాశక్తి-తృష్ణ-శాంతి-జాతి-లజ్జ-క్షాంతి-శ్రద్ధ-కీర్తి-లక్ష్మి-ధృతి-వృత్తి-శ్రుతి-స్మ్రతి-దయ-తుష్టి-పుష్టి-మాత-భ్రాంతి- యను నిరువది నల్గురు దేవతలను బూజింపవలయును. ఆ తర్వాత మతిమంతుడై భక్తుడు భూగృహ కోణములలో గణపతిని-క్షేత్రపాలకుని-వటుకుని-యోగినిని బూజింపవలయును. దానికి బైట వజ్రము మున్నిగు నాయుధములు దాల్చిన యింద్రుడు మొదలగు దేవతల నర్చించవలయును. ఈ విధమున నావరణ దేవతలను దుర్గాదేవి నారాధింపవలయును. తర్వాత వివిధ రాజోపచారములతో నర్చించి దేవిని సంతుష్టి పఱచవలయును. అటు తరువాతనవార్ణ మంత్రమును- మంత్రార్థమును భావింపవలయును. ఆ తరువాత దేవి సన్నిధిలో సప్త శతి స్తోత్రము పారాయణ చేయవలయును. ఈ ముల్లోకములందును సప్తశతీ స్తోత్రమునకు సాటియైన స్తోత్రము లేనేలేదు. ఈ విధముగ మానవుడు నిత్యమును దేవేశిని సంతోషపఱచవయును. ఇట్లు చేసిన వానికి ధర్మార్థకామమోక్షములు కరతలామలకములు. ఇది శ్రీదుర్గా పూజా విధానము. దీనివలన జన్మసార్థక మగును. ధన్య మగును. ఇదంతయును నీకు తెల్పితిని. బ్రహ్మ-విష్ణువు మొదలగు నెల్ల దేవతలు మునులు యోగులు యోగనిష్ఠలు ఆశ్రమవాసులు. లక్ష్మి మున్నగు దేవతందఱును శివకామేశ్వరిని దుర్గను మనసార ధ్యానింతురు. దుర్గాదేవిని స్మరించినచో జన్మతరించును. పదునలుగురు మనువులును దుర్గాదేవి చరణ కమలములు ధ్యానించుట వలన మనువు లైరి. దేవతలును తమ గొప్ప గొప్ప పదవు లలంకరించగల్గిరి. ఈవిధముగ రహస్యాతి రహస్యమైన దుర్గాదేవీ చరిత్ర మంతయును వినిపించితిని. పంచ ప్రకృతులను వారి యంశజులను గూర్చి విపులముగ దెలిపినతిని. నాచేత చెప్పబడిన దీనిని వినిన మానవుడు ముమ్మాటికి నిక్కముగ మహావిద్యావంతుడు గాగలడు. ఎవ డే కోర్కితో వినునో వాని కా కోరిక తేరును. దీని శరన్న వరాత్రములందు శ్రీదేవి సన్నిధానమునందు నిశ్చల మనస్సుతో చదివినచో వానికి దేవి వశ్యురా లగును. వాడు దేవికి ప్రియభక్తుడు గాగలడు. ఇందు గూర్చి యథా విధిగ శకునములు చూచుకొనవలయును. దాని క్రమ మెట్లనగా నొక కుమారిక చేతగాని వటువు చేతగాని ఏదేని మనస్సులో తంచుకొని దేవి పుస్తకమును మొదట పూజింపవలయును. ఆ జగదీశానిని మాటిమాటికి నమస్కరించవలయును. చక్కగా స్నానముచేసిన ఒక కన్యను తెచ్చి యామెను పూజించవలయును. ఆమె చేతి కొక బంగారు కడ్డీ నీయవలయును. ఆమె దానిని శుభాశుభ స్థానములం దెచ్చట నుంచునో తెలిసికొని దానిని బట్టి తన కోరిక ఫలమెఱుంగవలయును. ఆ బాలిక ప్రసన్నయైన దేవి తలంచవలయును. ఉపేక్షించియున్న దేవి యుదాసీనగ నుండునని యెఱుగవలయును. దానిని బట్టి ఫలితములును తెలియవలయును. *ఇది శ్రీదీవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధమందు యేబదవ యధ్యాయము* *మూడువేల ఆరు వందల యిరువదైదున్నర శ్లోకములుగల నవమ స్కంధము సమాప్తము.*

_*శ్రీ దేవి భాగవతం - 266 వ అధ్యాయం*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*శక్తి రహస్య నిరూపణము*


🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥


*నారదు డిట్లనెను :*  వేనిని వినుటవలన జీవు డీ జన్మసంసార బంధములనుండి విముస్తు డగునో యట్టి ప్రకృతులచరితలు చక్కగ వింటిని. ఇపుడు శ్రీరాధా దుర్గల గుఱించి మఱల వేదములందు చెప్పబడిన పరమ రహస్య విధానము వినదలచుచున్నాను. నారాయణ! వారిర్వురిని గూర్చి వివరముగ తెల్పితివి. అట్టి వారి చరిత్రలు వినిన వారి మనస్సులు వారి భక్తిలో మునిగిపోవును. ఎవరి యంశచే నీ చరాచర జగముత్పన్నమయ్యెనో నియమింపబడుచున్నదో యెవరి భక్తి వలన ముక్తి గల్గునో యట్టివారిని వారి పూజా విధానమును మరల కొంచెము విపులముగ తెలుపుము. నారాయణు డిట్లు పలికెను : నారదా! వేద రహస్యము తెల్పుచున్నాను వినుము. సారములలో సారము-పరాత్పరము పూర్వమెవరును చెప్పని రహస్యము. అది రహస్యము మగుటవలన నితరులకు తెలపురాదు. ఈ జగము లుద్బవించిన పిమ్మట ప్రకృతిరూప జగదీశ్వరునుండి ఇర్వురు శక్తు లుద్బవించిరి. ఒకరు కృష్ణుని ప్రాణాధిష్ఠానదేవి ఇంకొకరు కృష్ణుని బుధ్ధ్యధిష్ఠానదేవి. వీరిర్వురు సకల జీవులను నియమించగలరు ప్రేరేపించగలరు. ఈ విరాడ్విశ్వమంతయును వారి స్వాధీనమందుండు. వారి యనుగ్రహమునకు పాత్రులు గానివారికి ముక్తి దుర్లభము. కనుక వారి ప్రీతికి నా రిర్వురిని నిత్యము సంసేవింపవలయును. వారిలో మొదట రాధామంత్రము భక్తిమీర నాలకింపుము. బ్రహ్మ విష్ణ్వాదులచేత పరాత్పరుడు నిత్యము సేవింపబడును. అతడు శ్రీరాధా శబ్దమునకు చతుర్థీ విభక్తి తర్వాత స్వాహాశబ్దము. ఇది షడక్షర మహామంత్రము ధర్మార్థము లొసంగునది. దీనికి మాయాబీజము చేర్చినచో నది కోర్కులు తీర్చుచింతామని యగు " ఓం హ్రీం శ్రీరాధాయైస్వాహా" అను మూలమంత్రము. కోటి నోళ్ళతో కోట్ల నాలుకలతోను రాధామంత్ర మహిమ వర్ణింపనలవిగాదు. ఈ మంత్రము మొట్టమొదట శ్రీకృష్ణుడు భక్తితత్పరుడై గోలోక రాసమండలమున రాధాదేవి యాదేశము ప్రకారము జపించెను. కృష్ణుడు విష్ణునకు బ్రహ్మకు బ్రహ్మ ధర్మునకు ధర్ముడు నాకు నీ మంత్ర ముపదేశించెను. నే నీ మంత్రము జపించుట వలన నేను దీనికి ఋషినైతిని. బ్రహ్మాది దేవతలును నిత్యము రాధనే ధ్యానింతురు.

రాధ నర్చింపకున్నచో శ్రీకృష్ణు నర్చించుట కధికారము లేదు. ఇది వైష్ణవు లందఱికి నియమము కనుక తొలుత రాధార్చనము చేయవలయును. శ్రీకృష్ణుని ప్రాణాధిష్ఠానదేవి రాధ. కృష్ణు డామెకు వశుడు. ఆమె రాసేశ్వరి. కృష్ణుడు లేక రాధ యుండజాలదు. సకల కామములు సిద్దింపచేయునది గాన ఆమెను రాధ యుందురు. ఈ స్కంధమున చెప్పబడిన మంత్రము లన్నిటికిని నారాయణుడను నేనే ఋషిని. ఈ రాధా మంత్రమునకు గాయత్రీ-ఛందము; రాధ-దేవత; ప్రణవము బీజము భువనేశ్వరి శక్తి. మూలమంత్రము నారుసార్లు చెప్పి షడంగన్యాసము చేయవలయును. పిదప శృంగార రసాధిదేవి-రాసేశ్వరి-మహాదేవియగు శ్రీరాధాదేవిని మదిలో ధ్యానించవలయును. సామవేదమున చెప్పబడిన విధముగ రాధ నిల్టు ధ్యానింపవలయును. తెల్లని చంపక వర్ణము గలది శారద చంద్రునివంటి ముఖము గలది కోటిచంద్రులుగల మేను గలది శారద కమలముల బోలు కన్నులు గలది పండిన దొండపండువంటిమోవి గలది సొంపైన పిఱుదులు గలది మొలనూలు గలది మొల్ల మొగ్గల వరుసలవలె వెల్గు జిమ్ము పలువరుసగలది దేవి. ఆమె తెల్లని దువ్వలువలు దాల్చి అగ్ని శుద్ధమైన మేలిముసుగు దాల్చియున్నది. లేత మొలకనవ్వులు విప్పారిన ముఖము గలది. ఏనుగు కుంభములవంటి స్తనముల గలది. రత్నభూషణభూషితయై నిత్యము పండ్రెం డేడుల వయసుతో నలరారు సౌందర్యలహరి ; భక్తనుగ్రహ పరాయణ; మల్లికా మాలతీ మాలల పరిమళములు గుబాళించు కేశపాశములు గలది. కుసుమకోమలి-లతాంగి-రాస మండల మధ్య వర్తిని. వరాభయ ముద్రలుకల కలములుగల శాంతమూర్తి. నిండారు పరువముతో విలసిల్లు తల్లి. రత్న సింహాసనాసీన- గోపీమండలనాయిక-వేదప్రబోధిత-పరమేశ్వరి. కృష్ణ ప్రాణాధిక ప్రియ. ఈ విధముగ రాధను ధ్యానించి సాలగ్రామమునగాని కలశమునగాని అష్టదళపద్మయంత్రమునగాని విధి విధానమున రాధ నావాహమనము చేయవలయును. ఇట్లా వాహనము చేసిన పిమ్మట మూలమంత్రముతో దేవి కాసనాదులు కల్పించవలయును. మూల మంత్రముతో రాధపాదములకు పాద్యమును కరముల కర్ఘ్యమును ఆచమనీయము నగసంగవలయును.

తర్వాత రాధాదేవికి మధుపర్కమును పాలిచ్చు గోవును సమర్పించవలయును. పిదప స్నానశాలకు భక్తిభావముతో గొని పోవలయును. దేవి కభ్యంగ స్నాన మొనరించి పట్టు పుట్టములు కట్టబెట్టవలయును. పెక్కు సొమ్ములు దరింపజేసి మేనికి మంచి గందములందవలయును. రాధాదేవికితులసి గుత్తుల పూలమాలలు-పారిజాత-కమలములు మాలలు నర్పించవలయును. తర్వాత పవిత్రముగ దేవి పరివారమును పూజింపువలుయును. అగ్నేయమునైరృతివాయువ్యము ఈశాన్యములందు దిక్పూజ సలుపవలయును. తర్వాత అష్టదళయంత్రమునందు దక్షణము మొదలుకొని దిక్కులందు క్రమమున అష్ట శక్తుల నర్చింపవలయును. తూర్ప దళమున మాలావతిని అగ్నికోణమున మాధవిని దక్షిణమందు రత్నమాలను నైఋ%ుతిని సుశీలను పడమటి దళమున శశికళను తెలివిగలవాడు పూజింపవలయును. వాయువ్యము పారిజాతను ఉత్తరమున పరా వతిని; ఈశాన్యమున ప్రియకారిణియగు సుందరి నర్చింపవలయును. ఆమెకు బైట బ్రహ్మాదులను భూమిపై ఆశాపాలురను పూజింపవలయును. ఇట్లు వజ్రాయుధము మున్నగునాయుధములను దేవిని పూజింపవలయును. తర్వాత బుద్ధిమంతు డావరణ దేవతలను రాధను గంధము మున్నగు పూజ ద్రవ్యములతో రాజోపచారములతో పూజింపవలయును. ఆ తర్వాత రాధా సహస్రనామములతో దేవి నర్చింపవలయును. తప్పనిసరిగ మూలమంత్రము వేయి సార్లు జపించవలయును. ఈ విధముగ రాసేశ్వరి- పరమయగు రాధాదేవిని పూజించువాడు విష్ణు సమాను డగును. అతడు గోలోక మేగగలడు. కార్తిక పూర్ణిమ నాడు రాదా జన్మోత్సవము జరుపు భక్తుని చెంత రాసేశ్వరి- పరాదేవి కటాక్షముతో విలసిల్లును. ఏదో యొక కారణమున గోలోకవాసినియగు రాధ బృందావనమును వృషభాను నందినిగ నవతరించెను. ఇందు చెప్పబడిన మంత్రములకు చెప్పిన సంఖ్యప్రకారముగ పురశ్చరణ జరుపవలయును. దానికి దశాంశము హోమము చేయవలయును.

నూగులు- తేనె- నెయ్యి- పాలు మున్నగు వస్తువులతో భక్తితో హోమము జరుపవలయును. నారదు డిట్లనెను: మహాత్మా| ఏ స్తోత్రమున రాధ ప్రసన్న మగునో తెల్పుము. నారాయణు డిట్లనెను : పరమేశాని ! రాసమండలవాసిని ! రాసేశ్వరి! కృష్ణ ప్రాణాధికప్రియా! నీకు నమస్కారములు. త్రైలోక్యజననీ ! కరుణాలయా! బ్రహ్మ విష్ణ్వాది దేవతలచే మనస్కరింబడు పదపద్మములుగల దేవి ! నమస్కారములు. సరస్వతి రూపిణీ ! సావిత్రి! శంకరీ!గంగ! పద్మావతి రూపా! షష్ఠీ మంగళచండికా ! నమస్కారములు. తులసీ ! లక్ష్మీ ! దుర్గాదేవీ ! సర్వస్వరూపిణీ ! నీకు నమస్కారములు తల్లీ! మూలప్రకృతి స్వరూపిణీ దేవీ! కరుణాలవాలా! మేము నిరంతరము నిన్నే కొలిచెదము ఘోర సంసార సాగరమునుండి సముద్ధరింపదగినదవే! దయ చూడుము ! ఈ విధముగ సంస్మరించుచు మూడువేళల స్తోత్రము చదువు వాని కెచ్చటను దుర్లభమైనది లేనేలేదు. అతడు తనువు చాలించిన మీదట గోలోకమందలి రాసమండలమున నివసింపగలడు. ఈ పరమ రహస్య మితరులకు చెప్పరాదు. ఇపుడు శ్రీదుర్గాదేవి పూజా విధాన మాలకింపుము. దుర్గామాతను స్మరించినంతనే మహాపద లన్నియు తొలిగిపోవును. ఎవడు దుర్గాదేవిని కొలువడో వాని కెచ్చటనేమియు నుండదు. ఆమె విశ్వమాత- శైవి- సర్వోపాస్య-సర్వశక్తి-మహాద్బుత చరిత్ర-సర్వ బుద్ధ్యధిష్ఠానదేవి- అంతర్యామి స్వరూపిణి- ఘోరా సంకటములు పాపున దగుటచే భువిపై దుర్గ యని ప్రసిద్ధి గాంచినది. ఈమె నిత్యమును శైవ-వైష్ణువుల చేత నుపాసింపబడుదగినది. మూలప్రకృతి స్వరూపుణి-సృష్టి స్థిత్యంతకారిణి. దుర్గ నవార్ణమంత్రము త్తమోత్తమమైనది. అది వాగ్బీజము శాంభవీ బీజము కామబీజములు గల్గియుండునది. చాముండాయై పదము చివర '' విచ్ఛే '' యను రెండవక్షరములుండును. '' ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే '' యను నవాక్షర మంత్రము కొల్చువారికి కల్పతరువు. దీనిని మనువు తెల్పెను.

ఈ మంత్రమునకు బ్రహ్మ- విష్ణువు-మహేశులు ఋషులు; గాయథ్రి-ఉష్ణిక్‌-అనుష్టుప్పులు చందములు మహాకాళీ-మహాలక్ష్మీ-మహా సరస్వతులు దేవతలు; రక్తదంతికా దుర్గాభ్రామరీ బీజములు; నందా-శాకంభరీ భీభూదేవతలు శక్తులు; ధర్మార్థ కామమోక్షములందు దీని వినియోగము. (ఋషి- ఛందము-దేవతలను క్రమముగా శిరమున-ముఖమున- హృదయమున బీజత్రయమును దక్షిణస్తనమున శక్తి త్రయమును వామస్తనమున వ్యాపము చేయవలెను. పిమ్మట వాగ్బీజమును హృదయ మున మాయా బీజమును శిరమున కామ రాజబీజమును శిఖయందు చాముండాయై అను నాల్గక్షరములను కవచమున విచ్చేఅను రెండక్షరములను నేత్ర త్రయమున మోత్తమునవార్ణమంత్రమును అస్త్రమున న్యాసమొనర్పవలయును. ఈ అంగన్యాసమున చతుర్థ్యంతములయిన శిరసే మొదలగు పదముల చివర వరుసగా నమః స్వాహా - వషట్‌ - హుం - వౌషట్‌ - ఫట్‌- అను జాతి పదముల చేర్చవలెను. ఇక వర్ణ వ్యాసము; కామ రాజ బీజము మొదలు మూల మంత్రపు తొమ్మిది వర్ణములను వరుసగా శిఖా- దక్షిణ నేత్ర- వామనేత్ర - దక్షిణ వర్ణ - వామ కర్ణ- దక్షిణ నాసా - వామనాసా- ముఖ గుదములందు న్యాసము చేయవలెను. పరిష్కర్త.) ఖడ్గము-శంఖము-చక్రము గద విల్లమ్ములు పరిషు శూలము భుశుండి శిరము శంఖము దాల్చినది త్రిణయన నానా భూషణభూషిత నల్లని కాటుక కొండవంటి రూపు పది పాదములు ముఖములుగలది మధుకైటభనాశమునకు మున్ను బ్రహ్మయే దేవిని సంస్తుతించెనో యా కామబీజ స్వరూపిణి యగుమహాకాళిని ధ్యానించుచున్నాను. అక్షమాల- పరశు- గద-కులిశము-పద్మము- ధనువు- కుండి- కరండము-శక్తి- కత్తి-చర్మము- అంబుజము-ఘంటిక-పానపాత్ర-శూలము-పాశము-సుదర్శనమునను నాయుధములు దాల్చు అరుణప్రభ రక్తకమలాసన మాయాబీజ స్వరూపిణి మహిషాసురమర్దిని యగు మహాలక్ష్మిని ఘంట- శూలము- హలము - ముసలము- సుదర్శనము- ధనుర్భాణములను కరములందు దాల్చి మొల్ల పూలకాంతు లీను శుంభాది దైత్య సంహారిణి నవార్ణమంత్రమందలి వాగ్బీజమున కధిదేవత- సచ్చిదానంద స్వరూపిణియైన మహాసరస్వతిని ధ్యానించుచున్నాను.

ఇక దేవీయంత్రము గూర్చి వినుము. త్రికోణము-తర్వాత షట్కోణము-తర్వాత అష్టదశములు తర్వాత ఇరువదినాల్గు దళములు. భూగృహ నిర్మాణము గలదానిగ చింతింపవలయును. సాలగ్రామము కలశము యంత్రము ప్రతిమ బాణలింగము వీనిలో దేని యందైనను సూర్యనందైనను నిశ్చలబుద్ధితో దేవి నారాధింపవలయును. యంత్రమునకు తూర్పున సరస్వతితోడి బ్రహ్మను నైరృతకోణమున లక్ష్మితో విష్ణువును ధ్యానించవలయును. వాయుకోణమున పార్వతితోడి శంభుని ఉత్తరమున సింహమును దక్షిణమున మహాసురుడైన (సాయుజ్యమొందుట వలన) మహిషుని పూజింపవలయును. తర్వాత ఆరు కోణములందు నందజ- రక్తదంత- శాకంభరి-శివ-దుర్గ-భీమ-భ్రామరిలను పూజింపవలయును. తర్వాత అష్టదళములందుబ్రాహ్మి - మహేశ్వరి-కౌమరి- వైష్ణవి- వారాహి- నారసింహ- ఐంద్రి- చాముండలను బూజింపవలయును. తరువాత నిరువది నాల్గు దళములందు క్రమముగ విష్ణుమాయ-చేతన-బుద్ది-నిత్ర-క్షుధ-ఛాయ- పరాశక్తి-తృష్ణ-శాంతి-జాతి-లజ్జ-క్షాంతి-శ్రద్ధ-కీర్తి-లక్ష్మి-ధృతి-వృత్తి-శ్రుతి-స్మ్రతి-దయ-తుష్టి-పుష్టి-మాత-భ్రాంతి- యను నిరువది నల్గురు దేవతలను బూజింపవలయును. ఆ తర్వాత మతిమంతుడై భక్తుడు భూగృహ కోణములలో గణపతిని-క్షేత్రపాలకుని-వటుకుని-యోగినిని బూజింపవలయును. దానికి బైట వజ్రము మున్నిగు నాయుధములు దాల్చిన యింద్రుడు మొదలగు దేవతల నర్చించవలయును. ఈ విధమున నావరణ దేవతలను దుర్గాదేవి నారాధింపవలయును. తర్వాత వివిధ రాజోపచారములతో నర్చించి దేవిని సంతుష్టి పఱచవలయును. అటు తరువాతనవార్ణ మంత్రమును- మంత్రార్థమును భావింపవలయును. ఆ తరువాత దేవి సన్నిధిలో సప్త శతి స్తోత్రము పారాయణ చేయవలయును. ఈ ముల్లోకములందును సప్తశతీ స్తోత్రమునకు సాటియైన స్తోత్రము లేనేలేదు.

ఈ విధముగ మానవుడు నిత్యమును దేవేశిని సంతోషపఱచవయును. ఇట్లు చేసిన వానికి ధర్మార్థకామమోక్షములు కరతలామలకములు. ఇది శ్రీదుర్గా పూజా విధానము. దీనివలన జన్మసార్థక మగును. ధన్య మగును. ఇదంతయును నీకు తెల్పితిని. బ్రహ్మ-విష్ణువు మొదలగు నెల్ల దేవతలు మునులు యోగులు యోగనిష్ఠలు ఆశ్రమవాసులు. లక్ష్మి మున్నగు దేవతందఱును శివకామేశ్వరిని దుర్గను మనసార ధ్యానింతురు. దుర్గాదేవిని స్మరించినచో జన్మతరించును. పదునలుగురు మనువులును దుర్గాదేవి చరణ కమలములు ధ్యానించుట వలన మనువు లైరి. దేవతలును తమ గొప్ప గొప్ప పదవు లలంకరించగల్గిరి. ఈవిధముగ రహస్యాతి రహస్యమైన దుర్గాదేవీ చరిత్ర మంతయును వినిపించితిని. పంచ ప్రకృతులను వారి యంశజులను గూర్చి విపులముగ దెలిపినతిని. నాచేత చెప్పబడిన దీనిని వినిన మానవుడు ముమ్మాటికి నిక్కముగ మహావిద్యావంతుడు గాగలడు. ఎవ డే కోర్కితో వినునో వాని కా కోరిక తేరును. దీని శరన్న వరాత్రములందు శ్రీదేవి సన్నిధానమునందు నిశ్చల మనస్సుతో చదివినచో వానికి దేవి వశ్యురా లగును. వాడు దేవికి ప్రియభక్తుడు గాగలడు. ఇందు గూర్చి యథా విధిగ శకునములు చూచుకొనవలయును. దాని క్రమ మెట్లనగా నొక కుమారిక చేతగాని వటువు చేతగాని ఏదేని మనస్సులో తంచుకొని దేవి పుస్తకమును మొదట పూజింపవలయును. ఆ జగదీశానిని మాటిమాటికి నమస్కరించవలయును. చక్కగా స్నానముచేసిన ఒక కన్యను తెచ్చి యామెను పూజించవలయును. ఆమె చేతి కొక బంగారు కడ్డీ నీయవలయును. ఆమె దానిని శుభాశుభ స్థానములం దెచ్చట నుంచునో తెలిసికొని దానిని బట్టి తన కోరిక ఫలమెఱుంగవలయును. ఆ బాలిక ప్రసన్నయైన దేవి తలంచవలయును. ఉపేక్షించియున్న దేవి యుదాసీనగ నుండునని యెఱుగవలయును. దానిని బట్టి ఫలితములును తెలియవలయును.


*ఇది శ్రీదీవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధమందు యేబదవ యధ్యాయము*


*మూడువేల ఆరు వందల యిరువదైదున్నర శ్లోకములుగల నవమ స్కంధము సమాప్తము.*

0 कॉमेंट्स • 0 शेयर
Shanti pathak May 16, 2021

+44 प्रतिक्रिया 11 कॉमेंट्स • 43 शेयर
Sweta Saxena May 16, 2021

+26 प्रतिक्रिया 6 कॉमेंट्स • 13 शेयर
Ramesh Agrawal May 16, 2021

+17 प्रतिक्रिया 6 कॉमेंट्स • 48 शेयर

+8 प्रतिक्रिया 1 कॉमेंट्स • 1 शेयर

पुराने समय की बात है। मोहन काका डाक विभाग के कर्मचारी थे। बरसों से वे माधोपुर और आस पास के गाँव में चिट्ठियां बांटने का काम करते थे। एक दिन उन्हें एक चिट्ठी मिली, पता माधोपुर के करीब का ही था लेकिन आज से पहले उन्होंने उस पते पर कोई चिट्ठी नहीं पहुंचाई थी। रोज की तरह आज भी उन्होंने अपना थैला उठाया और चिट्ठियां बांटने निकल पड़े। सारी चिट्ठियां बांटने के बाद वे उस नए पते की ओर बढ़ने लगे। दरवाजे पर पहुँच कर उन्होंने आवाज़ दी, “पोस्टमैन!” अन्दर से किसी लड़की की आवाज़ आई, “काका, वहीं दरवाजे के नीचे से चिट्ठी डाल दीजिये।” “अजीब लड़की है, मैं इतनी दूर से चिट्ठी लेकर आ सकता हूँ और ये महारानी दरवाजे तक भी नहीं निकल सकतीं !”, काका ने मन ही मन सोचा। “बाहर आइये! रजिस्ट्री आई है। हस्ताक्षर करने पर ही मिलेगी!”, काका खीजते हुए बोले। “अभी आई।”, अन्दर से आवाज़ आई। काका इंतज़ार करने लगे, पर जब 2 मिनट बाद भी वह नहीं आयी तो उनके सब्र का बाँध टूटने लगा। “यही काम नहीं है मेरे पास, जल्दी करिए और भी चिट्ठियां पहुंचानी है।” ऐसा कहकर काका दरवाज़ा पीटने लगे। कुछ देर बाद दरवाज़ा खुला। सामने का दृश्य देख कर काका चौंक गए। एक 12-13 साल की लड़की थी जिसके दोनों पैर कटे हुए थे। उन्हें अपनी अधीरता पर शर्मिंदगी हो रही थी। लड़की बोली, “क्षमा कीजियेगा मैंने आने में देर लगा दी, बताइए हस्ताक्षर कहाँ करने हैं?” काका ने हस्ताक्षर कराये और वहां से चले गए। इस घटना के आठ-दस दिन बाद काका को फिर उसी पते की चिट्ठी मिली। इस बार भी सब जगह चिट्ठियां पहुँचाने के बाद वे उस घर के सामने पहुंचे! “चिट्ठी आई है, हस्ताक्षर की भी ज़रूरत नहीं है…नीचे से डाल दूँ।”, काका बोले। “नहीं-नहीं, रुकिए मैं अभी आई।”, लड़की भीतर से चिल्लाई। कुछ देर बाद दरवाजा खुला। लड़की के हाथ में गिफ्ट पैकिंग किया हुआ एक डिब्बा था। “काका लाइए मेरी चिट्ठी और लीजिये अपना तोहफ़ा।”, लड़की मुस्कुराते हुए बोली। “इसकी क्या ज़रूरत है बेटा”, काका संकोचवश उपहार लेते हुए बोले। लड़की बोली, “बस ऐसे ही काका…आप इसे ले जाइए और घर जा कर ही खोलियेगा!” काका डिब्बा लेकर घर की और बढ़ चले, उन्हें समझ नहीं आ रहा था कि डिब्बे में क्या होगा? घर पहुँचते ही उन्होंने डिब्बा खोला और तोहफ़ा देखते ही उनकी आँखों से आंसू टपकने लगे। डिब्बे में एक जोड़ी चप्पलें थीं। काका बरसों से नंगे पाँव ही चिट्ठियां बांटा करते थे लेकिन आज तक किसी ने इस ओर ध्यान नहीं दिया था। ये उनके जीवन का सबसे कीमती तोहफ़ा था…काका चप्पलें कलेजे से लगा कर रोने लगे। उनके मन में बार-बार एक ही विचार आ रहा था कि बच्ची ने उन्हें चप्पलें तो दे दीं पर वे उसे पैर कहाँ से लाकर देंगे? दोस्तों, संवेदनशीलता या sensitivity एक बहुत बड़ा मानवीय गुण है। दूसरों के दुःखों को महसूस करना और उसे कम करने का प्रयास करना एक महान काम है। जिस बच्ची के खुद के पैर न हों उसकी दूसरों के पैरों के प्रति संवेदनशीलता हमें एक बहुत बड़ा सन्देश देती है। आइये हम भी अपने समाज, अपने आस-पड़ोस, अपने यार-मित्रों,अजनबियों सभी के प्रति संवेदनशील बनें…। आइये हम भी किसी के नंगे पाँव की चप्पलें बनें और दुःख से भरी इस दुनिया में कुछ खुशियाँ फैलाएं... 🌈 राह दे राधे राधे 🌈

+247 प्रतिक्रिया 54 कॉमेंट्स • 326 शेयर
surandar Nagar May 16, 2021

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 6 शेयर
shiva May 16, 2021

+4 प्रतिक्रिया 1 कॉमेंट्स • 0 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB