0 कॉमेंट्स • 0 शेयर
BVRMKMY May 16, 2021

0 कॉमेंट्स • 0 शेयर
Eswar Tanikella May 14, 2021

0 कॉमेंट्स • 0 शेयर
Eswar Tanikella May 14, 2021

0 कॉमेंट्स • 0 शेयर
Dvsraju May 14, 2021

శివయ్యా చూస్తున్నావా అస్పత్రులలో అవసరానికి తగిన వసతులు లేవు కావలసిన మందులు దుకాణలలో లభ్యం కావటం లేదు ఎవరిని ఎప్పుడు ఎలా తగులుకుంటుందో తెలియదు ఆ మహమ్మారి ఎవరి ఊపిరి ఎప్పుడు ఆగుతుందొ తెలియదు ఎవరి గుండె ఎప్పుడు భారంగా కొట్టుకుంటుందో ఎరుగము ఒంటరిగా తోడు ఎవరూ లేక ఆవేదన ఆక్రోశం పంచుకొనే వారు లేక బతుకు పోరాటం చేయలేక ఆగలేక జీవుల వేదన చూసావా కుటుంబాలకు కుటుంబాలే తలకిందులు అవుతున్నాయి మొన్నలా నిన్న నిన్నలా నేడు నేడులా రేపు ఉండటం లేదు ఏ మనిషిని కదిలించినా చెప్పుకోలేని వ్యధలే ఏ మనసుని తరచి చూసినా తడి ఆరని కనులే సర్వం కోల్పోయిన వారూ ఎందరో తల్లి తండ్రులను తోబుట్టువులను కని పెంచినవారిని ప్రాణ ప్రదమైన ఆత్మీయులను భాగస్వములను పోగొట్టుకొని జీవన పయనం దుర్బరం ఐన వారు ఎందరో వారితో పాటే మమ్మల్ని తీసుకుపోమ్మనే అర్తనాదాలు వినపడటం లేదా ఆలయాలలో పూజాలందుకొని శిలలా మారిపోయావా అన్న ప్రశ్న వినలేదా జగతికి తల్లి తండ్రులు ఎందుకు బిడ్డలను కాపాడరు అన్న ఆక్రోశం తెలియటం లేదా? మేలుకోవయ్యా ఎలుకోవయ్యా కింకరుల ఆదుకోవయ్యా శివయ్యా నీవే దిక్కయ్యా

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 27 शेयर
Sriram May 15, 2021

0 कॉमेंट्स • 0 शेयर

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 398🌹* రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ *🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* అధ్యాయము - 19 *🌻. కామదహనము - 3 🌻* దేవలిట్లు పలికిరి- కొద్దిగా భస్మను తీసుకొని శ్రద్ధగా చేయుము. భయమును వీడుము. ఆ మన్మథుని శివుడు బ్రతికించగలడు. నీకు మరల ప్రియుడు దక్కగలడు (27). సుఖమును గాని దుఃఖమును గాని జీవునకు ఇతరులెవ్వరూ ఈయరు. సర్వప్రాణులు తమ కర్మఫలములను అనుభవించెదరు. నీవు వ్యర్థముగా దేవతలను నిందించుచున్నావు(28). బ్రహ్మ ఇట్లు పలికెను- దేవతలందరు రతిని ఈ విధముగా ఓదార్చి శివుని వద్దకు వెళ్లిరి. శివుని మిక్కిలి భక్తితో ప్రసన్నునిగా జేసి ఈ మాటలను పలికిరి (29). దేవతలిట్లు పలికిరి- హే భగవాన్‌! ప్రభో! మహేశ్వరా! నీవు శరణు జొచ్చిన వారిపై ప్రేమ గలవాడవు. దయతో మా ఈ శుభవచనమును వినుము. (30) హే శంకరా! మన్మథుడు చేసిన ఈ పనిని నీవు ప్రీతితో చక్కగా విచారించుము. మహేశ్వరా! కాముడు ఈ పనిని చేయుటలో ఆతని స్వార్థచింతన లేదు (31). హే విభో! నాథా! దుష్టుడగు తారకునిచే పీడింపబడిన దేవతలందరు కలసి ఈ వనిని ఆతని చేత చేయించినారు. ఓ శంకరా! నీవు మరియొక విధముగా తలంపవద్దు (32). హే దేవా! దుఃఖితురాలైన రతీదేవి ఏకాకినియై విలపించుచున్నది. హే కైలాసాధిపతీ! నీవు కూడ ఆమెను ఓదార్చుము (33). హే శంకరా! నీవు ఈ క్రోధముతో సర్వమును సంహరింప బూనుకొంటివి. నీవు ఆ మన్మథుని సంహరించినచో, దేవతలతో సహా అందరినీ సంహరించినట్లే యగును (34). ఆ రతీదేవి యొక్క దుఃఖమును చూచి దేవతలు తామే నశించినట్లు భావించుచున్నారు. కావున నీవు కూడ రతీదేవి యొక్క శోకమును తొలగించవలసియున్నది (35). బ్రహ్మ ఇట్లు పలికెను- ఆ దేవతలందరి యొక్క ఈ మాటలను విని ప్రసన్నుడై భగవాన్‌ శివుడిట్లు పలికెను (36). శివుడిట్లు పలికెను- దేవతలారా! ఋషులారా! మీరందరు నామాటను శ్రద్ధగా వినుడు. నా క్రోధముచే ఏది జరిగినదో అది అటులనే జరుగవలసి యున్నది. మరియొక విధానము లేదు (37). భూమి యందు కృష్ణుడు అవతరించి రుక్మిణిని చెట్టపట్టునంతవరకు రతీదేవి భర్తయగు కామ ప్రభుడు దేహము లేనివాడై ఉండుగాక! (38) కృష్ణుడు ద్వారకయందు నివసించి రుక్మిణి యందు సంతానమును పొందగలడు. వారిలో మన్మథుడు కూడ ఒకడై జన్మించగలడు (39). వానికి ప్రద్యుమ్నుడను పేరు ఉండును. దీనిలో సందేహము లేదు. ఆ బాలుడు పుట్టగానే శంబరుడు వానని అపహరించగలడు (40). మూర్ఖుడగు శంబరాసురుడు ఆ బాలుని అపహరించి సముద్రములో పారవేసి మరణించినాడని భ్రమించి తన నగరమునకు వెళ్లగలడు (41). ఓ రతీ! నీవు అంతవరకు ఆ నగరమునందు సుఖముగా నుండుము. నీ భర్తయగు ప్రద్యుమ్నుడు నీకు అచటనే లభించగలడు (42). అచట కాముడు యుద్ధములో శంబరుని వధించగలడు. ప్రద్యుమ్నుడను పేరుతో ప్రసిద్ధి గాంచిన వాడై ఆతడు తన ప్రియురాలిని కలిసి సుఖించగలడు. ఓ దేవతలారా! (43). ఆతడు శంబరుని ధనమునంతనూ తీసుకొని రతీదేవి తోడు రాగా తన నగరమునకు వెళ్లగలడు. దేవతలారా! నా మాట సత్యము (44). సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 #శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
Eswar Tanikella May 14, 2021

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజాం । భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 1 ॥ గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలం । జటాజూట గంగోత్తరంగైర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 2॥ ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తం । అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 3 ॥ వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశం । గిరీశం గణేశం సురేశం మహేశం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 4 ॥ గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహం । పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్-వంద్యమానం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 5 ॥ కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దదానం । బలీవర్ధమానం సురాణాం ప్రధానం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 6 ॥ శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం । అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 7 ॥ హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం। శ్మశానే వసంతం మనోజం దహంతం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 8 ॥ స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నం । సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి ॥ 🙏☯️🕉️🌞🔱🚩 ఓంనమఃశివాయ 🙏🙏🙏🙏🙏

0 कॉमेंट्स • 0 शेयर
Eswar Tanikella May 14, 2021

0 कॉमेंट्स • 0 शेयर
Eswar Tanikella May 14, 2021

నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై "న" కారాయ నమః శివాయ మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై "మ" కారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై "శి" కారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై "వ" కారాయ నమః శివాయ యజ్ఞ స్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై "య" కారాయ నమః శివాయ పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే భావం నాగేంద్రుని హారముగా ధరించిన వాడు, మూడు కన్నులు గలవాడు, పవిత్రమైన బూడిదని ఒళ్లంతా పూసుకొన్న వాడు, మహేశ్వరుడు, నిత్యుడు, శుద్ధ స్వరూపుడు, నలుదిక్కులను వస్త్రములుగా ధరించిన వాడు, పంచాక్షరీ మహామంత్రంలో 'న' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము. మందాకిని నదీ జలాలతో పూజింపబడే వాడు, చందనంతో పూయబడిన మేని కలిగిన వాడు నంది, సకల భూతప్రేతాలకు అధిపతి అయిన మహేశ్వరుడు, మందారం మరియు అనేక ఇతర పుష్పాలతో పూజింపబడేవాడు, పంచాక్షరీ మహామంత్రంలో ' మ' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము. మంగళ కరుడు, గౌరీ వదనారవిందాన్ని ఉదయింపజేసే సూర్యుడు, దక్షుని యజ్ఞం నాశనం చేసిన వాడు, నీలకంఠుడు, వృషభధ్వజుడు, పంచాక్షరీ మహామంత్రంలో 'శి' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము. వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు మొదలైన మునిశ్రేష్ఠులచే మరియు సకల దేవతలచే పూజింపబడే వాడు, విశ్వమంతటికీ కిరీటం వంటి వాడు (శేఖరుడు), సూర్య, చంద్ర, అగ్నులను మూడు కన్నులుగా కలిగినవాడు, పంచాక్షరీ మహామంత్రంలో ' వ' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము. యజ్ఞస్వరూపుడు, జటాధరుడు, త్రిశూలం ధరించిన వాడు, సనాతనుడు, తేజస్సు కలవాడు, నలుదిక్కులను వస్త్రములుగా ధరించిన వాడు, పంచాక్షరీ మహామంత్రంలో ' య' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము. 🙏☯️🕉️🌞🔱🚩 ఈ పంచాక్షరీ స్తోత్రమును శివసన్నిధిలో జపించువారు, శివలోక ప్రాప్తి కలిగి బ్రహ్మానందులై ఉందురు.

0 कॉमेंट्स • 0 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB