Eswar Tanikella
Eswar Tanikella Sep 15, 2021

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 22 शेयर
Eswar Tanikella Oct 26, 2021

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
Eswar Tanikella Oct 26, 2021

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Eswar Tanikella Oct 26, 2021

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
SRINIVASASAI DURGA Oct 26, 2021

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 14 शेयर

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर
svsaastri Oct 24, 2021

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Eswar Tanikella Oct 26, 2021

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Eswar Tanikella Oct 26, 2021

#ఆథ్యాత్మికభక్తివిశేషాలు 🌺 💐💐💐ఆంజనేయ ప్రార్దనలు💐💐💐 👉 మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం! వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామ దూతమ్ శిరసా నమామి|| 👉అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామచంద్ర కృపాసింధో మ త్కార్యం సాధయ ప్రభో|| 👉బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగతా అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్|| భావం: హనుమంతుని నామం తలచినంతనే బుద్ధికుశలత, బలం, కీర్తి, ధైర్యం, శక్తి, చక్కగా పొందికగా మాట్లాడగల శక్తి మొదలగునవి కలుగుతాయి. 💐అష్టోత్తర శత నామావళి 💐 ఓం శ్రీ ఆంజనేయాయ నమః ఓం మహావీరాయ నమః ఓం హనుమతే నమః ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః ఓం మారుతాత్మజాయ నమః ఓం తత్త్వఙ్ఞానప్రదాయ నమః ఓం అశొకవనికాచ్చేత్రే నమః ఓం సర్వబంధ విమోక్త్రే నమః ఓం రక్షోవిధ్వంసకారకాయనమః ఓం పరవిద్వప నమః ఓం పరశౌర్య వినాశనాయ నమః ఓం పరమంత్ర నిరాకర్త్రే నమః ఓం పరమంత్ర ప్రభేవకాయ నమః ఓం సర్వగ్రహ వినాశినే నమః ఓం భీమసేన సహాయకృతే నమః ఓం సర్వదుఃఖ హరాయ నమః ఓం సర్వలోక చారిణే నమః ఓం మనోజవాయ నమః ఓం పారిజాత ధృమమూలస్ధాయ నమః ఓం సర్వమంత్ర స్వరూపవతే నమః ఓం సర్వయంత్రాత్మకాయ నమః ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః ఓం కపీశ్వరాయ నమః ఓం మహాకాయాయ నమః ఓం సర్వరోగహరాయ నమః ఓం ప్రభవే నమః ఓం బలసిద్ధికరాయ నమః ఓం సర్వ విద్యాసంపత్ర్ప వాయకాయ నమః ఓం కపిసేనా నాయకాయ నమః ఓం భవిష్యచ్చతు రాననాయ నమః ఓం కూమార బ్రహ్మచారిణే నమః ఓం రత్నకుండల దీప్తిమతే నమః ఓం చంచల ద్వాల సన్నద్ధలంబమాన శిఖోజ్వలాయ నమః ఓం గందర్వ విద్యాతత్వఙ్ఞాయ నమః ఓం మహాబలపరాక్రమాయ నమః ఓం కారాగృహ విమోక్త్రే నమః ఓం శృంఖల బంధ విమోచకాయ నమః ఓం సాగరోత్తారకాయ నమః ఓం ప్రాఙ్ఞాయ నమః ఓం రామదూతాయ నమః ఓం ప్రతాపవతే నమః ఓం వానరాయ నమః ఓం కేసరిసుతాయ నమః ఓం సీతాశోక నివారణాయ నమః ఓం అంజనా గర్భసంభుతాయ నమః ఓం బాలర్క సదృశాననాయ నమః ఓం విభీషణ ప్రియకరాయ నమః ఓం దశగ్రీవ కులాంతకాయ నమః ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః ఓం వజ్రకాయాయ నమః ఓం మహాద్యుతయే నమః ఓం చిరంజీవినే నమః ఓం రామభక్తాయ నమః ఓం ద్తెత్యకార్య విఘాతకాయ నమః ఓం అక్షహంత్రే నమః ఓం కాంచనాభాయ నమః ఓం పంచవక్త్రాయ నమః ఓం మహాతపసే నమః ఓం లంకిణేభంజనాయ నమః ఓం గంధమాదన శ్తెల నమః ఓం లంకాపుర విదాహకాయ నమః ఓం సుగ్రీవ సచివాయ నమః ఓం ధీరాయ నమః ఓం శూరాయ నమః ఓం ద్తెత్యకులాంతకాయ నమః ఓం సురార్చితాయ నమః ఓం మహాతేజసే నమః ఓం రామ చూడామణి ప్రదాయ కామరూపివే నమః ఓం శ్రీ పింగళాక్షాయ నమః ఓం నార్ధి ంతే నాక నమః ఓం కబలీకృత మార్తాండమండలాయ నమః ఓం కబలీకృత మార్తాండ నమః ఓం విజితేంద్రియాయ నమః ఓం రామసుగ్రీవ సందాత్రే నమః ఓం మహారావణ మర్ధనాయ నమః ఓం స్పటికా భాయ నమః ఓం వాగ ధీశాయ నమః ఓం నవ వ్యాకృతి పండితాయ నమః ఓం చతుర్భాహవే నమః ఓం దీనబంధవే నమః ఓం మహత్మనే నమః ఓం భక్త వత్సలాయ నమః ఓం సంజీవన నగా హర్త్రే నమః ఓం శుచయే నమః ఓం వాగ్మినే నమః ఓం దృఢవ్రతాయ నమః ఓం కాలనేమి ప్రమధనాయ నమః ఓం హరిమర్కట మర్కటాయనమః ఓం దాంతాయ నమః ఓం శాంతాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం శతకంఠ మదావహృతేనమః ఓం యోగినే నమః ఓం రామకధాలోలాయ నమః ఓం సీతాన్వేషణ పండితాయ నమః ఓం వజ్ర నఖాయ నమః ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః ఓం ఇంద్ర జిత్ప్ర్రహితా మోఘబ్రహ్మస్త్ర వినివార కాయ నమః ఓం పార్ధ ధ్వజాగ్ర సంవాసినే నమః ఓం శరపంజర భేదకాయ నమః ఓం దశబాహవే నమః ఓం లోకపూజ్యాయ నమః ఓం జాం వత్ప్ర తి వర్ధనాయ నమః ఓం సీత సమేత శ్రీరామపాద సేవా దురంధరాయ నమః🚩🚩🙏☯️🕉️🌞🔱🚩

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
Eswar Tanikella Oct 26, 2021

ఒకనాడు చిత్రకూట పర్వత ప్రాంతానికి ఇద్దరు రాకుమారులు గుర్రాలపై వచ్చారు.. అచ్చట తులసీదాస్ ను చూస్తూ కొంచెము సేపు విశ్రమించి వారు వెళ్ళడము జరిగినది. తులసీదాస్ ఆ రాకుమారులను చూశాడు కానీ పలుకరించలేదు. రాజులు ఎన్నో కార్యాల పై ఇటు వస్తుంటారువారు. వారి పనులు వారివి నా పనులు నావి. అని అనుకున్నాడు. ఆ రాజకుమారులు వెళ్లిపోయిన తర్వాత ఆంజనేయుడు ప్రత్యక్షమై "తులసీ! ఏమిటి ఇది? రామ దర్శన వాంఛతో జీవిస్తున్న నీవు రాముని గౌరవించక పోవడమేమిటయా ? కొద్ది నిముషాల క్రిందట రాకుమారుల వేషములో వచ్చినది ఎవరనుకుంటున్నావు ?... వారు రామలక్ష్మణులే సుమా". అని తెలియ జేయగా.... అప్పుడు తులసీ బాధతో విల విల లాడుతూ " ఎంతటి దురదృష్టవంతుని నేను. నా కోసం వచ్చిన రాముని పలుకరించలేక పోయానే.." అని దుఃఖించాడు. రామునికి నమస్కరించలేకపోయినందులకు పసిబిడ్డలా విలపించ సాగాడు. ఆంజనేయస్వామి మందహాసమును చిందిస్తూ తులసీ! దుఃఖించవలదు నీవు త్రికరణశుద్ధితో తారకమంత్రమును ధ్యానించుము. అతి త్వరలోనే మళ్ళీ నీకు రామదర్శనము కలుగగలదు" అని చెప్పి హనుమంతుడు అంతర్థానమయ్యెను. dear friends....... మనుషుల యొక్క మనస్తత్వాలు పలురకాలు... మనల్ని ఒకరు.... పరిచయం లేకపోయినా పలకరిస్తారు. మరి ఒకరు పరిచయం ఉన్నా కూడా పలకరించరు. కొందరు అవసరార్థం పలకరిస్తారు. మరి కొందరు అవసరం ఉన్నా కూడా పలకరించరు. కొందరు పలకరిస్తారు కానీ ఎదుటి వాళ్లు పలకరిస్తేనే వారి పలకరింపు ఉంటుంది. కానీ రామాయణంలో మాత్రం రాముని మనస్తత్వాన్ని చాలా అందంగా దర్శింప చేస్తాడు వాల్మీకిమహర్షి... మొదటి పలకరింపు రామచంద్రునిదే ఎప్పుడు కూడా.. ఎదుటి వారు తనను పలకరించాలని ఎదురు చూడడు రాముడు. తానే ముందుగా పలకరిస్తాడు. ఎదుటివారి నమస్కారం కోసం ఎదురుచూడడు తానే ముందుగా నమస్కరిస్తాడు. ఇది శ్రీరాముని హృదయం. మాయా ముసుగు ధరించి ప్రాణుల రూపంలో మాధవుడు నటిస్తున్నాడు. మనం ఏ ప్రాణికి నమస్కరించినా కూడ అది మాధవునికే చెందుతుంది. కనుక నమస్కరించడానికి మొహమాటం దేనికి ?. శ్రీరాముని మీ కొడుకు గా తలచి ఆశీర్వదించు. శ్రీరాముని నీ మిత్రుని గా భావించి అభినందించు. శ్రీరాముని తల్లిగా తండ్రిగా గురువుగా భావించి నమస్కరించు. ఈ క్రియ ఎప్పుడు చేయాలి ఎదురుగా రామచంద్రుని విగ్రహం ముందు ఇలా మాత్రమే భావన చేయడం కాదు... మన చుట్టూ ఉన్న ప్రాణుల రూపంలో అతడే ఉన్నాడని భావించి గ్రహించి మన ప్రవర్తన కదలాలి దివ్యంగా.... పెద్దలు ఇచ్చే ఆశీర్వాదం రామభద్రుడే ఇస్తున్నాడు. ఇది సత్యం. మన కంటే వయసులో ఒక నిమిషం పెద్ద అయినా సరే వారిని గౌరవించి నమస్కరించాలి. జ్ఞానంలో నీవు వారి కన్నా అదికుడ వై వుండవచ్చు గాక.... కానీ వయసుకు గౌరవం ఇవ్వాలి. ఈ విధానం చెప్పింది నేను కాదు సాక్షాత్తు గా రామచంద్రుడే చెప్పాడు. సాక్షాత్తుగా హనుమంతుడే చెప్పాడు. ఆ మహనీయులు ఇద్దరూ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే కదా. అయినప్పటికీ కూడా తమకన్నా వయసులో పెద్ద వారిని వారు గౌరవించారు తెలుసా!. మేము జ్ఞానులం మేము దైవ స్వరూపులం అని భీష్మించుకుని కూర్చో లేదు. మీరు రండి మీ అందరికీ మేము ఆశీర్వాదాలు ఇస్తాం. మీకు వరాలను ప్రసాదిస్తాం అని వారు ప్రవర్తించలేదు. ధర్మం ప్రకారం నడుచుకోవాలి. ఎందుకంటే ధర్మమే దైవము కనక. సరే ఫ్రెండ్స్ విషయానికి వస్తాను నా మాటలను మీరు సీరియస్గా తీసుకోవద్దు చాలా తేలిగ్గా తీసుకోండి ఓకేనా....🌼🌼🌼🙏😊 ఒక నాడు ఒక అందమైన గిరిజన బాలుడువచ్చి తులసీదాస్ పర్ణశాలముందు నిలబడి నవ్వుతూ " అయ్యా! ఏమిటి ఇది ? చాలా మంచి వాసన వస్తుంది "..అని అడిగాడు. గంధమును అరగదీస్తున్న తులసి ఆ బాలుని చూసి " బాబు! ఇది చందనం నీవు ముట్టుకోవద్దు. చేతులు చూడు చాలా మురికిగా ఉన్నాయి." అని మందలించాడు. ఆ పిల్లవాడు " సరేలే స్వామి! కొంచెము చందన లేపమును ఇవ్వవా" అని కోరుతాడు. ఇప్పుడుకూడా తులసిదాస్ రామచంద్రుని గుర్తించలేకపోతున్నాడని గ్రహించిన ఆంజనేయస్వామి రామచిలుక రూపమును ధరించి నీనుండి చందనమును గ్రహించువాడె రామచంద్రుడు అని గానము చేస్తాడు. చిత్రకూట్ కే ఘాట్ పర్ భాయి సంతన్ కీ భిర్| తులసీదాస్ చందన్ ఘిసే తిలక్ దేత్ రఘువీర || సాధు మహాత్ములు వశించు చిత్రకూటపర్వతమువద్ద రామభద్రుడు తులపి వద్దనుండి సుగంధలేపమును గ్రహించుచుండ రామచంద్రుని తులసి గుర్తించలేకపోతున్నాడు అని గానము చేశాడు. ఆంజనేయుని అమృతవచనములు తులసి చెవిని పడ్డాయి. తులసిదాస్ శరీరము కంపించిపోయింది నేత్రాలు అశ్రుపూరితమయ్యాయి శ్రీరాముని పాదాలపై పడి " స్వామి! మందమతిని మన్నించు. నిన్ను గుర్తించలేక పోతున్నాను రామా" అని దుఃఖించసాగాడు. బాలుని రూపంలో వచ్చిన రాముడు సరసంగా తులసి ముఖమునకు చందనము పూసి అదృశ్యమయ్యాడు. పవనపుత్రుడు తులసీదాసు కు దర్శనమిచ్చి " తులసీ! రామదర్శనము తో నీ జన్మ ధన్యమైనది. నీవు కారణజన్ముడవు నీవు మరచిపోయిన కార్యమును జ్ఞాపకముచేయుటకై నేను నీకడ కేతెంచినాను. శ్రీ వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్రామాయణ మహాకావ్యమును సామాన్యులకు అర్థమయ్యే విధంగా హిందీ భాషలో రచించు. శ్రీరాముని మనస్సు ఎటువంటిదో ప్రజలకు తెలిపి వారిని ఆనందడోలికల్లో ముంచు. “రామచరిత మానసము " అను పేర రామకథ రచన కొనసాంగించి నీ జన్మను సార్ధకమొనర్చుకో. నీవు నీ భార్యతో గూడి వానప్రస్థాశ్రమమున ప్రవేశించి ...నిత్యము రామకథ ను వ్రాస్తూ ఉండు. వ్రాసిన ప్రతులను మహాభక్తురాలైన నీ భార్యకు విని పించు. " అని ఆశీర్వదించి అంతర్జాన మయ్యేను. హనుమంతుని సలహాను శిరోధార్యంగా భావించి... రాజ్ పూర్ కు వెళ్లి జరిగిన సంగతులన్నీ తన అర్ధాంగి రత్నావళి కి వివరించి ఆమెను తోడు తీసుకుని వాన ప్రస్థాశ్రమ ప్రవేశముచేసి శ్రీ రామచరిత మానసమను పవిత్ర గ్రంథమును సంత్ తులసీదాస్ గారు హృదయకంజకముగా రచించుటకు ఉపక్రమించారు. రామకధ నడచు చుండగా సాక్షాత్తు రాముడే తనముందు కదిలియాడుచున్నట్లు తులసీదాసునకు ఆనుభూతి కలిగేది. నిరంతరము రామజ్యోతిని హృదయ మందిరమున ప్రతిష్ఠించుకొని రామనామామృతమును పానముచేయుచూ రామ రూపమును దర్శించు చూ రామగానము నాలకించు చూ తన ధర్మపత్నియగు రత్నావళి సేవలు చేయుచుండగా రాముని హృదయం ఎటువంటిదో గ్రంథస్థం చేయడం మొదలుపెట్టాడు. ఇలా తులసిదాస్ జీవితం చాలా పవిత్రంగా కొనసాగుతన్నది. అప్పుడు ఆయన ఆశ్రమంలోనికి ఇద్దరు చోరులు ప్రవేశించారు.... 🙏☯️🕉️🌞🔱🚩 మిత్రులందరికీ శుభమస్తు. 🙏🌼🌼🌼🙏

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB