హే సాయిరామ్ హే సాయిరామ్ హరేహరే కృష్టా రాథే రాథే శ్యామ్ హే సాయిరామ్ హే సాయిరామ్ శుభ శుభోదయం 🙏🌼🙏🌼🙏

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 8 शेयर

*🚩సాయిభక్తుల అనుభవమాలిక 311వ భాగం🚩.* ☘️🌼☘️🌼☘️🌼☘️🌼☘️🌼☘️ sai maharaj sannidhiThursday, February 06, 2020 3 comments: ఈ భాగంలో అనుభవాలు: బాబా చూపుతున్న దయ బాబా లీల చూపించారు బాబా చూపుతున్న దయ ఓం సాయినాథాయనమః ముందుగా బాబా భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు సుజిత్ కుమార్. మా నివాసం వరంగల్. నేను సాయిభక్తుడిని. బాబా నన్ను తన భక్తునిగా స్వీకరించారని నా నమ్మకం. ఆయనే మాకు తల్లి, తండ్రి. మేము ఆపదలో ఉన్న ప్రతిసారీ ఆయన మాతో ఉంటూ ఆపదలను తొలగించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. నాకు బాబా ప్రసాదించిన అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరంలో ఒకసారి మా నాన్నగారు హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే మేము ఆయనను వరంగల్‌లోని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లి చూపించాము. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. శ్వాస తీసుకోవడం కూడా ఆయనకు చాలా కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో బాబా దయ చూపించారు. ఎవరో చెప్పడంతో మేము నాన్నని హైదరాబాద్ తీసుకొని వెళ్లి, అక్కడి హాస్పిటల్లో చేర్చాము. నేను, "బాబా! నాన్న త్వరగా కోలుకునేలా అనుగ్రహించండి" అని బాబాను దీనంగా వేడుకున్నాను. తరువాత డాక్టర్లు నాన్నకి శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. మేము సరేనని శస్త్రచికిత్స చేయించాము. కొన్నిరోజులకి నాన్న ఆరోగ్యం కుదుటపడి సాధారణ స్థితికి వచ్చారు. ఇదంతా బాబా మా మీద కురిపించిన దయ. ఆ సమయంలో మేము చాలా టెన్షన్ పడ్డాము. బాబా కృప, ఆయన చల్లని చూపు వల్ల మాకు మంచి జరిగి మేము ఆ కష్టం నుండి బయటపడ్డాము. ఈమధ్య నాకొక సమస్య వచ్చింది. అప్పుడు నేను అనుకున్నట్లు జరిగితే ఈ బ్లాగులో నా అనుభవం పంచుకుంటానని అనుకున్నాను. దాని పూర్తి వివరాలు ఇక్కడ వెల్లడించలేనుగానీ నేను అనుకున్నట్లే జరిగేలా బాబా అనుగ్రహించారు. ఇవి మన బాబా నా మీద కురిపించే ప్రేమ, ఆప్యాయతలకు రెండు ఉదాహరణలు మాత్రమే. ఆయన ప్రేమ అవధులు లేనిది. ఇకమీదట కూడా బాబా నాపై కురిపిస్తున్న ప్రేమను మీతో పంచుకుంటాను. "బాబా! మీరు నాపై చూపుతున్న దయకు చాలా చాలా కృతజ్ఞతలు. ఎప్పుడూ మీ రక్షణ భక్తులందరికీ ఉండాలని కోరుకుంటున్నాను". బాబా లీల చూపించారు ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు: నేను సాయిభక్తుడిని. నా ప్రతి చర్యలో బాబా ఉనికిని నేను అనుభవిస్తున్నాను. నా జీవితంలో ప్రతి దశలో బాబా ఆశీస్సులు నాతో ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాదిన్నర నుండి ఆయన నా జీవితంలో భాగమైపోయారు. బాబానే నా జీవితం. నా ప్రతిరోజూ బాబా పేరుతో మొదలై, బాబా పేరుతోనే ముగుస్తుంది. బాబా నా బెస్ట్ ఫ్రెండ్. ఏ కాస్త సమయం దొరికినా నా జీవితంలో జరిగిన ప్రతి అంశం గురించి ఆయనతో మాట్లాడుతూ, ఆయన మార్గదర్శకత్వాన్ని కోరుతాను. బాబా లేని నా జీవితాన్ని ఊహించటం కష్టం. బాబాకు దగ్గరగా ఉండగలగటం, ఆయనని తెలుసుకోవడం, అనుభూతి చెందడం చాలా సంతోషదాయకమైనది. నేను కొంతకాలంగా బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతున్నాను. బాబా భక్తుల సంక్షేమం కోసం చేసే అద్భుతాలను విశ్వసిస్తున్నప్పటికీ, 'అటువంటివి స్వీకరించేంత ధన్యత నేను కలిగి ఉన్నానా?' అనే ప్రశ్న నన్ను ఎప్పుడూ వెంటాడేది. బాబా నాకు అందుకు తగిన అనుభవం చూపించారు. దాన్నే నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఒకసారి నేను నా ఆఫీసులో ఒక ముఖ్యమైన ఫైలును పోగొట్టుకున్నాను. అవకాశమున్న ప్రతిచోటా నేను దానికోసం వెతికాను. అక్కడ సహాయకులుగా పనిచేసే అందరినీ అడిగాను, కానీ ప్రయోజనం లేకపోయింది. ఇక నేను ఆశ వదులుకున్నాను. కానీ ఫైల్ పోగొట్టుకున్న కారణంగా చెడు పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మనసు లోతుల్లో భయం చోటు చేసుకుంది. అందువలన నేను, "బాబా! నా ఈ అజాగ్రత్తకు నన్ను క్షమించి, దయచేసి నాకు సహాయం చెయ్యండి" అని ప్రార్థించాను. తరువాత రోజు నేను ఆఫీసుకు వెళ్తూ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కూడా, "బాబా! ఫైల్‌ దొరికేలా నాకు సహాయం చేయండి" అని హృదయపూర్వకంగా బాబాని అడిగాను. తరువాత నేను ఆఫీసుకు వెళ్ళాక, నా గదిలోకి ప్రవేశిస్తూనే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, ఆ ఫైల్ నా టేబుల్‌పైనే ఉంది. బాబా చూపిన ఈ కరుణకు నేను కృతజ్ఞతలతో సరిపెట్టలేను. నా ఈ అనుభవాన్ని నా తోటి సాయిభక్తులతో పంచుకుంటానని బాబాకు వాగ్దానం చేసినట్లుగానే నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా! దయచేసి సదా నాతో ఉండి నాకు సహాయం చేయండి". 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

*🚩సాయిభక్తుల అనుభవమాలిక 310వ భాగం.🚩* ☘️🌼☘️🌼☘️🌼☘️🌼☘️🌼☘️ sai maharaj sannidhiWednesday, February 05, 2020 4 comments: ఈ భాగంలో అనుభవాలు: చలానా చెల్లించకుండా బాబా రక్షించారు తక్షణ సహాయం అందించే సాయి చలానా చెల్లించకుండా బాబా రక్షించారు సాయిభక్తురాలు రోజా తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు: ఓం సాయిరామ్! నేను సాయిబాబాకు చిన్న భక్తురాలిని. చిన్నతనంనుండి బాబా గురించి నాకు తెలుసు. అయితే ఇతర దేవుళ్ళను ప్రార్థించినట్లే బాబాను కూడా ప్రార్థించేదాన్ని. ఆ సమయంలో నాకు సాయిబాబా లీలల గురించి ఏమీ తెలియదు. 2015లో నా స్నేహితురాలి ద్వారా నాకు బాబా లీలలు తెలిశాయి. అవి విన్న తరువాత నాలో బాబాపట్ల విశ్వాసం ఏర్పడి ప్రతి గురువారం బాబా మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టాను. అప్పటినుండి నా జీవితం పూర్తిగా మారిపోయింది. నాకు బాబా చాలా అనుభవాలు ఇచ్చారు. దయతో బాబా నాకు చాలాసార్లు గోడ మీద దర్శనం ఇచ్చారు. అంటే, ప్లెయిన్ గోడపై బాబా ముఖం కనిపించేది. అవసరంలో ఆయన తన ఉనికిని కూడా నాకు తెలియజేశారు. ఇక నా అనుభవానికి వస్తే... నేను ఇటీవలే బిటెక్ పూర్తిచేశాను. తరువాత నేను ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఉద్యోగం వచ్చేవరకు ఖాళీగా ఉండకుండా నేను, నా స్నేహితులిద్దరితో ఒక కోర్సులో చేరాను. ఇన్‌స్టిట్యూట్ దూరంగా ఉండటం వలన మేము స్కూటీ అద్దెకు తీసుకుని వెళ్లి వస్తుండేవాళ్ళం. ఒకరోజు మేము ముగ్గురం ఇన్‌స్టిట్యూట్ అయిపోయాక ఒక కొత్త మార్గం గుండా స్కూటీ మీద వస్తున్నాము. హఠాత్తుగా మేము పోలీసులకు పట్టుబడ్డాము. ఆ పోలీసు ఆఫీసర్ అందరిపై అరుస్తున్నాడు. మాకు భయమేసింది. అతను జరిమానా కట్టించుకోకుండా ఎవరినీ వదిలింది లేదట. ఆ సమయంలో మావద్ద ఒక్క రూపాయి కూడా లేదు. మాకు హెల్మెట్, లైసెన్స్ కూడా లేవు. పైగా మేము ముగ్గురం ఒకే స్కూటీ మీద వస్తున్నాము. పోలీసులు మా స్కూటీ తాళం తీసుకుని పక్కన పెట్టారు. మేము అతనిని అభ్యర్థించడానికి అతని వద్దకు వెళ్ళాము. కానీ అతను మాపై అరిచాడు. ఏమి చేయాలో మాకు తెలియలేదు. ఆ స్థితిలో నేను సాయిపై నమ్మకముంచి ఆయననే ప్రార్థిస్తూ, "బాబా.. బాబా" అని జపిస్తూ ఉన్నాను. పోలీసులు పట్టుబడిన ప్రతి ఒక్కరికీ చలానా ఇవ్వకుండా వదిలిపెట్టడం లేదు. అయినప్పటికీ నేను బాబాపై పూర్తి విశ్వాసం ఉంచాను. కొంతసేపటి తర్వాత బాబా అద్భుతం చేశారు. పోలీసులు మమ్మల్ని చూసి, “మీరు వెళ్ళవచ్చు” అని అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఇది కేవలం నా ప్రియమైన బాబా వల్లనే సాధ్యమైంది. బాబా తన భక్తులను ఒంటరిగా వదిలిపెట్టరు. ఆయన తన భక్తుల నుండి ఏమీ ఆశించరు. ఆయనకు తన భక్తుల నుండి కావలసింది స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. ఆయన ఎల్లప్పుడూ తన భక్తులు శ్రద్ధ (విశ్వాసం), సబూరి (సహనం) అనే రెండు విషయాలను అనుసరించేలా చేస్తారు. మీరు బాబాను నిజంగా ప్రేమిస్తే, ఆయనపై పూర్తి విశ్వాసముంచి ఆయన దివ్య పాదకమలాల వద్ద అన్నింటినీ విడిచిపెట్టండి. ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది. "బాబా! జీవితంలో మీరు నాకిచ్చిన ప్రతిదానికీ నా ధన్యవాదాలు. నా ప్రియమైన సాయిదేవా! దయచేసి నన్ను ఎప్పుడూ మీ గురించి ఆలోచించేలా చేయండి. ఎల్లప్పుడూ నాతో ఉండండి బాబా". source:http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2558.html తక్షణ సహాయం అందించే సాయి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు: అందరికీ నమస్కారం. నేను ఒక చిన్న సాయిభక్తురాలిని. నేను అనుకున్నది జరిగితే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాతో చెప్పుకున్నాను. నేను ఇంట్లోనే ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాను. ఈమధ్య ఒకసారి అందులో కొంచెం నష్టం వచ్చే సమస్య ఏర్పడింది. అప్పుడు నేను, "బాబా! ఈ నష్టం నాకు రాకుండా చెయ్యండి. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. వెంటనే బాబా నాకు సహాయం చేశారు. ఆయన పిలిస్తే పలికే దైవం. ఎవరు ఎప్పుడు పిలిచినా తక్షణ సహాయం అందించడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. "థాంక్యూ సో మచ్ బాబా! మీ భక్తులను ఎల్లప్పుడూ ఇలాగే కాపాడుతూ ఉండండి". ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*🚩సాయిభక్తుల అనుభవమాలిక 309వ భాగం🚩.* ☘️🌼☘️🌼☘️🌼☘️🌼☘️🌼☘️ sai maharaj sannidhiTuesday, February 04, 2020 7 comments: ఈ భాగంలో అనుభవాలు: కలలో కూడా ఎటువంటి కష్టం కలగకుండా చూసుకుంటున్న బాబా సాయిబాబాను విశ్వసిస్తే, ఆయన ఖచ్చితంగా సమస్యను పరిష్కరిస్తారు కలలో కూడా ఎటువంటి కష్టం కలగకుండా చూసుకుంటున్న బాబా సాయిభక్తురాలు సుచిత్ర తనకు బాబా ప్రసాదించిన అనుభవాలనిలా పంచుకుంటున్నారు: సాయిబంధువులందరికీ సాయిరామ్! నాకు వచ్చిన ప్రతి కలలో నేను ఏదో ఒక కష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటాను. కానీ కలలో కూడా బాబా నాకు ఎటువంటి కష్టం కలగకుండా చూసుకుంటున్నారు. అవి కలలే అయినా బాబా సంరక్షణలో ఉన్నాననే అనుభూతి నాకెంతో ఆనందాన్నిస్తుంది. ఈ ఆనందాన్ని సాయి కుటుంబంతో పంచుకోవాలని అనుకుంటున్నాను. కొన్ని నెలల క్రితం వచ్చిన కలలో ఎవరో నన్ను చంపమని ఇద్దరు మనుషులని పంపించారు. వాళ్ళు కత్తి తీసుకోని నా దగ్గరకు రాగానే నేను బాబా ఆరతి పాట పాడటం మొదలుపెట్టాను. దాంతో వాళ్ళు నన్ను వదిలేసి, తిరిగి వెళ్లి తమను పంపిన వాళ్లతో, "ఆమెను చంపడం మా వల్ల కాద"ని చెప్పి వెళ్లిపోయారు. అందుకు వాళ్ళు, "మీ వల్ల కాకపోతే మేమే స్వయంగా వెళతామ"ని కత్తి తీసుకోని నా వద్దకు వచ్చారు. నేను భయంతో 'బాబా!' అని అరిచాను. వాళ్ళు చేయెత్తి నాకు నమస్కరించి, కడుపునిండా భోజనం పెట్టి, మా ఇంటికి పంపించేశారు. ఇంకోసారి కలలో నేను మా పాపను ఎత్తుకొని లిఫ్టులో ఉన్నాను. హఠాత్తుగా లిఫ్ట్ పాడైపోయి వేగంగా కిందకి జారసాగింది. ఆ పరిస్థితి ఎలా ఉందంటే, అదే వేగంతో లిఫ్ట్ నేలను తాకిందంటే పెద్ద పేలుడు (బ్లాస్ట్) సంభవించేలా ఉంది. అది సరిగా నేలను తాకే సమయంలో నేను 'బాబా!' అని అరిచాను. లిఫ్ట్ నెమ్మదిగా ఆగింది. మరొక కలలో ఎక్కడో ఒక చిక్కుడుకాయల చెట్టు ఉంది. నేను దాన్ని చూస్తూ ఉన్నాను. దాని వెనకాల రెండు కోతులున్నాయి. వాటిని చూస్తూనే నేను భయపడ్డాను. అంతలో వాటిలో ఒకటి కోపంగా నా మీదకు వచ్చి, నా చేయి పట్టుకొని నోట్లో పెట్టుకొని కొరకబోయింది. నేను 'బాబా!' అని గట్టిగా అరిచాను. దాంతో అది నా చేయి వదిలేసి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. "పిలిస్తే పలుకుతాను" అన్న బాబా మాటను నా చిన్నప్పటినుండి విన్నాను, చదివాను. ఆ మాట ఎంత అక్షరసత్యమో నేను అనుభవిస్తున్నాను. కలలోనే కాకుండా నిజజీవితంలో కూడా ఆ అనుభూతిని పొందుతున్నాను. "బాబా! నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే, మీ సన్నిహిత భక్తులైన మహల్సాపతి, తాత్యాపాటిల్ ల అంతటి గొప్ప స్థానాన్ని కాకపోయినా మీ పాదాల చెంత చిన్న ప్రాణిగా అయినా స్థానాన్ని ప్రసాదించండి దేవా, సాయినాథా!" సాయిబాబాను విశ్వసిస్తే, ఆయన ఖచ్చితంగా సమస్యను పరిష్కరిస్తారు ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు: ఓం సాయిరామ్! ఈమధ్యకాలంలో ఒకరాత్రి హఠాత్తుగా నా కొడుకుకి తీవ్రమైన జ్వరం వచ్చింది. తను మందులను వేసుకోవడానికి నిరాకరిస్తుండేవాడు. బలవంతంగా మందులు ఇవ్వడానికి ప్రయత్నిస్తే, ఉమ్మేసి వాంతి చేసుకునేవాడు. కనీసం తడిగుడ్డతో తన శరీరాన్ని తుడిచే ప్రయత్నం చేసినా కూడా తను అవకాశమివ్వక తీవ్రంగా ఏడుస్తుండేవాడు. మేము చాలా ఆందోళన చెందాము. మరుసటిరోజు ఉదయం మేము తనని ఆసుపత్రికి తీసుకువెళ్ళాము. తనని పరీక్షించిన డాక్టర్, తన గొంతులో కొంత ఇన్ఫెక్షన్ ఉందని, టాన్సిల్స్ విస్తరించాయని చెప్పి, 5 రోజులు యాంటీబయాటిక్స్ వాడమని చెప్పారు. అక్కడినుండి ఇంటికి వెళ్ళాక జ్వర తీవ్రత ఇంకా ఎక్కువ అయింది. మరుసటిరోజు కూడా అదే పరిస్థితి కొనసాగింది. ముఖ్యంగా రాత్రిపూట జ్వరం చాలా ఎక్కువగా ఉంటుండేది. అందువలన తను ఏడుస్తూ ఉంటే మాకు చాలా ఆందోళనగా ఉండేది. మరుసటిరోజు మేము తనని తీసుకుని మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాము. ఈసారి డాక్టర్ రక్తపరీక్ష చేయించారు. రిపోర్టులు సాధారణంగా రావడంతో మునుపటి మందులే మరో రెండురోజులు కొనసాగించమని చెప్పారు. కానీ ఆరోజు రాత్రి కూడా అదే పరిస్థితి. నేను డాక్టరుకి పరిస్థితిని వివరిస్తూ ఒక మెయిల్ పంపాను. అందుకతను 5 రోజుల తరువాత కూడా ఈ మందులవల్ల ఎటువంటి స్పందనా లేకపోతే, ఐ.వి. ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఆ మాట వింటూనే నేను చాలా బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆ రాత్రి నేను సాయిబాబాను ప్రార్థించడం ప్రారంభించాను. బ్లాగులో అనుభవాలు చదువుతూ, నా బిడ్డకు జ్వరం మళ్లీ రాకూడదని పదేపదే బాబాను ప్రార్ధిస్తూ ఉన్నాను. బాబా రూపాన్ని చూస్తూ నేను కన్నీళ్ల పర్యంతమయ్యాను. నిజానికి నేను నా ఇంటర్మీడియట్ నుండి సాయిబాబా భక్తురాలిని. కానీ గత 5 రోజులలో నేను నా బిడ్డ జ్వరాన్ని తగ్గించమని బాబాను అస్సలు ప్రార్థించలేదు. ఆ రాత్రే సహాయం చేయమని బాబాను అర్థించాను. అద్భుతం! బాబా దయ చూపారు. మరుసటిరోజు ఉదయానికల్లా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చింది. "సాయిబాబా! చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి". మనం సాయిబాబాను విశ్వసిస్తే, ఆయన ఖచ్చితంగా మన సమస్యను పరిష్కరిస్తారు. "లవ్ యు సాయిబాబా!" 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🍌🥥🍌🙏🙏🙏🙏

+8 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB