_*శ్రీ దేవి భాగవతం - 257 వ అధ్యాయము*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *లక్ష్మీ చరితము - 3* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ *నారాయుణు డిట్లనియెను :* అంత దేవేంద్రుడు హరిని మనసులో ధ్యానించి బృహస్పతి ముందు నడువగ సురలు తేడురాగ బ్రహ్మసభ కేగెను. దేవత లెల్లరు నింద్ర గురువులతో గలిసి త్వరితగతి నటుల బ్రహ్మలోక మేగి బ్రహ్మకు నమస్కరించిరి. జరిగిన వృత్తాంతమంతయును బృహస్పతి బ్రహ్మకు నివేదించెను. అపుడు నలువ నవ్వి యింద్రున కిట్లనెను. వ్స! నీవు నా వంశమున బుట్టితివి - నా ముని మనుమడవు - గురుని శిష్యుడవు - సురపతివి. నీ మాతామహుడు విష్ణు భక్తుడు - ప్రతాపియైన దక్షుడు. ఇట్లు నీ మూడు కులములు పవిత్రములు గదా! మఱి నీ కహంకార మెట్లు గల్గెను? ఎవని తల్లి పతివ్రతయో ఎవని తండ్రి శుద్ధాత్ముడగు జితేంద్రియుడో ఎవని తాత - మేనమామలు పవిత్రులో యట్టి వాని కహంకార మెట్లు గల్గును. మానవుడు తండ్రి దోషమున మాతామహుని దోషమున గురుని దోషమున నీ మాట తప్పక తానును దోషియగును. సర్వాంతారాత్ముడగు భగవాను డెల్ల దేహములందు చైతన్యజ్యోతి గవెల్గుచుండును. అతడెవని శరీరమును వదలునో అతని శరీరము శవ మగును. ఇంద్రియములకు మనస్సధిపతి: శంకరుడు జ్ఞాన స్వరూపుడు; భగవతి - సతియగు బుద్ధియే ప్రకృతి. అది విష్ణునకు ప్రాణము. నిద్ర మున్నగు శక్తు లన్నియును ప్రకృతి కళలు. జీవుడాత్మ ప్రతిబింబము. ఈ భోగాయతన శరీరమును దాల్చువాడు. రాజు బయలుదేరగనే యతని యనుచరు లతని వెంటనడతురు. అటులే యాత్మ దేహమును విడువగనే శక్తు లన్నియు నతని ననుసరించును. శివుడు శేషుడు విష్ణువు ధర్ముడు మహావిరాట్టు మీరు నేను నెవని యంశజులమో యెవని భక్తులమో యతని పుష్పమును నీవు తిరస్కరించితివి. శివుడు విష్ణుని నే పుష్పముతో పూజించెనో దానిని హరి దుర్వాసున కిచ్చెను. ఆ ముని నీ కీయగ నీవు దానిని తిరస్కరించితివి. ఆ శ్రీకృష్ణుని పదకమలములం దుంచబడిన పుష్ప మెవని తలపై నుండునో యతడు సకల సురలలో నగ్రగణ్యుడగును. నీవు నష్ట భాగ్యుడవు: విధివంచితుడవు; దైవము బలవత్తరమైనది; ఆదృష్టహీనుడగు మూఢు నెవడును రక్షింపజాలడు. శ్రీకృష్ణుని నిర్మాల్యమును తిరస్కరించుట వలన నిపుడు రాజ్యశ్రీ నిన్ను వదలిపోయినది. కనుక గురుడు నేను వెంటరాగ నీవు వైకుంఠమున శ్రీపతిని సంసేవించి నా వరప్రభావమున తిరిగి లక్ష్మని బడయగలవు. అని బ్రహ్మ సురగణములతో తరలెను. అచటికి వెళ్ళి వారు భగవానుని దర్శించిరి. హరి స్వయంప్రకాశముతో వెల్గులు జిమ్ముచున్నాడు - సనాతనుడు - పరబ్రహ్మము - లక్ష్మిప్రియుడు - అనంతుడు - పరమశాంతుడు - ఆది మధ్యాంత రహితుడు - గ్రీష్మనున పట్ట పగలింటి నూఱు కోట్ల సూర్యుల కాంతులు విరజిమ్ముచున్నాడు. అతడు చతుర్బుజులగు పార్శ్వచరులతో గంగా సరస్వతులతో కొలువుండి నాల్గు వేదములతో నుతింపబడు పరమపురుషుడు. బ్రహ్మ మొదలగు దేవత లెల్లరును విష్ణునకు నమస్కరించిరి. వారు గద్గదకంఠముతో భక్తి నమ్రులై కన్నీ రొలుక పరమేశ్వరుని సంస్తుతించిరి. అపుడు బ్రహ్మ స్వయముగ దోసి లొగ్గి జరిగిన దంతయు విన్నవించెను. తమ తమ యధికారములు గోల్పోయిన దేవత లందఱును గోడుగోడున విలపించిరి. అంత శ్రీహరి రత్నభూషణములు - వాహనములు లేక భయముతో వణకుచు నాపదలందు జిక్కుకొనిన సురగణమును చూచెను. భయ నివారకుడు - అభయదాతయగు హరి శోభాప్రభలు - కోల్పోయి వెలవెబోవుచున్న దేవతలను చూచి యిట్లనెను. *శ్రీ భగవాను డిట్లనెను :* బ్రహ్మా! దేవతలారా! భయపడకుడు నే నుండగ మీకు భయమేల? పరమైశ్వర్యము గల్గించు శాశ్వతలక్ష్మీని మీకు ప్రసాదించగలను. నామాట కొంచె మాలకింపుడు. సమయోచితము - హితము - సత్యము - సారభూతము సుఖకరమైన మాట మీకు చెప్పెదను. ఈ యనంత బ్రహ్మాండములందలి ప్రాణి కోటు లెల్లను నా యధీనమం దుండును. నేను భక్తరాధీనుడను. అస్వతంత్రుడను. నా ప్రియభక్తుడు నన్నే నమ్నుకొనయుండు నిరంకుశుడు. అత డెవరిని కోపించునో వారియింట నేను - లక్ష్మీ యిర్వురము నివసింపము. దూర్వాసుడు శంకరాంశజుడు వైష్ణవుడు - నన్ను గొల్చువాడు. అతడు మీ కిచ్చిన శాపమువలన నేను - లక్ష్మీయును మీ గృహమునుండి వెడలి వచ్చితిమి. శంఖ ధ్వని తులసి శివార్చనము బ్రాహ్మణ నిత్యభోజనము లేని యింట లక్ష్మి నివసింపదు. బ్రహ్మా! సురలారా! నా భక్తులకు నాకు నింద గల్గినచోట సిరి యుండనొల్లదు. కోపముతో లేచిపోవును. ఏ మూఢుడు నా భక్తిలేక ఏకదాశి-అష్టమి-నా పుట్టిననాడు భోజనము చేయునో యతని యింట సిరి యుండనోపదు. నానామమును - కన్యకను నమ్నుకొను వాని యింట అతిధులు భుజింపని యింట లక్ష్మి వెడలిపోవును. రంకు టాలికి పుట్టిన బాపని యింట రంకు టాలి పతి యింట శూద్రుల శ్రాద్ధాన్నము తినువాని యింట లక్ష్మి నివసింపక కొపముతో లేచిపోవును. శూద్రుల శవములు కాల్చువాడు భాగ్యహీనుడగు ద్విజాధముడు. అట్టి పాపుల యింటినుండి రోషములతో లక్ష్మి లేచిపోవును. శూద్రుల వంటలు చేయువాడగు బ్రాహ్మణునింట నెడ్లబండిలాగు విప్రు నింట లక్ష్మి యుండక వెళ్ళును. అతని చేతి నీరు త్రాగుటకు లక్ష్మీ యిష్టపడదు. చిత్తశుద్ధి లేనివాడు క్రూరుడు హింసకుడు నిందకుడునైన ద్విజునింట శూద్రయాజియగు బ్రాహ్మణునింటి సిరి యుండదు. పతిపుత్రులులేని స్త్రీ చేతి యన్నము తినువాని యింట లచ్చి నివసింపదు. గోళ్లతో గడ్డి త్రుంచువాని యింట గోళ్లతో నేల గీకువాని యింట బ్రహ్మాణుడు నిరాశతో వెళ్ళు వాని యింట లక్ష్మి యుండనోపదు. సూర్యోదయమున భుజించువాని యింట పగలు నిద్రించువాని యింట పగలు రతి సల్పు వాని యింట సిరి యుండజాలదు. దురాచారియుగు విప్రు నింట శూద్రులనుండి దానము పట్టువాని యింట దీక్ష గైకొనని మూఢు నింట లక్ష్మి యుండదు. తడి కాళ్లతో - దిగంబరముగ నిదురుంచువాని యింట అజ్ఞాని-వదరుబోతునైన వాని యింట లచ్చి యుండనోపదు. తలకు నూరె రాచుకొని యా చేత నితరులను తాకువాని యింట తన శరీరముపై వాద్యము వాయుంచువాని యింట నుండక కొపముతో లచ్చి లేచిపోవును. వ్రతోపవాసము-సంధ్యావందనము చేయనివాని యింట విష్ణుభక్తి లేనివా యింట లక్ష్మి వసించదు. బ్రాహ్మణుని సతతము నిందించి ద్వేషించువాని యింట జీవహింస చేయుచు దయమాలినవాని యింట లక్ష్మియుండదు. ఎచ్చటెచ్చట శ్రీహరి పూజలు - నామ సంకీర్తనలును సాగుచుండునో యచ్చటచ్చట సర్వమంగళ మంగళయగు సిరి పాయక సిరులు గురియుచుండును. పితామహా! ఎచ్చోట శ్రీకృష్ణుని ప్రశంస జరుగునో కృష్ణ భక్తుల మహిమలు కొనియాడబడుచుండునో యచ్చోట కృశ్ణప్రియయగు లచ్చి వాసమై యుండును. ఎచొట దక్షిణావర్త శంఖము - శంఖధ్వని - తులసీధళ ముండునో హరిసేవ - వందనము - ధ్యానము జరుగునో యచొట లచ్చి కొలు వుండును. శివలింగార్చనము శివుని గుణనామ సంకీర్తనము శ్రీదుర్గాపుజ దూర్గా గుణ మహిమ గానము జరుగు తావులందు పద్మాలయ నివసించును. బ్రాహ్మణ పుజా-బ్రాహ్మణ భోజనము జరుగు చోట్ల సర్వ దేవార్చనము జరిగినట్లగును. కనుక నచ్చట లక్ష్మి నిక్కముగ కొలువై రాజిల్లును. అని దేవతలతో పలికి హరి మలర లక్ష్మీతో 'నీవు నీ యొక కళతో పాల సంద్రములో నవతరించు'మని పలికెను. ఇట్లు పలికిన పిదప కమలాపతి మరల బ్రహ్మతో నిట్లనియెను. ఓ బ్రహ్మా! దేవత లందఱును కలిసి సముద్రము మథించి లక్ష్మిని దేవతల కిండు. అని కమలాపతి పలికి తన యంతిపురమున కరిగెను. దేవతలును కొంత కాలమునకు పాలసంద్రము చేరిరి. మందరగిరిని కవ్వముగ శేషుని కవ్వపుత్రాడుగా తాబేటి నాధారముగ జేసి దేవాసురులు సాగరమును చిలికిరి. అపుడందుండి ధన్వంతరి ఉచ్చైఃశ్రవము ఐరావతము నానా రత్నములు సుదర్శనము లక్ష్మీ అమృతము నుద్బవించెను. నారదా! అంత క్షీరసాగర శయనుడు సర్వేశ్వరుడు రమ్యుడు నైన విష్ణు కంఠసీమలో లక్ష్మి వైజయంచి వనమాల నలంకిరంపజేసెను. అత్తఱి లక్ష్మిని సురలు బ్రహ్మ శివుడును పూజించిరి. బ్రాహ్మణ శాపము తొలగుట వలన కలుముల తల్లి మరల దేవతల యిండ్లలో నివసింపజొచ్చెను. నారదా! మహాలక్ష్మి వర ప్రసాదమున దైత్యులు భయంకరముగ దూరాక్రమణము చేసిన స్వర్గమును దేవతలు తిరిగి పొందిరి. ఇట్లు నీకు పవిత్రమైన లక్ష్మీదేవి మహోపాఖ్యానము వినిపించితిని. ఇది సుఖదము. సారభూతమునైనది. ఇంకేమి వినదలచితివో తెల్పుము. *ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమందలి తొమ్మిదివ స్కంధమున నలువదియొకటవ అధ్యాయము.*

_*శ్రీ దేవి భాగవతం - 257 వ అధ్యాయము*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️*లక్ష్మీ చరితము - 3*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*నారాయుణు డిట్లనియెను :* అంత దేవేంద్రుడు హరిని మనసులో ధ్యానించి బృహస్పతి ముందు నడువగ సురలు తేడురాగ బ్రహ్మసభ కేగెను. దేవత లెల్లరు నింద్ర గురువులతో గలిసి త్వరితగతి నటుల బ్రహ్మలోక మేగి బ్రహ్మకు నమస్కరించిరి. జరిగిన వృత్తాంతమంతయును బృహస్పతి బ్రహ్మకు నివేదించెను. అపుడు నలువ నవ్వి యింద్రున కిట్లనెను. వ్స! నీవు నా వంశమున బుట్టితివి - నా ముని మనుమడవు - గురుని శిష్యుడవు - సురపతివి. నీ మాతామహుడు విష్ణు భక్తుడు - ప్రతాపియైన దక్షుడు. ఇట్లు నీ మూడు కులములు పవిత్రములు గదా! మఱి నీ కహంకార మెట్లు గల్గెను? ఎవని తల్లి పతివ్రతయో ఎవని తండ్రి శుద్ధాత్ముడగు జితేంద్రియుడో ఎవని తాత - మేనమామలు పవిత్రులో యట్టి వాని కహంకార మెట్లు గల్గును. మానవుడు తండ్రి దోషమున మాతామహుని దోషమున గురుని దోషమున నీ మాట తప్పక తానును దోషియగును. సర్వాంతారాత్ముడగు భగవాను డెల్ల దేహములందు చైతన్యజ్యోతి గవెల్గుచుండును. అతడెవని శరీరమును వదలునో అతని శరీరము శవ మగును. ఇంద్రియములకు మనస్సధిపతి: శంకరుడు జ్ఞాన స్వరూపుడు; భగవతి - సతియగు బుద్ధియే ప్రకృతి. అది విష్ణునకు ప్రాణము. నిద్ర మున్నగు శక్తు లన్నియును ప్రకృతి కళలు. జీవుడాత్మ ప్రతిబింబము. ఈ భోగాయతన శరీరమును దాల్చువాడు. రాజు బయలుదేరగనే యతని యనుచరు లతని వెంటనడతురు. అటులే యాత్మ దేహమును విడువగనే శక్తు లన్నియు నతని ననుసరించును. శివుడు శేషుడు విష్ణువు ధర్ముడు మహావిరాట్టు మీరు నేను నెవని యంశజులమో యెవని భక్తులమో యతని పుష్పమును నీవు తిరస్కరించితివి.

శివుడు విష్ణుని నే పుష్పముతో పూజించెనో దానిని హరి దుర్వాసున కిచ్చెను. ఆ ముని నీ కీయగ నీవు దానిని తిరస్కరించితివి. ఆ శ్రీకృష్ణుని పదకమలములం దుంచబడిన పుష్ప మెవని తలపై నుండునో యతడు సకల సురలలో నగ్రగణ్యుడగును. నీవు నష్ట భాగ్యుడవు: విధివంచితుడవు; దైవము బలవత్తరమైనది; ఆదృష్టహీనుడగు మూఢు నెవడును రక్షింపజాలడు. శ్రీకృష్ణుని నిర్మాల్యమును తిరస్కరించుట వలన నిపుడు రాజ్యశ్రీ నిన్ను వదలిపోయినది. కనుక గురుడు నేను వెంటరాగ నీవు వైకుంఠమున శ్రీపతిని సంసేవించి నా వరప్రభావమున తిరిగి లక్ష్మని బడయగలవు. అని బ్రహ్మ సురగణములతో తరలెను. అచటికి వెళ్ళి వారు భగవానుని దర్శించిరి. హరి స్వయంప్రకాశముతో వెల్గులు జిమ్ముచున్నాడు - సనాతనుడు - పరబ్రహ్మము - లక్ష్మిప్రియుడు - అనంతుడు - పరమశాంతుడు - ఆది మధ్యాంత రహితుడు - గ్రీష్మనున పట్ట పగలింటి నూఱు కోట్ల సూర్యుల కాంతులు విరజిమ్ముచున్నాడు. అతడు చతుర్బుజులగు పార్శ్వచరులతో గంగా సరస్వతులతో కొలువుండి నాల్గు వేదములతో నుతింపబడు పరమపురుషుడు. బ్రహ్మ మొదలగు దేవత లెల్లరును విష్ణునకు నమస్కరించిరి. వారు గద్గదకంఠముతో భక్తి నమ్రులై కన్నీ రొలుక పరమేశ్వరుని సంస్తుతించిరి. అపుడు బ్రహ్మ స్వయముగ దోసి లొగ్గి జరిగిన దంతయు విన్నవించెను. తమ తమ యధికారములు గోల్పోయిన దేవత లందఱును గోడుగోడున విలపించిరి. అంత శ్రీహరి రత్నభూషణములు - వాహనములు లేక భయముతో వణకుచు నాపదలందు జిక్కుకొనిన సురగణమును చూచెను. భయ నివారకుడు - అభయదాతయగు హరి శోభాప్రభలు - కోల్పోయి వెలవెబోవుచున్న దేవతలను చూచి యిట్లనెను.

*శ్రీ భగవాను డిట్లనెను :* బ్రహ్మా! దేవతలారా! భయపడకుడు నే నుండగ మీకు భయమేల? పరమైశ్వర్యము గల్గించు శాశ్వతలక్ష్మీని మీకు ప్రసాదించగలను. నామాట కొంచె మాలకింపుడు. సమయోచితము - హితము - సత్యము - సారభూతము సుఖకరమైన మాట మీకు చెప్పెదను. ఈ యనంత బ్రహ్మాండములందలి ప్రాణి కోటు లెల్లను నా యధీనమం దుండును. నేను భక్తరాధీనుడను. అస్వతంత్రుడను. నా ప్రియభక్తుడు నన్నే నమ్నుకొనయుండు నిరంకుశుడు. అత డెవరిని కోపించునో వారియింట నేను - లక్ష్మీ యిర్వురము నివసింపము. దూర్వాసుడు శంకరాంశజుడు వైష్ణవుడు - నన్ను గొల్చువాడు. అతడు మీ కిచ్చిన శాపమువలన నేను - లక్ష్మీయును మీ గృహమునుండి వెడలి వచ్చితిమి. శంఖ ధ్వని తులసి శివార్చనము బ్రాహ్మణ నిత్యభోజనము లేని యింట లక్ష్మి నివసింపదు. బ్రహ్మా! సురలారా! నా భక్తులకు నాకు నింద గల్గినచోట సిరి యుండనొల్లదు. కోపముతో లేచిపోవును. ఏ మూఢుడు నా భక్తిలేక ఏకదాశి-అష్టమి-నా పుట్టిననాడు భోజనము చేయునో యతని యింట సిరి యుండనోపదు. నానామమును - కన్యకను నమ్నుకొను వాని యింట అతిధులు భుజింపని యింట లక్ష్మి వెడలిపోవును. రంకు టాలికి పుట్టిన బాపని యింట రంకు టాలి పతి యింట శూద్రుల శ్రాద్ధాన్నము తినువాని యింట లక్ష్మి నివసింపక కొపముతో లేచిపోవును. శూద్రుల శవములు కాల్చువాడు భాగ్యహీనుడగు ద్విజాధముడు. అట్టి పాపుల యింటినుండి రోషములతో లక్ష్మి లేచిపోవును. శూద్రుల వంటలు చేయువాడగు బ్రాహ్మణునింట నెడ్లబండిలాగు విప్రు నింట లక్ష్మి యుండక వెళ్ళును.

అతని చేతి నీరు త్రాగుటకు లక్ష్మీ యిష్టపడదు. చిత్తశుద్ధి లేనివాడు క్రూరుడు హింసకుడు నిందకుడునైన ద్విజునింట శూద్రయాజియగు బ్రాహ్మణునింటి సిరి యుండదు. పతిపుత్రులులేని స్త్రీ చేతి యన్నము తినువాని యింట లచ్చి నివసింపదు. గోళ్లతో గడ్డి త్రుంచువాని యింట గోళ్లతో నేల గీకువాని యింట బ్రహ్మాణుడు నిరాశతో వెళ్ళు వాని యింట లక్ష్మి యుండనోపదు. సూర్యోదయమున భుజించువాని యింట పగలు నిద్రించువాని యింట పగలు రతి సల్పు వాని యింట సిరి యుండజాలదు. దురాచారియుగు విప్రు నింట శూద్రులనుండి దానము పట్టువాని యింట దీక్ష గైకొనని మూఢు నింట లక్ష్మి యుండదు. తడి కాళ్లతో - దిగంబరముగ నిదురుంచువాని యింట అజ్ఞాని-వదరుబోతునైన వాని యింట లచ్చి యుండనోపదు. తలకు నూరె రాచుకొని యా చేత నితరులను తాకువాని యింట తన శరీరముపై వాద్యము వాయుంచువాని యింట నుండక కొపముతో లచ్చి లేచిపోవును. వ్రతోపవాసము-సంధ్యావందనము చేయనివాని యింట విష్ణుభక్తి లేనివా యింట లక్ష్మి వసించదు. బ్రాహ్మణుని సతతము నిందించి ద్వేషించువాని యింట జీవహింస చేయుచు దయమాలినవాని యింట లక్ష్మియుండదు. ఎచ్చటెచ్చట శ్రీహరి పూజలు - నామ సంకీర్తనలును సాగుచుండునో యచ్చటచ్చట సర్వమంగళ మంగళయగు సిరి పాయక సిరులు గురియుచుండును. పితామహా! ఎచ్చోట శ్రీకృష్ణుని ప్రశంస జరుగునో కృష్ణ భక్తుల మహిమలు కొనియాడబడుచుండునో యచ్చోట కృశ్ణప్రియయగు లచ్చి వాసమై యుండును. ఎచొట దక్షిణావర్త శంఖము - శంఖధ్వని - తులసీధళ ముండునో హరిసేవ - వందనము - ధ్యానము జరుగునో యచొట లచ్చి కొలు వుండును.

శివలింగార్చనము శివుని గుణనామ సంకీర్తనము శ్రీదుర్గాపుజ దూర్గా గుణ మహిమ గానము జరుగు తావులందు పద్మాలయ నివసించును. బ్రాహ్మణ పుజా-బ్రాహ్మణ భోజనము జరుగు చోట్ల సర్వ దేవార్చనము జరిగినట్లగును. కనుక నచ్చట లక్ష్మి నిక్కముగ కొలువై రాజిల్లును. అని దేవతలతో పలికి హరి మలర లక్ష్మీతో 'నీవు నీ యొక కళతో పాల సంద్రములో నవతరించు'మని పలికెను. ఇట్లు పలికిన పిదప కమలాపతి మరల బ్రహ్మతో నిట్లనియెను. ఓ బ్రహ్మా! దేవత లందఱును కలిసి సముద్రము మథించి లక్ష్మిని దేవతల కిండు. అని కమలాపతి పలికి తన యంతిపురమున కరిగెను. దేవతలును కొంత కాలమునకు పాలసంద్రము చేరిరి. మందరగిరిని కవ్వముగ శేషుని కవ్వపుత్రాడుగా తాబేటి నాధారముగ జేసి దేవాసురులు సాగరమును చిలికిరి. అపుడందుండి ధన్వంతరి ఉచ్చైఃశ్రవము ఐరావతము నానా రత్నములు సుదర్శనము లక్ష్మీ అమృతము నుద్బవించెను. నారదా! అంత క్షీరసాగర శయనుడు సర్వేశ్వరుడు రమ్యుడు నైన విష్ణు కంఠసీమలో లక్ష్మి వైజయంచి వనమాల నలంకిరంపజేసెను. అత్తఱి లక్ష్మిని సురలు బ్రహ్మ శివుడును పూజించిరి. బ్రాహ్మణ శాపము తొలగుట వలన కలుముల తల్లి మరల దేవతల యిండ్లలో నివసింపజొచ్చెను. నారదా! మహాలక్ష్మి వర ప్రసాదమున దైత్యులు భయంకరముగ దూరాక్రమణము చేసిన స్వర్గమును దేవతలు తిరిగి పొందిరి. ఇట్లు నీకు పవిత్రమైన లక్ష్మీదేవి మహోపాఖ్యానము వినిపించితిని. ఇది సుఖదము. సారభూతమునైనది. ఇంకేమి వినదలచితివో తెల్పుము.


*ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమందలి తొమ్మిదివ స్కంధమున నలువదియొకటవ అధ్యాయము.*

+1 प्रतिक्रिया 1 कॉमेंट्स • 2 शेयर

कामेंट्स

deepak.goyal Apr 13, 2021

+28 प्रतिक्रिया 2 कॉमेंट्स • 15 शेयर
ram ji Apr 13, 2021

+3 प्रतिक्रिया 1 कॉमेंट्स • 0 शेयर
Mohini 🙏 Apr 13, 2021

+7 प्रतिक्रिया 1 कॉमेंट्स • 0 शेयर
Shefali Sharma Apr 13, 2021

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Ansouya M 🍁 Apr 13, 2021

🕉🙏🙏🙏🙏श्री गणेशाय नम ः🌷 🕉🙏🕉🕉🌷🌷जय श्री राधे कृष्ण 🙏🙏🕉 🌷🕉🌷🌷जय सिया राम 🌹🙏🌹 🌷🌷🌷🌷🕉🕉🕉जय बजरंगबली हनुमान 🙏 🌷🕉🙏🙏🌷🌷जय माता दी 🙏🌹 जय माता दी 🙏🌹 जय माता दी 🙏🌹 जय माता दी 🙏🌹 जय माता दी 🙏🌹 जय माता दी 🙏🌹 जय माता दी 🙏🌹 जय माता दी 🙏🌹 सर्व मंगल मागल्ये शिवे सर्वाथ साघिके शरणये त्रयमबके गौरी नारायणी नमोस्तुते 🙏🌷🙏🙏🌷🙏🙏🌷🙏🙏🙏🙏🙏🙏🙏हे जगदम्बिके आपकी जय हो।।🌷🙏🌷🌷🙏सम्पुर्ण प्राणियों की पीड़ा हरने वाली माता--मधु और कैटभ को मारने वाली तथा ब्रह्मा जी को वरदान देने वाली न माता आपको बारम्बार प्रनाम हो 🌷🙏🌷🕉 हे शैलपुत्रि कल्याणदात्रि मंगलकारिणी माता आप को बारम्बार प्रनाम है 🌷🕉🙏🌷🌷🙏🙏🌷🌷🌷सर्व मंगल मागल्ये शिवे सर्वाथ साघिके शरणये त्रयमबके गौरी नारायणी नमोस्तुते 🙏🌷🙏🙏🙏🙏सर्वस्वरूपे सर्वेशे सर्व शक्ति समन्विते ।। भयेभय्स्त्राहि नव देवी दुर्गे देवी नमोस्तुते 🌷🙏🌷🌷🌷🌷नवरातरों की पहली रात्रि पूजन की हार्दिक शुभकामनाएं आप सभी भक्ततों को जी 🌷🙏🌷🙏 शुभ संध्या मंगलमय हो 🙏🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🙏🙏🌷🌷🙏🌷

+93 प्रतिक्रिया 30 कॉमेंट्स • 9 शेयर
dhruv wadhwani Apr 13, 2021

+44 प्रतिक्रिया 11 कॉमेंट्स • 15 शेयर

+11 प्रतिक्रिया 1 कॉमेंट्स • 15 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB