Dvsraju
Dvsraju Apr 17, 2021

ఆత్మ అనగా అర్ధం ఏమిటి ? 🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺 *సవిస్తార చైతన్య సముద్రం లో ఓ చిన్న కెరటం ఆత్మ. శక్తికి త్రిగుణాలుంటాయి మూడు గుణాలు సమ స్థితిలో ఉండే శుద్ద స్వరూపం ఆత్మ. అలాంటి స్థితిలో ఉన్న శక్తి లో గుణ సమ స్థితి తప్పినప్పుడు కలిగేది మాయ.దానినే మనిషి లో మనస్సు అని అంటాము.పదార్ధానికి ఒక్క ఆకర్షణ మాత్రమే ఉంటుంది ( గ్రహాలకు ,అణువులకు మధ్యన ఆకర్షణ ) కాని శక్తికి ఆకర్షణ , వికర్షణ రెండూ ఉంటాయి. ఈ తత్వ మే శక్తి స్వరూపమైన మనస్సుకీ ఉంటుంది ఇదే ద్వందం రాగము ద్వేషము ;సంకల్పము ,వికల్పము.* *పదార్ధమే పూర్తి యదార్థం కాదు *పదార్ధం , మనస్సు , ఆత్మ ఇవన్నీ కలిసి చైతన్యం లో ఇమిడి ఉంటాయి. అంటే చైతన్యమే యదార్ధం అదే శుద్ద సత్యం.* *ధ్యాన సాధన - ధ్యాన స్థితి *భౌతిక విషయాలను , ఇంద్రియాల లో కలిగే స్పందనలను సాక్షీభూతం గా గమనించడమే సాధన. ఆ విధం గా సాధన చేస్తూ ఉంటే ఏదో ఒక క్షణం లో ధ్యానం సిదిస్తుంది. ఆ ధ్యాన స్థితి లో యదార్ధ స్థితిని అనుభూతిస్తాము.* *ధ్యానం లో మనస్సు పని చేయదు అలాంటప్పుడు అనుభూతి ఎలా కలుగుతుంది ?* *పుట్టి బుద్ధి ఎరిగాక మన దైనందిన వ్యవహారాలన్నీ మనస్సుతో చేస్తాము మనస్సుతో అనుభూతిస్తాము. మనస్సు లేకపోవడం, మనస్సుని అధిగమించడం అనేది మన అనుభవంలో లేనిది ప్రతిదీ మనస్సు తో అలవాటైన మనకు ఆత్మ గత అనుభూతి గురించి ఏమీ తెలియదు ఎంత చెప్పినా, చదివినా ఉపన్యాసాలు విన్నా సాధన చేయకపోతే ఎప్పటికీ ఆత్మ ని గుర్తించ లేము.* *మన శరీరం , మనస్సు ,ప్రాణం -ఇవన్నీ ఆత్మ ప్రకాశం వలనే పని చేస్తాయి. ఆత్మ చైతన్యం తో నే మనస్సు పని చేస్తుంది ఆత్మ ప్రకాశం తో నే ఆత్మను అనుభూతించడం ధ్యానం మనస్సు పని చేస్తే ద్వందం ఉంటుంది మనస్సు పనిచెయ నప్పుడు మిగిలేది ఒక్కటే అదే ఆత్మ అదే చైతన్యం అదే ఎరుక అదే సత్ చిత్ ఆనందం. ఆ స్థితిలో చూడబడేది ,చూసేది ,చూపు - ఇవన్నీ విడి విడి గా ఉండక అన్నీ కలిసి ఏకమవుతాయి.* *మనస్సు పైన చిత్తం , దాని పైన బుద్ది ,దానికి పైన అహం - ఇలా పదార్ధం వివిధ స్థాయులలో స్పందనలు చేస్తుంది.అరిషడ్వర్గాలు, సమస్త కోరికలు ,రాగ ద్వేషాలు అన్నీ మనస్సులోనే రూపు దిద్దుకొంటా యి . కానీ వీటికి మూలం చిత్తం లో ని వాసనలు, తత్వాలు, గుణాలు కాబట్టి చిత్తాన్ని శుద్ది చేయకుండా మనస్సుని నియంత్రించు కొనే సాధనాలు ఎన్ని చేసినా సరైన ఫలితం ఉండదు.* *చిత్తాన్ని ఎలా శుద్ది చేసుకోవాలి ?* *వివేకము తో కూడిన వైరాగ్య భావనలను, సాక్షీ త్వం ను ప్రతిరోజూ ,ప్రతి క్షణమూ అభ్యాసం చేయాలి. నవ విధ భక్తీ మార్గాలు కూడా చిత్తాన్ని శుద్ది చేస్తాయి.ఎన్నో యుగాల నుండి పేరుకుపోయిన కర్మ వాసనలను సమూలం గా భస్మం చేయాలి. సాక్షీ భూత కర్మాచరణ కర్మ ఫల అనాసక్తి వలన మనస్సులో స్పందనలు తగ్గుతాయి చిత్తం లో ఎలాంటి కర్మ పోగు పడదు.* *ఎన్నో యోగ క్రియలు ,ఆసన ముద్రలు ,నాడీ శుద్ధి క్రియలు ,ప్రాణ శుద్ది క్రియలు - ఇవన్నీ పంచకోశ శుద్దీకరణ లో భాగాలే చిత్త శుద్ది లేని శివ పూజ లేల ? భాండ శుద్ది లేని పాకమేల ?కాబట్టి ముందు చిత్త శుద్ది తర్వాతే ఆత్మావిష్కరణ మోహం క్షయ మవ్వడమే మోక్షం.అహం అణిగి సోహంగా మిగలటమే శరణాగతి. ప్రధమంగా మనకు శ్రద్ద ,ఓర్పు పుష్కలం గా ఉండాలి.* 🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺

ఆత్మ అనగా అర్ధం ఏమిటి ?

🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺

*సవిస్తార చైతన్య  సముద్రం లో ఓ చిన్న కెరటం ఆత్మ. శక్తికి త్రిగుణాలుంటాయి  మూడు గుణాలు సమ స్థితిలో  ఉండే శుద్ద స్వరూపం ఆత్మ. అలాంటి స్థితిలో ఉన్న శక్తి లో గుణ సమ స్థితి తప్పినప్పుడు కలిగేది మాయ.దానినే మనిషి లో మనస్సు అని అంటాము.పదార్ధానికి  ఒక్క  ఆకర్షణ మాత్రమే ఉంటుంది ( గ్రహాలకు ,అణువులకు మధ్యన ఆకర్షణ ) కాని శక్తికి ఆకర్షణ , వికర్షణ రెండూ  ఉంటాయి. ఈ తత్వ మే శక్తి స్వరూపమైన మనస్సుకీ ఉంటుంది ఇదే ద్వందం రాగము ద్వేషము ;సంకల్పము ,వికల్పము.*


*పదార్ధమే  పూర్తి  యదార్థం  కాదు 


*పదార్ధం , మనస్సు , ఆత్మ ఇవన్నీ కలిసి చైతన్యం లో ఇమిడి ఉంటాయి. అంటే చైతన్యమే యదార్ధం అదే శుద్ద సత్యం.*

                            
*ధ్యాన సాధన - ధ్యాన స్థితి 


*భౌతిక విషయాలను , ఇంద్రియాల లో కలిగే స్పందనలను  సాక్షీభూతం గా గమనించడమే సాధన. ఆ  విధం గా సాధన చేస్తూ ఉంటే ఏదో ఒక క్షణం లో ధ్యానం సిదిస్తుంది. ఆ ధ్యాన స్థితి లో  యదార్ధ స్థితిని అనుభూతిస్తాము.*


*ధ్యానం లో మనస్సు పని చేయదు  అలాంటప్పుడు అనుభూతి ఎలా కలుగుతుంది ?*


*పుట్టి బుద్ధి ఎరిగాక మన దైనందిన వ్యవహారాలన్నీ మనస్సుతో చేస్తాము  మనస్సుతో అనుభూతిస్తాము. మనస్సు లేకపోవడం, మనస్సుని అధిగమించడం అనేది మన అనుభవంలో లేనిది ప్రతిదీ మనస్సు తో అలవాటైన మనకు ఆత్మ గత అనుభూతి గురించి ఏమీ తెలియదు ఎంత చెప్పినా, చదివినా ఉపన్యాసాలు విన్నా సాధన చేయకపోతే ఎప్పటికీ ఆత్మ ని గుర్తించ లేము.* 


*మన శరీరం , మనస్సు ,ప్రాణం  -ఇవన్నీ ఆత్మ ప్రకాశం వలనే పని చేస్తాయి. ఆత్మ చైతన్యం తో నే మనస్సు పని చేస్తుంది  ఆత్మ ప్రకాశం తో నే ఆత్మను అనుభూతించడం ధ్యానం మనస్సు పని చేస్తే ద్వందం ఉంటుంది  మనస్సు పనిచెయ నప్పుడు మిగిలేది ఒక్కటే  అదే ఆత్మ  అదే చైతన్యం అదే ఎరుక అదే సత్ చిత్ ఆనందం. ఆ స్థితిలో చూడబడేది ,చూసేది ,చూపు - ఇవన్నీ విడి విడి గా ఉండక అన్నీ కలిసి ఏకమవుతాయి.*


*మనస్సు పైన చిత్తం , దాని పైన బుద్ది ,దానికి పైన అహం - ఇలా పదార్ధం వివిధ స్థాయులలో స్పందనలు చేస్తుంది.అరిషడ్వర్గాలు, సమస్త కోరికలు ,రాగ ద్వేషాలు అన్నీ మనస్సులోనే రూపు దిద్దుకొంటా యి . కానీ వీటికి మూలం చిత్తం లో ని వాసనలు, తత్వాలు, గుణాలు కాబట్టి చిత్తాన్ని శుద్ది చేయకుండా మనస్సుని నియంత్రించు కొనే సాధనాలు ఎన్ని చేసినా సరైన ఫలితం ఉండదు.*


*చిత్తాన్ని ఎలా శుద్ది చేసుకోవాలి ?*
 

*వివేకము తో కూడిన వైరాగ్య భావనలను, సాక్షీ త్వం ను  ప్రతిరోజూ ,ప్రతి క్షణమూ అభ్యాసం చేయాలి. నవ విధ భక్తీ మార్గాలు కూడా చిత్తాన్ని శుద్ది చేస్తాయి.ఎన్నో యుగాల నుండి పేరుకుపోయిన కర్మ వాసనలను సమూలం  గా భస్మం చేయాలి. సాక్షీ భూత కర్మాచరణ కర్మ ఫల అనాసక్తి వలన మనస్సులో స్పందనలు తగ్గుతాయి  చిత్తం లో ఎలాంటి కర్మ పోగు పడదు.*


*ఎన్నో యోగ క్రియలు ,ఆసన ముద్రలు ,నాడీ శుద్ధి క్రియలు ,ప్రాణ శుద్ది క్రియలు - ఇవన్నీ పంచకోశ శుద్దీకరణ లో భాగాలే చిత్త  శుద్ది  లేని శివ పూజ లేల ? భాండ శుద్ది లేని పాకమేల ?కాబట్టి ముందు  చిత్త శుద్ది  తర్వాతే ఆత్మావిష్కరణ మోహం క్షయ మవ్వడమే మోక్షం.అహం అణిగి సోహంగా మిగలటమే  శరణాగతి.  ప్రధమంగా మనకు శ్రద్ద ,ఓర్పు పుష్కలం గా ఉండాలి.*

🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 6 शेयर

+11 प्रतिक्रिया 0 कॉमेंट्स • 20 शेयर
Dvsraju May 5, 2021

*గర్వము...* ప్రతి మనిషికి గర్వం రావటానికి అనేక కారణాలుంటాయి... సామాన్యంగా ఐశ్వర్యమో, పాండిత్యంతో, అధికారమో గర్వానికి కారణాలవుతాయి... కానీ ఈ గర్వమే తన శత్రువని మనిషి గ్రహించాలి. ఎందు కంటే దాని మూలంగ అతనికి మున్ముందు అనర్ధం జరుగుతుంది... అంతకంటే ఎక్కువగా గర్విష్ఠియైన మనిషి తప్పుడు పనులు చేస్తాడు. తనను ఎవరూ అడ్డుకోలేరనే భ్రమలో వుంటాడు. తన దుష్కర్మల ఫలితాన్ని అతను తప్పకుండ అనుభవిస్తాడు. వీటన్నిటినీ తప్పించుకోవాలంటే గర్వాన్ని విడనాడాలి... *శ్రీ శంకర భగవత్పాదుల వారి మాటలలో...* _మాకురు ధనజన యౌవన గర్వమ్ |_ _హారతి నిమేషాత్ కాలః సర్వం ||_ దనం, యవ్వనం, పాండిత్యం, అధికారమో ఉన్నవి అన్న కారణంగా ఏ మానవుడూ గర్వించరాదు... ఎందుకంటే కాలం సర్వాన్ని హరిస్తుంది, అంటే అవి శాశ్వతం కాదు. శ్రీ శంకర భగవత్పాదులవంటి మహనీయులు ఎంతటి పండితులైనా ఏమాత్రం గర్వానికి లోనుకాలేదు, అందువలనే ప్రజలు వారిని మహా పురుషులుగా కీర్తించారు. కాబట్టి మనిషి ఏకారణంలో కూడా గర్వానికి లోను కాకూడదు, వినయంతో జీవించాలి. తస్మాదహంకార మిమం స్వశత్రుమ్ భోక్తుర్గలే కంటకవత్ ప్రతీతమ్ | భుంక్ష్వాత్మసామ్రాజ్యసుఖం యధేష్టమ్ || అన్న ... భగవత్పాదుల సూక్తిని ప్రతియొక్కరూ మననం చేస్తూ నిరహంకారమైన జీవితాన్ని గడపాలి... *భక్తుడు అనే వాడు ఎప్పుడూ నిరహంకారమైన జీవితాన్ని గడపాలి* *_🌺శుభమస్తు🌺_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

+8 प्रतिक्रिया 0 कॉमेंट्स • 32 शेयर
Dvsraju May 5, 2021

దేవతల చేతిలో ఆయుధాలు ఎందుకు? ఈమధ్య ఒక పనికిమాలిన జోక్ అనే పోస్ట్ చక్కర్లు కొడుతోంది. వారి వారి భార్యలకు భయపడి విష్ణుమూర్తి చక్రము, శివుడు త్రిశూలము లాంటివి పట్టుకున్నారని దేవుళ్ళు కూడా భార్యలకు భయపడి ఉంటారని దాని దిక్కుమాలిన సారాంశం. మరొక మూర్ఖపు వాదన అసలు అంత శక్తిమంతులు ఆ దేవుళ్ళు అయితే వారికి ఆయుధాలు ఎందుకు? అసలు మన దేవీదేవతలు చతుర్భుజులుగా, అష్టభుజులుగా కనబడడం వెనుక వారి చేతుల్లో రకరకాల ఆయుధాలు, పుష్పాలు, ముద్రలు ఉండడం వెనుక చాలా అర్ధం అంతరార్ధం ఉన్నాయి. ఒకొక్క దేవతామూర్తి వారు చూపే రక్షణ అనుగ్రహాన్ని బట్టి వారి వారి ఆయుధాలు ఉంటాయని శాస్త్రవచనం. ఆ మాటకొస్తే తమ భక్తులను అనుగ్రహించాలంటే దేవునికి ఆయుధాలు అక్కర్లేదు, సంకల్పమాత్రం చేత దుష్టశిక్షణ, శిష్టరక్షణ చెయ్యగల సమర్ధుడు, మరొక అడుగు ముందుకేస్తే అసలు నిర్గుణ నిరాకారుడైన ఆయన రూపం తో అవతారం కూడా స్వీకరించనక్కర్లేదు. దేవీదేవతలు ఆయా రూపాలలో దర్శనం ఇవ్వడం మనలాంటి అల్పజ్ఞానులకు, నిదర్శనం చూస్తె తప్ప నమ్మని మనబోటి పామరుల కోసమే. అర్చామూర్తులు కొందరు జ్ఞానులకు ఋషులకు ఆ రూపంలో దర్శనం అనుగ్రహించగా లేదా వారిని ఆ రూపంలో రక్షించగా వారు దయతో మనకోసం ఆ రూపాన్ని వర్ణించి చూపారు. మరికొన్ని చోట్ల ఆ దేవతామూర్తులే స్వయంగా వ్యక్తమయ్యారు ఆ రూపాలలో. వారి వివిధ భంగిమలకు, వారి చేతి ముద్రలకు ఎన్నో అర్ధాలు చెబుతారు పండితులు. 1. వారి అరచేయి ఆశీర్వాదం ఇస్తున్నట్టు కిందకు చూపుతూ ఉంటె నిన్ను నేను కాపాడుతాను రా అని అభయం ఇస్తున్నట్టు 2. వారి చేయి పూర్తిగా విప్పారి ఆశీర్వదిస్తున్నట్టు ఉంటె నీకు భయం లేదురా నిన్ను నేను చూసుకుంటా, ఏమాత్రం భయ పడవలదు అని చెప్పినట్టు 3. చిన్ముద్రలో ఉంటె నిన్ను అజ్ఞానం నుండి తీసి నిన్ను సరైన దారిలో నడిపిస్తాను అని అభయం ఇచ్చినట్టు 4. ఒక కాలు ఎత్తి నించున్న భంగిమ నిన్ను ఈ సంసార సాగరాన్ని దాటించి ముక్తిని ఇస్తాను అని చెప్పినట్టు 5. అమ్మవారిలా రెండు చేతులో వారి హృదయానికి దగ్గరగా ఉంచితే నిన్ను అక్కున చేర్చుకుని నీకు జ్ఞానమిచ్చి నిన్ను ధర్మం వైపు నడిపించి నిన్ను చూసుకుంటాను అని ప్రేమతో చెప్పినట్టు 6. తిరుమలలో ఉన్నట్టు స్వామి వారు కటిహస్తం ఉంచితే ఒరేయ్ ఈ సంసారమనే సాగరం నీ కటి వరకే వస్తుంది, నా పాదాలను నమ్ముకుని నేను చెప్పినట్టు ఉన్నవాడిని ఇలా నడిపించి ఈ భవసాగరాన్ని దాటిస్తాను అని చెప్పినట్టు ఇలా ఎన్నో భంగిమలకు, వారి అభయ హస్తాలకు ఎన్నో అర్ధాలు గోచరిస్తాయి, అన్నింటిలో కూడా భక్తుని రక్షించే ఆర్తత్రాణపరాయణత్వం కనబడుతూ ఉంటుంది. మూర్తులు ప్రధానంగా 3 రకాల రూపాలలో అనుగ్రహిస్తూ కనబడతారు 1. శాంతం – ప్రశాంత వదనం తో ద్విభుజులుగా లేక చతుర్భుజులుగా దర్శనం ఇస్తూ ఉంటారు 2. వీరం – రెండు కానీ నాలుగు కానీ ఆరు భుజాలతో వీర రసం ఒలికిస్తూ దుష్టశిక్షణ, శిష్ట రక్షణను నిర్దేశిస్తూ కనిపించే విగ్రహాలు 3. ఉగ్రం – ఆరు కానే, 8 కానీ 18 కానీ భుజాలతో ఉగ్రమూర్తులు. దుష్టశిక్షణ ప్రధానంగా కనిపించే ఈ అర్చామూర్తులు పూజా విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కానీ మనకు ఎక్కువగా చతుర్భుజులుగా ఉన్న అర్చామూర్తులు దర్శనం ఇస్తూ ఉంటారు. ఆ నాలుగు భుజాలు ఉండడానికి కూడా ఎన్నో ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఆ నాలుగు చేతులు మనకు ఎన్నో విషయాలు నేర్పుతాయి. 1. నీకున్న నాలుగు దిక్కులలో నిన్ను రక్షించే తత్త్వం నాది 2. జాగ్రద్, స్వప్న, సుషుప్త, తురీయావస్థలలో నిన్ను వెన్నంటి ఉన్న తత్త్వం నాది 3. చాతుర్వర్ణం నా సృష్టి. అందరినీ రక్షించే బాధ్యత నాది. 4. నీకున్న నాలుగు ఆశ్రమాలలో నిన్ను కనిపెట్టి ఉంటాను 5. మనస్సు, బుద్ధి అహంకార చిత్ అవస్థలలో నిన్ను చూస్తూ ఉన్నాను 6. ధర్మార్ధకామ మోక్షాలు అనే నాలుగు పురుషార్ధాలు ప్రసాదించేది నేనే 7. ఆహవనీయ, గార్హపత్య అనే నాలుగు అగ్నులు నా ఆధీనం 8. నాలుగు మార్గాలు నన్ను చేరేవి ఇలా ఎన్నో తత్త్వాలు చెబుతాయి. ఇక వారు మనకు అభయమిచ్చే వారి ఆయుధాల అంతరార్ధం గురించి 1. శంఖం – ఓంకారమే వేదం. ఆ శబ్దబ్రహ్మాన్ని నేనే అని చెబుతుంది. అలాగే శంఖం లోనున్న జీవిని రక్షించినట్టు నిన్ను ప్రేమతో ఆర్ద్రతలో రక్షించుకుంటాను. నువ్వు కూడా నీ చుట్టు పక్కల వారితో ప్రేమగా ఉండు అని బోధిస్తుంది 2. గద – ఈ ప్రపంచాన్ని అంతా తన శక్తితో నడిపిస్తున్నాను, నీలో మోహ మదమాత్సర్యాలను ఈ గదతో మోది తరిమి నిన్ను ఈ గద ధరించినట్టు ధరిస్తాను అని చెబుతుంది 3. చక్రం – ఈ ప్రపంచాన్ని ఈ చక్రం తిప్పినట్టు తిప్పుతాను ఈ ప్రపంచం అంతా కాల స్వరూపం అది ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. అది తిరిగినా తిరగని నేను కాలాతీతుడిని. ఈ కాలాన్ని నియంత్రించే సర్వేశ్వరుడిని, నన్ను నమ్ముకుంటే నీలో ఉన్న దుర్గుణాలను తీసి నిన్ను ఈ జననమరణాల చక్రభ్రమణం నుండి ఆవలకు తీసుకుపోగల వాడను అని అభయం ఇస్తుంది 4. తామర పువ్వును పట్టుకున్న నా చేతిని చూసి నీమీద నా చల్లని చూపు వుంటుంది, నువ్వు కూడా తామర పువ్వులా నీ చుట్టు ఎంత పంకం ఉన్నా నన్ను ధ్యానించి దానిమధ్యలో ఆ పంకం అంటని తామర్పువ్వులా వికసించు అని దీవిస్తుంది 5. ఖడ్గం – రక్షోసురాణాం కఠినోగ్ర...అన్నట్టు మనలో పేరుకుపోయిన ఆసురీ లక్షణాలను, కామం, మోహం అంటే భయంకరనువ్వుమైన అంతఃశత్రువులను తరిగి పోగులు పెట్టి మనల్ని రక్షించే ఆయుధం ద్వారా నిన్ను వైరాగ్యమనే ఖడ్గంతో ఏది నిలిచేది ఏది నిలవనిది అని నీకు చెప్పి ఉద్ధరిస్తాను అని నీకు రక్షణ ఇచ్చే తత్త్వం చెబుతుంది 6. త్రిశూలం – నిన్ను భూత భవిష్యద్ వర్తమానాలకు ఆవల తీసుకు వెళ్ళగలను అని, సత్వ రజో తమో గుణాలకు ఆవల ఉన్న తత్త్వం నాది అని, ధర్మ, అర్ధ కామాలను ఈ ప్రపంచంలో ఇచ్చి ఆ పైన మోక్షాన్ని అనుగ్రహించగలిగిన వాడను నేను అని చెప్పే తత్త్వం 7. అంకుశం/ఖట్వాంగ – నిన్ను పక్కదారి పట్టిస్తున్న కోరికలను అంకుశంతో తొక్కి నిన్ను ధర్మ మార్గం వైపు నడిపిస్తాను అని చెబుతుంది 8. పాశం – నువ్వు ఎక్కడున్నా నిన్ను ఈ పాశంతో కట్టి నిన్ను ఆధ్యాత్మికంగా పైకి తీసుకెళ్ళే బాధ్యత నాది అని అభయం ఇస్తుంది 9. చేతిలో తినే వస్తువులను పట్టుకుని ఉంటె నీ సాధన ద్వారా శాశ్వతమైన అమ్రుతోపమానమైన అద్భుత తినుబండారాలలాగ నీ సాధన సంపత్తి ద్వారా నీకు తగిన ప్రతిఫలం ఇప్పిస్తాను అని అభయం ఇచ్చునది 10. పట్టిశం – నిన్ను ఏది ఆపుతున్నదో దాన్ని నేను తీసి వస్తాను అని చెప్పేది, అవిద్య, కర్మ, వాసనలను పోగొట్టి నిన్ను మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధిగా నిన్ను సంపూర్ణంగా తీర్చిదిద్దే బాధ్యత నాది అని చెప్పేది 11. చురి – ఈ ఆధ్యాత్మిక మార్గం చాలా పదునైనది, దీన్ని చాలా జాగ్రత్తగా అనుష్టించాలి, అటు ఇటు అయినా తేగాగలదు అని చెప్పేది 12. వీణ – అంతర్గత ఆధ్యాత్మిక సంగీత మాధుర్యం. నీకున్న వెన్నులో 24 ఈ వీణలో ఉన్న చిర్రలు, నీ శరీరంతో ఆధ్యాత్మిక సాధన ద్వారా ఈ పిండాండం నుండి ఆ బ్రహ్మాండం ఆవలకు తీసుకుపోగల సామర్ధ్యం నీకు అనుగ్రహించేది నేనే అని అభయం ఇస్తుంది 13. కమండలం – ఎవరికి ఏది కావాలన్నా అన్నా ఈ నిండు కుండ లాంటి కమండలం లో ఉంది, అడిగినవారికి అర్హతను బట్టి అనుగ్రహిన్చగలను అని అభయం 14. డమరుకం – రెండు త్రికోణాల కలయికతో చర్మవాద్యం. స్త్రీ పురుష శక్తుల సంయక్తంగా ఈ చర్మం తో పుట్టిన నువ్వు ఈ చర్మ చక్షువులకు ఆవల ఉన్న స్థితికి తీసుకుపోగాలవాడను అని చెబుతుంది 15. చాపం/శరం – నీకున్న జీవిత పరమావధి కోసం నువ్వు కదలని ఏకాగ్రతతో నీ బుద్ధి ద్వారా ఈ శరంలా దూసుకుపో. నీకు చెప్పిన శాస్త్రం ద్వారా జ్ఞానాన్ని గట్టిగా చాపంలా పట్టుకుని ఆ మోక్షం వైపు ఏకాగ్రతతో నీ శరీరాన్ని శరంగా చేసుకుని ఆ మోక్షం వైపు అడుగులు వెయ్యి, నిన్ను పంపే బాధ్యత నాది 16. భిక్ష పాత్ర – నువ్వు అందరిమీద దయగా నడువు, నీకున్న దుర్గుణాన్ని భిక్షగా తీసుకుని నీ కర్మ ధ్వంసం చేసి నిన్ను పైకు తీసుకువెళ్ళగలను. నువ్వు కోరుకుంటున్న ఆ ఉన్నత స్థితిని అనుగ్రహించగలిగే శక్తి నా స్వంతం అని చెబుతుంది. కొన్ని చోట్ల కపాలం పట్టుకుని ఆ రక్తం ఆ భిక్షాపాత్ర లో పడుతున్నట్టు ఉన్న చోట నువ్వు నీ శరీరానికి ఆవల ఉన్న సత్యం గ్రహించు ఈ శరీరం మున్ముందు దాటవలసినదే ఈ మొహాన్ని వదిలి నిన్ను పైకి నడిపిస్తాను అని చెప్పే తత్త్త్వం 17. వజ్రం – పైకి మూడు కొనలు, కిందకు మూడు కొనలు ఉన్నట్టు ఉండే ఈ వజ్రం నీలో పేరుకుపోయిన అవిద్య ఎంతో కఠినం గా ఉంటుంది, జ్ఞానమే వజ్రంతోనే దాన్ని కోసి నిన్ను ఉద్ధరించగలిగిన శక్తి నాకు ఉంది అని నీకు ధైర్యం చెబుతుంది 18. డాలు/ ఖేటకం – నీ మీద పడుతున్న పాప దృష్టి, నీ ధర్మవర్తనకు ఎదురుగా వస్తున్నా దుష్టశక్తులనుండి నిన్ను రక్షిస్తాను అని చెబుతుంది. నీమీద పడబోతున్న హానికారక విషయాలను తరిమి కాపాడే తత్త్వం 19. పరశువు – నీకు నిత్యానిత్య విచక్షణ జ్ఞానం ఈ పరశువు ద్వారా అనుగ్రహిస్తాను. మంచిని చేడునుండి చెట్టు నుండి కొమ్మను తీసినట్టు తీసి ఇస్తాను నీకు అని చెప్పే తత్త్వం 20. ఘంట – ఆసురీ శక్తులు ఘంటానాదం వలన పోయినట్టు నీలో ఉన్న చెడును తరిమి విజయగంట మోగిస్తాను అని అభయం 21. వరి పైరు – నీకు ప్రకృతి అనుగ్రహం సమృద్ధిగా అనుగ్రహించే తత్వం 22. చెరుకుగడ – నన్ను నమ్ముకున్న వారికి చెరుకు లో ఉన్న తీపిగా నీలో ఉన్న శక్తిగా ఉన్నవాడిని/దానిని అని చెబుతుంది. ప్రకృతి అనుగ్రహం ఈ చెరుకుగడలా నీకు అందచేస్తాను 23. ముద్గరం – నిన్ను ఒక అద్భుతమైన శిల్పంగా మారుస్తాను అని చెబుతుంది. నీ చుట్టూ ఉన్న సంఘాన్ని నీకు అనుకూలంగా మలుస్తాను అనే అభయం. 24. ధ్వజం – ఉన్నవారిలో నిన్ను చూసి అందరూ గొప్పగా చెప్పుకునేలాగా అన్నింటా ధ్వజం లాంటి స్థితిని కలుగ చేస్తాను అని చెబుతుంది. 25. మృగం – మూర్తి మృగాన్ని పట్టుకున్నట్టు కనిపిస్తే ఈ చరాచరజగత్తు నా ఆధీనం అని, జీవుడులోని దేవుడిని తట్టిలేపే శక్తి నాదే అని చెప్పే విధానం 26. సర్పం – నీలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసే తత్త్వం 27. విభూతి – ఈ జగత్తు అంతా చివరకు చేరుకోవలసిన స్థితి ఇదేరా అని చెప్పి నిన్ను నిత్యానిత్యవివేచనా చెయ్యమని బోధించే తత్త్వం 28. శుకం – చిలుక నువ్వు ఏది నేర్పుతావో అదే ఉన్నదున్నట్టు చెప్పే విధంగా నువ్వు నీ గురువు దగ్గర వేదాన్ని అభ్యసించి తరువాత వారికి అందించే విధంగా నిన్ను అనుగ్రహిస్తున్నాను అని చెప్పే తత్త్వం 29. చామరం – ఎంత ఉన్నా నీ గురువుల దగ్గర పెద్దల వద్ద నువ్వు అణుకువగా ఉండు అని నేర్పే విధానం 30. చింతామణి – నీ కోరికలను తీర్చే అపర చింతామణి నేనే అని చెప్పే అభయం 31. కుంతలం – నువ్వు శ్రద్ధగా శాస్త్రాన్ని అనుష్టానం చేస్తే నీ లక్ష్యమైన మోక్షం వైపు తీసుకువెళ్ళే అభయం 32. ఆదర్శం – (అద్దం) – ఈ ప్రపంచం అంతా కేవలం ఈ అద్దంలో చూసిన విధానంగా అశాశ్వతం, శాశ్వతమైన స్థితికి తీసుకుపోయే నేను నీకు శాశ్వతం ఏదో, అశాశ్వతం ఏదో బోధించి నీకు జ్ఞానం కలిగించి కాపాడుతాను అని చెబుతుంది 33. జపమాల – 108 తులసిపూసలు కానీ/ రుద్రాక్షలు కలిగిన జపమాల నీకు ధ్యానం యొక్క గొప్పదనాన్ని జపం యొక్క విశిష్టతని వివరిస్తూ ఈ లోకంలో పుట్టిన 27 నక్షత్రాల x4 పాదాల లో పుట్టిన జీవులు అందరూ నా చేతిలో మాలలా తిరుగుతూ ఉంటారు, వారిని అందరినీ రక్షించేది నేనే అని చెప్పే తత్త్వం 34. పుస్తకం – నీకు జ్ఞానాన్ని ఒసగే అనుగ్రహం నాది, నువ్వు విన్న చతుర్వేదాలు నా అనుగ్రహం అని స్పష్టం చేసేది. ... ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఆయుధాలు వాటి విశేష తత్త్వం ఆయా శాస్త్రం ప్రకారం చెప్పబడి ఉంది. భక్తుడికి స్వామి పట్టుకున్న ఆయుధాలు ఎంతో సౌఖ్యాన్ని నమ్మకం కలిగిస్తాయి అభయాన్ని ఇస్తాయి , అదే ఆసురీ తత్త్వం ఉన్న చవటలకు అవి భయపెడతాయి, భయం కలిగిస్తాయి. యద్భావం తద్భవతి అని వారి వారి పరిణతిని బట్టి వారికి ఆ దేవతామూర్తులు కనిపిస్తాయి. భక్తిగా నమ్ముకున్న వారికి ఆనందాన్ని కలిగిస్తాయి ఆ సగుణరూపాలు. వారి అనుగ్రహం మనకు పరిపూర్ణంగా దక్కాలి అని కోరి ప్రార్ధిద్దాం !! ఓం నమో వేంకటేశాయ !! !! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

0 कॉमेंट्स • 4 शेयर

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 12 शेयर
haritha dharmapuri May 4, 2021

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 6 शेयर
Dvsraju May 3, 2021

_*💫వాక్సిన్ వేసుకున్నా ఎందుకు మరణిస్తున్నారు !? 💉*_ _కోవిడ్ వాక్సిన్ వేసుకున్నా కూడా, కరోనా ఎందుకు వస్తుంది ?? వాక్సిన్ వేసుకున్నా కూడా కోవిడ్ వల్ల మనుషులు ఎందుకు మరణిస్తున్నారు ?? ఇది వాక్సిన్ వైఫల్యమా మానవ తప్పిదమా ??_ _అసలు వాక్సిన్ ఏమిటి, అది ఏమి చేస్తుంది. కోవిడ్ వాక్సిన్ లో కరోనా అవశేషాలు ఉంటాయి. కవిడ్ యొక్క జినోమ్ స్ట్రక్చర్ ఉంటుంది. అ స్ట్రక్చర్ ద్వారా మన శరీరంలోని ఇమ్మ్యూనిటి అంటే తెల్ల రక్తకణాలకి కరోనా వైరస్ నించి రక్షించే వలయం ఏర్పాటుచేయ్యడం నేర్పిస్తుంది. తద్వారా మన శరీరంలో ఇమ్మ్యూన్ సిస్టం అంటే రక్షణ వలయం ఏర్పారుచుకుంటుంది._ _అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ వాక్సిన్ మందు కాదు. కరోనాని ఆపేది వాక్సిన్ కాదు. రక్షణ వలయం ఏర్పాటు చేసేదీ వాక్సిన్ కాదు. అదీ కేవలం ఫార్ములా చూపిస్తుంది అంతే, మొత్తం చేసేది మన శరీరమే._ _ఉదాహరణకి ఒక ఇల్లు కట్టాలంటే ముందు దాని స్ట్రక్చర్ గిస్తాము. ఇంజనీరు తన విధ్వత్తంతా ఉపయోగించి ప్లాన్ గిస్తాడు. అంత మాత్రాన ఇల్లు పుట్టుకురాదు. మంచి పనివాళ్ళు మంచి సిమెంటు మంచి ఇసుక మొదలైన వాటితో ఇల్లుని జాగ్రత్తగా అమర్చుకుంటూ వెళ్తేనే ఇల్లు తయారవుతుంది. ఇంజనీరు ఎంత మంచి ప్లాన్ వేసిన పని వాళ్ళు సరైన విధంగా కట్టకపోతే ఇల్లు కూలిపోతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది._ _వాక్సిన్ అనే కరోనా జినోమ్ స్ట్రక్చర్ మన ఒంట్లోకి వెళ్ళాక మన శరీరానికి రక్షణ వలయం అనే ఇల్లు కట్టడానికి 14 రోజులు పడుతుంది (మొదటి డోస్ అయినా రెండో డోస్ అయినా) ఆ 14 రోజులు పాటించాల్సిన నియమాలు పాటిస్తేనే మన శరీరం వాలయాన్ని క్రమంబద్దంగా పర్ఫెక్ట్ గా ఏర్పరుచుకుంటుంది._ _ఇందులో మొదటి నియమం perfect blood circulation, సరైన రక్తప్రసరణ. అంటే blood intoxication, acidic blood, blood hypertension, ఇవి లేకుండా చూసుకోవాలి. ఇదే అన్నిటికన్నా ముఖ్యం._ _1. బైట అస్సలు తిరగకూడదు. ఎండ, UV rays అస్సలు తగలకూడదు. UV rays కొంచెం తగిలిన anti bodies బాగా దెబ్బ తింటాయి._ _2. జనాలుచేసే ఇంకో ముఖ్యమైన పొరపాటు. చిన్న పనే కదా అని బైటకి వెళితే. బైక్ మీద వెళ్తున్నప్పుడు సిగ్నల్ పడినా, పక్క బైక్ వాడు overtake చేసిన. ఏదన్నా వాహనం అదుపుతప్పి మీదకి రాబోయినా, రోడ్డు మీద ఎవరన్నా మనతో దురుసుగా ప్రవర్తించినా, వీటిల్లో ఏది జరిగిన మన రక్త ప్రసారణలో మార్పు వస్తుంది. Blood intoxication జరుగుతుంది. వెంటనే anti bodies దెబ్బ తింటాయి._ _3. తరవాత మన work spot కి వెళతాం. అక్కడ మన కింద వాడితో పని విషయంలో గొడవ పైవాడితో వత్తిడి. మళ్ళీ BP ups and downs. మళ్ళీ తెల్ల రక్తకాణాలు దెబ్బ తింటాయి._ _ఇప్పుడు గమనించండి బైటకి వెళ్ళగానే UV rays వల్ల దెబ్బ, రోడ్డు మీద hypertension వల్ల దెబ్బ, పని వేళలో వత్తిడి వల్ల దెబ్బ. ఇన్ని దెబ్బలతో మన శరీరం వలయాన్ని కట్టుకుంటుంది. ఇక వాక్సిన్ వేసుకున్నాం మాకేం కాదు అనే నిర్లక్ష్యం మనకే తెలియకుండా వస్తుంది._ _సామజిక దూరం పాటించకుండా మాస్క్ శానిటైజర్ లేకుండా తిరిగేస్తారు. అదే సమయంలో కరోనా మన వంట్లోకి చేరుతుంది. వీక్ గా కట్టుకున్న వలయాన్ని కూలుస్తుంది, మన శరీరాన్ని ఆక్రమించుకుంటుంది. ఈ సమయంలో గనుక మన ఇమ్మ్యూన్ సిస్టం పూర్తిగా చేతులెత్తేసిందంటే, ఇక ఎప్పటికి లేవదు. దాని కెపాసిటీ కోల్పోతుంది. సరైన తిండి పెట్టకుండా 10 యుద్ధలు చేయించిన సైనికుల్లా తయారవుతాయి మన తెల్ల రక్త కణాలు. ఇంక ఆ స్టేజిలో మనిషి మరణిస్తాడు._ _అమెరికాలో వాక్సిన్ వేసిన తర్వాత 2 గంటలు హాస్పిటల్ లో కౌన్సిలింగ్ ఉంటుంది. అది అయ్యాక గాని బైటకి రారు. అది అక్కడ ప్రోటోకాల్. అందులో ఈ విషయాలన్నీ చెబుతారు. అందుకే వాళ్ళు post vaccine care బాగా తీసుకున్నారు. అందుకే అమెరికాలో వాక్సిన్ బాగా సక్సెస్ అయ్యింది._ _మన దేశంలో అలాంటి కౌన్సిలింగ్లు లేవు. అందువల్లే అమెరికా కన్నా స్ట్రాంగ్ వాక్సిన్ అయిన మన వాక్సిన్స్ వేసుకుని కూడా కరోనా బారిన పడుతున్నారు._ _దయచేసి అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడొచ్చిన వాక్సిన్ సంవత్సరాల క్రితం తయారుచేసింది కాదు. కొన్ని నెలల క్రితం మాత్రమే తయారుచేసింది. దీనికి ఇంకా medical history లేదు. ఇది ఇంకా primary దశ లో వేసిన వాక్సిన్. ఆల్ఫా స్టేజి అంటారు దాన్నే. ఇందులో వాక్సిన్ 20% చేస్తే 80% మన శరీరం చెయ్యాలి. అంటే మనమే చెయ్యాలి._ _కొన్ని సంవత్సరాలలో ఇంకా స్ట్రాంగ్ వాక్సిన్లు వస్తాయి అప్పుడు వాక్సిన్ వెయ్యగానే తిరిగేయాగలుగుతాం. కానీ ఇప్పటికి మాత్రం ఆ స్టేజి లేదు._ _దయచేసి వాక్సిన్ వేసుకున్న 14 రోజులు (మొదటి డోస్ అయినా రెండో డోస్ అయినా) ఇవి పాటించండి._ _1. బైట తిరగవద్దు. ఎండలో అస్సలు తిరగవద్దు._ _2. పాలు, పళ్ళు, dry fruits, కూరగాయలు, ఆకు కూరలు లాంటి మితమైన ఆహారం తినండి. బిర్యానీలు పిజ్జాలు బర్గర్ లు తినవద్దు. Digestion ఎప్పుడు తేలికగా ఉండేవి తినాలి._ _3. మందు [లిక్కర్] తాగకూడదు, మందు వల్ల blood acidic అవుతుంది. దానివల్ల ఇమ్మ్యూనిటి వెంటనే డామేజ్ అవుతుంది._ _4. డాక్టర్ సలహా లేకుండా ఏ కొత్త మందులు, ఇంజక్షన్లు వేసుకోవద్దు._ _5. మన ఊపిరి మన రక్త ప్రసరణ ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బాగా మన శరీరం, వాలయాన్ని కట్టుకుంటుందని బాగా గుర్తుపెట్టుకోండి._ _టెన్సన్స్ లేకుండా చూసుకోండి. వ్యాయామం, యోగ, ప్రాణాయామం, ధ్యానం వంటి వాటి వల్ల ఇమ్మ్యూనిటి సిస్టం బాగా బిల్డ్ అవుతుందని అధ్యాయానాలలో తేలింది._ _మన ప్రభుత్వం, ఎంతోమంది డాక్టర్లు ఎంతో ఖర్చుపెట్టి శ్రమించి తయారుచేసిన ఈ వాక్సిన్స్ కి చెడ్డ పేరు రానివ్వకండి, వృధాపోనివ్వకండి._ _14 రోజులు జాగ్రత్తలతో మంచి ఇమ్మ్యూనిటితో బైటకు రండి. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ శానిటైజర్లు వాడుతూ ఈ మహమ్మారినించి బైటపడండి._ _ సర్వేజనా సుఖినోభవంతు _ _-[నిపుణుల నుండి సేకరణ]-_

+5 प्रतिक्रिया 1 कॉमेंट्स • 85 शेयर
haritha dharmapuri May 4, 2021

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
Dvsraju May 3, 2021

పూజల్లో దోషాలు వస్తుంటాయి. అవ్వన్నీ స్వామి పట్టించుకోడు. కావలసింది శ్రద్ధా, భక్తి మాత్రమే ఒక ముసలి భిక్షువు శివాలయం దగ్గర బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూండేది. ఒక రోజు ఓ యోగిపుంగవుడు శివదర్శనం చేసుకుని వెడుతూంటే, ఆ వృద్ధురాలు ఆయన పాదలమీద పడి " అయ్యా ! నా జీవితం అంతా ఇలానే సాగిపోతోంది. నాకేదైనా మంత్రమో, పద్యమో చెప్పండి. ఇఖ బతికి ఉన్న నాలుగురోజులు మీరు చెప్పినదే మనస్సులోనే అనుకుంటూ బతుకుతాను " అని ప్రాధేయపడింది. ఆ యోగి అప్పుడామెకు ఇలా చెప్పాడు. "తవ పాదే మమ శిర: ధారయతాం ! దేహిమే ముక్తి శివా ! " అని ముమ్మారు చెప్పి వెళ్ళాడు. ఆమె అది విని ఆనంద పడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతోంది. అలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఈమె పండు వృద్ధురాలయింది. అలాగే ఆ శివాలయం దగ్గర బిక్షాటన చేస్తూ గడుపుతోంది. తిరిగి ఆ యోగి పుంగవుడు శివ దర్శనం చేసుకుని, ఈమెను గుర్తుపట్టి, " ఏమి అవ్వా! నేను చెప్పినది జ్ఞాపకం ఉన్నదా ? "అనడిగాడు. ఆమె ఆయనకు నమస్కరించి " అయ్యా ! అదీ మరువలేదు. తమరిని మరువలేదు " అన్నది. " ఏదీ చెప్పిన పాఠం అప్పజెప్పు " అని నవ్వుతూ అడిగాడు. ఆమె తడబడుతూ తను ధ్యానిస్తున్న ఆ యోగి చెప్పినది అప్పజెప్పింది. " అవ్వా ! తప్పు చదువుతున్నావు ! నేను స్వామి పాదాల మీద నీ శిరసు పెట్టమంటే, నువ్వు స్వామి శిరసు మీద నీ పాదాలు పెట్టావు ! నీ ఇన్నేళ్ళ ధ్యానం వ్యర్ధం అయ్యింది " అని కోపంతో వెళ్ళిపోయాడు. ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు ఈ " తవ, మమ " అనే పదాలు అటూ ఇటూ చేసి చదువుతోంది. ఆమె కంటిమింటికి ఏకధారగా ఏడుస్తూ, అన్నాహారాలు మాని తన ఇన్నేళ్ళ శ్రమ వ్యర్ధం అయ్యింది అని రోజుల తరబడి బాధపడసాగింది. ఓ రాత్రి మన స్వామి ఆ యోగిపుంగవుని కలలో కనబడి " ఏం పని చేశావయ్యా ! నా భక్తురాలు అన్నాహారాలు లేక బాధపడుతోంది. నేను శ్రద్ధాభక్తులకు వశుడను కానీ, భాషకు కాదయ్యా ! ముందు ఆమె బాధపోగొట్టి, ఆమె అహారం తీసుకునేలా చెయ్యి" అని ఆయనను హెచ్చరిక చేశాడు. ఆ యోగి పుంగవుడు ఉలిక్కిపడి లేచి, శివాలయం దగ్గరకు పరుగుపరుగున వెళ్ళి, ఆ వృద్ధురాలి పాదముల మీద పడి " అమ్మా ! నువ్వు చేసే పూజే స్వామి కి నచ్చింది. నన్ను క్షమించి ఆహారం స్వీకరించు " అని ఆమెను తృప్తిపరచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు. కాబట్టి మనం తెలుసుకోవలసింది, స్వామి మన శ్రద్ధాభక్తులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ, భాషకు కాదని తెలుసుకోవాలి. మనం ఎన్నో సహస్రాలు చదువుతూ ఉంటాము. పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. పూజల్లో దోషాలు వస్తుంటాయి. అవ్వన్నీ స్వామి పట్టించుకోడు. కావలసింది శ్రద్ధా, భక్తి మాత్రమే. 🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 10 शेयर

0 कॉमेंट्स • 0 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB