*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 374, 375 / Vishnu Sahasranama Contemplation - 374, 375 🌹* 📚. ప్రసాద్ భరద్వాజ *🌻 374. క్షోభణః, क्षोभणः, Kṣobhaṇaḥ 🌻* *ఓం అమితాశనాయ నమః | ॐ अमिताशनाय नमः | OM Amitāśanāya namaḥ* సర్గకాలే ప్రకృతించ పురుషంచ ప్రవిశ్యయః । క్షోభయామాస స హరిరితి క్షోభణ ఉచ్యతే ॥ ప్రకృతిం పురుషం చైవ ప్రవిశ్యాత్మేచ్ఛయా హరిః । ప్రవిశ్య క్షోభయామాస సర్గకాలే వ్యయావ్యయౌ ॥ ఇతి విష్ణుపురాణే శ్రీ పరాశర సమీరణాత్ ॥ జగదుద్పత్తి జరిగిన సమయమున మాయని/ప్రకృతినీ, జీవుని/పురుషునీ కూడ ప్రవేశించి క్షోభింప లేదా స్పందింపజేసెను. :: విష్ణు పురాణము - 1:2 :: ప్రకృతిం పురుషం చైవ ప్రవిశ్యాత్మేచ్ఛయా హరిః । ప్రవిశ్య క్షోభయామాస సర్గకాలే వ్యయావ్యయౌ ॥ 29 ॥ సృష్టికాలమునందు శ్రీహరి తన ఇచ్ఛతోనే ప్రకృతిని పురుషుని కూడ ప్రవేశించి వికారముకల తత్త్వమగు ప్రకృతిని నిర్వికార తత్త్వము అగు పురుషుని కూడ క్షోభింపజేసెను...అను విష్ణు పురాణ వచనము ఇచ్చట ప్రమాణము. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 374🌹* 📚. Prasad Bharadwaj *🌻 374. Kṣobhaṇaḥ 🌻* *OM Amitāśanāya namaḥ* सर्गकाले प्रकृतिंच पुरुषंच प्रविश्ययः । क्षोभयामास स हरिरिति क्षोभण उच्यते ॥ प्रकृतिं पुरुषं चैव प्रविश्यात्मेच्छया हरिः । प्रविश्य क्षोभयामास सर्गकाले व्ययाव्ययौ ॥ इति विष्णुपुराणे श्री पराशर समीरणात् ॥ Sargakāle prakr̥tiṃca puruṣaṃca praviśyayaḥ, Kṣobhayāmāsa sa haririti kṣobhaṇa ucyate. Prakr̥tiṃ puruṣaṃ caiva praviśyātmecchayā hariḥ, Praviśya kṣobhayāmāsa sargakāle vyayāvyayau. Iti viṣṇupurāṇe śrī parāśara samīraṇāt. At the time of creation, entering into Prakr̥ti and Puruṣa, He agitated them. So, He is Kṣobhaṇaḥ. Viṣṇu purāṇamu - 1:2 Prakr̥tiṃ puruṣaṃ caiva praviśyātmecchayā hariḥ, Praviśya kṣobhayāmāsa sargakāle vyayāvyayau. 29. :: विष्णु पुराण - १:२ :: प्रकृतिं पुरुषं चैव प्रविश्यात्मेच्छया हरिः । प्रविश्य क्षोभयामास सर्गकाले व्ययाव्ययौ ॥ २९ ॥ Bahavān Hari, entering into Prakr̥ti and Puruṣa at the time of creation, agitated the perishable (Prakr̥ti) and the imperishable (Puruṣa). 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः । करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः ॥ ४१ ॥ ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః । కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౪౧ ॥ Udbhavaḥ kṣobhaṇo devaḥ śrīgarbhaḥ parameśvaraḥ । Karaṇaṃ kāraṇaṃ kartā vikartā gahano guhaḥ ॥ 41 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 375 / Vishnu Sahasranama Contemplation - 375🌹* 📚. ప్రసాద్ భరద్వాజ *🌻 375. దేవః, देवः, Devaḥ 🌻* *ఓం దేవాయ నమః | ॐ देवाय नमः | OM Devāya namaḥ* యతో దీవ్యతి సర్గాద్యా క్రీడయా క్రీడతే హతః । విజిగీషతే సురాదీన్ భూతేషు వ్యవహారతః ॥ ఆత్మనా ద్యోతతే యస్మాత్ స్తుత్యైశ్చ స్తూయతే యతః । సర్వత్ర గచ్ఛత్యథవేత్యతో దేవ ఇతీర్యతే ॥ ఏకో దేవ ఇతి శ్రుత్యా చాచ్యుతః స్తూయతే హరిః ॥ దివ్ అనే ధాతువు నుండి 'దేవః' అను శబ్దము ఏర్పడుచున్నది. ఆ ధాతువునకు కల వివిదార్థములను అనుసరించి 'సృష్టిమొదలగు వ్యాపారములతో క్రీడించును', 'అసురులు మొదలగువారిని జయించగోరుచుండును', 'సర్వభూతములయందును అంతర్యామిగా వ్యవహరించుచుండును', 'సర్వ భూతములయందును ఆత్మతత్త్వమై ప్రకాశించుచుండును', ' స్తుత్యులగువారిచే కూడ స్తుతించబడుచుండును', 'అంతటను వ్యాపించు ఉండును' కావున ఆ విష్ణుని దేవః అనదగియుండును. 'ఏకో దేవః' (శ్వేతా 6-11) 'దేవ శబ్దముచే చెప్పబడదగిన పరమాత్ముడు ఒక్కడే' అను శ్వేతాశ్వతరమంత్రవచనము ఇచ్చట ప్రమాణము. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 375🌹* 📚. Prasad Bharadwaj *🌻375. Devaḥ🌻* *OM Devāya namaḥ* यतो दीव्यति सर्गाद्या क्रीडया क्रीडते हतः । विजिगीषते सुरादीन् भूतेषु व्यवहारतः ॥ आत्मना द्योतते यस्मात् स्तुत्यैश्च स्तूयते यतः । सर्वत्र गच्छत्यथवेत्यतो देव इतीर्यते ॥ एको देव इति श्रुत्या चाच्युतः स्तूयते हरिः ॥ Yato dīvyati sargādyā krīḍayā krīḍate hataḥ, Vijigīṣate surādīn bhūteṣu vyavahārataḥ. Ātmanā dyotate yasmāt stutyaiśca stūyate yataḥ, Sarvatra gacchatyathavetyato deva itīryate. Eko deva iti śrutyā cācyutaḥ stūyate hariḥ. Devaḥ is from the root 'div/दिव्'. The root has multiple interpretations such as 'He is desires to be victorious over all asurās or evil doers', 'sports by creation', 'wishes to conquer the celestials and others', 'functions in all beings', 'shines as their ātman or soul', 'is praised by those given to praise', 'goes everywhere' etc. and hence Lord Viṣṇu is Devaḥ vide the mantra 'eko devaḥ' (Śvetā 6-11). 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः । करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः ॥ ४१ ॥ ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః । కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౪౧ ॥ Udbhavaḥ kṣobhaṇo devaḥ śrīgarbhaḥ parameśvaraḥ । Karaṇaṃ kāraṇaṃ kartā vikartā gahano guhaḥ ॥ 41 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹 🌹 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama Join and Share విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 374, 375 / Vishnu  Sahasranama Contemplation - 374, 375 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 374. క్షోభణః, क्षोभणः, Kṣobhaṇaḥ 🌻*

*ఓం అమితాశనాయ నమః | ॐ अमिताशनाय नमः | OM Amitāśanāya namaḥ*

సర్గకాలే ప్రకృతించ పురుషంచ ప్రవిశ్యయః ।
క్షోభయామాస స హరిరితి క్షోభణ ఉచ్యతే ॥
ప్రకృతిం పురుషం చైవ ప్రవిశ్యాత్మేచ్ఛయా హరిః ।
ప్రవిశ్య క్షోభయామాస సర్గకాలే వ్యయావ్యయౌ ॥
ఇతి విష్ణుపురాణే శ్రీ పరాశర సమీరణాత్ ॥

జగదుద్పత్తి జరిగిన సమయమున మాయని/ప్రకృతినీ, జీవుని/పురుషునీ కూడ ప్రవేశించి క్షోభింప లేదా స్పందింపజేసెను.

:: విష్ణు పురాణము - 1:2 ::
ప్రకృతిం పురుషం చైవ ప్రవిశ్యాత్మేచ్ఛయా హరిః ।
ప్రవిశ్య క్షోభయామాస సర్గకాలే వ్యయావ్యయౌ ॥ 29 ॥

సృష్టికాలమునందు శ్రీహరి తన ఇచ్ఛతోనే ప్రకృతిని పురుషుని కూడ ప్రవేశించి వికారముకల తత్త్వమగు ప్రకృతిని నిర్వికార తత్త్వము అగు పురుషుని కూడ క్షోభింపజేసెను...అను విష్ణు పురాణ వచనము ఇచ్చట ప్రమాణము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 374🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 374.  Kṣobhaṇaḥ 🌻*

*OM Amitāśanāya namaḥ*

सर्गकाले प्रकृतिंच पुरुषंच प्रविश्ययः ।
क्षोभयामास स हरिरिति क्षोभण उच्यते ॥
प्रकृतिं पुरुषं चैव प्रविश्यात्मेच्छया हरिः ।
प्रविश्य क्षोभयामास सर्गकाले व्ययाव्ययौ ॥
इति विष्णुपुराणे श्री पराशर समीरणात् ॥

Sargakāle prakr̥tiṃca puruṣaṃca praviśyayaḥ,
Kṣobhayāmāsa sa haririti kṣobhaṇa ucyate.
Prakr̥tiṃ puruṣaṃ caiva praviśyātmecchayā hariḥ,
Praviśya kṣobhayāmāsa sargakāle vyayāvyayau.
Iti viṣṇupurāṇe śrī parāśara samīraṇāt.

At the time of creation, entering into Prakr̥ti and Puruṣa, He agitated them. So, He is Kṣobhaṇaḥ.

Viṣṇu purāṇamu - 1:2
Prakr̥tiṃ puruṣaṃ caiva praviśyātmecchayā hariḥ,
Praviśya kṣobhayāmāsa sargakāle vyayāvyayau. 29.

:: विष्णु पुराण - १:२ ::
प्रकृतिं पुरुषं चैव प्रविश्यात्मेच्छया हरिः ।
प्रविश्य क्षोभयामास सर्गकाले व्ययाव्ययौ ॥ २९ ॥

Bahavān Hari, entering into Prakr̥ti and Puruṣa at the time of creation, agitated the perishable (Prakr̥ti) and the imperishable (Puruṣa).

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः ।
करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः ॥ ४१ ॥

ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౪౧ ॥

Udbhavaḥ kṣobhaṇo devaḥ śrīgarbhaḥ parameśvaraḥ ।
Karaṇaṃ kāraṇaṃ kartā vikartā gahano guhaḥ ॥ 41 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 375 / Vishnu  Sahasranama Contemplation - 375🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 375. దేవః, देवः, Devaḥ 🌻*

*ఓం దేవాయ నమః | ॐ देवाय नमः | OM Devāya namaḥ*

యతో దీవ్యతి సర్గాద్యా క్రీడయా క్రీడతే హతః ।
విజిగీషతే సురాదీన్ భూతేషు వ్యవహారతః ॥
ఆత్మనా ద్యోతతే యస్మాత్ స్తుత్యైశ్చ స్తూయతే యతః ।
సర్వత్ర గచ్ఛత్యథవేత్యతో దేవ ఇతీర్యతే ॥
ఏకో దేవ ఇతి శ్రుత్యా చాచ్యుతః స్తూయతే హరిః ॥

దివ్ అనే ధాతువు నుండి 'దేవః' అను శబ్దము ఏర్పడుచున్నది. ఆ ధాతువునకు కల వివిదార్థములను అనుసరించి 'సృష్టిమొదలగు వ్యాపారములతో క్రీడించును', 'అసురులు మొదలగువారిని జయించగోరుచుండును', 'సర్వభూతములయందును అంతర్యామిగా వ్యవహరించుచుండును', 'సర్వ భూతములయందును ఆత్మతత్త్వమై ప్రకాశించుచుండును', ' స్తుత్యులగువారిచే కూడ స్తుతించబడుచుండును', 'అంతటను వ్యాపించు ఉండును' కావున ఆ విష్ణుని దేవః అనదగియుండును. 'ఏకో దేవః' (శ్వేతా 6-11) 'దేవ శబ్దముచే చెప్పబడదగిన పరమాత్ముడు ఒక్కడే' అను శ్వేతాశ్వతరమంత్రవచనము ఇచ్చట ప్రమాణము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 375🌹*
📚. Prasad Bharadwaj 

*🌻375. Devaḥ🌻*

*OM Devāya namaḥ*

यतो दीव्यति सर्गाद्या क्रीडया क्रीडते हतः ।
विजिगीषते सुरादीन् भूतेषु व्यवहारतः ॥
आत्मना द्योतते यस्मात् स्तुत्यैश्च स्तूयते यतः ।
सर्वत्र गच्छत्यथवेत्यतो देव इतीर्यते ॥
एको देव इति श्रुत्या चाच्युतः स्तूयते हरिः ॥

Yato dīvyati sargādyā krīḍayā krīḍate hataḥ,
Vijigīṣate surādīn bhūteṣu vyavahārataḥ.
Ātmanā dyotate yasmāt stutyaiśca stūyate yataḥ,
Sarvatra gacchatyathavetyato deva itīryate.
Eko deva iti śrutyā cācyutaḥ stūyate hariḥ.

Devaḥ is from the root 'div/दिव्'. The root has multiple interpretations such as 'He is desires to be victorious over all asurās or evil doers', 'sports by creation', 'wishes to conquer the celestials and others', 'functions in all beings', 'shines as their ātman or soul', 'is praised by those given to praise', 'goes everywhere' etc. and hence Lord Viṣṇu is Devaḥ vide the mantra 'eko devaḥ' (Śvetā 6-11).

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः ।
करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः ॥ ४१ ॥

ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౪౧ ॥

Udbhavaḥ kṣobhaṇo devaḥ śrīgarbhaḥ parameśvaraḥ ।
Karaṇaṃ kāraṇaṃ kartā vikartā gahano guhaḥ ॥ 41 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 5 शेयर

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 386, 387 / Vishnu Sahasranama Contemplation - 386, 387 🌹* 📚. ప్రసాద్ భరద్వాజ *🌻386. సంస్థానః, संस्थानः, Saṃsthānaḥ🌻* *ఓం సంస్థానాయ నమః | ॐ संस्थानाय नमः | OM Saṃsthānāya namaḥ* విశ్వేశ్వరేఽస్మిన్భూతానాం సంస్థితః ప్రలయాత్మికా । సమీచీనం స్థాన మస్యేత్యయం సంస్థాన ఉచ్యతే ॥ సంస్థితః, సంస్థానం అనునవి లెస్సయగు నిలుకడ అను అర్థమున సమానార్థక పదములు. అట్లు ఇతనియందు సకల భూతములకును 'ప్రళయ' రూపము అగు ఉనికి ఏర్పడును అను అర్థమున పరమాత్ముడు 'సంస్థానః' అనబడుచున్నాడు. లేదా సమీచీనం స్థానం అస్య ఇతనికి లెస్సయగు ఉనికి కలదు. తాను ఎవ్వరిని ఆశ్రయించక కాలపు అవధులకు లోబడక ఏవియు తనకు అంటక తాను వేనిని అంటక శాశ్వతుడై యుండు ఉనికి లెస్సయగు ఉనికియే కదా! సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 386🌹* 📚. Prasad Bharadwaj *🌻386. Saṃsthānaḥ🌻* *OM Saṃsthānāya namaḥ* Viśveśvare’sminbhūtānāṃ saṃsthitaḥ pralayātmikā, Samīcīnaṃ sthāna masyetyayaṃ saṃsthāna ucyate. विश्वेश्वरेऽस्मिन्भूतानां संस्थितः प्रलयात्मिका । समीचीनं स्थान मस्येत्ययं संस्थान उच्यते ॥ Here is the resting place of creatures in the form of pralaya or deluge. Or as He is the ultimate existence and His abode is excellent hence He is Saṃsthānaḥ. 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः ।परर्धिः परमस्पष्ट स्तुष्टः पुष्टश्शुभेक्षणः ॥ ४२ ॥ వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః ।పరర్ధిః పరమస్పష్ట స్తుష్టః పుష్టశ్శుభేక్షణః ॥ ౪౨ ॥ Vyavasāyo vyavasthānaḥ saṃsthānasthānado dhruvaḥ ।Parardhiḥ paramaspaṣṭa stuṣṭaḥ puṣṭaśśubhekṣaṇaḥ ॥ 42 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 387 / Vishnu Sahasranama Contemplation - 387🌹* 📚. ప్రసాద్ భరద్వాజ *🌻387. స్థానదః, स्थानदः, Sthānadaḥ🌻* *ఓం స్థానదాయ నమః | ॐ स्थानदाय नमः | OM Sthānadāya namaḥ* స్థానదః, स्थानदः, Sthānadaḥ ధ్రువాదిభ్యఃస్వకర్మానురూపం స్థానం దదాతి యః । స స్థానద ఇతి ప్రోక్తో విబుధైర్భగవాన్ హరిః ॥ ధ్రువుడు మొదలగు వారికి తమ కర్మలకు తగిన స్థానమును ఇచ్చువాడు. క. ధీరవ్రత! రాజన్య కు, మారక! నీ హృదయమందు మసలిన కార్యం బారూఢిగానెఱుంగుదు, నారయ నది వొందరాని దైనను నిత్తున్. (289) వ. అది యెట్టి దనిన నెందేని మేధియందుఁ బరిభ్రామ్యమాణ గోచక్రం బునుం బోలె గ్రహనక్ష త్రతారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్ర రూపంబుల యిన ధర్మాగ్ని కశ్యప శక్రులును సప్తర్షులును, దారకా సమేతులై ప్రదక్షిణంబు దిరుగుచుండుదురు; అట్టి దురాపంబును ననన్యాధిష్ఠితం బును లోకత్రయ ప్రళయకాలంబునందు నశ్వరంబుగాక ప్రకాశమా నంబును నయిన ధ్రువక్షితి యను పదంబు ముందట నిరువది యాఱువేలేండ్లు చనంబ్రాపింతువు... (290) రాజకుమారా! నీ వ్రతదీక్ష అచంచలమైనది. నీ మనస్సులోని అభిప్రాయాలు చక్కగా గ్రహించాను. అయితే అది దుర్లభమైనది. అయినప్పటికీ, నీ కోరిక తీరుస్తాను. కట్టుకొయ్య చుట్టూ పశువుల మంద తిరిగినట్లు గ్రహాలూ, నక్షత్రాలూ, తారాగణాలూ, జ్యోతిశ్చక్రమూ, నక్షత్ర స్వరూపాలయిన ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, సప్తర్షులు, తారకలతో కూడి దేనికి ప్రదక్షిణం చేస్తుంటారో అటువంటి "ధ్రువక్షితి" అనే మహోన్నత స్థానాన్ని ఇకపైన అరవైఆరువేల సంవత్సరాల అనంతరం నీవు పొందుతావు. అది ఎవ్వరికీ అందరానిది. ఇదివరకు ఎవ్వరూ దానిని పొందలేదు. మూడు లోకాలూ నశించేటప్పుడు కూడ అది నశింపక ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి స్థానాన్ని నీవు అలంకరిస్తావు. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 387🌹* 📚. Prasad Bharadwaj *🌻387. Sthānadaḥ🌻* *OM Sthānadāya namaḥ* Dhruvādibhyaḥsvakarmānurūpaṃ sthānaṃ dadāti yaḥ, Sa sthānada iti prokto vibudhairbhagavān hariḥ. ध्रुवादिभ्यःस्वकर्मानुरूपं स्थानं ददाति यः । स स्थानद इति प्रोक्तो विबुधैर्भगवान् हरिः ॥ Since Lord Hari confers on Dhruva and others their place according to their karmas, He is Sthānadaḥ. Śrīmad Bhāgavata - Canto 4, Chapter 9 Nanyaradhiṣṭhitaṃ bhadra yad bhrājiṣṇu dhruvakṣiti, Yatra graharkṣatārāṇāṃ jyotiṣāṃ cakramāhitam. 20. Dharmo’gniḥ kaśyapaḥ śukro munayo ye vanaukasaḥ, Caranti dakṣiṇīkr̥tya bhramanto yatsatārakāḥ. 22. :: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे नवमोऽध्यायः :: नन्यरधिष्ठितं भद्र यद् भ्राजिष्णु ध्रुवक्षिति । यत्र ग्रहर्क्षताराणां ज्योतिषां चक्रमाहितम् ॥ २० ॥ धर्मोऽग्निः कश्यपः शुक्रो मुनयो ये वनौकसः । चरन्ति दक्षिणीकृत्य भ्रमन्तो यत्सतारकाः ॥ २२ ॥ Lord continued: My dear Dhruva, I shall award you the glowing planet known as the polestar, which will continue to exist even after the dissolution at the end of the millennium. No one has ever ruled this planet, which is surrounded by all the solar systems, planets and stars. All the luminaries in the sky circumambulate this planet, just as bulls tread around a central pole for the purpose of crushing grains. Keeping the polestar to their right, all the stars inhabited by the great sages like Dharma, Agni, Kaśyapa and Śukra circumambulate this planet, which continues to exist even after the dissolution of all others. 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः ।परर्धिः परमस्पष्ट स्तुष्टः पुष्टश्शुभेक्षणः ॥ ४२ ॥ వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః ।పరర్ధిః పరమస్పష్ట స్తుష్టః పుష్టశ్శుభేక్షణః ॥ ౪౨ ॥ Vyavasāyo vyavasthānaḥ saṃsthānasthānado dhruvaḥ ।Parardhiḥ paramaspaṣṭa stuṣṭaḥ puṣṭaśśubhekṣaṇaḥ ॥ 42 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹 🌹 #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/

+7 प्रतिक्रिया 2 कॉमेंट्स • 17 शेयर

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 71 / Sri Vishnu Sahasra Namavali - 71 🌹* *నామము - భావము* 📚. ప్రసాద్ భరద్వాజ *🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷* *జ్యేష్ట నక్షత్ర తృతీయ పాద శ్లోకం* *🍀 71.బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః |* *బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ‖ 71 ‖ 🍀* 🍀 661) బ్రహ్మణ్య: - బ్రహ్మను అభిమానించువాడు. 🍀 662) బ్రహ్మకృత్ - తపస్సు మొదలైనవిగా తెలియ జేయుబడిన బ్రహ్మకు తానే కర్త అయినవాడు. 🍀 663) బ్రహ్మా - బ్రహ్మదేవుని రూపమున తానే సృష్టి చేయువాడు. 🍀 664) బ్రహ్మ - బ్రహ్మ అనగా పెద్దదని అర్థము. 🍀 665) బ్రహ్మవివర్థన: - తపస్సు మొదలైనవానిని వృద్ధి నొందించువాడు. 🍀 666) బ్రహ్మవిత్ - బ్రహ్మమును చక్కగా తెలిసినవాడు. 🍀 667) బ్రాహ్మణ: - వేదజ్ఞానమును ప్రబోధము చేయువాడు. 🍀 668) బ్రహ్మీ - తపస్యాది బ్రహ్మము తనకు అంగములై భాసించువాడు. 🍀 669) బ్రహ్మజ్ఞ: - వేదములే తన స్వరూపమని తెలిసికొనిన వాడు. 🍀 670) బ్రాహ్మణప్రియ: - బ్రహ్మజ్ఞానులైన వారిని ప్రేమించువాడు. సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Vishnu Sahasra Namavali - 71 🌹* *Name - Meaning* 📚 Prasad Bharadwaj *🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷* *Sloka for Jeshta 3rd Padam* *🌻 brahmaṇyō brahmakṛdbrahmā brahma brahmavivardhanaḥ |* *brahmavidbrāhmaṇō brahmī brahmajñō brāhmaṇapriyaḥ || 71 || 🌻* 🌻 661. Brahmaṇyaḥ: The Vedas, Brahmanas and knowledge are indicated by the word Brahma. As the Lord promotes these, He is called Brahmanya. 🌻 662. Brahmakṛt: One who performs Brahma or Tapas (austerity). 🌻 663. Brahmā: One who creates everything as the creator Brahma. 🌻 664. Brahma: Being big expanding, the Lord who is known from indications like Satya (Truth), is called Brahma. Or Brahma is Truth, Knowledge and Infinity! 🌻 665. Brahma-vivardhanaḥ: One who promotes Tapas (austerity), etc. 🌻 666. Brahmavid: One who knows the Vedas and their real meaning. 🌻 667. Brāhmaṇaḥ: One who, in the form of Brahmana, instructs the whole world, saying, 'It is commanded so and so in the Veda'. 🌻 668. Brahmī: One in whom is established such entities as Tapas, Veda, mind, Prana etc. which are parts of Brahma and which are also called Brahma. 🌻 669. Brahmajñaḥ: One who knows the nature of Brahman. 🌻 670. Brāhmaṇapriyaḥ: One to whom holy men are devoted. Continues... 🌹 🌹 🌹 🌹 🌹 #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
haritha dharmapuri May 7, 2021

+3 प्रतिक्रिया 1 कॉमेंट्स • 4 शेयर
Eswar Tanikella May 7, 2021

సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరమ్ | వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి || 🪔 సర్వదేహములందు ఆత్మను గూడియుండు పరమాత్మను గాంచువాడు మరియు నాశవంతమైన దేహమునందలి ఆత్మ, పరమాత్మ లిరువురిని ఎన్నడును నశింపనివారుగా తెలిసికొనగలిగినవాడు యథార్థదృష్టిని కలిగినవాడు. 🌞 భాష్యము : దేహము, దేహయజమానియైన ఆత్మ, ఆత్మ యొక్క మిత్రుడు అనెడి మూడు విషయములను సత్సాంగత్యముచే దర్శింపగలిగినవాడు యథార్థముగా జ్ఞానవంతుడు. ఆధ్యాత్మిక విషయముల యథార్థజ్ఞానము కలిగినవాని సాంగత్యము లేకుండా ఆ మూడు విషయములను ఎవ్వరును దర్శింపలేరు. అట్టి జ్ఞానవంతుల సాంగత్యము లేనివారు అజ్ఞానులు. వారు కేవలము దేహమునే గాంచుచు, దేహము నశించిన పిమ్మట సర్వము ముగియునని తలతురు. కాని వాస్తవమునకు అట్టి భావన సరియైనది కాదు. దేహము నశించిన పిమ్మటయు ఆత్మ, పరమాత్మ ఇరువురును నిలిచియుందురు. అంతియేగాక వారు అనంతముగా పలువిధములైన స్థావర, జంగమ రూపములలో తమ అస్తిత్వమును కొనసాగింతురు. జీవాత్మ దేహమునకు యజమానియైనందున "పరమేశ్వర" అను పదమునకు కొన్నిమార్లు జీవాత్మగా అర్థము చెప్పబడుచుండును. అట్టి ఆత్మ దేహము నశించిన పిమ్మట వేరొక దేహమును పొందుచుండును. ఈ విధముగా ఆత్మ దేహమునకు యజమానిగా తెలియబడుచుండును. కాని కొందరు "పరమేశ్వర" అను పదమునకు పరమాత్ముడని అర్థము చెప్పుదురు. ఈ రెండు భావములందును ఆత్మ మరియు పరమాత్మలు శాశ్వతముగా నిలుచువారే. వారెన్నడును నశింపరు. ఈ విధముగా ఆత్మ, పరమాత్మలను దర్శించువాడు జరుగుచున్నదానిని యథార్థముగా గాంచగలడు. ఇది భగవద్గీత యందు త్రయోదశాధ్యాయమగు ప్రకృతి, పురుషుడు, చైతన్యము యందలి 28 వ శ్లోకము.🙏☯️🕉️🌞🔱🚩

0 कॉमेंट्स • 0 शेयर

Join and Share ALL 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/ https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg Join and Share విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/ Join and Share 🌹. Daily satsang Wisdom 🌹 www.facebook.com/groups/dailysatsangwisdom/ https://t.me/Seeds_Of_Consciousness https://pyramidbook.in/dailywisdom Join and Share 🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹 www.facebook.com/groups/vivekachudamani/ https://pyramidbook.in/vivekachudamani Join and Share భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM www.facebook.com/groups/maharshiwisdom/ https://pyramidbook.in/maharshiwisdom Join and Share 🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹 https://t.me/srilalithachaitanyavijnanam http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ Join and share Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా www.facebook.com/groups/avataarmeherbaba/ Join and Share Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు www.facebook.com/groups/theosophywisdom/ Join and Share 🌹. శ్రీ దత్త చైతన్యం - Sri Datta Chaitanyam 🌹 www.facebook.com/groups/dattachaitanyam/ Join and Share 🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 www.facebook.com/groups/masterek/ Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 7 शेयर

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 261 / Sri Lalitha Chaitanya Vijnanam - 261 🌹* *సహస్ర నామముల తత్వ విచారణ* ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ మూల మంత్రము : *🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁* *🍀 63. సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా । సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ ॥ 63 ॥ 🍀* *🌻261. 'ప్రాజ్ఞాత్మిక' 🌻* ప్రాజ్ఞాత్మిక అనగా పూర్తిగ ఆత్మయందు విచ్చుకొనిన ప్రజ్ఞగ నున్న శ్రీదేవి. ప్రాజ్ఞుడనగా తెలిసినవాడు. విజ్ఞానవంతుడు, జ్ఞాన వంతుడు, అంతర్లోక బహిర్లోక విషయములు తెలిసినవాడు. ఈ తెలియుట శ్రీమాత సాన్నిధ్యమే. ఒక జీవుని యందు జ్ఞానముగను, విజ్ఞానముగను శ్రీదేవియే యున్నదని తెలియవలెను. గ్రుడ్డి దీపము నుండి, సూర్యుని వఱకు గల అశేష రూపములలో గల వెలుగు శ్రీదేవి అని తెలియవలెను. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 261 🌹* *1000 Names of Sri Lalitha Devi* ✍️. Ravi Sarma 📚. Prasad Bharadwaj *🌻Prājñātmikā प्राज्ञात्मिका (261)🌻* She is known as prājñātmikā in the suṣupti stage, the stage of deep sleep. This is an extension of the previous nāma. Prājñā is the manifestation of individual soul in the casual body. As such, it is associated with the Brahman, the aggregate of entire casual bodies. If Brahman controls the universe, at microcosmic level, prājña controls individual existence. Vāc Devi-s after having described the three known stages, now proceed to explain the fourth state of consciousness called turya. Continues... 🌹 🌹 🌹 🌹 🌹 #లలితాసహస్రనామ #LalithaSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹 https://t.me/srilalithachaitanyavijnanam http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

*🌹. శ్రీమద్భగవద్గీత - 600 / Bhagavad-Gita - 600 🌹* ✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 📚. ప్రసాద్ భరద్వాజ *🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 11 🌴* 11. న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషత: | యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే || 🌷. తాత్పర్యం : దేహధారుడైనవానికి సర్వకర్మలు త్యజించుట నిక్కముగా అసాధ్యమైన విషయము. కాని కర్మఫలములను త్యాగమొనర్చినవాడు మాత్రము నిజమైన త్యాగి యనబడును. 🌷. భాష్యము : మనుజుడు ఏ సమయమునను కర్మను త్యజింపజాలడని భగవద్గీత యందే తెలుపబడినది. కనుక కృష్ణుని కొరకే కర్మనొనరించుచు, కర్మఫలమును తాననుభవింపక కృష్ణునికే సమస్తమును అర్పించువాడు నిజమైన త్యాగి యనబడును. మా అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘమునందు సభ్యులైన పలువురు తమ కార్యాలయములందు గాని, కర్మాగారమునందు గాని, ఇతర చోట్ల గాని కష్టించి పనిచేసినను వారు సంపాదించినదంతయు సంస్థకే ఒసగుదురు. అట్టి మహాత్ములు వాస్తవముగా సన్న్యాసులైనట్టివారే. అనగా వారు సన్న్యాసాశ్రమము నందు నెలకొనియున్నట్టివారే. కర్మఫలములను ఏ విధముగా త్యాగము చేయవలెనో మరియు ఎట్టి ప్రయోజనమునకై కర్మఫలములను విడువవలెనో ఈ శ్లోకమున సృష్టపరుపబడినది. 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Bhagavad-Gita as It is - 600 🌹 ✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 📚 Prasad Bharadwaj *🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 11 🌴* 11. na hi deha-bhṛtā śakyaṁ tyaktuṁ karmāṇy aśeṣataḥ yas tu karma-phala-tyāgī sa tyāgīty abhidhīyate 🌷 Translation : It is indeed impossible for an embodied being to give up all activities. But he who renounces the fruits of action is called one who has truly renounced. 🌹 Purport : It is said in Bhagavad-gītā that one can never give up work at any time. Therefore he who works for Kṛṣṇa and does not enjoy the fruitive results, who offers everything to Kṛṣṇa, is actually a renouncer. There are many members of the International Society for Krishna Consciousness who work very hard in their office or in the factory or some other place, and whatever they earn they give to the Society. Such highly elevated souls are actually sannyāsīs and are situated in the renounced order of life. It is clearly outlined here how to renounce the fruits of work and for what purpose fruits should be renounced. 🌹 🌹 🌹 🌹 🌹 #భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

🌹. శ్రీమద్భగవద్గీత - 32 / Bhagavad-Gita - 32 🌹 ✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 📚. ప్రసాద్ భరద్వాజ 🌴. ప్రధమ అధ్యాయము - విషాదయోగము - 32 🌴 32. న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ || కిం నో రాజ్యేన గోవిన్ద కిం భోగైర్జీవితేన వా | 🌷. తాత్పర్యం : ఓ కృష్ణా! తదనంతర విజయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను వాంఛింపలేకున్నను. ఓ గోవిందా! మేమెవరి కొరకు రాజ్యమును, సుఖమును, చివరకు జీవనమును సైతము కోరుచున్నమో వారందరును ఈ యుద్ధమున నిలిచియుండగా ఆ రాజ్యాదుల వలన మాకు కలుగు ప్రయోజనమేమి? 🌻. భాష్యము : మనుజుని నిజలాభాము విష్ణువు (లేదా కృష్ణుడు) నందే కలదని తెలియక బద్ధజీవులు దేహపరబంధముల యెడ ఆకర్షితులగుదురు. వాటి యందు తాము ఆనందము పొందగలమని వారు అభిలషింతురు. జీవితపు అట్టి అంధమయ భావనలో వారు భౌతికసుఖమునకు హేతువులైన వాటిని సైతము మరచిపోవుదురు. ఇచ్చట అర్జునుడు క్షత్రియధర్మమును మరచినట్లుగా తోచుచున్నది. శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆదేశములో రణరంగమునందు మరణించు క్షత్రియుడు మరియు ఆధ్యాత్మికానుభవము కొరకే అంకితమైన సన్యాసి యనెడి ఇరుపురు శక్తివంతమును మరియు తేజోమయమును అగు సూర్యమండలమున ప్రవేశింపయోగ్యులు కాగలరని తెలుపబడినది. బంధువుల మాట అటుంచి శత్రువులను వధించుటకు సైతము అర్జునుడు విముఖుడై యుండెను. బంధువులను చంపుట వలన తనకు జీవితమున సుఖము లభింపదని అతడు భావించెను. కనుకనే ఆకలిలేనివాడు వంట చేయుటకు నిరాకరించురీతి అతడు యుద్ధము చేయుటకు ఇచ్చగింపలేదు. ఇపుడతడు వనముకేగి వ్యర్థముగా ఒంటరి జీవితమును గడప నిశ్చయించు కొనెను. క్షత్రియునిగా జీవనార్థమై అతనికి ఒక రాజ్యము అవసరము. ఏలయన క్షత్రియులు ఇతర ఏ వృత్తులు యందును నియుక్తులు కాజాలరు. కాని ప్రస్తుతము అర్జునుడు రాజ్యమును కలిగిలేడు. జ్ఞాతులలో మరియు సోదరులతో పోరాడి పితృదత్తమైన రాజ్యమును తిరిగి పొందుట ఒక్కటే రాజ్యమును పొందుటకు అర్జునునకు అవకాశమై యుండెను. కాని ఆ విధముగా ఒనర్చుటకు అతడు ఇష్టపడలేదు. కనుకనే ఒంటరిగా విఫల జీవితమును గడుపుటకు వనమున కేగుట ఒక్కటే తనకు తగినదని అతడు భావించెను. 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Bhagavad-Gita as It is - 32 🌹 ✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 📚. Prasad Bharadwaj 🌴 Chapter 1 - Vishada Yoga - 32 🌴 32. na kāṅkṣe vijayaṁ kṛṣṇa na ca rājyaṁ sukhāni ca kiṁ no rājyena govinda kiṁ bhogair jīvitena vā 🌷. Translation : nor can I, my dear Kṛṣṇa, desire any subsequent victory, kingdom or happiness. O Govinda, of what avail to us are a kingdom, happiness or even life itself when all those for whom we may desire them are now arrayed on this battlefield? 🌻. Purport : Without knowing that one’s self-interest is in Viṣṇu (or Kṛṣṇa), conditioned souls are attracted by bodily relationships, hoping to be happy in such situations. In such a blind conception of life, they forget even the causes of material happiness. Arjuna appears to have even forgotten the moral codes for a kṣatriya. It is said that two kinds of men, namely the kṣatriya who dies directly in front of the battlefield under Kṛṣṇa’s personal orders and the person in the renounced order of life who is absolutely devoted to spiritual culture, are eligible to enter into the sun globe, which is so powerful and dazzling. Arjuna is reluctant even to kill his enemies, let alone his relatives. He thinks that by killing his kinsmen there would be no happiness in his life, and therefore he is not willing to fight, just as a person who does not feel hunger is not inclined to cook. He has now decided to go into the forest and live a secluded life in frustration. But as a kṣatriya, he requires a kingdom for his subsistence, because the kṣatriyas cannot engage themselves in any other occupation. But Arjuna has no kingdom. Arjuna’s sole opportunity for gaining a kingdom lies in fighting with his cousins and brothers and reclaiming the kingdom inherited from his father, which he does not like to do. Therefore he considers himself fit to go to the forest to live a secluded life of frustration. 🌹🌹🌹🌹🌹 #భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 13 🌹* ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ *🍀. దేవుడంటే ఆనందం. దేవుడంటే శాశ్వత తత్వం. 🍀* ఫ్రెడరిక్ నిషే! దేవుడు చనిపోయాడు' అన్నాడు. కానీ ఎవరూ అతన్ని 'ఇంతకూ దేవుణ్ణి ఎవరు చంపారు?” అని అడగలేదు. అక్కడ రెండు అవకాశాలున్నాయి. అతను ఆత్మహత్య చేసుకుని వుండాలి. లేదా ఎవరైనా అతన్ని హతమార్చి వుండాలి. దేవుడు ఆత్మహత్య చేసుకోడు. అది అసాధ్యం. కారణం దేవుడంటే ఆనందం. ఆనందం ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? దేవుడంటే శాశ్వత తత్వం. కాబట్టి ఆత్మహత్య అన్నది అసాధ్యం కాబట్టి అతన్ని ఎవరో హత్య చేసి వుండాలి. మతాధికారులు ఆ పని చేసి వుంటారు. ఈ కుట్రలో అన్ని మతాలకు సంబంధించిన అందరు పెద్దలు భాగస్వామ్యం వహించారు. వాళ్ళు దేవుణ్ణి చంపారు. వాళ్ళు నిజమైన దేవుణ్ణి చంపలేరనుకోండి. వాళ్ళు తాము సృష్టించిన దేవుణ్ణి చంపగలరు. అర్థం లేని పదివేల సంవత్సరాల మత చరిత్రలో జరిగిందిది. నేను యిచ్చే సలహా. ప్రేమని అన్వేషించండి. దేవుణ్ణి గురించి మరిచిపొండి. దైవత్వమన్నది దానంతట అదే వస్తుంది. అనివార్యంగా వస్తుంది. సశేషం ... 🌹 🌹 🌹 🌹 🌹 #ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 81 🌹* ✍️. సద్గురు కె. పార్వతి కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ *🌻 62. చర్విత చర్వణము 🌻* ప్రస్తుత కాలము పూర్వకాలమును గుర్తుచేయు చున్నది. కాల చక్రమున మానవజాతి చరిత్రలో చేసిన పొరపాట్లే మరల చేయుట కనిపించును. ఇప్పుడు జరుగుచున్న సంఘటనలన్నియు వినాశమును ప్రోత్సహించునవిగ గోచరించుచున్నవి. అట్లాంటిస్ నాగరికత జలమయం కాకముందు వారును యిట్లే ప్రవర్తించిరి. సన్నివేశముల వివరములలో క్రొత్తదనమున్నదిగాని విధానమంతయు పాతయే. అపుడును నకిలీ భాష్యకారులు, కపటయోగులు చాలమంది పామరులను భ్రష్టు పట్టించినారు. ఇప్పుడును అదే జరుగుచున్నది. ఓనమ లు రానివారు గూడ మహాత్ములుగ గుర్తింపబడుటకు తపన చెందుతున్నారు. కపట వేషణము, భాషణము, సత్యదూరమగు సాధనా పద్ధతులు, భ్రమల యందాకర్షణ అప్పుడును జరిగినది, ఇప్పుడును జరుగుచున్నది. కృతఘ్నత, ఆధ్యాత్మిక అనాగరికత, ఆటవిక ఆధ్యాత్మిక ప్రదర్శనములు అప్పుడు ఇప్పుడును గూడ మరల మిక్కుటముగ గోచరించుచున్నవి. అట్లాంటిస్ నాగరికతలో గూడ ఆకాశగమన విద్య గలదు. వారును వినువీధిలో త్వరితముగ ప్రయాణము చేయుటకు పరికరములు కలిగియుండిరి. వేగముగ కదలుటకు, త్వరితముగ కబళించుటకు, బలముతో ఆక్రమించుటకు ఆ పరికరములను వాడుచుండిరి. అప్పుడును ఇప్పుడును కూడ భౌగోళిక సంచారము, గ్రహాంతర సంచారము జరిగినది, జరుగుచున్నది. అప్పుడును ఇప్పుడును కూడ ఆలయములను ధ్వంసము చేయుట, అపవిత్రము చేయుట, అపహాస్యము చేయుట జరిగినవి, జరుగుచున్నవి. సోమనాథుడు, కాశీ విశ్వేశ్వరుడు, అయోధ్యా రాముడు, మధురానాథుడు భారతమున అవమానింపబడినట్లే, మధ్య ఆసియాలో శాంతి నిలయమైన జెరూసలేము దేవాలయము, దక్షిణ అమెరికాలో శంబళకు ప్రతీకయైన ఇబెజ్ (IBEZ) దేవాలయము, మధ్య అమెరికాలో గల అమేరు దేవాలయములు అవమానింపబడినవి. అపుడును ధర్మోల్లంఘనము మితిమీరి జరిగినది. ఇపుడును జరుగుచున్నది. అపుడును భూమి అంతర్భాగములలో మానవులు అలజడి కలిగించిరి. ఇప్పుడును అదే పని చేయుచున్నారు. చేసిన పొరపాట్లే మరల చేయుట వలన, ఇదివరకటి ఫలితములే మరల పొందవలసియుండును. మానవజాతి జీవనము చక్ర భ్రమణమున సాగుచున్నదేగాని ఆరోహణ క్రమము కొద్దిమందికే అలవడుచున్నది. జాతి కథ చర్విత చర్వణమే. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom www.facebook.com/groups/maharshiwisdom/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB