*🌹. భగవద్గీత యథాతథం - 1 - 045 🌹* AUDIO - VIDEO సేకరణ : ప్రసాద్ భరద్వాజ అధ్యాయం 1, శ్లోకం 45 45 యది మామప్రతీకారమ్‌ అశస్త్రం శస్త్రపాణయ: | ధార్తరాష్ట్రారణ హన్యు: తన్మే క్షేమతరం భవేత్‌ || తాత్పర్యము : నిరాయుధుడను మరియు ప్రతీకారము చేయనివాడను అగు నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగమునందు వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. భాష్యము : క్షత్రియ యుద్ధ నియమాల ప్రకారము శత్రువు చేతిలో ఆయుధాలు లేకపోయినా లేదా యుద్ధము చేయుటకు సిద్ధముగా లేకపోయినా అట్టి యోధుడ్ని సంహరింపరాదు. అయితే అర్జునుడు ఎంతకు సిద్ధమైనాడంటే ”వారు నిరాయుధుడనైన నన్ను సంహరించినా సరే గాని నేను మాత్రము యుద్ధము చేయను” అనే నిర్ణయానికి వచ్చెను. ఇవన్నీ అర్జునుని యొక్క భక్తిని తద్వారా అతని కోమల హృదయాన్ని ప్రతిబింపచేయుచున్నవి. ….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …. 🌹 🌹 🌹 🌹 🌹 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతాసారం #GitaSaram Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*🌹. గీతోపనిషత్తు -195 🌹* ✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ *📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚* శ్లోకము 36 *🍀 35. స్థిరత్వము - స్థిరచిత్తము లేనివారికి బ్రహ్మముతో యోగము చెందుట అశక్యము. స్వాధీనమైన మనస్సు కలిగి దైవముతో యోగించుటకు ప్రయత్నించు వానికి సాధ్యమగును. దర్శనము అనుభూతి కలుగవలె నన్నచో స్థిర చిత్తము పునాదిరాయి. ప్రతినిత్యము ఒక పనిని అదే సమయమున నిర్వర్తించుట, అంతే శ్రద్ధతో నిర్వర్తించుట, ఆసక్తితో రుచి కలిగి నిర్వర్తించుట వలన అస్థిరత్వము నుండి చిత్తమునకు స్థిరత్వ మేర్పడును. నిరంతరత్వము, దీర్ఘకాలము అను రెండంశము ఆధారముగ నేర్వవలసిన విషయమును నేర్చుట సిద్ధించును. మరియొక మార్గము లేదు. 🍀* అసంయతాత్మనా యోగో దు ప ఇతి మే మతిః | వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తు ముపాయతః || 36 స్థిరచిత్తము లేనివారికి బ్రహ్మముతో యోగము చెందుట అశక్యము. స్వాధీనమైన మనస్సు కలిగి దైవముతో యోగించుటకు ప్రయత్నించు వానికి నే తెలిపిన ఉపాయము చేత సాధ్యమగును. ఇది నా అభిప్రాయము. చంచలమైన మనస్సు ఐహిక జీవనమునకు గూడ వినియోగ పడదు. అట్టి మనస్సునకు సామర్థ్యముండదు. ఒక కార్యము పై ఎక్కువ సేపు నిలచి పనిచేయుట కూడ యుండదు. దీక్షతో ఏకాగ్ర మైన మనస్సుతో కార్యములను నిర్వర్తించినపుడు కార్యసిద్ధి కవకాశము మెండుగ నుండును. చిందులు వేయు మనస్సునకు ఎట్టి అవకాశము ఉండదు. చిందులు వేయు మనసును అనాదిగ మర్కటముతో పోల్చుదురు. మర్కట మనగ కోతి. కోతి ఒక చెట్టుపై నిలకడగ ఉండదు. ఒక కొమ్మపై అసలుండదు. ఏ పండును పూర్తిగ భుజించదు. తోటలో సమృద్ధిగ పండ్లున్నపుడు అన్ని పండ్లను ఎంగిలి చేయుటయేగాని, సమగ్రముగ భుజింపదు. ఒక పండు తినుచు మరొక పండును చూచును. అపుడున్న పండును విసర్జించి మరియొక పండునకై గెంతును. ఇట్లే సామాన్య మానవులు కూడ గమ్యమున నడవక ప్రక్కదారులను పట్టి పోవుచుందురు. అట్టి వారు కార్యములను చక్కబెట్టలేరు. బాధ్యతలను సమగ్రముగ నిర్వర్తించలేరు. ఒక పాఠ్యాంశమును కూడ పరిపూర్ణముగ పఠించ లేరు. ఒక పని చేయుచున్నపుడు మరియొక పని గుర్తు వచ్చు చుండును. ఉదాహరణకు భోజనము చేయునపుడు వృత్తిపరమైన భావములు స్ఫురించుట, తత్కారణముగ భోజనమును అనుభూతి చెందలేరు. అట్లే వృత్తి యందున్నపుడు మరియొక అంశము పైకి మనస్సు గెంతును. అందువలన వృత్తి నిర్వహణము జరుగును. నిదురించుచున్నపుడు తాను చేయవలసిన పనులు, మరచిన పనులు జ్ఞప్తికి వచ్చి నిదుర పట్టదు. ఏ పనియందైనను ఏకాగ్రత ఉండకుండుట వలన పని చెడి, ఎక్కువ పని ఏర్పడును. పనులు జరుగుట మానును. దానితో అసహనత, కోపము పెరుగును. ఇట్లు మనస్సు పెట్టు తిప్పలు, త్రిప్పటల వలన అలసిపోవుటయే యుండును. జీవచైతన్యము ఒక ప్రవాహముగ సాగదు. ఇట్లు ఎంతైనను సామాన్య మానవుని మనస్సు గూర్చి విశ్లేషించవచ్చును. ఆరాట పడుటయే గాని, తగు విధమగు ఆచరణముండక పోవుటచే, స్థిరము లేక సూత్రము తెగిన గాలిపటమువలె జీవితము గాలి వాటున సాగుచుండును. ఇట్లు వృత్తములలో గిరగిర తిరుగు చిత్తమును నిగ్రహించుట గాలిపటమునకు సూత్రము కట్టుట వంటిది. ఎద్దు ముక్కునకు త్రాడు వేయుట వంటిది. గుఱ్ఱమునకు కళ్ళెము కట్టుట వంటిది. అపుడే ప్రయాణము సాగును. జీవన ప్రయోజనము నెరవేరును. ఇది నిస్సంశయము. కళ్ళెము లేని గుజ్జముపై ప్రయాణము గమ్యమునకు చేర్చదు. ముక్కుకు త్రాడు వేయని ఎద్దుతో పొలము దున్నలేము. అట్లు మనస్సును అంతరంగమునుండి పట్టనిచో అది పలు విధముల పరుగెట్టు చుండును. అంతరంగమందు సుందర తేజోరూపమునో, జ్యోతినో లేక స్పందనాత్మక చర్యనో పట్టుట వలన క్రమముగ స్థిరమగు మనసు ఏర్పడును. అట్టి స్థిరమనస్సు అంతర్ముఖముగ అంతరంగమున దర్శించినచో ఆసక్తికరము, రుచికరము అగు బుద్ధి ఆవరణము గోచరించును. అందు ప్రవేశించిన వానికి బుద్ధియను వెలుగునకు మూలమగు దానియందు ఆసక్తి కలుగును. ఇట్లు అంతరంగమును శోధించుచు తన మూలమును చేరుట వలన యోగము పరిపూర్ణ మగును. పరమాత్మ, జీవాత్మ, బుద్ధి, స్థిరచిత్తము ఒకే సూత్రముగ, తేజోమయముగ గోచరించును. పై విధమగు దర్శనము అనుభూతి కలుగవలె నన్నచో స్థిర చిత్తము పునాదిరాయి. స్థిరచిత్త మేర్పడుటకే అనేకమగు ప్రాథమిక దీక్ష లున్నవి. ప్రతినిత్యము ఒక పనిని అదే సమయమున నిర్వర్తించుట, అంతే శ్రద్ధతో నిర్వర్తించుట, ఆసక్తితో రుచి కలిగి నిర్వర్తించుట వలన అస్థిరత్వము నుండి చిత్తమునకు స్థిరత్వ మేర్పడును. అట్లేర్పడుటకు చాలకాలమట్లే నిర్వర్తించవలెను. నిరంతరత్వము, దీర్ఘకాలము అను రెండంశము ఆధారముగ నేర్వవలసిన విషయమును నేర్చుట సిద్ధించును. మరియొక మార్గము లేదు. భగవంతుడు శ్రీ కృష్ణుడు ఈ శ్లోకమున "స్థిరచిత్తము లేనిచో యోగము లేదు. ఇది నా మతము" అని పలికినాడు. కేవలము ఇది తన అభిప్రాయమని తెలిపినను మరియొక మార్గము లేదని తెలియవలెను. అభ్యాసము చేతను, వైరాగ్యము చేతను స్థిరచిత్త మేర్పరచుకొన వచ్చును. అపుడే యోగమున కర్హత కలుగును. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

*🌹. శ్రీమద్భగవద్గీత - 601 / Bhagavad-Gita - 601 🌹* ✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 📚. ప్రసాద్ భరద్వాజ *🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 12 🌴* 12. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ: ఫలమ్ | భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్ || 🌷. తాత్పర్యం : ఇష్టము, అనిష్టము, ఇష్టానిష్ఠమిశ్రితము అనెడి మూడు విధములైన కర్మఫలములు త్యాగికానటువంటి వానికి మరణము పిదప కలుగుచున్నవి. కాని సన్న్యాసాశ్రమమునందున్న వారికి మాత్రము సుఖదుఃఖములను కలిగించు అట్టి ఫలములు కలుగుటలేదు 🌷. భాష్యము : శ్రీకృష్ణభగవానునితో గల నిత్యసంబంధ జ్ఞానముతో వర్తించు కృష్ణభక్తిరసభావితుడు సర్వదా ముక్తస్థితి యందే యుండును. కనుక అతడు మరణము పిదప తన కర్మఫలములచే సుఖించుటగాని, దు:ఖించుటగాని జరుగదు. 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Bhagavad-Gita as It is - 601 🌹* ✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 📚 Prasad Bharadwaj *🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 12 🌴* 12. aniṣṭam iṣṭaṁ miśraṁ ca tri-vidhaṁ karmaṇaḥ phalam bhavaty atyāgināṁ pretya na tu sannyāsināṁ kvacit 🌷 Translation : For one who is not renounced, the threefold fruits of action – desirable, undesirable and mixed – accrue after death. But those who are in the renounced order of life have no such result to suffer or enjoy. 🌹 Purport : A person in Kṛṣṇa consciousness acting in knowledge of his relationship with Kṛṣṇa is always liberated. Therefore he does not have to enjoy or suffer the results of his acts after death. 🌹 🌹 🌹 🌹 🌹 #భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*🌹. శ్రీమద్భగవద్గీత - 33 / Bhagavad-Gita - 33 🌹* ✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 📚. ప్రసాద్ భరద్వాజ *🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - శ్లోకము 33 🌴* 33. యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా: సుఖాని చ || త ఇమేవస్థితా యుద్ధే ప్రాణం స్త్యక్త్వా ధనాని చ | 🌷. తాత్పర్యం : ఎవరికోసం మనం రాజ్యాన్ని, సుఖ భోగాన్ని కోరుకుంటామో వారు ప్రాణాలను, సంపదలను త్యజించి ఇక్కడ నిలబడి ఉన్నారు. 🌷. భాష్యము : గోవులకు మరియు ఇంద్రియములకు శ్రీకృష్ణుడు ఆనందధ్యేయమైన కారణమున అతనిని అర్జునుడు ఇచ్చట “గోవిందా” యని సంభోదించినాడు. ఈ ప్రత్యేక పదప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తనను ఆనందపరచగలదో శ్రీకృష్ణుడు ఎరుగవలెనని సూచించుచున్నాడు. కాని మన ఇంద్రియతృప్తి కొరకై గోవిందుడు నిర్దేశింపబడలేదు. అయినప్పటికిని ఆ గోవిందుని తృప్తిపరచుట యత్నించినచో అప్రయత్నముగా మనము కుడా తృప్తినొందగలము. ప్రతియెక్కరు తమ ఇంద్రియములను తృప్తిపరచవలెననియే వాంచింతురు మరియు అట్టి ఆనందమును భగవానుడు ఒసగవలెననియు కోరుదురు. కాని భగవానుడు జీవులు ఎంతవరకు అర్హులో అంతవరకే వారికి ఇంద్రియభోగము నొసగును గాని వారు కోరినంత కాదు. కాని మనుజుడు అట్లుగాక భిన్నమార్గమును చేపట్టినప్పుడు, అనగా తన ఇంద్రియముల తృప్తిని కోరకుండ గోవిందుని ప్రియము కొరకే యత్నించినపుడు అతని కరుణచే సమస్త కోరికలు పూర్ణము చేసికొనగలడు. తన జాతి మరియు కుటుంబసభ్యుల యెడ అర్జునుడు కనబరచిన ప్రగాడ అనురాగామునకు వారి యెడ అతనికి గల సహజ కరుణయే కొంత కారణమై యున్నది. కనుకనే అతడు యుద్ధమునకు సిద్ధపడలేదు. సాధారణముగా ప్రతియొక్కరు తమ ధనసంపత్తులను బంధు,మిత్రులకు ప్రదర్శింపవలెనని తలతురు. బంధుమిత్రులందరును యుద్ధమున మరణింతురు కావున యుద్ధవిజయము తదుపరి తన సంపదను వారితో కలసి పంచుకొనజాలనని అర్జునుడు భీతిచెందెను. లౌకికజీవనము నందలి భావములు ఈ విధముగనే ఉండును. కాని ఆధ్యాత్మిక జీవనము దీనికి భిన్నమైనట్టిది. భక్తుడు సదా భగవానుని కోరికలను పూర్ణము చేయవలెననియే కోరును కనుక ఆ దేవదేవుని సేవ కొరకు (అతడు అంగీకరించినచో) అన్ని విధములైన సంపదలను స్వికరించును. భగవానుడు అంగీకరింపనిచో ఆ భక్తుడు చిల్లిగవ్వనైనను తాకరాదు. 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Bhagavad-Gita as It is - 33 🌹* ✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 📚. Prasad Bharadwaj *🌻 Chapter 1, Vishada Yoga - Verse 33 🌻* 33. yeṣām arthe kāṅkṣitaṁ no rājyaṁ bhogāḥ sukhāni ca ta ime ’vasthitā yuddhe prāṇāṁs tyaktvā dhanāni ca 🌷Translation O Madhusūdana, when teachers, fathers, sons, grandfathers, maternal uncles, fathers-in-law, grandsons, brothers-in-law and other relatives are ready to give up their lives and properties and are standing before me, why should I wish to kill them, even though they might otherwise kill me? 🌻. Purport : Arjuna has addressed Lord Kṛṣṇa as Govinda because Kṛṣṇa is the object of all pleasures for cows and the senses. By using this significant word, Arjuna indicates that Kṛṣṇa should understand what will satisfy Arjuna’s senses. But Govinda is not meant for satisfying our senses. If we try to satisfy the senses of Govinda, however, then automatically our own senses are satisfied. Materially, everyone wants to satisfy his senses, and he wants God to be the order supplier for such satisfaction. The Lord will satisfy the senses of the living entities as much as they deserve, but not to the extent that they may covet. But when one takes the opposite way – namely, when one tries to satisfy the senses of Govinda without desiring to satisfy one’s own senses – then by the grace of Govinda all desires of the living entity are satisfied. Arjuna’s deep affection for community and family members is exhibited here partly due to his natural compassion for them. He is therefore not prepared to fight. Everyone wants to show his opulence to friends and relatives, but Arjuna fears that all his relatives and friends will be killed on the battlefield and he will be unable to share his opulence after victory. This is a typical calculation of material life. The transcendental life, however, is different. Since a devotee wants to satisfy the desires of the Lord, he can, Lord willing, accept all kinds of opulence for the service of the Lord, and if the Lord is not willing, he should not accept a farthing. 🌹🌹🌹🌹🌹 #భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*🌹. గీతోపనిషత్తు -195 🌹* ✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ *📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚* శ్లోకము 36 *🍀 35. మనో నిగ్రహము - శ్రద్ధ కలవాడు మొట్టమొదటగ కర్మఫలములను విసర్జించుట నేర్వవలెను. కర్తవ్య కర్మనే నిర్వర్తించుట నేర్వవలెను. ఇష్టాయిష్టములను ఆధారముగ చేసుకొని జీవించుటగాక కర్తవ్యమునే అనుసరించుట నేర్వవలెను. క్రమముగ స్వంత సంకల్పము లను విసర్జించి అందివచ్చు కర్తవ్యములను మాత్రము నిర్వర్తించుచు జీవించవలెను. శీతోష్ణ సుఖదుఃఖములు, మానావమానములు వైరాగ్య దృష్టితో గ్రహించవలెను. సమ భావమును అందరియందు నిర్వర్తించుట నేర్వవలెను. శ్రద్ధ ఆధారముగ ఈ విషయములను నేర్చినచో మనో నిగ్రహ మేర్పడును. 🍀* అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః | అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి || 37 అర్జునుడు మరియొక సందేహమును వెలిబుచ్చెను. శ్రద్ధ యున్నను మనోనిగ్రహము లేనివాడు, చంచలమగు మనస్సు కలవాడు యోగసిద్ధిని పొందనపుడు అత డే గతి పొందును? ఈ ప్రశ్న చాల సమంజసమగు ప్రశ్న. శ్రద్ధ యున్నను మనో నిగ్రహము లేకపోవుట సర్వసామాన్యముగ శిష్టుల ఎడ గోచ రించును. మనో చాంచల్యము వలన యోగము కుదరదు. యత చిత్తుడు కానిదే యోగాభ్యాసమును గూర్చి భావించుట నిరర్ధకము గదా! కావున శ్రద్ధ కలవాడు మొట్టమొదటగ కర్మఫలములను విసర్జించుట నేర్వవలెను. కర్తవ్య కర్మనే నిర్వర్తించుట నేర్వవలెను. ఇష్టాయిష్టములను ఆధారముగ చేసుకొని జీవించుటగాక కర్తవ్యమునే అనుసరించుట నేర్వవలెను. క్రమముగ స్వంత సంకల్పము లను విసర్జించి అందివచ్చు కర్తవ్యములను మాత్రము నిర్వర్తించుచు జీవించవలెను. శీతోష్ణ సుఖదుఃఖములు, మానావమానములు వైరాగ్య దృష్టితో గ్రహించవలెను. సమ భావమును అందరియందు నిర్వర్తించుట నేర్వవలెను. శ్రద్ధ ఆధారముగ ఈ విషయములను నేర్చినచో మనో నిగ్రహ మేర్పడును. అర్జునుడు సహజముగ శ్రద్ధా వంతుడు అగుటచే శ్రద్ధ ఆధారముగ యోగమును నిర్వర్తించుట వీలుపడు నేమోనని, చంచలమైన మనస్సు కలిగినను యోగ మభ్యసించవచ్చునేమోనని కొంత తడవు భావించి, చలిత మానసు లకు యోగాభ్యాసము కుదరదని నిశ్చయించుకొని పై విధముగ ప్రశ్నించెను. శ్రద్ధ ప్రధానమగు విషయము. శ్రద్ధను ముందు తెలిపిన ప్రాథమిక విషయములపై నిలుపవలెను. అపుడు స్థిరమగు మనస్సు లేక యతచిత్తము ఏర్పడును. యతచిత్త మేర్పడినవాడు యతి. ఈ శ్లోకమున అయతి గూర్చి అర్జునుడు పలుకుచున్నాడు. అయతీకి మనస్సు చలించు చుండును. యతి మనస్సు చలింపదు. యతియైనవాడికే యోగాభ్యాసము సిద్ధించును. కానివాడు ముందు యతచిత్తము నేర్పరచుకొనవలెను. కేవలము శ్రద్ధ కలిగి చరిత మనస్కులగు వారు యోగసిద్ధిని పొందలేరు గదా! అట్టివారు ఏ గతి పొందుదురని అర్జునుని ప్రశ్న. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

*🌹. మృతసంజీవని కవచం స్తోత్రం 🌹* *1)ఏవమారాధ్య గౌరీశం దేవం మృత్యుంజయేశ్వరమ్ |* *మృత సంజీవనం నామ్నా కవచం ప్రజపేత్సదా ||* *2) సారాత్సారతరం పుణ్యం గుహ్యా ద్గుహ్యతరం శుభమ్ |* *మహాదేవస్య కవచం మృతసంజీవనామకం ||* *3) సమాహితమనా భూత్వా శృణుష్వ కవచం శుభమ్ |* *శృత్వైతద్దివ్య కవచం రహస్యం కురు సర్వదా ||* *4) వరా భయకరో యజ్వా సర్వదేవ నిషేవితః |* *మృత్యుంజయో మహాదేవః ప్రాచ్యాం మాం పాతు సర్వదా ||* *5) దధానః శక్తిమభయాం త్రిముఖం షడ్భుజః ప్రభుః |* *సదాశివోఽగ్నిరూపీ మాం ఆగ్నేయ్యాం పాతు సర్వదా ||* *6) అష్టాదశ భుజోపేతో దండా భయకరో విభుః |* *యమరూపీ మహాదేవో దక్షిణస్యాం సదాఽవతు ||* *7) ఖడ్గా భయకరో ధీరో రక్షోగణ నిషేవితః |* *రక్షోరూపీ మహేశో మాం నైరృత్యాం సర్వదాఽవతు ||* *8) పాశాభయ భుజః సర్వ రత్నాకర నిషేవితః |* *వరూణాత్మా మహాదేవః పశ్చిమే మాం సదాఽవతు ||* *9) గదాభయకరః ప్రాణనాయకః సర్వదాగతిః |* *వాయవ్యాం మారుతాత్మా మాం శంకరః పాతు సర్వదా ||* *10)శంఖాభయ కరస్థో మాం నాయకః పరమేశ్వరః |* *సర్వాత్మాంతర దిగ్భాగే పాతు మాం శంకరః ప్రభుః ||* *11) శూలాభయకరః సర్వ విద్యానామధి నాయకః |* *ఈశానాత్మా తథైశాన్యాం పాతు మాం పరమేశ్వరః ||* *12) ఊర్ధ్వభాగే బ్రహ్మరూపీ విశ్వాత్మాఽధః సదాఽవతు |* *శిరో మే శంకరః పాతు లలాటం చంద్రశేఖరః ||* *13) భ్రూమధ్యం సర్వ లోకేశస్త్రినేత్రో లోచనేఽవతు |* *భ్రూయుగ్మం గిరిశః పాతు కర్ణౌ పాతు మహేశ్వరః ||* *14) నాసికాం మే మహాదేవ ఓష్ఠౌ పాతు వృషధ్వజః |* *జిహ్వాం మే దక్షిణామూర్తిర్దంతాన్మే గిరిశోఽవతు ||* *15) మృత్యుంజయో ముఖం పాతు కంఠం మే నాగభూషణః |* *పినాకీ మత్కరౌ పాతు త్రిశూలీ హృదయం మమ ||* *16) పంచవక్త్రః స్తనౌ పాతు ఉదరం జగదీశ్వరః |* *నాభిం పాతు విరూపాక్షః పార్శ్వౌ మే పార్వతీపతిః ||* *17) కటిద్వయం గిరీశో మే పృష్ఠం మే ప్రమథాధిపః |* *గుహ్యం మహేశ్వరః పాతు మమోరూ పాతు భైరవః ||* *18) జానునీ మే జగద్ధర్తా జంఘే మే జగదంబికా |* *పాదౌ మే సతతం పాతు లోకవంద్యః సదాశివః ||* *19) గిరిశః పాతు మే భార్యాం భవః పాతు సుతాన్మమ |* *మృత్యుంజయో మమాయుష్యం చిత్తం మే గణనాయకః ||* *20) సర్వాంగం మే సదా పాతు కాలకాలః సదాశివః |* *ఏతత్తే కవచం పుణ్యం దేవతానాం చ దుర్లభమ్ ||* *ఫల శృతి* *21) మృత సంజీవనం నామ్నా మహాదేవేన కీర్తితమ్ |* *సహస్రావర్తనం చాస్య పురశ్చరణ మీరితమ్ ||* *22) యః పఠేచ్ఛృణు యాన్నిత్యం శ్రావయేత్సు సమాహితః |* *స కాలమృత్యుం నిర్జిత్య సదాయుష్యం సమశ్నుతే ||* *23) హస్తేన వా యదా స్పృష్ట్వా మృతం సంజీవయత్యసౌ |* *ఆధయో వ్యాధయస్తస్య న భవంతి కదాచన ||* *24) కాలమృత్యుమపి ప్రాప్తమసౌ జయతి సర్వదా |* *అణిమాది గుణైశ్వర్యం లభతే మానవోత్తమః ||* *25) యుద్ధారంభే పఠిత్వేదమష్టా వింశతి వారకమ్ |* *యుద్ధ మధ్యే స్థితః శత్రుః సద్యః సర్వైర్న దృశ్యతే ||* *26) న బ్రహ్మాదీని చాస్త్రాణి క్షయం కుర్వంతి తస్య వై |* *విజయం లభతే దేవయుద్ధమధ్యేపి సర్వదా ||* *27) ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్కవచం శుభమ్ |* *అక్షయ్యం లభతే సౌఖ్య మిహలోకే పరత్ర చ ||* *28) సర్వవ్యాధి వినిర్ముక్తః సర్వరోగ వివర్జితః |* *అజరా మరణో భూత్వా సదా షోడశ వార్షికః ||* *29) విచరత్యఖిలాన్లోకాన్ప్రాప్య భోగాంశ్చ దుర్లభాన్ |* *తస్మాదిదం మహా గోప్యం కవచం సముదాహృతమ్ ||* *3) మృత సంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ |* *మృత సంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ ||* 🌹 🌹 🌹 🌹 🌹

+9 प्रतिक्रिया 1 कॉमेंट्स • 58 शेयर

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 396🌹* రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ *🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* అధ్యాయము - 19 *🌻. కామదహనము - 1 🌻* నారదుడిట్లు పలికెను- ఓ బ్రహ్మా! విధీ! మహాత్మా! తరువాత ఏమైనది? నీవు అనుగ్రహించి పాపములను నశింపజేయు ఆ గాథను చెప్పుము (1). బ్రహ్మ ఇట్లు పలికెను- ఆ తరువాత జరిగిన గాథను వినుము. వత్సా! ఆనందమును గొల్పు శివలీలను నీయందలి ప్రేమచే చెప్పగలను (2). మహాయోగియగు మహేశ్వరుడు తాను ధైర్యమును గోల్పోవుటను గాంచి మిక్కిలి చకితుడై, తరువాత మనస్సులో ఇట్లు తలపోసెను (3). ఉత్తమమగు తపస్సును చేయుచున్న నాకు విఘ్నములు కలుగుటకు కారణమేమి? ఈ సమయములో నా మనస్సులో వికారమును కలిగించిన దుష్టుడెవరు? (4) నేను పరస్త్రీని ఉద్దేశించి చెడు వర్ణనను చేసితిని. ఇపుడు ధర్మమునకు విరుద్దముగా జరిగినది. వేదమర్యాద ఉల్లంఘింపబడినది (5). బ్రహ్మ ఇట్లు పలికెను - సత్పురుషులకు ఆశ్రయము, మహాయోగి అగు పరమేశ్వరుడు ఇట్లు తలపోసి, శంకను పొందినవాడై చుట్టూ దిక్కులనన్నింటినీ పరికించెను (6) . గర్విష్ఠి, మూర్ఖుడు, బాణమును ధనస్సునందు ఎక్కుపెట్టి ప్రయోగించుటకు సిద్దముగా నున్నవాడు అగు మన్మథుని ఆయన తన ఎడమవైపున ఉండగా గాంచెను (7). ఓ నారదా! పరమాత్ముడగు శివునకు ఆ స్థితిలో నున్న కాముని చూడగానే వెనువెంటనే తీవ్రమగు క్రోధము కలిగెను (8). ఓ మహర్షీ! బాణము ఎక్కుపెట్టియున్న ధనస్సును చేతబట్టి అన్తరిక్షమునందు నిలబడియున్న మన్మథుడు నివారింప శక్యము కానిది, వ్యర్థము కానిది అగు అస్త్రమును శంకరునిపై ప్రయోగించెను (9). అమోఘమగు ఆ అస్త్రము పరమాత్ముని యందు మొక్క వోయెను. గొప్ప కోపము గల పరమేశ్వరుని పొంది ఆ అస్త్రము శాంతించెను (10). తన అస్త్రము శివుని యందు వ్యర్థము కాగానే మన్మథుడు భయమును పొందెను. ఆతడు తన ఎదుట నున్న మృత్యుంజయుడగు శివ ప్రభుని గాంచి వణికిపోయెను (11). ఓ మహర్షీ! ఆ మన్మథుడు తన ప్రయత్నము వ్యర్థము కాగానే భయభీతుడై ఇంద్రాది దేవతలనందరినీ స్మరించెను (12). ఓ మునిశ్రేష్ఠా! కామునిచే స్మరింపబడిన వారై ఇంద్రాది దేవతలందరు అచటకు విచ్చేసి శివునకు ప్రణమిల్లి స్తుతించిరి (13). సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 #శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

Join and Share ALL 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 www.facebook.com/groups/chaitanyavijnanam/ https://t.me/ChaitanyaVijnanam https://pyramidbook.in/Chaitanyavijnanam Join and Share 🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹 https://t.me/bhagavadgeethaa/ www.facebook.com/groups/bhagavadgeethaa/ https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg Join and Share విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/ Join and Share 🌹. Daily satsang Wisdom 🌹 www.facebook.com/groups/dailysatsangwisdom/ https://t.me/Seeds_Of_Consciousness https://pyramidbook.in/dailywisdom Join and Share 🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹 www.facebook.com/groups/vivekachudamani/ https://pyramidbook.in/vivekachudamani Join and Share భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM www.facebook.com/groups/maharshiwisdom/ https://pyramidbook.in/maharshiwisdom Join and Share 🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹 https://t.me/srilalithachaitanyavijnanam http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ Join and share Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా www.facebook.com/groups/avataarmeherbaba/ Join and Share Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు www.facebook.com/groups/theosophywisdom/ Join and Share 🌹. శ్రీ దత్త చైతన్యం - Sri Datta Chaitanyam 🌹 www.facebook.com/groups/dattachaitanyam/ Join and Share 🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 www.facebook.com/groups/masterek/ Join and Share 🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹 http://www.facebook.com/groups/oshoteachings/

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर

*🌹. మృతసంజీవని కవచం స్తోత్రం 🌹* *1)ఏవమారాధ్య గౌరీశం దేవం మృత్యుంజయేశ్వరమ్ |* *మృత సంజీవనం నామ్నా కవచం ప్రజపేత్సదా ||* *2) సారాత్సారతరం పుణ్యం గుహ్యా ద్గుహ్యతరం శుభమ్ |* *మహాదేవస్య కవచం మృతసంజీవనామకం ||* *3) సమాహితమనా భూత్వా శృణుష్వ కవచం శుభమ్ |* *శృత్వైతద్దివ్య కవచం రహస్యం కురు సర్వదా ||* *4) వరా భయకరో యజ్వా సర్వదేవ నిషేవితః |* *మృత్యుంజయో మహాదేవః ప్రాచ్యాం మాం పాతు సర్వదా ||* *5) దధానః శక్తిమభయాం త్రిముఖం షడ్భుజః ప్రభుః |* *సదాశివోఽగ్నిరూపీ మాం ఆగ్నేయ్యాం పాతు సర్వదా ||* *6) అష్టాదశ భుజోపేతో దండా భయకరో విభుః |* *యమరూపీ మహాదేవో దక్షిణస్యాం సదాఽవతు ||* *7) ఖడ్గా భయకరో ధీరో రక్షోగణ నిషేవితః |* *రక్షోరూపీ మహేశో మాం నైరృత్యాం సర్వదాఽవతు ||* *8) పాశాభయ భుజః సర్వ రత్నాకర నిషేవితః |* *వరూణాత్మా మహాదేవః పశ్చిమే మాం సదాఽవతు ||* *9) గదాభయకరః ప్రాణనాయకః సర్వదాగతిః |* *వాయవ్యాం మారుతాత్మా మాం శంకరః పాతు సర్వదా ||* *10)శంఖాభయ కరస్థో మాం నాయకః పరమేశ్వరః |* *సర్వాత్మాంతర దిగ్భాగే పాతు మాం శంకరః ప్రభుః ||* *11) శూలాభయకరః సర్వ విద్యానామధి నాయకః |* *ఈశానాత్మా తథైశాన్యాం పాతు మాం పరమేశ్వరః ||* *12) ఊర్ధ్వభాగే బ్రహ్మరూపీ విశ్వాత్మాఽధః సదాఽవతు |* *శిరో మే శంకరః పాతు లలాటం చంద్రశేఖరః ||* *13) భ్రూమధ్యం సర్వ లోకేశస్త్రినేత్రో లోచనేఽవతు |* *భ్రూయుగ్మం గిరిశః పాతు కర్ణౌ పాతు మహేశ్వరః ||* *14) నాసికాం మే మహాదేవ ఓష్ఠౌ పాతు వృషధ్వజః |* *జిహ్వాం మే దక్షిణామూర్తిర్దంతాన్మే గిరిశోఽవతు ||* *15) మృత్యుంజయో ముఖం పాతు కంఠం మే నాగభూషణః |* *పినాకీ మత్కరౌ పాతు త్రిశూలీ హృదయం మమ ||* *16) పంచవక్త్రః స్తనౌ పాతు ఉదరం జగదీశ్వరః |* *నాభిం పాతు విరూపాక్షః పార్శ్వౌ మే పార్వతీపతిః ||* *17) కటిద్వయం గిరీశో మే పృష్ఠం మే ప్రమథాధిపః |* *గుహ్యం మహేశ్వరః పాతు మమోరూ పాతు భైరవః ||* *18) జానునీ మే జగద్ధర్తా జంఘే మే జగదంబికా |* *పాదౌ మే సతతం పాతు లోకవంద్యః సదాశివః ||* *19) గిరిశః పాతు మే భార్యాం భవః పాతు సుతాన్మమ |* *మృత్యుంజయో మమాయుష్యం చిత్తం మే గణనాయకః ||* *20) సర్వాంగం మే సదా పాతు కాలకాలః సదాశివః |* *ఏతత్తే కవచం పుణ్యం దేవతానాం చ దుర్లభమ్ ||* *ఫల శృతి* *21) మృత సంజీవనం నామ్నా మహాదేవేన కీర్తితమ్ |* *సహస్రావర్తనం చాస్య పురశ్చరణ మీరితమ్ ||* *22) యః పఠేచ్ఛృణు యాన్నిత్యం శ్రావయేత్సు సమాహితః |* *స కాలమృత్యుం నిర్జిత్య సదాయుష్యం సమశ్నుతే ||* *23) హస్తేన వా యదా స్పృష్ట్వా మృతం సంజీవయత్యసౌ |* *ఆధయో వ్యాధయస్తస్య న భవంతి కదాచన ||* *24) కాలమృత్యుమపి ప్రాప్తమసౌ జయతి సర్వదా |* *అణిమాది గుణైశ్వర్యం లభతే మానవోత్తమః ||* *25) యుద్ధారంభే పఠిత్వేదమష్టా వింశతి వారకమ్ |* *యుద్ధ మధ్యే స్థితః శత్రుః సద్యః సర్వైర్న దృశ్యతే ||* *26) న బ్రహ్మాదీని చాస్త్రాణి క్షయం కుర్వంతి తస్య వై |* *విజయం లభతే దేవయుద్ధమధ్యేపి సర్వదా ||* *27) ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్కవచం శుభమ్ |* *అక్షయ్యం లభతే సౌఖ్య మిహలోకే పరత్ర చ ||* *28) సర్వవ్యాధి వినిర్ముక్తః సర్వరోగ వివర్జితః |* *అజరా మరణో భూత్వా సదా షోడశ వార్షికః ||* *29) విచరత్యఖిలాన్లోకాన్ప్రాప్య భోగాంశ్చ దుర్లభాన్ |* *తస్మాదిదం మహా గోప్యం కవచం సముదాహృతమ్ ||* *3) మృత సంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ |* *మృత సంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ ||* 🌹 🌹 🌹 🌹 🌹

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 73 / Sri Vishnu Sahasra Namavali - 73 🌹* *నామము - భావము* 📚. ప్రసాద్ భరద్వాజ *🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷* *మూల నక్షత్ర ప్రధమ పాద శ్లోకం* *🍀 73. స్తవ్యస్తవప్రియ స్తోత్రం స్తుత స్తోతారణప్రియః|* *పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః || 73 🍀* 🍀 679. స్తవ్యః - సర్వులచే స్తుతించబడువాడు. 🍀 680. స్తవప్రియః - స్తోత్రములయందు ప్రీతి కలవాడు. 🍀 681. స్తోత్రం - స్తోత్రము కూడా తానే అయినవాడు. 🍀 682. స్తుతిః - స్తవనక్రియ కూడా తానే అయినవాడు. 🍀 683. స్తోతా - స్తుతించు ప్రాణి కూడా తానే అయినవాడు. 🍀 684. రణప్రియః - యుద్ధమునందు ప్రీతి కలవాడు. 🍀 685. పూర్ణః - సర్వము తనయందే గలవాడు. 🍀 686. పూరయితా - తన నాశ్రయించిన భక్తులను శుభములతో నింపువాడు. 🍀 687. పుణ్యః - పుణ్య స్వరూపుడు. 🍀 688. పుణ్యకీర్తిః - పవిత్రమైన కీర్తి గలవాడు. 🍀 689. అనామయః - ఏ విధమైన భౌతిక, మానసిక వ్యాధులు దరిచేరనివాడు. సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Vishnu Sahasra Namavali - 73 🌹* *Name - Meaning* 📚 Prasad Bharadwaj *🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷* *Sloka for Moola 1st Padam* *🌻73. stavyaḥ stavapriyaḥ stōtraṁ stutiḥ stōtā raṇapriyaḥ |* *pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇya kīrti ranāmayaḥ || 73 || 🌻* 🌻 679. Stavyaḥ: One who is the object of laudations of everyone but who never praises any other being. 🌻 680. Stava-priyaḥ: One who is pleased with hymns. 🌻 681. Stotraṁ: A Stotra means a hymn proclaiming the glory, attributes and names of the Lord. 🌻 682. Stutiḥ: A praise. 🌻 683. Stōtā: One who, being all -formed, is also the person who sings a hymn of praise. 🌻 684. Raṇapriyaḥ: One who is fond of fight for the protection of the world, and for the purpose always sports in His hands the five weapons, the discus Sudarshana, the mace Kaumodaki, the bow Saranga, and the sword Nandaka besides the conch Panchajanya. 🌻 685. Pūrṇaḥ: One who is self-fulfilled, being the source of all powers and excellences. 🌻 686. Pūrayitā: One who is not only self-fulfilled but gives all fulfillments to others. 🌻 687. Puṇyaḥ: One by only hearing about whom all sins are erased. 🌻 688. Puṇyakīrtiḥ: One of holy fame. His excellences are capable of conferring great merit on others. 🌻 689. Anāmayaḥ: One who is not afflicted by any disease that is born of cause, internal or external. Continues... 🌹 🌹 🌹 🌹 🌹 #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 73 / Sri Lalita Sahasranamavali - Meaning - 73 🌹* 🌻. మంత్రము - అర్ధం 🌻 📚. ప్రసాద్ భరద్వాజ *🍀73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమప్రియా ।* *కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀* 🍀 321. కామ్యా - కోరదగినటువంటిది. 🍀 322. కామకళారూపా - కామేశ్వరుని కళయొక్క రూపమైనది. 🍀 323. కదంబకుసుమప్రియా - కడిమి పువ్వులయందు ప్రేమ కలిగినది. 🍀 324. కళ్యాణీ - శుభ లక్షణములు కలది. 🍀 325. జగతీకందా - జగత్తుకు మూలమైనటువంటిది. 🍀 326. కరుణా రససాగరా - దయాలక్షణానికి సముద్రము వంటిది. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 73 🌹* 📚. Prasad Bharadwaj *🌻 73. kāmyā kāmakalārūpā kadamba-kusuma-priyā |* *kalyāṇī jagatīkandā karuṇā-rasa-sāgarā || 73 || 🌻* 🌻 321 ) Kaamya - She who is of the form of love 🌻 322 ) Kamakala roopa - She who is the personification of the art of love 🌻 323 ) Kadambha kusuma priya - She who likes the flowers of Kadamba 🌻 324 ) Kalyani - She who does good 🌻 325 ) Jagathi kandha - She who is like a root to the world 🌻 326 ) Karuna rasa sagara - She who is the sea of the juice of mercy Continues... 🌹 🌹 🌹 🌹 🌹 #లలితాసహస్రనామ #LalithaSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం Join and Share 🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹 https://t.me/srilalithachaitanyavijnanam http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB