🚩ఓం గణపతియే నమః🚩 మిత్రులందరికి శుభ గురువారం శుభ దినం శుభ శుభోదయపు వందనాలు🙏🙏🙏🙏🙏 మేలుకో శ్రీసాయి మేలుకోవయ్యా మేలుకొని మమ్ము దయ నేలుకోవయ్య మేలుకో శ్రీసాయి మేలుకోవయ్యా మేలుకొని మమ్ము దయ నేలుకోవయ్య lమేలుకో మేలకోl ఉదయభానుని కాంతి కిరణంబు పొడచూపె నిదుర మేల్కొనమనుచు అరుణకాంతులు విరిసె హృదయ ద్వారము తెరచి భక్తి వాకిట నిలచి భజన కీర్తనలతో నిను సన్నుతించేను lమేలుకో మేలకోl మందభాగ్యను నేను మంత్రతంత్రము లెరుగ వందనములే సేరు భక్తి భావము పరగ చంద్రవదనా మందహాసమ్ముతో నీవు అండనుండి కావు అన్యమెరుగను బ్రోవు lమేలుకో మేలకోl పన్నీటి స్నానాల పాలనభిషేకింప పట్టువస్త్రములిడగ భరణాలు తొడగ సద్దుసేయక నీదు వాకిటను నిలిచేను బెట్టుచేయక రాజరాజాది సద్గురువు lమేలుకో మేలకోl తులసి మరువము చేర్చి పూలమాలలు గూర్చి శీలసుందరరాయ సారచందన మిడగ ఫాలలోచన పొద్దు వేసాగి గడిపితి జాలమేలర యింక ద్వారకామయ చేర్చ lమేలుకో మేలకోl పాలు ఫలములు తేనె పరమాన్నములు మేలు భక్ష్య భోజ్యములివిగో తాంబూలమిదిగో ఆరగించవె స్వామి ఆలసింపక యింక నీరజాక్షా నీకు నీరాజనము లిడెద lమేలుకో మేలకోl భక్తవరదా నీకు వింజామరము వీచి చక్కనైన పక్క వేసి పాదము లొత్తి నృత్య గీతపు సేవ సంతోషముగ సేతు పవ్వళింతువు తిరిగి పంతమిప్పుడు వీడి lమేలుకో మేలకోl *ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయిఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి* *శుభ శుభోదయం* 🙏🙏🙏SATYAVARAPU VENKANNABABU & VARALAKSHMI🙏🙏🙏

🚩ఓం గణపతియే నమః🚩

మిత్రులందరికి శుభ గురువారం శుభ దినం శుభ శుభోదయపు వందనాలు🙏🙏🙏🙏🙏

మేలుకో శ్రీసాయి మేలుకోవయ్యా
మేలుకొని మమ్ము దయ నేలుకోవయ్య
మేలుకో శ్రీసాయి మేలుకోవయ్యా
మేలుకొని మమ్ము దయ నేలుకోవయ్య
lమేలుకో మేలకోl

ఉదయభానుని కాంతి కిరణంబు పొడచూపె
నిదుర మేల్కొనమనుచు అరుణకాంతులు విరిసె
హృదయ ద్వారము తెరచి భక్తి వాకిట నిలచి
భజన కీర్తనలతో నిను సన్నుతించేను
lమేలుకో మేలకోl

మందభాగ్యను నేను మంత్రతంత్రము లెరుగ
వందనములే సేరు భక్తి భావము పరగ
చంద్రవదనా మందహాసమ్ముతో నీవు
అండనుండి కావు అన్యమెరుగను బ్రోవు
lమేలుకో మేలకోl

పన్నీటి స్నానాల పాలనభిషేకింప
పట్టువస్త్రములిడగ భరణాలు తొడగ
సద్దుసేయక నీదు వాకిటను నిలిచేను
బెట్టుచేయక రాజరాజాది సద్గురువు
lమేలుకో మేలకోl

తులసి మరువము చేర్చి పూలమాలలు గూర్చి
శీలసుందరరాయ సారచందన మిడగ
ఫాలలోచన పొద్దు వేసాగి గడిపితి
జాలమేలర యింక ద్వారకామయ చేర్చ
lమేలుకో మేలకోl

పాలు ఫలములు తేనె పరమాన్నములు మేలు
భక్ష్య భోజ్యములివిగో తాంబూలమిదిగో
ఆరగించవె స్వామి ఆలసింపక యింక
నీరజాక్షా నీకు నీరాజనము లిడెద
lమేలుకో మేలకోl

భక్తవరదా నీకు వింజామరము వీచి
చక్కనైన పక్క వేసి పాదము లొత్తి
నృత్య గీతపు సేవ సంతోషముగ సేతు
పవ్వళింతువు తిరిగి పంతమిప్పుడు వీడి
lమేలుకో మేలకోl

*ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయిఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి*

*శుభ శుభోదయం*

🙏🙏🙏SATYAVARAPU VENKANNABABU & VARALAKSHMI🙏🙏🙏

+12 प्रतिक्रिया 0 कॉमेंट्स • 11 शेयर

🌹. సాయి తత్వం - మానవత్వం - 13 / Sai Philosophy is Humanity - 13 🌹 🌴. అధ్యాయము - 4 🌴 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. గౌలిబువా అభిప్రాయం 🌻 1. 95 సంవత్సరముల వయస్సుగల గౌలిబువా యను వృద్దభక్తుడు ఒకడు పండరీయాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 2. ఎనిమిది మాసములు పండరీపురమందు, మిగత నాలుగు మాసములు - ఆషాడము మొదలు కార్తీకమువరకు (జూలై-నవంబరు) -- గంగానది యొడ్డునను ఉండెడివాడు. 3. సామాను మొయుటకొక గాడిదను, తోడుగా నొక శిష్యుని తీసికొనిపోవువాడు. ప్రతి సంవత్సరము పండరీయాత్ర చేసికొని శిరిడి సాయిబాబా దర్శనమునకై వచ్చెడివాడు. 4. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ యిట్లనెడివాడు: "వీరు పండరీనాథుని యవతారమే! అనాథల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి!" గౌలిబువా విఠోబాదేవుని ముసలిభక్తుడు. 5. పండరీయాత్ర యెన్ని సారులో చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని యవతారమని నిర్థారణ పరచిరి. 🌻. విఠల దేవుడు దర్శనమిచ్చుట 🌻 1. సాయిబాబాకు భగవన్నామ స్మరణ యందును, సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు 'అల్లామాలిక్ --అనగా 'అల్లాయే యజమాని' -- అని యనుచుండెడివారు. 2. ఏడు రాత్రింబగళ్ళు భగన్నామస్మరణ చేయించుచుండెడివారు. దీనినే నామసప్తాహమందురు. బాబా ఒకప్పుడు దాసగణు మహరాజును నామసప్తాహము చేయమనిరి. 3. సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామసప్తాహమును సలిపెదనని దాసగణు జవాబిచ్చెను. 4. బాబా తన గుండెపై చేయి వేసి, "తప్పనిసరిగ దర్శనమిచ్చును గాని, భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను. 5. డాకూరునాధ్ యొక్క డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము, ఇక్కడనే -- యనగా శిరిడీలోనే -- యున్నవి. 6. ఎవరును ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే యున్నాడు. భక్తుడు భక్తిప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడిక్కడనే యవతరించును" అనెను. 7. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడీ క్రింది విధముగా దర్శనమిచ్చెను. స్నానానంతరము కాకాసాహెబు దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి గాంపించెను. 8. కాకా మధ్యాహ్నహారతి కొరకు బాబా యొద్దకు పోగా తేటతెల్లముగా కాకాను బాబా యిట్లడిగెను. 9. "విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవువానిని జూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని ధృఢముగా పట్టుకొనుము. 10. ఏమాత్రము అజాగ్రత్తగ నున్నను తప్పించుకొని పారిపోవును." ఇది ఉదయము జరిగెను. మద్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు 25, 30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను. 11. ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని జూచి బాబా మాటలు జ్ఞాపకమునకు దెచ్చుకొని, కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను. 12. విఠోబా పటము నొకటి కొని పూజా మందిరములో నుంచుకొనెను.. సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 🌹. Sai Philosophy is Humanity - 13 🌹 Chapter 4 ✍️. Sri NV. Gunaji 📚. Prasad Bharadwaj 🌻. Dictum of Goulibuva 🌻 An old devotee by name Goulibuva, aged about 95 years, was a Varkari of Pandhari. He stayed 8 months at Pandharpur and four months - Ashadha to Kartik (July - November) on the banks of the Ganges. He had an ass with him for carrying his luggage, and a disciple, as his companion. Every year he made his Vari or trip to Pandharpur and came to Shirdi to see Sai Baba, Whom he loved most. He used to stare at Baba and say, "This is Pandharinath Vithal incarnate, the merciful Lord of the poor and helpless." This Goulibuva was an old devotee of Vithoba, and had made many a trip to Pandhari; and he testified that Sai Baba was real Pandharinath. 🌻. Vithal Himself Appeared 🌻 Sai Baba was very fond of remembering and singing God’s name. He always uttered Allah Malik (God is Lord) and in His presence made others sing God’s name continuously, day and night, for 7 days. This is called Namasaptaha. Once He asked Das Ganu Maharaj to do the Namasaptaha. He replied that he would do it, provided he was assured that Vithal would appear at the end of the 7th day. Then Baba, placing His hand on his breast assured him that certainly Vithal would appear, but that the devotee must be ‘earnest and devout’. The Dankapuri (Takore) of Takurnath, the Pandhari of Vithal, the Dwarka of Ranchhod (Krishna) is here (Shirdi). One need not go far out to see Dwarka. Will Vithal come here from some outside place? He is here. Only when the devotee is bursting with love and devotion, Vithal will manifest Himself here (Shirdi). After the Saptaha was over, Vithal did manifest Himself in the following manner. Kakasaheb Dixit was, as usual, sitting in meditation after the bath, and he saw Vithal in a vision. When he went at noon for Baba’s darshana, Baba asked him point-blank - "Did Vithal Patil come? Did you see Him? He is a very truant fellow, catch Him firmly, otherwise, he will escape, if you be a little inattentive." This happened in the morning and at noon there was another Vithal darshana. One hawker from outside came there for selling 25 or 30 pictures of Vithoba. This picture exactly tallied with the figure that appeared in Kakasaheb’s vision. On seeing this and remembering Baba’s words, Kakasaheb Dixit was much surprised and delighted. He bought one picture of Vithoba, and placed it in his shrine for worship. Continues.... 🌹 🌹 🌹 🌹 🌹

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

🌹. సాయి తత్వం - మానవత్వం - 12 / Sai Philosophy is Humanity - 12 🌹 🌴. అధ్యాయము - 4 🌴 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. పవిత్ర షిరిడి క్షేత్రము 🌻 1. ఆహమదునగరు జిల్లాలోని గోదావరినదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలయన నచ్చట ననేక యోగులుద్భవించిరి, నివసించిరి. 2. అట్టి వారిలో ముఖ్యులు శ్రీజ్ఞానేశ్వర్ మహరాజ్. శిరిడీ గ్రామమున అహమదు నగరు జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. 3. కోపర్గాం వద్ద గోదావరి దాటి శిరిడీకి పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో నీంగాంప్ వచ్చును. 4. అచ్చటికి శిరిడీ కనిపించును. కృష్ణా తీరమందుగల గాణగాపురము, నరసింహవాడి, ఔదుంబర్ మోదలుగా గల పుణ్యక్షేత్రములవలె శిరిడీకూడా గోప్పగా పేరు గాంచినది. 5. పండరీపురమునకు సమీపమున గల మంగళవేఢ యందు భక్తుడగు దామాజీ, సజ్జనగఢ యందు సమర్థరామదాసు, నర్సోబాచీవాడీ యందు శ్రీనరసింహ సరస్వతీస్వామివార్లు వర్థిల్లినట్లే శ్రీసాయినాథుడు శిరిడీలో వర్థిల్లి దానిని మొనర్చెను. 🌻. సాయిబాబా రూపురేఖలు 🌻 1. సాయిబాబా వలననే శిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా యెట్టి వ్యక్తియో పరిశీలింతము. 2. వారు కష్టతరమైన సంసారమును జయించినారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తుల కిల్లువంటివారు; ఉదారస్వభావులు; సారము లోని సారాంశము వంటి వారు; నశించు వస్తువులందభిమానము లేనివారు; ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగియుండెడివారు; భూలోకమందుగాని, స్వర్గలోకమందుగాని గల వస్తువులయందభిమానము లేనివారు. 3. వారి యంతరంగము అద్దమువలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి యమ్రుతము స్రవించుచుండెను. 4. గొప్పవారు, బీదవారు, వారికి సమానమే. వారు మానావమానలకు లెక్కించినవారు కారు. అందరికి వారు ప్రభువు. 5. అందరితో కలసిమెలసి యుండెడివారు. ఆటలు గాంచెడివారు; పాటలను వినుచెండెడివారు. కానీ సమాధి స్థితినుండి మరలువారు కారు. 6. ఎల్లప్పుడు అల్లా నామము నుచ్ఛరించుచుండెడివారు. ప్రపంచమంతా మేలుకొనునప్పుడు వారు యోగనిద్రయందుండెడివారు. 7. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు. వారి యంతరంగములోతయిన సముద్రమువలె ప్రశాంతము. 8. వారి యాశ్రమము, వారి చర్యలు ఇదమిత్దముగా నిశ్చయించుటకు వీలుకానివి. ఒకచోటనే కూర్చుండియున్నప్పటికిని ప్రపంచమందు జరుగు సంగతులన్నియు వారికి తెలియును. 9. వారి దర్భారు ఘనమైనది. నిత్యము వందలకొలది కథలు చెప్పునప్పటికిని మౌనము తప్పెడివారు కారు. 10. ఎల్లప్పుడు మసీదుగోడకు ఆనుకొని నిలుచువారు. లేదా, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండి తోటవైపుగాని చావడివైపుగాని పచార్లు చేయుచుండెడివారు. 11. ఎల్లప్పుడు ఆత్మధ్యానమునందేమునిగి యుండెడివారు. సిద్ధపురుషుడైనప్పటికిని సాధకునివలె నటించువారు. 12. అణకువ నమ్రత కలిగి, యహంకారము లేక యందరిని ఆనందింపజేయువారు. అట్టివారు సాయిబాబా. 13. శిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. జ్ఞానేశ్వర్ మహరాజ్ ఆళందిని వృద్ధి చేసినట్లు, ఏకనాధుడు పైఠానును వృద్ధిచేసినట్లు శ్రీసాయిబాబా శిరిడీని వృద్ధిచేసెను. 14. శిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసికొన్నవి. ఏలయన బాబా పవిత్రపాదములను ముద్దుపెట్టుకొని వారి పాదధూళి తలపైని వేసికొనగలిగినవి. 15. శిరిడీ మావంటి భక్తులకు పండరీపురము, జగన్నాధము, ద్వారక, కాశి, రామేశ్వరము, బదరీకేదార్, నాసిక్, త్ర్యంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణములవంటిదయినది. 16. శిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణతంత్రము. అది మాకు సంసారబంధముల సన్నగిలచేసి యాత్మసాక్షాత్కారమును సులభసాధ్యము చేయును. 17. శ్రీసాయి దర్శనమే మాకు యోగసాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. 18. త్రివేణి ప్రయాగల స్నానఫలము వారిపాదసేవ వలననే కలుగుచుండెడిది. వారిపాదోదకము మా కోరికలను నశింపజేయుచుండెడిది. 19. వారి యాజ్ఞ మాకు వేదవాక్కుగా నుండెడిది. వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. 20. వారు మా పాలిట శ్రీ కృష్ణుడుగ, శ్రీరాముడుగా నుండి ఉపశమనము కలుగజేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మస్వరూపమే. 21. వారు ద్వంద్వాతీతులు; నిరుత్సాహముగాని ఉల్లాసముగాని యెరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండెడివారు. 22. శిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందూస్థానము, గుజరాతు, దక్కను, కన్నడదేశములలో చూపుచుండిరి. 23. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా, భక్తులన్నిదేశములనుండి శిరిడీ చేరి వారిని దర్శించి వారి యాశీర్వాదమును పొందుచుండిరి. 24. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించు చుండెడివి. పండరీపురమందు విఠర్ రఖుమాయూలను దర్శించినచో భక్తులకు కలిగెడి యానందము శిరిడీలో దొరకుచుండెడిది. 25. ఇది యతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. సశేషం..... 🌹 🌹 🌹 🌹 🌹 🌹. Sai Philosophy is Humanity - 12 🌹 Chapter 4 ✍️. Sri NV. Gunaji 📚. Prasad Bharadwaj 🌻 Shirdi - A Holy Tirth 🌻 The banks of the Godavari river, in the Ahmednagar District, are very fortunate for they gave birth and refuge to many a Saint, prominent amongst them being Jnaneshwar. Shirdi also falls in the Kopargaon Taluka of the Ahmednagar District. After crossing the Godavari River at Kopargaon, one gets the way to Shirdi. When you go three Koss (9 miles), you come to Nimgaon, from whence; Shirdi is visible. Shirdi is as famous and well known as other holy places like Gangapur, Narsinhwadi, Audumbar on the banks of Krishna River. As the devotee Damaji flourished in and blessed Mangalvedha (near Pandharpur) as Samarth Ramdas at Sajjangad, as Shri Narasimha Saraswati at Saraswatiwadi, so Sainath flourished at Shirdi and blessed it. 🌻 Personality of Sai Baba 🌻 It is on account of Sai Baba that Shirdi grew into importance. Let us see what sort of a personage Sai Baba was. He conquered this Samsar (worldly existence), which is very difficult and hard to cross. Peace or mental calm was His ornament, and He was the repository of wisdom. He was the home of Vaishnava devotees, most liberal (like Karna) amongst liberals, the quint-essence of all essences. He had no love for perishable things, and was always engrossed in self-realization, which was His sole concern. He felt no pleasure in the things of this world or of the world beyond. His Antarang (heart) was as clear as a mirror, and His speech always rained nectar. The rich or poor people were the same to Him. He did not know or care for honour or dishonour. He was the Lord of all beings. He spoke freely and mixed with all people, saw the actings and dances of Nautchgirls and heard Gajjal songs. Still, He swerved not an inch from Samadhi (mental equilibrium). The name of Allah was always on His lips. While the world awoke, He slept; and while the world slept, He was vigilant. His abdomen (Inside) was as calm as the deep sea. His Ashram could not be determined, nor His actions could be definitely determined, and though He sat (lived) in one place, He knew all the transactions of the world. His Darbar was imposing. He told daily hundreds of stories; still He swerved not an inch from His vow of silence. He always leaned against the wall in the Masjid or walked morning, noon and evening towards Lendi (Nala) and Chavadi; still He at all times abided in the Self. Though a Siddha, He acted like a Sadhaka. He was meek, humble and egoless, and pleased all. Such was Sai Baba, and as Sai Baba’s Feet treaded the soil of Shirdi, it attained extraordinary importance. As jnaneshwar elevated Alandi, Ekanath did to Paithan, so Sai Baba raised Shirdi. Blessed are the grass-leaves and stones of Shirdi, for they could easily kiss the Holy Feet of Sai Baba, and take their dust on their head. Shirdi became to us, devotees, another Pandharpur, Jagannath, Dwarka, Banaras (Kashi) and Rameshwar, Badrikedar, Nasik, Tryambakeshwar, Ujjain, and Maha Kaleshwar or Mahabaleshwar Gokarn. Contact of Sai Baba in Shirdi was like our Veda and Tantra; it quieted our Samsara (world consciousness) and rendered self-realization easy. The darshana of shri Sai was our Yoga-Sadhana, and talk with Him removed our sins. Shampooing His Legs was our bath in Triveni Prayag, and drinking the holy water of His Feet destroyed our desires. To us, His commands were Vedas, and accepting (eating) His Udi (sacred ashes) and Prasad was all purifying. He was our Shri Krishna and Shri Rama who gave us solace and He was our Para Brahma (Absolute Reality). He was Himself beyond the Pair of dwandwas (opposite), never dejected nor elated. He was always engrossed in His Self as ‘Existence, Knowledge and Bliss.’ Shirdi was His centre; but His field of action extended far wide, to Punjab, Calcutta, North India, Gujarat, Dacca (Now in Bangladesh) and Konkan. Thus the fame of Sai Baba spread, far, and wide, and people from all parts came to take His darshana and be blessed. By mere darshan, minds of people, whether, pure or impure, would become at once quiet. They got here the same sort of unparalleled joy that devotees get at Pandharpur by seeing Vithal Rakhumai. This is not an exaggeration. Consider what a devotee says in this respect. Continues... 🌹 🌹 🌹 🌹 🌹

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 8 शेयर

*సాయిభక్తుల అనుభవమాలిక - 141 వ భాగం* 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ఈరోజు భాగంలో అనుభవాలు: చిన్న చిన్న కోరికలు తీర్చారు బాబా పిలిచినంతనే బాబా నా బిడ్డ ఇబ్బందిని తొలగించారు చిన్న చిన్న కోరికలు తీర్చారు బాబా యు.ఎస్. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాలనిలా పంచుకుంటున్నారు: నేను సాయిభక్తురాలిని. బ్లాగు ద్వారా బాబాపట్ల నా విశ్వాసం రోజురోజుకీ వృద్ధి చెందుతోంది. బ్లాగు నిర్వాహకులకు చాలా చాలా ధన్యవాదాలు. సాధారణంగా నేను ప్రతిరోజూ సాయిసచ్చరిత్ర చదువుతూ, ప్రతి గురువారం బ్లాగులో అనుభవాలు చదువుతుంటాను. ఒక బుధవారంనాడు నా స్నేహితురాలి నుండి ఒక మెసేజ్ కోసం ఎదురుచూస్తూ, "బాబా! దయచేసి ఈరోజు ముగిసేలోగా నా స్నేహితురాలి నుండి మెసేజ్ వచ్చేలా అనుగ్రహిస్తే నేను ఈరోజు బ్లాగులోని అనుభవాలు చదువుతాను" అని బాబాని ప్రార్థించాను. రాత్రి పది దాటేసరికి నేను మెసేజ్ వస్తుందన్న ఆశ దాదాపుగా కోల్పోయాను. సరిగ్గా రోజు ముగియడానికి ఇంకొక గంట ఉందనగా నా స్నేహితురాలి నుండి మెసేజ్ వచ్చింది. ఆశ్చర్యంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మరోసారి నాకు కొత్త ఫోన్ వచ్చింది. పాత ఫోన్‌లోని డేటా కంప్యూటరులో భద్రపరచుకుని, ఫోన్ తీసుకెళ్లి అమ్మేశాను. ఇంటికొచ్చి ఆ డేటాను కొత్త ఫోనులో వేసుకోవడానికి ప్రయత్నిస్తే అది పాస్‌వర్డ్ అడుగుతోంది. అసలు నేనెప్పుడూ పాస్‌వర్డ్ పెట్టుకోలేదు. ఎంతగా ఆలోచించినా పాస్‌వర్డ్ పెట్టుకున్నట్టు గుర్తురాలేదు. పదేళ్లనాటి మధురమైన జ్ఞాపకాలు, కాంటాక్ట్స్ అందులో ఉన్నాయి. వాటిని తిరిగి ఎలా పొందాలో తెలియలేదు. దాదాపు 50 పాస్‌వర్డ్స్ ఇచ్చి ప్రయత్నించాను. కానీ ప్రయోజనం లేదు. కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి విషయం చెప్పాను. వాళ్ళు పాస్‌వర్డ్ లేదా పాత ఫోన్ ఉంటేనే ఏదైనా చేయగలమని చెప్పారు. నా దగ్గర ఆ రెండూ లేవు. చివరిగా నేను బాబాను ప్రార్థించి ఒక పాస్‌వర్డ్ ప్రయత్నించాను. నిజానికి ఆ పాస్‌వర్డ్ ఇంతకుముందు కూడా ప్రయత్నించాను. కానీ అప్పుడు పని చేయలేదు, కానీ ఈసారి పని చేసింది. నేను ఆశ్చర్యానందాలలో మునిగిపోయాను. "బాబా! ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటూ ప్రతి చిన్న కోరికను నెరవేరుస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు!" సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! పిలిచినంతనే బాబా నా బిడ్డ ఇబ్బందిని తొలగించారు యు.ఎస్. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: నేను 11 సంవత్సరాలుగా సాయిభక్తురాలిని. సాయి నా జీవితంలోకి వచ్చాక చాలా మంచి జీవితాన్ని నేను పొందాను. బాబా గురించి ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటున్నకొద్దీ రోజురోజుకీ ఆయనకు ఇంకా ఇంకా దగ్గరవుతున్న అనుభూతి పొందుతున్నాను. నాకు ఒక సంవత్సరం వయస్సున్న పాప ఉంది. తను పుట్టిన తరువాత నాకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. వాటిని పరిష్కరించమని బాబాను ప్రార్థిస్తున్నాను. ఇక నా అనుభవానికి వస్తే... ఒకసారి మా పాపకు వాక్సినేషన్ చేయించాము. అందువలన తను ఇబ్బందిపడుతూ చాలా చికాకు చికాకుగా ఉంది. నిజానికి తను ఎప్పుడూ సంతోషంగా ఉంటూ మమ్మల్ని ఏమాత్రం ఇబ్బందిపెట్టదు. అలాంటి తను ఆరోజు మధ్యరాత్రిలో లేచి గుక్కపెట్టి ఏడవడం మొదలుపెట్టింది. నేను తనని ఎత్తుకుని ఎంతగా ఓదార్చడానికి ప్రయత్నించినా తన ఏడుపు ఆపలేదు. ఎప్పుడూ అంతలా తను ఏడవటం చూడని నేను చాలా భయపడిపోయాను. ఏమి చేయాలో అర్థంకాక వేరే బెడ్రూమ్‌లో పడుకుని ఉన్న నా భర్త వద్దకు పాపను తీసుకుని వెళ్ళాను. నిద్రమత్తులో ఉన్న ఆయన నన్ను పాపని తీసుకుని బయటకు వెళ్ళమని అన్నారు. నాకు నోటమాట రాలేదు. ఒక తల్లిగా మొదటిసారి సహాయం చేయడానికి ఎవరూ లేక నిస్సహాయస్థితిలో ఉండిపోయాను. వెంటనే నా దేవుడిని తలచుకున్నాను. బాబా ఎందరికో నిద్రపుచ్చడంలో సహాయం చేశారు. మరి నా బిడ్డ విషయంలో ఎందుకు సహాయం చేయరు? ఈ తల్లి వేదనను ఎందుకు తీర్చలేరు? ఆయన తప్ప నాకు ఇంకెవరూ లేరు. విదేశీ నేలపై నా బిడ్డ రక్షణ కోసం ఎక్కడికి పోను? కనీసం ఊదీ కూడా అందుబాటులో లేదు. అది పూజగదిలో ఉంది. నా బిడ్డని ఎత్తుకుని అక్కడి వరకు వెళ్ళలేను. కాబట్టి ఉన్నచోటునుండే ఆయనను పిలిచాను. వెంటనే ఆయన మిరాకిల్ చూపించారు. నేను ప్రార్థించిన పది నిమిషాల్లో నా బిడ్డ నిద్రలోకి జారుకుంది. బాబా తన ఇబ్బందిని తొలగించేశారు. నేను పట్టలేని ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. "బాబా! నా బిడ్డ వంగడంలో ఇబ్బంది పడుతోంది. తనకి సహాయం చేయండి. మా జీవితంలో ఉన్న ఇతర సమస్యలను కూడా తొలగించి మమ్మల్ని కాపాడండి. మీరు మాత్రమే మా సంరక్షకులు".

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*సాయిభక్తుల అనుభవమాలిక - 131 వ భాగం* 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ఈరోజు భాగంలో అనుభవాలు: ఈరోజు నా ముఖంపై నవ్వు ఉందంటే అందుకు కారణం బాబానే! బాబా ఆశీస్సులతో పాపకు జన్మనిచ్చాను ఈరోజు నా ముఖంపై నవ్వు ఉందంటే అందుకు కారణం బాబానే! ఆస్ట్రేలియానుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాలనిలా మనతో పంచుకుంటున్నారు: నేను సాయిబాబాను పూర్తిగా విశ్వసిస్తాను. ఈరోజు నా ముఖంపై నవ్వు ఉందంటే అందుకు కారణం ఆయనే. గత రెండు సంవత్సరాలుగా ఆరోగ్యపరంగా, వ్యక్తిగతపరంగా, వృత్తిపరంగా ఇలా పలురకాలుగా ఒకటి తర్వాత ఒకటిగా చాలా సమస్యలు నన్ను చుట్టుముట్టాయి. ఆ సమస్యలతో పూర్తిగా విసిగిపోయాను. ఒకానొక సమయంలో, "ఇక నేను ఈ సమస్యలను తట్టుకోలేను, ఈ జీవితాన్ని కొనసాగించలేన"ని అనుకున్నాను. అటువంటి స్థితిలో కూడా ప్రతిరోజూ సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఉండేదాన్ని. నవగురువార వ్రతం కూడా చేయాలని అనుకున్నాను. అనుకున్నదే తడవుగా వ్రతకథ పుస్తకం లేకుండానే వ్రతం మొదలుపెట్టడానికి సిద్ధపడ్డాను. మొదటి గురువారంనాడు సాయి మందిరం దగ్గరున్న షాపులో పుస్తకం దొరుకుతుందేమో చూద్దామని మందిరానికి వెళ్లి షాపులో అడిగాను. కానీ వాళ్ల దగ్గర ఆ పుస్తకం లేదు. "సరే ఏం చేస్తాం? ఆన్లైన్ లో చదివి వ్రతం పూర్తి చేద్దామ"ని అనుకున్నాను. తరువాత బాబా దర్శనం చేసుకుని మందిరం లోపలినుండి బయటకు వచ్చాను. అక్కడ మందిర ప్రాంగణంలో ఒక టేబుల్ ఉంటుంది. దానిపై భక్తుల కోసం ప్రసాదాన్ని ఉంచుతారు. నేను ప్రసాదం తీసుకోవడానికి టేబుల్ దగ్గరకు వెళ్లి చూస్తే, ఆశ్చర్యం! టేబుల్ పై 'భక్తుల కోసం' అని వ్రాసిపెట్టి ఉంది, దాని ప్రక్కనే 'సాయివ్రతకథ' పుస్తకం ఉంది. అది కూడా కేవలం ఒకే ఒక్క పుస్తకం ఉంది. బాబానే ఆ పుస్తకాన్ని నాకు అందజేశారని ఆనందంతో మనసారా ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. వ్రతం మొదలుపెట్టాక పరిస్థితుల్లో అనుకూలమైన మార్పు కనిపించడం మొదలైంది. మూడవ గురువారంనాడు నేను ఆఫీసు లంచ్ బ్రేక్‌లో బాబా దర్శనం కోసం మందిరానికి వెళ్ళాను. కానీ ఆ సమయంలో మందిరం మూసివుంది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. హఠాత్తుగా మందిర నిర్వహణ బాధ్యతలు చేసే వ్యక్తి అక్కడకు వచ్చారు. నన్ను చూస్తూ, "ఈ సమయంలో వచ్చారేమిటి?" అని అడిగారు. నేను, "నాకు మందిరం వేళల గురించి తెలియని కారణంగా ఈ సమయంలో వచ్చాను" అని చెప్పి, "మందిర వేళలు ఏమిటి?' అని అడిగాను. అందుకాయన, "మధ్యాహ్నం ఒంటిగంటకి మందిరం మూసివేసి, మళ్లీ సాయంత్రం ఐదు గంటలకి తెరుస్తాం" అని చెప్పారు. ఇంకా ఇలా చెప్పారు, "ఒక భక్తునికి ఒక పుస్తకం అవసరమని నేనిప్పుడు ఇక్కడకు వచ్చాను" అని. తర్వాత మందిరం తెరచి, నన్ను 'బాబా దర్శనం చేసుకోమ'ని చెప్పారు. నేను ఆనందంగా లోపలకు వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను. అవకాశమే లేని సమయంలో బాబా నాకిలా సహాయం చేశారని ఎంతో మురిసిపోయాను. అప్పటికి అతను తన పని ముగించుకుని తాళం వేయడానికి బయట వేచివున్నారు. నేను దర్శనం చేసుకుని బయటకు వస్తుండగా అతను నాతో, "సాయి పాదాల వద్ద మీకోసం ఒకటి ఉంది, వెళ్లి తీసుకోండి" అన్నారు. నేను ఆనందంతో మళ్ళీ లోపలికి పరుగుతీశాను. అక్కడ బాబా పాదాల వద్ద ఒక గులాబీ, ఒక అరటిపండు ఉన్నాయి. నేను పట్టలేని ఆనందంతో వాటిని తీసుకుని బయటకు వచ్చి అతనికి కృతజ్ఞతలు చెప్తే, అతను, ""మీ బిడ్డకు ఏదైనా ఇవ్వండి బాబా!" అని బాబాను అడిగాను, ఆయనిచ్చారు. అంతే, నాదేముంది?" అన్నారు. "ఓ మై బాబా!" నా ఆనందానికి అవధుల్లేవు. నిజానికి నేను మందిరానికి వెళ్లేటప్పుడు, "బాబా! దయచేసి నాకు ఏదైనా సానుకూలమైన సంకేతమివ్వండి" అని అడిగాను. ఆయన గులాబీపువ్వు, అరటిపండు ఇచ్చారు. నాలోని భావాలను ఎలా వ్యక్తపరచాలో నాకు అర్థం కావట్లేదు. మొత్తానికి నా సాయి నాకోసం ఏదో చేస్తున్నారు. ఒకసారి నాకొక కల వచ్చింది. ఆ కలలో నేను మేడపై ఉన్నాను. మేడపైన బాల్కనీ నుండి క్రిందకి చూస్తే సాయిబాబా కనిపించారు. వెంటనే ఆయనకివ్వడానికి పది డాలర్లు చేతిలో పట్టుకుని పరుగు పరుగున క్రిందకు వెళ్ళాను. అక్కడ చూస్తే ఇద్దరు సాయిబాబాలు ఉన్నారు. ఒకరు నిజమైన సాయిబాబా, మరొకరు టీవీ సీరియల్‌లో సాయిబాబా పాత్ర చేస్తున్న అతను. ఉన్నట్టుండి అసలు సాయిబాబా వెళ్లిపోయారు. సీరియల్ బాబా నా వైపు చూస్తున్నారు. "నేను ఈ డబ్బులు అసలు సాయిబాబాకే ఇస్తాను. ఆయనే నా నిజమైన సాయిబాబా" అని చెప్పాను. అంతటితో కల ముగిసింది. మరుసటిరోజు ఉదయం నిద్రలేస్తూనే కల గురించి ఆలోచించాను కానీ, నాకేమీ అర్థం కాలేదు. వెంటనే, "బాబా! నాకు మళ్ళీ కలలో కనిపించి మీరు ఏమి చెప్పదలుచుకున్నారో అర్థమయ్యేలా నాకు తెలియజేయండి" అని ప్రార్థించాను. "బాబా! దయచేసి నా సమస్యలన్నీ పరిష్కరించండి. నేను ఏమైనా తప్పులు చేసివుంటే నన్ను క్షమించి నన్ను ఆశీర్వదించండి. నాకు తెలుసు, మీరు నన్ను సమస్యలనుంచి బయటపడేస్తారు". బాబా ఆశీస్సులతో పాపకు జన్మనిచ్చాను యు.ఎస్. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: నేను సాయిబాబాకు సాధారణ భక్తురాలిని. మొదట్లో నాకు ఆయనపట్ల భక్తి ఉండేది కాదు. మావారు మాత్రం నిత్యం బాబాని పూజిస్తూ, ఆయనకు సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉండేవారు. క్రమం తప్పకుండా ఆయన సాయిబాబా మందిరంలో ఆరతులకు హాజరవుతూ ఉండేవారు. ఆయనను చూస్తూ క్రమంగా నేను కూడా సాయిబాబా పుస్తకాలు చదవడం, ఆయనను ప్రార్థించడం మొదలుపెట్టాను. గత నాలుగేళ్లనుండి మేము యు.ఎస్.ఏ. లో నివసిస్తున్నాము. నా భర్త హెచ్4 వీసా మీద యు.ఎస్. వచ్చారు. హెచ్1 వీసా కోసం చాలాసార్లు ప్రయత్నించాము. 2016లో చేసిన మొదటి ప్రయత్నంలో లాటరీలో ఎంపిక కాలేదు. అదే సమయంలో మేము పిల్లలకోసం కూడా ప్రయత్నిస్తుండేవాళ్ళం. కానీ మా ప్రయత్నాలు ఫలించలేదు. ఒకవైపు ఆఫీసులో పని, మరోవైపు పిల్లల సమస్య మమ్మల్ని చాలా ఒత్తిడికి గురి చేస్తుండేవి. అటువంటి సమయంలో భక్తుల అనుభవాలకు సంబంధించిన ఇంగ్లీష్ బ్లాగు నా దృష్టిలో పడింది. ఆ బ్లాగు మేము పడుతున్న ఒత్తిడినుండి దూరం చేసే ఆశాకిరణమైంది. భక్తులు తాము ప్రెగ్నెంట్ అవడంలో చేసిన ప్రయత్నాలు - ఊదీ నీళ్లను త్రాగడం, కడుపుపై ఊదీ రాసుకోవడం, రాత్రంతా బాబా పాదాల చెంత గ్లాసుతో నీళ్లు పెట్టి ఉదయాన వాటిని త్రాగడం, నవగురువార వ్రతం చేయడం మొదలైనవి తమ అనుభవాలలో చెప్తుండేవారు. నేను వాటిని ప్రయత్నిస్తుండేదాన్ని. అయినప్పటికీ పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. డాక్టర్లను సంప్రదిస్తూ పరీక్షలకు, మందులకు చాలా డబ్బు ఖర్చుపెట్టాం. అయినా ప్రయోజనం లేకపోవడం మాట అటుంచి, వాటి కారణంగా నాకేమీ బాగుండేది కాదు. అందువలన ఆఫీసు పనులు పూర్తి చేయడం కష్టంగా ఉండేది. ఇలా ఉండగా 2017, ఏప్రిల్ లో నా భర్త హెచ్1 వీసా లాటరీలో ఎంపిక అయ్యింది. అయినప్పటికీ అది ఆమోదం పొందుతుందో లేదో అన్న ఆలోచనతో మేము సంతోషించలేకపోయాము. దానితో నేను అనుభవిస్తున్న ఒత్తిడి తారాస్థాయికి చేరుకుని మందులు తీసుకోవడంతో సహా అన్నీ బాబాకు వదిలిపెట్టేసాను. అదే సమయంలో మా నాన్నగారు ఇండియానుండి ఒక పార్సెల్ పంపించి, ఆచారబద్ధంగా ఇంటిలో ఒక విధి నిర్వహిస్తే పిల్లలు కలిగే అవకాశం ఉందని చెప్పారు. కానీ మేము అటువంటివి ఏమీ చేయకుండానే బాబా అద్భుతం చేసారు. నేను గర్భం దాల్చాను. మొదట్లో నాకు చాలా వికారంగా ఉండేది. కనీసం నీళ్లు త్రాగడానికి కూడా కష్టంగా ఉండేది. కానీ నాకు తెలుసు, నా కడుపులోని బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడానికి బాబా ఉన్నారని. నా నమ్మకం వమ్ము కాలేదు. ఆయన అనుగ్రహచిహ్నంగా 2018, ఏప్రిల్ 5 గురువారంనాడు మాకు పాప పుట్టింది. తనకి మేము 'యశస్వి' అని పేరు పెట్టుకున్నాము. "బాబా! ఎవరూ పిల్లల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడండి. త్వరలోనే మీరు మావారికి వర్క్ వీసా అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాను". పూర్తిగా బాబాకు శరణాగతి చెందండి. ఆయన ఆశీస్సులు తప్పక లభిస్తాయి.

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*సాయిభక్తుల అనుభవమాలిక - 117 వ భాగం* 🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴 ఈరోజు భాగంలో అనుభవం: సాయిబాబానే చీకటిలో మార్గాన్ని చూపుతారు బెంగళూరునుండి ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: 30 సంవత్సరాలకు పైగా నేను సాయిభక్తుడిని. బ్లాగుల్లోని సాయి భక్తుల అనుభవాలు చదవడం ద్వారా బాబాపట్ల నా విశ్వాసం ఎన్నో రెట్లు పెరిగింది. "ప్రతి చీకటి సొరంగమార్గం చివర వెలుగు ఉంటుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి దుఃఖానికి ఉపశమనం ఉంటుంది. సాయిబాబా ప్రతీ సమస్యను అద్భుతరీతిన పరిష్కరిస్తారు. మనం చేయాల్సింది కేవలం ఆయనపై నమ్మకాన్ని ఉంచడమే" అని ఎక్కడో చదివాను. నిజం! చాలా కరెక్టుగా చెప్పారు. ఇది నేను కష్టంలో ఉన్నప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ప్రతి చీకటి సొరంగమార్గం చివర వెలుగు ఉంటుంది - సాయిబాబానే ఆ చీకటిలో మార్గాన్ని చూపుతారు(మనం గుర్తించినా, గుర్తించకపోయినా). నేనిప్పుడు చెప్పబోయే అనుభవం దానిని ఋజువు చేస్తుంది. 2017లో కంపెనీ ఉద్యోగస్తులను తగ్గించుకునే(downsizing) ప్రక్రియలో నేను నా ఉద్యోగాన్ని కోల్పోయాను. అప్పటికి నేను సీనియర్ పొజిషన్లో మంచి జీతం సంపాదిస్తున్నాను. హఠాత్తుగా అలా జరిగేసరికి నేను చాలా కృంగిపోయాను. "త్వరగా ఉద్యోగం దొరికేలా చూడమ"ని బాబాను ప్రార్థించాను. తరువాత కూడా కుదురుగా ఉండలేక ఇద్దరు జ్యోతిష్యులను కలిసాను. వాళ్లలో ఒకరు '7-8 నెలల తరువాత నాకు ఉద్యోగం వస్తుంద'ని చెపితే, మరొకరు 'అసలు ఉద్యోగరేఖే కనిపించడంలేదు, అయినా కానీ ఆర్థికపరంగా సమస్యలు ఉండవు' అని చెప్పారు. కానీ బాబా కృపవలన అద్భుతంగా కేవలం ఒక నెలలోనే నాకు ఉద్యోగం వచ్చింది. అది కూడా మా ఇంటికి అతిసమీపంలో! ఇక్కడ ఒక్క విషయం గుర్తించండి. 'జ్యోతిష్యులిద్దరి అంచనాలు తప్పు అని తేలిపోయాయి. కేవలం బాబా యందు ఉన్న విశ్వాసమే పని చేసింది. మిగతా అంతా బాబా ముందు పక్కకు తప్పుకుంది'. అయితే కొత్త ఉద్యోగంలో నేను ముందు సంపాందించే దానికన్నా 25% తక్కువ జీతం నిర్ణయించారు. అయినా నేను దాని గురించి దిగులుపడకుండా అంతా బాబా చూసుకుంటారని సంతోషంగా ఆ అవకాశాన్ని స్వీకరించాను. ఒక నెల గడిచేసరికి అనేక కారణాలరీత్యా నేను ఆ ఉద్యోగంలో సంతోషంగా ఉండలేకపోయాను. దానితో వేరే ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెట్టాను. అయితే ఆ సమయంలో మార్కెట్‌లో ఉద్యోగాలు లేవు. అదే సమయంలో నేను పనిచేస్తున్న కంపెనీ పనితీరు దిగజారిపోవడం మొదలైంది. జీతాలు రావడం ఆలస్యం అవుతూ ఉండేది. 2018 జనవరి వచ్చేసరికి పరిస్థితి ఇంకా హీనం అయిపోయింది. జీతాలలో 40% తగ్గించేశారు. అందువలన నేను చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాను. ఉన్నపళాన వేరే ఉద్యోగం చూసుకునే ప్రయత్నం చేసినా నాకు సరైన అవకాశం దక్కలేదు. 'నాకెందుకీ పరిస్థితి? అసలు ఏమి జరగబోతుంది?' అని అన్నీ ప్రశ్నలే నా ముందు. ఏమి చేయాలో నాకేమీ అర్థం కాలేదు. అటువంటి సమయంలో సాయి దివ్యపూజ, సచ్చరిత్ర సప్తాహపారాయణ చేశాను. 'నాకెప్పుడు ఉద్యోగం వస్తుంద'ని నేనడిగిన ప్రతిసారీ సాయిబాబా ప్రశ్నలు&సమాధానాలు పుస్తకంలో సానుకూలమైన సమాధానాలు లభిస్తూ ఉండేవి. 2018 జనవరి చివరివారం, ఫిబ్రవరి మొదటివారం మధ్యలో దాదాపు నాకు క్రొత్త ఉద్యోగం వచ్చినట్లే అనుకున్నాను. కానీ చివరినిమిషంలో అది చేజారిపోయింది. అలా ఏదీ నాకు కలిసిరాక బాగా కృంగిపోయాను. ఆ సమయంలో ఎటువంటి చంచలత్వం లేకుండా దృఢమైన విశ్వాసం, నమ్మకం సాయిబాబాపై పెట్టాలని నిశ్చయించుకుని మళ్ళీ సచ్చరిత్ర పారాయణ చేశాను. శిరిడీ కూడా వెళ్లి వచ్చాను. కానీ ఆ తరువాత కూడా కంపెనీ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. అసలు మెరుగుపడే సూచనలు కూడా కనపడలేదు. నా జీతం కట్ చేసి ఇస్తున్నందువల్ల, ఇంకా వేరే ఇతర కారణాలవలన కంపెనీ నాకు దాదాపు 4 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బులు వదులుకోలేను. అలాగని సౌకర్యంగా లేనిచోట ఉద్యోగం కొనసాగించలేక ఇరకాటంలో పడిపోయాను. చివరికి 2018 నవంబరులో కంపెనీ వాళ్ళు, "మీకింక మేము జీతం చెల్లించలేము. మీరు వెళ్లిపోవచ్చ"ని నిర్మొహమాటంగా చెప్పేశారు. నేను నిర్ఘాంతపోయాను. అయితే ఆ సమయమంతా 'నేను నీకు సహాయం చేస్తాను' అని బాబా నుండి సంకేతాలు అందుతూనే ఉండేవి. ఒకవైపు బాబా సహాయం చేస్తారని తెలిసినా, ఆరోజు ఎప్పుడు వస్తుందా అని నేను ఆందోళనపడకుండా ఉండలేకపోయేవాడిని. చాలా చాలా మానసిక సంఘర్షణను అనుభవించాను. చాలా బాధాకరమైన రోజులవి. అలా ఉండగా హఠాత్తుగా క్రొత్తగా మొదలుపెట్టిన మహాపారాయణ గ్రూపులో నాకు అవకాశం వచ్చింది. నేను ఆనందంతో పులకరించిపోయాను. చివరికి 2018 డిసెంబరు 24న బాబా నాకు దారి చూపించారు. దానితో నాకు ఉద్యోగం వచ్చింది. అదొక అద్భుతమైన లీల. Linkedin లో ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ఒక లింక్ నా దృష్టిలో పడింది. నిజానికి అది మూడువారాల ముందు షేర్ చేయబడింది. పైగా నా నైపుణ్యానికి సంబంధించినది కాదు. అయినా కూడా నేను దానికి దరఖాస్తు చేశాక నాకు ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. నేను ఇంటర్వ్యూ గదిలో అడుగుపెడుతూనే సాయిబాబా ఫోటోని చూసాను. అద్భుతం! అంతకన్నా నాకు ఇంకేమి కావాలి? బాబా దగ్గరుండి నా ఇంటర్వ్యూ సక్రమంగా నడిపించారు. ఆయన కృపతో నా పాత ఉద్యోగాన్ని విడిచిపెట్టాల్సిన ఒక్కరోజు ముందు నాకు ఉద్యోగం వచ్చింది. "థాంక్యూ బాబా, మీ అపారమైన కృపకు, దయకు". నేను ఎక్కువగా ఆందోళనపడాల్సిన పనిలేదు. ఎందుకంటే, నా జీవితం బాబా పాదాల చెంత ఉంది. బాబా నన్ను, నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. "ప్రణామాలు బాబా! అందరికీ శాంతి చేకూర్చండి".

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

*సాయిభక్తుల అనుభవమాలిక - 114 వ భాగం* 🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗 ఈరోజు భాగంలో అనుభవం: అడుగడుగునా అందిన బాబా ఆశీస్సులు ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: నేను యు.ఎస్ లో నివసిస్తున్న సాయిభక్తుడిని. చిన్నప్పటినుంచి బాబాను ఒక సాధుసత్పురుషుడుగానే చూసేవాడిని. కానీ 2015లో నన్ను తన పాదాల చెంతకు లాక్కున్నప్పటినుండి బాబా భగవంతుని అవతారమని తెలుసుకున్నాను. అప్పటినుండి బాబా నన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నారు. ఆయన రాకతో నా జీవితమే మారిపోయింది. ప్రియమైన సాయిభక్తులందరికీ బాబా తన భక్తులను ఎలా రక్షిస్తారో తెలుసు. నేను ఒక విషయంలో ఎన్నో సమస్యలను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. అయినప్పటికీ బాబా యందు పూర్తి విశ్వాసంతో, ఆయన స్మరణ చేస్తూ సమస్యను ఆయనకే విడిచిపెట్టాను. ఆయన తనదైన ప్రత్యేకశైలిలో ఆ సమస్యనుండి నన్ను బయటపడేశారు. ఇటువంటి అనుభవాలు నాకు చాలానే జరిగాయి. వాటివల్ల బాబాపట్ల నా విశ్వాసం అధికమైంది. అటువంటి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. యు.ఎస్ లో నాకు ఒక స్వంత కంపెనీ ఉంది. 2018లో ఇండియాలో నాకున్న ఒక అపార్ట్‌మెంటుని అమ్మేసి, ఆ డబ్బుతో నా కంపెనీ లోన్ క్లియర్ చేయాలనుకున్నాను. అప్పటికే ఆ అపార్ట్‌మెంట్ తీసుకోవడానికి ఒకతను సిద్ధంగా ఉన్నారు. కానీ, నాకు త్వరగా ఇండియా వెళ్లే అవకాశం లేకపోవడంతో, అతనిని వెయిట్ చేయించడం ఇష్టంలేక వేరే అపార్ట్‌మెంట్ ఏదైనా చూసుకోమని చెప్పాను. కానీ అతను మా అపార్ట్‌మెంట్ తీసుకోవడానికే ఆసక్తి కనబరుస్తూ, "డిసెంబర్ వరకు వేచి ఉంటాను. మీకు వీలైనప్పుడు రండి" అని చెప్పాడు. ఇలా ఉండగా అక్టోబర్ నెలలో అత్యవసరంగా నాకు డబ్బు అవసరమైంది. కానీ అపార్ట్‌మెంట్ అమ్మే పని త్వరగా అయ్యేది కాదు. ఎందుకంటే, ముందుగా అతను బ్యాంకు లోన్ పొందాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చాలా ప్రయాస, సమయంతో కూడుకున్నది. అదీకాక వచ్చిన డబ్బును యు.ఎస్ తరలించడం చార్టెడ్ అకౌంటెంట్, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు, బ్యాంకు వీటన్నిటితో ముడిపడివుంది. దాంతో నేను నా అపార్ట్‌మెంట్ తీసుకుంటానన్న వ్యక్తికి ఫోన్ చేసి, "పనంతా త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందా?" అని అడిగాను. "నేను అన్నీ ఏర్పాటు చేస్తాను. మీరు రండి" అని అన్నాడు. సరేనని నేను ఇండియాకి టికెట్స్ బుక్ చేసుకుని మంగళవారం ఉదయానికి ఇండియా చేరుకున్నాను. తీరా ఇండియా చేరాక ఒక నెల నుంచి లాయర్లు సమ్మె చేస్తున్నారని, అందువలన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్స్ జరగట్లేదని తెలిసింది. ఆ పనులన్నీ పూర్తి చేసుకోడానికి నావద్ద కేవలం ఎనిమిది పనిదినాలు మాత్రమే ఉండటంతో నాకేమి చేయాలో అర్థం కాలేదు. నా సమయం, డబ్బు వృధా అయిపోతున్నాయని ఆందోళనపడ్డాను. ఇక బాబాయే శరణం అనుకున్నాను. ఆయనయందు పూర్తి విశ్వాసముంచి, ఆయన స్మరణ చేస్తూ, "నా పని పూర్తయ్యేలా చూడమ"ని ప్రార్థించాను. ప్రతిరోజూ ఉదయం మా ఇంటికి దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్తుండేవాడిని. అక్కడ ప్రశాంతంగా, అందంగా ఉన్న బాబా మూర్తిని చూస్తుంటే నాకు మనశ్శాంతి లభిస్తుండేది. ఇలా రెండురోజులు గడిచాక గురువారం మధ్యాహ్నానికి నా అపార్ట్‌మెంట్ తీసుకుంటున్న అతని బ్యాంకు లోనుకి సంబంధించిన పేపర్ వర్క్ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయింది. ఆ సమయంలో అతను లాయర్ల సమ్మె శుక్రవారం ఉదయానికి ముగుస్తుందని, కాబట్టి రిజిస్ట్రేషన్ పని కూడా ఆరోజు పూర్తయ్యేలా చూస్తానని చెప్పాడు. దాంతో మిగిలినరోజుల్లో డబ్బు యు.ఎస్ కి ట్రాన్స్‌ఫర్ చేసే పని కూడా అయిపోతుందని అనుకున్నాను. అయితే శుక్రవారం ఉదయం అతను మళ్ళీ ఫోన్ చేసి, "అనుకున్నట్టుగా సమ్మెను ఆరోజు కాకుండా శనివారంరోజు లాయర్లు విరమించుకుంటార"ని చెప్పాడు. దాంతో నేను మళ్ళీ టెన్షన్ పడ్డాను. అలవాటు ప్రకారం శనివారం ఉదయం బాబా దర్శనానికి వెళ్లి, "మీకు ఏది మంచిదనిపిస్తే అది చేయండి" అని ప్రార్థించి, అక్కడ ఉన్నంతసేపు ఆయన స్మరణ చేస్తూ గడిపాను. తర్వాత పనిమీద బ్యాంకుకి వెళ్ళాను. మనసులో మాత్రం రిజిస్ట్రేషన్ గురించి ఆందోళనపడుతూ ఉన్నాను. ఒంటిగంట సమయంలో బ్యాంకు ముందున్న నా కారు తీస్తుండగా నా ఫోను రింగ్ అయింది. చూస్తే మా సిస్టర్. తను, "చాలాసేపటి నుంచి అపార్ట్‌మెంట్ తీసుకునే అతను ఫోన్ చేస్తున్నారు, కానీ మీ ఫోన్ కలవడం లేదు, వెంటనే బయలుదేరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రమ్మ"ని చెప్పింది. నాకు కాస్త ప్రశాంతంగా అనిపించింది. వెంటనే నేను ఇంటికి వెళ్లి, కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకుని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకి బయలుదేరాను. దారిలో ఈ మొత్తం ప్రక్రియలో మాకు సహాయం చేస్తున్న ఒకతనిని కూడా కారులో ఎక్కించుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చేరుకున్నాను. ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండే ఆ చోటు ఎడారిని తలపించేలా ఖాళీగా ఉండటంతో ఆశ్చర్యపోయాను. ముందుగా లాయర్ని కలవడానికి వెళ్ళాను. అక్కడ నా దృష్టిని ఆకర్షించిన మొదటి వస్తువు - ఆయన టేబుల్ పై ఉన్న ఒక పుస్తకం. దానిపై బాబా ఫోటో ఉంది. వెంటనే లాయర్ని, "అది సచ్చరిత్రనా?" అని అడిగాను. అందుకాయన, అది "శిరిడీ డైరీ" అని చెప్పారు. బాబా నాకు తోడుగా ఉన్నారని చాలా ఆనందించాను. తర్వాత లాయరు అవసరమైన డాక్యుమెంట్స్, ఐడీ ప్రూఫ్స్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు అడిగారు. అయితే డాక్యుమెంట్స్, ఐడీప్రూఫ్స్ మాత్రమే కావాలని ముందుగా చెప్పి ఉండటంతో వాటినే నేను తీసుకెళ్లాను. దాంతో ఫోటోల కోసం ఏం చేయాలా అని టెన్షన్ పడ్డాను. వెంటనే బాబా నాకో ఆలోచన స్ఫురింపజేశారు. నాతోపాటు ఎప్పుడూ ఉండే బ్యాగులో 2 సంవత్సరాల క్రితం మొబైల్ ఫోన్ కోసం తీసుకున్న ఫోటోలున్నాయి. బ్యాగులో చూస్తే సరిగ్గా రెండు ఫోటోలు మాత్రమే ఉన్నాయి. 'బాబా ఎంత కరుణామయుడు!' అని నా హృదయం ఆనందంతో పులకించిపోయింది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటూనే లాయరు, 'సాక్షిగా ఎవరు ఉన్నారు?' అని అడిగారు. కారులో నాతోపాటు తీసుకొచ్చిన వ్యక్తి సాక్షిగా ఉంటానని అన్నారు. అప్పుడు లాయరు అతని ఐడీ ప్రూఫ్స్ అడిగారు. అవి అతని వద్దలేవు. లాయరు కనీసం మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా సరిపోతుందని అతనితో అన్నారు. కానీ అతను అది కూడా లేదని చెప్పారు. సరే ఇంటికి వెళ్లి వస్తామనుకుంటున్న సమయంలో మరో అద్భుతం జరిగింది. ఎందుకో అనుకోకుండా అతను తన జేబులో ఉన్న కాగితాలన్నీ చూస్తుండగా డ్రైవింగ్ లైసెన్స్ కనిపించింది. తరువాత డాక్యుమెంట్స్ టైపు చేసే వ్యక్తి భోజనానికి వెళ్లి గంటవరకు కనపడలేదు. మరో వ్యక్తి 3 గంటలకే తన గ్రామానికి వెళ్లిపోవాలని అంటాడు. చివరిగా సంతకం పెట్టాల్సిన వ్యక్తి లాయర్ల సమ్మె సాకుగా చెప్పి ఊరంతా తిరుగుతున్నాడు. ఇలా ఎన్నో అవాంతరాలు, ఇబ్బందుల నడుమ సుమారు 4 గంటలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. చివరికి బాబా దయతో రాత్రి 7.30 కి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ మొత్తం ప్రక్రియ అంతా రావిచెట్టు కింద నడిచింది. అది నాకు బాబా వేపచెట్టు క్రింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్న వృత్తాంతాన్ని గుర్తు చేసింది. దానితో జరుగుతున్నదంతా బాబా ఆశీస్సులతోనే జరుగుతుందని, ఇకపైన కూడా ఆయన కృపతో ఉన్న తక్కువ సమయంలో అంతా సజావుగా సాగిపోతుందని అనిపించింది. మరుసటిరోజు నేను బ్యాంకు మేనేజరుని కలిసాను. బ్యాంకు మేనేజర్ చేతివేళ్ళకి అందమైన బాబా ఉంగరం ఉంది. అలా ప్రతి మలుపులో 'నేను నీకు తోడుగా ఉన్నాన'ని బాబా సూచించారు. ఇంకా ప్రత్యేకించి చెప్పనక్కరలేదు, పనంతా సజావుగా సాగిపోయింది. అప్పటికి గత కొన్ని నెలలుగా రూపాయి విలువ పడిపోతుండటంతో నాకు చాలా ఎక్కువ డాలర్స్ వచ్చాయి. అంతా బాబా కృప. నా అనుభవాన్ని చాలా ఎక్కువగా వ్రాసానని నాకు తెలుసు. కానీ నా తోటి భక్తులకు బాబా ఎట్టి పరిస్థితిలోనూ మన చేయి వదిలిపెట్టరని తెలియజేయడానికి ప్రతి విషయాన్నీ వ్రాసాను. ఆయన మన 'శ్రద్ధ' 'సబూరి'లను పరీక్షిస్తారు. కాబట్టి ప్రియమైన భక్తులారా! సహనాన్ని కోల్పోకుండా విశ్వాసంతో బాబాను ప్రార్థిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుంది. "బాబా! మీ దివ్య పాదాల చెంత చోటివ్వండి. నాతోటి సోదర సోదరీమణులకు మీ సహాయాన్ని అందించి మీ చల్లని నీడలో ఆశ్రయాన్ని ఇవ్వండి". ఓం శ్రీసాయినాథాయ నమః!

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*సాయిభక్తుల అనుభవమాలిక - 114 వ భాగం* 🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗 ఈరోజు భాగంలో అనుభవం: అడుగడుగునా అందిన బాబా ఆశీస్సులు ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: నేను యు.ఎస్ లో నివసిస్తున్న సాయిభక్తుడిని. చిన్నప్పటినుంచి బాబాను ఒక సాధుసత్పురుషుడుగానే చూసేవాడిని. కానీ 2015లో నన్ను తన పాదాల చెంతకు లాక్కున్నప్పటినుండి బాబా భగవంతుని అవతారమని తెలుసుకున్నాను. అప్పటినుండి బాబా నన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నారు. ఆయన రాకతో నా జీవితమే మారిపోయింది. ప్రియమైన సాయిభక్తులందరికీ బాబా తన భక్తులను ఎలా రక్షిస్తారో తెలుసు. నేను ఒక విషయంలో ఎన్నో సమస్యలను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. అయినప్పటికీ బాబా యందు పూర్తి విశ్వాసంతో, ఆయన స్మరణ చేస్తూ సమస్యను ఆయనకే విడిచిపెట్టాను. ఆయన తనదైన ప్రత్యేకశైలిలో ఆ సమస్యనుండి నన్ను బయటపడేశారు. ఇటువంటి అనుభవాలు నాకు చాలానే జరిగాయి. వాటివల్ల బాబాపట్ల నా విశ్వాసం అధికమైంది. అటువంటి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. యు.ఎస్ లో నాకు ఒక స్వంత కంపెనీ ఉంది. 2018లో ఇండియాలో నాకున్న ఒక అపార్ట్‌మెంటుని అమ్మేసి, ఆ డబ్బుతో నా కంపెనీ లోన్ క్లియర్ చేయాలనుకున్నాను. అప్పటికే ఆ అపార్ట్‌మెంట్ తీసుకోవడానికి ఒకతను సిద్ధంగా ఉన్నారు. కానీ, నాకు త్వరగా ఇండియా వెళ్లే అవకాశం లేకపోవడంతో, అతనిని వెయిట్ చేయించడం ఇష్టంలేక వేరే అపార్ట్‌మెంట్ ఏదైనా చూసుకోమని చెప్పాను. కానీ అతను మా అపార్ట్‌మెంట్ తీసుకోవడానికే ఆసక్తి కనబరుస్తూ, "డిసెంబర్ వరకు వేచి ఉంటాను. మీకు వీలైనప్పుడు రండి" అని చెప్పాడు. ఇలా ఉండగా అక్టోబర్ నెలలో అత్యవసరంగా నాకు డబ్బు అవసరమైంది. కానీ అపార్ట్‌మెంట్ అమ్మే పని త్వరగా అయ్యేది కాదు. ఎందుకంటే, ముందుగా అతను బ్యాంకు లోన్ పొందాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చాలా ప్రయాస, సమయంతో కూడుకున్నది. అదీకాక వచ్చిన డబ్బును యు.ఎస్ తరలించడం చార్టెడ్ అకౌంటెంట్, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు, బ్యాంకు వీటన్నిటితో ముడిపడివుంది. దాంతో నేను నా అపార్ట్‌మెంట్ తీసుకుంటానన్న వ్యక్తికి ఫోన్ చేసి, "పనంతా త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందా?" అని అడిగాను. "నేను అన్నీ ఏర్పాటు చేస్తాను. మీరు రండి" అని అన్నాడు. సరేనని నేను ఇండియాకి టికెట్స్ బుక్ చేసుకుని మంగళవారం ఉదయానికి ఇండియా చేరుకున్నాను. తీరా ఇండియా చేరాక ఒక నెల నుంచి లాయర్లు సమ్మె చేస్తున్నారని, అందువలన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్స్ జరగట్లేదని తెలిసింది. ఆ పనులన్నీ పూర్తి చేసుకోడానికి నావద్ద కేవలం ఎనిమిది పనిదినాలు మాత్రమే ఉండటంతో నాకేమి చేయాలో అర్థం కాలేదు. నా సమయం, డబ్బు వృధా అయిపోతున్నాయని ఆందోళనపడ్డాను. ఇక బాబాయే శరణం అనుకున్నాను. ఆయనయందు పూర్తి విశ్వాసముంచి, ఆయన స్మరణ చేస్తూ, "నా పని పూర్తయ్యేలా చూడమ"ని ప్రార్థించాను. ప్రతిరోజూ ఉదయం మా ఇంటికి దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్తుండేవాడిని. అక్కడ ప్రశాంతంగా, అందంగా ఉన్న బాబా మూర్తిని చూస్తుంటే నాకు మనశ్శాంతి లభిస్తుండేది. ఇలా రెండురోజులు గడిచాక గురువారం మధ్యాహ్నానికి నా అపార్ట్‌మెంట్ తీసుకుంటున్న అతని బ్యాంకు లోనుకి సంబంధించిన పేపర్ వర్క్ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయింది. ఆ సమయంలో అతను లాయర్ల సమ్మె శుక్రవారం ఉదయానికి ముగుస్తుందని, కాబట్టి రిజిస్ట్రేషన్ పని కూడా ఆరోజు పూర్తయ్యేలా చూస్తానని చెప్పాడు. దాంతో మిగిలినరోజుల్లో డబ్బు యు.ఎస్ కి ట్రాన్స్‌ఫర్ చేసే పని కూడా అయిపోతుందని అనుకున్నాను. అయితే శుక్రవారం ఉదయం అతను మళ్ళీ ఫోన్ చేసి, "అనుకున్నట్టుగా సమ్మెను ఆరోజు కాకుండా శనివారంరోజు లాయర్లు విరమించుకుంటార"ని చెప్పాడు. దాంతో నేను మళ్ళీ టెన్షన్ పడ్డాను. అలవాటు ప్రకారం శనివారం ఉదయం బాబా దర్శనానికి వెళ్లి, "మీకు ఏది మంచిదనిపిస్తే అది చేయండి" అని ప్రార్థించి, అక్కడ ఉన్నంతసేపు ఆయన స్మరణ చేస్తూ గడిపాను. తర్వాత పనిమీద బ్యాంకుకి వెళ్ళాను. మనసులో మాత్రం రిజిస్ట్రేషన్ గురించి ఆందోళనపడుతూ ఉన్నాను. ఒంటిగంట సమయంలో బ్యాంకు ముందున్న నా కారు తీస్తుండగా నా ఫోను రింగ్ అయింది. చూస్తే మా సిస్టర్. తను, "చాలాసేపటి నుంచి అపార్ట్‌మెంట్ తీసుకునే అతను ఫోన్ చేస్తున్నారు, కానీ మీ ఫోన్ కలవడం లేదు, వెంటనే బయలుదేరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రమ్మ"ని చెప్పింది. నాకు కాస్త ప్రశాంతంగా అనిపించింది. వెంటనే నేను ఇంటికి వెళ్లి, కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకుని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకి బయలుదేరాను. దారిలో ఈ మొత్తం ప్రక్రియలో మాకు సహాయం చేస్తున్న ఒకతనిని కూడా కారులో ఎక్కించుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చేరుకున్నాను. ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండే ఆ చోటు ఎడారిని తలపించేలా ఖాళీగా ఉండటంతో ఆశ్చర్యపోయాను. ముందుగా లాయర్ని కలవడానికి వెళ్ళాను. అక్కడ నా దృష్టిని ఆకర్షించిన మొదటి వస్తువు - ఆయన టేబుల్ పై ఉన్న ఒక పుస్తకం. దానిపై బాబా ఫోటో ఉంది. వెంటనే లాయర్ని, "అది సచ్చరిత్రనా?" అని అడిగాను. అందుకాయన, అది "శిరిడీ డైరీ" అని చెప్పారు. బాబా నాకు తోడుగా ఉన్నారని చాలా ఆనందించాను. తర్వాత లాయరు అవసరమైన డాక్యుమెంట్స్, ఐడీ ప్రూఫ్స్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు అడిగారు. అయితే డాక్యుమెంట్స్, ఐడీప్రూఫ్స్ మాత్రమే కావాలని ముందుగా చెప్పి ఉండటంతో వాటినే నేను తీసుకెళ్లాను. దాంతో ఫోటోల కోసం ఏం చేయాలా అని టెన్షన్ పడ్డాను. వెంటనే బాబా నాకో ఆలోచన స్ఫురింపజేశారు. నాతోపాటు ఎప్పుడూ ఉండే బ్యాగులో 2 సంవత్సరాల క్రితం మొబైల్ ఫోన్ కోసం తీసుకున్న ఫోటోలున్నాయి. బ్యాగులో చూస్తే సరిగ్గా రెండు ఫోటోలు మాత్రమే ఉన్నాయి. 'బాబా ఎంత కరుణామయుడు!' అని నా హృదయం ఆనందంతో పులకించిపోయింది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటూనే లాయరు, 'సాక్షిగా ఎవరు ఉన్నారు?' అని అడిగారు. కారులో నాతోపాటు తీసుకొచ్చిన వ్యక్తి సాక్షిగా ఉంటానని అన్నారు. అప్పుడు లాయరు అతని ఐడీ ప్రూఫ్స్ అడిగారు. అవి అతని వద్దలేవు. లాయరు కనీసం మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా సరిపోతుందని అతనితో అన్నారు. కానీ అతను అది కూడా లేదని చెప్పారు. సరే ఇంటికి వెళ్లి వస్తామనుకుంటున్న సమయంలో మరో అద్భుతం జరిగింది. ఎందుకో అనుకోకుండా అతను తన జేబులో ఉన్న కాగితాలన్నీ చూస్తుండగా డ్రైవింగ్ లైసెన్స్ కనిపించింది. తరువాత డాక్యుమెంట్స్ టైపు చేసే వ్యక్తి భోజనానికి వెళ్లి గంటవరకు కనపడలేదు. మరో వ్యక్తి 3 గంటలకే తన గ్రామానికి వెళ్లిపోవాలని అంటాడు. చివరిగా సంతకం పెట్టాల్సిన వ్యక్తి లాయర్ల సమ్మె సాకుగా చెప్పి ఊరంతా తిరుగుతున్నాడు. ఇలా ఎన్నో అవాంతరాలు, ఇబ్బందుల నడుమ సుమారు 4 గంటలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. చివరికి బాబా దయతో రాత్రి 7.30 కి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ మొత్తం ప్రక్రియ అంతా రావిచెట్టు కింద నడిచింది. అది నాకు బాబా వేపచెట్టు క్రింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్న వృత్తాంతాన్ని గుర్తు చేసింది. దానితో జరుగుతున్నదంతా బాబా ఆశీస్సులతోనే జరుగుతుందని, ఇకపైన కూడా ఆయన కృపతో ఉన్న తక్కువ సమయంలో అంతా సజావుగా సాగిపోతుందని అనిపించింది. మరుసటిరోజు నేను బ్యాంకు మేనేజరుని కలిసాను. బ్యాంకు మేనేజర్ చేతివేళ్ళకి అందమైన బాబా ఉంగరం ఉంది. అలా ప్రతి మలుపులో 'నేను నీకు తోడుగా ఉన్నాన'ని బాబా సూచించారు. ఇంకా ప్రత్యేకించి చెప్పనక్కరలేదు, పనంతా సజావుగా సాగిపోయింది. అప్పటికి గత కొన్ని నెలలుగా రూపాయి విలువ పడిపోతుండటంతో నాకు చాలా ఎక్కువ డాలర్స్ వచ్చాయి. అంతా బాబా కృప. నా అనుభవాన్ని చాలా ఎక్కువగా వ్రాసానని నాకు తెలుసు. కానీ నా తోటి భక్తులకు బాబా ఎట్టి పరిస్థితిలోనూ మన చేయి వదిలిపెట్టరని తెలియజేయడానికి ప్రతి విషయాన్నీ వ్రాసాను. ఆయన మన 'శ్రద్ధ' 'సబూరి'లను పరీక్షిస్తారు. కాబట్టి ప్రియమైన భక్తులారా! సహనాన్ని కోల్పోకుండా విశ్వాసంతో బాబాను ప్రార్థిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుతుంది. "బాబా! మీ దివ్య పాదాల చెంత చోటివ్వండి. నాతోటి సోదర సోదరీమణులకు మీ సహాయాన్ని అందించి మీ చల్లని నీడలో ఆశ్రయాన్ని ఇవ్వండి". ఓం శ్రీసాయినాథాయ నమః!

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 4 शेयर

*సాయిభక్తుల అనుభవమాలిక - 113 వ భాగం* 🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗 గురుపూర్ణిమరోజుతో ముడిపడివున్న అనుభవాలు: నేను ఇవ్వాలనుకున్న దక్షిణను బాబా స్వీకరించారు పండ్లు నైవేద్యంగా పెట్టే భాగ్యాన్నిచ్చారు బాబా. నాకోసం ట్రైన్ గంట ఆలస్యం చేసిన బాబా గురుపూర్ణిమరోజు నేను ఇవ్వాలనుకున్న దక్షిణను బాబా స్వీకరించారు సాయిబంధువు రాజేష్ తోలాని తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: నేను మస్కట్(ఒమెన్‌)లో నివసిస్తున్నాను. 2019, జులై 16, గురుపూర్ణిమరోజు ఉదయాన నేను బాబా గుడికి వెళ్తూ కొంత డబ్బు హుండీలో వేయాలని అనుకున్నాను. అయితే నా పర్సు కారులోనే మర్చిపోయాను. ఆ విషయం గుళ్ళోకి వెళ్లి విఘ్నేశ్వరునికి నమస్కరిస్తుండగా గుర్తుకువచ్చి బాధతో నన్ను నేను తిట్టుకున్నాను. దర్శనం చేసుకుని నా కారు వద్దకు తిరిగి వచ్చేసరికి ఒక వయసు పైబడిన వ్యక్తి నా కారు ప్రక్కన నిలబడి ఉన్నాడు. నేను చాలా సంవత్సరాలుగా ఆ మందిరానికి ప్రతి మంగళవారం వెళ్తున్నాను. కానీ ఆ వ్యక్తిని అంతకుముందెన్నడూ చూడలేదు. అతనిని చూసిన మరుక్షణం సచ్చరిత్రలోని 'స్వచ్ఛమైన మనస్సుతో బాబాకి దక్షిణ ఇవ్వాలనుకుని మర్చిపోతే, బాబానే ఏదో ఒక రూపంలో వచ్చి ఆ దక్షిణను స్వీకరిస్తారు' అన్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే హుండీలో వేయాలనుకున్న మొత్తాన్ని ఆ వృద్ధునికి ఇచ్చాను. అతను చిరునవ్వుతో ఆ డబ్బు తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. "థాంక్యూ బాబా!" గురుపూర్ణిమనాడు పండ్లు నైవేద్యంగా పెట్టే భాగ్యాన్నిచ్చారు బాబా. 2019, జులై 15న సాయిబంధువు హరిణి తాను పొందిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: సాధారణంగా ప్రతిరోజూ నేను బెల్లంతోపాటు ఏదైనా పండును నైవేద్యంగా బాబాకు పెడతాను. ఒకవేళ పండ్లు లేకుంటే బెల్లం మాత్రమే నైవేద్యం పెడతాను. గురుపూర్ణిమకు 4 రోజుల ముందు నుండి బెల్లం మాత్రమే పెడుతున్నాను. 2019, జులై 15 సాయంత్రం 'రేపు గురుపూర్ణిమ కదా! బాబాకి పండ్లు నైవేద్యంగా పెడదాం' అని అనుకుని 'పండ్లు తీసుకుని రమ్మ'ని నేను నా భర్తకి మెసేజ్ పెట్టాను. తన నుండి నాకు రిప్లై రాకపోవడంతో తను నా మెసేజ్ చూడలేదేమో అనుకున్నాను. అయితే తను ఇంటికి వస్తూ 4 ఆపిల్స్ తీసుకొచ్చారు. తను నా మెసేజ్ చూసి ఆ ఆపిల్స్ తీసుకొచ్చారని అనుకున్నాను. కానీ నేను మేసేజ్ చేసేటప్పటికే తను ఆఫీసు నుండి బయలుదేరి దారిలో ఉన్నందువల్ల మొబైల్ చూసుకోలేదని చెప్పారు. సాధారణంగా నేను పండ్లు, పువ్వులు మొదలైనవి తెమ్మని మెసేజ్ పెడితేనే తను తీసుకుని వస్తారు. అలాంటిది ఆరోజు నా మెసేజ్ చూడకుండానే తను పండ్లు తీసుకొచ్చారు. నా మనసు తెలిసిన బాబా తను పండ్లు తీసుకుని ఇంటికి వచ్చేలా చేసి గురుపూర్ణిమనాడు నా మనసుకు నచ్చేవిధంగా ఆయనను పూజించుకునే భాగ్యాన్ని కల్పించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" నాకోసం ట్రైన్ గంట ఆలస్యం చేసిన బాబా సాయిబంధువు సెంథిల్ సచిన్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: నేను గురుపూర్ణిమ సందర్భంగా శిరిడీ సందర్శించి బాబా దర్శనం చేసుకున్నాను. 2019, జులై 17న నా తిరుగు ప్రయాణానికి పూణే నుండి మధ్యాహ్నం 3.45 కి ట్రైన్ ఉంది. కాబట్టి శిరిడీ నుండి పూణే వెళ్ళడానికి ఉదయం 10 గంటలకున్న ఒక ప్రైవేట్ బస్సుకు టికెట్ బుక్ చేసుకున్నాను. అయితే 10 గంటలకు బయలుదేరాల్సిన బస్సు 10.30కి బయలుదేరింది. బయలుదేరటమే ఆలస్యమనుకుంటే డ్రైవర్ కూడా చాలా నెమ్మదిగా బస్సు నడుపుతూ, ఎక్కడికి అక్కడ బస్సు ఆపుతున్నాడు. దానికితోడు సుమారు 40 నిమిషాలు లంచ్ కోసం ఆపేశాడు. ఇక నా రైలు తప్పిపోవడం ఖాయం అనిపించింది. నిరాశతో బాబాను తలచుకుని, "రైలు తప్పిపోయే సందర్భంలో నేను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి బాబా" అని అనుకున్నాను. ఏమి జరిగిందో ఊహించగలరా?! కొద్దిసేపటికి నేను నా చేతిలో ఉన్న మొబైల్ లోని యాప్‌లో ట్రైన్ స్టేటస్ చూస్తే, ట్రైన్ గంట ఆలస్యంగా ఉంది. అది చూసి నాకు సంతోషంగా అనిపించింది. నేను స్టేషన్‌ చేరుకుని 15 నిమిషాలు వేచి ఉన్నాక ట్రైన్ వచ్చింది. బాబా నా ట్రైన్‌ను గంట ఆలస్యం చేసారు. ఆయన చూపిన దయకు కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*సాయిభక్తుల అనుభవమాలిక - 112 వ భాగం* 🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗 ఈరోజు భాగంలో అనుభవం: అనుకున్నది జరగకపోతే నిరాశపడకూడదనే పాఠాన్ని నేర్పి, ఉద్యోగాన్ని అనుగ్రహించిన బాబా సాయిభక్తుడు విఘ్నేష్ తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు: నేను పుట్టి పెరిగింది చెన్నై. ప్రస్తుతం కలకత్తాలో ఉంటున్నాను. నా తల్లిదండ్రులు, సిస్టర్ చెన్నైలోనే ఉన్నారు. నేను సాయిభక్తుడిని. సద్గురు సామ్రాట్ అయిన సాయినాథునికి నా హృదయపూర్వక నమస్కారములు. నాకు శ్రీ సాయిబాబా యందు అపారమైన నమ్మకం. నా జీవితంలో ప్రతిదీ ఆయన ఆశీస్సులతోనే జరుగుతుందని నా సంపూర్ణ విశ్వాసం. ఆయన తన చేతిలోని దారాన్ని లాగుతూ మనల్ని నడిపిస్తున్నారు. ఏ సమయంలోనైనా మనకు ఏది మంచిదో అది ఆయనే నిర్ణయిస్తారు. నా జీవితమే అందుకు చక్కటి ఉదాహరణ. బాబా దయ, ఆశీర్వాదాలతో నేనొక ప్రముఖ బిజినెస్ స్కూల్లో చదువుతున్నాను. "నేనసలు ప్రవేశ పరీక్ష బాగా వ్రాసి, బిజినెస్ స్కూల్లో సీటు పొందగలనా?" అని అనుకునేవాడిని. అలాంటిది బాబా నాకు చాలా మంచి కాలేజీలో సీటు వచ్చేలా అనుగ్రహించారు. అలా ఆ సమయంలో నాకవసరమైన మంచి బహుమానాన్నిచ్చారు. ఇటీవల ఒక నెల ఆరంభంలో మా బ్యాచ్‌కి కాలేజీ ప్లేస్‌మెంట్స్ మొదలయ్యాయి. చాలా గొప్ప గొప్ప కంపెనీలు వస్తుండటంతో అందరూ ఇంటర్వ్యూ కోసం చాలా కష్టపడి ప్రిపేర్ అవుతున్నారు. అలాంటి సమయంలో నేను అనుకోకుండా అనారోగ్యం పాలై మంచం పట్టాను. ఆ కారణంతో నేను సరిగా ప్రిపేర్ కాలేకపోయాను. కానీ బాబా నన్ను నిరాశపరచరని, ఖచ్చితంగా మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చేలా అనుగ్రహిస్తారని నాకు ఆయనపట్ల పూర్ణ విశ్వాసం. మొదటిరోజు వచ్చిన మొదటి కంపెనీలోనే నాకు ఉద్యోగం రావాలని నేను ఆశించాను. నేను, "బాబా! నాకీ కంపెనీలో ఉద్యోగం వచ్చేలా చూడండి" అని ప్రార్థించి ఇంటర్వ్యూకి వెళ్ళాను. అయితే గ్రూప్ డిస్కషన్‌లో నేను సరైన నైపుణ్యం చూపలేకపోయాను. నాకు బాధగా అనిపించినా బాబా నా మంచికోసమే అలా చేశారని అనుకున్నాను. ఆరోజు సాయంత్రం వేరే కంపెనీలోనైనా నేను ఎంపిక కావాలన్న లక్ష్యంతో ఇంటర్వ్యూకి వెళ్ళాను. కానీ ఈసారి కూడా నేను గ్రూప్ డిస్కషన్‌లో విఫలమయ్యాను. ఏం జరుగుతుందో అర్థంకాక, "బాబా! నన్ను అనుగ్రహించండ"ని ప్రార్థించాను. అప్పటికే అలసిపోయి ఉన్నప్పటికీ అదేరోజు అర్థరాత్రి వేరే కంపెనీవాళ్ళు నిర్వహించిన టెస్టుకి కూడా హాజరయ్యాను. పరీక్ష కాస్త కష్టంగానే ఉంది. నేను పూర్తిగా బాబాపై ఆధారపడ్డాను. మరుసటిరోజు ఉదయం వేరే కంపెనీ గ్రూప్ డిస్కషన్ సమర్థవంతంగా పూర్తిచేయగలిగాను. దాంతో ఈసారి నాకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని అనుకున్నాను. కానీ ఇంటర్వ్యూలో విఫలమయ్యాను. ఇక నేను నిరాశకు లోనై సాయిబాబా నాకు సహాయం చేయట్లేదని ఆయనను నిందించడం మొదలుపెట్టాను. "నేను ఎవరికి ఏ హాని చేశాను, నన్నిలా ఎందుకు శిక్షిస్తున్నారు?" అని బాబాను అడిగాను. తర్వాత ఒక కంపెనీ వీడియో ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. తర్వాత ఆరోజు సాయంత్రం వేరే కంపెనీ ఇంటర్వ్యూకి ప్రయాణమయ్యాను. అక్కడ కూడా నేను సమర్థవంతంగా నా ప్రతిభ చూపలేకపోయాను. నన్ను బాబా శిక్షిస్తున్నారని చాలా భయపడిపోయాను. అదే సమయంలో ముందురోజు రాత్రి నేను టెస్ట్ రాసిన కంపెనీ నుండి 'నేను తర్వాత రౌండుకి ఎంపిక చేయబడినట్టు' మెయిల్ వచ్చింది. వాళ్ళు మొదట 25 మందిని ఎంపిక చేయాలనుకున్నారు కానీ, చివరి నిమిషంలో 30 మంది వరకు తీసుకున్నారు. ఆ జాబితాలో నేనే చివరివాడిని. మెయిల్ చూశాక నాకు కొంత ఆశ కలిగింది. కానీ అప్పటికే బాగా అలసిపోయి ఉన్నందున ప్రిపరేషన్ మొదలుపెట్టకుండా నిద్రపోయాను. మరుసటిరోజు వేకువఝామున లేచి స్నానం చేసి కంపెనీకి బయలుదేరాను. మార్గంలో అంతా సాయిబాబా భజనలు వింటూ ప్రయాణం కొనసాగించాను. అక్కడ ఇంటర్వ్యూ కోసం చాలా సమయం వేచి ఉండాల్సి వచ్చింది. చాలామంది మొదటి రౌండు పూర్తయి రెండవ రౌండుకు వెళ్తున్నా, నాకు మాత్రం చాలాసేపటివరకు మొదటి రౌండు అవకాశమే రాలేదు. అక్కడ ఉన్నవాళ్ళు ఇంటర్వ్యూలో చాలా కఠినమైన టెక్నికల్ ప్రశ్నలు అడుగుతున్నారని అంటుంటే విన్నాను. కానీ నేనేమీ కంగారుపడకుండా ప్రతి ఇంటర్వ్యూకి వెళ్లేముందు సచ్చరిత్ర చదువుకుంటూ ఉండే నా అలవాటు ప్రకారం సచ్చరిత్ర చదువుతూ కూర్చున్నాను. బాబా నాకేది మంచిదో అది చేస్తారనేది నా నమ్మకం. అలా చాలా సమయం వేచి ఉన్నాక నన్ను పిలిచారు. నేను బాబాను ప్రార్థించుకుని ఇంటర్వ్యూ గది లోపలికి వెళ్ళాను. ఆశ్చర్యంగా నన్ను అన్నీ చాలా తేలికైన ప్రశ్నలు అడిగారు. నేనిచ్చిన సమాధానాలతో వాళ్ళు ఎంతగానో సంతృప్తి చెందారు. అంతా సజావుగా సాగి నేను బయటకు వచ్చి కూర్చున్నాక మళ్లీ రెండో రౌండు ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ రౌండులో కూడా నాకు అన్నీ తెలిసిన ప్రశ్నలు అడిగారు. నా సమాధానాలతో వాళ్ళు చాలా సంతోషించారు. తర్వాత నేను బయటకు వచ్చి కూర్చుని సచ్చరిత్ర చదవడం కొనసాగించాను. కొంతసేపటికి నన్ను పిలిచి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఉద్యోగం ఆఫర్ చేశారు. నేను పట్టలేని ఆనందంతో పరుగున వెళ్లి సచ్చరిత్ర పుస్తకాన్ని గుండెలకు హత్తుకున్నాను. కళ్ళనుండి వస్తున్న కన్నీళ్ళను ఆపుకోలేకపోయాను. నేను వెళ్లిన ప్రతి కంపెనీలో ఉద్యోగమిమ్మని బాబాని ప్రార్థించాను. అన్నింట్లోకి ఏది అత్యుత్తమమైన కంపెనీయో అందులో బాబా నాకు ఉద్యోగాన్ని అనుగ్రహించారు. టెస్టులో ఎంపిక కాబడినవాళ్ల జాబితాలో నేనే చివరివాడిని, ఉద్యోగాన్ని పొందినవాళ్ళలో మొదటి వ్యక్తినయ్యాను. అదీ బాబా చేసే అద్భుతమంటే! ఆయనే నన్ను అన్నీ తేలికైన ప్రశ్నలు అడిగేలా చేసి, నాకు ఉద్యోగం వచ్చేలా చేశారు. సంతోషంతో మా వాళ్లకు ఫోన్ చేసి సాయి చేసిన లీల గురించి చెప్పాను. వాళ్ళు కూడా సంతోషించారు. బాబా నాకోసం ఉత్తమమైన ఏర్పాట్లు చేస్తుంటే, నేను మాత్రం వేరే కంపెనీలలో ఎంపిక కాలేకపోయానని అజ్ఞానంతో ఆయనను నిందించాను. అందుకు బాబాకు మనసారా క్షమాపణలు చెప్పుకున్నాను. అంతేకాదు, ఎప్పుడైనా మనం అనుకున్నట్లు జరగకపోతే నిరాశపడకూడదనే పాఠం నేర్చుకున్నాను. బాబాకు తెలుసు, మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో! ఆయనెప్పుడూ మనకి శ్రేయస్కరమైనదే చేస్తారు. శ్రద్ధ, సబూరీ మాత్రం కలిగి ఉండి ఆత్మస్వరూపుడైన సాయికి మన జీవితాన్ని అప్పగిస్తే, ఆయన మన కర్మలను తొలగించి మనకు ఉత్తమమైనదేదో అదే ఇస్తారు. ఏ సమయంలోనైనా ఆయనే మనకు గొప్ప మార్గదర్శకుడు.

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*సాయిభక్తుల అనుభవమాలిక - 106 వ భాగం* ఈరోజు భాగంలో అనుభవాలు: "నీవు ఎవరినైనా కోపగించుకుంటే నాకెంతో బాధ కలుగుతుంది". సాయిని మించిన వైద్యుడు, ఊదీని మించిన ఔషధం లేదు ఈరోజు అనుభవాలను సాయిబంధువు సుమ పంచుకుంటున్నారు: "నీవు ఎవరినైనా కోపగించుకుంటే నాకెంతో బాధ కలుగుతుంది". ఓం సాయిరామ్! నా పేరు సుమ. నేను నెల్లూరు నివాసిని. ముందుగా బ్లాగు నిర్వహిస్తున్నవారికి చాలా చాలా ధన్యవాదాలు. బ్లాగులో నేను పంచుకుంటున్న మూడవ అనుభవమిది. 2019 జూన్ 16వ తేదీ, శనివారంనాడు మా చెల్లికి ఒక కల వచ్చింది. కలలో బాబా దర్శనమిచ్చి, "మీ అక్క వల్ల నేను చాలా బాధపడుతున్నాను. ఆ విషయం మీ అక్కకి చెప్పు" అన్నారు. తను, "ఎందుకు బాబా?" అని అడిగితే, "మీ అక్కకి కోపం ఎక్కువ. అందరిమీదా అరుస్తుంది. అందువలన అవతలివాళ్ళు చాలా బాధపడతారు. కాబట్టి నేను కూడా బాధపడుతున్నాను. ఎందుకంటే ప్రతిజీవిలో నేనే ఉన్నాను. వాళ్ళని కోప్పడితే నాపై కోపగించుకున్నట్టే. మీ అక్కకి కోపంగాని, బాధగాని వస్తే నా పాదాలు పట్టుకుని శాంతంగా ఉండమను. అంతా నేను చూసుకుంటాను. ఇకపై ఎవరిమీదా కోప్పడవద్దని చెప్పు" అన్నారు. అక్కడితో కల ముగిసింది. ఉదయాన నిద్రలేస్తూనే మా చెల్లి తనకి వచ్చిన కల గురించి నాతో చెప్పింది. అది వినగానే నాకు చాలా బాధ కలిగింది. ఎప్పుడైనా నేను ఏ కాస్త బాధలో ఉన్నా కూడా సాయిమహారాజ్ వెంటనే ఏదో ఒక రూపంలో వచ్చి నన్ను సంతోషపెడతారు. 'అలాంటి బాబాని నేను ఇంతలా బాధపెడుతున్నానా?' అని తెలిసేసరికి నాకు దుఃఖం ఆగలేదు. నిజానికి నాకు కోపం చాలా ఎక్కువే. అయితే అది ఎక్కువసేపు ఉండదు. కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం అవతలివాళ్ళు బాధపడతారేమో అన్న ఆలోచన ఏమాత్రం లేకుండా కోపంలో నేను ఏదేదో మాట్లాడేస్తుంటాను. ప్రతిజీవిలో బాబా ఉంటారని తెలిసి కూడా నేను అలా ప్రవర్తించడం చాలా చాలా పెద్ద పొరపాటు. నిజంగా నా కోపం వల్ల బాధ కలిగిన వాళ్ళందరికీ పేరుపేరునా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. "బాబా! దయచేసి నన్ను క్షమించండి". సాయికి తన బిడ్డలమైన మనమంటే ఎంత అమితమైన ప్రేమో! 'నా వల్ల బాధపడుతున్నాన'ని అన్నారేగాని, నాపై కోపంగా ఉందని అనలేదు. సాయి ప్రేమగల తల్లి. తల్లికి తన బిడ్డ మీద ఎప్పుడూ కోపం రాదు. కానీ 'నా బిడ్డ ఇలా చేస్తుందే' అని బాధపడతారు. ఈ బిడ్డ వలన సాయిమాత పడుతున్న బాధ నాకు ఆ కల ద్వారా అర్థమైంది. నా కోసం బాబా ఎన్నో చేశారు, ఎన్నో అసాధ్యాల్ని సుసాధ్యం చేశారు. 'అలాంటి బాబా కోసం నేను నా కోపాన్ని వదులుకోలేనా?' అనిపించింది. అందుకే ఆరోజే 'ఇకపై ఎవరిపైనా కోప్పడకూడద'ని ఒక నిర్ణయం తీసుకుని, "బాబా! ఇక నేను ఎవరిమీదా కోప్పడను, సహనంతో ఉంటాను. నా వంతుగా నేను నూటికి నూరుశాతం కోప్పడకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. కానీ మీ సహాయం లేకుంటే నేనేమీ చేయలేను. అందువలన నా ఈ ప్రయత్నంలో మీ ఆశీస్సులు నాకెంతో అవసరం" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత కూడా 'బాబా నావల్ల ఎంత బాధ అనుభవించారో' అని బాధపడుతూ నిద్రలోకి జారుకున్నాను. నిద్రలేచాక మొబైల్‌లో చూస్తే, బాబాకు సంబంధించిన ఒక క్విజ్ పోటీలో నేను గెలిచినట్లు తెలియజేస్తూ ఒక మెసేజ్ ఉంది. అది చూడగానే నా సంతోషానికి అవధుల్లేవు. బాబా నన్ను ఇంత సంతోషపెడతారని నేను అస్సలు ఊహించలేదు. నేను ఎప్పుడు బాధపడినా సాయిమహారాజ్ నన్ను వెంటనే సంతోషపెడతారని ముందే మీకు చెప్పాను కదా! 'నా వలన తాము బాధపడుతున్నామ'ని తెలియజేసిన బాబా, నేను బాధపడేసరికి వెన్నలా కరిగిపోయి నన్నెలా ఆనందపెట్టారో చూసారా! ఆయన చూపే ఆ అంతులేని ప్రేమ ఏ పదాలకు అందుతుంది? నా తప్పు తెలుసుకుని, "ఇకపై ఎవరిమీదా కోప్పడను, నన్ను క్షమించండ"ని చెప్పుకోగానే బాబా నన్ను క్షమించారు అనేదానికి సమయానికి వచ్చిన ఆ మెసేజే సంకేతం. "మీ బిడ్డలపై మీకెంత ప్రేమ సాయి! సదా మా అందరిపై మీ ప్రేమని ఇలాగే కురిపిస్తూ ఉండండి. నన్ను క్విజ్‌లో విజేతగా నిలబెట్టి సంతోషపెట్టినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా! తెలిసీతెలియక నేను చేసిన తప్పులన్నింటికీ నన్ను క్షమించండి సాయీ! జీవితాంతం మీ తోడు నాకు కావాలి బాబా. మీ పాదాల చెంత నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. మీ కృప మా అందరిపై సదా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా!" సాయిని మించిన వైద్యుడు, ఊదీని మించిన ఔషధం లేదు 4 సంవత్సరాల క్రితం నాకు గొంతునొప్పి వచ్చింది. ఆ నొప్పితో మాట్లాడడం కూడా కష్టంగా ఉండేది. డాక్టర్ని సంప్రదిస్తే, "స్వరపేటిక బాగా దెబ్బతింది. మీరు చాల తక్కువగా మాట్లాడాలి. గొంతుపై ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడాలి" అని చెప్పి కొన్ని మందులు వ్రాసిచ్చారు. కొన్నిరోజులు మందులు వాడాక నొప్పి తగ్గిపోయింది. మరలా 4 సంవత్సరాల తరువాత మొన్న జూన్ నెలలో మళ్ళీ ఆ నొప్పి నన్ను చాలా ఇబ్బందిపెట్టింది. రోజూ బాబా ఆరతి పాడే అలవాటున్న నేను ఆ నొప్పి కారణంగా ఆరతి కూడా పాడలేకపోయాను. ఆరతి పాడడం, మాట్లాడడం చాలా కష్టంగా అయిపోయింది. 'ఈసారి గొంతు సమస్య వస్తే కష్టం, ఆపరేషన్ దాక వెళ్లాల్సి ఉంటుంద'ని డాక్టరు 4 ఏళ్ళ క్రితమే చెప్పి ఉన్నందున నాకు హాస్పిటల్‌కి వెళ్లాలంటేనే భయమేసింది. అందువలన బాబాకి నమస్కరించుకొని, "బాబా! నా గొంతునొప్పిని మీరే నయం చెయ్యాలి" అని ప్రార్థించాను. తరువాత బాబా ఊదీని గొంతుకి రాసుకొని, నీళ్లలో కొంత కలుపుకొని త్రాగాను. అలా రెండురోజులపాటు చేశాను. రెండవరోజుకి నాకు కొంత ఉపశమనం కనిపించింది. మూడవరోజు నుంచి క్రమంగా నొప్పి తగ్గుతూ అయిదవరోజుకల్లా పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు నేను హాయిగా మాట్లాడుతున్నాను, ఆరతి పాడుతున్నాను. అంతా బాబా దయ, ఆయన ఊదీ మహిమ. "తక్కువ సమయంలో నొప్పినుండి నాకు ఉపశమనం కలిగించినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!" మరో అనుభవం : జూన్ నెలలోనే మా నాన్నగారికి నడుము పట్టేసి చాలా బాధపడ్డారు. మాత్రలు వేసుకున్నా, ఇంజక్షన్ వేయించుకున్నా కూడా నొప్పి తగ్గలేదు. ఆయన పడుతున్న అవస్థ చూసి నాకు చాలా బాధేసింది. అప్పుడు నాన్నకి మాత్రలతో పాటు బాబా ఊదీని నీళ్ళలో కలిపి ఇచ్చాను. రెండవరోజుకి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ముందు మాత్రలకు, ఇంజక్షన్‌కు తగ్గని నొప్పి బాబా ఊదీతో పూర్తిగా తగ్గింది. "మరోసారి మీ ఊదీ మహిమ చూపినందుకు చాలా చాలా ధన్యవాదాలు, అనేకానేక నమస్కారాలు బాబా!" నిజంగా సాయిని మించిన వైద్యుడు, ఊదీని మించిన ఔషధం లేదు.

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB