m.sreenivasareddy
m.sreenivasareddy May 16, 2019

🙏 భక్తుడు-బిచ్చగాడు 🤲 👉ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు. రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు. ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే. ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది...... బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు. చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది. తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు. తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు. భక్తుడు సరేనన్నాడు. ఆ ఘడియ రానే వచ్చింది. బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. ..... భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు. ఆశ్చర్యం ......! దాని నుండి నిధి బయటపడింది. వెండి, బంగారు నాణేలు దానిలో ఉన్నాయి. అవన్నీ అతడి సొంతమయ్యాయి..... మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది. జరిగిన దానికి సంతోషపడ్డాడు. కానీ, ఒక సందేహం అతడిని పీడించింది. నిధి మీదే కూచున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడి గానే ఉండిపోయాను. దారిన పోయే దానయ్య కోటీశ్వరుడు అయ్యాడు. ఏమిటయ్యా ఇది! అని దేవుణ్ణి ప్రశ్నించాడు. ...... అతడికి దేవుడు సమాధానం చెబుతూ.....నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూచుని, భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు. అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది. అతడు రోజూ భగవత్సేవ చేస్తూ, నీకు యదా శక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు. నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అందుకే అతనికి సిరిసంపదలు లభించాయి అన్నాడు దేవుడు. వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విస్మరించి, గుడ్డి వాడిలా బయటే ఏదో ఉందని పరిభ్రమించడం ఆగాలి. తప్పక అంతర్ముఖుడు కావాలి! 🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
m.sreenivasareddy May 19, 2019

[19/05, 5:27 AM] Babulreddy: మానవుడు భౌతిక సిరిసంపదలు , ఆడంబర ఆనందాలు , గర్వం అన్నీ పొందవచ్చునుకాని అవి వచ్చిపోయేవే అనగా అశాశ్వతం అని అతనికి తెలుసు . భౌతికంగా అతను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాక అవన్నీ తోడురావు అని కూడా అతనికి తెలుసు . మంచిగా జీవించకపోతే ఈ జీవితం ఎందుకు ? దైవానికి అంకితం చేయబడినది , ' అతని ' కొరకే జీవించినది , ' అతనిలోనే , అతడిచేతనే జీవించబడినదే మంచి జీవితం . అది ఎందుకంటే , దానివలన మానవుడు సంస్కారాలనుంచి మరుజన్మలనుంచి విముక్తుడవుతాడు . అతని లక్ష్యంవైపు , మాస్టర్ లో లయం కావటానికి యాత్ర చేస్తాడు . బాబూజీ మహారాజ్ [19/05, 5:27 AM] Babulreddy: మనందరికీ సాక్షాత్కారం కలిగించాలని , అందుకు మనందరినీ యోగ్యులుగా చేయాలని బాబూజీ మహారాజ్ యొక్క సంకల్పం . అందుచేత మనం హృదయం విప్పి వారినే ఆరాధిస్తే మనకు ప్రోగ్రెస్ కలుగుతుంది . అలా కాకుండా మన గురించే మనం ఆలోచించుకుంటూ , మన మనస్సుకే ( మానసిక ఆలోచనలకే ) పరిమితమై పోతూ వుంటే మనకు ప్రోగ్రెస్ తెలియదు . అందుచేత ఎంతసేపూ హృదయంలో వారినే దర్శిస్తూ ఉండాలి . ఆణిముత్యాలు [19/05, 8:20 AM] msvreddy13: 🍀🌸💖💚🧚‍♂💚💖🌸🍀 🌸 యత్ భావం తత్ భవతి 🌸 🌸 ఒక సన్యాసి, దేవుడి కోసం తపస్సు చేశాడు. అతడి దీక్ష ఫలించి దేవుడు ప్రత్యక్షమై- మూడుసార్లు అతను మనసులో ఏది తలచుకుంటే అదే జరుగుతుందనే వరమిచ్చాడు. వెంటనే ఆ సన్యాసి సకల సదుపాయాలతో ఒక రాజభవనం లాంటి భవంతి కావాలనుకున్నాడు. వెంటనే భవంతి ప్రత్యక్షమయింది. అందమైన యువతితో వివాహం జరగాలి అనుకున్నాడు. అదీ జరిగింది. ఒక్కసారిగా సంప్రాప్తించిన సుఖభోగాలకు తట్టుకోలేని ఆ వ్యక్తి 'కొంపదీసి ఇవన్నీ మాయమవుతాయా!' అని భయపడ్డాడు... భయం అదే ఆలోచనను పదే పదే పునరుచ్చేరణ చేసింది నిజంగానే పోతాయేమో అనుకున్నాడు. అంతే, తక్షణం ఆ సన్యాసి తన పూర్వపు స్థితికి వచ్చేశాడు. 🌸 మన మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తాయో, ఫలితాలు అలానే ఉంటాయనేది ఈ భావాన్నే శ్లోకం రూపంలో ' *యాదృశీ* *భావనా యత్ర సిద్ధిర్భవతి* *తాతృశి* ' అన్నారు ..... 🌸 మృతుల్ని బతికించే మృత సంజీవనితోపాటు పిచ్చిమొక్కలు, విషపుమొక్కలు కూడా నేలతల్లినుంచే ఉద్భవిస్తాయి. అలాగే మంచి ఆలోచనలతోపాటు చెడుతలంపులకూ మానసిక క్షేత్రమే కేంద్రబిందువు. మంచి ఆలోచనలు ఆచరణలో పెడితే మానవాళికి మహోపకారం. ఒక మంచి తలంపు మనిషికి జీవం పోస్తే ఒక చెడు ఆలోచన ప్రళయనికి దారి తీస్తుంది. మంచి ఆలోచనల విలువ అపారం. దాని వలన తనకే కాకుండా తన చుట్టూ ఉన్నవారికి కూడా ఆనందం పంచబడుతుంది.. మనం నిత్యం ఆనందంగా ఉండాలి అంటే సరళమైన ఆలోచన ఉత్తమంగా ఉంటుంది... Thank you....💚💖💚 All is well..... 💖💚💖 🍀🌸💖💚🧚‍♂💚💖🌸🍀

+6 प्रतिक्रिया 1 कॉमेंट्स • 2 शेयर
m.sreenivasareddy May 18, 2019

🌷 *మౌనం - వాక్కు * 🌷 🌷🌷🌷🍂🍂🍂🌷🌷🌷 *మౌనం అంటే మూగబోవాల్సింది మనస్సేగాని వాక్కు కాదు* అని గ్రహించాలి. అసలు *వాక్కు నాలుగువిధాలు. అవే 🌷 పరా 🌷 పశ్యంతి 🌷 మధ్యమ 🌷 వైఖరీ ... అని. *ఇక ఐదవరకం లేదు*. 🌷*వైఖరి* 🌷 ఎల్లప్పుడూ లోకవ్యవహారాలు, వ్యర్థప్రసంగాలు, చెప్పిందే చెప్పి సాగదీయటాలు - *ఇవన్నీ 'వైఖరీ' అంటారు. లోకంలో వీరే ఎక్కువ*. వీరు వాక్కును వ్యర్థం చేయటమే గాక, అనేక అబద్ధాలు మాట్లాడటం జరుగుతుంది. 🌷 *మధ్యమ* 🌷 కొందరు ప్రాపంచికవిషయాలు, వ్యర్థప్రసంగాలతో బాటు అప్పుడప్పుడు భగవత్ సంబంధమైన విషయాలు కూడా మాట్లాడుతారు. వీరి వాక్కులనే 'మధ్యమ' అంటారు. 🌷 *పస్యంతి* 🌷 భగవత్ సంబంధవిషయాలు గాని, ప్రాపంచిక విషయాలు గాని ఏవైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారి వాక్కులు 'పశ్యంతి'. 🌷 *పరా* 🌷 పూర్తిగా ఆత్మకు సంబంధించిన విషయాలు, పరమాత్మ తత్త్వాన్ని తెలిపే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలకు సంబంధించిన విషయాలను మాత్రమే మాట్లాడితే ఆ వాక్కును 'పరా' అంటారు*. *మనం వైఖరీ వాక్కును మధ్యమ వాక్కునందు, మధ్యమ వాక్కును, పశ్యంతినందు, పశ్యంతి వాక్కును పరావాక్కునందు లయంజేసి 'ఆ పరబ్రహ్మను నేనే' అని గ్రహించి అలా ఉండిపోవటమే నిజమైన మౌనం.* 🌷🌷🌷🍂🍂🍂🌷🌷🌷

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
m.sreenivasareddy May 17, 2019

🍀🌸💖💚🧚‍♂💚💖🌸🍀 🌸 మౌనం 🌸 🌸 మౌని అన్నా ముని అన్నా ఒక్కటే. ముని అంటే మానన శీలుడు అని. తాను విన్న భగవత్ సంబంధమైన విషయాలను నిరంతరం మననం చేసుకుంటూ మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం, మనస్సులో ఏ ఆలోచనా ఉన్న దాని అవసరం ఉన్నంత వరకే ఆలోచించటం.. 🌸ఏ భగవత్ సంబంధమైన విషయాలను మాట్లాడవలసి వచ్చినా, ఎవరన్నా ఏదన్నా సందేహం అడిగినా ఈ రోజు మౌనంలో ఉన్నాను కనుక మాట్లాడను అని అనేవాడు మౌని తాను విన్నటువంటి లేదా చదివినటువంటి ఆధ్యాత్మికవిషయాలను గాని, భగవత్తత్వాన్ని - భగవంతుని వైభవాన్నిగాని, కథలనుగాని ప్రశాంతమైన, నిర్మలమైన మనస్సుతో నిరంతరం మననం చేస్తూ ఉండటమే నిజమైన మౌనం. అలా మననం చేసుకుంటూ ఉండేవానికి ఇతరులతో మాట్లాడవలసిన అవసరమే ఉండదు; మాట్లాడటం కుదరదు. అందువల్ల సరికాని విషయాలకు ఆస్కారం లేదు. 🌸 ఒకవేళ తప్పనిసరైతే ఒకటిరెండు మాటలు క్లుప్తంగా మాట్లాడినా ఫరవాలేదు. అసలు ముఖ్యంగా గమనించవలసింది ఒక్కటే. మనం ఆధ్యాత్మికత సంబంధ విషయాలే ప్రీతి. మూగబోవాల్సింది మనస్సేగాని వాక్కు కాదు అని గ్రహించాలి. అసలైన మౌనం అంటే అంతరమౌనం. వాక్కును పరావాక్కునందు లయంజేసి 'ఆ పరబ్రహ్మను నేనే' అని గ్రహించి అలా ఉండిపోవటమే నిజమైన మౌనం. 🌸 ధ్యాని వాక్కును ఆధీనంలో ఉంచుకొని ఉండాలి. మనసును ఆలోచనల నుండి విశ్రాంతి ఇవ్వటమే నిజమైన మౌనం. ఇది తెలుసుకొని చేస్తేనే ధ్యానికి తను ఎవరో తెలుసుకుని, తనని పొందగలుగుతారు. అంతర మౌనం తో ఇదంతా సాధ్యపడుతుంది. Thank you....💖💚💖 All is well..... 💚💖💚 🍀🌸💖💚🧚‍♂💚💖🌸🍀

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
Venkatesh Ganji May 19, 2019

+7 प्रतिक्रिया 3 कॉमेंट्स • 4 शेयर
m.sreenivasareddy May 19, 2019

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
ఆమ్మలు May 17, 2019

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 10 शेयर
Rajashekar Reddy May 18, 2019

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
Venkatesh Ganji May 17, 2019

+6 प्रतिक्रिया 1 कॉमेंट्स • 3 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB