मायमंदिर फ़्री कुंडली
डाउनलोड करें
durgaprasad
durgaprasad Jun 12, 2019

Hai friendd

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 9 शेयर
ఆమ్మలు Jun 17, 2019

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Rambabu Bachina Jun 17, 2019

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
Gopalam Ravi kumar Jun 17, 2019

శ్రీ మహా విష్ణు లీలామృతమ్ శ్రీకృష్ణావతారం-38 మధ్యాహ్నం వేళకు యమునాతీరం చేరుకున్నారంతా. దాహం తీర్చుకోదలచి, బలరామకృష్ణుల సహా యమునలోకి దిగారు. కాళ్ళూ చేతులూ కడుక్కున్నారు. దోసిటపట్టి నీరు తాగి దాహం తీర్చుకున్నారు. కాస్సేపు నదీతీరాన చెట్లనీడల్లో విశ్రమించి, సేదదీరారు. బలరామకృష్ణుల్ని రథం మీద కూర్చోబెట్టి, తానూ దాహం తీర్చుకునేందుకు యమునలోకి దిగాడు అక్రూరుడు కంటిన్ మున్ను రథంబుపై; జలములోఁ గంటిం దుదిం గ్రమ్మఱం గంటిం దొంటి రథంబుమీఁద; నిదె యీ కల్యాణచారిత్రు లే వెంటం దోఁచిరి రెండు దిక్కుల; మనోవిభ్రాంతియో? నీటిలో నుం టాశ్చర్యము; చూతు నంచు మఱియు న్నూహించి మగ్నాంగుఁడై. “ముందు రథంలో చూసాను. తరువాత నీటిలో వీక్షించాను. మళ్ళీ వారు ముందటి లాగే రథం మీదనే ఉండడం దర్శించాను. మంగళ స్వరూప గుణులైన రామకృష్ణులు ఎలా ఇక్కడ అక్కడా రెండు చోట్లా కనపడ్డారు. నా మనస్సు ఏమైనా భ్రమ పడిందా? నీళ్ళలో వీళ్ళుండడం ఆశ్చర్యంగా ఉంది. ఇంకోసారి చూస్తాను” అని తలంచి, తిరిగి నదీజలాలలో మునిగాడు. అక్రూరుడు తక్కువవాడు కాదు బం ధువులను పోషించేవాడూ, యాదవులలో గొప్పవాడూనూ. ఆయన ఆ నదీ జలాలలో అశేషమైన విశేషాలు గల ఆదిశేషుణ్ణి దర్శించాడు. ఆ ఫణీంద్రుడు సద్భాషణాశీలం కల వాడు; వేయితలలపై ప్రకాశించే విభూషణాలు కలవాడు; నాగులకు ప్రభువు; మహారాజ వేషము ధరించినవాడు; దయార్ద్ర హృదయుడు; శత్రుసైన్యాన్ని జయించు శీలం గలవాడు; నిత్యం సంతోషంగా ఉండు వాడు; కోపం లేనివాడు; నిష్కళంకుడు. నల్లని వస్త్రాలు ధరించి సిద్ధులు నాగులు మొదలైన వారిచే చక్కగా స్తుతింపబడుతున్న ఆ సర్పరాజును అక్రూరుడు కనురెప్పలు ఆర్పకుండా చూసాడు. ఇంకా, ఆ అక్రూరుడు; ఆదిశేషుణ్ణి పానుపుగా చేసుకుని ఆ పానుపు మధ్య భాగంలో శయనించి ఉన్న అందాలగని అయిన పురుషోత్తముడిని దర్శించాడు. ఆ దివ్యపురుషుడు మెరిసిపోతున్న పసుపుపచ్చని పట్టువస్త్రం కట్టుకుని ఉన్నాడు. మేఘంలో మెరిసే మెరుపు లాగ, అతని వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఒప్పుతున్నది. మూగిన తుమ్మెదలు చెదరగా ఆయన నాభికమలంలో ఆ నాలుగు ముఖాల నందనుడు క్రీడిస్తున్నాడు. ఆ పురుషోత్తముడు కాలు కదపకుండానే, కాలిఅందెలు ఎన్నో పదక్రమాల విశేషాలతో వేదనినాదాలు వెలువరిస్తున్నాయి. ఆయన బ్రహ్మ, ఈశ్వర, సనక సనందన, సద్బ్రాహ్మణ, దేవతల చేత స్తుతింపబడుతుండే వాడు. రమ్యమైన శుభలక్షణాలు గల గోళ్ళు, పాదములు, మడములు, మోకాళ్ళు, పిక్కలు, తొడలు, కటిప్రదేశము, నాభి, నడుము, కడుపు కలవాడు; ఆదరముతో కూడిన వాడు; శ్రీవత్సమనే పుట్టుమచ్చ, కౌస్తుభము అనే మణి, వనమాల అనే పేరు గలిగిన పూవులు ఆకులు చేర్చి కట్టి మెడ నుండి కాళ్ళ వరకు వ్రేలాడు మాలతో విరాజిల్లే వెడల్పైన రొమ్ము కలవాడు; తెల్లతామరల వంటి కన్నులు కలవాడు; సత్త్వగుణ సంపన్నుడు; జందెము, మొలతాడు, ముత్యాలపేరు, భుజకీర్తులు, అందెలు, కంకణాలు, మకరకుండలాలు, కిరీటము మొదలైన ఆభరణాలతో అలంకృత మైనవాడు; భక్తులను కాపాడేవాడు; చక్కని చెక్కిళ్ళు, నొసలు, ముక్కు, పెదవి, ముఖము చెవులు కలవాడు; నీలమేఘము వంటి దేహకాంతి కలవాడు; ప్రహ్లాదుడు, నారదుడు, సునందుడు, నందుడు మున్నగువారిచే పూజింపబడుతూ ఉండువాడు; లక్ష్మి, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇల, ఊర్జ, విద్య, అవిద్య, శక్తి, మాయ మున్నగు తేజోమూర్తులు శక్తులచే సేవింపబడేవాడు అయిన ఆ పరమాత్మునికి అక్రూరుడు మ్రొక్కాడు. భక్తిసంభ్రమాలతో తటాలున చేతులు జోడించి డగ్గుత్తికతో స్తోత్రం చేసాడు. లక్ష్మీనాథుడవైన శ్రీకృష్ణా! దాహం తీర్చుకోడానికి జలము వలె తోచే ఎండమావులకు ఆశపడినట్లు స్వప్న సమానము లయిన పుత్రులు మిత్రులు కళత్రములు గృహములు మొదలైన జంజాటము సత్యమని భావిస్తుంటాను. నేను మూఢుణ్ణి మిథ్యాతత్త్వజ్ఞుణ్ణి ఇలాంటి నాకు ప్రకాశించు నీ పాదాల జంటను చూపి కరుణతో కటాక్షించు.” అని మరల మరల తనను స్తోత్రం చేస్తున్న అక్రూరుడికి తన పూర్వరూపం చూపి నటుడు తన పాత్ర పోషణ అయ్యాక ఆ వేషాన్ని తెరమరుగైనట్లు, తిరిగి దానిని మరగుపరచి భగవంతుడు అంతర్ధానం అయిపోయాడు. అక్రూరుడు నీటి నుండి బయటకు వచ్చి ఆశ్చర్యపోతూ వచ్చి రథాన్ని అధిరోహించాడు. అప్పుడు కృష్ణుడు అతనితో ఇలా అన్నాడు. భగవదనుగ్రహం పొంది, దాహాన్ని తీర్చుకుని వచ్చాడు అక్రూరుడు. రథాన్ని అధిరోహించాడు. ముందుకుపోనిచ్చాడు. రథం నడుస్తోంటే అతని దగ్గరగా వచ్చి “నీళ్ళు దగ్గరలోనే ఉన్నాయి కదా. నీవు స్నానానికి వెళ్ళి చాలా సేపయింది. ఆకాశంలోనూ, భూమిలోనూ లేని వింతలేమైనా నదీజలాలలో కాని కన్పించాయా? ఇలా అడిగిన కృష్ణుడితో అక్రూరుడు ఇలా అన్నాడు ‘కనిపించింది కృష్ణా! సర్వం శ్రీహరిమయం అనిపించింది. ఈ జన్మకి ఇది చాలు.’’ అన్నాడు అక్రూరుడు. వారలా మాట్లాడుకుంటూ మధురాపురం పొలిమేరలకు చేరుకున్నారు. అప్పటికి సూర్యాస్తమయం అయింది. ఓ ఉద్యానవనం ముందు రథాన్ని నిలిపాడు అక్రూరుడు. అప్పటికే అక్కడకి చేరుకున్న నందుడు మొదలయిన యాదవప్రముఖులంతా బలరామకృష్ణులను చుట్టుముట్టారు. అన్నతో సహా రథాన్ని దిగాడు కృష్ణుడు.‘‘అక్రూరా! ఈ రాత్రి ఇక్కడే ఈ ఉద్యానవనంలో విడిది చేస్తాం. రేపు పట్టణంలోకి ప్రవేశిస్తాం. మీరిక వెళ్ళొచ్చు.’’ చెప్పాడు. ‘‘నిన్ను విడచి వెళ్ళలేను కృష్ణా! నువ్వు లేకుండా మధురాపురంలో అడుగుపెట్టలేను. నేను నీ భక్తుణ్ణి. “లక్ష్మీసంపన్నుడవైన శ్రీకృష్ణా! నీవు మా యింటికి రావాలి, నీ పద్మాలవంటి పాదాల ధూళి సోకి మా యిల్లు పావనము అవుతుంది, నీ బంటునైన నన్ను ఆమాత్రం ఆదరింపకూడదా?” ఈ రాత్రి నా ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించు. దయచేసి నన్ను కరుణించు.’’ ప్రార్థించాడు అక్రూరుడు ‘‘నీ కోరిక తప్పకుండా తీరుస్తాను, అయితే ఇప్పుడు కాదు, త్వరలో. ముందు నేను వచ్చిన పని చక్కబెట్టనీ.’’ అన్నాడు కృష్ణుడు. సరేనన్నాడు అక్రూరుడు. శలవు తీసుకున్నాడు. నిష్క్రమించాడక్కణ్ణుంచి. కంసుణ్ణి సందర్శించాడు. బలరామకృష్ణుల్ని వెంటబెట్టుకుని వచ్చానని చెప్పాడతనికి. కుట్ర ఫలించినందుకు సంతోషించాడు కంసుడు. రజకుని రగడ శ్రీకృష్ణుడు అల్లంతదూరంలో అగడ్తలు, కోటలు, బురుజులు, పతాకాలు, రాజభవనాలు, వీధులు, గుఱ్ఱాలు, రథాలు, వీరులు, ఏనుగులు, మేడలు, వాద్యాలు, యువతులు, ధాన్యాలు, ధనాలు, గొప్ప గొప్ప ఉద్యాన వనాలు, నడబావులు మున్నగు వాటి అత్యద్భుతమైన శోభతో ఒప్పునట్టి మధురను చూసాడు. బలరామకృష్ణులు మధురపురానికి రావడం అదే మొదటిసారి. ఆ కారణంగా చాలా సంతోషంగా ఉన్నారిద్దరూ. పైగా తమ తల్లిదండ్రులు, మేనమామ కలగసిన ఊరు. ఆ నేలతో తెలియని అనుబంధం ఉన్నదనిపించింది. పురవీధులు తిరగాలనిపించింది. బయల్దేరారిద్దరూ. మధుర ఎంతో బాగుంది. వైభవంగా ఉంది. ఎటు చూసినా ఐశ్వర్యం కనిపించసాగింది. ఒకరి చేయి ఒకరు పట్టుకుని తిరుగుతున్న బలరామకృష్ణుల్ని చూసి, మధురాపురవాసులు వారెవరో ఇట్టే గుర్తించగలిగారు. అలా చూసి, బలరామకృష్ణులు ఆ పట్టణంలో ప్రవేశించి సంచరిస్తున్న సమయంలో. . . “ఓ రమణులారా! నందుడి తపస్సుకు ఫలముగా కలిగిన వాడు, మేలిగుణాల ప్రోవు అయిన వాడు, గొల్ల పడచుల నోముల పంట ఐన వాడు, లక్ష్మీదేవి హృదయానికి ఆనందం కూర్చేవాడు, కరుణాసముద్రుడు, యోగులు అందరూ తమ మనస్సులో కోరుకునే అపురూపమైన పెన్నిధి వంటివాడు అయిన శ్రీకృష్ణుల వారు వస్తున్నారు. కన్నుల కాంక్ష తీరేలా వెళ్ళి వీక్షిద్దాము రండి” అంటూ ఆ మథురానగర కాంతలు శ్రీకృష్ణుని చూడాలనే ఆసక్తి తోకూడిన తొందరలో ఒకరినొకరు పిలుచుకుంటూ, భోజనాలు చేసి, భోజనపాత్రలను మూలకి తోసేసి, పడుకుని లేచి, తలంటుస్నానాలుచేసి చేయక, పెద్దలు వారిస్తున్నా వినిపించుకోకుండా, ఇంటి పనులలో నిమగ్నలై మెసలకుండా, భర్తలను సేవించడంలో మనసు లగ్నం చేయకుండా, ఎత్తుకున్న బిడ్డలను దింపేసి, ఒండొరుల బట్టలు, ఆభరణాలు, పువ్వులు, గంధాలు అలంకారాలు చేసేసుకుని, అవి జారిపోతున్నా లెక్కచేయకుండా బయలుదేరిపోయారు. అలా కృష్ణసందర్శన వాంఛా తొందరలలో, ఆ పట్టణంలో ఉండే పడతులు అందరూ రత్నాలు, కూర్చిన ఎత్తయిన బంగారు మేడలపై గుంపులు గూడి, విశాలమైన వక్షము కలవాడూ తామరరేకుల వంటి కన్నులు కలవాడూ అయిన శ్రీకృష్ణుణ్ణి వీక్షించారు. “రాకాసి పూతన ప్రాణాలు తోడేసేలా స్తన్యపానం చేసిన అసాధ్యపు అర్భకుడు వీడేనటే; నందుని ఇల్లాలికి తన నోట్లో విశ్వమంతా చూపించిన ముద్దుబిడ్డడు వీడేనటే; మందలో వెన్నలు అన్నీ దర్పంగా దొంగిలించి భక్షించిన దొంగ వీడే నటే; గొల్లకన్నెల మనసుల ఆసక్తి రగిల్చి మానాలను కొల్లగొట్టిన భువనైక సుందరుడు వీడేనటే; ఇతడు లేని ఊరు ఉత్త అరణ్యమేలే; ఇతడిని కలియని జన్మ మెందుకూ పనికిరానిదేనే; ఇతడిని పలకరించని పలుకు పక్షి కూతలేనే; ఇతడిని దర్శంచని చూపులు వట్టి వ్యర్ధములేనే. ఓ చెలీ! బాలక శ్రేష్ఠుడైన ఈ కృష్ణుడిని గోపకన్యలు నిత్యం ధ్యానిస్తూ, కీర్తిస్తూ, చేతిలో ఉసిరికాయ ఆట వంకతో పిలిచి తాకుతూ, పిలుస్తూ, సంభాషిస్తూ, నవ్వుతూ, లాలిస్తూ ఆనందిస్తుంటారు. ఇంతటి ఆదరాన్ని అందుకోడానికి పూర్వజన్మలలో చేరలేని ఏ చోటులకు చేరి, ఎంతటి నోములు నోచారో కదా” అంటూ ఓ పరీక్షన్మహారాజా! ఆ నగర వనితలు సంతోషంతో పూలు జల్లుతూ, అదేపనిగా ఆయన రూపాన్ని కళ్ళతో ఆస్వాదిస్తూ, తమ హృదయములలో కృష్ణుడి రూపాన్ని ప్రతిష్ఠించుకున్నారు. ఇంకా. . . ఆ మధురానగరంలోని బ్రాహ్మణులు అనేక రకాల సువాసన ద్రవ్యాలు, పూలు, పండ్లు మున్నగువాటిని; శుభకరములైన పచ్చని అక్షతలనూ కానుకలుగా ఇస్తూ ఉత్తములైన ఆ వసుదేవకుమారులను ఉత్సాహంగా పూజించారు. బలరామకృష్ణుల్ని చూసి జన్మ తరించందనుకున్నారు. మహదానందం చెందారు. భక్తితో నమస్కరించారు. పూలూ, గంధాక్షితలూ చల్లి పూజించారు. కంసునికి రోజులు దగ్గరపడ్డాయి. అందుకే బలరామకృష్ణులు వేంచేశారనుకున్నారు యోగులు.తిరుగుతూ తిరుగుతూ ఓ మలుపు దగ్గరకు చేరుకున్నారు బలరామకృష్ణులు. అక్కడ వారికి ఓ రజకుడు కనిపించాడు. కంసుని బట్టలుతికేవాడతను. మహారాజూ, అతని పరివారం ధరించేందుకు రకరకాల రంగు రంగుల దుస్తులు ఉన్నాయి అతని దగ్గర. చలువజేసి, చక్కగా మడతలుబెట్టి ఉన్నాయి. వాటిని ధరించాలనిపించింది బలరామకృష్ణులకు. గోకులంలో పెరిగారు. ఆలమందలను కాచుకుంటూ తిరిగారు. ఎన్నడూ అలాంటి వస్త్రాలు ధరించలేదు. సరదాపడ్డారిద్దరూ. ‘‘ఇదిగో నీ దగ్గర బలే మంచి మంచి దుస్తులు ఉన్నాయి. మేము వాటిని ధరించాలనుకుంటున్నాం. ఓ రెండు జతలివ్వు.’’ అడిగారు.సమాధానంగా పగలబడి నవ్వాడు రజకుడు. కంసునిలాగే వాడు కూడా దుష్టుడు. మదాంధుడు. బలరామకృష్ణులను అవమానించాడతను.‘‘గోవులు కాచుకునే మీకు రాజదుస్తులు కావాలా? తప్పు తప్పు. తప్పుకోండి.’’ అన్నాడు. ‘‘ఈ దుస్తులు కంసమహారాజే ధరించాలి. వీటిని ధరించే అర్హత, అందం, చందం అతనికే ఉన్నాయి.’’ అన్నాడు. ఆ మాటలకి కృష్ణుడికి కోపం వచ్చింది. రజకుణ్ణి కోపంగా చూశాడతను. ఆ రజకుడు అలా బీరంతో రెచ్చిపోవడంతో, పొగరుబోతుతనంతో తెలివితప్పి మెలగడంతో, భయంకర మైన తన అరచేత్తో ధీరుడైన శ్రీకృష్ణుడు తల తెగిపడేలా కొట్టాడు. అది చూసిన నగరంలోని ప్రజల గుండెలు పగిలిపోయాయి. దెబ్బకి వాడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అలా నేలకూలిన రజకుని చూసిన వాడి మనుషులు బట్టలు అక్కడే వదిలేసి భయంతో పారిపోయారు. అప్పుడు బలరాముడు కృష్ణుడు తమకు కావలసిన బట్టలు కట్టుకుని, కొన్ని గోపకుల కిచ్చి ముందుకుసాగారు. అటు పిమ్మట ఆ దారిలో వస్తున్న ఒక నేతపనివాడు వసుదేవుడి కుమారులైన రామకృష్ణులను చూసి వారు మెచ్చుకొనేలా మిక్కిలి మెత్తనైన రంగు రంగుల వస్త్రాభరణాలను పరమ సంతోషంతో ఇచ్చాడు. శూరులైన రామకృష్ణులు ఆ వస్త్రాభరణాలను దయతో స్వీకరించి అలంకరించుకుని సింగారింపబడిన దిగ్గజాల గున్నల మాదిరి అందగించారు. పిమ్మట కృష్ణుడు ఆ నేతపనివాడి పరిచర్యకు మిక్కిలి సంతుష్టుడు అయ్యాడు. వాడికి సకల ఐశ్వర్యాలను అనుగ్రహించి, తన సారూప్యమును సంపత్తినీ ప్రసాదించాడు. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే శ్రీ మహా విష్ణు దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Gopalam Ravi kumar Jun 15, 2019

శ్రీ మహా విష్ణు లీలామృతమ్ శ్రీకృష్ణావతారం-37 పద్మముల వంటి కన్నులు కలవారు, చక్కటి వన్నెగల మేనులు కలవారు, వెల్లివిరిసే ప్రకాశము కలవారు, పచ్చని నల్లని క్రొంగొత్త వలువలు ధరించినవారు, పూలదండలు దాల్చినవారు, ధైర్యవంతులు, యువతుల పాలిటి నవమన్మథాకారులు, సకల జనులు మెచ్చుకొనే మర్యాదస్తులు అయిన శ్రీకృష్ణ బలరాములు అక్రూరుడు చేరే సరికి చక్కగా అలంకరించుకొని పాలు పితికే శాలలలో ఉన్నారు. అక్కడ వారిని అక్రూరుడు చూసాడు. వారిద్దరూ బలరామకృష్ణులని గ్రహించాడు. అంతే! రథం దిగి, పరుగు పరుగున వెళ్ళి బలరామకృష్ణులకు సాష్టాంగప్రణామం చేశాడు. వారి పాదపద్మాలను కళ్ళకు అద్దుకున్నాడు ఎప్పుడయితే బలరామకృష్ణుల పాదాలను స్పృశించాడో అప్పుడే తన పాపాలన్నీ మటుమాయం అయి, తాను పరిశుద్ధుడయినట్టుగా భావించాడు అక్రూరుడు. ఆనందం అతని శరీరం అణువణువునా పొంగిపొర్లింది. నోట మాటరాలేదతనికి. తమను చూస్తూ కన్నీరుపెట్టుకుంటున్న అక్రూరుణ్ణి లేవనెత్తారు బలరామకృష్ణులు. గట్టిగా కౌగలించుకున్నారతన్ని. శిరస్సు నిమిరారు. రండంటూ ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఉచితాసనం చూపించి, అర్ఘ్యమూ పాద్యమూ సమర్పించారు. కుశలప్రశ్నలు వేశారు. షడ్రషోపేతమయిన విందు ఏర్పాటు చేసి, భోజనానంతరం పట్టుపాన్పుపై పవళింపజేశారు. విశ్రాంతి తీసుకుని, మేల్కొన్నాడు అక్రూరుడు. అప్పుడతనితో ఏకాంతంగా సంభాషించారు బలరామకృష్ణులు.‘‘అక్రూరా! క్రౌర్యం లేని నిన్ను అక్రూరుడని వ్యవహరించడం సముచితం. పుణ్యాత్ముడవు. సదాచార సంపన్నుడవు. చెప్పు, నువ్వు వచ్చిన పని ఏమిటి?’’ అడిగాడు బలరాముడు.‘‘మధురానగరంలో అంతా కుశలమే కదా? పూజ్యులు మా తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు క్షేమమే కదా?’’ అడిగాడు శ్రీకృష్ణుడు. ‘‘మా మేనమామ కంసుడు ఏమంటున్నాడు? మధురానగరప్రజలు అతని బాధలు తట్టుకోగలుగుతున్నారా?’’ బలరాముడు అడిగాడు. అన్నదమ్ములిద్దరూ అడిగిన ప్రతిప్రశ్నకూ చక్కని సమాధానాలిచ్చాడు అక్రూరుడు. తర్వాత అసలు విషయం, కంసుడు ధనుర్యాగం తలపెట్టిన సంగతీ, బలరామకృష్ణులను అతను ఆహ్వానించిన సంగతీ చెప్పాడు. ‘‘దగ్గరుండి మిమ్మల్ని మధురకు తీసుకుని వెళ్ళేందుకే నేను వచ్చాను. మీరు వస్తారని ఆశిస్తున్నాను.’’ అన్నాడు అక్రూరుడు.‘‘మీరిద్దరూ వసుదేవుని బిడ్డలని కంసునికి తెలిసిపోయింది. నారదమహాముని ఈ సంగతి చెప్పేశాడు. మిమ్మల్ని మట్టుబెట్టే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ ధనుర్యాగం.’’ అన్నాడు అంతలోనే.‘‘తప్పని పరిస్థితుల్లో నేను మీకు దూతనయ్యాను. అంతేగాని, అన్యథా నన్ను భావించవద్దు.’’ అని వేడుకున్నాడు. ఆ మాటలకి బలరామకృష్ణులు నవ్వుకున్నారు. అక్రూరుడు సహా బలరామకృష్ణులు తండ్రి నందగోపుణ్ణి సమీపించారు. కంసరాజు ఆజ్ఞను తెలియజేశారతనికి. కంసునికి నందుడు సామంతుడు. రాజాజ్ఞను ధిక్కరించలేడతను. ఇటువంటి కార్యాలప్పుడు, సామంతరాజుగా ఆహ్వానాన్ని అందుకుని పరిజనులతో వెళ్ళి కానుకలను సమర్పించి తీరాలి. అది ఆచారం. అందుకని నందుడు మధురకు వెళ్ళేందుకు సన్నద్ధుడయ్యాడు. తోడుగా యాదవప్రముఖులను తరలిరమ్మని చాటింపు వేయించాడు. బలరామకృష్ణుల ప్రయాణం అక్రూరుడు రథాన్ని సిద్ధం చేశాడు. బలరామకృష్ణులను ఆహ్వానించాడు. వారొచ్చి, రథాన్ని అధిరోహించారు. అధిరోహించి, పక్కపక్కన కూర్చున్న ఆ ఇద్దరూ బుధ, శుక్రుల వలె మహాతేజస్సుతో వెలిగిపోసాగారు. అక్రూరుడు సారథి అయి, రథాన్ని ముందుకు పోనిచ్చాడు. నందుడు మొదలయిన యాదవ ప్రముఖులు అతన్ని అనుసరించారు. రథాలు మెల్లగా నడుస్తున్నాయి. బలరామకృష్ణులు మధురకు ప్రయాణ మయ్యారని తెలిసి, గోపికలు పరుగు పరుగున వచ్చారక్కడకి. ప్రయాణిస్తున్న రథానికి అడ్డుగా నిలిచారు. కన్నీరు పెట్టుకుని, కన్నయ్యను చూశారు. హరినవ్వుల్ హరిమాటలున్ హరిమనోజ్ఞాలాపముల్ లీలలున్ హరివేడ్కల్ హరిమన్ననల్ హరికరాబ్జాలంబనాహ్వానముల్ హరిణీలోచన లందఱున్ మఱి యుపాయం బెట్లొకో యంచు లో నెరియన్ ముచ్చటలాడి రంత గములై యేకాంత గేహంబులన్. శ్రీకృష్ణుడి మాటలూ, చిరునవ్వులూ, మనసులు హరించే సరస సల్లాపాలు, విలాసాలూ, వినోదాలూ, ఆదరాభిమానాలూ, ఆయన తన చేతితో పట్టుకుని పిలుచుటలూ ఇవన్నీ ఇకపై అనుభవించే ఉపాయాలు ఏమిటా అని ఆ లేడికన్నుల గొల్లభామినులు ఖిన్నలై కుములుతూ ఏకాంతగృహాలలో కలుసుకుని చర్చించుకున్నారు. ఇంకా వారు తమలోతాము ఇలా అనుకున్నారు. “బ్రహ్మదేవుడు నిష్ఠగల సంసారి అని చాలా గట్టిగా నమ్మాము గదమ్మా! తీరా చూస్తే, ఆయనలో ఏమాత్రం ధర్మం లేదు, మన కృష్ణుడు, మన ప్రభువు, పుండరీకాక్షుడిని ఇక్కడ ఉండనీయకుండ వేరొకచోటికి పోయేలా చేసి చిన్నపిల్లల ఆట్లాడుతున్నాడు చూడు. అయ్యో! ఆయన ఇల్లాలు సరస్వతీ దేవితో ఐనా ఈ దుండగపు చేష్టలను చెప్పండే.” ఆ గోపకాంతలు ఇంకా ఇలా అనుకున్నారు “రమ్మని పిలగానే మధురకు పయనమౌతున్నాడు కానీ మన కమలాక్షుడు మన కన్నయ్య “నన్ను ఈ భామలు నమ్ముకుని ఉన్నారే, అటువంటి మనల్ని మదనబాణాల పాలు చేస్తే, ఎంతో తాపంతో కుమిలిపోతారు కదా” అని అనుకోలేదు. పోనీ మన అమ్మలక్కలు మన గొల్ల పెద్దలు మధురకు వెళ్ళవద్దని మాధవునితో మాటవరసకైనా అనటం లేదు కదా. అక్రూరు డని పేరు పెట్టుకుని మా హృదయేశ్వరు డైన కృష్ణుణ్ణి ఇవాళ మా నుండి దూరంగా తీసుకువెళ్ళడానికి వచ్చాడు. ఇతగాడు అక్రూరుడు కాదు నిజానికి క్రూరుడే. అక్రూరుడైతే కుటిల ఆలోచనలు మానేసి, మన కృష్ణుణ్ణి దిగవిడచి తన దారిని తాను వెళ్తానని అనుకునే వాడు కదా. ఇలా అనుకుంటూ ఆ గొల్లభామలు మదనతాపంతో కంది భ్రమచెందారు. తమ కొప్పులు, కోకలు జారిపోడం కూడా చూసుకోవడం లేదు. “మా కృష్ణుణ్ణి ఎందుకు తీసుకుపోతావని అక్రూరుణ్ణి ప్రార్ధిద్దామా లేకపోతే ఆ నందనందనుడిని పోనీయకుండా ఇక్కడే ఉంచమని దేవతలను పూజిద్దామా” లేదా “ఓ దేముడా!” అంటూ ఆ హరి కాళ్ళకే అడ్డం పడదామా అనుకోసాగారు. వనితలు సిగ్గులు విడిచి రెండు కళ్ళమ్మట బొటబొటా కన్నీరు కారుస్తూ మైమరచి తమ చిక్కని చెక్కిళ్ళమీద కరకమలాలు చేర్చి గాలికి కంపించే తీగల వలె “ఓ గోవిందా! మాధవా! దామోదరా! మమ్ము దయతో కాపాడు” అంటూ స్వరబద్ధంగా తాళబద్దంగా రాగాలు తీస్తూ పాటలు పాడుతూ ఏడ్చారు నిన్ను వదలి క్షణం కూడా ఉండలేమన్నారు. వద్దువద్దన్నట్టుగా కూలబడ్డారు. వారిని సముదాయించడం ఎవరి వల్లా కాలేదు.‘‘నిన్ను చూడకుండా నిముషం కూడా ఉండలేం. నీతోపాటు మమ్మల్ని కూడా తీసుకునిపో కృష్ణా’’ ప్రార్థించారు గోపికలు. రథం దిగిరమ్మనట్టుగా అతని చేయిపట్టుకున్నారు. సున్నితంగా విదలించుకున్నాడు కృష్ణుడు.‘‘త్వరలో వచ్చేస్తాను. మధురకు నా దేహమే ప్రయాణిస్తోంది. నా మనసు ఇక్కడే ఈ వ్రేపల్లెలోనే ఉంది.’’ అన్నాడు. పేరు పేరునా గోపికలను బుజ్జగించి, బయల్దేరాడు. అంతలో యశోద, రోహిణి వచ్చారక్కడకి. బలరామకృష్ణుల నొసట తిలకాలు దిద్ది, హారతులిచ్చారు. పిల్లలకు ఏ ఆపదా రాకూడదని దేవుళ్ళను ప్రార్థించారు. వారిని ముద్దిడి దీవెనలిచ్చారు. అంతా ఊరి సరిహద్దుల దాకా వచ్చి, బలరామకృష్ణులను సాగనంపి, వెను తిరిగారు. పాపం యశోదాదేవి దుఃఖమునకు అంతేలేదు. ప్రతిక్షణం ఆ కృష్ణుడిని తలుచుకోవడం తప్ప, అసలు ఆవిడకి జీవితమే లేదు. అంత ప్రేమించిన తల్లి. అక్కడ కంసుని వలన, ఏ ప్రమాదము వస్తుందోనని, ఆమె బెంగపెట్టుకుని ఉంది. దూరంగా రథం వెళ్ళిపోయి, ఆ ధూళి రేగుతుండగా, పతాకం కనిపించినంతసేపు ఉండి, తిరిగి యిళ్ళకు వచ్చేశారు ర థం వేగం పుంజుకుంది. అక్రూరుడు రథాన్ని వాయువేగంతో నడపసాగాడు. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే శ్రీ మహా విష్ణు దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం

+18 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Sriram Jun 15, 2019

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
lakshmi Jun 15, 2019

శ్రీమద్భాగవతం ప్రథమస్కంధం తొమ్మిదో అధ్యాయం భీష్ముని నిర్యాణం ******************************************** 9. భీష్ముని నిర్యాణము అలా ప్రజాద్రోహి భయంతో బాధపడ్డాడు ధర్మరాజు . భీష్ముడి దగ్గర ధర్మ తత్వం తెలుసుకోవడం కోసం కురుక్షేత్రం బయలుదేరాడు. అక్కడ అంపశయ్యమీద పడి ఉన్నాడు భీష్ముడు. ధర్మరాజు తమ్ములూ, వ్యాసుడూ, ధౌమ్యుడూ, మొదలైన బ్రాహ్మలూ మంచి మంచి గుర్రాలు పూన్చిన బంగారపు రథాలెక్కి ధర్మరాజు వెంట బయలుదేరారు. అర్జునుడితో కలిసి కృష్ణ భగవానుడూ రథమెక్కి అతడి వెంట బయలుదేరాడు. ఇంతమంది తోనూ గుహ్యకులతో బయలు దేరిన కుబేరుడిలా అగుపించాడు ధర్మరాజు. అలా తమ అనుచరులతోను శ్రీకృష్ణుడి తోనూ కురుక్షేత్రం వెళ్లారు . పాండవులు స్వర్గం నుంచి పడిన దేవతల్లాగా కింద శరశయ్య మీద పడున్న భీష్ముణ్ణి చూశారు. అంత మందీ అతడికి నమస్కరించారు. దేవ ఋషులు బ్రహ్మ ఋషులూ కూడా భీష్ముణ్ణి చూడడం కోసం అక్కడ ఉన్నారు. పర్వతుడూ, నారదుడూ, వ్యాసుడూ, ధౌమ్యుడూ, బృహదశ్వుడు భరద్వాజుడూ శిష్యులతో పరశురాముడూ వశిష్టుడూ ఇంద్రప్రమదుడూ, త్రితుడూ, గృత్స్నమదుడూ, అసితుడూ, కక్షేవంతుడూ, గౌతముడూ, అత్రి, విశ్వామిత్రుడూ, సుదర్శనుడూ , శుక్రుడూ మొదలైన శుద్ధ హృదయలు మహాత్ములూ శిష్యులతో కలిసి కశ్యపుడూ, బృహస్పతీ మొదలైన దివ్య మునులు క్రమంగా అక్కడికి వచ్చారు. ధర్మమూ దేశకాల విభాగమూ తెలిసిన మహనీయుడు భీష్ముడు వచ్చిన మునులందరినీ యధావిధిగా గౌరవించాడు. శ్రీకృష్ణుడి ప్రభావం అతడికి తెలుసు. మాయతో మనిషి రూపం బైట కూర్చొన్న అతడు తన హృదయంలో ఎప్పుడూ నివసిస్తూనే ఉన్నాడు. చూసి మనసులోనూ, బైటా కూడా పూజించాడు భీష్ముడు. వినయ విధేయతలతో వెళ్లి తాతగారి దగ్గర కూర్చున్నారు పాండవులు . వాళ్లందరినీ చూశాడు. అతడి రెండు నేత్రాలూ ప్రేమాశ్రువులతో నిండిపోయాయి. " నాయనలారా !" గద్గద కంఠంతో అన్నాడు భీష్ముడు " మునుల ఆశ్రయమూ, శ్రీకృష్ణుడి ప్రాపూ ఉన్నాయి మీకు. అయినా నా అష్టకష్టాలూ అనుభవించారు మీరు. ఇదే కష్టంగా ఉంది నాకు. మహారథుడు పాండు రాజు కాలం చేసినప్పటికీ మీరు చిన్న పిల్లలు. మీ కోసం మీ అమ్మ కుంతి ఎన్నో కష్టాలు అనుభవించింది . మీరు పడిన కష్టాలు అన్నింటికీ కాలమే కారణం. ఎవ్వరి చేతిలోనూ లేదది. మేఘాలు గాలి వల్ల నడిచినట్లు, దిక్పాలకులతో కూడా ఈ లోకాలు అన్నీ కాలం వల్లే నడుస్తున్నాయి . కాలగతి ఎంత చిత్రమైనదంటే, ధర్మరాజు వంటి రాజూ, గాండీవం వంటి ధనుస్సు పట్టుకున్న అర్జునుడి వంటి విలుకాడూ, గదాధరుడు స్వయం శ్రీ కృష్ణ భగవానుడి వంటి స్నేహితుడూ ఉన్న చోట కూడా ఆపద తప్పలేదు. ధర్మరాజా ! ఏ ఉద్దేశంతో ఏ పని శ్రీకృష్ణుడు చేస్తాడో తెలుసుకోవడం సులభం కాదు. పండితులు కూడా ఈ తత్వం తెలుసుకునేందుకు ప్రయత్నించి మూఢులయి కూర్చుంటారు తుదకి. కనుక అంతా దైవాధీనం అని తెలుసుకో . దైవానువర్తివికా !ఈ భావంతోనే ప్రజల్ని పాలించు. ఇదిగో ఎదుట వున్న ఈ శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు . ఇతడే నారాయణుడు తన మాయతో లోకులను మోహంలో ముంచి యాదవ వంశంలో మనిషి రూపంతో అవతరించాడు. మహారాజా ! ఇతడి ప్రభావం యెంతో రహస్యమైనది , రవ్వంత అది శివుడెరుగును, నారదుడెరుగును, కపిల మహాముని ఎరుగును, ఇతరులు యెరుగరు. మామ కొడుకు అని , నీ ప్రియసఖుడు అనీ , నీ మంత్రి అనీ , దూత అనీ అనుకుంటున్నావు ఇతణ్ణి తుదకి సారధి పనికి కూడా వినియోగిస్తున్నావు. కానీ ఇతణ్ణి ఎరుగవు నువ్వు. స్వయం పరమాత్మ యితడు. పరాపర భేదం లేదు ఇతడికి, హెచ్చు తక్కువ భావం లేదు. రాగద్వేషాలు లేవు . అహంకార భావం లేదు. యోగ్యాయోగ్యకర్మ లితడికి లేవు. మంచిచెడ్డలు లేవు. అద్వితీయుడు ఇతడు. సర్వమయుడు, సమదర్శి - అయినా భక్తవత్సలుడు . నా మీద ఎంతో అనుగ్రహం చూపాడు. నా మరణ కాలం దగ్గర పడింది. ఇది తెలిసి నాకు దర్శనమివ్వడం కోసమే ఇలా ఇక్కడికి దయచేసాడు. యోగులు భక్తి భావముతో ఇతడి పాదపద్మాలు ధ్యానిస్తూ నామసంకీర్తనము చేస్తూ ప్రాణాలు వదిలిపెడతారు. కర్మబంధాల నుంచి ముక్తి పొందుతారు. అంతటి ప్రభువు నా మరణ కాలము దాకా నా యెదుట ఉండాలి. ఇదే నా ప్రార్థన. ప్రసన్నమైన నవ్వుమొహమూ, ఎర్రటి పద్మపత్రాల వంటి నేత్రాలూ, నాలుగు చేతులూ చూస్తూ నా ప్రాణం వదిలిపెడతాను " అన్నాడు. భీష్ముడి మాటలు విన్నాడు ధర్మరాజు. అంపశయ్య మీద ఉన్న తాత గారిని మునుల అందరి ఎదుట ధర్మ సంబంధమైన ఎన్నో ప్రశ్నలు అడిగాడు . అతడు అడిగిన అన్ని విషయాలూ విడమర్చి వివరించాడు భీష్ముడు, మనుష్య జాతి సాధారణ ధర్మాలూ వర్ణాశ్రమ ధర్మాలూ వైరాగ్య ధర్మమూ నివృత్తి ప్రవృత్తి లక్షణాలూ, దానధర్మాలూ, రాజధర్మాలూ ,మోక్షధర్మాలూ, విష్ణువ్రతాలూ భాగవత ధర్మమూ ఇవన్నీ సంక్షేపముగాను, విపులముగానూ వివరించాడు. ధర్మమూ, కామమూ, మోక్షమూ, ఇవి పొందదగిన ఉపాయాలూ, వీటికి అనుగుణ్యమైన ఉపాఖ్యానాలూ తెలియజేశాడు. పరమయోగి భీష్ముడు. కోరుకోందే తనకి చావు రాదు. శరీరం వదిలి పెట్టడానికి ఉత్తరాయణం కోసం కని పెట్టుకున్నాడతడు. ధర్మరాజుకి ధర్మ రహస్యాలు చెబుతుండగా ఉత్తరాయణం వచ్చేసింది. దాంతో వాక్సంయమనంపూనాడు భీష్ముడు . ఆదిపురుషుడైన శ్రీ కృష్ణుడిమీద, పీతాంబరధారి మీద , చూపు నిలిపి ధ్యానమగ్నుడయ్యాడు. పవిత్రమైన జ్ఞానం ఉదయించిందతడికి, అతడిఅశుభాలన్నీ అంతరించాయి. అస్త్రాల వల్ల కలిగిన గాయాల వేదన కృష్ణుడి కృపాదృష్టితో శాంతించింది. ఇంద్రియాల నుంచి బ్రాంతి తొలగిపోయింది. శరీరం వదిలే ముందు అతడు కృష్ణ పరమాత్ముని స్తుతించాడు. " తృష్ణవదిలి నిర్వికారమైన నా మనసును ఈ మరణకాలంలో నేను కృష్ణార్పణం చేస్తున్నాను. ఈ యాదవ పతి స్వయం భగవానుడు. ఎప్పుడూ ఆనంద స్వరూపముతోనే విహరిస్తాడితడు లీలకోసమే ప్రకృతిని ఆశ్రయిస్తాడు . " తమాల శ్యామల శరీరం, తెల్లని పీతాంబరం, ముంగురులు ముసురుతున్న ముఖపద్మం - త్రిభువన మోహనమైన కృష్ణపరమాత్మ మీదే నా బుద్ధి నిలవాలి. రణరంగములో గుర్రాలడెక్కలతో థూళిరేగి చంచలమైన అతడి జుత్తు దుమ్ముతో నిండిపోయింది. మొహమంతా ఆయాసంతో చెమటబొట్లు చిందాయి. నేను వేసిన వాడిబాణాలు అతడికవచం దూసుకుపోయి నాటుకున్నాయి. అదుగో ఆ రూపం మీద నా మనస్సు స్థిరపడాలి. యుద్ధారంభంలో అర్జునుడు కోరిన ప్రకారము ఉభయ సైన్యాల మధ్య రథం నిలబెట్టాడతడు. చూపులతోనే శత్రుసైనికుల ఆయువు హరించాడు. ఆ కాలస్వరూపుడైన శ్రీ కృష్ణుడి మీద నా భక్తి నిలకడకావాలి. శత్రుసైన్యం చూసి అర్జునుడు బంధు వధకి భయపడ్డాడు . యుద్ధం చేయ్యనన్నాడు. అప్పుడు ఆత్మ విద్య ఉపదేశించి అతడి అహంకారమూ, అఙ్ఞానమూ, నాశనం చేసిన శ్రీకృష్ణుడి పాదాలమీద నా బుద్ధి నిలపాలి. భారతయుద్ధంలో ఆయుధంపట్టనని ప్రతిజ్ఞ చేశాడతడు . ' అతడి చేత ఆయుధం పట్టిస్తాను' అని ప్రతిజ్ఞ చేశాను నేను. భక్తవత్సలుడు అతడు. నా ప్రతిజ్ఞ నిలపడం కోసం చక్రం పట్టుకున్నాడు. రథం నుంచి కుప్పించి గెంతాడు. ఏనుగు మీదికి వురికిన సింహంలాగ నా మీదికి ఉరికాడు. అప్పుడు అతడి ఉత్తరియం ఎగిరి జారిపడింది . అతడి అడుగులు పడి భూమి వణికింది. ఆతతాయినినేను. వాడి వాడి బాణాలు అతడి మీద నటించాను కవచం పగిలి నెత్తురు ధారలు కట్టింది. అర్జునుడు అడ్డుపడుతున్నా నన్ను చంపడానికే పుంకించాడతడు అదిగో ఆ భగవంతుడు శ్రీకృష్ణుడే గతి కావాలి నాకు. అర్జునుడి రథం నోగలమీద కూర్చున్నాడు అతడు. ఒక చేత పగ్గాలూ , మరొక చేత మునికోలా పట్టుకున్నాడు. ఆ అపురూపమూర్తిని దర్శనంచేసి యుద్ధంలో ప్రాణాలు వదిలిన వాళ్ళు ఉత్తమగతి పొందారు . ఈ మరణ సమయములో ఆ దివ్య మూర్తి మీద నా మనసు లగ్నం కావాలి. అతడి లలితగతివల్ల , మధుర మనోహరమైన నవ్వువల్లా అతడి ప్రణయ దృష్టివల్లా గోపికా స్త్రీలు సన్మానితులు అయారు. మదం తో గర్వించి అతడి మీద మానమూ అభిమానమూ కనబరిచారు. అయినా వాళ్ళమీద పరిమితమైన దయా కురిపించాడు ప్రభువు. ఆ దేవదేవుడి మీద నా మనసు స్థిరపడాలి. ధర్మరాజు రాజసూయం చేసినప్పుడు మహారాజులూ మహామునులూ ఆ దివ్య మూర్తి రమణీయరూపశ్రీ దర్శించారు . ముగ్దులయ్యారు. ఆ కృష్ణ పరమాత్మ నా ఎదుట ఉన్నాడు ఇప్పుడు నా భాగ్యమే భాగ్యం. పుట్టుకే లేదు ఇతడికి. ప్రాణుల్ని సృష్టించి, అందరి హృదయాలలోనూ నివసిస్తాడు యితడు. ఒకే సూర్యుడు ఉపాధిభేదం వల్ల అనేక రూపాలుగా అవుపడినట్లు శరీరభేదం వల్ల అనేక రూపాలతో కనపడతాడు యితడు. ఆ భేద రూపంతో ఈ పరమాత్ముణ్ణి దర్శనం చేసి కృతార్ధుణ్ణవుతాను . అలా స్తోత్రం చేసి తన మనస్సూ, మాటా, చూపూ, కృష్ణుడి మీద నిలిపి ఊరుకున్నాడు భీష్ముడు. అతడి ప్రాణవాయువు అంతర్విలీనం అయిపోయింది. భీష్ముడి ప్రాణవాయువు శాంతించిందని అక్కడి వాళ్ళందరికీ అవగతమైపోయింది. పొద్దుగుంకిపోయాక పక్షులు కలకలం మాని ఊరు కున్నట్లు అంతమందీ నిశ్శబ్దంగా ఉండిపోయారు. దేవతలూ మానవులూ దుందుభి వాద్యాలతో భీష్ముడి మరణం చాటారు. అతణ్ణి వేనోళ్ళా పొగిడారు . ఆకాశం మీంచి పూలవాన కురిసింది. భీష్ముడి మృతకళేబరానికి అగ్ని సంస్కారం చేసి, క్షణకాలం శోకంతో కృంగిపోయాడు ధర్మరాజు. శ్రీ కృష్ణుడి మహిమ కళ్ళారా చూసి, అతణ్ణి ఎన్నోవిధాల కీర్తించారు మునులు. అతణ్ణి ధ్యానిస్తూ తమ తమ ఆశ్రమాలకి మళ్ళారు. శ్రీ కృష్ణుడి తో కలసి హస్తినాపురం వచ్చేసాడు ధర్మరాజు శోకసంతృప్తుడైన దృతరాష్ట్రుణ్ణి, గాంధారిని ఓదార్చాడు. ధృతరాష్ట్రుడి అనుమతీ, కృష్ణుడి అనుమోదము పొంది తన తండ్రి తాతల రాజ్యం ధర్మంతో పరిపాలించాడతడు. శ్రీమద్భాగవతం ప్రధమస్కంధం లో ఏది తొమ్మిదవ అధ్యాయం పూర్తి. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ

+3 प्रतिक्रिया 1 कॉमेंट्स • 0 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB