_*శ్రీ శివ మహాపురాణం - 149 వ అధ్యాయం*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *కుమారుని లీల* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ *బ్రహ్మ ఇట్లు పలికెను -* అపుడచట ఆ గంగా పుత్రుడు తన యందు భక్తిని కలిగించే ఒక చక్కని లీలను ప్రదర్శించెను. ఓ నారదా! ఆ లీలను ప్రీతితో వినుము. అదే సమయములో అచటకు యజ్ఞమును చేసిన శోభాయుక్తుడగు నారదుడనే ఒక బ్రాహ్మణుడు గుహుని శరణు పొందుటకు వచ్చెను. ప్రసన్నమగు మనస్సు గల ఆ బ్రాహ్మణుడు కార్తికుని సమీపమునకు వచ్చి శుభస్తోత్రములతో ప్రణమిల్లి తన అభిప్రాయమును చెప్పెను. *బ్రాహ్మణుడిట్లు పలికెను -* ఓ స్వామీ! నా మాటను వినుము. నాకిపుడు కలిగిన కష్టమును తొలగించుము. బ్రహ్మాండములన్నింటికీ ప్రభువు నీవే. అందువలననే నిన్ను శరణు జొచ్చితిని. నేను వైదిక కర్మను చేయ నారంభించితిని. నా ఇంటి వద్ద నున్న మేక త్రాటిని తెంపుకొని పారిపోయినది. అది ఎచటకు పోయినదో తెలియకున్నది. నేను చాలా వెదికితిని. కాని దొరకలేదు. దీనివలన నా క్రతువునకు పెద్ద ఆటంకము వాటిల్లినది. విభూ! నీవు ప్రభువై యుండగా యజ్ఞము భగ్నమగుట ఎట్లు సంభవము? ఓ అఖిలేశ్వరా! నీవు ఆలోచించి నా కోర్కెను పరిపూర్ణము చేయుము. ఓ శివపుత్రా! ప్రభూ! బ్రహ్మాండములన్నింటికీ ప్రభుడు, దేవతలందరిచే సేవింపబడువాడు అగు నిన్ను విడిచి నేను ఎవరిని శరణు పొందగలను ? నీవు దీనబంధుడవు. దయాసముద్రుడవు. సేవింపదగిన వాడవు. భక్తుల యందు ప్రేమ గలవాడవు. విష్ణుబ్రహ్మాది దేవతలచే స్తుతింపబడే పరమేశ్వరుడవు. పార్వతీ తనయుడవగు స్కందుడవు. అద్వయుడవు. శత్రువులను తపింప జేయువాడవు. పరమాత్మవు. శరణు గోరు సత్పురుషుల ఆత్మను రక్షించు స్వామివి. దీనుల ప్రభువగు మహేశ్వరా! శవపుత్రా! ముల్లోకములకు తండ్రియగు ప్రభూ! మాయను వశము చేసుకున్న వాడా! నిన్ను శరణు పొందితిని . విప్రులు నీకు ప్రిరయమైన వారు. నన్ను రక్షించుము. నీవు అందరికీ ప్రియుడగు ప్రభుడవు. నీవు సర్వజ్ఞుడవు. బ్రహ్మాది దేవతలు నిన్ను స్తుతించెదరు. మాయకు అధీశ్వరుడవగు నీవు మాయచే ఆకారమును దాల్చి, నీ భక్తులను రక్షించి సుఖముల నిచ్చుచున్నావు. భక్తుల ప్రాణప్రియులైన వాడా! సద్గుణ నిలయుడవగు నీవు త్రిగుణాతీతుడవు. శంభునకు ప్రియచసుతుడవగు నీవు శంభు స్వరూపడవు. సచ్చిదానందరూపుడవగు నీవు ప్రసన్నుడవై సుఖములనిచ్చెదవు. త్రిపురారి యగు శంకరుని కుమారుడవగు నీవు సర్వము తెలిసిన వాడవు. పవిత్ర ప్రేమకు నీవు సర్వదా వశుడవై యుందువు. ఆరు మోయులు గల నీకు సాధువులు, భక్తులు ప్రీతి పాత్రులు. సర్వేశ్వరుడవగు నీవు సుఖముల నిచ్చెదవు. సాధవులకు ద్రోహము చేయువారిని నీవు సంహరించెదవు. శంకరుడు నీ తండ్రి. నీవు బ్రహ్మాండములను పాలించు ప్రభుడవు. దేవతలు మొదలగు వారందరు నీ పాదములను సేవించెదరు. నీకు సేవ ప్రియమైనది. నన్ను రక్షించుము. శత్రువులకు భయమును కలిగించువాడా! శంకర స్వరూపా! జనులకు శరణునొసగి సుఖములనిచ్చే నీ పాదపద్మములకు నమస్కరించు చున్నాను. ఓ స్కందా! నా విన్నపమును నీ చెవిలో వేసుకొనుము. జనుల మనస్సులో నీ భక్తి సర్వదా ఉండునట్లు చేయుము. సర్వసమర్ధుడవగు నీవు ఎవనికి రక్షకుడవో, వానిని బలవంతుడు, సమర్ధుడు, రెండు పార్శ్యములయందు దృఢమగు రక్షణ నేర్పరుచుకున్నవాడు అగు శత్రువైననూ, తక్షకుడే అయిననూ, రాక్షసుడైననూ ఏమి చేయగలడు? అనేక గురువులను శుశ్రూష చేసినవాడైననూ నిన్ను స్తుతింప సమర్ధుడు గాడు. మంద బుద్ది అగు నేను ఎట్లు స్తుతించగలను? గొప్ప వారిచే పూజింపబడే ఓ స్కందా! నేను శుచియైననూ, కాక పోయిననూ, ఎట్లున్ననూ, నీ పాదపద్మముల పరాగమును ప్రార్థించుచున్నాను. ఓ సర్వేశ్వరా! భక్తవత్సలా! కరుణా సముద్రా! నేను నీ వాడను. సేవకుడను. ఓ మహాప్రభూ! నీ సేవకుని వంద తప్పులనైననూ నీవు లెక్కించవు. ఓ విభూ! భక్తుని అల్పమగు భక్తిని కూడా నీవు గుర్తించెదవు. నీవు భృత్యుల దుఃఖములను పోగొట్టెదవు. ఓ భగవాన్‌! నీ కంటె వేరుగా రక్షకుడు లేడు. నా కంటె ఎక్కువ మూర్ఖుడగు మానవుడు లేడు. ఓ గుహా! నీవు కల్యాణములనిచ్చి కలి దోషములను పోగొట్టెదవు. కుబేరుని బంధువగు నీ మనస్సు కరుణార్ద్రమై యుండును. మూడు ఆరుల నేత్రములతో, ఆరు ముఖములతో ప్రకాశించు నీవు నా యజ్ఞమును పూర్ణము చేయుము. ముల్లోకములను రక్షించువాడువు, శరణుజొచ్చిన వారిని ప్రేమించువాడవు, యజ్ఞ కర్తవు, యజ్ఞమును రక్షించు వాడవు అగు నీవు యజ్ఞమునకు విఘ్నమును కవలిలగించు వారిని సంహరించెదవు. సాధువుల విఘ్నములను నివారించు వాడా! సర్వ సృష్టికి కారణమైనవాడా! ఈశాన పుత్రా! నాయజ్ఞమును పూర్ణము చేయుము. నీకు నమస్కారమగు గాక! ఓ స్కందా! సర్వులను రక్షించునది నీవే. సర్వజ్ఞుడవు నీవే. సర్వేశ్వరుడవు నీవే. బ్రహ్మాండముల నన్నిటినీ పాలించునది నీవే. సర్వమును సృష్టించి రక్షించునది నీవే. దేవ దేవుడవగు నీవే సత్పురుషులకు గతి. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడవగు నీవు సర్వజ్ఞుడవు, ముల్లోకమలు కధిపతివి. ధ్యానము చేయువాడవు నీవే. ధ్యానింపబడేది నీవే. నీవు తండ్రులకు తండ్రివి. సత్పురుషులకు శరణ్యస్థానము నీవే. *బ్రహ్మ ఇట్లు పలికెనున -* దేవ దేవుడగు శివపుత్రుడు ఆతని ఈ మాటను విని వీరబాహుడను పేరు గల తన గణమును ఆతని పనికొరకై పంపెను. ఆయన ఆజ్ఞను పొంది మహావీరుడగు వీర బాహుడు భక్తితో ఆ స్వామికి నమస్కరించి మేకను వెదుకుట కొరకై వెంటనే బయులుదేరెను. ఆతడు బ్రహ్మండములన్నింటినీ వెదికిననూ ఆ మేక దొరకలేదు. అపుడాతడు ఆ మేక చేసిన అలజడిని వినెను. అతడుఅపుడు వైకుంఠమునకు వెళ్లగా అచట అది కనబడెను. మహాబలశాలియగు ఆ మేక మెడలో యూపము వ్రేలాడు చుండెను. అది అలజడిని కలిగించు చుండెను. ఆ వీరుడు దానిని మిక్కిలివేగముగా కొమ్ములయందు పట్టుకొని కూమారస్వామి ఎదుటకు దోడ్కొని వచ్చెను. ఆది పెద్ద ధ్వనిని చేయుచుండెను. దానిని చూచి, బ్రహ్మాండమునంతనూ ధరించిన మహిమ గలవాడు, గొప్ప లీలలను ప్రదర్శించువాడు, గుహశబ్దవాచ్యుడు అగు ఆ కార్తిక ప్రభుడు వెంటనే దానిని అధిరోహించెను. ఓ మునీ! ఆ మేక శ్రమ లేకుండగనే ముహూర్తకాలములో బ్రహ్మాండమునంతనూ చుట్ట బెట్టి శీఘ్రముగా మరల అదే స్ధానమునకు వచ్చెను. అపుడా స్వామి దాన నుండి దిగి తన ఆసనమునధిష్ఠించెను. ఆ మేక అక్కడనే నిలబడి యుండగా, నాదుడు ఆయనతో నిట్లనెను. *నానదుడిట్లు పలికెను -* ఓ దేవదేవా! నీకు నమస్కారము. ఓ దయానిధీ! నాకు మేకను ఇమ్ము. నేను ఆనందముతో యజ్ఞమును చేసెదను. నన్ను మిత్రునిగా చేసుకొనుము. *కార్తికుడిట్లు పలికెను -* ఓ విప్రా! మేకను వధించుట తగదు. నారదా! నీ ఇంటికి పొమ్ము. నీ యజ్ఞము నా అనుగ్రహముచే పరిపూర్ణము అగుగాక ! *బ్రహ్మ ఇట్లు పలికెను -* ఆ బ్రాహ్మణుడు ప్రభుని ఈ మాటను విని సంతసించిన మనస్సు గలవాడై ఆయనకు ఉత్తమమగు ఆశీస్సులనిచ్చి తన గృహమునకు వెళ్ళెను. *శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహిత యందు కుమారఖండలో కుమారుని అద్భుత చరితమును వర్ణించే ఆరవ అధ్యాయము ముగిసినది.*

_*శ్రీ శివ మహాపురాణం - 149 వ అధ్యాయం*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*కుమారుని లీల*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️*బ్రహ్మ ఇట్లు పలికెను -*

అపుడచట ఆ గంగా పుత్రుడు తన యందు భక్తిని కలిగించే ఒక చక్కని లీలను ప్రదర్శించెను. ఓ నారదా! ఆ లీలను ప్రీతితో వినుము. అదే సమయములో అచటకు యజ్ఞమును చేసిన శోభాయుక్తుడగు నారదుడనే ఒక బ్రాహ్మణుడు గుహుని శరణు పొందుటకు వచ్చెను. ప్రసన్నమగు మనస్సు గల ఆ బ్రాహ్మణుడు కార్తికుని సమీపమునకు వచ్చి శుభస్తోత్రములతో ప్రణమిల్లి తన అభిప్రాయమును చెప్పెను.

*బ్రాహ్మణుడిట్లు పలికెను -*

ఓ స్వామీ! నా మాటను వినుము. నాకిపుడు కలిగిన కష్టమును తొలగించుము. బ్రహ్మాండములన్నింటికీ ప్రభువు నీవే. అందువలననే నిన్ను శరణు జొచ్చితిని. నేను వైదిక కర్మను చేయ నారంభించితిని. నా ఇంటి వద్ద నున్న మేక త్రాటిని తెంపుకొని పారిపోయినది. అది ఎచటకు పోయినదో తెలియకున్నది. నేను చాలా వెదికితిని. కాని దొరకలేదు. దీనివలన నా క్రతువునకు పెద్ద ఆటంకము వాటిల్లినది. విభూ! నీవు ప్రభువై యుండగా యజ్ఞము భగ్నమగుట ఎట్లు సంభవము? ఓ అఖిలేశ్వరా! నీవు ఆలోచించి నా కోర్కెను పరిపూర్ణము చేయుము. ఓ శివపుత్రా! ప్రభూ! బ్రహ్మాండములన్నింటికీ ప్రభుడు, దేవతలందరిచే సేవింపబడువాడు అగు నిన్ను విడిచి నేను ఎవరిని శరణు పొందగలను ?

నీవు దీనబంధుడవు. దయాసముద్రుడవు. సేవింపదగిన వాడవు. భక్తుల యందు ప్రేమ గలవాడవు. విష్ణుబ్రహ్మాది దేవతలచే స్తుతింపబడే పరమేశ్వరుడవు. పార్వతీ తనయుడవగు స్కందుడవు. అద్వయుడవు. శత్రువులను తపింప జేయువాడవు. పరమాత్మవు. శరణు గోరు సత్పురుషుల ఆత్మను రక్షించు స్వామివి. దీనుల ప్రభువగు మహేశ్వరా! శవపుత్రా! ముల్లోకములకు తండ్రియగు ప్రభూ! మాయను వశము చేసుకున్న వాడా! నిన్ను శరణు పొందితిని . విప్రులు నీకు ప్రిరయమైన వారు. నన్ను రక్షించుము. నీవు అందరికీ ప్రియుడగు ప్రభుడవు. నీవు సర్వజ్ఞుడవు. బ్రహ్మాది దేవతలు నిన్ను స్తుతించెదరు. మాయకు అధీశ్వరుడవగు నీవు మాయచే ఆకారమును దాల్చి, నీ భక్తులను రక్షించి సుఖముల నిచ్చుచున్నావు.

భక్తుల ప్రాణప్రియులైన వాడా! సద్గుణ నిలయుడవగు నీవు త్రిగుణాతీతుడవు. శంభునకు ప్రియచసుతుడవగు నీవు శంభు స్వరూపడవు. సచ్చిదానందరూపుడవగు నీవు ప్రసన్నుడవై సుఖములనిచ్చెదవు. త్రిపురారి యగు శంకరుని కుమారుడవగు నీవు సర్వము తెలిసిన వాడవు. పవిత్ర ప్రేమకు నీవు సర్వదా వశుడవై యుందువు. ఆరు మోయులు గల నీకు సాధువులు, భక్తులు ప్రీతి పాత్రులు. సర్వేశ్వరుడవగు నీవు సుఖముల నిచ్చెదవు. సాధవులకు ద్రోహము చేయువారిని నీవు సంహరించెదవు. శంకరుడు నీ తండ్రి. నీవు బ్రహ్మాండములను పాలించు ప్రభుడవు. దేవతలు మొదలగు వారందరు నీ పాదములను సేవించెదరు. నీకు సేవ ప్రియమైనది. నన్ను రక్షించుము. శత్రువులకు భయమును కలిగించువాడా! శంకర స్వరూపా! జనులకు శరణునొసగి సుఖములనిచ్చే నీ పాదపద్మములకు నమస్కరించు చున్నాను. ఓ స్కందా! నా విన్నపమును నీ చెవిలో వేసుకొనుము. జనుల మనస్సులో నీ భక్తి సర్వదా ఉండునట్లు చేయుము.

సర్వసమర్ధుడవగు నీవు ఎవనికి రక్షకుడవో, వానిని బలవంతుడు, సమర్ధుడు, రెండు పార్శ్యములయందు దృఢమగు రక్షణ నేర్పరుచుకున్నవాడు అగు శత్రువైననూ, తక్షకుడే అయిననూ, రాక్షసుడైననూ ఏమి చేయగలడు?  అనేక గురువులను శుశ్రూష చేసినవాడైననూ నిన్ను స్తుతింప సమర్ధుడు గాడు. మంద బుద్ది అగు నేను ఎట్లు స్తుతించగలను? గొప్ప వారిచే పూజింపబడే ఓ స్కందా! నేను శుచియైననూ, కాక పోయిననూ, ఎట్లున్ననూ, నీ పాదపద్మముల పరాగమును ప్రార్థించుచున్నాను.

ఓ సర్వేశ్వరా! భక్తవత్సలా! కరుణా సముద్రా! నేను నీ వాడను. సేవకుడను. ఓ మహాప్రభూ! నీ సేవకుని వంద తప్పులనైననూ నీవు లెక్కించవు. ఓ విభూ! భక్తుని అల్పమగు భక్తిని కూడా నీవు గుర్తించెదవు. నీవు భృత్యుల దుఃఖములను పోగొట్టెదవు. ఓ భగవాన్‌! నీ కంటె వేరుగా రక్షకుడు లేడు. నా కంటె ఎక్కువ మూర్ఖుడగు మానవుడు లేడు. ఓ గుహా! నీవు కల్యాణములనిచ్చి కలి దోషములను పోగొట్టెదవు. కుబేరుని బంధువగు నీ మనస్సు కరుణార్ద్రమై యుండును. మూడు ఆరుల నేత్రములతో, ఆరు ముఖములతో ప్రకాశించు నీవు నా యజ్ఞమును పూర్ణము చేయుము. ముల్లోకములను రక్షించువాడువు, శరణుజొచ్చిన వారిని ప్రేమించువాడవు, యజ్ఞ కర్తవు, యజ్ఞమును రక్షించు వాడవు అగు నీవు యజ్ఞమునకు విఘ్నమును కవలిలగించు వారిని సంహరించెదవు.

సాధువుల విఘ్నములను నివారించు వాడా! సర్వ సృష్టికి కారణమైనవాడా! ఈశాన పుత్రా! నాయజ్ఞమును పూర్ణము చేయుము. నీకు నమస్కారమగు గాక!  ఓ స్కందా! సర్వులను రక్షించునది నీవే. సర్వజ్ఞుడవు నీవే. సర్వేశ్వరుడవు నీవే. బ్రహ్మాండముల నన్నిటినీ పాలించునది నీవే. సర్వమును సృష్టించి రక్షించునది నీవే. దేవ దేవుడవగు నీవే సత్పురుషులకు గతి. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడవగు నీవు సర్వజ్ఞుడవు, ముల్లోకమలు కధిపతివి. ధ్యానము చేయువాడవు నీవే. ధ్యానింపబడేది నీవే. నీవు తండ్రులకు తండ్రివి. సత్పురుషులకు శరణ్యస్థానము నీవే.

*బ్రహ్మ ఇట్లు పలికెనున -*

దేవ దేవుడగు శివపుత్రుడు ఆతని ఈ మాటను విని వీరబాహుడను పేరు గల తన గణమును ఆతని పనికొరకై పంపెను. ఆయన ఆజ్ఞను పొంది మహావీరుడగు వీర బాహుడు భక్తితో ఆ స్వామికి నమస్కరించి మేకను వెదుకుట కొరకై వెంటనే బయులుదేరెను. ఆతడు బ్రహ్మండములన్నింటినీ వెదికిననూ ఆ మేక దొరకలేదు. అపుడాతడు ఆ మేక చేసిన అలజడిని వినెను. అతడుఅపుడు వైకుంఠమునకు వెళ్లగా అచట అది కనబడెను. మహాబలశాలియగు ఆ మేక మెడలో యూపము వ్రేలాడు చుండెను. అది అలజడిని కలిగించు చుండెను.

ఆ వీరుడు దానిని మిక్కిలివేగముగా కొమ్ములయందు పట్టుకొని కూమారస్వామి ఎదుటకు దోడ్కొని వచ్చెను. ఆది పెద్ద ధ్వనిని చేయుచుండెను. దానిని చూచి, బ్రహ్మాండమునంతనూ ధరించిన మహిమ గలవాడు, గొప్ప లీలలను ప్రదర్శించువాడు, గుహశబ్దవాచ్యుడు అగు ఆ కార్తిక ప్రభుడు వెంటనే దానిని అధిరోహించెను. ఓ మునీ! ఆ మేక శ్రమ లేకుండగనే ముహూర్తకాలములో బ్రహ్మాండమునంతనూ చుట్ట బెట్టి శీఘ్రముగా మరల అదే స్ధానమునకు వచ్చెను. అపుడా స్వామి దాన నుండి దిగి తన ఆసనమునధిష్ఠించెను. ఆ మేక అక్కడనే నిలబడి యుండగా, నాదుడు ఆయనతో నిట్లనెను.

*నానదుడిట్లు పలికెను -*

ఓ దేవదేవా! నీకు నమస్కారము. ఓ దయానిధీ! నాకు మేకను ఇమ్ము. నేను ఆనందముతో యజ్ఞమును చేసెదను. నన్ను మిత్రునిగా చేసుకొనుము.

*కార్తికుడిట్లు పలికెను -*

ఓ విప్రా! మేకను వధించుట తగదు. నారదా! నీ ఇంటికి పొమ్ము. నీ యజ్ఞము నా అనుగ్రహముచే పరిపూర్ణము అగుగాక !

*బ్రహ్మ ఇట్లు పలికెను -*

ఆ బ్రాహ్మణుడు ప్రభుని ఈ మాటను విని సంతసించిన మనస్సు గలవాడై ఆయనకు

ఉత్తమమగు ఆశీస్సులనిచ్చి తన గృహమునకు వెళ్ళెను.*శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహిత యందు కుమారఖండలో కుమారుని అద్భుత చరితమును వర్ణించే ఆరవ అధ్యాయము ముగిసినది.*

0 कॉमेंट्स • 0 शेयर
Mamta Chauhan May 7, 2021

+26 प्रतिक्रिया 8 कॉमेंट्स • 14 शेयर
VarshaLohar May 7, 2021

+20 प्रतिक्रिया 9 कॉमेंट्स • 4 शेयर

+17 प्रतिक्रिया 1 कॉमेंट्स • 13 शेयर

⛳🙏🕉️🙏🥀🌹जय श्री राम राम राम जी सभी🔔माया मंदिर के 🔔🎪🔔आदरणीय भाई बहनों को शुभ दोपहर की🙏 राम राम जी राम राम 🙏सभी पर श्री सीताराम जी की कृपा दृष्टि बनी रहे 🙏मंगलकामनाएं शुभकामनाएं जी🙏😌 प्रार्थना हे राम जी हम सब आपके नादान नासमझ बच्चे हैं आप हम सबकी भूल-चूक को क्षमा🙏🏻 करके पूरी पृथ्वी 🌍 पर बस्सी दुनिया की🗾🌍☠️🌎🦠🌏🐛इस बढ़ती बीमारी महामारी कोरोना 👺👹☠️🦠🦠वायरससे सभी की 🙏रक्षा कीजिए जैसे आपने असुरों का संघार 🏹🏹👹किया था त्रेता युग में इस युग में आपके लाडले कलयुग में भी अमरता का वरदान पाने वाले श्री पवन पुत्र हनुमान जी को अपनी आज्ञा देकर इस अदृश्य वायरस ☠️ शक्ति से हम सबकी रक्षा करवाइए सुना है प्रभु जी यह बीमारी हवा में गुल 🌬️🌀🌪️रही है😇 पवन पुत्र हनुमान जी सबकी रक्षा करें इस महामारी को दूर भगाए होनी होकर रहती है इतना तो हम भी जानते हैं 🙏😌परमपिता परमात्मा जी भक्त और भगवान का विश्वास आपस में एक दूसरे से टूटे🙏ना बस इतनी कृपा दृष्टि सभी सनातन धर्म प्रेमियों पर बनाए🙏😟 🙂रखना 🙏जय हो ज्ञान ✍️ की देवी गायत्री माता जी जय गुरु🙏 ओम भूर्भुव स्व तत्सवितुर्वरेंयं भर्गो देवस्य धीमहि धियो योन प्रचोदयात् 🙏जय श्री राम जय हो वीर बजरंगी हनुमान जी की सदा ही जय हो🙌🌹🌹🕉️🌹🌹⛳⛳⛳

+4 प्रतिक्रिया 1 कॉमेंट्स • 1 शेयर

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Ajit sinh Parmar May 7, 2021

+51 प्रतिक्रिया 5 कॉमेंट्स • 28 शेयर
shiva May 7, 2021

+43 प्रतिक्रिया 8 कॉमेंट्स • 37 शेयर
Ganesh dubey May 7, 2021

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB