_*శ్రీ దేవి భాగవతం - 265 వ అధ్యాయము*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ *సురభివృత్తాంతము* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ *నారదు డిట్లనెను:* నారాయణా ! ఆ గోలోకమునందుండి యేతెంచిన సురభి యెవరు? ఆమె జన్మవృత్తాంతము విన కుతూహల మగుచున్నది. నారాయణుడిట్లనియెను: సురభి గోవుల కదిష్ఠానదేవి - గోమాత- మొదటిగోవు-గోవులలో ప్రధానురాలు-గోలోకమున నుద్బవించినది. సురభి మొదటి సృష్టి చరిత్ర తెల్పుచున్నాను. సురభి యే కారణనున బృందా వనిలో బుట్టెనో తెలుపును వినుము. పూర్వము రాధికాలోలుడు తన్నుగోపికలు చుట్టుజేరి కొలువగ రాధనుగూడి పుణ్య బృందావనములు గల గోలోకమున కరిగెను. అతడచ్చోట వినోదముగ రహస్యముగ తిరుగుచుండగ నతనికి పాలుత్రాగు కోరిక గల్గెను. అతడు తన యెడమవైపునుండి లీలగ సురభిని సృజించెను. దాని వెంట దూడ గలదు. దాని పేరు మనోరథ. సురభిపుష్కలముగ పాలు గలది. శ్రీదాముడు దూడగల పాడి యావును చూచి క్రొత్త కడవలో పాలు పితికెను. ఆ పాలు జన్మ-మృత్యు-జరా-రోగములు పాపునవి. అమృతము కన్న తియ్యనివి. ఆ యమృత క్షీరములను గోపాలకుడు స్వయముగత్రాగెను. తర్వాత మిగిలిన పాలు గల కడవ పగిలెను. అపుడచట పాల కాసార మేర్పడెను. ఆ క్షీర కాసారము గోలోకమునందు వంద యోజనములు పొడవు వంద యోజనములు వెడల్పుగ నుండెను. ఆ సరోవరము రాధకు కృష్ణునకును క్రీడా సరస్సుగ నలరారెను. ఈశ్వరుని కోర్కె వలన దానికి రతనాల మెట్లు నిర్మించబడెను. శ్రీకృష్ణుని సంకల్పముతో నచట లెక్కలేనన్ని కామధేనువులు లక్షలు కోట్లుగ నుద్బవించెను. వెంటనే సురభిరోమ కూపములనుండియు నందఱు గోపకు లుద్బవించిరి. లెక్కలేనన్ని యావుదూడలును బుట్టెను. ఆ గోవులమందలచే జగమంతయు నిండిపోయెను. ఇట్లు గోవుల సృష్టిజరిగెను. తొలదొల్త శ్రీకృష్ణుడు సురభిని పూజించెను. ఆ తర్వాత ముల్లోకములందును గోపూజ వ్యాపించెను. దీపావళి మఱునాడు పూర్వాహ్ణమున సురభిని పూజించవలయునని శ్రీకృష్ణు డాజ్ఞాపించెను. ఇదంతయును నేను ధర్మునివలన వింటిని. సురభిమాత యొక్క ధ్యానము స్త్రోత్రము మూలమంత్రము పూజా విధానము వేదోక్తముగ తెల్పుదును. వినుము. ''ఓం సురభ్యై నమః'' అను షడక్షర మంత్రమును లక్ష జపింపవలయును. మంత్రసిద్ధి గల్గును. ఇది భక్తులకు కల్పవృక్షము. యుజుర్వేదమున సురభి ధ్యానము-గీత-పూజాదికము గలదు. సురభి బుద్ది-వృద్దు లొసంగును. సర్వకామములు దీర్చును. ముక్తిని సైత మిచ్చును. లక్ష్మీస్వరూపిణి- పరమ రాధాసహచరి-గోవుల కధిష్ఠానదేవి - గోవులకు మొదటిది - గోవుల గన్న తల్లికి నమస్కారములు. పవిత్రరూప-పూత-భక్తులకామదాయిని-విశ్వమునంత పావనమొనరించునట్టి సురభ దేవికి నమస్కారములు. బ్రాహ్మణు డొక కలశమందుగాని గోవుతలయందుగాని ఆవులను గట్టు స్తంభమందుగాని సాల గ్రామమందుగాని జలమందుగాని సురభి నావాహనము చేసి పూజింపవలయును. దీపావళి మర్నాడు పట్టపగలు గోమాతను పూజించువాడు తప్పక భూమండలమున పూజనీయుడు గాగలడు. మున్ను వరాహకల్పమున విష్ణు మాయవలన ముల్లోకము లందును పాలు లేకుండునట్లు సురభి మాయ గల్పించెను. అపుడు సురాదులు పాలులేక చింతాక్రాంతు లైరి. వారపుడు బ్రహ్మలోక మేగి బ్రహ్మను సంస్తుతించిరి. బ్రహ్మ యనుమతితో నింద్రుడు సురభిని సంతోష పఱచెను. మహాదేవి! గోబీజ స్వరూపిణి! జగదంబికా! సురభిమాతా నిన్ను నమస్కరించుచున్నాను. నీవు కృష్ణ ప్రియవు-రాధా ప్రియవు-పద్మాంశవు నగు గోమాతవు. నిన్ముపల్మారు నమస్కరించుచున్నాను. నీ వెల్లవారికి నెల్లవేళల కల్పవృక్షమువంటి దానువు-క్షీరము-సద్బుద్ది-ధనము నొసంగుదానవు. కీర్తిదాయినివి- నీకు పల్మార్లు నమస్కారుము చేయ చున్నాను. శుభాంగివి-సుభద్రపు-గోపప్రదాయినివి-యశము-కీర్తి-ధర్మము నొసంగు దేవివి నీకు నమస్కారుము చేయ చున్నాను. అను స్తోత్రము విన్నంతనే తుష్టితో సంతుష్టితో గోమాత సనాతని యగు సురభిమాత బ్రహ్మలోకమందు నావిర్బవించెను. ఆమె యింద్రునకు దుర్బభములైన కోరిన కోర్కె లీడేర్చితిరిగి గోలోకమేగెను. ఆ పిమ్మట విశ్వమంతయగును గుమ్మపాలతో. నిండిపోయెను. నారదా! అపుడు పాలు-నెయ్యి పుష్కలముగ నుంట యజ్ఞముల విరివిగ సాగెను. సుర లును ప్రీతిజెందిరి. ఈ సురభి వస్తోత్రము మహాపుణ్యప్రదమైనది. దీనిని భక్తి శ్రద్దలతో చదువువాడు గో-ధన-సంపదలతో పుత్రకీర్తిమంతుడై విలసిల్లును. సకల తీర్థములందు గ్రుంకిన వాడగును. సర్వయాగదీక్షితుడు నగును. ఈ లోకమును సుఖములనుభవించి చివరకు కృష్ణ మందిరము జేరగలడు. అట చిరకాలము శ్రీకృష్ణుని సంసేవించుచుండును. ఆ తర్వాత పవిత్ర భారతదేశమున బ్రాహ్మణుడై యుద్బవించగలడు. *ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి నవమ స్కంధమున నలువదితొమ్మిదవ అధ్యాయము*

_*శ్రీ దేవి భాగవతం - 265 వ అధ్యాయము*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*సురభివృత్తాంతము*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*నారదు డిట్లనెను:* నారాయణా !   ఆ గోలోకమునందుండి యేతెంచిన సురభి యెవరు? ఆమె జన్మవృత్తాంతము విన కుతూహల మగుచున్నది. నారాయణుడిట్లనియెను: సురభి గోవుల కదిష్ఠానదేవి - గోమాత- మొదటిగోవు-గోవులలో ప్రధానురాలు-గోలోకమున నుద్బవించినది. సురభి మొదటి సృష్టి చరిత్ర తెల్పుచున్నాను. సురభి యే కారణనున బృందా వనిలో బుట్టెనో తెలుపును వినుము. పూర్వము రాధికాలోలుడు తన్నుగోపికలు చుట్టుజేరి కొలువగ రాధనుగూడి పుణ్య బృందావనములు గల గోలోకమున కరిగెను. అతడచ్చోట వినోదముగ రహస్యముగ తిరుగుచుండగ నతనికి పాలుత్రాగు కోరిక గల్గెను. అతడు తన యెడమవైపునుండి లీలగ సురభిని సృజించెను. దాని వెంట దూడ గలదు. దాని పేరు మనోరథ. సురభిపుష్కలముగ పాలు గలది. శ్రీదాముడు దూడగల పాడి యావును చూచి క్రొత్త కడవలో పాలు పితికెను. ఆ పాలు జన్మ-మృత్యు-జరా-రోగములు పాపునవి. అమృతము కన్న తియ్యనివి. ఆ యమృత క్షీరములను గోపాలకుడు స్వయముగత్రాగెను. తర్వాత మిగిలిన పాలు గల కడవ పగిలెను. అపుడచట పాల కాసార మేర్పడెను. ఆ క్షీర కాసారము గోలోకమునందు వంద యోజనములు పొడవు వంద యోజనములు వెడల్పుగ నుండెను. ఆ సరోవరము రాధకు కృష్ణునకును క్రీడా సరస్సుగ నలరారెను. ఈశ్వరుని కోర్కె వలన దానికి రతనాల మెట్లు నిర్మించబడెను. శ్రీకృష్ణుని సంకల్పముతో నచట లెక్కలేనన్ని కామధేనువులు లక్షలు కోట్లుగ నుద్బవించెను. వెంటనే సురభిరోమ కూపములనుండియు నందఱు గోపకు లుద్బవించిరి.

లెక్కలేనన్ని యావుదూడలును బుట్టెను. ఆ గోవులమందలచే జగమంతయు నిండిపోయెను. ఇట్లు గోవుల సృష్టిజరిగెను. తొలదొల్త శ్రీకృష్ణుడు సురభిని పూజించెను. ఆ తర్వాత ముల్లోకములందును గోపూజ వ్యాపించెను. దీపావళి మఱునాడు పూర్వాహ్ణమున సురభిని పూజించవలయునని శ్రీకృష్ణు డాజ్ఞాపించెను. ఇదంతయును నేను ధర్మునివలన వింటిని. సురభిమాత యొక్క ధ్యానము స్త్రోత్రము మూలమంత్రము పూజా విధానము వేదోక్తముగ తెల్పుదును. వినుము. ''ఓం సురభ్యై నమః'' అను షడక్షర మంత్రమును లక్ష జపింపవలయును. మంత్రసిద్ధి గల్గును. ఇది భక్తులకు కల్పవృక్షము. యుజుర్వేదమున సురభి ధ్యానము-గీత-పూజాదికము గలదు. సురభి బుద్ది-వృద్దు లొసంగును. సర్వకామములు దీర్చును. ముక్తిని సైత మిచ్చును. లక్ష్మీస్వరూపిణి- పరమ రాధాసహచరి-గోవుల కధిష్ఠానదేవి - గోవులకు మొదటిది - గోవుల గన్న తల్లికి నమస్కారములు. పవిత్రరూప-పూత-భక్తులకామదాయిని-విశ్వమునంత పావనమొనరించునట్టి సురభ దేవికి నమస్కారములు. బ్రాహ్మణు డొక కలశమందుగాని గోవుతలయందుగాని ఆవులను గట్టు స్తంభమందుగాని సాల గ్రామమందుగాని జలమందుగాని సురభి నావాహనము చేసి పూజింపవలయును. దీపావళి మర్నాడు పట్టపగలు గోమాతను పూజించువాడు తప్పక భూమండలమున పూజనీయుడు గాగలడు. మున్ను వరాహకల్పమున విష్ణు మాయవలన ముల్లోకము లందును పాలు లేకుండునట్లు సురభి మాయ గల్పించెను. అపుడు సురాదులు పాలులేక చింతాక్రాంతు లైరి.

వారపుడు బ్రహ్మలోక మేగి బ్రహ్మను సంస్తుతించిరి. బ్రహ్మ యనుమతితో నింద్రుడు సురభిని సంతోష పఱచెను. మహాదేవి! గోబీజ స్వరూపిణి! జగదంబికా! సురభిమాతా నిన్ను నమస్కరించుచున్నాను. నీవు కృష్ణ ప్రియవు-రాధా ప్రియవు-పద్మాంశవు నగు గోమాతవు. నిన్ముపల్మారు నమస్కరించుచున్నాను. నీ వెల్లవారికి నెల్లవేళల కల్పవృక్షమువంటి దానువు-క్షీరము-సద్బుద్ది-ధనము నొసంగుదానవు. కీర్తిదాయినివి- నీకు పల్మార్లు నమస్కారుము చేయ చున్నాను. శుభాంగివి-సుభద్రపు-గోపప్రదాయినివి-యశము-కీర్తి-ధర్మము నొసంగు దేవివి నీకు నమస్కారుము చేయ చున్నాను. అను స్తోత్రము విన్నంతనే తుష్టితో సంతుష్టితో గోమాత సనాతని యగు సురభిమాత బ్రహ్మలోకమందు నావిర్బవించెను. ఆమె యింద్రునకు దుర్బభములైన కోరిన కోర్కె లీడేర్చితిరిగి గోలోకమేగెను. ఆ పిమ్మట విశ్వమంతయగును గుమ్మపాలతో. నిండిపోయెను. నారదా! అపుడు పాలు-నెయ్యి పుష్కలముగ నుంట యజ్ఞముల విరివిగ సాగెను. సుర లును ప్రీతిజెందిరి. ఈ సురభి వస్తోత్రము మహాపుణ్యప్రదమైనది. దీనిని భక్తి శ్రద్దలతో చదువువాడు గో-ధన-సంపదలతో పుత్రకీర్తిమంతుడై విలసిల్లును. సకల తీర్థములందు గ్రుంకిన వాడగును. సర్వయాగదీక్షితుడు నగును. ఈ లోకమును సుఖములనుభవించి చివరకు కృష్ణ మందిరము జేరగలడు. అట చిరకాలము శ్రీకృష్ణుని సంసేవించుచుండును. ఆ తర్వాత పవిత్ర భారతదేశమున బ్రాహ్మణుడై యుద్బవించగలడు.


*ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి నవమ స్కంధమున నలువదితొమ్మిదవ అధ్యాయము*

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

🚩🌹🥀जय श्री मंगलमूर्ति गणेशाय नमः 🌺🌹💐🚩🌹🌺 शुभ प्रभात वंदन🌺🌹 राम राम जी 🌺🚩🌹मंदिर के सभी भाई बहनों को राम राम जी परब्रह्म परमात्मा आप सभी की मनोकामना पूर्ण करें 🙏 🚩🔱🚩प्रभु भक्तो को सादर प्रणाम 🙏 🚩🔱 🚩🕉️ सूर्यदेवाय नमः ऊँ भास्कराय नमः ऊँ दिवाकराय नमः ऊँ मित्राय नमः जय सूर्यनारायण नमो नमः🌺ऊँ राम रामाय नमः 🌻🌹ऊँ हं हनुमंते नमः 🌹🌺🥀🌻ऊँ सीतारामचंद्राय नमः🌹 ॐ राम रामाय नमः🌹🌺🌹 ॐ हं हनुमते नमः 🌻ॐ हं हनुमते नमः🌹🥀🌻🌺🌹ॐ शं शनिश्चराय नमः 🚩🌹🚩ऊँ नमः शिवाय 🌹जय श्री राधे कृष्णा जी 🌻 श्री सीता राम चंद्राय नमः 🌺 श्री सूर्यदेवाय नमः सूर्यदेव भगवान की असीम कृपा दृष्टि आप सभी पर हमेशा बनी रहे 🌹 आप का हर पल मंगलमय हो 🚩जय श्री राम 🚩🌺हर हर महादेव🚩राम राम जी 🥀शुभ प्रभात स्नेह वंदन💐शुभ रविवार🌺 हर हर महादेव 🔱🚩🔱🚩🔱🚩🔱🚩🚩जय-जय श्रीराम 🚩जय-जय श्रीराम 🚩जय-जय श्रीराम 🚩जय माता दी जय श्री राम 🚩🌻👏 🚩हर हर नर्मदे हर हर नर्मदे 🌺🙏🌻🙏🌻🥀🌹🚩🚩🚩

+58 प्रतिक्रिया 17 कॉमेंट्स • 25 शेयर

+27 प्रतिक्रिया 5 कॉमेंट्स • 7 शेयर
Gajendrasingh kaviya May 16, 2021

+17 प्रतिक्रिया 4 कॉमेंट्स • 16 शेयर
Shanti pathak May 16, 2021

+75 प्रतिक्रिया 15 कॉमेंट्स • 72 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB